
సాక్షి. తూర్పు గోదావరి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని మంచి వాలంటరీ వ్యవస్థను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సీఎం జగన్ ప్రభుత్వం పటిష్టమైన ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇంట్లో ఏ కష్టమొచ్చిన వాలంటరీ వ్యవస్థ పరిష్కరిస్తుందన్నారు. అటువంటి వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం తప్పు అన్నారు. చంద్రబాబు ఒత్తిడితో కరోనా సాకు చూపించి ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. ఎన్నికలు వాయిదా వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.
‘బాబు అలా చేస్తే బాగుంటుంది: ఎమ్మెల్యే ద్వారంపూడి
Comments
Please login to add a commentAdd a comment