వైఎస్సార్‌సీపీ నాయకులకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి
ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ ఘాట్‌లో జగన్ నివాళి
జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం
సాక్షి ప్రతినిధి, కడప: ‘వైఎస్సార్‌సీపీ నాయకులు ఐక్యంగా పోరాటం చేయాలి. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి...’ అని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మంగళవారం హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకున్న ఆయన నేరుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సు«దీర్‌రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ భరోసా కలి్పంచాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ఆదేశించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, గంగుల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌బీ అంజాద్‌బాషా, రాచమల్లు శివప్రసాదరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులతో సమావేశమై పలు విషయాలు చర్చించారు. అనంతరం పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ పార్టీ నాయకులతో మమేకమయ్యారు.
బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఆయా ప్రాంతాల నాయకులతోను వివిధ అంశాలపై చర్చించారు. కాగా, పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ... ఆగి పలకరిస్తూ... వారి వినతులు స్వీకరిస్తూ... వైఎస్ జగన్ భాకరాపురంలో ఉన్న తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది.
ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద సెల్ఫీ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల రూ.530 కోట్లతో నిరి్మంచారు. 605 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తిచేశారు. ఎన్‌ఎంసీ తనిఖీల అనంతరం 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే కూటమి ప్రభుత్వం మంజూరైన 50 ఎంబీబీఎస్ సీట్లు తిరస్కరిస్తూ లేఖ రాసింది. దీంతో ఈ ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వేంపల్లె నుంచి పులివెందులకు వెళుతూ మార్గమధ్యంలోని మెడికల్ కళాశాల వద్ద ఆగి సెల్ఫీ తీసుకున్నారు. అక్కడ ఉన్న స్థానికులు, కొంతమంది ఉద్యోగులు మెడికల్ సీట్లు భర్తీ చేసి వైద్య కళాశాలను నిర్వహించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం తిరస్కరించిందని వైఎస్ జగన్‌కు వివరించారు. ఇక్కడ నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను సైతం ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారని తెలిపారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment