Margadarsi Chits
-
చందాదారుల వివరాలు ఎందుకివ్వరు?
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులపై సుప్రీం కోర్టుకు అందజేసిన 69,531 పేజీల వివరాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు ఎల్రక్టానిక్ఫార్మాట్లో ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే ఉండవల్లి వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయని, కొన్ని ఇబ్బందుల కారణంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్ (పెన్ డ్రైవ్)లో కోరుతున్నారని హైకోర్టు తెలిపింది. దీనికి సమాధానం చెప్పేందుకు మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తటపటాయించారు. కొంత గడువు ఇస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్ నుంచి సూచనలు పొంది చెబుతానని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. ఆరోజున అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), మార్గదర్శితో పాటు ఇరు రాష్ట్రాల న్యాయవాదులను ఆదేశించింది. చందాదారుల వివరాలను పెన్ డ్రైవ్‌లో తీసుకురావాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచి్చంది. ఈ తీర్పుపై ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ ఏడాది ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించింది. లూథ్రా వాదనకు ధర్మాసనం అభ్యంతరం ఈ వ్యవహారంపై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణకు ఉండవల్లి అరుణ్‌కుమార్ వర్చువల్‌గా హాజరయ్యారు. సుప్రీం కోర్టుకు మార్గదర్శి అందజేసిన 69,531 పేజీల చందాదారుల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. పేపర్ ఫార్మాట్లో వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ, పరిశీలనకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. కొన్ని అంశాలను ఇప్పటికే పరిశీలించానని, ఆ వివరాలన్నీ డొల్లగానే ఇచ్చారని అన్నారు. ఎల్రక్టానిక్ ఫార్మాట్లో ఇస్తే అక్రమాలు తెలియజేస్తానన్నారు. తాను ఎవరి తరఫున వకాలత్ తీసుకోలేదని, సుప్రీం కోర్టు సూచన మేరకు హైకోర్టుకు సాయం మాత్రమే చేస్తున్నా అని చెప్పారు. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చందాదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పేపర్ ఫార్మాట్లో ఉన్న వివరాలనే పెన్‌డ్రైవ్‌లో కోరుతున్నారు కదా అని ప్రశ్నించింది. దీంతో గడువిస్తే సంస్థ నుంచి సూచనలు పొంది చెబుతానని లుథ్రా బదులిచ్చారు. కాగా, ఈ కేసులో పిటిషనర్–2 (రామోజీరావు) మృతి చెందారని తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని కూడా ధర్మాసనం నమోదు చేసుకుంది. -
మార్గదర్శి కేసు.. వారి వివరాలిస్తే ఇబ్బందేంటీ?: హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సోమవారం చేపట్టిన విచారణలో జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుల ధర్మాసనం చందాదారుల వివరాలు ఇవ్వడానికి మీకేంటి ఇబ్బంది? అని మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రాను ప్రశ్నించింది. అయితే.. న్యాయవాది లూద్రా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు వివరాలు ఇవ్వాలని చెప్పలేదన్న కోర్టుకు తెలిపారు. ఉండవల్లి అరుణ కుమార్ వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయి. ఆయన ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో అడుగుతున్నారు. ఇవ్వడానికి ఇబ్బందేంటో చెప్పండని హైకోర్టు ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. పిటిషనర్ నుంచి సూచనలు పొంది తెలియజేస్తామని న్యాయవాది లూద్రా అన్నారు. అన్ని వివరాలతో రావాలని ఆర్బీఐ, లూద్రాకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్–2 రామోజీరావు మృతిచెందారని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్( పీపీ) హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక..తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.చదవండి: చందాలు ఎవరికి తిరిగిచ్చారో.. ఇవ్వలేదో వివరాల్లేవు -
ఆ ఖర్చంతా మార్గదర్శి భరించాల్సిందే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ‘మార్గదర్శి’ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నోటీసులు యాడ్స్‌కు అయ్యే ఖర్చును మార్గదర్శి భరించాలని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. యాడ్స్ ఖర్చు వివరాలు ఇచ్చిన వారంలోపు మార్గదర్శి డిపాజిట్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘చందాదారుల వివరాల కోసం పత్రికల్లో నోటీసులివ్వండి. మొత్తం ఎంత ఖర్చవుతుందో రిజిస్ట్రీ మార్గదర్శికి చెబుతుంది. అప్పటి నుంచి వారంలోగా ఆ డబ్బు డిపాజిట్ చేయాలి. వెంటనే పత్రికల్లో విస్తృతంగా నోటీసులిస్తూ ప్రచారం చేయండి’’ అని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది.మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదును తిరిగి చెల్లించిందా? లేక ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు గత విచారణలో రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది.అలాగే చందాదారుల వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సూచించింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. -
మార్గదర్శి కోసం ముసుగు తీసేసాడు: Undavalli Arun Kumar
-
ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకో: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: రామోజీరావుకు క్లీన్చిట్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రామోజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రామోజీరావు సంస్థలను చంద్రబాబు కాపాడుతున్నారన్నారు.రామోజీ ఆర్థిక నేరస్థుడు..‘‘డీబీటీ పథకాలన్నీ చంద్రబాబు పక్కనపెట్టారు. దాచుకో.. దాచుకో.. తినుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మార్గదర్శి ఫండ్స్‌ను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారు. చిట్స్ వసూలు చేసి మిగతా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. రామోజీ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. చట్ట వ్యతిరేకంగా రామోజీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. రామోజీ ఆర్థిక నేరస్థుడు. రామోజీ పెట్టుబడులన్నీ అక్రమంగా నిర్వహించినవే. చిట్స్ కేసు కొట్టేస్తే పత్రికల్లో వార్త రాకుండా జాగ్రత్తపడ్డారు. అర్ధాంతరంగా కేసును సీఐడీ విత్ డ్రా చేసుకోవడం దారుణం. దీనిపై ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఉండవల్లి ఈ కేసును బతికించారు’’ అని అంబటి చెప్పారు.అసలు మార్గదర్శి చట్టపరంగా నడుస్తోందా? ‘‘మార్గదర్శికి సహాయం చేయాలనే దురుద్దేశంతో చంద్రబాబు ఇటువంటి పనులకు పాల్పడ్డారు. రామోజీరావు కుటుంబం చట్టాలను ఉల్లంఘించింది. రామోజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. మార్గదర్శి మీద అనేక కోర్టుల్లో విచారణ జరుగుతోంది. కానీ ఈ కేసులను ప్రభుత్వం విత్ డ్రా చేసకోవటం చాలా అన్యాయం. ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకో. కోర్టులతో పనిలేకుండా ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇస్తోంది. మార్గదర్శి అంటే వైఎస్సార్, జగన్‌కు కోపం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మార్గదర్శిలోని లోపాల గురించి మాట్లాడటం లేదు. అసలు మార్గదర్శి చట్టపరంగా నడుస్తోందా? లేదా? అనేదే చూడాలి. ఒక చిట్ వేసేటప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక ఎకౌంట్ ఓపెన్ చేయాలి. ఇలా ఎన్ని చిట్లు వేస్తే అన్ని ఖాతాలు తెరవాలి. కానీ మార్గదర్శి కేసులో ఒకే ఖాతాలో ఎమౌంట్ వేశారు’’ అని అంబటి రాంబాబు వివరించారు. సీఐడీ విత్ డ్రా.. దీని వెనుక కుట్ర ‘‘ఆ డబ్బుని ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టారు. ప్రజల సొమ్ముతో పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నారు. సీఐడీ దీన్ని గుర్తించి రామోజీరావుని కూడా విచారించింది. ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ, పీవి నరసింహారావు కూడా కోర్టులో నిలబడ్డారు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్. 2006లోనే మార్గదర్శి ఫైనాన్షియల్ అక్రమాలను ఆర్బీఐ గుర్తించింది. ఆ తర్వాతే కేసు నమోదు చేశారు. రాష్ట్రం విడిపోయే ముందు రోజు ఎవరికీ తెలియకుండా కోర్టు కొట్టేసింది. ఆనాడు ఏ పత్రికా ఆ వార్త రాయలేదు. ఇవాళ కూడా సీఐడీ విత్‌డ్రా చేసుకున్న సంగతిని కూడా ఏ పత్రిక రాయలేదు. అంటే దీని వెనుక కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. మార్గదర్శిలో డిపాజిట్లు కూడా ఎవరూ వేయకపోవటంతో దివాళా దశగా ఆ సంస్థ నడుస్తోంది. ప్రభుత్వం కేసు విత్‌డ్రా చేసుకున్నా కేసు ఎక్కడకూ పోదు. గతంలో ఇలాగే చేసినా ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లి కేసును బతికించారు. రామోజీ, చంద్రబాబులకు వ్యవస్థలను మేనేజ్ చేయటం అలవాటు.’’ అని అంబటి దుయ్యబట్టారు.చంద్రబాబు జీవితమంతా కొనుగోలు, అమ్మకాలే..‘‘నీతి, నిజాయితీ గలవారే రాజకీయాలు చేయగలరు. చంద్రబాబు జీవితమంతా కొనుగోలు, అమ్మకాలే. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్కడివారు గట్టిగా నిలబడ్డారు. ఎంపీటీసి, జడ్పీటీసీలను చూసైనా ఈ ఎంపీలు బుద్ది తెచ్చుకోవాలి. ఎంతమంది వెళ్లినా వైసీపికి 40 శాతం ఓటర్లు ఉన్నారని గుర్తించాలి. చంద్రబాబు, ఎల్లోమీడియా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి ని టార్గెట్ చేశారు. అసలు సజ్జలకు ఈ కేసుతో ఏం సంబంధం ఉంది?. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా ఈ కేసుతో చంద్రబాబు హడావుడి ఉంది. అదంతా త్వరలోనే భూమ్ రాంగ్ అవుతుంది. జెత్వాని వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. చంద్రబాబు స్కాం చేసినందున అరెస్టు అయ్యాడు. ఆయన్ని అరెస్టు చేశారని కక్ష కట్టి ఐపీఎస్‌ల మీద పగ సాధిస్తున్నారు. బాలకృష్ణ కాల్పుల కేసును కూడా బయటకు తీస్తారేమో చూడాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
ఈనాడుకు బాబు గిఫ్ట్
పరస్పర ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికి గానూ బాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. మార్గదర్శి విషయంలో అక్రమాలు జరిగినట్లు సీఐడీ గతంలో పక్కా ఆధారాలతో చార్జిషిట్లు వేసింది.దీంతో తేడా వస్తే తమ ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు మార్గదర్శి వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. సాక్షి, అమరావతి: ‘కుమ్మక్కు బంధం’ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతటి విఘాతమో మరోసారి తేటతెల్లమైంది. పరస్పర ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్సీపీ సర్కారుపై ఐదేళ్ల పాటు దుష్ప్రచారం చేసిన రామోజీ కుటుంబానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృతజ్ఞతాపూర్వకంగా ‘కానుక’ సమర్పించింది. అదీ రాష్ట్రంలో వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలను కాలరాసి మరీ!! మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఆంధ్రప్రదేశ్ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 వర్తించదంటూ ప్రత్యేక కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తుల జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఉపసంహరింప చేశారు. ఈమేరకు సీఐడీ అదనపు డీజీ గురువారం హైకోర్టుకు నివేదించారు. దీంతో అప్పీళ్ల ఉపసంహరణకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ వ్యాజ్యాలు తాజాగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. సీఐడీ కేసులన్నింటినీ తనకు అప్పగిస్తూ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ (ఈ అప్పీళ్లలో శైలజా కిరణ్ తరఫున వాదనలు వినిపించారు) ప్రొసీడింగ్స్ ఇచ్చారని నివేదించారు. అందువల్ల సీఐడీ తరఫున తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ అప్పీళ్లను ఉపసంహరించుకోవాలంటూ సీఐడీ అదనపు డీజీ లేఖ రాశారన్నారు. దీంతో తాము తమ అప్పీళ్లను ఉపసంహరించుకుంటున్నట్లు అదనపు డీజీ రాసిన లేఖను కోర్టుకు సమర్పించారు. ఆ లేఖను పరిశీలించిన న్యాయస్థానం పీపీ లక్ష్మీనారాయణ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని నమోదు చేసింది. అప్పీళ్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో వాటిని పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి అనంతరం ఉత్తర్వులు జారీ చేశారు. చిట్స్ రిజిస్ట్రార్ల ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ.. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిష్ట్రార్లు గతంలో సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. గడువు ముగిసినా, ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా ఫిర్యాదు చేశారు. పకడ్బందీ ఆధారాలతో చార్జిషీట్లు... మార్గదర్శి చిట్‌ఫండ్స్ అవకతవకలపై పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించిన సీఐడీ ప్రత్యేక కోర్టుల్లో చార్జిషిట్లు దాఖలు చేసింది. ఇదే సమయంలో ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖరారు చేయాలని కోరుతూ సీఐడీ పిటిషన్లు దాఖలు చేసింది. అయితే సీఐడీ దాఖలు చేసిన చార్జిషిట్లను పరిశీలించిన గుంటూరు, విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. ఆస్తుల జప్తు ఖరారు కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గుంటూరు కోర్టు కొట్టివేసింది. మార్గదర్శి, శైలజా కిరణ్ వాదనలను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీఈ అప్పీళ్లపై హైకోర్టు గత ఏడాది డిసెంబర్ నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ఈ అప్పీళ్ల విచారణార్హతపై రామోజీ, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ తరఫున నాడు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం చెప్పారు. మొదట విచారణార్హతపై తేల్చాలని పట్టుబట్టారు. దీనిపై సీఐడీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమ అప్పీళ్ల విచారణార్హతపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ రూపంలో తెలియచేయాలే తప్ప మౌఖికంగా కాదంది. అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ దాఖలు చేసినప్పుడే అందుకు తగిన సమాధానం ఇచ్చేందుకు తమ అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో మార్గదర్శి, శైలజా కిరణ్ తదితరులు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో జప్తు ఆస్తుల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగిస్తామని మార్గదర్శి తరఫున న్యాయవాది పోసాని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు తరువాత ఈ అప్పీళ్లపై ఇప్పటిదాకా విచారణ జరుగుతూ వస్తోంది.అప్పీళ్ల ఉపసంహరణతో జరిగేదిది..తాజాగా అప్పీళ్లను సీఐడీ ఉపసంహరించుకోవడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు భారీ ఊరట లభించినట్లయింది. తద్వారా నామమాత్రమైన ఐపీసీ సెక్షన్ల కింద విచారణకు ఆస్కారం ఉంటుంది. దీని వల్ల మార్గదర్శి యాజమాన్యానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిగి మార్గదర్శి డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలే పరిస్థితి ఉంటే దాని యాజమాన్యానికి, మేనేజర్లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, అలాగే ఆ సంస్థకు రూ 5 లక్షల జరిమానా విధించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మార్గదర్శి, దాని యాజమాన్యం బయటపడినట్లే. అదే రీతిలో రూ.1050 కోట్ల ఆస్తుల జప్తు కూడా ఉండదు. ఎందుకంటే ఆ జప్తును ఖరారు చేసేందుకు గుంటూరు కోర్టు తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఇలా ఈ మొత్తం కేసును నీరుగార్చి దాన్ని కొట్టేసేందుకు సీఐడీ ఆస్కారం కలిగించింది.భారీ గురు దక్షిణ..వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికిగానూ చంద్రబాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను, కీలక ప్రాజెక్టులను అటకెక్కించేసిన సీఎం చంద్రబాబు.. రామోజీ కుటుంబం కోసం మాత్రం రంగంలోకి దిగారు. సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ జరిపి కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ మాదిరిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ కూడా ఇరుక్కుపోవడం ఖాయమని పసిగట్టి ఆ పరిస్థితి తలెత్తకుండా సీఐడీని రంగంలోకి దించి అనుకున్న విధంగా పనికానిచ్చేశారు. అంతేకాదు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్ధిక మోసాలపై ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న కేసులను క్రమంగా ఎత్తివేసే దిశగా పావులు కదులుతున్నాయి. మార్గదర్శి విషయంలో రామోజీ కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ గతంలో పూర్తి ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులు సంఘం ఏర్పాటు చేసుకుని మరీ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటుఇతర రాష్ట్రాల్లోనూ బాధితులున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలు నాలుగు రాష్ట్రాలకు విస్తరించడం, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినందున ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించాలని సీఐడీ అధికారులు గతంలో కోరడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి రూ.4,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి చట్టపరంగా పీకల్లోతుల్లో కూరుకుపోయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం ఇప్పుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడుతోంది. తేడా వస్తే దాదాపు రూ.1,050 కోట్ల ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగా రామోజీరావు (ఇటీవల మృతి చెందారు) డైరెక్టర్‌గా, ఆయన కోడలు శైలజా కిరణ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఉన్న ఆరోపణలను నీరుగారుస్తోంది.మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలలో కొన్ని..సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టిపెట్టుకున్న మొత్తాలను రొటేషన్ చేస్తూ వస్తోంది. చట్ట నిబంధనల ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. అయితే అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. నాడు సీఐడీ అభ్యంతరం.. అప్పీళ్లు దాఖలుఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా, ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదంటూ గుంటూరు, విశాఖపట్నం కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో సీఐడీ అభ్యంతరం తెలిపింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ గత ఏడాది డిసెంబర్లో హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేసింది. మరికొన్ని అప్పీళ్లను ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు, ఆర్ధిక అవకతవకలు, చట్ట ఉల్లంఘనలపై పూర్తిస్థాయి ఆధారాలను చార్జిషీట్ రూపంలో ప్రత్యేక కోర్టుల ముందు ఉంచినా, వాటిని పట్టించుకోకపోవడం ఎంత మాత్రం సరికాదని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధమంది. చార్జిషిట్‌లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని తన అప్పీళ్లలో హైకోర్టుకు వివరించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయని, అలా చెప్పి ఉండకూడదంది. చార్జిషిట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను, జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. -
18 ఏళ్లుగా సాగదీత.. ఇంకా ఎన్నాళ్లో?
తాము ఏ సుద్దులు చెప్పిన... ఏ నీతులు చెప్పిన అవి ఎదుటి వారికే కాని తమకు కాదని ఈనాడు మీడియా గట్టిగా విశ్వసిస్తోంది. అందుకే ఈనాడు వారు తమకు ఇష్టం లేని వారిపై, లేదా తమ రాజకీయ ,వ్యాపార ప్రయోజనాలకు అడ్డం అవుతారని అనుకున్న వారిపై నానా బురద వేస్తుంటారు .పచ్చి అబద్దాలు రాయడానికి కూడా వెనుకాడడం లేదు .తెలుగుదేశం పార్టీకి , సీఎం చంద్రబాబుకు ,తమకు కొమ్ము కాసేవారికి మాత్రం రక్షణగా నిలబడుతుంది.గత ఐదేళ్లుగా వైఎస్ జగన్ పాలనపై ఎంత విషం చిమ్మిందో చూశాం. అప్పుడే కాదు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయినా, ఇప్పటికి వారిపైనే చెడరాస్తోంది. పాపాల పుట్టలు అని... అవి అని, ఇవి అని ఇష్టరీతిలో హెడ్గింగ్లు పెడుతుంది .అదే తమకు సంబందించిన అక్రమాల గురించి మాత్రం నోరు విప్పితే ఒట్టు.మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సంబందించి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం, అందులో రామోజి సంస్థ అక్రమాలకు పాల్పడిందని , అర్హత లేకపోయినా డిపాజిట్ లు వసూలు చేసిందని ...శిక్షార్హ నేరమని స్పష్టంగా చెప్పినా కనీసం స్పందించ లేకపోయింది.వేలకోట్లకు సంబందించిన దందా అనండి ...స్కామ్ అనండి.. దానిపై నేరుగా వివరణ ఇచ్చే పరిస్థితి కూడా మార్గదర్శి ఫైనాన్శయర్స్ కాని...ఈనాడు మీడియాకు కాని ఉన్నట్లు లేదు.మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుదలతో సాగించిన పోరాటంతో ఈ మాత్రం అయినా కదలిక వచ్చింది .లేకుంటే ఈ దేశంలో మీడియాను అడ్డంపెట్టుకుని ... ఎన్ని అరాచకాలకైనా పాల్పడవచ్చని, తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసి...తద్వారా ఎన్ని కైన ప్రభుత్వాల ద్వారా తమ అర్ధిక ప్రయోజనాలకు కాపాడుకోవచ్చని ఏవరైన భావించే పరిస్థితి ఏర్పడింది .తాజాగా ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించినప్పుడు జరిగిన పరిణామం చూస్తే మార్గదర్శి అనండి...దివంగత రామోజి రావు అనండి లేదా ప్రస్తుత యాజమాన్యం అనండి.. వారికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఎంత పట్టు ఉన్నది అర్ధం అవుతుంది .ఏపిలోని చంద్రబాబు ప్రభుత్వం...తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసులో జవాబు ఇవ్వడానికే సిద్దం పడకపోవడం విశేషం. చంద్రబాబు అంటే ఏటూ టిడిపి కనుక అయన తోటి ఈనాడుకు ఉన్న సంబంధాల రీత్య అర్ధం చేసుకోవచ్చు. రామోజీ కాంగ్రెస్‌కు అనుకూలం కాదని తెలిసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎలాంటి సమాదానం ఇవ్వకపోవడం గమనించదగ్గ అంశం.బహుశా గురుశిష్యులు ఇద్దరు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవ్వడం మార్గదర్శి సంస్థకు కలిసి వస్తోందని అనుకోవాలి. ఈ రెండు రాష్ట్రాల న్యాయవాదులు మార్గదర్శి కేసు విచారణకు హజరు అయినా పూర్తిగా మాౌనం పాటించారట. దానిని మార్గదర్శి న్యాయవాది లుద్రా అనుకూలంగా మలచుకుని కేసును అలస్యం చేసేందుకు ప్రయత్నాలు ఆరంబించారని మీడియా కధనం. మొత్తం విషయం పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది .రెండు వేల ఆరువందల కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారన్నది అభియోగం. అప్పటి ఎంపీ ఉండవెల్లి చేసిన ఫిర్యాదు వ్యవహరంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుని చివరకు ఈ దశకు చేరింది .మద్యలో ఏదో కారణం చూపి రామోజి ఈ కేసును ఉమ్మడి ఏపి హైకోర్టు విభజనకు ముందు రోజు కోట్టివేయించుకోగలిగారు .ఆ తర్వాత ఎప్పటికో ఈ విషయం తెలిసి ఉండవల్లి సుప్రీం కోర్టుకు వెళ్లి తన పోరాటం కోనసాగించారు . అసలు ఏప్పడో చర్య తీసుకోవాల్సిన ఆర్బిఐ ఇనాళ్లు మౌనంగా ఉండడం కూడా అశ్చర్యం కలిగిస్తోంది .తుదకు కోర్టు ఆదేశాలతో ఒక నివేదికను తయారు చేసి సమర్పించింది.అందులో మార్గదర్శి అక్రమంగానే డిపాజిట్లు వసూలు చేసిందని తేల్చింది .ఆర్బీఐ చట్టం లో సెక్షన్ 45 ఎస్ ను మార్గదర్శి ఉల్లంఘించిందని బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని తెలిపింది .ఈ కేసులో నేరాభియోగం రుజువు అయితే జైలు శిక్షతో పాటు డిపాజిట్ లుగా వసూలు చేసినదానికి రెండింతులు పెనాల్టి చెల్లించాల్సి ఉంటుంది .దీనితో మార్గదర్శికి, ఈనాడు వారికి మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది .ఒక్క సాక్షి తప్ప మిగిలిన మీడియా ఇంత పెద్ద వార్తను ప్రముఖంగా ఇవ్వకపోవడం కూడా వారి పలుకుబడిని తెలియచేస్తుంది .రామోజి రావు 2008 లో సమర్పించిన అఫడివిట్ ప్రకారం 2610 కోట్లు సేకరించారు .అందులో 1864 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపారు .మరి మిగిలిన సుమారు 750 కోట్ల డిపాజిట్లు ఏం అయ్యాయి?అవి ఎవరివి అన్న అంశాలను మాత్రం గుట్టుగా ఉంచారు .అంతేకాదు 1864 కోట్లు ఎవరేవరికి చెల్లించారో జాబితా ఇవ్వడానికి రామోజి కుటుంబం సమ్మతించడం లేదని సమాచారం మీడియాలో వచ్చింది.ఆ వివరాలు వెల్లడిస్తే కొందరు పెద్దలు ...అందులో ముఖ్యంగా టిడిపి వారికి చెందిన నల్లధనం బట్టబయలు అవుతుందని ..బినామి పేరుతో తాము పెట్టిన దందా వెల్లడి అవుతుందని రామోజీ కుటుంబం అందోళన చెందుతున్నట్టు సాక్షి పత్రిక నేరుగా అరోపించింది .ఈనాడు వారు కాని ...మార్గదర్శి వారు కాని ,రామోజి రావు కుమారుడు కిరణ్ , కోడలు శైలజ కాని ఏ మాత్రం విలువలు పాటించేవారైనా, ఖచ్చితంగా వీటికి సమాదానం చెప్పగలగాలి. అలా చెప్పడం లేదంటే దాని అర్దం వారు తప్పు చెసినట్టు అంగీకరించడమే .ఊరందరికి నీతులు చెప్పే ఈనాడు మీడియా ఈ విషయంలో ఉన్న గుట్టుముట్లను ఎందుకు విప్పడం లేదు అంటే ...దీని ఱర్ధం ఈ విషయాలు వెలుగులోకి వస్తే తమ పాపాల పుట్ట బయటపడుతుందా అన్న భయమా అనే సందేహం వస్తే తప్పు ఏముంది.దేశంలో ఉన్నవారందరని పారదర్శకంగా ఉండాలని నీతులు రాస్తూ ...కథలు చెబుతూ ఉండే ఈనాడు, మార్గదర్శిల యాజమాన్యం ఇప్పటికైనా ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేసినట్టుగా డిపాజిట్ లు ఏవరేవరికి చెల్లించారో వెల్లడించాలి.అలాగే ఎవరికి చెల్లించని 750 కోట్ల డిపాజిట్ ల రహస్యం ఏంటో తెలపాలి.అదంతా నల్లధనం కాదని ,తాము పద్దతిగా వ్యాపారం చేస్తున్నామని చెప్పగలగాలి.అలాగే చంద్రబాబు,రేవంత్ ప్రభుత్వాలు కూడా ఈ డిపాజిట్ లకు సంబందించి వాస్తవాలను తమ అఫడవిట్ ల ద్వారా తెలియచేయాలి.లేకుంటే ఈ రెండు ప్రభుత్వాలకు ఈనాడు మీడియాకు మద్య క్విడ్ ప్రో కో సాగుంతుందని జనం అభిప్రాయపడతారు . అరుణకుమార్ చేసిన విజ్ఞప్తికి రెండు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?అన్నది డౌటే.ఒకవేళ స్పందించినా, అది మార్గదర్శికి, ఈనాడు వారికి అనుకూలంగానే ఉండవచ్చు. నిజానికి ఉండవల్లి తన వాదనలో చెప్పినట్టు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యకు దిగితే మొత్తం లోగుట్టులు అన్ని బహిర్గతం అవుతాయి. కాని ఇప్పుడు ఉన్న వాతావరణం గమనిస్తే అది అంత తేలిక కాకపోవచ్చు. పద్దేనిమిది ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహరంలో ఎంతకాలం వీలైతే , అంత కాలం ఈ కేసును సాగదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కేసుల వల్లే మన వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతుంది .ప్రజల్లో విశ్వాసం నెలకోనాలంటే కనీసం న్యాయవ్యవస్థ అయినా ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది .అది జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మార్గదర్శిపై ఇద్దరు సీఎంలు స్పందించాలి: ఉండవల్లి అరుణ్‌కుమార్
మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్‌కు చేరి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్లింది. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని మార్గదర్శి నిర్వాహకులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది. మార్గదర్శిపై పోరాడుతున్న వారిని కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాపై రూ.50 లక్షల పరువు నష్టం దావా వేశారు. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్‌లో ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే.. ఆ కేసు నుంచి బయటడతాను. కేసు వేయడంతో చివరి వరకు పోరాటం చేయాల్సి వస్తోంది. – ఉండవల్లి అరుణ్‌కుమార్ సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టులో వాస్తవాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వాల నుంచి కనీస స్పందన కరువైందని ఆరోపించారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతోనైనా వాళ్లలో చలనం కలుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. రాజమహేంద్రవరంలోని ఓ బుక్ హౌస్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో ఈ కేసుకు బలం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు దివంగత రామోజీరావు, కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎలా స్పందిస్తారో తెలియడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే గౌరవం దక్కుతుందన్నారు. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప.. అన్యాయం జరగదని చెప్పారు. రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నా, సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలని కోరారు. మార్గదర్శి డిపాజిట్లకు సంబంధించిన వడ్డీల గురించి తనకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. డిపాజిట్ల సొమ్ము అందరికీ అందిందా? లేదా? అన్న విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రకటన ఇవ్వాలని హైకోర్టు సూచించిందన్నారు. డిపాజిట్‌దారుల వివరాలను పెన్ డ్రైవ్‌లో నింపి ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించానని తెలిపారు. తాము ఎవరికి డబ్బు చెల్లించామన్న వివరాలను మార్గదర్శి 70 వేల పేజీల్లో నింపి సుప్రీంకోర్టుకు అందించిందని చెప్పారు. నాడు చెప్పిందే.. నేడు నిజమైంది 2006 నవంబర్ 6వ తేదీన అప్పటి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరానికి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణ విషయంలో తాను ఏం ఫిర్యాదు చేశానో అదే విషయాన్ని ఆర్బీఐ సైతం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొందని ఉండవల్లి చెప్పారు. మార్గదర్శి అవిభాజ్య హిందూ కుటుంబం పేరుతో డిపాజిట్ల వసూళ్లలో 45ఎస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు ఆర్బీఐ స్పష్టం చేసిందన్నారు. మార్గదర్శిపై తన పోరాటాన్ని కొందరు తప్పు పట్టారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పడం వల్లే పోరాటం చేస్తున్నట్లు చేసిన విమర్శల్లో నిజం లేదన్నారు. కేసు పోరాటంలో తనకు ఎలాంటి రహస్య ఎజెండా లేదని స్పష్టం చేశారు. చిట్ ఫండ్ చట్టాలకు తాము అతీతం అని మార్గదర్శి భావించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చట్టాలు పాటించడం లేదని దుయ్యబట్టారు. ఇటీవల కాకినాడలో జయలక్ష్మి చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేశారని ఉదహరించారు. రామోజీ నిబంధనలు పాటించక పోవడంతో మిగిలినవి సైతం అదే దారిలో వెళుతున్నాయన్నారు. విలీన మండలాలను కాపాడుకోవాలి రాష్ట్ర విభజన విషయంలో విలీన మండలాలు తెలంగాణ పరం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉండవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరçఫున గతంలో వైఎస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేశారో ఇప్పుడు కూడా అదే చేయాలని చంద్రబాబును కోరారు. 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉన్నట్టు విశాఖపట్నంకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నీతి ఆయోగ్‌కు చేసిన దరఖాస్తు ద్వారా వెల్లడైందని, ఈ విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు. ఓట్ల శాతంపై కదలికేదీ? మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏపీలో పోలైన ఓట్ల కన్నా 12.54 శాతం ఓట్లు, ఒడిశాలో 12.4 శాతం ఓట్లు ఎక్కువగా లెక్కించినట్టు ప్రకటించిందని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయి.. ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డి్రస్టాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలని కోరారు. -
చంద్రబాబూ.. జగన్‌లా మీరు చేయలేరా? ఉండవల్లి హాట్ కామెంట్స్
తూర్పుగోదావరి, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని, కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో చూడాలని మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇంప్లీడ్ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. బుధవారం ఉదయం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. మార్గదర్శి తరపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపిస్తూ.. రెండు వారాల సమయం కోరారు. తాము ఎవరెవరికి డబ్బు చెల్లించామో 70 వేల పేజీల్లో సుప్రీంకోర్టుకు వివరాల్ని మార్గదర్శి సబ్మిట్ చేసింది. కట్టిన డబ్బుల ఇచ్చారే తప్ప వడ్డీ ఇవ్వలేదని పలువురు మార్గదర్శి ఫైనాన్స్ ఖాతాదారులు నన్ను అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా డబ్బు అందేందో లేదో పరిశీలించమని ఒక జ్యుడీషియరీ అడ్వైజర్ ను హైకోర్టులో నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..ఇదీ చదవండి: టీడీపీకి ఇది నల్ల ఖజానా.. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధం. 2006లో అప్పటి ఫైనాన్స్ శాఖా మంత్రి చిదంబరానికి నేను చెప్పిందే.. ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది. ఆర్బీఐ అఫిడవిట్‌తో నేను చెప్పిందే నిజమైంది. మార్గదర్శిపై నా పోరాటాన్ని మరోలా వక్రీకరించారు. ఇదేదో వైఎస్సార్ చెప్పటం వల్లే నేను చేశానని అందరూ అనుకుంటున్నారు... అది నిజం కాదు. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఏ చిట్‌ఫండ్ కంపెనీ కూడా చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరించడం లేదు. ఇటీవలె కాకినాడలో జయలక్క్క్ష్మి చిట్‌ఫండ్ కంపెనీ ఎత్తేశారు. మార్గదర్శి.. చిట్‌ఫండ్ యాక్ట్‌ను బ్యాడ్ లాగా పేర్కొంది. రామోజీరావు అనుసరించకపోవడం వల్లే తాము అదే ఫాలో అవుతున్నామని చెబుతున్నారు. ఈ విషయంలోనే నాపై మార్గదర్శి కంపెనీ కూడా కేసు కూడా వేసింది. రామోజీరావు కేసులో ప్రెస్‌మీట్ చెప్పిన అందరిని జైల్లో వేస్తున్నారు. మిగిలిన వారెవరు ప్రశ్నించకుండా ఉండేందుకు మార్గదర్శి నాపై పరువు నష్టం దావా కేసు వేశారు.సంబంధిత వార్త: మార్గదర్శి దందాకు క్విడ్ ప్రోకో కుట్ర.. మార్గదర్శి చిట్ ఫండ్స్ నాపై 50 లక్షలు పరువు నష్టం దావా వేశారు.. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్ లో ఉంది. మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసు నుంచి బయటపడగలను. మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్ లోకి వెళ్లి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్ళింది. ఈనాడు పేపర్ ను అడ్డం పెట్టుకుని రామోజీరావు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు. హెచ్ఎఫ్ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది. .. సెప్టెంబర్ 11 కి వాయిదా ఉంది. మార్గదర్శి కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఇటు రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ కావడంతో కేసుకు కాస్త బలం వచ్చింది. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు రామోజీరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నారు. కాబట్టి ఎలా స్పందిస్తారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే గౌరవం నిలబడుతుంది. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం జరగదు. రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలి. వెంటనే రెండు ప్రభుత్వాలు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి’’ అని ఉండవల్లి కోరారు.ఏపీ ఎన్నికల ఫలితాలపైనా.. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఐదు మండలాలు తిరిగి వెనక్కి ఇచ్చేయమని తెలంగాణ కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైయస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేశారో.. మీరు కూడా అదే చేయమని చంద్రబాబును కోరుతున్నాను. స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రకటించిన 11 రాష్ట్రాల్లో తెలంగాణ ను ఎందుకు చేర్చారో తెలియటం లేదు. మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 12.5% తేడా ఉందన్న ప్రకటించారు.. దీనిపై ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయిన ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో .. స్పష్టం తెలియాలి అని ఉండవల్లి డిమాండ్ చేశారు. -
హైకోర్టు కీలక నిర్ణయం.. మార్గదర్శికి బిగ్ షాక్
-
ఇదీ క్విడ్ ప్రోకో కుట్ర.. ‘మార్గదర్శి’ దందాకు బాబు రక్షణ
సాక్షి, అమరావతి: అసలు సిసలైన క్విడ్‌ప్రోకో అంటే ఇదే..! చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు, కుంభకోణాలకు ఈనాడు కొమ్ము కాస్తోంది. అందుకు ప్రతిగా ఆ పత్రిక యాజమాన్యం అక్రమ ఆర్థిక సామ్రాజ్యం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అవకతవకలకు చంద్రబాబు సర్కారు రక్షణగా నిలుస్తోంది!! అందుకే ‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్లపై న్యాయస్థానంలో తమ వైఖరి తెలిపేందుకు ససేమిరా అంటోంది. కుట్రపూరితంగా మౌనం పాటిస్తూ సామాన్య డిపాజిట్‌దారుల ప్రయోజనాలను గాలికొదిలేస్తోంది. మార్గదర్శి యాజమాన్యంతో కుమ్మక్కు కుట్రలో ఇటు చంద్రబాబు సర్కారు అటు తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడబలుక్కున్నట్లు ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయి. బాబు కుట్రపూరిత మౌనం.. ‘మార్గదర్శి’కి వత్తాసుమార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందాకు చంద్రబాబు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. ఆ కేసు విచారణను తీవ్ర జాప్యం చేసేలా వ్యవహరిస్తుండటమే అందుకు నిదర్శనం. ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట ఈనాడు రామోజీరావు కుటుంబం యథేచ్ఛగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా ఆధారాలతో సహా బట్టబయలైన విషయం తెలిసిందే. మార్గదర్శి పేరుతో ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది.ఈ నేపథ్యంలో ఆ అక్రమ డిపాజిట్లపై విచారణ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అంతేకాదు.. ఏపీ, తెలంగాణలో మార్గదర్శి డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించాలని స్పష్టం చేసింది. అందుకోసం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలంగాణ హైకోర్టుకు వెల్లడించాలని పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కారు దీనిపై స్పందించలేదు. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణకు హాజరైనా పూర్తిగా మౌన ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం గమనార్హం.తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కూడా మౌనమే వహించారు. ఇదే అదునుగా ‘మార్గదర్శి’ తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఈ కేసు విచారణను సాగదీసేందుకు ఎత్తుగడ వేశారు. ‘మార్గదర్శి’ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనన్న ఆర్బీఐ అఫిడవిట్‌పై తమ వైఖరిని వెల్లడించేందుకు సమయం కావాలని కోరారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేసింది. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలియచేస్తూ రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టులు క్రియాశీలం.. ప్రభుత్వాలు ఉదాశీనం‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై న్యాయ వ్యవస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. అక్రమ డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిపాజిటర్ల పేర్లు, డిపాజిట్ల వివరాలను జిల్లాల వారీగా ప్రకటించాలని.. ఎంతమందికి డిపాజిట్లు వెనక్కి ఇచ్చారో పరిశీలించాలని కూడా ఆదేశించడం గమనార్హం. ఆరు నెలల్లో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టుకు నిర్దేశించింది. ఈ క్రమంలో ‘సుప్రీం’ ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సత్వరం చేపట్టింది. కాగా ‘మార్గదర్శి’ డిపాజిట్లు చట్టవిరుద్ధమేనని ఆర్బీఐ తెలంగాణ హైకోర్టుకు లిఖితపూర్వకంగా వెల్లడించింది.ఈ కేసులో న్యాయస్థానాలు, ఆర్బీఐ చురుగ్గా వ్యవహరిస్తుండగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి ఉదాశీన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ‘మార్గదర్శి’ డిపాజిటర్ల వివరాలను జిల్లాలవారీగా ప్రకటిస్తామని, వారికి డిపాజిట్ల మొత్తం చెల్లించారో లేదో పరిశీలిస్తామని, ఎంతమందికి డిపాజిట్లు తిరిగి చెల్లించారు? ఎంతమందికి చెల్లించ లేదు? అనే అంశాలపై వాస్తవాలు తెలుసుకుని తెలంగాణ హైకోర్టుకు వెల్లడిస్తామని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పాల్సి ఉంది.క్షేత్రస్థాయిలో ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది ఈ రెండు ప్రభుత్వాలే. అయితే ఆ మాట చెప్పేందుకు ఇటు చంద్రబాబు ప్రభుత్వానికిగానీ అటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గానీ మనస్కరించడం లేదు. మార్గదర్శి యాజమాన్యానికి పరోక్షంగా సహకరించాలనే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.నాడు కొట్టివేతకు బాబు ప్రభుత్వ సహకారంకేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం1995 నుంచి 2004 వరకు చంద్రబాబు సర్కారు అండతోనే ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణించారు) ఉమ్మడి ఏపీలో యథేచ్చగా అక్రమ డిపాజిట్ల దందా సాగించారు. దీనిపై 2006లో నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో రామోజీ వసూలు చేసినవి అక్రమ డిపాజిట్లేనని ఆర్బీఐ స్పష్టం చేయడంతో ఆయన అనివార్యంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసివేశారు. సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని డిపాజిట్‌దారులకు చెల్లించేసినట్లు చెప్పారు.అయితే సేకరించిన డిపాజిట్లు, డిపాజిట్‌దారుల వివరాలు, వారికి తిరిగి చెల్లించిన మొత్తం వివరాలను వెల్లడించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్‌కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఈ కేసును పట్టించుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం రామోజీ అక్రమ డిపాజిట్ల దందాకు అండగా నిలిచింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును కొట్టివేయడం గమనార్హం.అయితే డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పును ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆ కేసులో ఇంప్లీడ్ అయింది. తద్వారా ఆ కేసు నిలిచేలా చేసింది. మళ్లీ అదే కుతంత్రం..రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల దందాకు వత్తాసు పలుకుతోంది. ‘మార్గదర్శి’వి అక్రమ డిపాజిట్లేనని స్వయంగా ఆర్బీఐ నిగ్గు తేల్చడంతో రామోజీ కుటుంబం అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించడంతో రామోజీ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. దీంతో మీ అక్రమాలకు అండగా నేనున్నానంటూ చంద్రబాబు మరోసారి కుట్రలకు తెరతీశారు. అక్రమ డిపాజిట్లపై ప్రభుత్వ వైఖరిని చెప్పకుండా వీలైనంత జాప్యం చేసేలా కుట్ర పన్నుతున్నారు.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తే ‘గోడ మీద పిల్లి’ వైఖరి అనుసరించాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక జిల్లాల వారీగా డిపాజిటర్ల వివరాల వెల్లడి, వారికి డిపాజిట్ మొత్తాన్ని చెల్లించారో లేదో పరిశీలన ప్రక్రియ చేపట్టే ఉద్దేశమే లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా పరిగణించాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్గదర్శి డిపాజిటర్లకు న్యాయం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని స్పష్టం చేస్తున్నారు. -
రామోజీని జైల్లో పెట్టాలన్నది నా కోరిక కాదు: ఉండవల్లి
సాక్షి, రాజమండ్రి: మార్గదర్శి కేసు వివరాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఉండవల్లి తెలిపారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. కాగా, ఉండల్లి అరుణ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. తెలంగాణ హైకోర్టుకు విచారణ బాధ్యతలు అప్పగించారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది. మార్గదర్శిలో జరిగింది ఆర్థికనేరం. రామోజీరావు ఎవరైతే నాకేంటి. ఒక ఇష్యూలో తప్పు జరిగింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే మనం కళ్లు మూసుకుపోవాలా?. అందుకే ఈ విషయాన్ని బయటకు తీశాను. నేను అడిగింది 45-ఎస్ ఉల్లంఘన గురించి. అది తేల్చండి చాలు. రామోజీరావును జైలులో పెట్టాలని లేక శిక్షించాలన్నది నా కోరిక కాదు. ఈ వ్యవహారంలో కొన్ని నిజాలు బయటకు రావాలన్నదే నాకు కావాల్సింది. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ లూథ్రాకు కూడా చెప్పాను. ఈనాడు రాసిన రాతలపైనే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను. వక్రీకరించి వార్తలు రాయడం ఈనాడుకు అలవాటుగా మారింది. భావవ్యక్తీకరణను ఏ రకంగా చంపేస్తారో.. ఈనాడు అలాంటి రాతలను ఇన్ని సంవత్సరాల్లో అనేకంగా రాసింది. నా మాటలను వక్రీకరించి చూపారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎంతమంది ఖాతాదారులకు డబ్బులు వెనక్కిచ్చారన్న విషయాన్ని పరిశీలించడానికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని జ్యుడీషియల్ అధికారిగా ఏర్పాటు చేశారు. 80 నిమిషాల పాటు ఇండియాలో ఉన్న టాప్ అడ్వకేట్స్ ముగ్గురు రామోజీరావు తరపున దీనిపై వాదనలు వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగిందంటే కేవలం జడ్జిలు వల్ల జరిగిందని భావించాలి. ఇప్పుడు 45-ఎస్ ఓపెన్.. దానిపైన నిర్ణయం తీసుకుంటామన్నారు.ఎక్యుర్డ్ ఇంట్రెస్ట్‌తో సహా ఖాతాదారులకు డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించామని మార్గదర్శి కోర్టు వివరించింది. ఖాతాదారులు అందరికీ కలిపి 55.39 కోట్లు వడ్డీ కింద అందజేశామని మార్గదర్శి ఫైనాన్షియర్స్ చెప్పారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపితే 900 కోట్లు వడ్డీ పే చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకును పార్టీలను చేసి తెలంగాణ హైకోర్టుకు ఈ వ్యవహారంలో అరుణ్ కుమార్ అసిస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందజేసిన మెచూరిటీ అమౌంట్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఖాతాదారుల దగ్గర ఉన్న ఆధారాలు, పూర్తి అడ్రస్‌తో జీమెయిల్‌కి పంపండి. thedepositers@gmail.com అనే జిమెయిల్ ప్రారంభించాను. జరిగిన వ్యవహారంపై పూర్తి విచారణ తెలంగాణ హైకోర్టులో జరిపించమన్నారు. దీనిపై పూర్తి విచారణ జరుగనుంది. ఈ వ్యవహారం ఆరు నెలలలో తేల్చమంది. ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ వస్తుందని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మార్గదర్శి చిట్ ఫండ్ కుంభకోణంపై రామోజీరావుపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
-
బందిపోటు దొంగల్లా మార్గదర్శి యాజమాన్యం
-
పేద, మధ్య తరగతి ప్రజలను మార్గదర్శి మోసం చేసింది
-
రామోజీకి వణుకు.. అసలు కథ ముందుంది?
వృద్ధాప్యంలో ఉన్న ఈనాడు మీడియా యజమాని రామోజీరావుకు పెద్ద సవాలే ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవని ఆయన భయపడుతున్నారనిపిస్తోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఇష్టారాజ్యంగా నడిపారు. వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని మీడియా రాజ్యాన్ని సృష్టించారు. ఆ మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారంలో తనకు ఎదురులేదన్నట్లుగా ప్రవర్తించారు. కానీ, సీఎం జగన్ రూపంలో తనకు ఇంత ప్రతిఘటన ఎదురవుతుందని ఆయన ఊహించలేకపోయారు. తన మార్గదర్శి సంస్థలో జరిగిన పలు అక్రమాలు, అవినీతిని, నల్లధనం తదితర విషయాలన్నిటినీ ఏపీ సీఐడీ బహిర్గతం చేసింది. దాంతో సీఎం జగన్‌పై కక్ష కట్టిన రామోజీ ఇప్పుడు తన మీడియాను పూర్తి స్థాయిలో టీడీపీ కరపత్రంగా, బాకాగా మార్చేశారు. ఈసారి ముఖ్యమంత్రి జగన్ పోటీ పడుతున్నది చంద్రబాబు కాదని, రామోజీరావు అని అంతా భావించే దశకు వెళ్లారు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుందని, ఎవరో ఒకరు తగులుతారని అంటారు. అలాగే రామోజీ సంస్థలలోని ఆర్దిక అరాచకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనిపెట్టింది. తత్ఫలితంగా ఆయన ప్రతిష్ట మసకబాసింది. దాంతో ఆయనకు సీఎం జగన్‌పై ఎక్కడ లేని ద్వేషం ఏర్పడింది. నిజానికి సీఎం జగన్‌పై రామోజీరావుకు ఉన్న పగ ఈనాటిది కాదు. ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ నుంచే రామోజీ బొడ్డుకు సున్నం రాసుకున్నట్లు వ్యవహరించేవారు. దానికి కారణం అంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనను రాజగురువుగా భావించి, నిత్యం సంప్రదింపులు చేస్తూ ఆయనను సంతృప్తిపరుస్తుండేవారు. 1989-1994 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలతో మరీ ఈ స్థాయిలో గొడవపడేవారు కారు. వారు కూడా చూసి చూడనట్లు పోతుండేవారు. రామోజీ మీడియాకు వారు కొంత భయపడేవారు. 1994లో ఎన్.టి.రామారావు అంత మెజార్టీతో అధికారంలోకి వస్తారని రామోజీ ఊహించలేదు. అయినా ఎన్టీఆర్ భారీ ఆధిక్యతతో అదికారంలోకి రావడంతో కొద్దికాలం సర్దిపెట్టుకున్నారు. కానీ, ఆ తర్వాత పరిణామాలలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతిని సాకుగా చూపుతూ ఆయనను దారుణంగా చిత్రీకరిస్తూ వ్యంగ్య కార్టూన్లు వేయించేవారు. చంద్రబాబుకు కొమ్ముకాసి ఎన్టీఆర్‌ను దించడంలో రామోజీ తనదైన పాత్రను పోషించారు. అప్పటి నుంచి తానే షాడో ముఖ్యమంత్రి అన్నట్లు సంతోషపడుతుండేవారు. ఆయనకు ప్రభుత్వపరంగా ఏది కావాలన్నా ఎదురులేని పరిస్థితి సృష్టించుకున్నారు. ఆ పరిస్థితిలో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీని ఓడించి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. ఎందువల్లో వైఎస్ పట్ల మొదటి నుంచి అంత సానుకూలంగా ఉండేవారు కాదు. అయినా వైఎస్సార్ పెద్దగా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోయేవారు. కాకపోతే ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేసేవారు. వాటికి పోటీగా కాంగ్రెస్‌కు కూడా ఒక పత్రిక ఉండాలని, ఒక టీవీ ఉండాలని తలపోశారు. అందుకు అనుగుణంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి మీడియాను ఏర్పాటు చేశారు. అది రామోజీకి పుండుమీద కారం చల్లినట్లయింది. తన మీడియాకే పోటీకి వస్తారా అన్న అహంభావంతో వైఎస్ ప్రభుత్వంపై చెలరేగడం ఆరంభించారు. చివరికి సీఎంగా ఉన్న వైఎస్సార్‌పై ఒక సంపాదకీయం రాస్తూ ‘ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే’ అంటూ హెడింగ్ పెట్టి వైఎస్‌ను ఘోరంగా అవమానించారు. అదే తరుణంలో రామోజీ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌తో జరుగుతున్న అక్రమ డిపాజిట్ల సేకరణపై అప్పట్లో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణకుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో రివర్స్ కథ మొదలైంది. రామోజీ అంతవరకు తాను ఏమీ తప్పు చేయడం లేదన్నట్లుగా ప్రజల దృష్టిలో పడుతూ, మరోవైపు అక్రమంగా డిపాజట్ల సేకరణకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయడంలో ఉండవల్లి సఫలం అయ్యారు. అయితే, తీసుకున్న డిపాజిట్లను రామోజీ సకాలంగా చెల్లిస్తున్నారుగా అన్న ప్రచారం జరిగేది. కానీ, అసలు డిపాజిట్లు సేకరించడమే అక్రమమని, నేరమని ఆర్బీఐ ప్రకటించడంతో రామోజీ తన టీవీ చానళ్లు కొన్నిటిని విక్రయించి సుమారు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను తిరిగి చెల్లించవలసి వచ్చింది. అది ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించింది. 2009లో రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ కేసుకు బ్రేక్ పడింది. ఆయన తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలు రామోజీతో రాజీపడిపోయారు. అంతలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రామోజీ స్నేహం చేస్తూ, కాదు.. కాదు... భజన చేస్తూ.. తన ఆస్తులవైపు, తన సంస్థల లావాదేవీల వైపు రాకుండా చూసుకోగలిగారు. అదే సమయంలో విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. చంద్రబాబును భుజాన వేసుకుని వైఎస్ కుమారుడు జగన్మోహన్రెడ్డి యువకుడు అన్న ఆలోచన కూడా లేకుండా దాడి ఆరంభించారు. సోనియాగాంధీ, చంద్రబాబులకు రామోజీ తోడై సీబీఐ పెట్టిన అక్రమ కేసులపై తన మీడియా ద్వారా విపరీత వ్యతిరేక ప్రచారం చేసేవారు. అయినా.. జగన్మోహన్రెడ్డి మాత్రం వీరిని పట్టించుకునేవారుకారు. 2014 ఎన్నికలలో రామోజీ మీడియా చేసిన అబద్దపు ప్రచారం కొంత పనిచేసింది. కారణం ఏమైనా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాలేకపోయారు. అయినా ఆయన పట్టువదలకుండా రాజకీయాలు నడిపారు. అది ఈనాడుకు నచ్చలేదు. జగన్మోహన్రెడ్డిని దెబ్బతీశాం కదా అనుకుంటే మళ్లీ కెరటంలా లేస్తున్నారని గమనించారు. 2019 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్రెడ్డిపై దారుణమైన కథనాలు అల్లారు. కానీ, జనం నమ్మలేదు. రామోజీ రాతలను ఖాతరు చేయకుండా ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్‌కు పట్టం కట్టారు. అప్పటి నుంచి మళ్లీ రామోజీలో అసూయ పెరిగింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనపై దాడి ఆరంభించారు. కొంతకాలం ఓపికగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేచి చూసింది. అయినా రామోజీ తన వైఖరిని మార్చుకోకుండా, ఈనాడు మీడియాను టీడీపీ ప్రచార బాకాగా వాడడం ఆరంభించారు. అంతవరకు అయితే ఫర్వాలేదు. సీఎం జగన్‌పై ఉన్నవి, లేనివి కలిపి పచ్చి అబద్దాలు రాయడం ఆరంభించారు. ఈ దశలో మార్గదర్శి చిట్స్‌లో జరిగిన అక్రమాలు, అక్రమ డిపాజిట్ల వసూలు కొనసాగించడం సీఐడీ దృష్టికి వెళ్లి, వారు రంగంలో దిగారు. దాంతో ఒక్కసారిగా రామోజీ బిత్తరపోయారు. తాను ఎవరికి దొరకనని, ఎవరూ తన జోలికి రావడానికి సాహసం చేయరని అనుకునే రామోజీరావుకు ముఖ్యమంత్రి జగన్ రూపంలో సవాల్ ఎదురైంది. మార్గదర్శి చిట్స్‌లో సభ్యుల చేరిక మొదలు, చిట్టీలు పాడుకున్నవారికి సకాలంలో చెల్లించకపోవడం, డిపాజిట్ల అక్రమ సేకరణ, నల్లధనం చలామణి మొదలైనవాటిని ఏపీ సీఐడీ కనిపెట్టడంతో రామోజీకి సినిమా మొదలైంది. చివరికి ఆయన సీఐడీ అధికారుల విచారణను ఎదుర్కున్నారు. అప్పటికీ న్యాయ వ్యవస్థలో తనకు ఉన్న పట్టుతో ఈ కేసులన్నీ వేగంగా సాగకుండా అడ్డుపడుతున్నారు. ఏపీ కేసులకు కూడా తెలంగాణ హైకోర్టులో స్టేలు తెచ్చుకుని తప్పించుకోచూస్తున్నారు. మార్గదర్శి చిట్స్‌లో సుమారు 800కోట్ల నల్లధనం లావాదేవీలు జరిగాయని సీఐడీ గుర్తించింది. చిట్స్ నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించడంతో ఏపీలో సంస్థ బ్రాంచ్‌లలో వ్యాపారం స్తంభించడం ఆరంభమైంది. టర్నోవర్‌పై దాని ప్రభావం పడింది. తాజాగా సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం చిట్స్రూపేణా కాని, అక్రమ డిపాజిట్ల రశీదుల రూపేణా కాని సుమారు 4800 కోట్ల రూపాయల మేర బకాయిలు పడ్డారని అధికారులు అంచనా వేసినట్లు రావడం సంచలనాత్మకంగా మారింది. రామోజీ మరీ రెచ్చిపోయి, బరితెగించి వైఎస్ ప్రభుత్వంపై ఎందుకు ఇంత నీచంగా వార్తలు రాస్తున్నారు అని ఆలోచించేవారికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. తన వ్యాపార లావాదేవీల అరాచకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం బహిర్గతం చేసిందన్న కోపం ఒకవైపు, మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే, తన ఆట కట్టినట్లే అవుతుందన్న భయం మరోవైపు రామోజీ బృందాన్ని వేటాడుతున్నాయి. దాంతో ఈనాడు మీడియాను పణంగా పెట్టి ముఖ్యమంత్రి జగన్‌పై విపరీతమైన ధోరణిలో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అదికారంలోకి వస్తే ఈ కేసులేవీ ముందుకు సాగవు అన్న భావన. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబుకన్నా, రామోజీకే అతి పెద్ద సవాలుగా మారాయనిపిస్తుంది. అంతే తప్ప తనపై వచ్చిన కథనాలకు సమాధానం ఇవ్వడానికి, మార్గదర్శిలో జరిగిన అవకతవకలకు సంజాయిషీ ఇవ్వడానికి బదులు సీఎం జగన్ ప్రభుత్వంపై దాడి చేయడాన్ని ఆయన మార్గంగా ఎంచుకున్నారు. నిజానికి జర్నలిజంలో ఒక సూత్రం ఉంది. తన సొంత వ్యాపార ప్రయోజనాలకోసం మీడియాను అడ్డు పెట్టుకోరాదు. ఆ పరిస్థితిని మనం ఆశించలేకపోయినా, ఒక రాజకీయ పార్టీని అనైతికంగా భుజాన వేసుకుని రామోజీ తన మీడియాను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు రాస్తూ సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ సైతాన్ మాదిరి ప్రవర్తిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. అయినా ఈ విమర్శలన్నిటి కన్నా తన సంస్థపై వచ్చిన కేసులను కప్పిపుచ్చుకోవడానికి గాను ఆయన తన మీడియాను ఫణంగా పెట్టి మరీ దుష్ప్రచారం సాగిస్తున్నారని చెప్పాలి. అందుకే టీడీపీ గెలుపు చంద్రబాబుకన్నా, రామోజీకే ఎక్కువ అవసరంగా మారింది. అయినా ఆయన ఆశలు నెరవేరే సూచనలు కన్పించడం లేదు! -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్!
-
‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్!
సాక్షి, అమరావతి : అక్రమ పునాదులపై ఈనాడు రామోజీరావు నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యానికి చట్ట విరుద్ధంగా నిధులు అందించే కామథేనువు ‘మార్గదర్శి’ ఒట్టిపోయింది. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఆయన తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో ‘మార్గదర్శి’ పాపాల పుట్ట బద్దలైంది. కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టంచేయడంతో ఆ సంస్థలోని ఆర్థిక కార్యకలాపాలు దాదాపు 16 నెలలుగా స్తంభించిపోయాయి. దీంతో లక్షలాది మంది చందాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్ణీత కాలంలో చందాదారులకు చిట్టీపాటల ప్రైజ్‌మనీ చెల్లించలేక మార్గదర్శి ముఖం చాటేస్తోంది. ష్యూరిటీలపై కొర్రీలు వేస్తూ కాలహరణం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మార్గదర్శి’ ఇక ప్యాకప్ చెప్పడమే తరువాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి. రూ.4,880 కోట్లకు పైగా బకాయిలు కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును రామోజీరావు తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించారు. రాష్ట్ర స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. నిబంధనల ప్రకారం కొత్త చిట్టీలు ప్రారంభించాలంటే జిల్లా చిట్ రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి. అలాగే, కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని అమలుచేస్తున్నట్లుగా ఆధారాలు చూపాలని చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఆదేశించారు. అందుకు రామోజీరావు ససేమిరా అన్నారు. మరోవైపు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై సీఐడీ విభాగం 2022, నవంబరులో కేసు నమోదు చేసింది. సొమ్మును రామోజీరావు అక్రమంగా మళ్లిస్తున్నారని తెలియడంతో కొత్త చందాదారులు చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరడంలేదు. అప్పటి నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. దశాబ్దాలుగా మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఆ సంస్థలో మనీ టర్నోవర్ నిలిచిపోయింది. దాంతో ఇప్పటికే కొనసాగుతున్న చిట్టీ గ్రూపుల చిట్టీపాటల మొత్తం (ప్రైజ్‌మనీ) చెల్లించడం రామోజీకి తలకు మించిన భారంగా మారింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 16 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్‌మనీ సక్రమంగా చెల్లించలేకపోతోంది. ► ఇక రాష్ట్రంలో 37 బ్రాంచీల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు నెలనెలా రూ.260 కోట్ల టర్నోవర్ ఉంది. అందులో రూ.80 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉండగా.. రూ.180 కోట్లు వరకు చిట్టీ పాటల ప్రైజ్‌మనీగా చెల్లించాల్సి ఉంది. 2022 నవంబరు నుంచి ఆ ప్రైజ్‌మనీ మొత్తం సక్రమంగా చెల్లించకుండా బకాయిలు పేరుకుపోయాయి. ఆ ప్రకారం 16 నెలలకు రూ.2,880 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ► అలాగే, మార్గదర్శి చిట్‌ఫండ్స్ రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లు కాలపరిమితి ముగుస్తున్నా చెల్లించలేకపోతోంది. 4 శాతం నుంచి 5 శాతం వడ్డీ చొప్పున ఆరునెలల నుంచి రెండేళ్ల కాలపరిమితితో అక్రమంగా ఆ డిపాజిట్లను సేకరించింది. కాల పరిమితి ముగిసిన ఆ రశీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్ 16 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపితే మొత్తం మీద దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెరసి మార్గదర్శి చిట్‌ఫండ్స్ దాదాపు రూ.4,880 కోట్ల వరకు చందాదారులకు చెల్లించాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు అంచనా వేశారు. కొర్రీలతో చందాదారులకు ముప్పుతిప్పలు ఇదిలా ఉంటే.. చిట్టీ పాటల ప్రైజ్‌మనీ, కాలపరిమితి ముగిసిన డిపాజిట్ల సొమ్ము కోసం చందాదారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కానీ, తమ గల్లాపెట్టే ఖాళీ కావడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొర్రీలు వేస్తూ చందాదారులను మొండిచేయి చూపిస్తోంది. నిబంధనల ప్రకారం మూడు ష్యూరిటీలు చూపించినా.. వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ తిరస్కరిస్తోంది. పైగా.. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మళ్లీ రశీదు డిపాజిట్‌గానే తమ డిపాజిట్ చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం తాము ఆ మొత్తాన్ని చెల్లించలేమని చెబుతుండటం గమనార్హం. ఇలా అక్రమంగా రశీదు డిపాజిట్ల దందాను కొనసాగించాలని రామోజీరావు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి ఇంధనం ఆ అక్రమ డిపాజిట్లే కాబట్టి. కానీ, సీఐడీ అధికారులు నిశితంగా కేసు దర్యాప్తు చేస్తుండడంతో అక్రమ డిపాజిట్ల దందాకు చెక్ పడింది. చందాదారులకు సీఐడీ రక్షణ.. మరోవైపు.. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు కూడా సీఐడీ నివేదించింది. దాంతో రామోజీ ఆర్థిక అక్రమాల ఆట కట్టింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు మోసపోకుండా, వారి చిట్టీల మొత్తం, డిపాజిట్లకు న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించేందుకు సీఐడీ ఉద్యుక్తమైంది. తద్వారా అగ్రిగోల్డ్ తరహాలో రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులను ముంచేయకుండా సీఐడీ కార్యాచరణను చేపట్టింది. -
‘మార్గదర్శి’ మోసాలపై కలిసికట్టుగా పోరాటం: బాధితుల సంఘం
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్స్ మోసాలపై కలిసికట్టుగా పోరాడేందుకు బాధితులు సిద్ధమయ్యారు. మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం పేరుతో రిజిస్ట్రేషన్ అవ్వగా, విజయవాడ కేంద్రంగా ఈ సంఘం పనిచేయనుంది. అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బాధితుల సంఘం పేర్కొంది. మోసపోయిన వారు తమను సంప్రదించాలని, తమ సమస్యలను 9849055267 నెంబర్‌కు పంపించాలని బాధితుల సంఘం తెలిపింది. ఇదీ మార్గదర్శి బాగోతం హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది. ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా, జీవోలపై స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏ మాత్రం సహకరించలేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు. ఇదీ చదవండి: ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే -
ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే
ఈనాడు పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావు ఆర్థిక నేరస్తుడే అన్నది నిగ్గు తేలింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజగురువు రామోజీ ఆర్థిక ఉగ్రవాదేనన్నది స్పష్టమైంది. ‘మార్గదర్శి’ ముసుగులో భారీగా నల్లధనం దందా నిర్వహిస్తున్నారన్నదీ రూఢీ అయ్యింది. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు తొడుక్కున్న ‘పత్రికా స్వేచ్ఛ’ అనే ముసుగు తొలగిపోయింది. చట్టాలను ఉల్లంఘిస్తూ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డ రామోజీ నిజ రూపంలో అవినీతి దిగంబరుడుగా నిలబడ్డారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసిందని ఆర్బీఐ స్పష్టం చేయడంతో ఈ కేసులో తరువాత పరిణామాలు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. అక్రమ డిపాజిట్ల కేసు నిరూపితమైతే ఏకంగా రెట్టింపు జరిమానా అంటే రూ.5,200 కోట్ల జరిమానాతోపాటు కనీసం రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట ఏళ్ల తరబడి సాగించిన అక్రమ డిపాజిట్ల వసూళ్లు.. నల్లధనం దందాపై 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎట్టకేలకు ఫలించాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు అక్రమ డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు విస్పష్టంగా నివేదించింది. దాంతో రామోజీ అవినీతి ఆట కట్టిందని, ఇక శిక్ష పడటమే మిగిలిందని నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండేళ్ల నుంచి గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు సాగించిన ఆర్థిక అక్రమాల కథ కమామీషు మరోసారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2006లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశి్నంచే వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్టు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపిస్తూ ఉండేవి. కానీ ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించేదనే విషయం బయటి ప్రపంచానికి తెలీదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించింది. భారీగా అక్రమ డిపాజిట్లు సేకరణ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్ల సేకరణ పేరిట ప్రజలను మోసం చేయకుండా కట్టడి చేసేందుకు ఆర్బీఐ స్పష్టమైన విధి విధానాలను నిర్దేశించింది. ఆర్బీఐ చట్టంలోని 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీరావు తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ చట్టానికి తాను అతీతం అని భావించే రామోజీ ఈ నిబంధనను నిర్భీతిగా బేఖాతరు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట యథేచ్ఛగా డిపాజిట్లు వసూలు చేశారు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. కాగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తప్పు ఒప్పుకోక తప్పని రామోజీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. ఈ అక్రమాలపై సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. కాగా తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని బుకాయించేందుకు రామోజీ యత్నించారు. హెచ్యూఎఫ్గా తాము ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించవచ్చని అడ్డగోలుగా వాదించారు. కానీ సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దాంతో తాము తప్పు చేసినట్టు రామోజీరావు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్టు కూడా సమ్మతించారు. తమ తప్పును అంగీకరిస్తూ డిపాజిట్‌దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. వివరాలు చెప్పం అని వితండవాదం తాము అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్లను సంబంధిత డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని రామోజీరావు న్యాయస్థానానికి తెలిపారు. కాగా అక్రమ డిపాజిట్లు ఎవరెవరి నుంచి సేకరించారు.. ఎవరెవరికి తిరిగి చెల్లించారో ఆ వివరాలు వెల్లడించాలని సీఐడీ, ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరినప్పటికీ రామోజీరావు సమ్మతించ లేదు. ఆ వివరాలు తాము వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు. కాగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలని అదీకృత అధికారి కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు తన చివరి పనిదినాన కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. డిపాజిట్ దారుల వివరాలు వెల్లడించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం 2022లో ఇంప్లీడ్ అయ్యింది. డిపాజిట్‌దారుల వివరాలు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు గత ఏడాది పేర్కొంది. కానీ ఇంతవరకు రామోజీరావు తమ డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. నల్లధనం దందా వల్లే గప్‌చుప్ ► మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకే తమ సంస్థలో డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు ససేమిరా అంటున్నారు. ► 2006 నాటికే ఏకంగా 32,385 మంది నుంచి రూ.2,600 కోట్ల వరకు అక్రమంగా డిపాజిట్లు సేకరించారని వెల్లడైంది. కానీ వారి పేర్లు, వివరాలను మాత్రం వెల్లడించేందుకు రామోజీరావు ససేమిరా అంటుండటం గమనార్హం. ఎందుకంటే ఆ డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చారు. అందుకే సీఐడీతోపాటు న్యాయస్థానం కోరినప్పటికీ వారి వివరాలను వెల్లడించేందుకు సమ్మతించడం లేదు. ► కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు కూడా నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలు రూ.50 వేలకు మించి ఉన్నప్పటికీ వాటిని రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓ లుగా మార్చింది. ► మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్‌దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ► మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.2,610.38 కోట్లుగా రామోజీరావు 2006లో తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన రూ.800 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ రూ.800 కోట్లు రామోజీకి అత్యంత సన్నిహితుడైన పచ్చ బాబు, ఆయన గ్యాంగ్వే అని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో చెప్పడానికి రామోజీ ససేమిరా అంటున్నారు. -
మార్గదర్శి ఫ్రాడ్ కేసులో రామోజీకి శిక్ష తప్పదు : అడ్వకేట్ శివరామి రెడ్డి
-
రామోజీకి భారీ షాక్.. ఫలించిన ఉండవల్లి పోరాటం
-
అమ్మ రామోజీ.. అన్నీ తెలిసి ఇన్ని తప్పులా?
సాక్షి, ఢిల్లీ: సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆర్బీఐ తొలిసారి నోరు విప్పింది. హెచ్‌యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దని ఆర్.బి.ఐ తరపు న్యాయవాది తెలిపారు. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 9న ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన రామోజీరావు.. తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తీసుకువచ్చారు. ఇదీ చదవండి: రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది? -
మార్గదర్శి స్కాం కేసులో రామోజీ రావుకు సుప్రీం కోర్ట్ షాక్
-
అప్పులంటూ అబద్ధాల డప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రం అప్పులపై ‘ఈనాడు’ రామోజీ అట్టడుగు స్థాయికి దిగజారి తప్పుడు కథనాలు ప్రచురించారని, నిరాధారమైన గణాంకాలతో దు్రష్పచారానికి దిగారని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయటమే లక్ష్యంగా అప్పులపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ భయపడిందని, కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించిందని, స్టాక్ ఎక్స్చేంజ్ మదుపరులను అప్రమత్తం చేసిందని, ఆర్థిక దిగ్గజాలు భయపడుతున్నారని, ఏపీ అప్పులను చూసి దేశం ఆశ్చర్యపోతోందంటూ దుర్మార్గంగా వండి వార్చిన కథనాలను చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పత్రికకు ఉన్న ద్వేషం, కక్ష అర్ధం అవుతున్నాయన్నారు. ఈనాడు కథనంలో డొల్లతనాన్ని నిరూపిస్తూ.. ఆర్బీఐ, కాగ్ అధికారిక నివేదికలను దువ్వూరి కృష్ణ బయటపెట్టారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మీడియాకు వాస్తవాలను వివరించారు. అవి ఆయన మాటల్లోనే... అబద్ధాలే.. ఆధారాలేవి? ఊహాజనిత గణాంకాలతో, లేని అప్పులు ఉన్నాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలను అచ్చు వేసింది. ప్రతి గొంతుతోనూ అబద్ధాలాడే ‘దశకంఠుడి’గా రామోజీ దిగజారిపోయారు. రాష్ట్ర అప్పులు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనల మేరకు పరిమితికి లోబడే ఉన్నాయి. కోవిడ్‌తో రెండేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ టీడీపీ హయాంలో కన్నా ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వృద్ధి తక్కువగా ఉంది. మార్కెట్ రుణాలతో పాటు నాబార్డు, విద్యుత్ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, బాండ్ల గ్యారెంటీతో పాటు గ్యారెంటీ ఇవ్వకుండా తీసుకున్న మొత్తం అప్పులు రూ.6.38 లక్షల కోట్లు మాత్రమే. దాన్ని రూ.10.11 లక్షల కోట్లగా పేర్కొంటూ ‘ఈనాడు’ ఏ అధికారిక నివేదిక ఆధారంగా రాసిందో చెప్పాలి. లేదంటే కాగ్, ఆర్బీఐ అధికారిక నివేదికల ప్రకారం నేను వెల్లడించిన గణాంకాలను ప్రచురించాలి. పెండింగ్ బిల్లులపై సొంత లెక్కలా? పెడింగ్ బిల్లులు రూ.21 వేల కోట్లు మాత్రమే ఉన్నాయని ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రకటించగా రూ.1.70 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులున్నట్లు రామోజీ పచ్చి అబద్ధాలు ఎలా ప్రచురిస్తారు? ప్రభుత్వం బడ్జెట్లో చేసే అప్పులతో పాటు గ్యారెంటీతో చేసిన అప్పులు, గ్యారెంటీ ఇవ్వని అప్పులన్నీ కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు అసెంబ్లీకి సమర్పించాం. ఈనాడు తనకు నచ్చిన ఊహాజనిత గణాంకాలతో అప్పులుపై తప్పుడు కధనాలు రాస్తోంది. అప్పులపై ఎన్నిసార్లు వాస్తవాలు వెల్లడించినా పదేపదే దు్రష్పచారానికి పాల్పడుతూ టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. హెచ్చరికలంటూ అవగాహనారాహిత్యం.. ఆర్బీఐ గానీ కేంద్ర ఆర్థికశాఖగానీ అప్పులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించలేదు. అసలు నిబంధనల మేరకు అప్పులకు అనుమతిస్తారు. ఒకవేళ నిబంధనలు మీరితే అప్పులు ఇవ్వడం నిలిపేస్తారు. అంతేగానీ హెచ్చరికలు ఉండవు. ఈ మాత్రం కనీస అవగాహన కూడా రామోజీరావుకు లేదు. కేంద్రానికి గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ అనధికారిక అప్పులు ఉండవనే సంగతి తెలియకపోవడం ‘ఈనాడు’ అవగాహనారాహిత్యానికి నిదర్శనం. అనధికారిక అప్పులా? మార్గదర్శి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక డిపాజిట్లు సేకరించడం రామోజీకే చెల్లింది. ప్రభుత్వాలకు బ్యాంకులు గానీ, ఆర్థిక సంస్ధలు గానీ ఏ అప్పులిచ్చినా అవి అధికారికంగానే ఇస్తాయి. అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వరనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా? మార్వాడీ దగ్గరకు వెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడం కేంద్రంతో పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ సాధ్యం కాదు. ప్రభుత్వానికి అప్పులు చెల్లించే ఉద్దేశం లేదంటూ మరో అబద్ధాన్ని ఈనాడు అచ్చేసింది. అప్పులను వాయిదాల ప్రకారం ప్రభుత్వాలు తీరుస్తూ ఉంటాయి. తీర్చకపోతే డిఫాల్ట్ అవుతాయి. అది కూడా తెలియదా? గత అప్పులకు ఇప్పుడు కోత రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు తక్కువే. వాస్తవానికి గత సర్కారు నిబంధనల కంటే ఎక్కువగా అప్పులు చేసింది. దాంతో కేంద్రం ఇపుడు వాటిని తగ్గిస్తోంది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల జారీ ద్వారా రుణం తీసుకోవడానికి సెబీ అనుమతించింది. అయితే అవసరం లేదు కాబట్టి తీసుకోలేదు. దీన్ని కూడా వక్రీకరిస్తూ రాజ్యాంగ విరుద్ధం అన్నట్లు తప్పుడు కథనాలు ప్రచురించారు. పరిమితికి లోబడే గ్యారెంటీలు గ్యారెంటీలు రాష్ట్ర ఆదాయంలో 80 శాతమే ఉన్నాయి. ఇవి నిబంధనల కన్నా తక్కువే. పెండింగ్ బిల్లుల విషయంలో ‘ఈనాడు’వి పచ్చి అబద్ధాలు. జీతాలు గానీ పెన్షన్లు గానీ ఆగలేదు. అలాంటప్పుడు ఇన్ని పెండింగ్ బిల్లులు ఎలా ఉంటాయి? కోవిడ్ కారణంగా రాష్ట్రం రూ.66 వేల కోట్లు ఆదాయం కోల్పోయినప్పటికీ టీడీపీ హయాంతో పోలిస్తే తక్కువగానే అప్పు చేసింది. గత సర్కారు హయాంతో పోల్చితే ఆస్తుల కల్పనకు వెచ్చించిన మూల ధన వ్యయం ఇప్పుడే ఎక్కువ.