
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం భేటీ అయ్యింది.
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం భేటీ అయ్యింది. ఐఆర్, పెండింగ్ డీఏ, సరెండర్ లీవ్‌లు, పదవీ విమరణ బకాయిలపై చర్చించింది.
చర్చలు అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, రూ.5,600 కోట్ల బకాయిల విడుదలపై చర్చించామని తెలిపారు. త్వరగా ఉద్యోగుల పెండింగ్ అంశాలను పరిష్కరించాలని సీఎస్, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించామన్నారు. విశాఖ ఎమ్మార్వో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పటికే ప్రకటించామని మంత్రి బొత్స పేర్కొన్నారు.