GVR
-
మార్గదర్శి అక్రమాలపై చర్చ.. తోకముడిచిన జీవీ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలపై బహిరంగ చర్చ అంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చివరికి తోక ముడిచారు. బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నానంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు శనివారం సమాచారం అందించారు. రామోజీరావు, మార్గదర్శి అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీరెడ్డి సవాల్‌ను స్వీకరించారు. అంతేకాదు రామోజీ ఫిల్మ్సిటీలోగానీ, హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో గానీ రామోజీరావు సమక్షంలో ఈ చర్చను ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని జీవీరెడ్డికి ప్రతి సవాల్ కూడా విసిరారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా రేపు (మే14న) చర్చ జరగాల్సి ఉంది. అయితే.. మార్గదర్శి అక్రమాలకు వత్తాసు పలుకుతూ చర్చకు సవాల్ విసిరిన జీవీరెడ్డి.. ఇపుడు బిజీ పేరుతో వెనక్కి తగ్గడం దేనికి సంకేతం? చర్చను ఎదుర్కొనే ధైర్యం లేక, భంగపాటు తప్పదనే భయంతోనే ముందుగానే చక్కబడినట్టు కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా దశాబ్దాలుగా వేళ్లూనుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను కూకటి వేళ్లతో సహా తొలగించే విస్తృత కార్యాచరణకు సీఐడీ విభాగం ఉపక్రమించింది. రాష్ట్రంలోని మొత్తం 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు చేపట్టింది. సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో సోదాలతోపాటు సీఐడీ అధికారులు సమాంతరంగా ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేపట్టింది. ఈ కేసులో ఆ సంస్థ చైర్మన్ రామోజీరావును, శైలజా కిరణ్ ను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇక అదానీ ఎయిర్‌పోర్టులు..!
న్యూఢిల్లీ: ప్రైవేట్ దిగ్గజం అదానీ గ్రూప్ అయిదు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 50 ఏళ్ల పాటు వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి వచ్చిన బిడ్స్‌లో అయిదింటికి అదానీ అత్యధికంగా కోట్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్ విమానాశ్రయాలు వీటిలో ఉన్నట్లు వివరించారు. ఆరోదైన గౌహతి ఎయిర్పోర్ట్ బిడ్‌ను మంగళవారం తెరవనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ప్రయాణికుడిపై చెల్లించే ఫీజు ప్రాతిపదికన బిడ్డింగ్ సంస్థను ఎంపిక చేసినట్లు అధికారి చెప్పారు. మిగతా సంస్థలతో పోలిస్తే అదానీ గ్రూప్ అత్యధిక ఫీజు కోట్ చేయడంతో అయిదు ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టు దానికి దక్కినట్లు పేర్కొన్నారు. ఏఏఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు అదానీ గ్రూప్ ప్యాసింజర్ ఫీజు కింద అత్యధికంగా రూ. 177 ఆఫర్ చేసింది. అలాగే జైపూర్‌కు రూ. 174, లక్నో ఎయిర్‌పోర్టుకు రూ. 171, తిరువనంతపురం విమానాశ్రయానికి రూ. 168, మంగళూరు ఎయిర్‌పోర్టుకు రూ. 115 మేర ప్యాసింజర్ ఫీజు కింద ఏఏఐకి అదానీ గ్రూప్ చెల్లించనుంది. హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను నిర్వహిస్తున్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సంస్థ ఇవే విమానాశ్రయాలకు వరుసగా రూ. 85, రూ. 69, రూ. 63, రూ. 63, రూ. 18 ఆఫర్ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపదికన ఏఏఐ అధీనంలోని ఆరు విమానాశ్రయాలను నిర్వహించే ప్రతిపాదనకు కేంద్రం గతేడాది నవంబర్‌లో ఆమోదముద్ర వేసింది. ఆయా విమానాశ్రయాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, ప్రయాణికులకు మరింత మెరుగైన సర్వీసులు అందించగలగడం ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యం. 10 కంపెనీలు .. 32 బిడ్లు.. ప్రస్తుతం ఏఏఐ నిర్వహణలో ఉన్న ఈ ఆరు విమానాశ్రయాల నిర్వహణకు 10 కంపెనీల నుంచి మొత్తం 32 సాంకేతిక బిడ్లు వచ్చాయి. వీటిలో ఆటోస్ట్రేడ్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఐ–ఇన్వెస్ట్మెంట్ మొదలైన సంస్థలు ఉన్నాయి. అహ్మదాబాద్, జైపూర్ విమానాశ్రయాలకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్), జ్యూరిక్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ రెండో అతి పెద్ద బిడ్డర్స్‌గా నిల్చాయి. అటు లక్నో ఎయిర్‌పోర్టు విషయంలో ఏఎంపీ క్యాపిటల్, తిరువనంతపురం విమానాశ్రయానికి సంబంధించి కేరళ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కేఎస్ఐడీసీ), మంగళూరు ఎయిర్‌పోర్టు విషయంలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థలు రెండో స్థానంలో నిలిచాయి. -
కారు కొంటేనే మంచి భర్త!
మగోడు మా పక్కింటి వాళ్లు సంపన్నులు. మా బంధువులలో కూడా చాలా మంది సంపన్నులు ఉన్నారు. వాళ్ల ఇంట్లో ఏ కొత్త వస్తువు చూసినా ‘‘అది మన ఇంట్లో ఉండాల్సిందే’’ అని పట్టుపడుతుంది మా ఆవిడ. మంచి భర్త అంటే ఎవరు? అనే ప్రశ్నకు- ‘‘పువ్వులో పెట్టి చూసుకునేవాడు’’ అనే సమాధానం వినిపిస్తుంటుంది. నేను అక్షరాల అలాంటి భర్తనే. ఏ రోజూ నా భార్యను చిన్న మాట కూడా అనలేదు. కానీ ఆమె దృష్టిలో నేను అసమర్థుడిని. దీనికి కారణం ఆమె గొంతెమ్మ కోరికలు. మా పక్కింటి వాళ్లు సంపన్నులు. మా బంధువులలో కూడా చాలా మంది సంపన్నులు ఉన్నారు. వాళ్ల ఇంట్లో ఏ కొత్త వస్తువు చూసినా ‘‘అది మన ఇంట్లో ఉండాల్సిందే’’ అని పట్టుపడుతుంది మా ఆవిడ. ‘‘అదెలా కుదురుతుంది? వారి స్థాయి ఎక్కడ? మన స్థాయి ఎక్కడ? ఉన్నంతలోనే సర్దుకుపోవాలి’’ అని చెప్పినా ఒక పట్టాన వినదు. ఒకరోజు మా ఆవిడ వాళ్ల అక్క, ఆమె భర్త మా ఇంటికి వచ్చారు. ‘‘మీ బావ కారు కొనడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇంక రెండు నెలల్లో మా ఇంటికి కారు వస్తుంది’’ అని మా ఆవిడతో చెప్పింది వాళ్ల అక్క. ఇక అది మొదలు...‘కారు కొనండి’ అని రోజూ పోరు..! ఒకోసారి తట్టుకోలేనంత కోపం వస్తుంది. అయినా నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. మనశ్శాంతి కోసం యోగా కూడా చేస్తున్నాను. నా భార్య కళ్లు తెరిపించాల్సిందని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. - జీవిఆర్, ఖమ్మం