సాక్షి, కాకినాడ: ఈనాడు రామోజీరావుపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. రామోజీరావు కుల కుట్రలు చేస్తున్నారని, రామోజీ కులంవారు తప్ప వేరే వాళ్లు అధికారంలోకి రాకూడదా? అని ప్రశ్నించారు.
కాగా, ద్వారంపూడి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడులో అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. నేను ఎలాంటి అక్రమాలు చేయలేదు. కావాలంటే విచారణ చేయించుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం సరికాదు. నాపై ఆరోపణలు నిజం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. గతంలో పిన్నెల్లి మీద కూడా అసత్య కథనాలు రాశాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇమేజ్‌ను దెబ్బ తీయాలనే ఇలాంటి వార్తలు రాస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గెలవకూడదూ.. రామోజీ పోవాలి. రాష్ట్రానికి పట్టిన చీడపురులు చంద్రబాబు, రామోజీ. వీళ్ళ వల్లే రాష్ట్రంలో కులాల ఘర్షణలు జరిగాయి. అబద్దాన్ని నిజం చేసే దిట్ట రామోజీరావు. కాకినాడలో వాస్తవ పరిస్ధితులు ఏమిటో తెలుసుకో. కోవిడ్ సమయంలో అనేక మంది జర్నలిస్టులకు నేను ఫీజులు చెల్లించాను. కోవిడ్ నిబంధనలు ఉల్లంగించిన అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆసుపత్రులకు పెనాల్టీ వేయించాను అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment