
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన కార్యకర్తలు ద్వారంపూడి ఇంటిపై రాళ్లదాడి చేయటంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దాడిని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై సైతం జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. అంతేకాకుండా పరిస్థితులను చక్కబెట్టడానికి ప్రయత్నిస్తున్న పోలీసులతో సైతం వారు వాగ్వివాదానికి దిగారు.