
సాక్షి, కాకినాడ : పాదయాత్రలో చెప్పినట్లుగానే ‘జగన్ అనే నేను’ అన్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల రోజులు రాష్ట్రాన్ని పరిపాలించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మంత్రి వర్గ విస్తరణ నాటి నుంచి అక్రమ నిర్మాణమైన ప్రజావేదిక కూల్చివేత వరకు అన్నీ సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నారని పేర్కొన్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఐదుగురికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. అవినీతి రహిత పరిపాలన అందించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మాలాంటి నాయకులకు ఎంతో సంతోషమని అన్నారు. సీఎం జగన్ విషయంలో మేమంత ధైర్యంగా ఉన్నామని అన్నారు. వైఎస్ జగన్ నోటి వెంట ఒక్కమాట వస్తే, హామీ ఇస్తే.. అదే ప్రభుత్వ జీవోతో సమానమని పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లో ‘వాట్ ఈజ్ జగన్’ అనేది ప్రజలందరూ చూస్తారని తెలిపారు.