Kondababu
-
MLA కొండబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్
-
కాకినాడ పోర్టులో పవన్ చిందులు
కాకినాడ, సాక్షి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కాకినాడ పోర్టు పర్యటనలో చిందులు తొక్కుతూ కనిపించారు. టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో (వనమాడి వెంకటేశ్వరరావు)పాటు అధికారులపైనా ఆయన సీరియస్ అయ్యారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంశాన్ని ప్రస్తావిస్తూ.. అందరికీ చురకలు అంటించారు. శుక్రవారం ఉదయం కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ తనిఖీలు నిర్వహించారు. ఆ టైంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట ఉన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా.. రేషన్ బియ్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యారా? అంటూ ఎమ్మెల్యే కొండబాబును పవన్ ప్రశ్నించారు. ఇంత భారీగా బియ్యం దేశం దాటి వెళ్తుంటే.. ఏం చేస్తున్నారు?. ప్రతీసారి మాలాంటి వాళ్లు వచ్చిన ఆపితేగానీ.. ఇలాంటి అక్రమ రవాణా ఆపలేరా?. మీరు సరిగా ఉంటే పోర్టులోకి రేషన్ బియ్యం ఎలా వస్తాయి? అంటూ ఆయన అధికారులపై మండిపడ్డారు. ఆ టైంలో ఎమ్మెల్యే కొండబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోగా.. పవన్ పట్టించుకోలేదు. దీంతో ఆ ఎమ్మెల్యే నీళ్లు నములుతూ కనిపించారు. పశ్చిమాఫిక్రా దేశాలకు అక్రమంగా ఈ బియ్యాన్ని తరలించే ప్రయత్నం చేస్తుండగా.. అధికారులే స్వయంగా ఛేజ్ చేసి పట్టుకున్నట్లు అధికార వర్గాలు ప్రకటించున్నాయి.కాస్త గ్యాప్‌తో మరోసారి.. అయితే.. ఆ పరిణామం జరిగిన కాసేపటికే మరోసారి కొండబాబును పవన్ టార్గెట్ చేశారు. ఈసారి టగ్గులో వెళ్తూ ఆయనపై మండిపడ్డారు. బిజినెస్ అంటే స్మగ్లర్ ను అనుమతించడం కాదు కదా అనడంతో కొండబాబు కంగుతిన్నారు. మనం ఏమీ చెయ్యకపోతే రేషన్ మాఫియాలో మన హస్తం ఉన్నట్లు ఉంటుందని పవన్ అన్నారు. దానికి.. రేషన్ బియ్యంపై విజిలెన్స్ ఎంక్వెయిరీ జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేశారు కొండబాబు. అయినా కూడా ఆ మాటలు పట్టించుకోకుండా.. కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై హోం మంత్రికి, పీఎంవోలకు లేఖ రాస్తానని పవన్ అన్నారు. ఇక.. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్ లో వెళ్లి మరీ పవన్ పరిశీలించడం గమనార్హం. తిరిగి సముద్రం నుంచి పోర్టుకు చేరకున్నాక.. ‘‘ఎస్పీ ఎందుకు నిపించడం లేదు. నేను వచ్చే టైంకి ఎందుకు సెలవు తీసుకున్నారు. ఇదంతా చాలా బాగుంది’’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఎల్లోమీడియాకు మెగా బ్రదర్ కౌంటర్ -
ఎమ్మెల్యే కొండబాబుకు ద్వారంపూడి బహిరంగ లేఖ
-
ఎమ్మెల్యే కొండబాబు అక్రమాలు బయటపెడతా: ద్వారంపూడి
సాక్షి, కాకినాడ జిల్లా: తనపై రాజకీయ కక్ష సాధింపులతో ఎమ్మెల్యే కొండబాబు అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. కొండబాబుకు బహిరంగ లేఖ రాసిన ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం వారిదే కనుక ఆరు నెలల సమయం ఇస్తున్నా నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలి’’ అంటూ సవాల్ విసిరారు.‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల కాలంలో కొండబాబు చేసిన అక్రమాలు, అవినీతి నా దృష్టికి వచ్చాయి. ఆయిల్ మాఫియా, పీడీఎస్ బియ్యం, అధికారుల బదిలీలలో కొండబాబు పాత్ర ఏంటో నాకు తెలుసు. త్వరలోనే వాటిని బయట పెడతాను. జగన్నాధపురం మూడో వంతెన తన స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం నిర్మించాలని కోరుతున్నాను. మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండబాబు మత్స్యకార భరోసా, ఓఎన్జీసీ నష్టపరిహరం త్వరగా అందజేయాలి’’ అని ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
టీడీపీ నేత కొండబాబు కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
-
కొండబాబు కాకినాడను భ్రష్టు పట్టించాడు: ద్వారంపూడి
సాక్షి, తూర్పుగోదావరి: భూ కబ్జాలు, పేకాట క్లబ్‌లు, గంజాయి వ్యాపారాలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, ఆయన కుటుంబ సభ్యులు కాకినాడ నగరాన్ని భ్రష్టు పట్టించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కొండబాబు చేసిన అవినీతి గురించి గత ఎన్నికల్లో చెప్పడం వల్లే ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. జగన్నాధపురం మూడవ వంతెన పేరుతో రూ.17 కోట్లు కొండబాబు కాజేయాలని చూస్తే తాను అడ్డుకున్నానని చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కొండబాబు టీడీపీ కార్పోరేటర్లను పట్టించుకోలేదని.. అందుకే గత సాధారణ ఎన్నికల్లో వారంతా తనకు మద్దతు పలికారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. -
ఒకటే ఉత్కంఠ.. సీటు ఎవరికంట?
సాక్షి, బోట్‌క్లబ్: ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి సమయం దగ్గర పడుతున్నకొద్దీ అటు నాయకుల్లోను, ఇటు పార్టీల కార్యకర్తల్లోను ఉత్కంఠ పెరుగుతోంది. తామంటే తామే అభ్యర్థులమంటూ కొంతమంది ఏర్పాట్లు చేసుకొంటున్నప్పటికీ అధినేతల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో లోలోపల ఒత్తిడి పెరుగుతోంది. అసలు తమ నాయకుడికి టిక్కెట్ వస్తుందా? మరెవరికైనా పోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే వనమాడిపై తీవ్ర వ్యతిరేకత కాకినాడ సిటీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ అధినేత ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సీటు తనదేనని ప్రచారం చేసుకొంటున్నప్పటికి ఆయన సీటుపై సృష్టత లేదు. కొండబాబు సోదరుడు సత్యనారాయణ పెత్తనం పెరిగిపోవడంతో ఆ పార్టీకి చెందిన 17 మంది కార్పొరేటర్లు కొండబాబుకి టిక్కెట్లు ఇస్తే అతనిని ఓడిస్తామని ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద పంచాయతీ పెట్టారు. టిక్కెట్టు కొండబాబుకు కాకుండా ఎవరికి ఇచ్చినా తాము పార్టీకి అండగా ఉంటామని అల్టిమేటం జారీ చేశారు. ఇటీవల ఒక ఫంక్షన్ హాల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేసుకొన్నారు. కాకినాడ నగరంలో పలు స్థలాలు కబ్జా చేయడంతోపాటు మద్యం, గుట్కా మాఫియా నుంచి ముడుపులు స్వీకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వనమాడికి టిక్కెట్లు ఇస్తే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలో టీడీపీ నాయకులు ఉన్నారు. ప్రాబల్యం చూపని జనసేన జనసేన టిక్కెట్టు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ తనయుడు ముత్తా శశిధర్‌కు కేటాయించారు. దీంతో ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. శశిధర్‌కు ప్రజలను ఆకట్టుకోవడంలో అంతు చురుకుదనం లేకపోవడం, జనసేన టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు ప్రస్తుతం దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయనది ఒంటరి పోరాటం అని చెప్పాలి. అభ్యర్థి వేటలో కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పంతం నానాజీ ప్రస్తుతం జనసేన పార్టీలోకి వెళ్లడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి కరువయ్యారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడంతో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కడం లేదు. కనీసం జెండా మోసేవారు కూడా ఆ పార్టీకి కరువయ్యారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ ఇస్తామన్నా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దూకుడుగా జనంలోకి వైఎస్సార్ సీపీ రానున్న ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు వైఎస్సార్ సీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ఇప్పటికే ప్రజల్లోకి నాయకులు, కార్యకర్తలు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుతుండడంతో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. పార్టీ కాకినాడ సిటీ కో– ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో రోజూ వివిధ డివిజన్లలో నవరత్నాల ప్రచార కార్యక్రమం నిరంతరం కొనసాగుతుండడంతో ఈ పథకాలపై ప్రజల్లో సృష్టత ఏర్పడింది. వైఎస్సార్ రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, పేదలందరికీ ఇళ్లు, పింఛన్ల పెంపు తదితర పథకాలతోనే నిజమైన సంక్షేమం సాధ్యమవుతుందన్న భరోసా ఏర్పడడంతో ఈసారి వైఎస్సార్ సీపీకి అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కాకినాడ ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు
-
నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా..!
♦ అంధ యువకుడ్ని పెళ్లాడిన ఆదర్శవనిత ♦ కంటికి రెప్పనై జీవితాంతం తోడుగా ఉంటా ♦ అతని అమాయకత్వం నచ్చింది.. శ్యామల ♦ ఆమెను మనసుతో చూశా... కళ్లల్లో పెట్టి చూసుకుంటా కొండబాబు ‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా..! అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరి ఉంటే ఈ కళ్లల్లోన నీ కలలుంటే ఊహలరెక్కలపైన ఊరేగే దారులు ఒక్కటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే...’ అంటూ ‘అంధ’మైన ఈ లోకాన్ని చూపించేందుకు ఓ యువతి ముందుకొచ్చింది. ఏడడుగులు నడిచింది. అంధుడైన భర్తను తన కళ్లతో లోకాన్ని చూపిస్తానంటోంది. తన హృదయంలో ఆమెకు ఆలయం కడతానని అతనంటున్నాడు. ఆ.. ఆమె...ఆ.. అతడు కథే ఇది...! –కె.టి. రామునాయుడు, సాక్షి,మధురవాడ(విశాఖపట్నం) పెళ్లంటే నూరేళ్ల పంట. దాని గురించి తలంపు రాగానే∙ప్రతి యువతి తన ఊహల రాకుమారుడి గురించి ఎన్నో కలలుకంటుంది. తన నూరేళ్ల అందమైన జీవితానికి ఎన్నో బాటలు వేసుకుని దానిని సాకారానికి ఎలా ప్రయత్నించాలో ఆలోచించుకుంటుంది. కానీ విశాఖ జిల్లా పరదేశిపాలెంకు చెందిన సత్యాల శ్యామల ఆదర్శభావాలతో విభిన్నంగా ఆలోచించింది. దానికి అనుగుణంగానే తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన వడ్డి కొండబాబు అనే అంధుడ్ని గత నెల 19న రాజమండ్రిలో వివాహమాడింది. తన కళ్లతో లోకాన్ని చూపిస్తానని శ్యామల చెబుతుంటే...నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని కొండబాబు చెబుతున్నాడు. శ్యామల నేపథ్యమిది... సత్యాల శ్యామల..పేద కుటుంబంలో వికసించిన పుష్పం. జీవీఎంసీ పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న అప్పారావు, పద్మల ప్రథమ కుమార్తె. పాఠశాల చదువంతా పరదేశిపాలెం, బోయిపాలెంలో సాగింది. విశాఖ కృష్ణా కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకూ చదివింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పింది. చిన్నతనం నుంచి శ్యామలకు సేవా గుణం ఎక్కువ. వికలాంగులను సేవ చేయడంలో ముందుండేది. వికలాంగులు, అంధుల కోసం చందాలు వసూలు చేసి ఇచ్చేది. అంగవైకల్యం ఉన్న వారినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకునేది. అతని మంచి తనం నాకు బాగా నచ్చింది వికలాంగులు, ఆపదలో ఉన్నరిని చూస్తే ఎందుకో కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. మనుషులందర్నీ దేవుడే సృష్టించాడు..మరి అటువంటప్పుడు ఈ వ్యత్యాసాలు ఎందుకో.. అందుకే వారంటే నాకు ఎక్కడ లేని ప్రేమ,అభిమానం. ఈ క్రమంలోనే మా బంధువుల ద్వారా కొండబాబు సంబంధం వచ్చింది. ఆయనతో మాట్లాడిన తరువాత అతని అమాయకత్వం, మంచి తనం..బాగా నచ్చింది. ఆయనకు కళ్లు లేవు. అంతకు మించి మంచి మనసుంది. పెళ్లిలో చేయి పట్టుకుని నడిచా..జీవితాంతం ఆయనను నా చేతితో నడిపిస్తాను. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జియోన్ అంధుల పాఠశాల్లో పనిచేస్తున్నారు. అవసరమైతే ఇద్దరం పనిచేస్తాం. ఆయనకు కష్టంగా ఉంటే నేను ఉద్యోగం చేసైనా సరే పోషించుకుంటాను. ఆయనకు జీవితాంతం తోడు, నీడగ ఉంటాను. –సత్యాల. శ్యామల, యువతి ఆమెను మనస్సుతో చూశాను నాది తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు. నాన్న కష్ణ. నాకు మూడేళ్ల వయస్సులో చికెన్ ఫాక్స్ కారణంగా ఓ కన్నుపోయింది. దాని ఇన్ఫక్షన్ వలన రెండో కన్ను కూడా పోయింది. దాంతో జియోన్ అంధుల పాఠశాలలో చదివాను. మా మేడమ్ గారు ఎస్తేరు రాణి ఇంటర్ తర్వాత ఇక్కడే ఉద్యోగం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఇక్కడ చదివిన ఓ పూర్వ విద్యార్థి ద్వారా సంబంధం కూడా ఎస్తేరు రాణి చూశారు. దగ్గరుండి పెళ్లి జరిపించారు. పెళ్లికి ఆమెతో పాటు తుమ్మిడి బ్రదర్స్ , వ్యాపార వేత్త ఆనంద్ జయంత్ గారు ఇలా చాలా మంది మంది అండగా నిలిచారు. ఎంతో ఆదర్శ భావంతో నన్ను పెళ్లాడిన శ్యామలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. నా భార్య కళ్లల్లో పెట్టి చూసుకుంటాను. –వడ్డి కొండబాబు -
నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్యా..!
అంధ యువకుడ్ని పెళ్లాడిన ఆదర్శవనిత కంటికి రెప్పనై జీవితాంతం తోడుగా ఉంటా అతని అమాయకత్వం నచ్చింది శ్యామల ఆమెను మనసుతో చూశా... కళ్లల్లో పెట్టి చూసుకుంటా కొండబాబు ‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్యా..! అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరి ఉంటే ఈ కళ్లల్లోన నీ కలలుంటే ఊహలరెక్కలపైన ఊరేగే దారులు ఒక్కటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే...’ అంటూ ‘అంధ’మైన ఈ లోకాన్ని చూపించేందుకు ఓ యువతి ముందుకొచ్చింది. ఏడడుగులు నడిచింది. అంధుడైన భర్తను తన కళ్లతో లోకాన్ని చూపిస్తానంటోంది. తన హృదయంలో ఆమెకు ఆలయం కడతానని అతనంటున్నాడు. ఆ.. ఆమె...ఆ.. అతడు కథే ఇది...! –కె.టి. రామునాయుడు, సాక్షి,మధురవాడ పెళ్లంటే నూరేళ్ల పంట. దాని గురించి తలంపు రాగానే∙ప్రతి యువతి తన ఊహల రాకుమారుడి గురించి ఎన్నో కలలుకంటుంది. తన నూరేళ్ల అందమైన జీవితానికి ఎన్నో బాటలు వేసుకుని దానిని సాకారానికి ఎలా ప్రయత్నించాలో ఆలోచించుకుంటుంది. కానీ విశాఖ జిల్లా పరదేశిపాలెంకు చెందిన సత్యాల శ్యామల ఆదర్శభావాలతో విభిన్నంగా ఆలోచించింది. దానికి అనుగుణంగానే తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన వడ్డి కొండబాబు అనే అంధుడ్ని గత నెల 19న రాజమండ్రిలో వివాహమాడింది. తన కళ్లతో లోకాన్ని చూపిస్తానని శ్యామల చెబుతుంటే...నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని కొండబాబు చెబుతున్నాడు. శ్యామల నేపథ్యమిది... సత్యాల శ్యామల..పేద కుటుంబంలో వికసించిన పుష్పం. జీవీఎంసీ పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న అప్పారావు, పద్మల ప్రథమ కుమార్తె. పాఠశాల చదువంతా పరదేశిపాలెం, బోయిపాలెంలో సాగింది. విశాఖ కృష్ణా కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకూ చదివింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పింది. చిన్నతనం నుంచి శ్యామలకు సేవా గుణం ఎక్కువ. వికలాంగులను సేవ చేయడంలో ముందుండేది. వికలాంగులు, అంధుల కోసం చందాలు వసూలు చేసి ఇచ్చేది. అంగవైకల్యం ఉన్న వారినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకునేది. అతని మంచి తనం నాకు బాగా నచ్చింది వికలాంగులు, ఆపదలో ఉన్నరిని చూస్తే ఎందుకో కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. మనుషులందర్నీ దేవుడే సృష్టించాడు..మరి అటువంటప్పుడు ఈ వ్యత్యాసాలు ఎందుకో.. అందుకే వారంటే నాకు ఎక్కడ లేని ప్రేమ,అభిమానం. ఈ క్రమంలోనే మా బంధువుల ద్వారా కొండబాబు సంబంధం వచ్చింది. ఆయనతో మాట్లాడిన తరువాత అతని అమాయకత్వం, మంచి తనం..బాగా నచ్చింది. ఆయనకు కళ్లు లేవు. అంతకు మించి మంచి మనసుంది. పెళ్లిలో చేయి పట్టుకుని నడిచా..జీవితాంతం ఆయనను నా చేతితో నడిపిస్తాను. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జియోన్ అంధుల పాఠశాల్లో పనిచేస్తున్నారు. అవసరమైతే ఇద్దరం పనిచేస్తాం. ఆయనకు కష్టంగా ఉంటే నేను ఉద్యోగం చేసైనా సరే పోషించుకుంటాను. ఆయనకు జీవితాంతం తోడు, నీడగ ఉంటాను. –సత్యాల. శ్యామల, యువతి ఆమెను మనస్సుతో చూశాను నాది తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు. నాన్న కష్ణ. నాకు మూడేళ్ల వయస్సులో చికెన్ ఫాక్స్ కారణంగా ఓ కన్నుపోయింది. దాని ఇన్ఫక్షన్ వలన రెండో కన్ను కూడా పోయింది. దాంతో జియోన్ అంధుల పాఠశాలలో చదివాను. మా మేడమ్ గారు ఎస్తేరు రాణి ఇంటర్ తర్వాత ఇక్కడే ఉద్యోగం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఇక్కడ చదివిన ఓ పూర్వ విద్యార్థి ద్వారా సంబంధం కూడా ఎస్తేరు రాణి చూశారు. దగ్గరుండి పెళ్లి జరిపించారు. పెళ్లికి ఆమెతో పాటు తుమ్మిడి బ్రదర్స్ , వ్యాపార వేత్త ఆనంద్ జయంత్ గారు ఇలా చాలా మంది మంది అండగా నిలిచారు. ఎంతో ఆదర్శ భావంతో నన్ను పెళ్లాడిన శ్యామలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. నా భార్య కళ్లల్లో పెట్టి చూసుకుంటాను. –వడ్డి కొండబాబు -
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
తూర్పుగోదావరి: కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు అర్ధరాత్రి వీరంగం సృష్టంచారు. స్థానిక ఆండాలమ్మ కాలేజీ ప్రహారీ గోడను ప్రొక్లెయిన్ సాయంతో కూల్చివేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరి ఆగడాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎమ్మెల్యే అనుచరులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
కొండబాబు ఇంటిని ముట్టడించిన డ్వాక్రా మహిళలు
-
మొండిబకాయిల కొండబాబు
సెటిల్మెంట్లు, కబ్జాలు, దందాలు చేయడంలోనే మొనగాడిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఈసారి తన టాలెంట్‌ను ఓ బ్యాంకుకు చూపించారు. తన సోదరుడు, మరో ఏడుగురి సన్నిహితులతో కలసి సదరు బ్యాంకు నుంచి దాదాపు రూ. ఏడుకోట్ల రుణాన్ని తీసుకొని వారికి ఏడు చెరువుల నీళ్లు తాగించారు. రుణం తిరిగి చెల్లించకుండా తన బండతనంతో మొండిగా వ్యవహరించిన కొండబాబు ఆస్తులను బుధవారం వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) కాకినాడలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి తీసుకున్న రుణం చెల్లించకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. కొండబాబు, ఆయన సోదరుడు సత్యనారాయణతోపాటు మరో ఏడుగురు సన్నిహితులు కలిసి బ్యాంకు నుంచి తీసుకున్న రూ.6.88 కోట్ల రుణం చెల్లించలేదు. వీరంతా మెసర్స్ శంభులింగం మెరైన్ సర్వీసెస్ పేరుతో ఏర్పాటైన కంపెనీ తరఫున బ్యాంక్ నుంచి మూడేళ్ల క్రితం రుణం తీసుకున్నారు. వీరిలో టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావు, భార్య శ్రీదేవి రూ.48 లక్షలు తీసుకున్నారు. తాను తీసుకున్న రుణం వివరాలను ఇటీవల కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే సందర్భంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో కూడా పొందుపరిచారు. ఆయన సోదరుడు వనమాడి సత్యనారాయణ, భార్య సత్యగౌరి పేరుతో మరో రూ.67 లక్షలు తీసుకున్నారు. వీరితోపాటు మిగిలిన వారంతా కలిసి బ్యాంక్ నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదు. తీసుకున్న రుణం చెల్లించాలంటూ తమ ప్రతినిధులు పలు పర్యాయాలు చేసిన విజ్ఞప్తులు వారు పట్టించుకోలేదని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. ఎంతకూ రుణం చెల్లించకపోవడంతో చేసేది లేక బ్యాంక్ అధికారులు వారి ఆస్తుల వేలానికి పత్రికల్లో ఇటీవల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం బుధవారం కొండబాబుతోపాటు ఆయన సోదరుడు, సన్నిహితుల ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంక్ అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఫిబ్రవరి 28 నాటికి ఉన్న బ్యాంక్ రుణంతో పాటు మార్చి ఒకటో తేదీ వరకు వడ్డీ, ఇతర బ్యాంక్ ఖర్చులు కూడా వసూలు చేసుకునేందుకు బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటైజేషన్ అండ్ రీ కనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 ప్రకారం తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ కాకినాడ బ్రాంచి ఈ మేరకు వేలం కోసం సీల్డుటెండర్లు ఆహ్వానించింది. రుణం కోసం బ్యాంక్‌లో తాకట్టుపెట్టిన కొండబాబుకు చెందిన కాకినాడ జగన్నాథపురం చర్చ్‌స్క్వేర్ సెంటర్లోని నివాస భవనాన్ని వేలం నిర్వహిస్తున్నట్టుగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ బ్రాంచి ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే రుణం తీసుకున్న మిగిలినవారి ఆస్తులకు కూడా బ్యాంకు అధికారులు బుధవారం వేలం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న వెంకటేశ్వరరావు రుణం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. నలుగురికీ సూక్తులు విన్పించే నాయకుడు తాను మాత్రం ఆదర్శంగా ఉండరా అని ప్రశ్నిస్తున్నారు. కావాలనే ఎన్నికల సమయంలో సానుభూతి కోసం అలా చేశారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. రుణాలు సక్రమంగా చెల్లించండి, కొత్త రుణాలు తీసుకోండని ఎమ్మెల్యేగా ఉండగా అనేక పర్యాయాలు వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కొండబాబుకు ఇప్పుడు తాను తీసుకున్న రుణం చెల్లించాలనే విషయం గుర్తుకు రావడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.