
సాక్షి,హైదరాబాద్ : మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, ఆర్థిక అవకతవకల సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మార్గదర్శి ఫైనాన్షియర్ డబ్బులు ఎగ్గొట్టిందని తన వాదనలు వినాలంటూ కోర్టుకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. న్యాయం స్థానం తీర్పును రిజ్వర్ చేసింది.
విచారణలో మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు. ‘45ఏళ్ల నయ వంచన. మార్గదర్శిపై క్రిమినల్ చర్యలు పెట్టాల్సిందే. ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు ఫైనాన్సియర్‌కు వత్తాసు. సుప్రీం కోర్టు సూచన మేరకే ప్రతివాదిగా ఆర్‌బీఐ. మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని ఆర్‌బీఐ తేల్చింది.
క్రిమినల్ చర్యలకు హెచ్‌యూఎఫ్ సభ్యులే బాధ్యులు. కఠినశిక్ష విధించకుంటే ఇలాగే ఫైనాన్షియర్లు పుట్టుకొస్తారు. దేశమే ప్రమాదంలో పడి పోయే ప్రమాదం ఉంది’అని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.