జనసేన నుంచి వెల్లువలా వైఎస్సార్‌సీపీలోకి.. | AP Local Body Elections 2020: Janasena Leaders Joined YSRCP | Sakshi
Sakshi News home page

కాకినాడలో జనసేనకు ఝలక్‌

Published Tue, Mar 10 2020 2:07 PM | Last Updated on Tue, Mar 10 2020 8:33 PM

AP Local Body Elections 2020: Janasena Leaders Joined YSRCP - Sakshi

సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎ‍స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అన్ని విపక్ష పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి  వస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి వెల్లువలా వైఎస్సార్‌సీపీలోకి వస్తున్నారు. (చదవండి: వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి)

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు మంగళవారం వైఎస్సార్‌సీలో చేరారు. కాకినాడ రూరల్ ఎంపీపీ పుల్ల సుధ చందు, టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షులు ముద్దన సూర్యప్రకాష్, జనసేన గ్రామకమిటీ అధ్యక్షులు పుల్ల రాము, తెలుగు యువత అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ శీలం చిన్న, మాజీ సర్పంచ్ బొండాడ విజయతో పాటుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కాకినాడ రూరల్ తమ్మవరం టీడీపీ నేతలు కాదా వల్లభరాముడు, కాదా శ్రీనివాస్, సిద్ధి నండిబాబు, పోలవరం రెడ్డి, 50 మంది కార్యకర్తలు.. నేమాం గ్రామ జనసేన, టీడీపీ నేతలు వనమాడి నాగేశ్వరరావు, రేవు వీరబాబు, దెయ్యాల ఏసుబాబు, కొప్పిశెట్టి వెంకటరమణ తదితరులు, 150 మంది కార్యకర్తలు మంత్రి కన్నబాబు సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు.

పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు రెడ్నం దొరబాబు, కోడెల అర్జునరావు, పెండ్యం అబ్బు, తుతిక కామేశ్వరరావ, నమ్మి శ్రీనివాసు, జనసేన నుంచి కృష్ణ వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ నేత దవులూరి సుబ్బారావు పార్టీ కండువా కప్పి వీరిని సాదరంగా ఆహ్వానించారు. కాగా, విశాఖలో జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నాయకులు ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. (చదవండి: వైఎస్సార్‌సీపీలోకి డొక్కా, రెహమాన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement