
ఓడిపోతామని తెలిసి కూడా పోరాడేవాడే నిజమైన నాయకుడని పేర్కొన్నారు..
సాక్షి, కాకినాడ: రాజకీయాల్లో ఓడిపోతామని తెలిసి కూడా పోరాడేవాడే నిజమైన నాయకుడని, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లో అలాంటి లక్షణాలు మచ్చుకు కూడా లేవన్నారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నాయకత్వ లక్షణం అంటే వైఎస్ జగన్‌దేనని స్పష్టం చేశారు.
బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓడిపోతామని తెలిసినా నాయకుడు యుద్దం నుండి తప్పుకోకూడదు. యుద్దం నుండి ఎప్పుడైతే తప్పుకున్నామో మన వెనుక ఉన్న సైనికులు భయపడతారు. ‘‘ఓడిపోతాం.. ముఖ్యమంత్రి అవ్వం’’ అంటే అది యుద్దమా?. నాయకుడి లక్షణమా?. నాయకత్వం అంటే వైఎస్ జగన్‌దే. ఏనాడూ ఆయన కార్యకర్తలకు అధైర్యాన్ని పంచలేదు. ఆయన కష్టకాలంలో ఉన్నా కూడా మాకు ధైర్యం పంచాడు. సిసలైన నాయకత్వ లక్షణం అంటే ఇదే.
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కన్నా నేను సీనియర్‌ని. కాకినాడ నుండి పవన్ కల్యాణే కాదు..లోకేష్ పోటి చేసినా ప్రజలు ఘోరంగా ఓడిస్తారు. పవన్, లోకేష్ .. ఎవరు పోటీకి ముందుకు వచ్చినా .. నేను రెడీ అంటూ పేర్కొన్నారాయన.
ఇదీ చదవండి: ఫన్నీ ఫన్నీగా లోకేష్ పాదయాత్ర