సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలపై బహిరంగ చర్చ అంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చివరికి తోక ముడిచారు. బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నానంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు శనివారం సమాచారం అందించారు.
రామోజీరావు, మార్గదర్శి అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీరెడ్డి సవాల్‌ను స్వీకరించారు. అంతేకాదు రామోజీ ఫిల్మ్‌సిటీలోగానీ, హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో గానీ రామోజీరావు సమక్షంలో ఈ చర్చను ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని జీవీరెడ్డికి ప్రతి సవాల్ కూడా విసిరారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా రేపు (మే14న) చర్చ జరగాల్సి ఉంది. అయితే..
మార్గదర్శి అక్రమాలకు వత్తాసు పలుకుతూ చర్చకు సవాల్ విసిరిన జీవీరెడ్డి.. ఇపుడు బిజీ పేరుతో వెనక్కి తగ్గడం దేనికి సంకేతం? చర్చను ఎదుర్కొనే ధైర్యం లేక, భంగపాటు తప్పదనే భయంతోనే ముందుగానే చక్కబడినట్టు కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాగా దశాబ్దాలుగా వేళ్లూనుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను కూకటి వేళ్లతో సహా తొలగించే విస్తృత కార్యాచరణకు సీఐడీ విభాగం ఉపక్రమించింది. రాష్ట్రంలోని మొత్తం 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు చేపట్టింది. సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో సోదాలతోపాటు సీఐడీ అధికారులు సమాంతరంగా ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేపట్టింది. ఈ కేసులో ఆ సంస్థ చైర్మన్ రామోజీరావును, శైలజా కిరణ్ ను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment