అద్భుత శిల్పం.. జాతికి అంకితం  | YS Jaganmohan Reddy unveils Ambedkars Social Justice Mahashilp | Sakshi
Sakshi News home page

అద్భుత శిల్పం.. జాతికి అంకితం 

Published Sat, Jan 20 2024 5:13 AM | Last Updated on Sat, Jan 20 2024 3:09 PM

YS Jaganmohan Reddy unveils Ambedkars Social Justice Mahashilp - Sakshi

సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే చరిత్ర పుటల్లో స్థానం  సంపాదించుకోగా, స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ ఏర్పాటుతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కీర్తిని మూటగట్టుకుంది. సామాజిక న్యాయ మహా శిల్పాన్ని జాతికి అంకితం చేసే మహత్తర కార్యక్రమం  దిగ్విజయం అయ్యింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ వేడుకకు తరలివచ్చారు.

మధ్యాహ్నానికి అశేష ప్రజావాహినితో స్వరాజ్‌ మైదానానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. సభా ప్రాంగణం జనంతో నిండిపోవడంతో స్వరాజ్‌ మైదానానికి ఆనుకుని ఉన్న మహాత్మా గాంధీ రోడ్డు, నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ల వద్ద జనం భారీగా గుమిగూడి ఆ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో జై భీమ్, జై జగన్‌ నినాదాలు మిన్నంటాయి.  

సాక్షి, అమరావతి: విజయవాడ నగరం నడిబొడ్డున భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అనంతరం బౌద్ధ వాస్తు శిల్పకళతో నిర్మించిన కాలచక్ర మహా మండపాన్ని ప్రారంభించారు. అంబేడ్కర్‌ విగ్రహ పీఠం వద్ద ఆ మహనీయుని పాదాలపై పూలు చల్లి నివాళులర్పించారు. అంబేడ్కర్‌ జీవిత విశేషాలను ప్రదర్శించే విహార యాంఫీ థియేటర్‌ను ప్రారంభించారు.

18.81 ఎకరాల స్వరాజ్‌ మైదానంలో రూ.404 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన స్మృతివనం అంతా కలియతిరిగారు. జీవ కళ ఉట్టిపడే మైనపు విగ్రహాలు, అంబేడ్కర్‌ జీవిత విశేషాలు తెలియజేసే ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్, 2 వేల మంది కూర్చొనేలా తీర్చిదిద్దిన కన్వెన్షన్‌ సెంటర్, 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్‌ కోర్టు, చిన్నారులు ఆడుకోవటానికి ప్లే ఏరియా, వాటర్, మ్యూజికల్‌ ఫౌంటెన్లు, ఉదయం, సాయంకాలం వేళల్లో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్‌ మార్గాలను పరిశీలించారు.

దేశానికే తలమానికంగా 81 అడుగుల పీఠంతో కలిపి 206 అడుగుల పొడవుతో నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని ఆశయాలు స్ఫూర్తిగా జగనన్న పాలన సాగుతోందంటూ వందల సంఖ్యలో డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేడ్కర్‌ చిత్రం, నవరత్న పథకాలు, పీపుల్స్‌ లీడర్‌ సీఎం వైఎస్‌ జగన్, భారత పార్లమెంట్, భారతదేశ పటం, ఆంధ్రప్రదేశ్‌ మ్యాప్, కర్నూలు కొండారెడ్డి బురుజు, ప్రకాశం బ్యారేజ్, చిలుక, కూచిపూడి నృత్యం వంటి ఆకృతులతో డ్రోన్ల ప్రదర్శన ఆకాశంలో కనువిందు చేసింది. 14 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు గల జాతీయ పక్షి నెమలి ఆకృతి విశేషంగా ఆకట్టుకుంది. మిరుమిట్లు గొలిపే లేజర్‌ షో, బాణా సంచా వెలుగులు సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.

అనంతరం అంబేడ్కర్‌ మహాశిల్పం ముందు సీఎం జగన్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు ఫొటోలు దిగారు. ఈ మహోత్సవంలో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషెన్‌రాజు, ఉప ముఖ్యమంత్రులు కొట్టు సత్యనారాయణ, అంజద్‌ బాషా, పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, కె. నారాయణస్వామి, మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, ఆర్‌కె రోజా, విడదల రజని, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, గురుమూర్తి, నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పుప్పాల హారిక, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డీవీజీ శంకర్రావు, సీఎస్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

అంబరం అంటిన సంబరం 
అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూర్యుడిలా ఆకాశమంత ఎత్తున రూపొందిన డాక్టర్‌ బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మహా శిల్పం ఆవిష్కరణ మహోత్సవం స్వరాజ్‌ మైదానంలో అంబరాన్ని తాకింది. నభూతో నభవిష్యత్‌ అనేలా సాగిన ఆ సంబరాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోలేదనడం అతిశయోక్తి కాదు. ఈ అపురూప కార్యక్రమానికి హాజరు కావడం తమ అదృష్టమని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు హర్షం వ్యక్తం చేశారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్‌కు ఇంతగా గౌరవం కల్పించడం పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రశంసించారు.  మహిళలు, యువత ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంబేడ్కర్, సీఎం జగన్‌ చిత్రాలతో కూడిన ఫ్లకార్డులు, జెండాలను చేతపట్టి వారంతా సందడి చేశారు. అంబేడ్కర్‌ గేయాలు, నవరత్న పథకాలపై పాటలు, కళా రూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 

దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే కార్యక్రమం
మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి
భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే కార్యక్రమం ఇది. దేశంలో ఎక్కడా లేని విధంగా జరుగుతున్న గొప్ప కార్యక్రమం, ఒకప్పుడు చంద్రబాబు మమ్మల్ని అవమానించారు, మా దేవుడ్ని అవమానించారు, మాపై దాడులు, అమానుషాలు చేయించారు, అంబేడ్కర్‌ విగ్రహం పెడతామని అవమానించారు, కానీ సీఎం జగన్‌ పాలనలో దళితులు గుండెలపై చేయి వేసుకుని ధైర్యంగా బతుకుతున్నారు, అంబేడ్కర్‌ కోరుకున్న రాజ్యాంగ వ్యవస్ధ తెచ్చారు, మా కులాల స్ధితిగతులు మార్చారు, ఏ రాష్ట్రంలో లేని విధంగా అంబేడ్కర్‌ను మీ గుండెల్లో, మీ కుటుంబంలో ఒకరిగా చేసుకున్నారు.

అంబేడ్కర్‌ ఆశయాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌
తానేటి వనిత, హోంశాఖా మంత్రి
సామాజిక న్యాయ మహాశిల్పం(స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌) ఆవిష్కరణ ఒక గొప్ప రికార్డు. ప్రపంచంలోనే అతి ఎత్తైన మహా శిల్పాన్ని రూపొందించి ప్రారంభించే సభలో నాకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. అంబేడ్కర్‌ ఆశయాలు, పోరాటాల గురించి మనం చరిత్ర పుస్తకాల్లో చదివాం. కానీ అవి అమలు చేసిన చరిత్ర సృష్టించింది మన సీఎం జగన్‌. అంబేడ్కర్‌ సిద్దాంతాలు, ఆశయాలు, ఆలోచనలు, సంస్కరణలు, పోరాటాలను సీఎం జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నారు.

మన కోసం పుట్టిన బాహుబలి జగన్‌
పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి
ఊరి చివర దళితవాడల వద్ద అంబేడ్కర్‌ విగ్రహాలు ఉండేవి. గొప్ప మహనీయుడైన అంబేడ్కర్‌ స్పూర్తిని భావితరాలకు అందించే సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని విజయవాడ నగర నడిబొడ్డున నిర్మించారు. అట్టడుగు వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన అంబేడ్కర్‌ బాహుబలి–1 అయితే మన కోసం పుట్టిన బాహుబలి–2 జగన్‌. 

పేదలను చేయి పట్టి నడిపిస్తున్న జగన్‌
అంజాద్‌బాషా, ఉపముఖ్యమంత్రి
అంబేడ్కర్‌ విగ్రహ ప్రారంభోత్సవం కులాలు, మతాలకు అతీతమైన పండుగ రోజు. అంబేడ్కర్‌ స్పూర్తితో రాష్ట్రంలో పేద వర్గాలను చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్న గొప్ప దార్శనికుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఎస్సీ, బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం అందిస్తున్న సీఎం జగన్‌ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. 

బాబు అవమానం... జగన్‌ గౌరవం 
టీడీపీ హయాంలో చంద్రబాబు దళితులను అవమానించాడు. సీఎం జగన్‌ దళితులను గౌరవిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ దళితులకు ప్రత్యేకంగా సంక్షేమాన్ని అందించడమే కాకుండా విజయవాడ నడి»ొడ్డున 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దళితులపై ఆయనకు ఉన్న ప్రేమ తెలుస్తోంది. – బి.డేవిడ్, సత్తివేడు 

దళితులకు పెద్దపీట  
సీఎం జగన్‌ అన్ని రంగాల్లో దళితులకు పెద్దపీట వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీలు,బీసీలందరూ జగన్‌కు అండగా ఉంటాం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినా నెరవేర్చలేదు. సీఎం జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధితో విగ్రహాన్ని ఆవిష్కరించారు.     – వి.మహేష్, శ్రీకాళహస్తి  

జనం గుండెల్లో నిలిచిపోతారు  
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. విజయవాడలో 206 అడుగుల ఎత్తున్న అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణం                 – వి.అరుణ్‌కుమార్, తిరుపతి  

జగన్, అంబేడ్కర్‌ను చూడ్డానికొచ్చా 
విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని, సీఎం జగన్‌బాబును చూడటానికి వచ్చా. నేను ఒక్కదానిని రావడానికి తెలియదు. అందుకే పక్కింటి అమ్మాయిని తోడు తెచ్చుకున్నా.. దళితుల పట్ల సీఎంకు ఉన్న శ్రద్ధ ఏ రాజకీయ నాయకుడికి లేదు. వెయ్యేళ్లు జగన్‌ బాబు వర్థిల్లాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. – మెరుగుమాల సుగుణమ్మ, చిలువూరు, గుంటూరు జిల్లా

అంబేడ్కర్‌ ఖ్యాతిని మరోసారి చాటారు 
సామాజిక సమానత్వం సీఎం జగన్‌ ప్రభుత్వంలోనే జరిగింది. టీడీపీ హయాంలో ఇదే విధంగా అంబేడ్కర్‌ విగ్రహాన్ని కడతామని కల్ల»ొల్లి మాటలతోనే కాలం గడిపేశారు. రాష్ట్రం నడిబొడ్డున ప్రపంచం గర్వపడేలా అంబేడ్కర్‌ విగ్రహాన్ని నిర్మించి ఆయన ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి సీఎం జగన్‌ చాటారు.     – తలారి శివకుమార్, గంగాధర్‌నెల్లూరు, చిత్తూరు జిల్లా  

ఆత్మ గౌరవం తీసుకొచ్చారు  
అంబేడ్కర్‌ ఆశయాలను సీఎం జగన్‌ తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు. ఆయన అమలు చేస్తోన్న ప్రతి పథకం ఎస్సీ,ఎస్టీ,బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతోంది. విజయవాడలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని నిర్మాణం చేసి బడుగు,బలహీన వర్గాల వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. – నెనావత్‌ భాస్కర్‌నాయక్, పత్తికొండ, కర్నూలు జిల్లా 

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంతో మేలు  
అంబేడ్కర్‌  నిలువెత్తు భారీ విగ్రహాన్ని విజయవాడలో ని     ర్మించిన సీఎం జగన్‌  మాకు దేవుడే. జగనన్న పాలనలో అమలైన పథకాల ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ, కాపు సామాజిక వర్గాల వారు చాలా మంది  అభివృద్ధి చెందారు.    – గొండిపల్లి సురేంద్రబాబు, శాగలేరు గ్రామం, పులివెందుల, కడప 

విగ్రహం ఏర్పాటు హర్షణీయం  
అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేయడం హర్షణీయం. ఆనాడు దళితుడని, అంటరానివాడని అంబేడ్కర్‌ను పాఠశాల బయట కూర్చోబెడితే నేడు నగరం నడి»ొడ్డున భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు.  – గొర్రెపాటి సాంబశివరావు, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా 

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు  
దళితుల ఆరాధ్యదైవం అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి దళితుల మీద ఉన్న ప్రేమను సీఎం జగన్‌ చాటుకున్నారు. ప్రపంచంలో కెల్లా ఎక్కడా లేనటువంటి 206 అడుగుల విగ్రహాన్ని  జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో అంబేడ్కర్‌ స్మృతివనం పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతుంది. – పీజే సైమన్, రిటైర్డ్‌ హెచ్‌ఎం, 

సంతరావూరు, చినగంజాం మండలం, బాపట్ల జిల్లా చిరస్థాయిగా నిలిచిపోతుంది  
ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని విజయవాడ నడి»ొడ్డున నిర్మించి ప్రారంభించటం సంతోషంగా ఉంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. విజయవాడ నగరానికి తలమానికంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని నిర్మించారు.  – మెడబలిమి భాస్కరరావు, వీబీ పాలెం, గుంటూరు జిల్లా  

మా హృదయాల్లో జగనన్న నిలుస్తారు 
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసింది. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఖ్యాతి ఇనుమడించేలా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌తో పాటు జగనన్న ప్రతీ ఒక్కరి హృదయాలలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు. – బుంగా జయరాజు, చెట్టునపాడు, ఏలూరు జిల్లా 

దళితులకు సముచిత స్థానం 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయసాధనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు. విజయవాడ నగరం నడి»ొడ్డున దళితుల ఖ్యాతి ఇనుమడింపచేసేలా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో దళితులకు సముచిత స్థానాన్ని సీఎం జగన్‌  కల్పించారు. –  జక్కుల ఆనందరావు, రాచర్ల, తాడేపల్లిగూడెం 

రాష్ట్రానికే ఐకాన్‌  
డాక్డర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం రాష్ట్రానికే ఐకాన్‌గా నిలుస్తుంది. కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంబేడ్కర్‌ స్మృతివనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా సీఎం జగన్‌ ప్రతీ ఒక్కరి హృదయాలలో చిరస్మరణీయ స్థానాన్ని  సంపాదించుకున్నారు. – ఎస్‌ వినయ్, మంగినపూడి, కృష్ణా జిల్లా 

యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది 
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ నగరం నడి»ొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా కలను సాకారం చేసిన  సీఎం జగన్‌కు ధన్యవాదాలు. –  సాగర్, గుంటూరు జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement