
సాక్షి, కాకినాడ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు సభ్యుడి రేసులో తాను లేనని కాకినాడ సిటీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పథకాలు అమలు చేయడంలో మాట తప్పని నాయకుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయన దగ్గర తాను పనిచేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ వంద రోజుల పాలన ప్రజామోదం పొందిందన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం జగన్ మాట తప్పడం లేదని పేర్కొన్నారు. ఆంధ్రా బ్యాంక్ పేరు మార్చి తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.