
సాక్షి, కాకినాడ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని కాకినాడ సీటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహానేతతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మహానేత లేకపోవడం తమ కుటుంబానికి తీరని లోటు అని తెలిపారు. వైఎస్సార్ తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మళ్లీ తమకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కలిగిందన్నారు. వైఎస్సార్ వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు. మహానేత స్పూర్తితో ప్రజల కోసం శ్రమిస్తామని పేర్కొన్నారు.