( ఫైల్ ఫోటో )
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో నేడు ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగనుంది. అప్రూవర్‌గా మారిన ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా స్టేట్‌మెంట్‌ని అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. షా పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్కిల్ స్కామ్ లో ఏ-2 ముద్దాయి మాజీ లక్ష్మీ నారాయణ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లక్ష్మీనారాయణ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
అప్రూవర్‌గా మారతానని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. కౌంటర్ పేరుతో చంద్రబాబు న్యాయవాదులు పలుమార్లు సమయం కోరారు. కేసులో కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ చంద్రబాబు తరపున న్యాయవాదులు ఇవ్వాలని కోరారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపున న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది.
అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై ఈ నెల 22న ఏసీబీ కోర్టులో విచారణ జరిపగా, కౌంటర్ వేయడానికి సమయమివ్వాలని చంద్రబాబు న్యాయవాదులు కోరారు. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల కుట్రలకు పాల్పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment