సాక్షి, రాజమండ్రి: మార్గదర్శి కేసు వివరాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఉండవల్లి తెలిపారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు.
కాగా, ఉండల్లి అరుణ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. తెలంగాణ హైకోర్టుకు విచారణ బాధ్యతలు అప్పగించారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది. మార్గదర్శిలో జరిగింది ఆర్థికనేరం. రామోజీరావు ఎవరైతే నాకేంటి. ఒక ఇష్యూలో తప్పు జరిగింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే మనం కళ్లు మూసుకుపోవాలా?. అందుకే ఈ విషయాన్ని బయటకు తీశాను.
నేను అడిగింది 45-ఎస్ ఉల్లంఘన గురించి. అది తేల్చండి చాలు. రామోజీరావును జైలులో పెట్టాలని లేక శిక్షించాలన్నది నా కోరిక కాదు. ఈ వ్యవహారంలో కొన్ని నిజాలు బయటకు రావాలన్నదే నాకు కావాల్సింది. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ లూథ్రాకు కూడా చెప్పాను. ఈనాడు రాసిన రాతలపైనే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను. వక్రీకరించి వార్తలు రాయడం ఈనాడుకు అలవాటుగా మారింది. భావవ్యక్తీకరణను ఏ రకంగా చంపేస్తారో.. ఈనాడు అలాంటి రాతలను ఇన్ని సంవత్సరాల్లో అనేకంగా రాసింది. నా మాటలను వక్రీకరించి చూపారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఎంతమంది ఖాతాదారులకు డబ్బులు వెనక్కిచ్చారన్న విషయాన్ని పరిశీలించడానికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని జ్యుడీషియల్ అధికారిగా ఏర్పాటు చేశారు. 80 నిమిషాల పాటు ఇండియాలో ఉన్న టాప్ అడ్వకేట్స్ ముగ్గురు రామోజీరావు తరపున దీనిపై వాదనలు వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగిందంటే కేవలం జడ్జిలు వల్ల జరిగిందని భావించాలి. ఇప్పుడు 45-ఎస్ ఓపెన్.. దానిపైన నిర్ణయం తీసుకుంటామన్నారు.ఎక్యుర్డ్ ఇంట్రెస్ట్‌తో సహా ఖాతాదారులకు డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించామని మార్గదర్శి కోర్టు వివరించింది. ఖాతాదారులు అందరికీ కలిపి 55.39 కోట్లు వడ్డీ కింద అందజేశామని మార్గదర్శి ఫైనాన్షియర్స్ చెప్పారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపితే 900 కోట్లు వడ్డీ పే చేయాల్సి ఉంటుంది.
మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకును పార్టీలను చేసి తెలంగాణ హైకోర్టుకు ఈ వ్యవహారంలో అరుణ్ కుమార్ అసిస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందజేసిన మెచూరిటీ అమౌంట్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఖాతాదారుల దగ్గర ఉన్న ఆధారాలు, పూర్తి అడ్రస్‌తో జీమెయిల్‌కి పంపండి. thedepositers@gmail.com అనే జిమెయిల్ ప్రారంభించాను.
జరిగిన వ్యవహారంపై పూర్తి విచారణ తెలంగాణ హైకోర్టులో జరిపించమన్నారు. దీనిపై పూర్తి విచారణ జరుగనుంది. ఈ వ్యవహారం ఆరు నెలలలో తేల్చమంది. ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ వస్తుందని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment