సాక్షి, గుంటూరు: రామోజీరావు అనేక చట్టాలను ఉల్లంఘించారని.. అవినీతి మీద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘రామోజీరావు వైపు 2006 వరకు ఏ వ్యవస్థ చూడలేదన్నారు.
‘‘మార్గదర్శిపై ఆనాడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆర్‌బీఐకి ఫిర్యాదు చేశారు. ఉండవల్లిపై కూడా రామోజీ పరువునష్టం దావా వేశారు. ఈ కేసును కొట్టేయమంటూ రామోజీ పిటిషన్ కూడా వేశారు. కేసు కొట్టేసినట్టు కూడా ఏ పేపర్‌లోనూ రాలేదు. 2016 డిసెంబర్‌లో ఉండవల్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసును కొట్టేయడం సరికాదని, విచారించాలని సుప్రీంకు వెళ్లారు. దీంతో విచారణ జరగాలని తెలంగాణ హైకోర్టుకు అప్పగించింది. మార్గదర్శి డిపాజిట్లపై విచారణ జరగాల్సిందేనని ఆర్‌బీఐ తెలిపింది’’ అని అంబటి రాంబాబు వివరించారు.
సంబంధిత వార్త: మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం
‘‘రామోజీరావు చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడ్డారు. దుష్టచతుష్టయంలో రామోజీరావు కూడా ఉన్నారు. ప్రజల వద్ద నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేశారు. చట్ట వ్యతిరేకంగా వసూలు చేసి పెట్టుబడి పెట్టుకున్నారు. రామోజీ ఎన్ని నేరాలు చేసినా ఇప్పటి సీఎం కూడా పట్టించుకోలేదు. ఎన్ని నేరాలు చేసినా తమను ఎవరూ పట్టించుకోకూడదని రామోజీ వారసులు కూడా వ్యవహరిస్తున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా చంద్రబాబుకు పట్టదు’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.
‘‘రామోజీరావు ఆర్థిక నేరస్థుడని మేం ముందునుంచి చెప్తున్నాం. ఈ కేసును బతికించడానికి ఉండవల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుపై యుద్ధం చేయాలని అరుణ్‌కుమార్‌ను కోరుతున్నా. చిట్‌ఫండ్ పేరుతో చేసిన నేరాలపై ఉండవల్లి పోరాడాలి’’ అని అంబటి సూచించారు.
సంబంధిత వార్త: అంతా నల్లధనం దందానే!
2006 నాటికి రూ. 2610 కోట్లు అక్రమ వసూళ్లు..
‘‘హెచ్‌యూఎఫ్ ప్రకారం డిపాజిట్లు సేకరించడం నేరమని ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టు విభజన చివరి రోజు కేసును కొట్టేయాలంటూ రామోజీరావు క్వాష్ పిటిషన్ వేశారు. 2006 నాటికి 2610 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారు. రామోజీరావు చనిపోయినా వారి కుటుంబ సభ్యుల పై చర్యలు తీసుకోవాలి. తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అవినీతి కార్యక్రమాలను చేసుకోవడంలో రామోజీరావు ఒకరు’’ అని అంబటి పేర్కొన్నారు.
రామోజీ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదు
‘‘వైఎస్ జగన్‌పై పుంఖాను పుంఖాలుగా తప్పుడు వార్తలు రాశారు. ఉదయం లేచినదగ్గర్నుంచి వైసీపీ పై దాడి చేసే ప్రయత్నం చేయడం దారుణం. మార్గదర్శి కేసులో రామోజీ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్.. ఆర్థిక నేరగాడు. మార్గదర్శి చిట్ ఫండ్ చేసిన కార్యక్రమాలన్నీ చట్ట వ్యతిరేకమే. మార్గదర్శిపై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు.
చెత్త నుంచి స్కాములు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు
‘‘రాజమండ్రి ఆర్అండ్‌ఆర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. ఆఫీసుల్లో చెత్తకాగితాలు తలేస్తుంటే ఎందుకు దిగజారిపోతున్నారు. చెత్త తగలబడితే స్కామ్ జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. చెత్త నుంచి స్కాములు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు. కావాలనే మా నాయకులను అరెస్టులు చేస్తున్నారు. మేం దేనికీ భయపడం. వైఎస్సార్‌సీపీ పార్టీ ధైర్యంలోంచి పుట్టింది. మా పై బురద చల్లాలలని చూస్తున్నారు’’ అని అంబటి మండిపడ్డారు.
మంత్రి రామానాయుడు నిజం ఒప్పేసుకున్నాడు
‘‘పోలవరం ఇష్యూ పై చంద్రబాబు, రామానాయుడికి చర్చకు రావాలన్న నా రిక్వెస్ట్‌ను విరమించుకుంటున్నా. అన్నీ సైమన్ టేనియస్ గా ప్రారంభించామని తెలిసో తెలియకో మంత్రి రామానాయుడు నిజం ఒప్పేసుకున్నాడు. ఇంక దీనిలో చర్చించడానికేం లేదు.’’ అని అంబటి చెప్పారు.
కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదు
‘‘మా సమయంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే స్కామ్‌కు అవకాశమెక్కడుంటుంది? కక్షసాధింపు చర్యల్లో ఉండవని చంద్రబాబు చెబుతున్నాడు. కానీ చెప్పే మాటలకు చేతలకు తేడా ఉంది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. కక్ష సాధింపు చర్యల వెనుక మనిషి చంద్రబాబు.. బుర్ర లోకేష్‌ది. రామోజీరావును సపోర్ట్ చేసిన వారు ఆర్బీఐ అఫిడవిట్‌కు ఏం సమాధానం చెబుతారు?. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు కూడా రామోజీరావు ఎదుర్కున్న పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయం’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment