సాక్షి, గుంటూరు: రామోజీరావుకు క్లీన్‌చిట్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రామోజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రామోజీరావు సంస్థలను చంద్రబాబు కాపాడుతున్నారన్నారు.
రామోజీ ఆర్థిక నేరస్థుడు..
‘‘డీబీటీ పథకాలన్నీ చంద్రబాబు పక్కనపెట్టారు. దాచుకో.. దాచుకో.. తినుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మార్గదర్శి ఫండ్స్‌ను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారు. చిట్స్ వసూలు చేసి మిగతా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. రామోజీ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. చట్ట వ్యతిరేకంగా రామోజీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. రామోజీ ఆర్థిక నేరస్థుడు. రామోజీ పెట్టుబడులన్నీ అక్రమంగా నిర్వహించినవే. చిట్స్ కేసు కొట్టేస్తే పత్రికల్లో వార్త రాకుండా జాగ్రత్తపడ్డారు. అర్ధాంతరంగా కేసును సీఐడీ విత్ డ్రా చేసుకోవడం దారుణం. దీనిపై ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఉండవల్లి ఈ కేసును బతికించారు’’ అని అంబటి చెప్పారు.
అసలు మార్గదర్శి చట్టపరంగా నడుస్తోందా?
‘‘మార్గదర్శికి సహాయం చేయాలనే దురుద్దేశంతో చంద్రబాబు ఇటువంటి పనులకు పాల్పడ్డారు. రామోజీరావు కుటుంబం చట్టాలను ఉల్లంఘించింది. రామోజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. మార్గదర్శి మీద అనేక కోర్టుల్లో విచారణ జరుగుతోంది. కానీ ఈ కేసులను ప్రభుత్వం విత్ డ్రా చేసకోవటం చాలా అన్యాయం. ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకో. కోర్టులతో పనిలేకుండా ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇస్తోంది. మార్గదర్శి అంటే వైఎస్సార్, జగన్‌కు కోపం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మార్గదర్శిలోని లోపాల గురించి మాట్లాడటం లేదు. అసలు మార్గదర్శి చట్టపరంగా నడుస్తోందా? లేదా? అనేదే చూడాలి. ఒక చిట్ వేసేటప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక ఎకౌంట్ ఓపెన్ చేయాలి. ఇలా ఎన్ని చిట్‌లు వేస్తే అన్ని ఖాతాలు తెరవాలి. కానీ మార్గదర్శి కేసులో ఒకే ఖాతాలో ఎమౌంట్ వేశారు’’ అని అంబటి రాంబాబు వివరించారు.
సీఐడీ విత్ డ్రా.. దీని వెనుక కుట్ర
‘‘ఆ డబ్బుని ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టారు. ప్రజల సొమ్ముతో పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నారు. సీఐడీ దీన్ని గుర్తించి రామోజీరావుని కూడా విచారించింది. ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ, పీవి నరసింహారావు కూడా కోర్టులో నిలబడ్డారు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్. 2006లోనే మార్గదర్శి ఫైనాన్షియల్ అక్రమాలను ఆర్‌బీఐ గుర్తించింది. ఆ తర్వాతే కేసు నమోదు చేశారు. రాష్ట్రం విడిపోయే ముందు రోజు ఎవరికీ తెలియకుండా కోర్టు కొట్టేసింది. ఆనాడు ఏ పత్రికా ఆ వార్త రాయలేదు. ఇవాళ కూడా సీఐడీ విత్‌డ్రా చేసుకున్న సంగతిని కూడా ఏ పత్రిక రాయలేదు. అంటే దీని వెనుక కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. మార్గదర్శిలో డిపాజిట్లు కూడా ఎవరూ వేయకపోవటంతో దివాళా దశగా ఆ సంస్థ నడుస్తోంది. ప్రభుత్వం కేసు విత్‌డ్రా చేసుకున్నా కేసు ఎక్కడకూ పోదు. గతంలో ఇలాగే చేసినా ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లి కేసును బతికించారు. రామోజీ, చంద్రబాబులకు వ్యవస్థలను మేనేజ్ చేయటం అలవాటు.’’ అని అంబటి దుయ్యబట్టారు.
చంద్రబాబు జీవితమంతా కొనుగోలు, అమ్మకాలే..
‘‘నీతి, నిజాయితీ గలవారే రాజకీయాలు చేయగలరు. చంద్రబాబు జీవితమంతా కొనుగోలు, అమ్మకాలే. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్కడివారు గట్టిగా నిలబడ్డారు. ఎంపీటీసి, జడ్పీటీసీలను చూసైనా ఈ ఎంపీలు బుద్ది తెచ్చుకోవాలి. ఎంతమంది వెళ్లినా వైసీపికి 40 శాతం ఓటర్లు ఉన్నారని గుర్తించాలి. చంద్రబాబు, ఎల్లోమీడియా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి ని టార్గెట్ చేశారు. అసలు సజ్జలకు ఈ కేసుతో ఏం సంబంధం ఉంది?. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా ఈ కేసుతో చంద్రబాబు హడావుడి ఉంది. అదంతా త్వరలోనే భూమ్ రాంగ్ అవుతుంది. జెత్వాని వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. చంద్రబాబు స్కాం చేసినందున అరెస్టు అయ్యాడు. ఆయన్ని అరెస్టు చేశారని కక్ష కట్టి ఐపీఎస్‌ల మీద పగ సాధిస్తున్నారు. బాలకృష్ణ కాల్పుల కేసును కూడా బయటకు తీస్తారేమో చూడాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment