సాక్షి, కాకినాడ: జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాకినాడ జీజీహెచ్‌లో బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంపై ఇవాళ ఉదయం జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. వారి దాడిని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎదుర్కోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాటల జరిగాయి. తొలుత పలువురు జనసేన కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. జనసేన కార్యకర్తల దాడిలో పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ఇద్దరు నర్సులు, ఓ మహిళా రిపోర్టర్ గాయపడ్డారు.
జనసేన కార్యకర్తల దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జీజీహెచ్‌లో చికిత్స కోసం వచ్చారు. అదే సమయంలో జనసేన పార్టీ నాయకులు జీజీహెచ్‌కు వచ్చి ఎమర్జన్సీ వార్డులో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడికి దిగారు. ఈ వీరంగాన్ని సెల్‌లో చిత్రీకరిస్తున్న ఓ పత్రిక రిపోర్టర్ జుత్తుక జ్యోతిపై విరుచుకుపడి ఆమెను గొడకేసికొట్టారు. దీంతో స్పృహతప్పి పడిపోయింది. జ్యోతిపై దాడిని అడ్డుకున్న ఇద్దరు నర్సులను కూడా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు జీజీహెచ్‌కు వచ్చి జనసేన కార్యకర్తల వీరంగాన్ని అడ్డుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment