యనమల సాక్షిగా.. తెలుగు తమ్ముళ్ల తన్నులాట! | Clash Between Tdp Leaders At Tuni Constituency | Sakshi
Sakshi News home page

యనమల సాక్షిగా.. తెలుగు తమ్ముళ్ల తన్నులాట!

Published Tue, Jan 2 2024 7:52 AM | Last Updated on Sun, Jan 28 2024 1:39 PM

Clash Between Tdp Leaders At Tuni Constituency - Sakshi

తన్నుకుంటున్న రాజేష్, కృష్ణుడు వర్గీయులు

తుని రూరల్‌: నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా జరుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వేదికపై తెలుగు తమ్ముళ్లు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దు­కుని బాహాబాహీకి దిగిన ఘటన సోమ­వారం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్‌.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద చోటు చేసుకుంది. తుని నియోజకవర్గ స్థాయిలో 2024 నూతన సంవత్సర వేడుకలను టీడీపీ నాయకులు సాయి వేదికలో ఏర్పాటు చేశా­రు.

వేదికపై యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, యనమల దివ్య (రామ­కృష్ణుడి కుమార్తె) ఉండడంతో నాయకులు, కార్య­కర్తలు వరుస క్రమంలో వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొంత సమయం తర్వాత దివ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొండంగి మండలం నుంచి అను­చరులతో తరలివచ్చిన యనమల రాజేష్‌.. రామకృష్ణుడిని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూలైన్‌ తప్పించుకుని వేదిక పైకి వెళుతుండగా.. వరుసగా రావాలంటూ కృష్ణుడి వర్గీయులు అడ్డుకున్నారు.

దీనిపై ఆగ్ర­హం చెందిన రాజేష్‌ వర్గీయులు ఒక్కసారిగా చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజేష్‌, కృష్ణుడి వర్గీ­యు­­ల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల వారు పరస్పరం ఘర్షణ పడుతూ కొట్టుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు ఇరు వర్గీయులను మందలించి, శాంతింపజేశారు.
ఇదీ చదవండి: పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement