Vundavalli Aruna Kumar
-
తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. ఖాతాదారుల వివరాలను పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిందేనని కోర్టు గురువారం ఆదేశించింది. ఫిజికల్ కాపీ ఉన్నప్పుడు.. పెన్‌డ్రైవ్‌లో వివరాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ఈ సందర్భంగా మార్గదర్శి తరఫు లాయర్‌ను ప్రశ్నించింది న్యాయస్థానం. ఉండవల్లికి పెన్డ్రైవ్లోని వివరాలు ఇవ్వాల్సిందేనని కోర్టు తెలిపింది. ఎస్ క్రో అకౌంట్లో ఉన్న డబ్బులు ఎవరివో మార్గదర్శి చెప్పాలంటూ ఉండవల్లి కోర్టులో వాదనలు వినిపించారు. చందాదారులు ఎందుకు డబ్బులు తీసుకోవటం లేదో మార్గదర్శి చెప్పాలన్నారు. తాను బాధిత ప్రజల కోసం పోరాడుతున్నానని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. లూద్రా లాగా లిటిగెంట్ కోసం పోరాటం చేయటం లేదని తెలిపారు. అనంతరం పిటిషన్ విచారణను వాయిదా వేసింది.చదవండి: ఆ ఖర్చంతా మార్గదర్శి భరించాల్సిందే: హైకోర్టు -
మార్గదర్శి విజ్ఞప్తికి అంగీకరించని హైకోర్టు!
హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసు విచారణ సందర్భంగా.. ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను మీడియా ముందుకు వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలని మార్గదర్శి భావించింది. అయితే.. అందుకు హైకోర్టు బ్రేకులు వేసింది. మార్గదర్శి కేసులో వాదనలు వినిపిస్తున్న ఉండవల్లి.. తరచూ మీడియా ముందుకు వచ్చి మార్గదర్శి అవినీతి తుట్టెను కదిలిస్తున్నారు. దీంతో ఆయనను మీడియా ముందుకు రానివ్వకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేసింది మార్గదర్శి. అయితే.. విచారణ చేపట్టకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం మార్గదర్శి లాయర్ సిద్ధార్థ లూథ్రాకు స్పష్టం చేసింది. ఈ తరుణంలో.. లూథ్రా తీరుపై ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.‘‘సుప్రీం కోర్టు సూచన మేరకు ఈ కేసులో హైకోర్టుకు సహకారం అందిస్తున్నా. నేను ఏ ఒక్కరి తరఫు లాయర్ కాదన్నది గుర్తుంచుకోవాలి. మీడియాతో నేను మాట్లాడి మూడు నెలలు దాటింది. మార్గదర్శి లాయర్ తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు.అనంతరం.. ఉండవల్లి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణ జరపకుండా ఉండవల్లికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని మార్గదర్శి లాయర్‌కు తేల్చి చెప్పింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
జనం గుండెల్లో నిండిన దేవుడు
ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన నాయకుడాయన. పేదవాడి ముఖంపై చిరునవ్వు వెలిగించడానికి నిరంతరం శ్రమించిన కార్మికుడాయన. జలయజ్ఞంతో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన కర్షక భగీరథుడాయన. సర్కారీ పాలనలోనే కాదు... స్నేహంలోనూ, సాయంలోనూ వై.ఎస్. రాజశేఖరరెడ్డిది ఓ అరుదైన వ్యక్తిత్వం. మనుషుల గుండెల్లో చిరకాలం చెరిగిపోని సంతకం. జనహృదయ విజేత వైఎస్ 2009లో అకాల మరణం చెందినప్పుడు ఆయన ఆప్తుడు, నాటి కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్ తన గుండె లోతుల్లో నుంచి ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాల మాలిక ఈ వ్యాసం. నేడు వైఎస్ 15వ వర్ధంతి సందర్భంగా నాటి కథనాన్ని నవతరం పాఠకుల కోసం మరోసారి అందిస్తున్నాం.గాంధీభవన్‌లో మీటింగ్... పీసీసీ అధ్యక్షులు ఎం. సత్యనారాయణరావు గారు, సీఎల్పీ లీడర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డిగారు కూర్చున్నారు. ఏదో అర్జంట్ మీటింగ్! అందుబాటులో ఉన్న నాయకులందరినీ పిలిచారు. ప్రెసిడెంట్ గారి రూంలోనే మీటింగ్. ముప్పై కుర్చీల దాకా వేశారు. నేను బాగా చివరి వరుసలో మూలగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ‘అరుణ్! ముందుకు రావయ్యా... ఇక్కడ ఖాళీగా ఉంది గదా!’ అంటూ ముందు వరుసలో కూర్చోమని ఆహ్వానించారు సత్యనారాయణ గారు. ‘ఎందుకు సార్... మళ్లీ ఎవరైనా పెద్ద లీడరొస్తే లేచి వెనక్కి రావాలి. ఇక్కడ కూర్చుంటే ఎవ్వరొచ్చినా లేవక్కర్లేదు’ అన్నాను నవ్వుతూ. అన్ని సీట్లూ నిండిపోయాయి. మీటింగ్ ప్రారంభమైంది. ఏదో నోట్ చేయాల్సిన అవసరమొచ్చింది. ‘అరుణ్! ముందుకు రావయ్యా!’ అంటూ వైఎస్ గారి పక్కనే కుర్చీ వేయించి నన్ను కూర్చోపెట్టారు. నేను, వైఎస్ గారితో అన్నాను... ‘చూశారా సార్! టైం వచ్చినప్పుడు చివరాఖర్న కూర్చున్నా తీసుకొచ్చి ముందు కూర్చోపెడ్తారు.’ ‘అవును అరుణ్! ఇది బైబిల్లో ఉంది... తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును’. నా జీవితంలో మర్చిపోలేని సందేశమిది. అప్పట్నుంచి నేనేనాడూ నా గురించి నేను గొప్పగా ఊహించుకోలేదు. ఎవరైనా పొగుడుతుంటే వైఎస్ గారి వాక్యమే గుర్తుతెచ్చుకుంటూ ఉండేవాడిని. 2009 ఎన్నికల ఫలితాలపై వైఎస్ మాట్లాడుతూ, ‘ప్రజలు మాకు పాస్ మార్కులే వేశారు. ఇది ఘన విజయంగా నేను భావించడం లేదు. గర్వం వీడి అణకువతో ప్రజలకు దగ్గరకండి’ అంటూ తనను తాను తగ్గించుకుంటున్నప్పుడు ఆయన మరింత హెచ్చించబడతాడనే అనుకున్నాను గానీ ఆ హెచ్చు మరీ ఇంత ఎక్కువగా ఉంటుందనీ... ఎవరికీ అందనంత ఎత్తులోకి వెళ్లిపోతారనీ కలలోనైనా ఊహించుకోలేదు. ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి నాయకులొస్తే వారి ఉపన్యాసాలను నేను అనువదించాలి. ఈ విషయంలో మాత్రం ఇంకెవర్నీ ఒప్పుకునేవారు కాదు వైఎస్ గారు! చాలాసార్లు కొందరు నాయకులు లోపల్లోపల గొణుక్కుంటూ ఉండేవారు ‘వీడే చెయ్యాలా ట్రాన్స్లేషన్... ఆ మాత్రం అనువాదకులు మనూళ్లో లేరా...’ అని!! కొన్నిసార్లు బాహాటంగా పత్రికల్లోనే విమర్శించారు. రాజీవ్‌గాంధీ, మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీ – ఎవరొచ్చినా వారితోపాటు వేదిక మీద నాకూ కుర్చీ వేసేవారు! నాకన్నా సీనియర్లు, మంత్రులు, పెద్ద నాయకులు ఎంతోమంది కింద కూర్చోవటం, కేవలం అనువాదకుడినైన కారణంగా నేను వేదిక మీద కూర్చోవటం కొంతమందికి మింగుడుపడేది కాదు. కానీ ట్రాన్స్లేషన్ విషయంలో మాత్రం వైఎస్ కాంప్రమైజ్ అయ్యేవారు కారు. రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం అనంతపూర్‌లో ప్రారంభించారు. ప్రధాని మన్మోహన్సింగ్, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రçఘువంశప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మణిశంకర్ అయ్యర్ ప్రసంగించారు. నన్ను సోనియాగాంధీ గారికి కేటాయించి, మిగతా ముగ్గురికీ ఇంకో ముగ్గురు నాయకులను ట్రాన్స్లేషన్కి ఏర్పాటు చేశారు. సరిగ్గా అందరూ స్టేజీ మీద కూర్చున్నాక వైఎస్ గారికి ఈ ఏర్పాటు సంగతి తెలిసింది. ఆయన ససేమిరా అంగీకరించలేదు. మొత్తం నలుగురికీ నేనే అనువాదం చెయ్యాలన్నారు. ‘సుమారు నలుగురు మాట్లాడేదీ ఒకటే ఉంటుంది. మళీ మళ్లీ అదే నేనొక్కడినే రిపీట్ చేస్తే జనానికి బోర్ కొడ్తుందేమో సార్’ అన్నాను. ‘చెప్పినట్టు చెయ్! నో మోర్ ఆర్గ్యుమెంట్!’ అన్నారు. నలుగురి స్పీచ్‌లూ నేనే అనువదించాను. ‘ఇంటర్ ప్రెటేషన్ కావాలి, ట్రాన్స్లేషన్ కాదు. లక్షల మంది పాల్గొన్న సభ, ఎక్స్పెరిమెంట్లు చేయటం పద్ధతి కాదు’ అన్నారాయన. నాకు అప్పుడు పదేళ్ల క్రితం జరిగిన ఒక అనువాద సంఘటన గుర్తుకొచ్చింది. విశాఖలో గాజువాక దగ్గర రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ. రాజేష్ పైలట్, అహ్లూవాలియా, వైఎస్, ద్రోణంరాజులతో కలిసి కార్లలో గాజువాక వెళ్తున్నాం. రాజీవ్‌గాంధీ చిరునవ్వు ముఖంలో మృత్యుకళ ప్రవేశపెట్టడం ఆ దేవుడి వల్ల కాలేదనీ... అందుకే అందమైన ఆ ముఖం నిర్జీవమైనప్పుడు ఎలాగుంటుందో చూపించలేని ఆ దేవుడు, అసలు ఆ ముఖమే లేకుండా చేసేశాడని వైఎస్ గారితో చెప్పాను. ఆ రోజుల్లో వైఎస్‌తో ఉండవల్లి ఈ మాటలు రాజశేఖరరెడ్డి గారి స్పీచ్‌లో చెప్పమన్నాను. ఆయన వద్దన్నారు. ‘ఇంత వివరంగా నువ్వే చెప్పగలవు. నువ్వే చెప్పు’ అన్నారు. ‘సార్! నేను అనువాదకుణ్ణేగానీ వక్తను గాను. రాజేష్ పైలట్, లేదా అహ్లూవాలియానో ఈ మాటలంటే నేను అనువదించగలను గానీ వాళ్లనకుండా నేనెలా చెప్తాను’ అన్నాను. ‘అక్కడికేదో వాళ్లు చెప్పింది మాత్రమే నువ్వు చెబుతున్నట్టు పోజు పెట్టకోయ్... అయినా నువ్వు చేసేది భావానువాదం, భాషానువాదం కాదు! భావం మారకుండా ఈ పదాలు జొప్పించు’ అన్నారు వైఎస్. అహ్లూవాలియా మాట్లాడుతూ రాజీవ్ మరణాన్ని విశ్లేషిస్తుండగా... నేను అనువాదం చేస్తూ, పైన చెప్పిన నాలుగు మాటలూ కలిపేశాను. సభలో ఊహించని రెస్పాన్స్. వైఎస్ గారు మీటింగ్ అయిపోయాక నా భుజం తట్టారు. ఇప్పుడనిపిస్తోంది... ఎప్పుడూ నవ్వుతూ ఉండే వైఎస్ ముఖంలో సైతం మృత్యువును ప్రవేశపెట్టడం ఆ భగవంతుని వల్ల కాలేదనీ, అందుకే హెలికాప్టర్ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన ఆ శరీరం కోట్లాదిమంది అభిమానుల ఆఖరి చూపులకు కూడా నోచుకోలేదని!ఇద్దరు మనుష్యుల మధ్య సంబంధాలు... ఇచ్చిపుచ్చుకోవటాలతో బలపడుతుంటాయి. ఒకరికొకరు సహాయపడుతూ ఆప్తులవుతారు. వైఎస్ గారితో నా సంబంధం తల్చుకుంటే... నాకు ఆశ్చర్యమేస్తుంది! ఎప్పుడూ ఆయన వల్ల నాకు జరిగిన ఉపకారాలే తప్ప... నా నుంచి ఆయన కోసం వీసమెత్తు కంట్రిబ్యూషన్ కూడా లేదు. కనీసం వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి కూడా... కావల్సిన కులబలం, ధనబలం లేని నన్ను రెండుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు పార్లమెంట్కీ పోటీ చేయించారు. ఎక్కడో లక్షలాదిమంది మధ్య నుంచొని రాజీవ్‌గాంధీ ఉపన్యాసానికి చప్పట్లుకొట్టే స్థాయి కాంగ్రెస్ కార్యకర్తనైన నన్ను సాక్షాత్తూ ఆ రాజీవ్‌గాంధీ పక్కనే నిలబెట్టారు. అగ్రనాయకులందరూ అడ్డుపడ్డా... నేనే బాగా అనువదిస్తానని, వారితో వాదించి – వారిని వారించి నాకు ఢిల్లీ స్థాయి నాయకులందరి పక్కనా ఉండే స్థాయి కల్పించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ స్థాయి నాయకులు నన్ను పేరెట్టి పిలిచే స్థానంలోకి పంపించారు. నేనేనాడూ ఆయన్ని ‘నాకిది కావాల’ని అడగలేదు. మొన్నటి (2009) ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రం ధైర్యం చేసి ఒక్క రిక్వెస్ట్ చేశాను... ‘ఈసారి ఎన్నికల్లో నన్ను పోటీ చేయించవద్ద’ని! అప్పటికే రామచంద్రరావు గారి దగ్గర ఈ ప్రతిపాదన చేసి చాలా తిట్టించుకున్నాను. అందుకే వైఎస్ గారితో నెమ్మదిగా ఈ విషయం చెప్పాను. హైదరాబాద్ శివార్లలో ఒక సభకు హాజరవ్వటానికి బయలుదేరుతున్న వైఎస్, తనతో పాటు కారెక్కమన్నారు. సుమారు ఇరవై నిమిషాల ప్రయాణం. దారిలో ఆయనకి ఎక్స్ప్లైన్ చేశాను. ఈసారి నాకెంత ప్రతికూల పరిస్థితులున్నాయో... నేను నెగ్గటం ఎంత అసాధ్యమో వివరించాను. ‘ఇప్పుడు నువ్వు పోటీ చేయకపోవడం కరెక్ట్ డెసిషన్ కాదు. నువ్వు చెప్పిందంతా నిజమే, అయినా నువ్వే గెలుస్తావు... డోంట్ వర్రీ గాడ్ ఈజ్ దేర్’ అన్నారు వైఎస్. అది 2009 సెప్టెంబర్ 3. ఆ రోజు వినాయక నిమజ్జనం. హైదరాబాద్ నగరమంతా అల్లకల్లోల సునామీ సముద్రంలా ఉండేరోజు. వైఎస్ మరణవార్త నెమ్మది నెమ్మదిగా జనానికి చేరుతోంది. నిశ్శబ్దంగా నిమజ్జనం ప్రారంభమయ్యింది. ప్రతి ముఖంలో దుఃఖం, ఎంతోమంది మహానాయకుల మరణవార్తల్ని విన్నాం, కళ్లారా చూశాం. ‘ఆ వార్త వినగానే గుండె పగిలింది’ అంటూ చాలాసార్లు అంటుంటాం. ఇంతకాలం ఇదొక పద ప్రయోగమే... మహా అయితే పదాలంకారమో అనుకున్నాగానీ... నిజంగా గుండె పగిలి చచ్చిపోయేంత దుఃఖం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంట్లో అందొచ్చిన కొడుకు చచ్చిపోతే ఏడ్చినట్టుగా ఏడుస్తున్న వృద్ధులు... ‘రేపు నా బిడ్డల పరిస్థితేమి’టంటూ పిల్లల తల్లులు... ఫ్రీగా ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులు... రాష్ట్రమంతా వెక్కివెక్కి ఏడ్చింది. కొన్ని వందల గుండెలు నిజంగానే పగిలిపోయాయి. యాక్సిడెంట్ కన్ఫర్మ్ అయి వైఎస్ మృతదేహాన్ని గుర్తించారని తెలిసిపోయాక, సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారి ఫ్లోర్‌లోకి వెళ్లాను. ఆయనతో నాకున్న సంబంధం, ఆయన నాపై చూపిన ప్రేమాభిమానాలూ మనసులో రీళ్లు తిరగసాగాయి. ఒక మాట దగ్గర రీల్ ఆగిపోయింది. ‘డోంట్ వర్రీ,,, గాడ్ ఈజ్ దేర్.’ నేను తప్పుగా విన్నాను ఆయనన్న మాట... ‘డోంట్ వర్రీ గాడ్ ఈజ్ హియర్!’ అని అయి ఉంటుంది. నేనుండగా నీకెందుకు వర్రీ!! నా సంకల్పమే నీకు దైవం. నా బలమే నీకు దైవబలం. ఇంకా తెలియలేదా అరుణ్... నేనెవరినో!!వైఎస్ గారితో నేను మాట్లాడిన మాటలు, వెటకారాలు, వేళాకోళాలు, జోకులూ అన్నీ గుర్తుకొచ్చి నెమ్మదిగా వెన్నులో వణుకు పుట్టింది. ఆయనతో మాట్లాడేటప్పుడు ఏమి అనాలనిపిస్తే అది అనేసేవాడిని. ఎవరేమనుకుంటారో, అనొచ్చో–లేదో... అని ఏనాడూ సంకోచించలేదు. ఎన్నిసార్లు నా మాటలు ఆయనకు నచ్చకపోయి ఉండొచ్చో... ఎన్నిసార్లు ఆయనకు నా మాటల వల్ల బాధ కలిగిందో... హఠాత్తుగా నాకు ‘భగవద్గీత’లోని ఒక శ్లోకం (11: 42) గుర్తుకొచ్చింది. అర్జున ఉవాచ :‘‘యచ్చావహా సార్థ మసత్కృతోసివిహార శయ్యాసన భోజనేషుఏకోథ వాప్యచ్యుత తత్సమక్షంతత్ క్షామయే త్వామహ మప్రమేయమ్’’ (విశ్వరూప సందర్శన యోగం)‘‘కృష్ణా! నాశరహితా! నీ ఈ మహిమ తెలియక పొరపాటున గానీ, చనువు వల్ల గానీ ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ సఖా అని అలక్ష్యముగా నేనేమి అన్నానో... విహారము సల్పునపుడుగానీ, పరుండునప్పుడుగానీ, కూర్చుండునప్పుడు గానీ, భుజించినప్పుడు గానీ, ఒక్కడవుగా ఉన్నప్పుడుగానీ, ఇతరుల యెదుట పరిహాసముగా గానీ ఏ విధంగా ప్రవర్తించితినో నా అపరాధములన్నీ అప్రమేయుడవగు నీవు క్షమించమని వేడుకొనుచున్నాను.’’తండ్రీ! ఓ రాజశేఖరరెడ్డీ! నన్ను క్షమించు... అనుగ్రహించు!!ఉండవల్లి అరుణ్‌కుమార్ – వ్యాసకర్త ప్రముఖ రాజకీయ నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు -
మార్గదర్శిపై ఇద్దరు సీఎంలు స్పందించాలి: ఉండవల్లి అరుణ్‌కుమార్
మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్‌కు చేరి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్లింది. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని మార్గదర్శి నిర్వాహకులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది. మార్గదర్శిపై పోరాడుతున్న వారిని కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాపై రూ.50 లక్షల పరువు నష్టం దావా వేశారు. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్‌లో ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే.. ఆ కేసు నుంచి బయటడతాను. కేసు వేయడంతో చివరి వరకు పోరాటం చేయాల్సి వస్తోంది. – ఉండవల్లి అరుణ్‌కుమార్ సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టులో వాస్తవాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వాల నుంచి కనీస స్పందన కరువైందని ఆరోపించారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతోనైనా వాళ్లలో చలనం కలుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. రాజమహేంద్రవరంలోని ఓ బుక్ హౌస్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో ఈ కేసుకు బలం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు దివంగత రామోజీరావు, కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎలా స్పందిస్తారో తెలియడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే గౌరవం దక్కుతుందన్నారు. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప.. అన్యాయం జరగదని చెప్పారు. రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నా, సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలని కోరారు. మార్గదర్శి డిపాజిట్లకు సంబంధించిన వడ్డీల గురించి తనకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. డిపాజిట్ల సొమ్ము అందరికీ అందిందా? లేదా? అన్న విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రకటన ఇవ్వాలని హైకోర్టు సూచించిందన్నారు. డిపాజిట్‌దారుల వివరాలను పెన్ డ్రైవ్‌లో నింపి ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించానని తెలిపారు. తాము ఎవరికి డబ్బు చెల్లించామన్న వివరాలను మార్గదర్శి 70 వేల పేజీల్లో నింపి సుప్రీంకోర్టుకు అందించిందని చెప్పారు. నాడు చెప్పిందే.. నేడు నిజమైంది 2006 నవంబర్ 6వ తేదీన అప్పటి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరానికి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణ విషయంలో తాను ఏం ఫిర్యాదు చేశానో అదే విషయాన్ని ఆర్బీఐ సైతం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొందని ఉండవల్లి చెప్పారు. మార్గదర్శి అవిభాజ్య హిందూ కుటుంబం పేరుతో డిపాజిట్ల వసూళ్లలో 45ఎస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు ఆర్బీఐ స్పష్టం చేసిందన్నారు. మార్గదర్శిపై తన పోరాటాన్ని కొందరు తప్పు పట్టారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పడం వల్లే పోరాటం చేస్తున్నట్లు చేసిన విమర్శల్లో నిజం లేదన్నారు. కేసు పోరాటంలో తనకు ఎలాంటి రహస్య ఎజెండా లేదని స్పష్టం చేశారు. చిట్ ఫండ్ చట్టాలకు తాము అతీతం అని మార్గదర్శి భావించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చట్టాలు పాటించడం లేదని దుయ్యబట్టారు. ఇటీవల కాకినాడలో జయలక్ష్మి చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేశారని ఉదహరించారు. రామోజీ నిబంధనలు పాటించక పోవడంతో మిగిలినవి సైతం అదే దారిలో వెళుతున్నాయన్నారు. విలీన మండలాలను కాపాడుకోవాలి రాష్ట్ర విభజన విషయంలో విలీన మండలాలు తెలంగాణ పరం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉండవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరçఫున గతంలో వైఎస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేశారో ఇప్పుడు కూడా అదే చేయాలని చంద్రబాబును కోరారు. 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉన్నట్టు విశాఖపట్నంకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నీతి ఆయోగ్‌కు చేసిన దరఖాస్తు ద్వారా వెల్లడైందని, ఈ విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు. ఓట్ల శాతంపై కదలికేదీ? మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏపీలో పోలైన ఓట్ల కన్నా 12.54 శాతం ఓట్లు, ఒడిశాలో 12.4 శాతం ఓట్లు ఎక్కువగా లెక్కించినట్టు ప్రకటించిందని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయి.. ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డి్రస్టాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలని కోరారు. -
చంద్రబాబూ.. జగన్‌లా మీరు చేయలేరా? ఉండవల్లి హాట్ కామెంట్స్
తూర్పుగోదావరి, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని, కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో చూడాలని మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇంప్లీడ్ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. బుధవారం ఉదయం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. మార్గదర్శి తరపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపిస్తూ.. రెండు వారాల సమయం కోరారు. తాము ఎవరెవరికి డబ్బు చెల్లించామో 70 వేల పేజీల్లో సుప్రీంకోర్టుకు వివరాల్ని మార్గదర్శి సబ్మిట్ చేసింది. కట్టిన డబ్బుల ఇచ్చారే తప్ప వడ్డీ ఇవ్వలేదని పలువురు మార్గదర్శి ఫైనాన్స్ ఖాతాదారులు నన్ను అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా డబ్బు అందేందో లేదో పరిశీలించమని ఒక జ్యుడీషియరీ అడ్వైజర్ ను హైకోర్టులో నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..ఇదీ చదవండి: టీడీపీకి ఇది నల్ల ఖజానా.. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధం. 2006లో అప్పటి ఫైనాన్స్ శాఖా మంత్రి చిదంబరానికి నేను చెప్పిందే.. ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది. ఆర్బీఐ అఫిడవిట్‌తో నేను చెప్పిందే నిజమైంది. మార్గదర్శిపై నా పోరాటాన్ని మరోలా వక్రీకరించారు. ఇదేదో వైఎస్సార్ చెప్పటం వల్లే నేను చేశానని అందరూ అనుకుంటున్నారు... అది నిజం కాదు. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఏ చిట్‌ఫండ్ కంపెనీ కూడా చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరించడం లేదు. ఇటీవలె కాకినాడలో జయలక్క్క్ష్మి చిట్‌ఫండ్ కంపెనీ ఎత్తేశారు. మార్గదర్శి.. చిట్‌ఫండ్ యాక్ట్‌ను బ్యాడ్ లాగా పేర్కొంది. రామోజీరావు అనుసరించకపోవడం వల్లే తాము అదే ఫాలో అవుతున్నామని చెబుతున్నారు. ఈ విషయంలోనే నాపై మార్గదర్శి కంపెనీ కూడా కేసు కూడా వేసింది. రామోజీరావు కేసులో ప్రెస్‌మీట్ చెప్పిన అందరిని జైల్లో వేస్తున్నారు. మిగిలిన వారెవరు ప్రశ్నించకుండా ఉండేందుకు మార్గదర్శి నాపై పరువు నష్టం దావా కేసు వేశారు.సంబంధిత వార్త: మార్గదర్శి దందాకు క్విడ్ ప్రోకో కుట్ర.. మార్గదర్శి చిట్ ఫండ్స్ నాపై 50 లక్షలు పరువు నష్టం దావా వేశారు.. తెలంగాణ కోర్టులో అది ఇంకా పెండింగ్ లో ఉంది. మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసు నుంచి బయటపడగలను. మార్గదర్శి చిట్స్ నుంచి డబ్బు మార్గదర్శి ఫైనాన్స్ లోకి వెళ్లి.. అక్కడి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్ళింది. ఈనాడు పేపర్ ను అడ్డం పెట్టుకుని రామోజీరావు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు. హెచ్ఎఫ్ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది. వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉంది. .. సెప్టెంబర్ 11 కి వాయిదా ఉంది. మార్గదర్శి కేసులో విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఇటు రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించలేదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ కావడంతో కేసుకు కాస్త బలం వచ్చింది. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు రామోజీరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నారు. కాబట్టి ఎలా స్పందిస్తారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే గౌరవం నిలబడుతుంది. కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం జరగదు. రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. సీఎం హోదాలో చంద్రబాబు విచారణకు సహకరించాలి. వెంటనే రెండు ప్రభుత్వాలు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి’’ అని ఉండవల్లి కోరారు.ఏపీ ఎన్నికల ఫలితాలపైనా.. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఐదు మండలాలు తిరిగి వెనక్కి ఇచ్చేయమని తెలంగాణ కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైయస్ జగన్ ఎలా అఫిడవిట్ ఫైల్ చేశారో.. మీరు కూడా అదే చేయమని చంద్రబాబును కోరుతున్నాను. స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రకటించిన 11 రాష్ట్రాల్లో తెలంగాణ ను ఎందుకు చేర్చారో తెలియటం లేదు. మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 12.5% తేడా ఉందన్న ప్రకటించారు.. దీనిపై ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయిన ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఓట్ల వివరాలు భద్రంగా ఉంచాలి. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాలి. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో .. స్పష్టం తెలియాలి అని ఉండవల్లి డిమాండ్ చేశారు. -
చందాదారులెవరు?.. తెలంగాణ హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదును తిరిగి చెల్లించిందా? లేక ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు తాజాగా రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే చందాదారుల వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సూచించింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 11వతేదీకి వాయిదా వేసింది. డిపాజిట్ల నిగ్గు తేలాలన్న ‘సుప్రీం’ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావు (ఇటీవల మృతి చెందారు)పై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. అయితే అనంతరం ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (వైఎస్సార్ సీపీ హయాంలో) సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు అన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును 2024 ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ మార్గదర్శి డిపాజిట్ల సేకరణకు సంబంధించి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని పేర్కొంది. మార్గదర్శి అక్రమాలను ఆర్బీఐ కౌంటర్లో తేల్చింది... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో తెలంగాణ హైకోర్టు తాజాగా మరోసారి విచారణ ప్రారంభించింది. సీనియర్ జడ్జి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్బీఐని ప్రతివాదుల జాబితాలో చేర్చింది. గత విచారణ (ఈనెల 6వ తేదీన) సందర్భంగా కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇవ్వాలన్న ఆర్బీఐ వినతికి అంగీకరిస్తూ ఇకపై ఈ పిటిషన్లను మోషన్ లిస్ట్‌లో పేర్కొనాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ వసూలు చేసిన డిపాజిట్లన్నీ చట్టవిరుద్ధం, అక్రమమేనని, అందుకు బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని నివేదిస్తూ ఈ నెల 13న ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో మంగళవారం జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, కోర్టు సహాయకులుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆన్లైన్లో హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాదితోపాటు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది పల్లె నాగేశ్వర్రావు, ఆర్బీఐ న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి హాజరయ్యారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారిస్తూ చట్టం 45 (ఎస్)ను ఉల్లంఘించినట్లు ఆర్బీఐ కౌంటర్లో తేల్చిందని ఈ సందర్భంగా ఉండవల్లి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీని ఆధారంగా మార్గదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని నివేదించారు. దాదాపు 70 వేల మంది చందాదారుల వివరాలను 1,500కిపైగా పేజీల్లో మార్గదర్శి సుప్రీం కోర్టుకు సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు కూడా పెన్‌డ్రైవ్‌లో అందజేసేలా ఆదేశించాలని కోరారు. దీనిపై జస్టిస్ సుజోయ్‌పాల్ స్పందిస్తూ.. వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ మేరకు ఆర్బీఐ, మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
‘మార్గదర్శి’ ఎగవేతదారుల వివరాలు తెలుసుకోండి: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: సుప్రీం కోర్టు ఆదేశాలతో మార్గదర్శి కేసు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి ఎగవేతదారుల వివరాలు తెలుసుకోవాలని, ఇందుకోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ దినపత్రికల్లో నోటీసులు ఇచ్చి విస్తృత ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. మార్గదర్శి కేసును ఇవాళ తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. జస్టిస్ సుజోయపాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం వాదనలు వింది. ఉండవల్లి అరుణ్‌కుమార్, మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రా అన్లైన్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆర్బీఐ దాఖలు చేసిన కౌంటర్‌పై స్పందన తెలిపేందుకు రెండు వారాలు సమయం కావాలని కోరారు మార్గదర్శి లాయర్ లూద్రా. అయితే..ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) ప్రకారం మార్గదర్శి చందాలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆర్బీఐ కౌంటర్లో తేల్చిందన్న విషయాన్ని ఉండవల్లి బెంచ్ ముందు ప్రస్తావించారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని, బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చెప్పిందని గుర్తు చేశారు. అలాగే.. మొత్తం 70,000 చందాదారుల వివరాలు సుప్రీంకోర్టుకు మార్గదర్శి సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆ సంస్థను ఆదేశించాలని ఉండవల్లి కోరారు. అయితే.. ఆ వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లికి హైకోర్టు సూచించింది. ఎగవేత దారుల వివరాలు తెలుసుకునేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మరోవైపు.. రెండు వారాల్లో కౌంటర్లు వేయాలని ఏపీ, తెలంగాణ సర్కారుకు ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. -
రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు పనిచేస్తారని ఆశిస్తున్నా: ఉండవల్లి
-
మార్గదర్శి కేసులో సంచలన విషయాలు..!
-
రామోజీరావు మార్గదర్శి కేసుపై నేను ఇంత ఇంట్రెస్ట్ పెట్టడానికి కారణం
-
LIVE: ఉండవల్లి అరుణ్ కుమార్ PRESS MEET
-
రామోజీని జైల్లో పెట్టాలన్నది నా కోరిక కాదు: ఉండవల్లి
సాక్షి, రాజమండ్రి: మార్గదర్శి కేసు వివరాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ఉండవల్లి తెలిపారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. కాగా, ఉండల్లి అరుణ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. తెలంగాణ హైకోర్టుకు విచారణ బాధ్యతలు అప్పగించారు. రామోజీరావు పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది. మార్గదర్శిలో జరిగింది ఆర్థికనేరం. రామోజీరావు ఎవరైతే నాకేంటి. ఒక ఇష్యూలో తప్పు జరిగింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే మనం కళ్లు మూసుకుపోవాలా?. అందుకే ఈ విషయాన్ని బయటకు తీశాను. నేను అడిగింది 45-ఎస్ ఉల్లంఘన గురించి. అది తేల్చండి చాలు. రామోజీరావును జైలులో పెట్టాలని లేక శిక్షించాలన్నది నా కోరిక కాదు. ఈ వ్యవహారంలో కొన్ని నిజాలు బయటకు రావాలన్నదే నాకు కావాల్సింది. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ లూథ్రాకు కూడా చెప్పాను. ఈనాడు రాసిన రాతలపైనే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను. వక్రీకరించి వార్తలు రాయడం ఈనాడుకు అలవాటుగా మారింది. భావవ్యక్తీకరణను ఏ రకంగా చంపేస్తారో.. ఈనాడు అలాంటి రాతలను ఇన్ని సంవత్సరాల్లో అనేకంగా రాసింది. నా మాటలను వక్రీకరించి చూపారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎంతమంది ఖాతాదారులకు డబ్బులు వెనక్కిచ్చారన్న విషయాన్ని పరిశీలించడానికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని జ్యుడీషియల్ అధికారిగా ఏర్పాటు చేశారు. 80 నిమిషాల పాటు ఇండియాలో ఉన్న టాప్ అడ్వకేట్స్ ముగ్గురు రామోజీరావు తరపున దీనిపై వాదనలు వినిపించారు. ఈ కేసులో న్యాయం జరిగిందంటే కేవలం జడ్జిలు వల్ల జరిగిందని భావించాలి. ఇప్పుడు 45-ఎస్ ఓపెన్.. దానిపైన నిర్ణయం తీసుకుంటామన్నారు.ఎక్యుర్డ్ ఇంట్రెస్ట్‌తో సహా ఖాతాదారులకు డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించామని మార్గదర్శి కోర్టు వివరించింది. ఖాతాదారులు అందరికీ కలిపి 55.39 కోట్లు వడ్డీ కింద అందజేశామని మార్గదర్శి ఫైనాన్షియర్స్ చెప్పారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపితే 900 కోట్లు వడ్డీ పే చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకును పార్టీలను చేసి తెలంగాణ హైకోర్టుకు ఈ వ్యవహారంలో అరుణ్ కుమార్ అసిస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందజేసిన మెచూరిటీ అమౌంట్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఖాతాదారుల దగ్గర ఉన్న ఆధారాలు, పూర్తి అడ్రస్‌తో జీమెయిల్‌కి పంపండి. thedepositers@gmail.com అనే జిమెయిల్ ప్రారంభించాను. జరిగిన వ్యవహారంపై పూర్తి విచారణ తెలంగాణ హైకోర్టులో జరిపించమన్నారు. దీనిపై పూర్తి విచారణ జరుగనుంది. ఈ వ్యవహారం ఆరు నెలలలో తేల్చమంది. ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ వస్తుందని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మార్గదర్శి చిట్ ఫండ్ స్కాంలపై నా దగ్గర కీలక ఆధారాలున్నాయి: మాజీ ఎంపీ ఉండవల్లి
-
స్కిల్ కేసు.. ఉండవల్లి పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, గుంటూరు: చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. స్కిల్ స్కామ్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. 14 మంది ప్రతివాదులు పలు కారణాలతో నోటీసులు తీసుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం.. ఇతర కారణాలతో నోటీసులు వెనక్కి విషయాన్ని ప్రస్తావించారాయన. పైగా ఈ కేసులో కొందరు ప్రతివాదులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీలోనూ ఉన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఆయా ప్రతివాదులకు పేపర్ ప్రకటన ద్వారా నోటీసులు ఇస్తామన్నారు. ఈ విషయంపై మెమో ఫైల్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో.. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది హైకోర్టు. -
‘స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది’
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరగాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ స్కాం జరిగిందని జీఎస్టీ డీజీ తేల్చినట్టు ఉండవల్లి చెప్పుకొచ్చారు. కాగా, ఉండవల్లి అరుణ్‌కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలి. స్కిల్ స్కామ్‌లో ఫైళ్లు మాయం చేశారని చెబుతున్నారు. స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పూణే జీఎస్టీ అధికారుల విచారణలో ఇది బయటపడింది. స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ఈ ప్రాజెక్ట్‌తో సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ చెప్పింది. ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని సీమెన్స్ తెలిపింది. ఒప్పందంపై సంతకం పెట్టిన వ్యక్తి తమ కంపెనీలో పనిచేయడం లేదని వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ లేఖ రాసింది. చంద్రబాబు ఎందుకు ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు?. బెయిల్ ఇవ్వలేదని జడ్జిపై ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారు. ప్రాథమిక సాక్ష్యాధారాలతో రిమాండ్‌కు పంపించారు. సీబీఐ విచారణ చేస్తే ఫైళ్లు ఎలా తగటబడ్డాయో తెలుస్తుంది. టీడీపీలో మంత్రులుగా చేసిన వాళ్లు కూడా చౌకబారుగా విమర్శలు చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దేశం వదిలి పారిపోయారు. బెయిల్‌పై పిటిషన్ వేయకుండా కేసు కొట్టేయాలని వాదిస్తున్నారు. స్కిల్ స్కామ్‌లో వాస్తవాలు బయటకు రావాలి. ఈ కేసులో సీబీఐ ఎంక్వైరీ అడిగితే తప్పేంటి?. నేను సీబీఐ విచారణ కోరితే టీడీపీకి ఎందుకు కోపం వస్తోంది?. స్కిల్ స్కాంలో ఉన్నవి సూటుకేసు కంపెనీలు. చంద్రబాబుకు సౌకర్యాలు కావాలంటే కోర్టు ద్వారా అడగొచ్చు. రాజమండ్రి జైలులో చాలా సౌకర్యాలు ఉన్నాయి. లైబ్రరీ ఉంది.. వాకింగ్ చేయవచ్చు. కేసు ఒక పద్దతిలో వెళ్తోంది. స్కిల్ స్కామ్‌లో అవినీతి జరిగిందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబుకు తెలియకుండా స్కామ్ జరిగిదంటే ఎవరూ నమ్మరు. చంద్రబాబు తనకు తాను సీఈవో అనుకుంటాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసుపై విచారణ
-
ఉండవల్లి అరుణ కుమార్ రామోజీ పై సంచలన వ్యాఖ్యలు...
-
రామోజీకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉంది: మాజీ ఎంపీ ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రామోజీరావుకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉందని, ఆయన అడ్వకేట్లు ఎలా కావాలనుకుంటే అలా చేయగలరంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘అపురూప కళాఖండాల విదేశాలకు తరలిస్తున్న కళాంజలి అని ఏబీకే ప్రసాద్ 1996లో రాశారు. భారత ప్రభుత్వం పెట్టిన కేసు గురించి రాస్తే ఏబీకేకి శిక్ష పడింది’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. ‘‘చిట్‌ఫండ్ చందాదార్లకు నోటీసులు ఇవ్వమని కోర్టు చెప్పింది. ఏ కేసుకు సంబంధించిన అఫిడవిట్ లోనైనా మొదట ఆయన నడుపుతున్న పత్రికల ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. నర్మగర్భంగా రాయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఏపీ చిట్‌ఫండ్ యాక్ట్ మార్గదర్శికి వర్తిస్తుందో వర్తించదో కచ్చితంగా తేల్చి చెప్పండి. ఉండవల్లిపై వేసిన డిఫర్ మెషన్ కేసులో రామోజీరావు ఎవరో తెలియదని రాజాజీ స్పష్టం చేశారు. మరో కేసులో రామోజీరావు తమ ఛైర్మన్ అని ఇదే రాజాజీ అఫిడవిట్ ఫైల్ చేశారు. మార్గదర్శి రూల్ వయలేషన్ చేసినా సరే తప్పు కాదని తేల్చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసినప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకొన్న డబ్బు పూర్తిగా వాళ్ల దగ్గర ఉండాలి కానీ లేదు. న్యాయవ్యవస్థ తీరు మారాలి. ఎవరికి ఆన్సర్ బుల్గా ఉండటం లేదు’’ అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. చదవండి: Fact Check: బురద రాతలే పునరావృతం ‘‘మార్గదర్శి వ్యవహారాల్లో నిజాలు బయటపెట్టాలంటే ప్రభుత్వం నాకు సహకరించాలి. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈనాడులో నోటికి వచ్చినవన్ని రాస్తారు. రాజాజీ అనే వ్యక్తి పై కంటెమ్ట్ ఆఫ్ కోర్టు వేయరా.. హైదరాబాద్‌లో ఒక్క చిట్ ఫండ్ కూడా రూల్ ఫాలో కావటం లేదు. రాజు గురువుకు కోపం వస్తే పునాదులు కదులుతాయని చంద్రబాబుకు భయం. అందుకే అదిరెడ్డిని పరామర్శించేందుకు వచ్చి కూడా రామోజీ గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు’’ అని ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. -
మార్గదర్శి అక్రమాలపై చర్చ.. తోకముడిచిన జీవీ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలపై బహిరంగ చర్చ అంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చివరికి తోక ముడిచారు. బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నానంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు శనివారం సమాచారం అందించారు. రామోజీరావు, మార్గదర్శి అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీరెడ్డి సవాల్‌ను స్వీకరించారు. అంతేకాదు రామోజీ ఫిల్మ్సిటీలోగానీ, హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో గానీ రామోజీరావు సమక్షంలో ఈ చర్చను ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని జీవీరెడ్డికి ప్రతి సవాల్ కూడా విసిరారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా రేపు (మే14న) చర్చ జరగాల్సి ఉంది. అయితే.. మార్గదర్శి అక్రమాలకు వత్తాసు పలుకుతూ చర్చకు సవాల్ విసిరిన జీవీరెడ్డి.. ఇపుడు బిజీ పేరుతో వెనక్కి తగ్గడం దేనికి సంకేతం? చర్చను ఎదుర్కొనే ధైర్యం లేక, భంగపాటు తప్పదనే భయంతోనే ముందుగానే చక్కబడినట్టు కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా దశాబ్దాలుగా వేళ్లూనుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను కూకటి వేళ్లతో సహా తొలగించే విస్తృత కార్యాచరణకు సీఐడీ విభాగం ఉపక్రమించింది. రాష్ట్రంలోని మొత్తం 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు చేపట్టింది. సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో సోదాలతోపాటు సీఐడీ అధికారులు సమాంతరంగా ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేపట్టింది. ఈ కేసులో ఆ సంస్థ చైర్మన్ రామోజీరావును, శైలజా కిరణ్ ను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. -
రామోజీరావు రెండు పాత్రలనూ బట్టబయలు చేసిన ఉండవల్లి
-
మార్గదర్శి అక్రమాలపై మే 10 తర్వాత చర్చకువస్తా: ఉండవల్లి
-
రామోజీ డబుల్ రోల్
సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్ అధినేత రామోజీరావు ద్విపాత్రాభినయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డిపాజిట్‌దారుల నుంచి సేకరించిన మొత్తాన్ని వేర్వేరు సంస్థలకు మళ్లించే క్రమంలో రామోజీ పోషించిన కీలక పాత్రను బహిర్గతం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి సుప్రీం కోర్టులో తాజాగా అదనపు డాక్యుమెంట్‌ను దాఖలు చేశారు. డిపాజిట్లు స్వీకరించే క్రమంలో కర్త ఆఫ్ హెచ్‌యూఎఫ్ కర్తగా, చెల్లించే సమయంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రొప్రయిటర్‌గా సంతకాలు చేసిన పత్రాలను కోర్టుకు సమర్పించారు. గత విచారణ సమయంలో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం.. ఒక చోట హెచ్యూఎఫ్గా, మరో చోట ప్రొప్రయిటర్‌గా క్లెయిమ్ చేసుకున్నారేమిటి అని రామోజీరావు తరఫు న్యాయవాదుల్ని ప్రశ్నించిన విషయం విదితమే. ఉండవల్లి అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు ఇలా.. 1990 తొలినాళ్లలో నా కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు, స్నేహితులు వారు సంపాదించిన సొమ్మును మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో పెట్టుబడి పెట్టారు. బలమైన కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నా కుటుంబ సభ్యులు రామోజీరావుకు చెందిన మార్గదర్శిలో ఇన్వెస్ట్ చేశారు. మీడియా, వ్యాపారం అనుసంధానం చేయబోరని భావించనందువల్లే ఇలా చేశారు. 16 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు డిపాజిట్లు రెన్యువల్ చేస్తూనే ఉన్నారు. అయితే, 2006లో మెచ్యూరిటీ తర్వాత డిపాజిట్లు రూ.లక్ష కన్నా తక్కువ ఉన్నాయని రెన్యువల్ చేయలేదు. దీనికి సంబంధించి మార్గదర్శి ఫైనాన్సియర్స్ జారీ చేసిన డిపాజిట్ బాండ్లలో హెచ్‌యూఎఫ్ కర్త హోదాలో, చెక్‌పైన మార్గదర్శి ఫైనాన్సియర్స్ తరపున ప్రొప్రయిటర్‌గా రామోజీరావు సంతకం చేయడం గమనించాను. ఇదే విషయాన్ని సహచర న్యాయవాద స్నేహితులు, ఆడిటర్లతో చర్చించా. ఆర్బీఐ యాక్టు, 1934 సెక్షన్ 45ఎస్ ప్రకారం 1997 తర్వాత ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం చట్ట ప్రకారం శిక్షార్హమైనదని, మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిబంధనలు ఉల్లంఘించిందని వారు తెలిపారు. రామోజీరావు లాంటి వ్యక్తి అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నారంటే నమ్మలేకపోయా. ఆంధ్రప్రదేశ్‌లోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల అక్రమాలను బహిర్గతం చేయడంలో ఈనాడు సహా పలు పత్రికలు కీలకపాత్ర పోషించాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌లో రిజిస్టర్ అయ్యేవి. బ్యాంకింగ్ వ్యాపారానికి ఆర్బీఐ నుంచి లైసెన్సు పొందేవి. వాటిలో అక్రమాలపై ఈనాడు సహా పలుపత్రికలు కథనాలు ప్రచురించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. 45 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల మొత్తం డిపాజిట్ల విలువ రూ.630 కోట్లు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ది పూర్తిగా చట్ట విరుద్ధమైన వ్యాపారం. ఆర్బీఐలో రిజిస్టర్ కాలేదు. ఏపీ ప్రభుత్వంలో రిజిస్టర్ కాలేదు. దేశంలో ఎక్కడా రిజిస్టర్ కాలేదు. అన్ ఇన్కార్పొరేటెడ్ బాడీగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై 1997 నుంచి ఎవరి నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా నిషేధం కూడా ఉంది. ఆ నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్లు స్వీకరించినందున రెండేళ్ల వరకు జైలు శిక్షకు అర్హులు. 45 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల డిపాజిట్లు మొత్తం రూ.630 కోట్లు అయితే మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఒక్కటే చట్ట విరుద్ధంగా సుమారు 2.75 లక్షల మంది నుంచి రూ. 2,600 కోట్లు సేకరించింది. 2006 మార్చి 31 నాటికి రూ.1,400 కోట్లు నష్టం కాగా, ఏడాది తర్వాత రామోజీరావు హెచ్‌యూఎఫ్ మొత్తం నష్టం రూ.1,800 కోట్లకు చేరుకుంది. ఈ నష్టాలు కేవలం సాంకేతిక నష్టాలు మాత్రమేనని రామోజీరావు వివరించడానికి ప్రయత్నించారు. అయితే, చాలా మంది ఆర్థిక నిపుణులు సాంకేతిక నష్టాలు అంటే అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్థిక స్థితి ఏ వార్తాపత్రికలోనూ ప్రచురించలేదు. లేదా డిపాజిటర్లు ఎవరికీ పంపిణీ చేయలేదు. వ్యాపారమంతా గుట్టుగా సాగిపోయింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరు వెబ్సైట్లో ఎప్పుడూ కనిపించలేదు. ఆశ్చర్యకరంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు ఉద్దేశపూర్వకంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్ విభాగం ద్వారా డిపాజిట్లు సేకరిస్తున్నారనే అభిప్రాయం కలిగించడానికి కనీసం సైన్ బోర్డులు కూడా ఉంచలేదు. ఈ విషయంపై 2006 నవంబరు 6న ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేశాను. డిపాజిటర్ల ప్రయోజనాల రీత్యా తగిన చర్యల కోసం ఆ కా>పీని అప్పటి ఏపీ సీఎంకు పంపించాను. అయితే, రామోజీరావు తాను చేస్తున్న భారీ అక్రమ వ్యాపారానికి క్షమాపణ చెప్పడానికి బదులు పత్రికా స్వేచ్ఛ మసుగులో బయట పడటానికి తీవ్రంగా ప్రయత్నించారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే రాజకీయ నాయకులందరూ వాస్తవాలు, గణాంకాలు ధ్రువీకరించకుండానే రామోజీరావుకు మద్దతు తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నించారు. చట్టం నుంచి తప్పించుకొనేందుకు ఒకరికి సహకరిస్తున్నామని వారందరూ మర్చిపోయారు. నా ఫిర్యాదు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం 2006 నవంబరు 6న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని నియమించింది. ఆ కమిటీకి రామోజీరావు సమాచారం ఇవ్వలేదు. పైగా, కమిటీ నియామకాన్ని సవాల్ చేశారు. హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కమిటీకి సహకరించడానికి రామోజీరావు నిరాకరిస్తున్నందున జుడిషియల్ మేజిస్ట్రేట్ నిర్దిష్ట ఆదేశాలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆవరణలో ప్రభుత్వం సోదాలు నిర్వహించింది. దురదృష్టవశాత్తు ఎల్కే అడ్వాణీ, నరేంద్రమోదీ, జయలలిత, ములాయం సింగ్ యాదవ్, కులదీప్ నయ్యర్, ఎడిటర్ ఎన్. రామ్ వంటి పెద్దలంతా ప్రభుత్వం చేస్తున్న సోదాలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారు. పత్రికల్లో ఎడిటోరియల్స్ కూడా రాశారు. పార్లమెంటులో, ఇతర ప్రాంతాల్లో నా సహచరులతో మాట్లాడుతున్నప్పుడు సమస్యపై విస్తత ప్రచారం జరిగినా సమాజంలో ఇంకా గందరగోళంగానే ఉన్న విషయాన్ని గ్రహించాను. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించడానికి వీలుగా అన్ని పత్రాలు కోర్టుకు సమర్పిస్తున్నాను’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అదనపు డాక్యుమెంటులో పేర్కొన్నారు. కోర్టుకు పలు పత్రాలు సమర్పించిన ఉండవల్లి తన తల్లి వి. లక్ష్మి సుబ్బారావు చేసిన డిపాజిట్లు, చెల్లింపు నిమిత్తం అందించిన చెక్కులను కూడా ఉండవల్లి అరుణ్‌కుమార్ పొందుపరిచారు. మార్గదర్శి రిజిస్టర్ హోల్డర్లయిన వి.లక్ష్మి సుబ్బారావు.. మీ నుంచి రూ.84,324 డిపాజిట్‌గా స్వీకరిస్తున్నామని 2006 మార్చి 23న కర్త ఆఫ్ హెచ్యూఎఫ్గా రామోజీరావు సంతకం చేసిన పత్రం, వి.లక్ష్మి సుబ్బారావు పేరిట 2006 నవంబర్ 3న మార్గదర్శి ఫైనాన్సియర్స్ ప్రొప్రయిటర్‌గా రామోజీరావు సంతకం చేసిన హెచ్డీఎఫ్సీ చెక్కును కూడా అదనపు డాక్యుమెంటుతో పొందుపరిచారు. నాటి ఆర్థిక మంత్రి చిదంబరానికి రాసిన లేఖ, మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఏర్పాటు, వ్యాపారం తదితర వివరాలు, బ్యాలెన్స్ షీట్లు, డిపాజిట్లు సేకరించొద్దని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఆర్బీఐ ఆదేశించిన పత్రాలు కూడా కోర్టుకు సమర్పించారు. -
మార్గదర్శి కేసు.. రామోజీకి బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, ఢిల్లీ: మార్గదర్శి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇంటరిమ్ అప్లికేషన్ దాఖలు చేశారు. అప్లికేషన్లో పలు అదనపు డాక్యుమెంట్లను జతచేశారు ఉండవల్లి. అయితే, ఉండవల్లి అరుణ్‌కుమార్ తల్లి ఫిక్స్డ్ డిపాజిట్‌పై హెచ్‌యూఎఫ్ పేరుతో రామోజీరావు సంతకం చేశారు. కాగా, తిరిగి చెల్లింపుల సమయంలో చెక్కుపై ప్రోపైటర్ పేరుతో సంతకం చేశారు. ఈ క్రమంలో కీలక పత్రాలను ఉండవల్లి.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇక, ఒక చోట హెచ్‌యూఎఫ్ పేరుతో, మరోచోట ప్రోపైటర్ పేరుతో రామోజీరావు డబుల్ రోల్ పోషించారు. ఇదిలా ఉండగా, హెచ్‌యూఎఫ్ ప్రకారం డిపాజిట్లు స్వీకరిస్తే ఆర్బీఐ నిబంధనలు పాటించాలి. ప్రోపైటరీ ప్రకారం డిపాజిట్లు సేకరిస్తే చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరించాలి. చట్టాలను పాటించకుండా ఇష్టానుసారం రామోజీ వ్యవహరించారని ఉండవల్లి పేర్కొన్నారు. ఇక, తాజాగా ఉండవల్లి అరుణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధం. మార్గదర్శి అక్రమాలపై వచ్చే నెల 10 తర్వాత చర్చకు వస్తాను. రామోజీ సమక్షంలో టీడీపీ ప్రతినిధితో చర్చకు సిద్ధం. మార్గదర్శిని సపోర్ట్ చేస్తున్న టీడీపీతోనూ చర్చకు సిద్ధమన్నారు. మార్గదర్శి చేస్తున్నది తప్పు అని నేను చెప్పాను. చంద్రబాబు.. రామోజీని ఒప్పించి చర్చకు పాల్గొనేలా చేయాలి. టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా నాకు అభ్యంతరం లేదు. రామోజీ సమక్షంలోనైనా నేను చర్చకు సిద్దమన్నారు. ఛాలెంజ్ చేసిన వాళ్లు చర్చకు వస్తే నేను సిద్ధం అని స్పష్టం చేశారు. -
తప్పు ఒప్పుకున్నా ఇంకా సమర్థిస్తారా?
సాక్షి, అమరావతి: మార్గదర్శి సంస్థ వ్యవహారాల విషయంలో చట్టాన్ని ఉల్లంఘించినట్లు విచారణలో రామోజీరావే అంగీకరించాక కొందరు ఇంకా ఆయన్ను సమర్థించేందుకు ప్రయత్నించడం అసంబద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ చట్ట విరుద్ధంగా చందాదారుల సొమ్మును జాతీయ బ్యాంకుల్లో కాకుండా తమ అనుబంధ సంస్థలు, ఇతర చోట్ల పెట్టుబడిగా పెట్టినట్లు రామోజీనే అంగీకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరుతో అక్రమాలకు పాల్పడుతుంటే చట్టం కళ్లు మూసుకుని చూస్తూ ఊరుకోదని తేల్చి చెబుతున్నారు. మార్గదర్శి మరో అగ్రిగోల్డ్ కాకముందే డిపాజిట్‌దారులు, చందాదారుల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు తీసుకుందని పేర్కొంటున్నారు. ‘రామోజీరావు మార్గదర్శి అక్రమాలు –నిజానిజాలు’ అనే అంశంపై ఆదివారం విజయవాడలో స్వర్ణాంధ్ర పత్రిక నిర్వహించిన సదస్సులో పలువురు ప్రముఖులు, న్యాయ కోవిదులు పాల్గొని మాట్లాడారు. ఉపేక్షిస్తే మాఫియా సామ్రాజ్యమే – మాజీ ఎంపీ ఉండవల్లి రామోజీరావు ఆగ్రహిస్తేనో, ఈనాడు పత్రికల్లో వ్యతిరేకంగా రాస్తేనో ఏదో జరిగిపోయే రోజులు పోయాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. గతంలో రాజమండ్రిలో తనను ఓడించేందుకు రామోజీ ఎంతో ప్రయత్నించినా తాను గెలిచానని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పట్ల కూడా ఈనాడు అలాగే వ్యవహరిస్తోందన్నారు. అయితే అప్పుడు జరిగిందే రేపు కూడా జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘రామోజీరావు తాను చట్టాలను పట్టించుకోనంటారు. చట్టాలకు అతీతమన్నట్లుగా వ్యవహరిస్తారు. తనను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదని వాదిస్తారు. తాను ఆర్థిక అక్రమాలకు పాల్పడినా అడగకూడదని వితండవాదం చేస్తారు. 60 ఏళ్లుగా తన అక్రమాలను ఎవరూ ప్రశ్నించలేదు కాబట్టి ఇప్పుడూ అడగడానికి వీల్లేదని చెబుతారు. రామోజీరావు లాంటి వారిని వదిలేస్తే దేశంలో అతిపెద్ద మాఫియా సామ్రాజ్యం తయారవుతుంది’ అని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. నాడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్లు ‘మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలోనూ 2006లో రామోజీరావు అడ్డగోలుగా వాదించారు. హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్) కాబట్టి ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయవచ్చన్న రామోజీ వాదనను ఆర్బీఐ సమ్మతించలేదు. ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో తాము ప్రజల నుంచి రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించడం తప్పని రామోజీ ఆర్బీఐ వద్ద అంగీకరించారు. ఆ డిపాజిట్లను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. కానీ ఎవరెవరి నుంచి డిపాజిట్లు వసూలు చేశారో చెప్పమంటే వెల్లడించలేదు. ఆ డిపాజిట్‌దారుల వివరాలు తెలియచేయాలని ఇటీవలే సుప్రీం కోర్టు ఆదేశించింది. హాయిగా మంచంపై పడుకుని.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను నిర్వహిస్తున్న రామోజీరావు అసలు తాను కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని పట్టించుకోనని సీఐడీ విచారణలో వాదించడం బరితెగింపే. చిట్‌ఫండ్ సంస్థలు తమ చందాదారుల నుంచి వసూలు చేసే సొమ్మును జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని చట్టంలో ఉంది. కానీ ఆ నిధులను రామోజీరావు తన సొంత సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై రామోజీరావు, ఆయన కోడలిని విచారించేందుకు సీఐడీ అధికారులు వారి ఇంటికే వెళ్లాల్సి వచ్చింది. రామోజీరావు హాయిగా మంచంపై పడుకుని ఉంటే సీఐడీ అధికారులు ఏవో ప్రశ్నలు అడిగి వచ్చారు. దేశంలో ఇతరులకు అలా సాధ్యం అవుతుందా? పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తారు. రామోజీరావు కాబట్టి ఏదైనా చెల్లుతుంది. సహకార వ్యవస్థను దెబ్బతీసి అక్రమాలు సహకార బ్యాంకింగ్ వ్యవస్థను రామోజీరావే దెబ్బతీశారు. సహకార బ్యాంకులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయని ఈనాడులో పెద్ద వార్తలు రాసి మూతబడేలా చేశారు. కానీ అవే చట్టాలు తనకుగానీ, మార్గదర్శి సంస్థకు గానీ వర్తించవని చెబుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం? అక్రమాలను ప్రశ్నిస్తే కక్ష గట్టడమా? మార్గదర్శి ఫైనాన్సియర్స్ ప్రజల నుంచి రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేస్తే రామోజీరావు గ్రూపు సంస్థలు రూ.1,850 కోట్లు నష్టం చూపించాయి. మరి రామోజీరావు బోర్డు తిప్పేస్తే డిపాజిట్‌దారుల పరిస్థితి ఏమిటని నేను అడగడం తప్పా? మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అక్రమాలను నేను ప్రశ్నిస్తే రామోజీపై కక్ష గట్టానని కొందరు ఆడిటర్లు, న్యాయవాదులు వాదిస్తుండటం విడ్డూరం. రామోజీరావుకు, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు అసలు సంబంధం లేదంటూ రాజాజీ అనే వ్యక్తితో నాపై పరువునష్టం దావా వేయించారు. అప్పుడు ఈ ఆడిటర్లు, న్యాయవాదులు ఒక్కరైనా మాట్లాడారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ స్పందించారు ఏపీ విభజన చట్టమే తప్పు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నేను సుప్రీంకోర్టులో కేసు వేశా. దానిపై ఏపీ ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ కావాలని చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన్ను కలసి మరీ అభ్యర్థిస్తే పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలని ఓ ప్రెస్మీట్లో కోరా. వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆ కేసులో ఇంప్లీడ్ అవుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ స్పందించారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాల కేసులో సుప్రీంకోర్టులో నేను వేసిన కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇంïప్లీడ్ కాలేదు. ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఇంప్లీడ్ అవుతుందో అనే భయంతో రామోజీ ఈనాడులో టీఆర్ఎస్కు భజన చేస్తున్నారు. సచివాలయాన్ని నిర్మిస్తే మయసభ నిర్మించినట్టుగా పెద్ద పెద్ద వార్తలు వేసి కేసీఆర్‌ను ఖుషీ చేయడానికి ప్రయత్నించారు. అక్రమాలను అడ్డు్డకోవడం జగన్ బాధ్యత మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో జగన్ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరిస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసును సమగ్రంగా విచారించి సరైన పరిష్కరం చూపించాల్సిన బాధ్యత సీఎం జగన్‌పై ఉంది. మార్గదర్శి అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు న్యాయం చేయడం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల్లో అతి ముఖ్యమైంది. దాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత సీఎం జగన్‌పై ఉంది. టీడీపీతో చర్చకు సిద్ధంగా ఉన్నా చంద్రబాబు, మార్గదర్శి వ్యవహారాలపై చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో చంద్రబాబు ఎవరినైనా చర్చకు పంపాలి. సింగపూర్, దుబాయిలో చంద్రబాబు ఆస్తులు లాంటి కష్టమైన ప్రశ్నలు ఏవీ నేను అడగను. టీడీపీ ప్రభుత్వంలో వ్యవహారాలపైనే అడుగుతా. పోలవరం ప్రాజెక్ట్‌ను తామే కడతామని చంద్రబాబు ప్రభుత్వం అడిగి తీసుకుందా? లేక మీరే కట్టమని కేంద్రమే ఇచ్చిందా? దానికి సమాధానం చెబితే చాలు. కేంద్రం ఇస్తేనే తాము నిర్మాణ బాధ్యత తీసుకున్నానని చంద్రబాబు శాసనసభలో చెప్పారు. అది నిజం కాదని, చంద్రబాబు ప్రభుత్వం అడిగితేనే సమ్మతించామని నీతి ఆయోగ్ చెబుతోంది’ అని మాజీ ఎంపీ ఉండవల్లి పేర్కొన్నారు. బాబు – రామోజీ క్విడ్ ప్రోకో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించినా, అక్రమాలకు పాల్పడినా సరే అన్ని పార్టీలు రామోజీరావును కీర్తిస్తూ పోటీలు పడి మరీ ప్రకటనలు ఇస్తున్నాయి. చంద్రబాబు – రామోజీరావుకు మధ్య క్విడ్ ప్రోకో ఉంది. తన మాట వినలేదు కాబట్టే ఎన్టీ రామారావును ఈనాడు దించేసింది. ప్రస్తుతం చంద్రబాబు రామోజీరావు చెప్పినట్లే నడుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారంతా పోటీలు పడి మరీ రామోజీరావును సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు, జనసేన పార్టీలు కూడా రామోజీపై కేసు పెట్టడం తప్పని మాట్లాడుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించామని అంగీకరించిన రామోజీ మార్గదర్శి విషయంలో చట్టాన్ని ఉల్లంఘించినట్టు రామోజీరావే అంగీకరించాక ఆయన తప్పు చేయలేదని ఇతరులు ఎవరో మాట్లాడటం అసంబద్ధమని సుప్రీంకోర్టు న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ పేర్కొన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ చట్టాన్ని ఉల్లంఘించి చందాదారుల సొమ్మును జాతీయ బ్యాంకుల్లో కాకుండా ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్టు రామోజీ అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు సెక్షన్ 160 కింద నోటీసులివ్వడాన్ని కొందరు ఆడిటర్లు, న్యాయవాదులు ప్రశ్నించడం సరికాదని సత్యనారాయణ ప్రసాద్ స్పష్టం చేశారు. తమకు ఎవిడెన్స్ చట్టం 126 కింద మాత్రమే నోటీసులివ్వాలన్న వారి వాదన సత్యదూరమన్నారు. సెక్షన్ 126 అన్నది ఒక అర్జిదారు, అతడి న్యాయవాదికి సంబంధించిన వ్యవహారాలకే వర్తిస్తుందన్నారు. కేసు అంశాలపై మాట్లాడినవారికి సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుందని వివరించారు. ఈనాడును అడ్డం పెట్టుకుని మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు పాల్పడతామంటే ఎలా? అని ప్రముఖ పాత్రికేయుడు కేజీబీ తిలక్ ప్రశ్నించారు. చట్టాలు సక్రమంగా అమలయ్యేలా వాచ్‌డాగ్‌గా ఉండాల్సిన మీడియా కొందరి పెంపుడు కుక్కగా మారుతుండటం విషాదకరమన్నారు. సమాచార హక్కు చట్టం పూర్వపు కమిషన్ అంబటి సుబ్బారావు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పూర్వ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డితోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సదస్సుకు హాజరయ్యారు. -
‘మార్గదర్శిలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగాయి’
సాక్షి, తూర్పు గోదావరి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో దర్యాప్తు జరిపించాలని ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరుతున్నారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిట్స్‌కు సంబంధించి గతంలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చిన సమాచారాన్ని సీఐడీ అధికారులకు పంపుతున్నా. ఏపీ చిట్‌ఫండ్ యాక్ట్ 14(2) ప్రకారం సేకరించిన.. నగదు మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలి. కానీ, మార్గదర్శిలో అలా జరగలేదు అని ఉండవల్లి వెల్లడించారు. చట్ట విరుద్ధంగా డిపాజిట్‌దారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మార్గదర్శిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని, 2008లోనే వట్టి వసంత్‌కుమార్ ఫిర్యాదు చేశారు. మార్గదర్శి ఫైనాన్స్ షేర్‌పై నేను కేసు పెట్టే సమయానికి.. రూ.1,360 కోట్ల నష్టాల్లో ఉందని ఉండవల్లి వెల్లడించారు. సంస్థ నుంచి కనీస సమాచారం కూడా అధికారులకు ఇవ్వడం లేదు. రామోజీ సెలబ్రిటీ కాబట్టి ఇప్పటిదాకా చర్యలు చేపట్టలేదు. మార్గదర్శి చిట్స్‌లో జరిగే అవకతవకలపై ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటరు దాఖలు చేస్తామని మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు రెండు వారాలు గడువు ఇవ్వాలని, విచారణ వాయిదా వేయాలని కోరారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంశంలో ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిల ధర్మాసనం ముందుకొచ్చాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్లో కౌంటరు దాఖలుకు సమయం కావాలని, విచారణ వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కూడా ధర్మాసనాన్ని కోరింది. ఈ మేరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
మార్గదర్శిలో ఇంకా డిపాజిట్ల సేకరణ
సాక్షి, రాజమహేంద్రవరం: ‘మార్గదర్శి చిట్‌ఫండ్‌లో డిపాజిట్ల సేకరణ ఆపేసినట్లు 2006లో రామోజీరావు ప్రకటించారు. తీసుకున్న వాటిని తిరిగి చెల్లిస్తామని హైకోర్టు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ సైతం వేశారు. కానీ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికీ డిపాజిట్లు సేకరిస్తూనే ఉన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. డిసెంబర్ 2న మార్గదర్శి కేసు విచారణకు రానున్న నేపథ్యంలో శనివారం ఆయన రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్గదర్శి చిట్‌ఫండ్ పేరిట డబ్బులు సేకరించారని, గతంలో డిపాజిట్ అని ఉంటే.. ప్రస్తుతం దాన్ని రిసీట్గా మార్చి వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ‘డిపాజిట్లు తీసుకోను’ అని ఆర్బీఐకి రాసిచ్చిన వ్యక్తి.. చిట్‌ఫండ్ పేరు మీద ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మార్గదర్శి చిట్‌ఫండ్ మీదే రశీదు సైతం ఇస్తున్నారన్నారు. ఇలా సేకరించిన డబ్బును ఇతర వ్యాపారాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ‘బ్యాలెన్స్ షీట్లో మార్చి 31 నాటికి అవుట్ స్టాండింగ్ రూ.139 కోట్లు చూపించారు. అంటే చీటీ పాడుకున్న కస్టమర్లు ఏప్రిల్‌లో కట్టాల్సిన సొమ్మును మార్చి నెలలోనే ముందస్తుగా కట్టారా? మార్గదర్శికి 3 శాతం మంది కూడా డిఫాల్టర్లు లేరా? అందులో ఏదో కిటుకు దాగుంది’ అని అన్నారు. ఉండవల్లి ఇంకా ఏమన్నారంటే.. తప్పులకు మీడియా ముసుగు ► పెద్ద బ్యాంకులు, సహకార శాఖలకు సాధ్యం కాని వసూళ్లు ఇక్కడ జరుగుతున్నాయా? మనీ ల్యాండరింగ్ జరుగుతోందా? కట్టకుండానే కట్టినట్లు చూపిస్తున్నారా? దీనిపై ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందా? రామోజీ అంటే ప్రభుత్వానికి, అధికారులకు భయమా? ► ఇలాంటి వ్యక్తికి బ్యాంకులను అప్పగిస్తే అద్భుతంగా నడిపిస్తారేమో! రామోజీ తెలివితేటలకు పద్మ విభూషణ్ కాదు.. భారతరత్న ఇవ్వాలి. మార్గదర్శి కేస్ స్టడీని విదేశాల్లో యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చాలి. ► రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మార్గదర్శి కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలు చేస్తోంది. దీనిపై.. రామోజీరావు టీడీపీకి అనుకూలంగా ఉంటాడని, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని.. అందుకే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టిందని ఆయన పేపర్లో రాసుకుంటాడు. ► 2007లో ఇదే వాదనతో సుప్రీంకోర్టుకు వెళ్తే.. అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జి రవీందర్ ‘రామోజీరావు రెండు టోపీలు పెట్టుకుని తిరుగుతున్న వ్యక్తి. పారిశ్రామికవేత్తగా చేసిన తప్పులను ప్రభుత్వం పట్టుకుంటే మీడియా టోపీ పెట్టుకుని నేను జర్నలిస్ట్ కాబట్టి టార్గెట్ చేస్తున్నారని మీడియా ముసుగులో తప్పులను కప్పిపుచ్చుకుంటున్నాడు. నువ్వు తప్పు చేశావా? లేదా? అనేది అవసరం. రాజశేఖరరెడ్డి పేరు పర్సనల్‌గా పెట్టింది తీసేస్తున్నాం’ అని చెప్పింది చాలా మందికి గుర్తుండే ఉంటుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో విచారించాలి ► మార్గదర్శి కుంభకోణంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేసి విచారణ జరిపించాలి. ఆ స్థాయి వ్యక్తులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తారు. ఇటీవల రిటైర్డ్ అయిన ఎన్వీ రమణ.. మార్గదర్శి రికార్డులు పరిశీలించి రామోజీ చేస్తున్నది కరెక్ట్, ఉండవల్లి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని చెబితే నేను స్వాగతిస్తా. ► రాష్ట్ర ప్రభుత్వం నన్ను పిలిస్తే.. వారు స్వాధీనం చేసుకున్న రికార్డులు నేనూ చూస్తాను. లేదా ఆర్టీఐ ద్వారా ఇచ్చే వెసులుబాటు కలిగినవి నాకివ్వాలి. అప్పుడు నా ద్వారా మరింత సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఎవరి డబ్బులు వారికి ఇచ్చేశామని రామోజీ చెబుతున్నారు.. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను. రామోజీరావు ఈ విషయం నిరూపించాలి. ► రామోజీపై ఆరోపణలు చేస్తుంటే నేనూ, జగన్ కలిసిపోయామని వార్తలొస్తున్నాయి. చంద్రబాబు, జగన్ చేసిన మంచి పనులు ప్రచారం చేసేందుకు మీడియా ఉంది. చంద్రబాబు చేసిన తప్పులు బయటకు రాకపోవడం వల్లే అప్పట్లో బాబును విమర్శించాల్సి వచ్చింది. ప్రస్తుతం జగన్‌పై వ్యతిరేక వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. జగన్‌కు వ్యతిరేకంగా ఈనాడు అన్ని వార్తలు రాస్తున్నా ప్రభుత్వ ప్రకటనలు మాత్రం తగ్గాయా? సర్క్యులేషన్ నిబంధనల ప్రకారం ప్రకటనలు ఇవ్వాల్సిందే. ఈ లెక్కన మార్గదర్శిలో సైతం చట్టానికి లోబడే కార్యకలాపాలు నడవాలన్నదే నా ఉద్దేశం. -
రామోజీకి బ్యాంకులను అప్పగిస్తే అద్భుతంగా నడిపిస్తారేమో
-
‘తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ మీడియాను వాడుకుంటున్నారు’
సాక్షి, రాజమండ్రి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అరుణ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 2న మార్గదర్శి కేసు విచారణ ఉంది. డిపాజిట్ల సేకరణ ఆపేసినట్లు 2006లో రామోజీరావు చెప్పారు. డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని హైకోర్టు, సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. కానీ, ఇప్పటికీ డిపాజిట్లు వసూలు చేస్తూనే ఉన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ పేరు మీదే డబ్బు సేకరిస్తున్నారు. గతంలో డిపాజిట్ అని ఉండేది.. ఇప్పుడు రిసీట్ అని సేకరిస్తున్నారు. మార్చి 31 నాటికి ఔట్ స్టాండింగ్ రూ. 139 కోట్లుగా చూపించారు. మార్గదర్శికి 3 శాతం కూడా డీఫాల్టర్లు లేరు.. అందులో కిటుకు ఏంటి?. రామోజీకి బ్యాంకులను అప్పగిస్తే అద్భుతంగా నడిపిస్తారేమో. రామోజీ తెలివితేటలకు పద్మవిభూషణ్ కాదు.. భారతరత్న ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా మార్గదర్శిలో తనిఖీలు నిర్వహించింది. మార్గదర్శికి ఇవాల్టికీ రామోజీనే ఛైర్మన్.. కానీ, కోర్టులో మాత్రం ఆయన ఛైర్మన్ కాదంటున్నారు. రామోజీకి రెండు టోపీలు ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జీ చెప్పారు. రామోజీ టోపీల్లో ఒకటి మీడియా, రెండోది ఇండస్ట్రీయలిస్ట్. వ్యాపారవేత్తగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మీడియాను వాడుకుంటున్నారు. ఏ వ్యాపారమైనా చట్టానికి లోబడే చేయాల్సిందే. రామోజీ చట్టాన్ని ఉల్లంఘించినట్టు రికార్డులే చెబుతున్నాయి. మార్గదర్శి స్కామ్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలి’ అని డిమాండ్ చేశారు. -
రామోజీరావుపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు
సాక్షి, రాజమహేంద్రవరం: ఈనాడు రామోజీరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శికి డిపాజిట్లు సేకరించే హక్కు లేదు. మార్గదర్శికి, రామోజీరావుకు సంబంధం లేదంటూనే.. బ్యాలెన్స్ షీట్లో ఛైర్మన్‌గా రామోజీరావు సంతకం చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం డిపాజిట్లు సేకరించే హక్కు మార్గదర్శికి లేదు. మార్గదర్శికి రామోజీరావుకు సంబంధం లేదంటూనే.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడ్‌విట్‌లో మార్గదర్శి నాదే అని రామోజీ సంతకం చేశారు. సెక్షన్ 10 ప్రకారం ఏ చిట్‌ఫండ్ కంపెనీ వేరే వ్యాపారం చేయకూడదు. రామోజీరావు మార్గదర్శి డబ్బులను మిగతా వ్యాపారాలకు వాడుకున్నారు. హెచ్‌యూఎఫ్ డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధం. చిట్‌ఫండ్ కంపెనీ నడుపుతున్న రామోజీ ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది పచ్చి అబద్ధం. చట్టం అనేది కొరడా లాంటిది. కోర్టులో ఒకసారి చిట్‌ఫండ్ తనే అని రామోజీ అన్నారు.. మరోసారి కాదన్నారు. నేను చెప్పే ప్రతీ అంశానికి డాక్యుమెంటరీ ఆధారం ఉంది. మార్గదర్శి రామోజీదా? కాదా? అనేది తేల్చాలి. రామోజీరావుకు చిట్‌ఫండ్ కంపెనీకి సంబంధం ఉందా లేదా?. మార్గదర్శితో రామోజీకి సంబంధం లేకుంటే కేసు విత్‌డ్రా చేసుకుంటాను. రామోజీపై ఎలాంటి కేసులు పెట్టినా వెంటనే స్టే తెచ్చుకోగలరు. రామోజీరావు లాంటి వ్యక్తితో పెట్టుకోవడానికి ఎవరూ సాహసించరు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
రామోజీ ‘మేనేజ్మెంట్’కు ఇదో ఉదాహరణ
సాక్షి, రాజమహేంద్రవరం: ‘అక్రమంగా రూ.2,600 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేసిన మార్గదర్శి కేసులో రామోజీరావు రూ.6,000 కోట్లు జరిమానాగా కట్టాలి. రామోజీరావు వసూలు చేసిన డబ్బు కట్టేసి కేసు నుంచి బయటపడ్డారు. ఈ విషయం బయటకు రాకుండా చూశారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుట్టు చప్పుడు కాకుండా కేసు కొట్టేసింది’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో రామోజీరావు దిట్ట అనడానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కేసు కొట్టేసిన విషయం తనకు ఏడాది తర్వాత తెలిసిందన్నారు. డబ్బు చెల్లించడంలోనూ రిలయన్స్, కొన్ని సూట్‌కేస్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని ఆరోపించారు. రామోజీరావు కేసులో తాను తాజాగా స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే అందులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఆర్బీఐ, మరో పార్టీ వకాల్తా, కౌంటర్లు వేయలేదని తెలిపారు. అయినా వాదనలకు తేదీలు అడిగారన్నారు. ఈ కేసుకు తొందరేంటని చీఫ్ జస్టిస్ అనడం దారుణమన్నారు. హఠాత్తుగా 5వ తేదీన వాదనలకు నిర్ణయించారని, మంగళవారం రాత్రి 10వ తేదీకి మారిందని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అభిప్రాయాలు చెప్పకుండానే కేసు స్వీకరించేందుకు సిద్ధ పడ్డారంటే రామోజీరావు పలుకుబడిని అర్థం చేసుకోవచ్చన్నారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ మేరకు పనులు చేపట్టారో సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు బాధ్యుడని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు అన్నారని, అదే నిజమైతే నష్టానికి బాధ్యులెవరో తేల్చాలని అన్నారు. -
బీజేపీ ప్రత్యామ్నాయ శక్తికి.. కేసీఆర్ నాయకత్వం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: బీజేపీ ప్రత్యామ్నాయ శక్తికి నాయకత్వం వహించే సత్తా తెలంగాణా సీఎం కేసీఆర్‌కు ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. తాజాగా కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలసిన ఉండవల్లి సోమవారం రాత్రి రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. తాను మొదటి నుంచి బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పలు విషయాలపై చర్చించేందుకు కేసీఆర్ ఆహ్వానించారని తెలిపారు. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటు కావాలని కేసీఆర్ చాలా పట్టుదలతో ఉన్నారని, ఇందుకోసం ఆయన చాలా అంశాలపై లోతైన అధ్యయనం చేశారని ఉండవల్లి చెప్పారు. తమ మధ్య జాతీయ పార్టీ గురించి ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. బీజేపీ పరిస్థితిపై టీమ్ వర్క్ కేసీఆర్ వద్ద బీజేపీకి చెక్ పెట్టే అజెండా ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపించగలుగుతారని, ఆయనకు ఆ సామర్థ్యం ఉందన్నారు. ఒక జాతీయ పార్టీని బీజేపీకి వ్యతిరేకంగా తయారు చేయాలనే ఆలోచతో కేసీఆర్ ఉన్నారన్నారు. బీజేపీ పరిస్థితిపై ఒక టీమ్ వర్క్ చేస్తున్నారని చెప్పారు. మమతా బెనర్జీ కంటే కేసీఆర్ హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోగలరనే నమ్మకం తనకుందన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారంతా కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలన్నారు. ఈ దిశగా మమతాబెనర్జీ, స్టాలిన్, క్రేజీవాల్, అఖిలేష్‌యాదవ్ లాంటి వారు సిద్ధంగా ఉన్నారన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైరయ్యారని, కొనసాగే ఉద్దేశం తనకు లేదని చెప్పానన్నారు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు. ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు బీజేపీ ప్రభావం మరింత పెరిగితే దేశానికి నష్టం జరుగుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని, పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రధాన మోదీ దేశంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. సోనియా, రాహుల్‌గాంధీ.. ప్రతి ఒక్కరినీ కేసులతో ప్రశ్నించకుండా చేస్తున్నారని ఆక్షేపించారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో నాలుగైదు దేశాలు మన రాయబారులను పిలిచి నిరసన తెలియచేశాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. -
చంద్రబాబు, పవన్ కలిసే ఎన్నికలకు వెళ్లే అవకాశం
అజిత్‌సింగ్ నగర్ (విజయవాడ సెంట్రల్): దేశంలో మతపరమైన రాజకీయాలు పెరుగుతున్నాయని, మతోన్మాద శక్తుల వల్ల దేశ మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. దేశంలో మత రాజకీయాలు పెరుగుతున్నాయని, దీనివల్ల కలిగే ప్రమాదాలను గుర్తించి సామ్యవాదులు, లౌకికవాదులు బయటకు వచ్చి తమ గళాన్ని వినిపించాలని కోరారు. కాంగ్రెస్‌లో కీలక పదవులు అనుభవించిన కొందరు బీజేపీ అధికారంలో ఉందనో, ఏదో పదవి వస్తుందనే ఆశతో ఆ పార్టీలో చేరుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ కుల రాజకీయాలు రాష్ట్రంలో కూడా కుల రాజకీయాలు పెరుగుతున్నాయని ఉండవల్లి అన్నారు. 2014 నుంచి కమ్మ, రెడ్లు, కాపులంటూ ముసుగు తీసేసి మరీ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బాబు, పవన్ కలిసే పోటీ రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. బీజేపీ నిర్ణయం కోసం పవన్ ఎదురు చూస్తున్నట్టు ఉందన్నారు. టీడీపీతో కలిసేందుకు బీజేపీ కాదంటే పవన్ బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఈసారి త్రిముఖ పోటీ కన్నా ద్విముఖ పోటీనే ఉంటుందని వివరించారు. ఈడీ కేసులలో పెద్దగా శిక్షలు పడే అవకాశం లేదని, సీఎం జగన్మోహన్రెడ్డి కేసుల్లో కూడా జరిమానాలే తప్ప శిక్షలు ఉండకపోవచ్చని అన్నారు. -
సెంట్రల్ జైలు స్థలాల్లో క్రికెట్ స్టేడియం నిర్మించండి
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు విస్తరించి ఉన్న 200 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో స్టేడియం నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 1999లో ఆర్ట్స్ కళాశాలలో స్టేడియం నిర్మాణానికి నాటి సీఎం చంద్రబాబు శిలాఫలకం వేశారని, అప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత పాలన చేపట్టిన వైఎస్సార్ హయాంలో సెంట్రల్ జైలులోని సువిశాల స్థలంలో పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించడానికి ప్రతిపాదన చేశారని చెప్పారు. అది సాకారమవుతున్న సమయంలో ఆయన మృతి చెందడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయిందన్నారు. అప్పట్లో స్టేడియం నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తూ జైలు శాఖ ఇచ్చిన ఉత్తర్వుల నకలును కూడా లేఖకు జత చేశారు. -
రాష్ట్రాల విభజనకు మార్గదర్శకాలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్‌లో రాష్ట్రాల విభజన చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో సవరణ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు జతగా ఈ సవరణ పిటిషన్‌ను ఉండవల్లి తరఫు న్యాయవాది రమేశ్ అల్లంకి దాఖలు చేశారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులు ఏపీ విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో గతంలో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విభజన జరిగి 8 ఏళ్లు పూర్తవుతుండటంతో.. భవిష్యత్‌లో రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చినా.. వాస్తవ రూపం దాల్చే అవకాశాలు లేకపోవడంతో ఉండవల్లి ఈ పిటిషన్ వేశారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని తేలితే దాన్ని ప్రకటించాలని.. భవిష్యత్‌లో ఏదైనా రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాటించేందుకు తగిన మార్గదర్శకాలివ్వాలని కోరారు. విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి కేంద్రం మద్దతిచ్చేలా తగిన ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. -
మోదీ వ్యాఖ్యలపై చర్చకు నోటీసు ఇవ్వండి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై పార్లమెంట్లో చర్చకు డిమాండ్ చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. మోదీ మాట్లాడిన అంశాలపై ఏపీ ఎంపీలు నోటీసు ఇవ్వాలని కోరారు. బుధవారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో చర్చ జరిగితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం దేశానికి తెలుస్తుందని అన్నారు. చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి మెజార్టీతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజన చేశారన్నారు. ఇటీవల రాజ్యసభలో ఏపీపై చర్చ జరుగుతున్న సందర్భంలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి షెడ్యూల్ 9, 10లలో ప్రస్తావించిన 150 సంస్థల విషయం ఎనిమిదేళ్లు అవుతున్నా కేంద్రం తేల్చకపోవడం అన్యాయమన్నారు. -
పెంచిన జీతాలు వద్దనడం చిత్రం: ఉండవల్లి
రాజమహేంద్రవరం సిటీ (తూర్పుగోదావరి జిల్లా): ప్రభుత్వ ఉద్యోగులు పాత జీతాలు కావాలంటూ సమ్మె నోటీసు ఇవ్వడం విచిత్రంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విస్మయం వ్యక్తం చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. కొత్త పీఆర్సీ అమలు చేయడం వల్ల రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతోందని ప్రభుత్వం అంటుంటే.. మాకు పెంచిన కొత్త జీతాలు వద్దు పాత జీతాలే చాలంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక దుస్థితిని దృష్ట్యా ఉద్యోగులు సమ్మెను ఆపవలసిందిగా ప్రార్థిస్తున్నానన్నారు. -
కరోనా వేళ ఆదుకున్న నవరత్నాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలందరినీ ఎంతో ఆదుకున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలందరికీ రూ.5 వేలు, రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేస్తే వాళ్లు ఖర్చు పెట్టుకుంటారని, దీనివలన ఆర్థికంగా అందరికీ బాగుంటుందని మేధావులు చెప్పారని పేర్కొన్నారు. అదేవిధంగా నవరత్నాల పథకాల ద్వారా సీఎం జగన్ ప్రజలను ఆదుకున్నారని చెప్పారు. ఇటువంటి పథకాలు తమకెందుకు అమలు చేయడం లేదంటూ ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడ్డారన్నారు. జగన్ సీఎం అయ్యాక వివిధ సంక్షేమ పథకాల కింద రాష్ట్రంలోని పేద ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.లక్ష కోట్లు జమచేశారని చెప్పారు. ఇన్ని పథకాలు అందిస్తూ మంచిపేరు తెచ్చుకున్న జగన్ పోలవరం నిర్వాసితుల పట్ల కూడా ఇదే విధానం అమలు చేయాలని కోరారు. 2013లో భూసేకరణ చట్టం రాకముందే భూసేకరణలో అదే విధానాలను దివంగత వైఎస్సార్ అమలు చేశారని చెప్పారు. ఇండియాలోనే పవర్ఫుల్ సీఎం అయిన వైఎస్సార్ విధానాలను అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే అవి మరింత ముందుకు వెళతాయంటూ మేధాపాట్కర్ కితాబిచ్చారని గుర్తుచేశారు. నదీజలాల వివాదంలో జగన్, కేసీఆర్ స్నేహపూర్వకంగా మాట్లాడుకోవాలని సూచించారు. -
ప్రైవేటీకరించే అధికారం మీకెక్కడిది?
సీతంపేట (విశాఖ ఉత్తర): కేవలం 30 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వాళ్లకు ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే అధికారం ఎక్కడిదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్, ఎల్ఐసీని ఎలా అమ్మేస్తారని నిలదీశారు. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఉండవల్లి ప్రసంగించారు. స్టీల్ ప్లాంట్‌కు భూములిచ్చిన ఏడు వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారికి న్యాయం చేయకుండా వేరే వారికి ప్లాంటును ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఈ రోజు సోషలిజం వర్సెస్ క్యాపిటలిజం నడుస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రాన్ని నిలదీయాలన్నారు. కేంద్రంపై వైఎస్ జగన్ మాత్రమే పోరాటం చేయగలరని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. దేశ బడ్జెట్‌తో సమానమైన సొమ్ము కేవలం 63 మంది వద్ద ఉందంటే.. ఇది సోషలిస్టు దేశమా లేక క్యాపిటలిస్టు దేశమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఆర్టీఐ కమిషనర్ మాడభూషి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్ కోసం పార్టీలన్నీ ఏకం కావాలి: ఉండవల్లి
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా రాజకీయాలకతీతంగా పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పాటైన తొలి ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేటుపరం చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సహా అన్ని పక్షాలు స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయకుండా ఉండే వరకైనా కలిసి ఉండాలన్నారు. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని నష్టాల పేరుతో బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకునేలా రాష్ట్రంలోని పార్టీలన్నీ తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం ఒక్కటే మన ముందున్న మార్గమన్నారు. -
సీఎం లేఖపై చర్చ జరగాల్సిందే
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై చీఫ్ జస్టిస్‌కు సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై చర్చ జరగాల్సిందేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్న లోపాలపై లేఖలు రాయడం కొత్తేమీ కాదని.. 1961లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి చంద్రారెడ్డిపై అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారని ఆయన గుర్తుచేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. బాబు హయాంలో జస్టిస్ రమణ ఏజీ జస్టిస్ ఎన్వీ రమణపై అవినీతి ఆరోపణలు కొత్తేమీ కాదని.. 2005లో రిటైర్డ్ జడ్జి బీఎస్ఏ స్వామి న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేస్తూ రాసిన పుస్తకంలో జస్టిస్ రమణ గురించి ఒక పేరాలో ప్రస్తావించారని వివరించారు. చంద్రబాబు హయాంలో రమణ అడ్వకేట్ జనరల్‌గా కూడా పనిచేశారన్నారని గుర్తుచేశారు. గ్యాగ్ ఆర్డర్ సరికాదు.. అలాగే, రాజధాని భూబాగోతంలో జరుగుతున్న దర్యాప్తుపై రాష్ట్ర హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం సరికాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వారిపై ఏమన్నా మాట్లాడితే కోర్టులు ఒప్పుకోవనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందన్నారు. జడ్జీలు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలన్నారు. హైకోర్టులో రాష్ట్ర డీజీపీతో ఐపీసీ సెక్షన్–151 చదివించారని, అంత అవసరమా? మేం రాష్ట్ర ప్రభుత్వం కన్నా బలవంతులమని చెప్పాలనుకుంటుందా అని ఉండవల్లి ప్రశ్నించారు. లెజిస్లేచర్‌కు, జ్యుడీషియరీకి ఉన్న సంబంధం చెడిపోతే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని ఉండవల్లి తెలిపారు. పార్లమెంట్ ద్వారానే రమణ నియంత్రణ జస్టిస్ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోవాలంటే పార్లమెంట్లో అభిశంసన జరగాలన్నారు. ఇది ఆమోదం పొందాలంటే లోక్‌సభలో వంద మంది, రాజ్యసభలో 50 మంది ఎంపీల మద్దతు అవసరమన్నారు. సీఎం వైఎస్ జగన్ కేసులపై ఆయన స్పందిస్తూ.. వీటిల్లో ఆయనకు శిక్షపడే అవకాశం లేదన్నారు. ‘సుప్రీం’ సీజేకు నేనూ లేఖ రాశా రాష్ట్రంలో రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల ట్రయల్స్ లైవ్ టెలీకాస్ట్ ఇవ్వాలంటూ ఈ నెల 13న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు తాను లేఖ రాసినట్లు మాజీ ఎంపీ వెల్లడించారు. చంద్రబాబు కేసులను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జడ్జీల నియామకానికి పరీక్షలు లేవని ఉండవల్లి చెబుతూ.. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉండగా పాదాలు పట్టుకున్న వారిని జడ్జీలుగా నియమించారని ఆరోపించారు. చట్టం ముందు అందరూ సమానమే అనడం తప్పని.. అలా అయితే చంద్రబాబుపై ఉన్న కేసుల పురోగతి మాటేమిటని ప్రశ్నించారు. అలాగే, మార్గదర్శిపై తాను వేసిన కేసు తనకు తెలియకుండానే ఉమ్మడి హైకోర్టు 2018లో కొట్టివేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని ఉండవల్లి స్పష్టంచేశారు. -
రామోజీరావుకు సుప్రీం నోటీసులు
-
రామోజీరావుకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: మార్గదర్శి కేసులో రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది. కాగా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని మాజీ ఐజీ కృష్ణంరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్యుఎఫ్ (హిందూ జాయింట్ ఫ్యామిలీ) వ్యక్తుల సమూహం కాదని, ఆర్బీఐ నిబంధనలు వర్తించవని ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు జస్టిస్ రజిని రామోజీరావుపై కేసును కొట్టివేశారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఇంప్లీడ్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. (మార్గదర్శి కేసులో.. ఉండవల్లి పిటిషన్ స్వీకరణ) -
జగన్‌కు ప్రజల్లో 51 శాతం ఆదరణ
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రజల్లో జగన్‌కు 51 శాతం ఆదరణ ఉందని, అతనిని ఎవరూ ఏమీ చేయలేరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు జగన్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యంగా ఉండాలన్నారు. రాజశేఖరరెడ్డి చొరవతో కాలువల నిర్మాణం జరగడం వల్లనే చంద్రబాబు పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వగలిగాడన్నారు. వైఎస్సార్ ఆలోచనను 14 ఏళ్ల తరువాత జగన్ నిజం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయమై జగన్‌కు బుధవారం లేఖ రాశానని చెప్పారు. -
మార్గదర్శి కేసులో.. ఉండవల్లి పిటిషన్ స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయాలన్న అభ్యర్థనకు సుప్రీంకోర్టు సమ్మతించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందని, ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల రెండున్నరరెట్ల జరిమానా చెల్లించాల్సి రావడంతో పాటు.. రెండేళ్ల జైలుశిక్ష పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. హైకోర్టు విభజనకు ఒక రోజు ముందు కేసు కొట్టేశారు ‘తమపై ఉన్న క్రిమినల్ కంప్లయింట్‌ను కొట్టేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విచారించి డిసెంబరు 31, 2018న కొట్టేసిందని పిటిషన్లో మేం వివరించాం. రెండు రాష్ట్రాల్లోనూ డిపాజిట్లు సేకరించినందున ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఇంప్లీడ్ చేయాలని మేం కోర్టును కోరగా అందుకు అంగీకరించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు మీడియాలో రాలేదు. ఎవరికీ తెలియదు. ఇలాంటి మరో కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి కలిసినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు విషయం తెలుసుకుని సుప్రీంకోర్టులో అప్పీలు చేశాం. ట్రయల్ కోర్టులో స్టేలు తెచ్చుకుని పుష్కరకాలం పాటు మార్గదర్శి కేసు ఆపుతూ వచ్చారు. డిపాజిటర్లు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ తెలంగాణను మాత్రమే పార్టీగా చేశారు. ఉమ్మడి హైకోర్టు ఆఖరి పనిదినం రోజున క్వాష్ చేయించుకున్నారు. కేసు కాలగర్భంలో కలిసిపోయిందనుకున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంలో అప్పీలు చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా భాగస్వామిని చేయాలని కోరాం. ఐపీఎస్ అధికారి కృష్ణరాజును కూడా కేసులో చేర్చారు. తదుపరి విచారణ నిర్వహిస్తామని కోర్టు చెప్పింది. రుజువైతే రూ.7 వేల కోట్ల జరిమానా చెల్లించాలి ఆర్బీఐ సెక్షన్ 45 (ఎస్) ప్రకారం హిందూ అవిభక్త కుటుంబం డిపాజిట్లు సేకరించకూడదని మా వాదన. దీనిని ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేస్తే రెండున్నర రెట్ల జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసినందున రూ. 7 వేల కోట్ల మేర జరిమానా చెల్లించాల్సి వస్తుంది. డిపాజిట్లు వెనక్కి ఇచ్చినా సరే.. నేరానికి పాల్పడినందున శిక్ష తప్పదు. కృష్ణరాజు వేసిన కేసులో ఏనాడూ విచారణ జరగనివ్వలేదు. కాలు నొప్పి, చేయి నొప్పి, కాగితం సరిగా టైప్‌కాలేదు వంటి అనేక కారణాలు చెబుతూ విచారణకు అడ్డుపడుతూ వచ్చారు. తేడా ఉంది కాబట్టే విచారణకు నిలబడడానికి అంగీకరించలేదు. మేనేజ్మెంట్ టెక్నిక్స్‌తో ఎలాగోలా బయటపడాలని చూశారు. దేశంలో ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వులు నిరూపించాయి. సుమారు రూ.7 వేల కోట్ల ఆర్థిక నేరానికి సంబంధించిన కేసు ఇది. ఆర్థిక నేరాల్లో విచారణ జరగకుండా క్వాష్ చేయడానికి వీల్లేదని సుప్రీం గతంలో తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే అప్పీలు చేసుంటే మాకు ఈ అవసరం ఉండేది కాదు. ఇదే హైదరాబాద్ (ఉమ్మడి) హైకోర్టులో ఈ తీర్పు వెలువడడానికి రెండు నెలల ముందు ఇదే తరహా కేసులో ఇంకో న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. రామోజీరావు కేసులో వచ్చిన తీర్పునకు పూర్తి విభిన్నంగా ఉంది. న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం రూ. 2,600 కోట్ల మేర వసూలు చేసిన అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి, పద్మవిభూషణ్ పురస్కారం పొందిన వ్యక్తి విచారణకు కోర్టుకు రానని చెబితే, తప్పించుకునే మార్గం గనక చట్టం చూపిస్తే.. ఇక చట్టం డబ్బున్న వాళ్లకు ఒకటి.. లేనివాళ్లకు ఒకటి అనుకోవాల్సి వస్తుంది. ఈరోజు పిటిషన్‌ను సుప్రీం అనుమతించడం ద్వారా అలా అనుకోవాల్సిన అవసరం లేదన్న భావన ఏర్పడింది. కచ్చితంగా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాం’ అని ఉండవల్లి పేర్కొన్నారు. ఆయన తరపు న్యాయవాదులు ఎస్.సత్యనారాయణ ప్రసాద్, అల్లంకి రమేష్‌లు కూడా కేసు గురించి విలేకరులతో మాట్లాడారు. -
చంద్రబాబు పాలనలో పారదర్శకత లేదు
దేవీచౌక్ (రాజమహేంద్రవరం): చంద్రబాబు పాలనలో పారదర్శకత అనేది లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పారదర్శకతతో కూడిన అవినీతిరహిత పాలనను అందిస్తానని రాష్ట్ర నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ తన తండ్రిలాగే ముక్కుసూటిగా మాట్లాడారని అభినందించారు. చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంపుదలకు ప్రాజెక్టు అథారిటీ అనుమతి తీసుకున్నారా? కేబినెట్ ఆమోదం తెలిపిందా? అని తాను అధికారులను అడిగితే ఇప్పటివరకు సమాధానం లేదన్నారు. రాజధాని ప్రకటన వెలువడ్డాక, అక్కడ భూముల కొనుగోలుపై రికార్డుల తనిఖీకి అనుమతి కోరితే దానికీ స్పందించడం లేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన అధికారులతో జగన్ మాట్లాడాలని, రేపోమాపో నీళ్లు ఇస్తామనే బూటకపు హామీలు ఇవ్వకుండా వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని కోరారు. కేంద్రం నుంచి మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినవాటిపై వెనుకకు తగ్గకుండా పోరాడాలన్నారు. చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ఒంటి చేత్తో 50 శాతం ఓట్లు తెచ్చుకున్నారని ఉండవల్లి కొనియాడారు. జగన్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాలని, ఏ చిన్న తప్పు దొర్లినా పెద్దదిగా చూపే ప్రయత్నాలు జరుగుతాయన్నారు. బాబు వాగ్దానాలను ప్రజలు నమ్మలేదని, మితిమీరిన ప్రచారమే టీడీపీని దెబ్బకొట్టిందన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే.. అక్కడ కూడా అధిక స్థానాల్లో టీడీపీకి ఎందుకు ఓటమి ఎదురైందని ప్రశ్నించారు. నాడు జగన్ అసెంబ్లీలో ఏ అంశం లేవనెత్తినా లక్ష కోట్ల అవినీతి అని నానా యాగీ చేశారని, దానితో ఆయన ప్రజల మధ్యకు వెళ్లి ఘనవిజయం సాధించారని చెప్పారు. సీఎంగా జగన్ అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. -
వైఎస్ కీర్తి దేదీప్యమానం
సాక్షి, హైదరాబాద్: జీవితంలో చివరి క్షణం వరకు సమాజ క్షేమం, అందరిలో చెరగని చిరునవ్వును కోరుకున్న అరుదైన మహానాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కీర్తి తెలుగుజాతి ఉన్నంత వరకు నిరంతరం దేదీప్యమానమై నిలిచి ఉంటుందని ఆయనతో పని చేసిన నాయకులు, అధికారులు కీర్తించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రచించిన ‘వైఎస్సార్‌తో ఉండవల్లి అరుణ్ కుమార్ ’పుస్తకాన్ని మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ఆవిష్కరించి తొలి ప్రతిని వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు సతీమణి సునీతకు అందజేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రోశయ్య మాట్లాడుతూ వైఎస్‌తో తనకు రాజకీయాల్లోకి రాకముందు నుంచే మిత్రత్వం ఉందని, అదే స్నేహభావం చివరి క్షణం వరకు చెక్కు చెదరలేదన్నారు. వైఎస్ అంటే మంచి స్నేహితుడు, కల్లాకపటం లేనివాడు, ఓ అరుదైన మిత్రుడిగా చెప్పొచ్చని రోశయ్య అన్నారు. రాజకీయాల్లో ఇంకా ఉండాల్సిన సమయం, వయసు ఉన్నా ఆయన దూరమవడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ సన్నిహితుడు కేవీవీ రామచంద్రరావు మాట్లాడుతూ 2004 మే 14న వైఎస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే ఆయనతో జ్ఞాపకాలను అందరితో పంచుకుంటున్నానని, 1966 నుంచి 2009 సెప్టెంబర్ 2 వరకు వైఎస్‌తో కలసి నడిచే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. వైఎస్, తాను అవిభక్త కవలలమని, వైఎస్‌కు తనతోపాటు అందరూ ఆత్మబంధువులేనని చెప్పారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలతో ఆయన నిజమైన పేదలకు మేలు చేశారన్నారు. దేశం గర్వించే అతికొద్ది మంది నాయకుల్లో రాజశేఖరరెడ్డి అగ్రగణ్యుడని కేవీపీ కితాబిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ వైఎస్‌తో తనకు తక్కువ సాన్నిహిత్యమే ఉన్నా ఆయన గొప్ప ప్రజానాయకుడన్నారు. తెలుగునాట ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రజానాయకులుగా ప్రజల్లో ముద్రపడ్డారన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజారంజక పాలన చేసే వారే చరిత్రలోనిలిచిపోతారని చలమేశ్వర్ అన్నారు. మహానాయకుడాయన: మాజీ ఐఏఎస్‌లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఓ మహానాయకుడు, గొప్ప విలక్షణ మనస్తత్వం ఉన్న నాయకుడని పుస్తకావిష్కరణలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మోహన్ కందా, రమాకాంత్‌రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావులు కితాబిచ్చారు. 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన తనకు తిరిగి వైఎస్ ప్రభుత్వంలోనూ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అరుదైన అవకాశం దక్కిందని మోహన్ కందా గుర్తుచేసుకున్నారు. వైఎస్ పాదయాత్ర అనుభవాలతో ఆరోగ్యశ్రీ లాంటి బృహత్తర పథక రూపకల్పన జరిగిందని, అందులో తామంతా భాగస్వాములం కావడం సంతోషకరమని మరో మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీలు ఎస్ఎస్పీ యాదవ్, అరవిందరావు, మాజీ ఐఏఎస్ ప్రభాకరరెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రాచమంద్రమూర్తి, ఉండవల్లి అరుణ్కుమార్సతీమణి జ్యోతి, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ తదితరులు మాట్లాడగా ఎమెస్కో విజయ్‌కుమార్ సభకు సమన్వయకర్తగా వ్యవహరించారు. మా అమ్మ ఆకాంక్షను వైఎస్ నెరవేర్చారు: ఉండవల్లి జ్యోతి ‘అరుణ్, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మా అమ్మానాన్న ఎంతో వ్యతిరేకించారు. అనేక మంది తాడూ, బొంగరం లేనివాడికి మీ అమ్మాయినిస్తారా అని వారిని ప్రశ్నించారు. రిటైర్మెంట్ తర్వాత పింఛన్ వచ్చే ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా చేయాలని అరుణ్‌కుమార్‌కు మా అమ్మానాన్న అనేకమార్లు సూచించినా ప్రభుత్వ ఉద్యోగం ఆయన వల్ల కాలేదు. రాజకీయాలంటేనే అమితంగా ఇష్టపడే అరుణ్ కుమార్‌ను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లిన ఘనత వైఎస్ గారిదే. మా అమ్మ కోరుకున్నట్లు ఈరోజు మాజీ ఎంపీగా పింఛన్ పొందుతున్నారు. ఈరోజు మా అమ్మా,నాన్నల ఆకాంక్ష వైఎస్, కేవీపీ వల్లే నెరవేరింది. వైఎస్సార్ అంటేనే ఒక భరోసా’ అని ఉండవల్లి జ్యోతి అన్నారు. సునీత ప్రేరణతోనే పుస్తకం... వైఎస్‌తో నాకున్న అనుబంధాన్ని పుస్తక రూపంలో తీసుకు రావడానికి ప్రేరణ.. కేవీపీ రామచందరరావు సతీమణి సునీత. వైఎస్ మరణాంతరం ఎప్పుడు కేవీపీ ఇంటికి వెళ్లినా వైఎస్సార్‌కు సంబంధించిన జ్ఞాపకాలే చర్చలో వచ్చేవి. వైఎస్‌తో జ్ఞాపకాలు పుస్తక రూపంలో తీసుకురావాల్సిందిగా ముందు కోరింది సునీత గారే. పుస్తకాన్ని అచ్చు వేస్తానని ముందుకు వచ్చింది ఎమెస్కో విజయ్‌కుమార్‌గారు. ఈ పుస్తకంలో నాకు వైఎస్‌తో ఉన్న అనుభవాలు, ఘటనలను ప్రస్తావించాను. నా విషయంలో వైఎస్ మంచివాడు, అంతకు మించినవాడు. – ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ, పుస్తక రచయిత -
అమరావతి బాండ్లు కొన్నదెవరు?
సాక్షి, రాజమహేంద్రవరం: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన అమరావతి బాండ్లను కొన్న తొమ్మిది మంది పేర్లు బయటపెట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాజధాని కోసం అధిక వడ్డీకి బాండ్లు జారీచేయడం దారుణమన్నారు. అప్పు చేసిన రూ.2 వేల కోట్లకు ప్రతి మూడు నెలలకొకసారి 10.36 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉందని, పైగా బ్రోకర్‌కు రూ.17 కోట్లు కమీషన్ ఇవ్వడం మరీ విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పైగా దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లు బయట పెట్టకపోవడాన్ని పారదర్శకత అంటారా? అని ప్రశ్నించారు. నగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధిక వడ్డీకి అప్పు చేయవద్దని ఏడు నెలల క్రితం జీవో జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు అధిక వడ్డీకి బాండ్లు జారీచేయడం ఏమిటని ఉండవల్లి ప్రశ్నించారు. గతంలో మర్చంట్ బ్యాంకుగా ఉండేందుకు రూపాయి జీతం తీసుకుంటామని ఏకే కేపిటల్ పేరుతో వచ్చిన వ్యక్తికే ఇప్పుడు రూ.17 కోట్లు బ్రోకరేజీ ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో విజన్ 2020 రూపొందించిన సీఎం చంద్రబాబు సలహాదారు మెకన్సీ.. ప్రస్తుతం చికాగో జైలులో ఉన్నారని ఉండవల్లి గుర్తుచేశారు. ప్రభుత్వం మద్యాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూడడం దారుణమన్నారు. చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ రూ.50కి విక్రయిస్తున్నారని.. అయితే దీని తయారీ, ప్యాకింగ్, రవాణాకు రూ.8.50 అవుతోందని.. షాపు వాళ్లకు రూ.3.75 ఆదాయం ఇస్తుండగా మిగిలిన రూ.37.75లు ప్రభుత్వానికి చేరుతోందన్నారు. నిజాలు చెప్పి పాలన చేయగలరా? రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.2,25,234 కోట్లు ఉందని ఉండవల్లి చెబుతూ.. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన అప్పు రూ.1.30లక్షల కోట్లని తెలిపారు. ఈ మొత్తాన్ని ఏం చేశారని నిలదీశారు. ప్రస్తుతం పెట్రోలు ధర రూ.85 ఉండగా, మనకు రూ.32లకు వస్తోందని, కేంద్రానికి రూ.19 పన్ను రూపంలో పోతుండగా, మిగతా మొత్తం రాష్ట్రానికి వెళ్తోందని వివరించారు. పెట్రోలు కొట్టించుకున్న తర్వాత వినియోగదారులకు ఇచ్చే బిల్లులో ఈ వివరాలు కేరళలో పొందుపరుస్తారని, మన రాష్ట్రంలో ఇలా నిజాలు చెప్పి పాలన చేయగలరా అని ప్రశ్నించారు. వైఎస్సార్ అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ వాళ్లు ‘రాజా ఆఫ్ కరప్షన్’ అనే పుస్తకాన్ని ముద్రించారని.. అప్పట్లోనే దానిపై చర్చకు రమ్మని లోక్‌సభలో ఎర్రన్నాయుడ్ని అడిగానని ఉండవల్లి గుర్తుచేశారు. ఇవాల్టికీ తాను అందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరారు. -
కిరణ్ 'జై సమైక్యాంధ్ర' తొలి కార్యవర్గం భేటీ
రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆవిర్భవించిన జై సమైక్యాంధ్ర పార్టీ తొలి కార్యవర్గం బుధవారం సమావేశమైంది. కిరణ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు. మరోవైపు జై సమైక్యాంధ్ర తొలిసభ స్థానిక జెమినీ గ్రౌండ్స్‌లో ఈరోజు సాయంత్రం జరగనుంది. ఈ సభలో ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సబ్బం హరి, సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్ కీలకంగా నిలవనుండగా మాజీమంత్రి పితాని సత్యనారాయణ, దాసరి నారాయణరావు, ఎమ్మెల్సీ బలసాలి ఇందిర హాజరు కానున్నట్లు సమాచారం. -
కిరణ్ పార్టీకి ఆదిలోనే హంసపాదు
సాక్షి, రాజమండ్రి: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేయబోయే ‘జై సమైక్యాంధ్ర’ పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 12న పార్టీ జెండా, ఎజెండాలను ప్రకటించే బహిరంగసభకు తొలుత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు. రాజమండ్రి, అమలాపురం ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్ సన్నాహాలు ప్రారంభించారు. అయితే ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో కళాశాల మైదానంలో సభ నిర్వహణకు అనుమతించబోమన్న కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సభ కోసం తరలించిన సామగ్రిని తొలగించాలని ఆదేశించారు. దీంతో విధి లేక వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. లాలాచెరువు వద్ద ఉన్న ప్రైవేటు స్థలాన్ని ముందుగా పరిశీలించినా ఆ స్థలం సాంకేతికంగా అనుకూలంగా లేదని, చివరకు వి.ఎల్.పురం ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న జెమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను ఖరారు చేశారు. -
అసలంత సీనుందా!
సాక్షి, రాజమండ్రి :ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ విషయంలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక శేషయ్యమెట్ట ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం, తన అనుయాయులైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో ఆయన ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. కిరణ్ పెట్టబోయే కొత్త పార్టీలో ప్రధాన పాత్ర పోషించాలని ఉభయ గోదావరి జిల్లాల నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ఆద్యంతం గోప్యంగా సాగింది. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్ర విభజన బిల్లు పాసైన తీరు, ఎంపీల సస్పెన్షన్‌కు దారి తీసిన పరిస్థితులను తన నియోజకవర్గ శ్రేణులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఉండవల్లి ఈ సమావేశం నిర్వహించినట్టు నేతలు చెబుతున్నారు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కిరణ్ పెట్టబోయే కొత్త పార్టీయే అజెండాగా ఈ సమావేశం సాగింది. కిరణ్ పార్టీలో చేరడంపై అభిప్రాయ సేకరణ చేయగా, కొంతమంది సై అన్నప్పటికీ మరికొందరు ‘ఇది అవసరమా?’ అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా పాసైందని, దీనిని వ్యతిరేకించినందువల్లనే తమను సస్పెండ్ చేశారని, పథకం ప్రకారమే ముందు పార్టీ నుంచి, తర్వాత సభ నుంచి పంపించేశారని ఉండవల్లి చెప్పారు. ఈ విషయాలు ప్రస్తావించడం ద్వారా సానుభూతి పొంది, సాధ్యమైనంతమంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కిరణ్ పార్టీవైపు ఆకర్షితులను చేసేందుకు యత్నించారని సమావేశానికి హాజరైనవారు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో కార్యాచరణ ఈ సమావేశానికి హాజరైన నేతల అభిప్రాయాలతో పాటు, హాజరు కాని, హాజరు కాలేనివారిని కూడా సమీకరించిన అనంతరం, నాలుగు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు.. సమావేశంలో కీలకంగా వ్యవహరించిన రాజమండ్రి నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నక్కా నగేష్ చెప్పారు. అయితే సమావేశం గురించి ఉండవల్లి మీడియాతో మాట్లాడలేదు. ఇటువంటి సమావేశాలను ఆయన మరో రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, రాజమండ్రి, గోపాలపురం, కొవ్వూరు మార్కెట్ కమిటీల అధ్యక్షులు చెరుకూరి వెంకటరావు, దుర్గారావు, రాఘవులు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు, ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన పలు విభాగాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. -
అరుణ్ మాటలకు.. అర్థాలే వేరులే..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :‘నేను ఎన్నికల్లో పోటీ చేయను. పోటీ చేసినా గెలవను. ఏ పార్టీలోనూ చేరను. స్వంత పార్టీపైనే అవిశ్వాసం పెట్టిన నాకు రాజకీయ భవిష్యత్ లేదు. మిగిలిన జీవితంలో కలం, కాగితంతో కాలక్షేపం చేస్తాను’ రాజమండ్రి నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఉండవల్లి అరుణ్‌కుమార్.. తెలంగాణ బిల్లు నేపథ్యంలో గత నెల రెండున కాంగ్రెస్‌కు, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సందర్బంలో అన్న మాటలివి. ఈ పలుకులు పలికి పట్టుమని రెండు నెలలు కూడా గడవ లేదు. అయితే.. విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం అనంతరం నాటకీయంగా పదవికి రాజీనామా చేసి, ఆపద్ధర్మముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఉండవల్లిని చూసి జిల్లావాసులు విస్తుబోతున్నారు. కొత్తపార్టీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న కిరణ్ బృందంలో ఉండవల్లి క్రియాశీలంగా వ్యవహరించడం ఆయన అనుచరులకే కొరుకుడు పడడం లేదు. విరక్తి.. ముందస్తు వ్యూహమే.. నిజానికి.. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న ఉండవల్లి పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడే అదంతా ముందస్తు వ్యూహంలో భాగం కావచ్చని ఆ పార్టీ నాయకులే అనుమానపడ్డారు. గత రెండు రోజులుగా కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ ఏర్పాటు, ఆయన వెంట వచ్చే ఎమ్మెల్యేలెందరు వంటి విషయాలపై హైదరాబాద్‌లోని తన సొదరుడి నివాసంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ భేటీల్లో కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎంపీలు ఆరుగురిలో హర్షకుమార్‌తో పాటు ఉండవల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన హర్షకుమార్ తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూద్దామని చెప్పుకొచ్చారు. ఉండవల్లి మాత్రం రాజకీయాలపై రోసినట్టు కఠిన నిర్ణయాన్ని ప్రకటించేశారు. తీరా ఆచరణకు వచ్చేసరికి తాను మిగిలిన నేతల మాదిరే రాజకీయాలకు అతీతుడిని కాదని చెప్పకనే చెపుతున్నారు. విభజనపై అధిష్టానం తీరుతో విసుగెత్తిన కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టే విషయం ఆలోచిస్తున్నారని ఉండవల్లి ముఖ్య అనుచరుడైన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హైదరాబాద్‌లో మీడియాతో పేర్కొనడం గమనార్హం. ఉండవల్లి తీసుకునే నిర్ణయంపైనే తన నిర్ణయం ఉంటుందన్న రౌతు మాటల్ని బట్టి రాజకీయాలపై ఉండవల్లి వైరాగ్యం కేవలం ప్రచారార్భాటమేనన్న వ్యాఖ్య సర్వత్రా వినిపిస్తోంది. ఉండవల్లి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారే తప్ప, రాజకీయాల్లో సిద్ధాంతకర్తగా ఉండనని ఎక్కడా చెప్పలేదు కదా అని ఆయన అనుచరుల్లో కొందరు సమర్థిస్తున్నారు. అయితే విభజన విషయంలోనూ ఇదే రీతిలో వ్యవహరించబట్టే అధిష్టానం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శ వినిపిస్తోంది. ‘కిరణ్’తో ప్రయాణానికి ఎమ్మెల్యేల వెనుకంజ.. కాగా, కిరణ్ పెట్టబోయే పార్టీలో ఉండవల్లి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా జిల్లా ఎమ్మెల్యేలు వారి వెంట నడిచేందుకు సాహసించడం లేదు. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు తన వెంట ఉంటారని కిరణ్ ఆశించారు. అయితే రాజమండ్రి సిటీ, పిఠాపురం, పెద్దాపురం ఎమ్మెల్యేలు రౌతు, వంగా గీత, పంతం గాంధీమోహన్లతో పాటు ఎమ్మెల్సీలు బలశాలి ఇందిర, అంగూరి లక్ష్మీశివపార్వతి మాత్రమే ఆయనతో భేటీ అయ్యారు. వీరిలో గీత, పంతం టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతుండడంతో కిరణ్ స్వయంగా ఫోన్ చేసి వారిని పిలిచినట్టు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటుపై కిరణ్ వారితో విడివిడిగా మాట్లాడినా ఏ ఒక్కరూ అనుసరిస్తామన్న భరోసా ఇవ్వనట్టు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలతో మాట్లాడాకే చెపుతామనడాన్ని బట్టి.. కిరణ్‌తో వెళ్లడం వివేకం కాదన్న యోచనతోనే అంటున్నారు. మొదటి నుంచీ కిరణ్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు శేషారెడ్డి, రాజా అశోక్‌బాబు, పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరీదేవి కూడా ఈ అభిప్రాయంతోనే భేటీకి ముఖం చాటేశారని సమాచారం. మొత్తం మీద కిరణ్ పెట్టే కొత్తపార్టీపై జిల్లా ఎమ్మెల్యేలు పెద్దగా ఆసక్తి కనబరచకపోయినా ఈ వ్యవహారంలో ఉండవల్లి పెద్దన్నయ్య పాత్ర పోషిస్తుండడం జిల్లాలో చర్చకు తెరతీసింది. -
ఈ ఎత్తు చిత్తు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి మరో హైడ్రామాకు తెరలేపింది. జిల్లా నుంచి కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎంఎం పళ్లంరాజు, రాజమండ్రి, అమలాపురం ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్ విభజన ఉద్యమం మొదటి దశలో ముఖం చాటేశారు. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఇద్దరు ఎంపీలు అరుణ్‌కుమార్, హర్షకుమార్‌లను పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసినందుకు పార్టీ అధిష్టానం మంగళవారం సస్పెండ్ చేసింది. పార్టీ ధిక్కారానికి పాల్పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రకటించింది. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే ఎంపీల సస్పెన్షన్ డ్రామాకు తెరతీసి ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అంతర్గత సంభాషణల్లో అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే ఏమో వీరి సస్పెన్షన్‌పై జిల్లా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం కాలేదు. ఎవరూ పట్టించుకోలేదు.సమైక్యాంధ్రను రెండు ముక్కలు చేసేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి అడ్రస్ గల్లంతయ్యేలా చేసింది. ఇద్దరు ఎంపీల సస్పెన్షన్ నిర్ణయానికి నిరసనగా రాజమండ్రి, అమలాపురంలలో వారి మద్దతుదారులు అక్కడక్కడ రాజీనామాలు చేశారు. పార్టీలో ఉంటే రాజకీయ మనుగడ కష్టమవుతుందని భావించిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఎంపీల సస్పెన్షన్‌ను సాకుగా తీసుకుని పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అమలాపురంలో నియోజకవర్గ నాయకులు సమావేశమై ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ నిర్ణయంపై వారి అనుచరగణం మాత్రమే స్పందించింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోటరీలో మంచి పట్టున్న పళ్లంరాజు, మేధావి వర్గానికి చెందిన నాయకునిగా పేర్కొనే ఉండవల్లి, చమురు సంస్థలపై చేపట్టిన ప్రజాందోళనల్లో కొంతలో కొంతైనా భాగస్వాములు కాలేకపోయిన మరో ఎంపీ హర్షకుమార్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా జిల్లాలో ప్రజలు పెద్దగా స్పందించ లేదు. పార్టీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆ ఇద్దరు ఎంపీలు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశామని భావించారు. అరుణ్‌కుమార్ రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో విభజన పరిణామాలు వివరించేందుకా అన్నట్టుగా ఏర్పాటు చేసిన సభలకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సహా ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా హాజరుకావడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. రెండు పర్యాయాలు ఉండవల్లి సమావేశాలు పెట్టినా ప్రజలు మాత్రం సమైక్యాంధ్ర పై ఆయన చిత్తశుద్ధిని శంకించారనే చెప్పాలి. మరో ఎంపీ హర్షకుమార్ కూడా విభజన నిర్ణయంపై వివిధ సందర్భాల్లో భిన్నమైన వాదనలతో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు. కాకినాడలో కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటి ముందు వరుస ధర్నాలు చేసి జేఎన్‌టియూకే కాలేజీ ఎదుట హోర్డింగ్‌లతో విద్యార్థిలోకం నిరసనను తెలియచేసింది. అమలాపురం, రాజమండ్రి ఎంపీల దిష్టిబొమ్మలను ఉద్యమకారులు దహనం చేశారు. వారు పలుచోట్ల నిరసనలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఎంపీ హర్షకుమార్ అయితే విభజన ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట అన్న దాఖలాలు కూడా లేవు. రాష్ట్ర విభజన చేసి తెలంగాణ ఇచ్చేయడమే మేలంటూ ప్రకటనలు చేసిన హర్షకుమార్ ప్రజా వ్యతిరేకతతో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలంటూ ఆనక ప్లేటు ఫిరాయించారు. ఇద్దరు ఎంపీలు ప్రజాగ్రహాన్ని ముందుగానే పసిగట్టారేమో తెలియదు కానీ, గత నెల మొదటివారంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ప్రజాదరణను తిరిగి పొందవచ్చునని ఆశించారు. అవిశ్వాస అస్త్రం ద్వారా అంతవరకు తమపై ఉన్న వ్యతిరేకతను సమైక్య ముసుగులో అధిగమించాలనుకున్న ఎంపీల ఎత్తుగడ పారలేదు. విభజన ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఒకరకంగాను ప్రజాగ్రహం పెల్లుబికినప్పుడు మరోరకంగాను వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఎదురైందంటున్నారు. ఇద్దరు ఎంపీలను ప్రజల్లో హీరోలను చేసే ఉద్దేశంతోనే అధిష్టానం సస్పెన్షన్ నాటకానికి తెరతీసినా ప్రజల్లో మాత్రం ఆశించిన స్పందన కానరాలేదు. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రజా విశ్వాసం పొందాలనుకున్న వారి ఆశలు అడియాశలే అయ్యాయి. అవిశ్వాస తీర్మానంపై సంతకం చేశాక ఇద్దరు ఎంపీలకు అదనంగా ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయంపై జిల్లా నుంచి కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు సహా ఇద్దరు ఎంపీల స్పందన ఆది నుంచి మొక్కుబడిగా, సందేహాస్పదంగానే కన్పించింది. ప్రజాందోళన నేపథ్యంలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ఓటేయమన్నా వేయరనే వాస్తవాన్ని ముందుగానే గమనించే ఉండవల్లి ఆ నిర్ణయం తీసుకున్నా ప్రజల నుంచి సానుభూతి మాత్రం అప్పుడు, ఇప్పుడు కూడా పొందలేకపోయారు. ఆ ఇద్దరు ఎంపీలు సమైక్యాంధ్రకు మద్ధతుగా చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం చేసి ఉంటే ఈ రోజు సస్పెండ్ అయినప్పుడు జిల్లా ప్రజల నుంచి ఆదరణ లభించి ఉండేదని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరించే నాయకుల పట్ల వారి స్పందన ఎలా ఉంటుందనేది ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. త్వరలో భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటాం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అవిశ్వాసానికి మద్దతు ఇచ్చాం. కానీ అధిష్టాన నిర్ణయం బాధ కలిగించింది. సస్పెండ్ అయిన మా ఆరుగురం త్వరలో భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటాం. - ఉండవల్లి అరుణ్‌కుమార్, రాజమండ్రి ఎంపీ తప్పేంటో అర్థం కావడం లేదు ఇది అన్యాయం. ప్రజల కోసం తీర్మానానికి అనుకూలంగా సంతకం చేశాం. మేం చేసిన తప్పేంటో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశాం. భవిష్యత్‌ను ప్రజలే నిర్ణయిస్తారు. - జి.వి.హర్షకుమార్, అమలాపురం ఎంపీ -
పూలు ముళ్లు
కాలం నిత్య సంచారి. ‘నిన్న నుంచి ‘నేటి’ మీదుగా ‘రేపటి’కి నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఎన్నెన్నో జ్ఙాపకాలను, అనుభవాలను మిగులుస్తుంది. అలా 2013 సంవత్సరం ఎన్నెన్నో తీపి అనుభూతులను, మరెన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. అవేంటో చూద్దాం. - సాక్షి, రాజమండ్రి జనవరి కొత్త సంవత్సరం వరాలు కురిపిస్తుందనుకున్న సర్కారు 2013 జనవరిలో చార్జీల మోతతో స్వాగతం పలికింది. ఏప్రిల్ నెల నుంచి విద్యుత్తు చార్జీలు పెంచాలంటూ ఈ నెల ఏడున ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వంక పదో తేదీ నుంచి రైల్వే చార్జీలను కూడా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వస్త్రాలపై విధించిన వ్యాట్‌కు వ్యతిరేకంగా రెండో దఫా ఉద్యమానికి ఈనెల 23 నుంచి జిల్లాలోని వస్త్రవ్యాపారులు తెరలేపారు. అత్యంత అట్టహాసంగా కాకినాడ సముద్రతీరంలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ జైఆంధ్రప్రదేశ్ పేరుతో సుబ్రహ్మణ్య మైదానంలో సమైక్య సభను నిర్వహించారు. ఫిబ్రవరి ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెల్‌బీ పరీక్షలను రాజమండ్రిలో రెండో తేదీన నిర్వహించారు. రైతులపై రూ.10,500 కోట్ల విద్యుత్తు బకాయిల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ మెట్ట ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపారు. జిల్లాలో ఫిబ్రవరి నెలలో విద్యుత్తు కోతలు పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. సమాచార కమిషనర్ ఎం.రతన్ రాజమండ్రిలో ప్రత్యేక కోర్టు నిర్వహించి అర్జీదారులతో నేరుగా విచారణ జరిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అఖిలభారత కార్మిక సంఘాలు ఈ నెల 21, 22 రెండు రోజులపాటు బంద్ పాటించడంతో జిల్లాలో జనజీవనం స్తంభించింది. మార్చి ఈ నెల నాలుగోతేదీన అమలాపురంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వివాదాల నడుమ నలుగుతున్న పోలవరం ప్రాజెక్టుకు ఎనిమిదో తేదీన భూమిపూజ నిర్వహించారు. హెడ్ వర్కు నిర్మాణ పనులు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ ప్రతినిధులు, రైతుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వ్యాట్‌కు వ్యతిరేకంగా పదో తేదీన వస్త్రవ్యాపారులు బంద్ పాటించారు. గ్రామాల విలీన సమస్యలకు తెరదించుతూ రాజమండ్రి కార్పొరేషన్లో 21 గ్రామాలు విలీనం చేస్తూ 18వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని రామచంద్రపురం ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 28వ తేదీన సీమాంధ్ర జిల్లాల వస్త్రవ్యాపారుల గర్జన సదస్సు రాజమండ్రిలో జరిగింది. వ్యాట్‌ను ఎత్తివేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేయడంతో 30వ తేదీన వస్త్ర వ్యాపారులు సమ్మె విరమించారు. ఏప్రిల్ రాజమండ్రిలో 21 గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓపై ఈ నెల ఒకటిన హైకోర్టు స్టే విధించింది. ఈ నెల ఒకటినుంచి పెరిగిన విద్యుత్తు చార్జీలు అమల్లోకి రావడంతో ఫలితంగా జిల్లాలో 16 లక్షల మంది వినియోగదారులపై పెనుభారం పడింది. పెంచిన విద్యుత్తు చార్జీలకు నిరసనగా జిల్లావ్యాప్తంగా ఐదో తేదీ నుంచి ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఎనిమిదో తేదీన అన్నివర్గాలు సంపూర్ణంగా బంద్ పాటించాయి. మూడోవారంలో బంగారం ధరలు పడిపోవడంతో జిల్లావ్యాప్తంగా మార్కెట్లు కిటకిటలాడాయి. మే 2011 జనాభాలెక్కల తుది నివేదిక విడుదలైంది. జిల్లా జనాభా 51,54,296గా అధికారులు ప్రకటించారు. మే 12న 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు తల్లడిల్లారు. పరిశ్రమలకు విధిస్తున్న పవర్‌హాలీడేను జూన్ నెలవరకూ పొడిగిస్తూ ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ గోదావరి నదిపై రాజమండ్రి-కొవ్వూరును కలుపుతూ బ్రిటిష్ కాలంలో 1897లో నిర్మితమైన హేవ్‌లాక్ వంతెన పరిరక్షణకోసం ఈ నెల మొదటివారం నుంచి ఉద్యమం ఊపందుకుంది. అన్నివర్గాల వారు తమ తమ పంథాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ నెల మూడు నుంచి 15వ తేదీ మధ్యలో ఉత్తరకాశీ యాత్రకు వెళ్లిన జిల్లాకు చెందిన 300 మంది ప్రయాణికులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారంరోజుల తర్వాత వారంతా సురక్షితంగా జిల్లాకు చేరుకున్నారు. జూలై ఈ నెల ఒకటిన గవర్నర్ నరసింహన్ రాజమండ్రిలో ఒక వ్యక్తిగత కార్యక్రమాలకోసం పర్యటించారు. తన అత్తగారి అస్తికల నిమజ్జనను పుష్కరాలరేవులో నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఆన్లైన్ విధానానికి రెండోతేదీ నుంచి శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ శాఖ రాజమండ్రి జిల్లాలో 19 కార్యాలయాలను ఆన్‌లైన్‌ద్వారా అనుసంధానం చేశారు. ఈ నెలలో గోదావరికి రికార్డుస్థాయిలో మూడోప్రమాద హెచ్చరిక దశ దాటి 17 న్నర అడుగుల వరకూ వరదచేరి వెనక్కు తగ్గింది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో 31వ తేదీనుంచి సమైక్య ఉద్యమం రాజుకుంది. ఆగస్టు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సకలజనులు నిరవధిక బంద్‌ను ఒకటోతేదీనుంచి ప్రారంభించారు. ఏడాదిమొత్తం మీద ఎన్నడూలేనంతగా ఉల్లి ధరలు ఆగస్టు 10 నుంచి రూ.70 కిలో రికార్డుస్థాయిని తాకాయి. ఈ నెల ఏడోతేదీన ట్యునీషియాకు చెందిన ఒక భారీ నౌక కాకినాడ కోరమండల్ ఫెర్టిలైజర్స్‌కు ఫాస్ఫరిక్ యాసిడ్‌తో రవాణ చేసేందుకు కాకినాడ తీరానికి చేరుకుంది. నౌకలోని యాసిడ్‌ను పైప్లైన్ల ద్వారా ఫెర్టిలైజర్‌కు తరలించారు. పోర్టు చరిత్రలో యాసిడ్ రవాణ ఇదే ప్రథమం. నెలరోజులూ జిల్లాలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. సెప్టెంబర్ ఈ నెల రెండోతేదీ నుంచి ఉపాధ్యాయులు సమైక్య సమ్మెలో చేరారు. 11 తేదీ అర్ధరాత్రి నుంచి విద్యుత్తు ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మె బాటపట్టడంతో రవాణాకు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అంధకారం అలుముకుంది. ఈ నెల 18కి ఉద్యమం 50 రోజులు పూర్తిచేసుకుంది. అక్టోబర్ 66 రోజులపాటు సమైక్య ఉద్యమాన్ని చేపట్టిన సుమారు 60 వేల మంది ఉద్యోగులు ఈ నెల 18 నుంచి విధుల్లోకి తిరిగి హాజరయ్యారు. ఈ నెల 21 నుంచి భారీగా కురిసిన వర్షాలు రికార్డు స్థాయిలో వర్షపాతాన్ని నమోదు చేశాయి. 350 మిల్లీమీటర్లకు పైగా వారం రోజుల్లో నమోదవడం ఐదేళ్లలో రికార్డు. జిల్లాలో సమైక్య ఉద్యమం నెలంతా కొనసాగింది. అన్నవరంలో సత్యదేవుని వ్రతం టిక్కెట్ల ధరను పెంచుతూ దేవస్థానం నిర్ణయం పట్ల భక్తుల్లో నిరసన వ్యక్తమవుతోంది. నవంబర్ తెల్లకార్డులకు ఇచ్చే రేషన్‌లో నవంబరు నెలలో 15 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై జిల్లావ్యాప్తంగా కార్డుదారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా డెల్టా ఆధునికీకరణ పనులు లేనట్టేనని 15వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో సాగునీటి సలహామండలి తేల్చిచెప్పడం రైతులకు నిరాశకు గురిచేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి హెలెన్ తుపాను జిల్లాను గడగడలాడించింది. అనంతరం 24 నుంచి లెహర్ తుపాను ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో తీరప్రాంతవాసులు గడగడలాడారు. లెహర్ ముప్పు తప్పినా రెండు తుపాన్లూ తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. డిసెంబర్ మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపునకు ‘ ఈ’ చెల్లింపు విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తెలంగాణ బిల్లులు కేబినెట్ ఆమోదించడంతో జిల్లాలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆరో తేదీ నుంచి రెండు రోజులు బంద్ పాటించారు. కాకినాడలో ఇండియన్ కోస్టుగార్డు అమ్ములపొదిలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న రాజ్ద్వజ్ అనే నౌక 17వ తేదీన వచ్చి చేరింది. చెన్నై నుంచి విశాఖ మధ్య తీరాన్ని ఈ నౌక గస్తీ కాస్తుంది. పండుగ సీజన్‌కావడంతో రాజమం డ్రి, కాకినాడల్లో 21వ తేదీ నుంచి కొత్త వస్త్ర నిలయాల ప్రారంభోత్సవాలు చోటుచేసుకున్నాయి. వీటిలో పాల్గొనేందు కు జిల్లాకు సినీ తారలు తరలివచ్చారు.