
రాజమహేంద్రవరం సిటీ (తూర్పుగోదావరి జిల్లా): ప్రభుత్వ ఉద్యోగులు పాత జీతాలు కావాలంటూ సమ్మె నోటీసు ఇవ్వడం విచిత్రంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విస్మయం వ్యక్తం చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. కొత్త పీఆర్‌సీ అమలు చేయడం వల్ల రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతోందని ప్రభుత్వం అంటుంటే.. మాకు పెంచిన కొత్త జీతాలు వద్దు పాత జీతాలే చాలంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక దుస్థితిని దృష్ట్యా ఉద్యోగులు సమ్మెను ఆపవలసిందిగా ప్రార్థిస్తున్నానన్నారు.