![Dwarampudi Chandrasekhar Reddy Challenges Tdp Mla Kondababu](/styles/webp/s3/article_images/2024/08/20/Dwarampudi-Chandrasekhar.jpg.webp?itok=60lUpd7B)
సాక్షి, కాకినాడ జిల్లా: తనపై రాజకీయ కక్ష సాధింపులతో ఎమ్మెల్యే కొండబాబు అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. కొండబాబుకు బహిరంగ లేఖ రాసిన ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం వారిదే కనుక ఆరు నెలల సమయం ఇస్తున్నా నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలి’’ అంటూ సవాల్ విసిరారు.
‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల కాలంలో కొండబాబు చేసిన అక్రమాలు, అవినీతి నా దృష్టికి వచ్చాయి. ఆయిల్ మాఫియా, పీడీఎస్ బియ్యం, అధికారుల బదిలీలలో కొండబాబు పాత్ర ఏంటో నాకు తెలుసు. త్వరలోనే వాటిని బయట పెడతాను. జగన్నాధపురం మూడో వంతెన తన స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం నిర్మించాలని కోరుతున్నాను. మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండబాబు మత్స్యకార భరోసా, ఓఎన్జీసీ నష్టపరిహరం త్వరగా అందజేయాలి’’ అని ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
![ఎమ్మెల్యే కొండబాబుకు ద్వారంపూడి బహిరంగ లేఖ](/sites/default/files/inline-images/ko_0.jpg)
Comments
Please login to add a commentAdd a comment