ఓటమి భయంతో.. బూతులు.. దాడులు.. కుట్రలు | TDP Janasena Chandrababu Pawan last efforts with Fear Of Defeat | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో.. బూతులు.. దాడులు.. కుట్రలు

Published Thu, May 9 2024 3:50 AM | Last Updated on Thu, May 9 2024 10:30 AM

నల్లజర్లలో హోం మంత్రి తానేటి వనిత ఉన్న ఇంటిపై టీడీపీ గూండాలతో కలిసి దాడి చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు , టీడీపీ గూండాల దాడిలో గాయపడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ చౌడేశ్వరి

నల్లజర్లలో హోం మంత్రి తానేటి వనిత ఉన్న ఇంటిపై టీడీపీ గూండాలతో కలిసి దాడి చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు , టీడీపీ గూండాల దాడిలో గాయపడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ చౌడేశ్వరి

ఓటమి భయంతో తారస్థాయికి నైరాశ్యం 

ఘోర పరాజయం ముంగిట బాబు – పవన్‌ ఆఖరి యత్నాలు

ప్రశాంతంగా ప్రచారం చేస్తున్న మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం

మంచి చేసిన పార్టీకే ఓటేస్తానన్న వృద్ధుడికి ముప్పాళ్లలో బెదిరింపులు

నీ అమ్మ మొగుడు..! నీ అమ్మమ్మ మొగుడు..! జగన్‌ను చంపితే ఏమవుతుంది..?

సీఎం జగన్‌పై అనకాపల్లి, బుచ్చిరెడ్డిపాలెం సభల్లో బాబు బూతు పురాణం

అదే భాషను అనుకరిస్తూ రెచ్చగొడుతున్న పవన్‌ కళ్యాణ్‌.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న టీడీపీ, జనసేన రౌడీలు

మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి భార్యపై రాళ్లు, సీసాలతో టీడీపీ గూండాల దాడి

ఎస్‌ఐపైనా దాడి.. తలకు తీవ్ర గాయం

నల్లజర్లలో హోంమంత్రి వనితపై హత్యాయత్నం.. బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి భార్య, కుమారుడిపై దాడి

ఓటమి తప్పదన్న నిరాశానిస్పృహలు టీడీపీ కూటమిని ఏ స్థాయికి దిగజారుస్తున్నాయంటే... చంద్రబాబు స్థాయి మరిచి, సిగ్గెగ్గులు వదిలి ‘అమ్మ మొగుడు.. అమ్మమ్మ మొగుడు’ అంటూ అడ్డూఅదుపూ లేకుండా పిచ్చిపట్టినట్లు అరుస్తున్నాడు. వృద్ధుల ఇంటికి పింఛను రాకుండా వారిని మండటెండల్లో రోడ్లమీదికి తేవటమే కాదు..భూములు లాక్కున్నారంటూ పచ్చి అబద్ధాలతో చెలరేగుతున్నాడు. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో పడాల్సిన నిధులను కుట్రతో అడ్డుకోవటమే కాదు... బాబు, దత్తపుత్రుడు కలిసి కిరాయి గూండాలతో దాడులు చేయిస్తున్నారు.  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య కావచ్చు... హోంమంత్రి తానేటి వనిత కావచ్చు... ప్రచారానికి వెళుతున్న మహిళా నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్ని చేసినా.. ఇది నారాసురుడికి క్లయిమాక్సే.

సాక్షి, అమరావతి/వెల్దుర్తి/ముప్పాళ్ల/సాక్షి, నరసరావుపేట: రూ.కోట్ల కట్టలు వెదజల్లుతున్నా.. అక్రమ మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. కళ్ల ముందు మరోసారి ఘోర పరాజయం స్పష్టంగా కనిపిస్తుండటంతో కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లో ఫ్రస్టేషన్‌ (నిరాశ, నిస్పృహ) తార స్థాయికి చేరుకుంది. చివరకు అధికార పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మహిళలపై సైతం దాడులు చేసే స్థాయికి దిగజారిపోవడం వారిద్దరినీ ఆవరించిన నైరాశ్యాన్ని రుజువు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి నీ అమ్మ మొగుడు..! నీ అమ్మమ్మ మొగుడు..! అంటూ ఈ నెల 6న అనకాపల్లి సభలో చంద్రబాబు బూతు పురాణం లంకించుకోవడంతో మహిళలంతా నివ్వెరపోయారు. 

అంతకుముందు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో.. జగన్‌ను చంపితే ఏమవుతుందంటూ టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారు. ఒకపక్క ముఖ్యమంత్రి జగన్‌ తన ఐదేళ్ల పాలనలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులను ప్రజలకు వివరిస్తూ, వారినుంచే జవాబులు రాబడుతూ ప్రచారం నిర్వహిస్తుండగా మరోపక్క కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ దాడులు, దుర్భాషలనే నమ్ముకోవడం వారి వ్యక్తిత్వాలకు ప్రతీకగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సైతం బాబు శైలిని అనుకరిస్తూ వ్యక్తిత్వహననం, దుర్భాషలకు దిగడం తెలిసిందే. దీంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు పేట్రేగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు దిగుతూ హత్యాయత్నాలకు పాల్పడుతున్నాయి.  
 


నల్లజర్లలో ‘ముళ్లపూడి’, మాచర్లలో ‘జూలకంటి’ గూండాయిజం 
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో మంగళవారం రాత్రి ప్రచారం ముగించుకుని పార్టీ నేత వెల్లంకి సుబ్రమణ్యం ఇంట్లో భోజనం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరి­పాడులో బుధవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మహిళలు సైతం గాయ­పడ్డారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి టీడీపీ గూండాలను దాడులకు పురిగొల్పారు. 

పచ్చి అవకాశవాదం.. 
ఎన్నికల్లో సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కోనే సత్తాలేక జనసేనతో జట్టు కట్టి బీజేపీతో కాళ్ల బేరానికి దిగిన చంద్రబాబు దాడులు, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా దగా చేయడం, ఇప్పుడు మళ్లీ జత కట్టటాన్ని ప్రజలు పచ్చి అవకాశవాదంగా గుర్తించారు. మళ్లీ కూటమి ముసుగులో చంద్రబాబు మోసం చేస్తారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కరువైంది. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాను రప్పించినా ప్రయోజనం కానరాకపోవడంతో ఓటర్లపై ధనా్రస్తాన్ని ఎక్కుపెట్టారు.  

నోట్ల కట్టలతో ప్రైవేట్‌ సైన్యాలు 
విదేశాల్లోని తన సామాజిక వర్గానికి చెందిన ఆరు వేల మంది ఎన్నారైలను రప్పించిన చంద్రబాబు వారిని గ్రామాల్లో మోహరించి నోట్ల కట్టలు  వెదజల్లుతున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ, విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, నరసరావుపేట లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ తదితరుల ద్వారా నోట్ల కట్టలతో ప్రైవేట్‌ సైన్యాలను సమాయత్తం చేశారు. ఎన్నికల అధికారులకు భారీ ఎత్తున పట్టుబడుతున్న కోట్ల కట్టలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. 

కర్ణాటక, గోవా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తరలించి ఏరులై పారిస్తున్నారు. ఎన్నికల అధికారులు సీజ్‌ చేస్తున్న మద్యం డంపులే అందుకు నిదర్శనం. కోట్ల కట్టలను వెదజల్లుతున్నా.. మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం, ఘోర పరాజయం కళ్ల ముందు కానరావడంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఫ్రస్టేషన్‌ తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి, వేటాడి రక్తపుటేరులు పారించి భయోత్పాతం సృష్టించడం ద్వారా ఉనికి చాటుకోవాలని ఎత్తు వేశారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన గూండాలను దాడులు, హత్యాకాండకు పురిగొలిపారు.  

‘ఫ్యాన్‌’కి ఓటేశాడని..!
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు హోం ఓటింగ్‌ ప్రక్రియలో భాగంగా పరిమి పెద్దభూషయ్య అనే వృద్ధుడు వైఎస్సార్‌సీపీకి ఓటు వేసేందుకు సుముఖత చూపటాన్ని జీర్ణించుకోలేక బెదిరిస్తూ వాదనకు దిగాయి. తనకు కులాలతో పనిలేదని, మంచి చేసిన పార్టీకే ఓటు వేస్తానని పెద్దభూషయ్య తేల్చి చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. టీడీపీ సానుభూతిపరుడు రావిపాటి నాగేశ్వరరావు కర్రతో దాడి చేయడంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన కానాల పుల్లారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వైఎస్సార్‌ సీపీకి చెందిన షేక్‌ దమ్మాలపాటి బాజికి కూడా ఘటనలో గాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మాచర్ల ఘటనపై ఈసీ సీరియస్‌
మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణితో పాటు పలువురు మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడిన ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మాచర్ల టౌన్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పి.శరత్‌బాబు, వెల్దుర్తి ఎస్సై వంగా శ్రీహరి, కారంపూడి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చిన్న మల్లయ్యను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

దౌర్జన్యాలు.. హత్యాయత్నాలు
⇒ నంద్యాల జిల్లా బనగానపల్లె మార్కెట్‌ వద్ద మంగళవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భార్య కాటసాని జయమ్మపై దాడికి  టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్‌రెడ్డి గూండాలను పురిగొల్పారు. ఈ విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న ఆమె తనయుడు ఓబుళరెడ్డిపై కూడా టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కోనేటి దుర్గ, సయ్యద్‌ అబ్బాస్, ఇంతియాజ్, ఖాజా హుస్సేన్, జమీర్, గుర్రప్ప తీవ్రంగా గాయపడ్డారు. 

⇒ అనంతపురం నియోజకవర్గంలో గత నెల 30న ఎన్నికల ప్రచారం నిమితం బైక్‌పై వెళ్తున్న
వైఎస్సార్‌సీపీ నాయకుడు గుజ్జుల నగే­ష్‌పై టీడీపీ గూండాలు కళ్లల్లో కారం చల్లి కర్రలు, ఇనుపరాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. 

⇒ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పిచ్చిరెడ్డికొట్టాల గ్రామంలో గత నెల 27న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి వాహనాలపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నేత కురుబ ముత్యాలు వాహనంతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. 

⇒ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మిట్టమీదిపల్లి, మాల్యవంతునిపాడు గ్రామాల మధ్య వైఎస్సార్‌సీపీకి చెందిన మూడు ప్రచార రథాలపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. డ్రైవర్లు వీరాంజనేయులు, ఆంథోని, రాజును రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. 

⇒ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఇదే రీతిలో టీడీపీ, జనసేన రౌడీ మూకలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి.  

మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే సతీమణిపై దాడి
ఎన్నికల వేళ టీడీపీ అరాచకాలు ఏ స్థాయికి దిగజారాయంటే ఇప్పటివరకు పల్నాడు ప్రాంతంలో మహిళలు, పిల్లలపై దాడులు చేసిన సంస్కృతి లేదు. అలాంటిది మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి ప్రోద్బలంతో పచ్చమూకలు బరి తెగించాయి. ఎన్నికల ప్రచారం చేస్తున్న మాచర్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవితోపాటు పలువురు మహిళలపై బుధవారం రాళ్లు, సీసాలతో దాడులకు దిగి హత్నాయత్నానికి పాల్పడ్డాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో ఇంటింటి ప్రచారం చేస్తున్న రమాదేవిపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి కుమారుడు శివారెడ్డి, కల్లం రామాంజిరెడ్డి తమ అనుచరులతో కలసి రాళ్ల దాడికి పాల్పడ్డారు. 

పీఆర్కే సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, కౌన్సిలర్‌ గట్ల అరుణ కుమారి, కో ఆప్షన్‌ సభ్యురాలు అన్నెం అనంతరావమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ ఎంపీపీ చౌడేశ్వరికి చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకునే యత్నం చేసిన ఎస్‌ఐ శ్రీహరిపై సైతం పచ్చమూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు దిగటాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో గెలవలేక టీడీపీ హింసకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన జూలకంటి బ్రహా్మరెడ్డిని చంద్రబాబు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడంతో ఫ్యాక్షన్‌  రాజకీయాలు తిరిగి మొదలయ్యాయని పేర్కొంటున్నారు.  

ఓటమి భయంతోనే మహిళలపై టీడీపీ దాడులు
ఎన్నికల్లో ఓటమి భయం­తోనే టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలపై దాడులు చేయిస్తున్నాడని వైఎస్సార్‌సీపీ మహిళా విభా­గం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ.. అందులోనూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై దాడి చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బొండా ఉమా మహిళలపై దాడులకు పురిగొల్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయ పదవుల్లో మహిళలకు పెద్ద పీట వేసి.. దళితులకు రాజ్యాధికారం కల్పించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సీఎం జగన్‌పై కక్ష కట్టాయన్నారు. విద్యార్థులకు విద్యా దీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర పథకాలను రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement