Dr. BR Ambedkar
-
రఘురామను సస్పెండ్ చెయ్యాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/చిలకలపూడి (మచిలీపట్నం)/తణుకు అర్బన్/భీమవరం/పాలకొల్లు సెంట్రల్/నగరి/తిరుపతి కల్చరల్/మంగళగిరి/ కోటవురట్ల/కాకినాడ క్రైం : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుపాడులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీని చింపి ఆయన్ను అవమానించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు, నేతలు డిమాండ్ చేశారు. అలాగే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం పలు చోట్ల రఘురామ దిష్టి బొమ్మను దహనం చేశారు. అలాగే దళిత డాక్టర్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సత్యవేడు ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకున్న చంద్రబాబు.. రఘురామపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. దళిత వర్గాలకు ఒక న్యాయం, అగ్రవర్ణాల వారికి ఒక న్యాయమా అంటూ నిలదీశారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు. పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో దళిత నేతలు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా నిరసనలుఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ఉమ్మడి పశ్చిమ జిల్లావ్యాప్తంగా సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ తీరుపై దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే అణచివేత ధోరణిలో ప్రభుత్వం పోలీసులతో కేసులు నమోదు చేయిస్తోందని దళిత నేతలు మండిపడ్డారు. అనేక నియోజకవర్గాల్లో రఘురామ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. భీమవరంలో దళిత సంఘాలు తలపెట్టిన భారీ ధర్నాను అడ్డుకునేలా హౌస్అరెస్టులు కొనసాగాయి. రఘురామను బర్తరఫ్ చేయాలికృష్ణాజిల్లా మచిలీపట్నం ధర్నాచౌక్ వద్ద దళిత యాక్షన్ కమిటీ నాయకులు నిరసన తెలిపారు. రఘురామను ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి జక్కుల ఆనంద్‌బాబు మాట్లాడుతూ.. ఎస్సీలను నోటికొచ్చినట్లు మాట్లాడి రఘురామకృష్ణరాజు అవమానించారన్నారు. ఆ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలన్నారు. న్యాయవాదుల రాస్తారోకో.. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం చట్టం కింద, దళిత వైద్యుడిపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి వారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని ఆలిండియా పూలే–అంబేడ్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది పొట్ల సురేశ్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసిన వారిపై ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయిస్తోందని మండిపడ్డారు. కూటమి ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా తణుకులో సోమవారం బార్ అసోసియేషన్ న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలి కూటమి ఎమ్మెల్యేల కుల దుహంకార చర్యలను నిరసిస్తూ అంబేడ్కర్ భవన్ అసోసియేషన్, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం తిరుపతిలోని బాలాజీ కాలనీలో పూలే విగ్రహం వద్ద ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రఘురామపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల సంఘాల రాష్ట్ర జేఏసీ కన్వీనర్ గుర్రం రామారావు డిమాండ్ చేశారు. సోమవారం మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘురామపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ దిష్టిబొమ్మ దహనంచిత్తూరు జిల్లా, నగరి బస్టాండు వద్ద అంబేడ్కర్ సర్కిల్లో ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం నేతలు రఘురామ కృష్ణరాజు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నిందపడగానే సస్పెండ్ చేసిన చంద్రబాబు.. అంబేడ్కర్‌ను అవమానించిన రఘురామను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. రఘురామ, నానాజీపై కఠిన చర్యలు తీసుకోండిడా.బీఆర్ అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై, దళిత వైద్యుడిపై దాడి చేసిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కఠిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎం.అప్పలరాజు, అంబేడ్కర్ గ్లోబల్ మిషన్ నాయకుడు కంచా లోవరాజు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే నానాజీపై నిరసనలు వద్దు..వైద్యులు, వైద్య విద్యార్థులకు పోలీస్, వైద్య శాఖల అధికారుల ఫోన్లుసాక్షి, అమరావతి: రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరావుపై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులపై చర్యలు తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం తరఫున పోలీసులు, వైద్య శాఖ ఉన్నతాధికారులతో వైద్యులు, వైద్య విద్యార్థులకు ఫోన్లు చేయిస్తూ నిరసనలు ఆపాలంటూ ఒత్తిడి తెస్తోంది.ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారని.. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలంటూ సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు, వైద్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నామమాత్రపు సెక్షన్లతో కేసు నమోదు చేసి చేతులు దులుపుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో వైద్యులు, వైద్య విద్యార్థులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలు, ఆస్పత్రి ప్రాంగణంలో ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. వైద్యులకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోతోందంటూ నినాదాలు చేశారు. ఊరుకుంటే.. ఉద్యమిస్తాండాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఇంతటి దాష్టీకం జరిగినా ప్రభుత్వ అధినేతలెవరికీ చీమకుట్టినట్టయినా లేదని వైద్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నానాజీని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడిలో పాల్గొన్న తూము బన్నీ సహా ఇతర అనుచరులను గుర్తించి శిక్షించాలని కోరారు. ఇంత జరుగుతున్నా పట్టనట్టు ఊరుకుంటే మాత్రం ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోమవారం హోరు వానలో కాకినాడ జీజీహెచ్ వద్ద వైద్యులు నిరసన తెలిపారు. -
భగ్గుమన్న దళితులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అవమానించడంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళితులను దుర్భాషలాడుతూ అంబేడ్కర్ ఫ్లెక్సీని చించివేయడంపై తీవ్రంగా స్పందించాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. తక్షణమే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. పెద్ద ఎత్తున నిరసనలు » ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దళిత నాయకులు ఆదివారం ఏలూరుపాడుకు చేరుకుని రా్రïÙ్టయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిõÙకం చేశారు. రఘురామకృష్ణరాజుపై 24 గంటల్లో అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, దళిత నాయకులు చీకటిపల్లి మంగరాజు, పెండ్ర వీరన్న, సుధామ, నల్లి రాజే‹Ù, గుమ్మాపు వరప్రసాద్, తాళ్లూరి మధు తదితరులు ఏలూరుపాడు గ్రామాన్ని సందర్శించి దళిత నాయకులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదివారం సాయత్రం భీమవరం అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. » ఏపీ బహుజన జేఏసీ, జై భీమ్ సేవాదళ్ ఆధ్వర్యాన భీమవరం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. జాతులు, కులాల మధ్య గొడవలు సృష్టించే విధంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రవర్తించారని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. » తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట సామాజిక న్యాయ పోరాట సమితి, జై భీమ్ యువజన సంఘం, సమత యువజన సంఘం, తణుకు అడ్వొకేట్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబేడ్కర్‌ను అవమానించి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, కాకినాడలో దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తణుకు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, నరేంద్ర సెంటర్లలో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. » చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోటలో దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంభం విజయరాజు మద్దతు తెలిపారు. » నూజివీడులో మాల యోధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. రఘురామకృష్ణరాజుపై నూజివీడు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కుల, మత ఘర్షణలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం సరికాదు. ఏలూరుపాడులో ఆయన స్వయంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించడం దారుణం. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలకు, అంబేడ్కర్ వాదులు అందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి. –పెండ్ర వీరన్న, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్బాబు పాలనలో దళితులపై దాడులు చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు సర్వసాధారణం. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన రఘురామకృష్ణరాజు ఏకంగా రాజ్యాంగ నిర్మాతనే అవమానించడంపై గవర్నర్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి. కాకినాడలో డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ దాడి చేయడం సిగ్గుచేటు. ఇద్దరు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలి. – నల్లి రాజే‹Ù, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడుఅట్రాసిటీ కేసు నమోదు చేయాలి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. అంబేడ్కర్ ఫ్లెక్సీని తొలగించిన రఘురామకృష్ణరాజు ఇప్పటికైనా తన తీరు మార్చుకుని అంబేడ్కర్‌కు క్షమాపణ చెప్పాలి. లేకపోతే దళితులంతా ఆయనకు తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారు. – కాకిలేటి ఆనందకుమార్ (మధు), వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శికులాల మధ్య చిచ్చుకే..ఏలూరుపాడులో ప్రపంచ మేధావి అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎమ్మెల్యే ఓ చదువుకోలేని అనామకుడిలా ప్రవర్తించి ఫ్లెక్సీలు చించివేయడం దారుణం. దళితుల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి గౌరవం లేదు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కులాల మధ్య చిచ్చుపెట్టి హీరో అవ్వాలని దురుద్దేశంతో ఫ్లెక్సీని చించి అంబేడ్కర్‌ని అవమానించారు. – గుమ్మాపు సూర్య వరప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, పీవీ రావు మాల మహానాడుకుల, ధన అహంకారంతోనే.. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన కుల, ధన అహంకారంతో రెచి్చపోయి అంబేడ్కర్ ఫొటో ఉన్న ఫ్లెక్సీని చించివేశారు. ఆ ఫ్లెక్సీ తొలగించే క్రమంలో ఆయన వాడిన భాష, బూతులు దారుణం. రఘురామకృష్ణరాజు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – పేరూరి మురళీకుమార్, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపకుడు, తణుకుజాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోవాలినెహ్రూనగర్/గోపాలపట్నం: టీడీపీ ఎమ్మెల్యే రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు నిరసన వ్యక్తంచేశారు. భీమ్ సేన సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపు నీలాంబరం మాట్లాడుతూ అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చించివేయడం, దళితులను దుర్భాషలాడటం సిగ్గుచేటన్నారు. ఈ విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుని రఘురామకృష్ణరాజుపై కఠిన చర్యలు తీసుకుని దళితుల మనోభావాలు కాపాడాలని కోరారు. అదేవిధంగా కాకినాడలో దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావును దుర్భాషలాడటంతోపాటు, దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, పంతం నానాజీలపై అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత సంఘాల నాయకులు విద్యాసాగర్, చిన్నం డేవిడ్ విలియమ్స్, బత్తుల అనిల్, మనోజ్‌కుమార్, మస్తాన్‌రావు, మనోహర్, విజయరాజు, జోసెఫ్, శంకర్, కాంతారావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలికాకినాడలో మెడికల్ కళాశాల ప్రొఫెసర్‌పై ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడం, అంబేడ్కర్ ఫ్లెక్సీని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చించివేయాన్ని ఖండిస్తూ విశాఖపట్నంలోని ఎన్ఏడీ కొత్త రోడ్డులో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వెల్ఫేర్ సంఘం సభ్యులు నిరసన తెలిపారు. పంతం నానాజీ, రఘురామకృష్ణరాజులను ఎమ్మెల్యే పదవులకు అనర్హులుగా ప్రకటించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వెల్ఫేర్ సంఘం సభ్యులు వెంకటేశ్వరరావు, ప్రసాద్, సోడదిశి సుధాకర్, అప్పారావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.వీధిరౌడీలా వ్యవహరించారు రఘురామకృష్ణరాజు ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక వీధిరౌడీలా వ్యవహరించారు. నిజంగా అక్కడ వారికి ఫ్లెక్సీ అడ్డుగా ఉంటే పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా తీయించాలి. ఇందుకు విరుద్ధంగా ఎమ్మెల్యే బూతులు తిడుతూ ఆయనే తొలగించడం దారుణం. – గొల్లపల్లి అంబేడ్కర్ సీనియర్ న్యాయవాది, తణుకు -
నిందితులెవరో తేల్చకుండా బెదిరింపులా?
సాక్షి, అమరావతి: రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం ఘటన కేసు దర్యాప్తులో విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించిన ఆగంతకులెవరో తేల్చకుండా.. ఆ సంఘటనను వక్రీకరించిన పత్రికలు, సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించడంపై విస్తుపోతున్నారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పి0చడం కాదా? అని నిలదీస్తున్నారు.విజయవాడ నడిబొడ్డున రాజ్‌భవన్, పోలీసు కమిషనర్ కార్యాలయానికి కూత వేటు దూరంలోని అంబేడ్కర్ స్మృతివనంలో సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు ఈనెల 8న రాత్రి కొందరు దుండగులు తెగబడ్డారు. స్మృతివనంలో పనిచేస్తున్న సిబ్బందిని రాత్రి 9 గంటలకు అక్కడి నుంచి బయటకు పంపి లైట్లన్నీ ఆర్పేసి సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ సీఎం జగన్ పేరును ధ్వంసం చేశారు. ఈ ఘటన జరుగుతుండగానే మీడియా ప్రతినిధులు పోలీసు కమిషనర్‌కు తెలిపేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. స్మృతివనం వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులను చూసి ఆగంతకులు పారిపోయారు. లేదంటే అంబేడ్కర్ విగ్రహం విధ్వంసానికి గురయ్యేదని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యోన్మాదంపై ఆగ్రహజ్వాల.. సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని బాబా సాహెబ్ అంబేడ్కర్ నినదించి ఆగస్టు 8వతేదీ నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అదే రోజు విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై టీడీపీ మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడంపై ప్రజాస్వామ్యవాదులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు మండిపడుతున్నారు. అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటనలో నిందితులెవరో తేల్చాలని ఉద్యమిస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారని స్పష్టం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతో ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో అంబేడ్కర్ విగ్రహంపై దాడి జరిగినట్లు స్పష్టమవుతోందని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేసేందుకు తెగబడ్డ ఉన్మాదులెవరో తేల్చకుండా కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలు వక్రీకరించి దు్రష్ఫచారం చేస్తూ సామాజిక వర్గాలు, దళిత సంఘాలను రెచ్చగొడుతూ వైషమ్యాలను సృష్టిస్తున్నాయని విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖరబాబు వ్యాఖ్యానించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.సీపీ గారూ.. సమాధానం చెబుతారా?» రాజ్‌భవన్, పోలీసు కమిషనర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న స్మృతివనంలో లైట్లన్నీ ఆర్పేసి అంబేడ్కర్ విగ్రహంపై కొందరు ఆగంతకులు దాడి చేయడం భద్రతా వైఫల్యం కాదా? » అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేస్తున్నారనే సమాచారాన్ని మీడియా మీకు అందించడానికి ప్రయత్నించినప్పుడు మీరు అందుబాటులోకి రాలేదన్నది వాస్తవం కాదా? » మీడియా ప్రతినిధులు, అంబేడ్కర్ ఆలోచనాపరులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున స్మృతివనం వద్దకు చేరుకోవటాన్ని చూసే కదా ఆగంతకులు పారిపోయారు? ఆ తర్వాతే అక్కడికి పోలీసులు వచ్చారన్నది నిజం కాదా? » అంబేడ్కర్ స్మృతివనం చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. వాటి ఫుటేజీని బయటపెట్టి నిందితులెవరో ఎందుకు తేల్చరు? » సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కనుసన్నల్లో ఎంపిక చేసిన పచ్చమూకలే అంబేడ్కర్ విగ్రహంపై దాడికి తెగబడ్డాయన్న నిజం బయటపడుతుందనే సీసీ ఫుటేజీని బహిర్గతం చేయడం లేదా? ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది పోయి ఖూనీ చేసిన వారికి వత్తాసు పలకడం కాదా? » సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును అప్పటికే ధ్వంసం చేశారు. స్మతివనం వద్దకు మీడియా, అంబేడ్కర్ ఆలోచనాపరులు, ప్రజాస్వామ్యవాదులు చేరుకునే సరికి ఆగంతకులు పారిపోయారు. లేదంటే అంబేడ్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేసే వారన్నది వాస్తవం కాదా? » అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటనను బహిర్గతం చేయడం మీ దృష్టిలో వక్రీకరించడమా? అది సామాజిక వర్గాలను, దళిత సంఘాలను రెచ్చగొట్టి వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడమా? -
అంబేడ్కర్ జోలికి వస్తే సహించం: వైఎస్సార్సీపీ శ్రేణులు
సాక్షి, నెట్వర్క్: విజయవాడ నగరం నడిబొడ్డున అంబేడ్కర్ స్మృతివనంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిరసించారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు శనివారం రాత్రి కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేశారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం జోలికి వస్తే సహించబోమని నినదించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కొవ్వొత్తులతో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, వైఎస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు పాల్గొన్నారు.» గుంటూరు నగరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో రాస్తారోకో, కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. యర్రగొండపాలెంలో జరిగిన నిరసనలో జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.» అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రాస్తారోకో చేసి, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో వైఎస్సార్సీపీ నేత ఈర లక్కప్ప ఆధ్వర్యంలో, హిందూపురంలో పార్టీ నేత దీపిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కర్నూలులో మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. కల్లూరులో జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.» విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు ఆధ్వర్యంలో, అనకాపల్లిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో, అడ్డరోడ్డు కూడలిలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఇచ్ఛాపురంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, రణస్థలంలో పార్టీ జిల్లా కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, పాతపట్నంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కొవొత్తుల ప్రదర్శనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు.» చిత్తూరులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు గాయత్రీదేవి, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో కడపలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్‌బాషా, కడప మేయర్ కె. సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కమలాపురంలో వైఎస్సార్సీపీ నాయకుడు, నవ్యాంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌బాబు ఆధ్వర్యంలో, అన్నమయ్య జిల్లా రాజంపేటలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండుగోపి తదితరుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. -
సోషల్ జస్టిస్‌కు నిలువెత్తు సాక్ష్యం..
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు స్ఫూర్తి సామాజిక న్యాయ మహా శిల్పం రూపంలో సగర్వంగా నిలిచింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్ మైదానం 18.81 ఎకరాల్లో రూ.404.35 కోట్లతో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేయడం విశేషం. అలాగే 81 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పీఠం(ఫెడస్టల్)పై 125 అడుగుల ఎత్తుగల ఈ అంబేడ్కర్ కాంస్య విగ్రహం కొలువై ఉంది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్(సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంబేడ్కర్ స్మృతివనాన్ని నిర్మిస్తామని స్థలం ఎంపిక చేసి కనీస కార్యాచరణ లేకుండా గాలికొదిలేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం చెప్పింది చేసి చూపించేలా సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. దేశీయంగా తయారైన ఈ కాంస్య విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయినది, దేశంలోని మతాతీత విగ్రహాల్లో ఇదే అతి పెద్దది కావడం మరో విశేషం. అంతటి స్ఫూర్తివంతమైన సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో అంబేడ్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు శనివారం సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్‌కు లోబడి నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రజలు, సామాజికవేత్తలు, అంబేడ్కర్ వాదులు విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించేలా ఏర్పాట్లు చేశారు. దర్శనీయక్షేత్రంగా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలకు అందించేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇది ప్రముఖ దర్శనీయ క్షేత్రంగా అందరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో విజయవాడ నగర నడిబొడ్డున చరిత్రాత్మక స్వరాజ్ మైదానాన్ని ప్రభుత్వం ఎంచుకుంది. సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడక కోసం ఈ ప్రాంతాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. పచ్చని ప్రకృతి ప్రతిబింబించేలా సౌందర్యవంతంగా దీనిని తీర్చిదిద్దారు. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంతంలో మరెన్నో ప్రత్యేకతలను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, రెండు వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చి్రల్డన్స్ ప్లే ఏరియా, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్, లాంగ్ వాక్ వేస్తో సహా మొత్తం ప్రాంతాన్ని తీర్చిదిద్దడం విశేషం. -
అద్భుత శిల్పం.. జాతికి అంకితం
సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకోగా, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏర్పాటుతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కీర్తిని మూటగట్టుకుంది. సామాజిక న్యాయ మహా శిల్పాన్ని జాతికి అంకితం చేసే మహత్తర కార్యక్రమం దిగ్విజయం అయ్యింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ వేడుకకు తరలివచ్చారు. మధ్యాహ్నానికి అశేష ప్రజావాహినితో స్వరాజ్ మైదానానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. సభా ప్రాంగణం జనంతో నిండిపోవడంతో స్వరాజ్ మైదానానికి ఆనుకుని ఉన్న మహాత్మా గాంధీ రోడ్డు, నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ల వద్ద జనం భారీగా గుమిగూడి ఆ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో జై భీమ్, జై జగన్ నినాదాలు మిన్నంటాయి. సాక్షి, అమరావతి: విజయవాడ నగరం నడిబొడ్డున భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అనంతరం బౌద్ధ వాస్తు శిల్పకళతో నిర్మించిన కాలచక్ర మహా మండపాన్ని ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహ పీఠం వద్ద ఆ మహనీయుని పాదాలపై పూలు చల్లి నివాళులర్పించారు. అంబేడ్కర్ జీవిత విశేషాలను ప్రదర్శించే విహార యాంఫీ థియేటర్‌ను ప్రారంభించారు. 18.81 ఎకరాల స్వరాజ్ మైదానంలో రూ.404 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన స్మృతివనం అంతా కలియతిరిగారు. జీవ కళ ఉట్టిపడే మైనపు విగ్రహాలు, అంబేడ్కర్ జీవిత విశేషాలు తెలియజేసే ఎక్స్పీరియన్స్ సెంటర్, 2 వేల మంది కూర్చొనేలా తీర్చిదిద్దిన కన్వెన్షన్ సెంటర్, 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టు, చిన్నారులు ఆడుకోవటానికి ప్లే ఏరియా, వాటర్, మ్యూజికల్ ఫౌంటెన్లు, ఉదయం, సాయంకాలం వేళల్లో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ మార్గాలను పరిశీలించారు. దేశానికే తలమానికంగా 81 అడుగుల పీఠంతో కలిపి 206 అడుగుల పొడవుతో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని ఆశయాలు స్ఫూర్తిగా జగనన్న పాలన సాగుతోందంటూ వందల సంఖ్యలో డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేడ్కర్ చిత్రం, నవరత్న పథకాలు, పీపుల్స్ లీడర్ సీఎం వైఎస్ జగన్, భారత పార్లమెంట్, భారతదేశ పటం, ఆంధ్రప్రదేశ్ మ్యాప్, కర్నూలు కొండారెడ్డి బురుజు, ప్రకాశం బ్యారేజ్, చిలుక, కూచిపూడి నృత్యం వంటి ఆకృతులతో డ్రోన్ల ప్రదర్శన ఆకాశంలో కనువిందు చేసింది. 14 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు గల జాతీయ పక్షి నెమలి ఆకృతి విశేషంగా ఆకట్టుకుంది. మిరుమిట్లు గొలిపే లేజర్ షో, బాణా సంచా వెలుగులు సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. అనంతరం అంబేడ్కర్ మహాశిల్పం ముందు సీఎం జగన్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు ఫొటోలు దిగారు. ఈ మహోత్సవంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు, ఉప ముఖ్యమంత్రులు కొట్టు సత్యనారాయణ, అంజద్ బాషా, పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, కె. నారాయణస్వామి, మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, ఆర్కె రోజా, విడదల రజని, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, గురుమూర్తి, నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుప్పాల హారిక, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్, ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర్రావు, సీఎస్ కెఎస్ జవహర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంబరం అంటిన సంబరం అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూర్యుడిలా ఆకాశమంత ఎత్తున రూపొందిన డాక్టర్ బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్ మహా శిల్పం ఆవిష్కరణ మహోత్సవం స్వరాజ్ మైదానంలో అంబరాన్ని తాకింది. నభూతో నభవిష్యత్ అనేలా సాగిన ఆ సంబరాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోలేదనడం అతిశయోక్తి కాదు. ఈ అపురూప కార్యక్రమానికి హాజరు కావడం తమ అదృష్టమని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు హర్షం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్‌కు ఇంతగా గౌరవం కల్పించడం పట్ల సీఎం వైఎస్ జగన్‌ను ప్రశంసించారు. మహిళలు, యువత ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంబేడ్కర్, సీఎం జగన్ చిత్రాలతో కూడిన ఫ్లకార్డులు, జెండాలను చేతపట్టి వారంతా సందడి చేశారు. అంబేడ్కర్ గేయాలు, నవరత్న పథకాలపై పాటలు, కళా రూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే కార్యక్రమం మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే కార్యక్రమం ఇది. దేశంలో ఎక్కడా లేని విధంగా జరుగుతున్న గొప్ప కార్యక్రమం, ఒకప్పుడు చంద్రబాబు మమ్మల్ని అవమానించారు, మా దేవుడ్ని అవమానించారు, మాపై దాడులు, అమానుషాలు చేయించారు, అంబేడ్కర్ విగ్రహం పెడతామని అవమానించారు, కానీ సీఎం జగన్ పాలనలో దళితులు గుండెలపై చేయి వేసుకుని ధైర్యంగా బతుకుతున్నారు, అంబేడ్కర్ కోరుకున్న రాజ్యాంగ వ్యవస్ధ తెచ్చారు, మా కులాల స్ధితిగతులు మార్చారు, ఏ రాష్ట్రంలో లేని విధంగా అంబేడ్కర్‌ను మీ గుండెల్లో, మీ కుటుంబంలో ఒకరిగా చేసుకున్నారు. అంబేడ్కర్ ఆశయాలు అమలు చేస్తున్న సీఎం జగన్ తానేటి వనిత, హోంశాఖా మంత్రి సామాజిక న్యాయ మహాశిల్పం(స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్) ఆవిష్కరణ ఒక గొప్ప రికార్డు. ప్రపంచంలోనే అతి ఎత్తైన మహా శిల్పాన్ని రూపొందించి ప్రారంభించే సభలో నాకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. అంబేడ్కర్ ఆశయాలు, పోరాటాల గురించి మనం చరిత్ర పుస్తకాల్లో చదివాం. కానీ అవి అమలు చేసిన చరిత్ర సృష్టించింది మన సీఎం జగన్. అంబేడ్కర్ సిద్దాంతాలు, ఆశయాలు, ఆలోచనలు, సంస్కరణలు, పోరాటాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు. మన కోసం పుట్టిన బాహుబలి జగన్ పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి ఊరి చివర దళితవాడల వద్ద అంబేడ్కర్ విగ్రహాలు ఉండేవి. గొప్ప మహనీయుడైన అంబేడ్కర్ స్పూర్తిని భావితరాలకు అందించే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని విజయవాడ నగర నడిబొడ్డున నిర్మించారు. అట్టడుగు వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన అంబేడ్కర్ బాహుబలి–1 అయితే మన కోసం పుట్టిన బాహుబలి–2 జగన్. పేదలను చేయి పట్టి నడిపిస్తున్న జగన్ అంజాద్‌బాషా, ఉపముఖ్యమంత్రి అంబేడ్కర్ విగ్రహ ప్రారంభోత్సవం కులాలు, మతాలకు అతీతమైన పండుగ రోజు. అంబేడ్కర్ స్పూర్తితో రాష్ట్రంలో పేద వర్గాలను చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్న గొప్ప దార్శనికుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎస్సీ, బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం అందిస్తున్న సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. బాబు అవమానం... జగన్ గౌరవం టీడీపీ హయాంలో చంద్రబాబు దళితులను అవమానించాడు. సీఎం జగన్ దళితులను గౌరవిస్తున్నారు. వైఎస్ జగన్ దళితులకు ప్రత్యేకంగా సంక్షేమాన్ని అందించడమే కాకుండా విజయవాడ నడి»ొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో దళితులపై ఆయనకు ఉన్న ప్రేమ తెలుస్తోంది. – బి.డేవిడ్, సత్తివేడు దళితులకు పెద్దపీట సీఎం జగన్ అన్ని రంగాల్లో దళితులకు పెద్దపీట వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీలు,బీసీలందరూ జగన్‌కు అండగా ఉంటాం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినా నెరవేర్చలేదు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధితో విగ్రహాన్ని ఆవిష్కరించారు. – వి.మహేష్, శ్రీకాళహస్తి జనం గుండెల్లో నిలిచిపోతారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. విజయవాడలో 206 అడుగుల ఎత్తున్న అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణం – వి.అరుణ్‌కుమార్, తిరుపతి జగన్, అంబేడ్కర్‌ను చూడ్డానికొచ్చా విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని, సీఎం జగన్‌బాబును చూడటానికి వచ్చా. నేను ఒక్కదానిని రావడానికి తెలియదు. అందుకే పక్కింటి అమ్మాయిని తోడు తెచ్చుకున్నా.. దళితుల పట్ల సీఎంకు ఉన్న శ్రద్ధ ఏ రాజకీయ నాయకుడికి లేదు. వెయ్యేళ్లు జగన్ బాబు వర్థిల్లాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. – మెరుగుమాల సుగుణమ్మ, చిలువూరు, గుంటూరు జిల్లా అంబేడ్కర్ ఖ్యాతిని మరోసారి చాటారు సామాజిక సమానత్వం సీఎం జగన్ ప్రభుత్వంలోనే జరిగింది. టీడీపీ హయాంలో ఇదే విధంగా అంబేడ్కర్ విగ్రహాన్ని కడతామని కల్ల»ొల్లి మాటలతోనే కాలం గడిపేశారు. రాష్ట్రం నడిబొడ్డున ప్రపంచం గర్వపడేలా అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించి ఆయన ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి సీఎం జగన్ చాటారు. – తలారి శివకుమార్, గంగాధర్‌నెల్లూరు, చిత్తూరు జిల్లా ఆత్మ గౌరవం తీసుకొచ్చారు అంబేడ్కర్ ఆశయాలను సీఎం జగన్ తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు. ఆయన అమలు చేస్తోన్న ప్రతి పథకం ఎస్సీ,ఎస్టీ,బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతోంది. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేసి బడుగు,బలహీన వర్గాల వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. – నెనావత్ భాస్కర్‌నాయక్, పత్తికొండ, కర్నూలు జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంతో మేలు అంబేడ్కర్ నిలువెత్తు భారీ విగ్రహాన్ని విజయవాడలో ని ర్మించిన సీఎం జగన్ మాకు దేవుడే. జగనన్న పాలనలో అమలైన పథకాల ద్వారా ఎస్సీ,ఎస్టీ, బీసీ, కాపు సామాజిక వర్గాల వారు చాలా మంది అభివృద్ధి చెందారు. – గొండిపల్లి సురేంద్రబాబు, శాగలేరు గ్రామం, పులివెందుల, కడప విగ్రహం ఏర్పాటు హర్షణీయం అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేయడం హర్షణీయం. ఆనాడు దళితుడని, అంటరానివాడని అంబేడ్కర్‌ను పాఠశాల బయట కూర్చోబెడితే నేడు నగరం నడి»ొడ్డున భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – గొర్రెపాటి సాంబశివరావు, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు దళితుల ఆరాధ్యదైవం అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి దళితుల మీద ఉన్న ప్రేమను సీఎం జగన్ చాటుకున్నారు. ప్రపంచంలో కెల్లా ఎక్కడా లేనటువంటి 206 అడుగుల విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో అంబేడ్కర్ స్మృతివనం పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతుంది. – పీజే సైమన్, రిటైర్డ్ హెచ్ఎం, సంతరావూరు, చినగంజాం మండలం, బాపట్ల జిల్లా చిరస్థాయిగా నిలిచిపోతుంది ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి»ొడ్డున నిర్మించి ప్రారంభించటం సంతోషంగా ఉంది. సీఎం జగన్మోహన్రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. విజయవాడ నగరానికి తలమానికంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించారు. – మెడబలిమి భాస్కరరావు, వీబీ పాలెం, గుంటూరు జిల్లా మా హృదయాల్లో జగనన్న నిలుస్తారు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసింది. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఖ్యాతి ఇనుమడించేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు జగనన్న ప్రతీ ఒక్కరి హృదయాలలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు. – బుంగా జయరాజు, చెట్టునపాడు, ఏలూరు జిల్లా దళితులకు సముచిత స్థానం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు. విజయవాడ నగరం నడి»ొడ్డున దళితుల ఖ్యాతి ఇనుమడింపచేసేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో దళితులకు సముచిత స్థానాన్ని సీఎం జగన్ కల్పించారు. – జక్కుల ఆనందరావు, రాచర్ల, తాడేపల్లిగూడెం రాష్ట్రానికే ఐకాన్ డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం రాష్ట్రానికే ఐకాన్‌గా నిలుస్తుంది. కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంబేడ్కర్ స్మృతివనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా సీఎం జగన్ ప్రతీ ఒక్కరి హృదయాలలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు. – ఎస్ వినయ్, మంగినపూడి, కృష్ణా జిల్లా యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది సీఎం జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ నగరం నడి»ొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా కలను సాకారం చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – సాగర్, గుంటూరు జిల్లా -
కోనసీమలో ‘నల్ల బంగారం’
సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలుస్తోంది. నదీతీరంలో బొగ్గు తయారీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రయోజనాలెన్నో.. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్‌ప్యాక్‌లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్‌లో కీలకమైన స్పేర్ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది. బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్ మిల్క్ యూనిట్‌తోపాటు కోకోనట్ చార్ కోల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. మన్నిక ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది. మార్కెట్ అవకాశాలు పెరగాలి మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం అత్యంత ధృడమైంది ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
125 అడుగుల అంబెడ్కర్ భారీ విగ్రహావిష్కరణ
-
అంబేడ్కర్ ఆశయాల అమల్లో కేసీఆర్
సనత్‌నగర్: దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో గురువారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్‌లతో కలసి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. ఆయన ఆశయాల అమల్లో భాగంగానే దళితబంధు వంటి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయని, పారిశ్రామికవేత్తలుగా వారు ఎదుగుతున్నారన్నారు. కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గమైన సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి పేరిట దళితబంధు తరహా పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. అలాగే నూతన సచివాలయ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టారని తెలిపారు. దళిత, గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే టీ–ప్రైడ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేటీఆర్ వివరించారు. కాగా, ఈ వేదికపై టీ–ప్రైడ్ కింద 8 వేల మంది ఔత్సాహికులకు రూ. 523 కోట్లను కేటీఆర్ మంజూరు చేశారు. అలాగే టీ–ప్రైడ్ కింద సబ్సిడీ పొంది విజయవంతంగా దూసుకెళ్తున్న 17 మందికి బెస్ట్ టీ–ప్రైడ్ అవార్డులను ప్రదానం చేశారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ)కి 2 ఎకరాల స్థలం కేటాయించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో హర్షధ్వానాలతో సభాప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రేఖానాయక్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ రామచంద్రనాయక్, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ‘డిక్కీ’ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, ఇండస్ట్రీస్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళిత, గిరిజనులకు స్వర్ణయుగం: సత్యవతి దళిత, గిరిజనులు కూడా అందరితో సమానంగా వృద్ధిలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దళిత, గిరిజనులకు ఇది స్వర్ణయుగం లాంటిదన్నారు. తెలంగాణ రాక ముందు 263 గురుకులాలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యికి చేరిందన్నారు. నూతన ఆవిష్కరణలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని, విజన్ ఉన్న సీఎంతోనే ఇది సాధ్యమవుతోందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీ–ప్రైడ్ ద్వారా ఎస్సీ, ఎస్టీలు యువ పారిశ్రామికవేత్తలుగా వృద్ధిలోకి వస్తున్నారన్నారు. కేసీఆర్ వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి... విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను విరమించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా డిమాండ్ చేయడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో పాల్గొంటామని కేసీఆర్ ప్రకటించడం వల్లే కేంద్రం దిగొచ్చి తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకున్నట్లు ప్రకటించిందని మంత్రి కేటీఆర్ వివరించారు. అదానీకి బైలడిల్లా గనుల కేటాయింపు కుట్రను బీఆర్ఎస్ బయట పెట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదంటూ కేంద్రం నామమాత్ర ప్రకటన చేసిందని కేటీఆర్ అంతకుముందు ఓ ప్రకటనలో విమర్శించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెంటనే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంపూర్ణంగా ఆగేంత వరకు, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటయ్యే వరకు కేంద్ర ప్రభుత్వంపై తమ ఒత్తిడి కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. -
మీడియాలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమేదీ?
బంజారాహిల్స్: మీడియాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఉండటం లేదని.. అలాంటప్పుడు సమాజంలో ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రముఖ విశ్లేషకుడు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం, భవిష్యత్తు అనే అంశంపై రెండో రోజైన ఆదివారం జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పౌర సమాజం బలంగా ప్రశ్నించడం వల్లే మీడియాలో ఆ మాత్రమైనా వార్తలు వచ్చాయని... కొందరు ఆంధ్ర పాలకులు అడ్డుపడినా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్–3 ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడిందన్నారు. తక్కువ శాతం జనాభా ఉన్న అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడంపై మీడియాలో ఎక్కడా ఎక్కువ చర్చ జరగలేదని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ జర్నలిజంపై ఇంకా లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాక్షి మీడియా గ్రూప్ సంపాదకుడు వర్ధెల్లి మురళి మాట్లాడుతూ మీడియా సంస్థలు ప్రజాప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారు. ‘మీడియా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ పెట్టుబడిదారులకు ఉపయోగకారిగా నిలుస్తోంది. ఈ పరిస్థితి మారి పాత్రికేయ స్వేచ్ఛను ఉపయోగిస్తూ ప్రజాప్రయోజనాలకు వాడాలి’అని కోరారు. గ్రామీణ, దళిత, మహిళా జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చాం: అల్లం నారాయణ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ నుంచి ప్రఖ్యాత పాత్రికేయులు ఉన్నారన్నారు. తమ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ పాత్రికేయులకు, దళిత జర్నలిస్టులకు, మహిళా పాత్రికేయులకు శిక్షణ ఇచ్చామన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె.సీతారామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రెండు రోజుల సదస్సుపై నివేదిక సమర్పించారు. కార్యక్రమంలో టిశాట్ సీఈవో ఆర్. శైలేశ్‌రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం–న్యూ మీడియా (బెంగళూరు) డీన్ డా. కంచన్ కౌర్, రాష్ట్ర ఐటీ (డిజిటల్ మీడియా) డైరెక్టర్ కొణతం దిలీప్, సీఈవో రాకేష్ దుబ్బుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ సుధాకర్‌రెడ్డి, ఉడుముల, సీనియర్ జర్నలిస్టు ఎ. కృష్ణారావు, వర్సిటీ సామాజిక శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ వడ్దానం శ్రీనివాస్, ప్రొఫెసర్ సత్తిరెడ్డి, సమన్వయకర్తలు యాదగిరి కంభంపాటి, సునీల్ కుమార్ పోతన, ఓయూ జర్నలిజం విభాగ విశ్రాంత అధ్యాపకురాలు పద్మజా షా, మాజీ సంపాదకుడు, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, వీక్షణం ఎడిటర్, ఎన్. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
BR Ambedkar: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావి. భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన పేరు పార్లమెంట్‌కు పెట్టడం సముచితమైంది. భారతదేశంలో కులం చట్రం నుండి బయటకు రాలేక చాలామంది దేశ నాయకులు ప్రపంచ మేధావులు కాలేక పోయారు. అంబేడ్కర్ ప్రపంచ మేధావిగా ఎదగ డానికి కారణం అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో సాగిన ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలే. ఇక్కడ సంపాదించిన జ్ఞానంతోనే అస్పృశ్యత, లింగవివక్ష, మతమౌఢ్యాలన్నింటినీ ఎదిరించగలిగాడు. ప్రత్యామ్నాయ తత్వాన్ని రూపొందించగలిగాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లోనూ, పార్లమెంట్ లోనూ, బహిరంగ వేదికల మీదా అనర్గళంగా మాట్లాడాడు. ఎన్నో పుస్తకాలు రాశాడు. హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటిష్ పార్లమెంట్)లో ఆయన శత జయంతిని జరిపారంటే... ఆయన స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ముక్కుసూటిదనం, తప్పును నిర్భయంగా ఖండించే తత్వం, అధ్యయన శీలత, దేశం పట్ల ప్రేమ ఆయన్ని దార్శనికునిగా నిలిపాయి. ఆయన 1951 అక్టోబర్ 29న పాటియా లాలో జరిగిన ఒక మహాసభలో మాట్లాడుతూ... ‘కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా నాపై ఎంతో ఒత్తిడి తెచ్చారు. నా అస్పృశ్యులకు ఏమాత్రం మంచి పని చేయని పార్టీలో నేనెందుకు చేరాలి? నేను చేరలేదు సరికదా మంత్రి పదవికి కూడా రాజీనామా చేశాను. ఇతర మంత్రులను రాజీనామా చేయమని అడిగినట్లుగా నన్నెవరూ రాజీనామా చేయమని అడగలేదు. నాపై ఎటువంటి ఆరోపణలూ లేవు. ఎవరైనా నా శీలంపైన మచ్చపడే విధంగా ఏవైనా చెప్పమని ఛాలెంజ్ చేశా. నాపై వేలెత్తి చూపడానికి ఏ ఒక్కరూ సాహసించలేదు’ అన్నాడు. ఇక రాజ్యాంగ రచన దగ్గరికొద్దాం. రాజ్యాం గాన్ని రాజ్యాంగ పరిషత్ రాసింది. రాజ్యాంగానికి ఒక రూపాన్ని ఇచ్చే నిమిత్తం ఏడుగురు సభ్యులతో ఒక ‘రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం’ ఏర్పాటు చేయబడింది. ఆ సంఘానికి అంబేడ్కర్ అధ్యక్షులు. వివిధ ఉప సంఘాలు పంపిన నివేదికలను క్రోడీకరించి, క్రమబద్ధీకరించి ఆ సంఘం రాజ్యాంగ ముసాయిదాను (చిత్తుప్రతి) తయారు చేసింది. 1948 జనవరిలో ఆ రాజ్యాంగ ముసాయిదా ప్రచురించబడి విడుదలయింది. ఆ ముసాయిదా రాజ్యాంగానికి 7,635 సవరణల ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, వాటిలో కేవలం 2,473 సవరణలను మాత్రమే రాజ్యాంగ పరిషత్ చర్చించింది. మిగిలిన వాటిని తిరస్కరించింది. నూతన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించగా, 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. దీంతో భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. 1947 ఏప్రిల్ 29వ తేదీన సమావేశమైన చట్ట సభలో అస్పృశ్యతను నిర్మూలిస్తూ తీర్మానం జరిగింది. దీనికి సంబంధించిన చిత్తుబిల్లును సర్దార్ వల్లభాయ్ పటేల్ చట్ట సభలో ప్రవేశపెట్టారు. ఇలా అస్పృశ్యతను చట్టరీత్యా నిర్మూలించే పరిస్థితి రావడానికి కారణం అంబేడ్కర్ మహోన్నతమైన కృషే కారణం. తరతరాలుగా అస్పృశ్యతలో మగ్గిపోతున్న ప్రజలకు ఈ చట్టం ఎంతో ఊరటను కలిగించింది. ఒక్క ఉదుటన వారు సంకెళ్ళను తెంచుకొని ప్రధాన స్రవంతి సమాజంలోకి పరుగులెత్తడానికి ఈ చట్టం రాచబాట వేసింది. అయితే ఈ కీర్తినంతా మహాత్మ గాంధీకి అంటగట్టాలని కాంగ్రెస్‌పార్టీ ఎంతో ప్రయత్నం చేసి విఫలమైంది. ఏ అస్పృశ్యతకైతే అంబేడ్కర్ గురి అయ్యారో ఆ అస్పృశ్యతా నివారణ చట్టాన్ని నిర్మించగలగడం, దాన్ని అగ్ర వర్ణాలు అధికంగా వున్న రాజ్యాంగ పరిషత్తులో నెగ్గేలా చేయడం అంబేడ్కర్ రాజనీతిజ్ఞతకు నిదర్శనం. ఆయన తన ప్రత్యర్థులను, శత్రువుల్ని కూడా తన వాదనా పటిమతో, తన జ్ఞాన వికాసంతో, తన శాస్త్ర ప్రమాణాలతో ఒప్పించగలిగిన ధీశక్తి గలవాడు. భారతదేశంలో ఉన్న ప్రతి మనిషినీ ఆయన కులం నుండి బయటపడేయాలని ప్రయత్నం చేశాడు. కులం మనిషికి గీతలు గీస్తుందనీ, అతడు ఎదగాల్సిన దిశ నుండి ఎదగకుండా, హద్దుల్లో వుంచుతుందనీ, ఇవ్వాళ అస్పృశ్యులుగా చెప్ప బడుతున్న వారు ఆర్యుల చేత ఓటమి చెందిన జాతులే కాని అస్పృశ్యులు కాదనీ, వారు భారత్‌ను పాలించిన జాతులనీ నొక్కి వక్కాణించారు. ఫ్రెంచి విప్లవం నుండి రూపొందిన స్వేచ్ఛ, సమానవత్వం, సౌభ్రాతృత్వ భావాలను ఆయన రాజ్యాంగంలో పొదిగారు. భారత పార్లమెంట్‌ను అత్యంత ఉన్నతమైన, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, భావజాల పూర్ణంగా రూపొందించారు. ఆయన నిర్మించిన ఈ ప్రజాస్వామ్య ‘భవనాని’కి ఆయన నామవాచకం పెట్టడం సముచితమైంది. అయోధ్యలోని రామ మందిరానికి రాముని పేరు పెడుతున్నారు కదా. అలాగే ఇదీ ప్రత్యా మ్నాయ భావజాలాల మానవతా మందిరం, మమతల సౌధం. అంబేడ్కర్ బౌద్ధ తత్వాన్ని జీర్ణించుకొన్న తాత్వికుడు. బౌద్ధ అంతస్సారమైన మానవత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, అవినీతి రహిత జీవనం లాంటి భావాలన్నింటినీ ఆయన రాజ్యాం గంలో పొందుపరిచారు. అలా మౌఖిక దశలో వున్న బౌద్ధ ధర్మాలను చట్టరూపంలోకి తీసుకురా గలి గాడు. ఈ రాజ్యాంగ సౌధాన్ని ఎవరూ కదిలించలేరు. దానికి ప్రతివాదం చేసిన వారంతా ఆ వాదంలో ఇమిడి పోవాల్సిందే. (క్లిక్ చేయండి: అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలంటే...) భారతదేశం ఈనాడు ప్రపంచం ముందు ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, పౌర హక్కులు, స్త్రీ అభ్యున్నతి, రాజకీయ సమతుల్యత వంటి అనేక విషయాల్లో తల ఎత్తుకుని నిలబడిం దంటే అది అంబేడ్కర్ సిద్ధాంతాలు, ఆశయాలు, నిర్మాణ దక్షత వల్లనే. భారత ఉపఖండంలో చరిత్రను మార్చిన వారు బుద్ధుడు, అశోకుడు, అంబేడ్కర్. వారు చరిత్ర విస్మరించలేని విశ్వజనీనులు. అందుకే అశోకుడి ధర్మ చక్రం భారత పతాకలో చేరింది. బుద్ధుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. అంబేడ్కర్ అస్తమించని సూర్యుడయ్యాడు. ఇప్పుడు పార్లమెంట్ భవనానికి ఆయన పేరే ఒక వెలుగు దివ్వె. ఆ వెలుగులో మనం నడుద్దాం! - డాక్టర్ కత్తి పద్మారావు ‘అంబేడ్కర్ జీవిత చరిత్ర’ రచయిత -
సచివాలయానికి అంబేడ్కర్ పేరుపెట్టండి
సాక్షి, మేడ్చల్ జిల్లా: తుది దశకు చేరుకున్న కొత్త సచివాలయ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మంత్రి కేటీఆర్ పార్లమెంట్ భవన్ పేరు మార్పు గురించి మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీలో అంబేడ్కర్ ఫొటో తీసేసి సీఎం కేసీఆర్ తన ఫొటో పెట్టించుకున్న విషయం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో బండి సంజయ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. సభలో సీఎం రాజకీయాలా? ప్రధాని మోదీపట్ల సీఎం కేసీఆర్ సంస్కారహీనంగా మాట్లాడారని.. అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు, రాష్ట్ర పరిస్థితులపై చర్చించాల్సిన శాసనసభలో సీఎం కేసీఆర్ రాజకీయాలు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు అసెంబ్లీని నడిపే అర్హత లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ ఎమ్మెల్యేలు ఎండగడుతున్నందుకే ఒక ఎమ్మెల్యేను (రాజాసింగ్) జైలుకు పంపించారని... ఇప్పుడు మరో ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్ చేశారని సంజయ్ దుయ్యపట్టారు. మోదీని ఫాసిస్టు అన్నందుకు మాకెంత కోపం రావాలి.. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. ఈటల సస్పెన్షన్‌ను ఖండిస్తున్నానని, ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని బండి తెలిపారు. అసెంబ్లీ బయట స్పీకర్‌ను మరమనిషి అని ఈటల విమర్శించినందుకే అధికార పార్టీ సభ్యులకు అంత కోపం వస్తే... నిండు సభలో ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఫాసిస్టు ప్రధాని అన్నందుకు తమకు ఎంత కోపం రావాలన్నారు. హామీలను అమలు చేయలేని వాళ్లను మరమనిషి అనడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. వీఆర్ఏలను బర్ల లెక్క కొట్టారు.. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 50 రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్ఏలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నిస్తే పోలీసులు వారిని బర్ల లెక్క కొట్టి తీసుకెళ్లారని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రగతి భవన్ సందర్శకుల జాబితాలో ఒవైసీ సోదరులు తప్ప ఇతరుల పేర్లేవీ కనిపించవని.. ఇంకెవరినీ లోనికి రానీయరని విమర్శించారు. దమ్ముంటే ఆ జాబితాను బయట పెట్టాలన్నారు. -
అంబేడ్కర్ గురుకులాలకు యమా డిమాండ్
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. ఐదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఇందుకు అద్దంపడుతున్నాయి. దరఖాస్తులకు గురువారం ఆఖరి తేదీ కావడంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 8 వరకు ఆ గడువు పెంచుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు వెల్లడించారు. 2022–23 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతిలో 14,940 సీట్లు ఉండగా.. 53,946 మంది దరఖాస్తు చేశారని చంద్రుడు తెలిపారు. అలాగే, జూనియర్ ఇంటర్లో 13,560 సీట్లకు 34 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఐదో తరగతికి అత్యధికంగా కర్నూలు, అనంతపూరం, విశాఖపట్నం జిల్లాల నుంచి.. ఇంటర్ ఫస్టియర్ కోసం కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీటిపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. -
భీంరావ్ రామ్‌జీ అంబేడ్కర్
లక్నో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుకు ఆయన తండ్రి ‘రామ్‌జీ’ పేరును చేర్చాలని ఉత్తరప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం అంబేడ్కర్ పేరున్న ప్రతిచోటా (రికార్డుల్లో) రామ్‌జీ పదాన్ని చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కార్యదర్శి (పరిపాలన) జితేంద్ర కుమార్ పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘అంబేడ్కర్ తండ్రి పేరు రామ్‌జీ. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వ్యక్తి పేరు, ఇంటిపేరుకు మధ్య తండ్రి పేరు ఉంటుంది. అందుకే భీంరావ్ రామ్‌జీ అంబేడ్కర్ అని రికార్డుల్లో మారుస్తున్నాం’ అని సెక్రటేరియట్ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. కాగా, యోగి సర్కారు నిర్ణయాన్ని ఎస్పీ, బీఎస్పీ తీవ్రంగా విమర్శించాయి. ‘అంబేడ్కర్ పేరు మార్చటం ద్వారా లబ్ధిపొందాలని ప్రభుత్వం నీచమైన నాటకాలు ఆడుతోంది. స్వలాభం కోసం బీజేపీ.. అంబేడ్కర్ పేరును దుర్వినియోగం చేస్తోంది’ అని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. ‘గాంధీ పేరును మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అని, ప్రధాని పేరును నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అని ఎవరైనా పిలుస్తారా? అలాంటప్పుడు అంబేడ్కర్ పేరు మార్చటం ఎందుకు?’ అని మాయావతి ప్రశ్నించారు. అంబేడ్కర్ పేరు మార్చటం కన్నా.. ఆయన చూపిన బాటలో బీజేపీ ప్రభుత్వం నడిస్తే బాగుంటుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సూచించారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కూడా ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. -
వచ్చే ఏడాది అంబేడ్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ
డిప్యూటీ సీఎం కడియం, మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నాటికి ఆవిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిం చామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. అంబేడ్కర్ 125 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబా ద్‌లోని ఐమాక్స్ నెక్లెస్ రోడ్డు వద్ద 125 అడుగుల అంబేడ్కర్ భారీ కాంస్య విగ్రహా న్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిష్టాçపన కమిటీ వేసినట్లు వారు పేర్కొన్నారు. గురువారం ఇక్కడ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కి టెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ప్రాంగణంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ శిల్పకళాకారులు మలిచిన అంబేడ్కర్ విగ్రహ నమూనాలను కడియం, జగదీశ్‌రెడ్డిలు పరిశీలించారు. శ్రీహరి మాట్లాడుతూ ఈ ఏడాది అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విగ్రహ ప్రతిష్టాపన చేయబోయే ప్రాంతంలోని మట్టిని పరీక్షించడంతోపాటు విగ్రహ నమూనా రూపకల్పనకు కన్సల్టెంట్‌ను నియమించనున్నట్లు చెప్పారు. నోడల్ ఏజెన్సీగా ఆర్ అండ్ బి శాఖ వ్యవహరిస్తుం దని, ప్రాజెక్ట్ వర్క్‌ను రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా సమన్వయం చేస్తారని తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపన పనుల ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ గణపతిని నియమించినట్లు చెప్పారు. -
పోరాటాలతోనే ఎదుగుదల
‘మాలల రణగర్జన’లో అంబేడ్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ పెదకాకాని(పొన్నూరు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి సమష్టిగా పోరాటాలు చేయడం ద్వారానే మాలలు రాజకీ యంగా ఎదుగుతారని అంబేడ్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్ అన్నారు. గుంటూరుజిల్లా పెదకాకానిలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఆది వారం మాలల రణగర్జన జరిగింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ‘చలో అమరావతి’ పిలుపులో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బహిరంగసభలో భీమ్రావ్ మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాలలు రాజకీయ శక్తిగా ఎదగడానికి ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు. మాలల హక్కుల సాధనకోసం సమతా సైనికదళ్ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. మాలమహా నాడు రాష్ట్ర నాయకుడు మల్లెల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ఎస్సీ వర్గీకరణ కుట్రను తెలియజేస్తూ కారం శశిధర్, గౌరీశ్వరరావు సంపా దకులుగా రూపొందించిన పుస్తకాన్ని భీమ్రావ్ ఆవిష్కరించారు. -
రాజ్యాంగ నిర్మాతకు క్రీడా నివాళి
విజయనగరం మున్సిపాలిటీ: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు క్రీడా నివాళి అర్పించేందుకు విజయనగరం సిద్ధమైంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) నేతృత్వంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు విజ్జీ, రాజీవ్ స్టేడియంలు ముస్తాబయ్యాయి. మూడు రోజుల పాటు కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నవి. ఏర్పాట్లలో అధికార యంత్రాంగం తలమునకలైంది. దీనికోసం కలెక్టర్ అధ్యక్షతన 14 కమిటీలు వేశారు. అయితే, రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు ప్రభుత్వం కేవలం రూ.12 లక్షల నిధులు మాత్రమే కేటాయించింది. నిధులు చాలవంటూ జిల్లా యంత్రాంగం శాప్‌కు నివేదించింది. బరిలో 1300 మంది క్రీడాకారులు.. రాష్ట్ర స్థాయి పోటీలకు 13 జిల్లాల నుంచి 1300 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. ఈమేరకు శనివారం ఉదయానికి నెల్లూరు, అనంతరపురం, ప్రకాశం జిల్లాలకు చెందిన క్రీడాకారులు విజయనగరం చేరుకోగా... మిగిలిన జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పోటీల పర్యవేక్షణ కోసం 300 మంది ఆఫీషియల్స్ జిల్లాకు చేరుకున్నారు. వీరికి వసతి సదుపాయాన్ని జిల్లా అధికారులు కల్పించారు. బాలికల కోసం నాయుడు ఫంక్షన్ హాల్, తోష్నివాలా భవన్లు కేటాయించగా.. బాలుర క్రీడాకారుల కోసం ఉల్లివీధిలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం, లేడీస్ రిక్రియేషన్ క్లబ్, టీటీడీ కల్యాణ మండపం, రెవెన్యూ కల్యాణ మండపం, పోలీస్ ట్రైనింగ్ కళాశాలలను కేటాయించారు. ఆఫీషియల్స్ వసతి కోసం యూత్ హాస్టల్‌తో పాటు జిల్లా పరిషత్, ఆర్అండ్బీ అతిథి గృహాలను కేటాయించారు. పోటీల్లో విజేతలకు నగదు ప్రోత్సాహకాలు పోటీల్లో విజేతలుగా నిలిచే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. విజేతలుగా నిలిచిన వరుస మూడు జట్లు, క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ.1500, రూ.1000, రూ.500 చొప్పున నగదు, జ్ఞాపికలు అందజేయనున్నారు. మైదానంలోనే సదుపాయాలు.. క్రీడాకారులకు మైదానంలోనే మౌలిక సదుపాయాలు కల్పించారు. క్రీడాకారులకు కేటాయించిన వసతి నుంచి 20 బస్సుల్లో ఉదయం 7 గంటలకే విజ్జి మైదానానికి తరలించనున్నారు. ఈ రవాణా ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికులు పర్యవేక్షించనున్నారు. మైదానం ఆవరణలో ఏర్పాటు చేసిన భోజనశాల వద్దనే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ముగించిన తరువాత వారికి కేటాయించిన వసతి వద్దకు తరలించనున్నారు. మైదానం ఆవరణలో పక్కా మరుగుదొడ్లు లేకపోవటంతో 34 మొబైల్ టాయిలెట్లు బాల, బాలికలకు వేరువేరుగా నిర్మించారు. క్రీడాకారులకు తాగేందుకు నీటి సదుపాయం, ఆటలో దెబ్బలు తగిలితే ప్రథమ చికిత్స అందించేందుకు మూడు మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. -
అంబేద్కర్‌కు వైఎస్సార్సీపీ నివాళులు
హైదరాబాద్ : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవంపై ప్రసంగించిన నేతలు అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మేరుగ నాగార్జున, భూమన కరుణాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, చల్లా మధు, పుత్తా ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు. -
కులం మూలంపై తొలి వేటు
కొత్త కోణం అంబేడ్కర్ ‘కులాల పుట్టుక’ నూరేళ్ల తరువాత కూడా ప్రామాణికమైనదిగా నిలిచింది. ‘‘కులం ఉనికిలోకి రావడం, దీర్ఘకాలం మనుగడ సాగించడం ఆశ్చర్యకరమైన, జటిలమైన సమస్యలు. కులం మనుగడకు అవసరమైన షరతులు కఠినమైనవి. ఒక విశ్వాసం పునాదిపై సాంఘిక వ్యవస్థ నిలబడాలంటే అంతకు ముందే ఆ వ్యవస్థ పుట్టి, పెరిగి, గట్టిపడి ఉండాలి’’ అంటూ పరిశోధక విద్యార్థిగానే అంబేడ్కర్ కొత్త దారిని చూపారు. సత్యాన్వేషణలో పక్షపాతానికి, వ్యక్తిగత అభిప్రాయానికి చోటు లేదని స్పష్టం చేశారు. ‘‘కులంపై సామాజిక శాస్త్రవేత్తలు గతంలో చేసిన నిర్వచనాలను పరిశీలిస్తే అవి అవసరమైన దానికన్నా ఎక్కువగానో, లేదా సంక్షిప్తంగానో ఉన్నట్టు తోస్తున్నది. ఏ ఒక్కటీ సంపూర్ణంగా లేదు. కుల వ్యవస్థకు గుండెకాయలాంటి అత్యంత కీలకమైన అంశాన్ని వారు పూర్తిగా విస్మరించారు. వీరంతా కులాన్ని మొత్తం కులవ్యవస్థలో ఒక అంతర్భాగంగా, ఇతర కులాలతో నిర్దిష్ట సంబంధాలుగల సమూహంగా కాక, తన చోట తాను స్వతంత్ర అస్తిత్వంలో ఉన్న యూనిట్‌గా నిర్వచించే ప్రయత్నం చేశారు’’ అంటూ పట్టుమని పాతికేళ్ళు కూడా లేని ఒక యువకుడు 1916లో గళమెత్తాడు. అంతకు ముందు భారత కుల వ్యవస్థను అధ్యయనం చేసిన ఫ్రెంచి పండితుడు సెనార్ట్, సామాజిక వేత్త నెస్‌ఫీల్డ్, జనాభాగణన అధికారి రిస్లీ, భారత సామాజికవేత్త డాక్టర్ కేట్కర్‌లు కులాన్ని నిర్వచించిన తీరును చర్చిస్తూ... ధైర్యంగా ఆ యువకుడు కుల వ్యవస్థ అధ్యయనానికి నూతన పథ నిర్దేశన చేయడానికి ముందుకొచ్చాడు. నాడు కొరకరాని కొయ్యగా ఉన్న ‘‘కుల సమస్య పుట్టుక-దాని-నిర్మాణం-ప్రభావం’’ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించిన ఆ యువకుడు మరెవరో కాదు... డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్! ‘కులం పుట్టుక ’ పోరుకు నాంది అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థిగా ఉండగా మానవ శాస్త్ర(ఆంత్రోపాలజీ) విభాగం 1916 మే రెండవ వారంలో నిర్వహించిన సెమినార్లో ఆయన ఆ పరిశోధనా పత్రాన్ని చదివి వినిపించారు. ఆ పత్రాన్ని సమర్పించి నేటికి నూరేళ్లు. అంబేడ్కర్ ఈ పరిశోధనను కేవలం తన డాక్టరేట్ డిగ్రీ కోసమే చేయలేదనేది ఆ తర్వాత సాగిన ఆయన జీవనయానమే స్పష్టం చేస్తుంది. ఆయన కులంపై పరిశోధనకు పరిమితంగాక, యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ యుద్ధాన్ని తుదకంటా కొనసాగించాడు. కుల సమస్యకు పరిష్కారాన్ని చూపాడు. అందుకే అంబేడ్కర్ ఒక విద్యార్థిగా కులంపై చేసిన ఆ పరిశోధనకు చాలా ప్రాధాన్యమున్నది. అంతేకాదు, సామాజిక పరిశోధకుడిగా, చరిత్రకారుడిగా ఆయన చేసిన అనన్య సామాన్య కృషిలోని తొలి మైలు రాయి. అంబేడ్కర్ తర్వాత 1932లో జీఎస్ గుర్యే రాసిన ‘క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా’ పుస్తకం కులంపై ప్రామాణిక గ్రంథంగా చలామణిలో ఉంది. గుర్యే తన గ్రంథానికి చివర ఇచ్చిన ఉపయుక్త గ్రంథాల పేర్లలో అంబేడ్కర్ పరిశోధనా పత్రం పేరు లేకపోవడం యాదృచ్ఛికమా? లేదా కావాలనే ఆయన పేరును విస్మరించారా? ఏది ఏమైనా సామాజిక పరిశోధనలో అంబేడ్కర్ కృషిని విస్మ రించారనేది స్పష్టమే. అంబేడ్కర్ అనంతరం వచ్చిన పరిశోధనా గ్రంథాలలో కూడా ఇక్కడి పరిస్థితులపై సమగ్రమైన విశ్లేషణ లేకపోవడం గమనిస్తూనే ఉన్నాం. నూరేళ్ళ తరువాత కూడా ఆయన రాసిన ‘కులాల పుట్టుక’ ప్రామాణికమైనదిగా ఉండటం విశేషం. ఆ పరిశోధనలో నాలుగు విషయాలను అంబేడ్కర్ ప్రధానమైనవని ప్రకటించాడు. ఒకటి, కులం ఒక అఖండ సాంస్కృతిక వ్యవస్థను ముక్కలుగా విడగొట్టడం. రెండు, కులం మొదట ఒక తెగగా మొదలుకావడం. అనుకరణ, బహిష్కరణ అనే మిగతా రెండు క్రమాల వల్ల కులాలు రూపొందడం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘‘నిజానికి కులం ఉనికిలోనికి రావడం, దీర్ఘకాలం మనుగడ సాగించగలగడం అన్నవి చాలా ఆశ్చర్యకరమైన, జటిలమైన సమస్యలు. ఎందుకంటే కులం మనుగడకు అవసరమైన షరతులు చాలా కఠినమైనవి. విశ్వాసంపై కులం ఆధారపడి ఉండే మాట నిజమే. కానీ ఒక విశ్వాసం అనే పునాదిపై సాంఘిక వ్యవస్థ నిలబడాలంటే అంతకు ముందే ఆ వ్యవస్థ పుట్టి, పెరిగి గట్టిపడి ఉండాలి’’ అంటూ ఆయన కులం పునాదిని వివరించారు. పరిశోధనలో పక్షపాతానికి తావు లేదు కులం నిత్య జీవితాచరణలో చాలా ముఖ్యమైనదని చెప్తూనే.... కులం మూలాలను సైద్ధాంతికంగా విశ్లేషించాలనే ఆసక్తిని కూడా అంబేడ్కర్ ఆ పరిశోధనా పత్రంలో వెలిబుచ్చారు. అయితే తన నిర్ధారణలు సరైనవని, అవి మాత్రమే సహేతుకమైనవని తనకు అనిపించవచ్చునని... అయితే ఆ విషయంలో అంతిమ సత్యాన్ని కనుగొన్నానని చెప్పేంత భ్రమలు తనకు లేవని కూడా స్పష్టంగా ప్రకటించారు. ఈ విషయంపై మరింత లోతైన, సమగ్రమైన చర్చ జరగడానికి తన వంతు కృషి చేస్తానని మాత్రమే చెప్పారు. కులంపై పరిశోధనను సరియైన దారిలోకి తెచ్చి, సత్యాన్వేషణను సుగమం చేయడానికి తాను ప్రయత్నించానని, ఇందులో ఎలాంటి పక్షపాతానికి వ్యక్తిగత అభిప్రాయానికి చోటు లేదని, ఉండకూడదని స్పష్టం చేశారు. ఆయన తన నలభైయేళ్ళ అధ్యయన, ఉద్యమ ప్రస్థానంలో సరైన, నిజాయితీ కలిగిన పరిశోధకుడిగా, నాయకుడిగా తన కృషిని సాగించార నడానికి అంబేడ్కర్ రచనలు, ఆచరణే నిదర్శనాలు. కుల వివక్షకు వ్యతి రేకంగా సాగించిన మహద్ చెరువు, కాలారాం ఆలయ ప్రవేశ పోరాటాలు అంబేడ్కర్ ఉద్యమ గమనాన్ని ఖరారు చేశాయి. 1930-31 లండన్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంబేడ్కర్ రాజకీయ హక్కుల కోసం పోరాటం సాగించడమే కాదు... కులంపైన, దాన్ని పెంచి పోషిస్తోన్న హిందూ మతం పైన కూడా పోరాడారు. 1936లో కుల నిర్మూలన కోసం ఒక మహత్తర పోరాటానికి ఆయన మార్గం వేశారు. అంబేడ్కర్ ‘కుల నిర్మూలన’ ఆ ఉద్యమ ప్రస్థానంలో అతి ముఖ్యమైన ఘట్టం. ఆయన కుల నిర్మూలనా కార్యక్రమంతోపాటూ... హిందూ మతం మనుగడ సాగించాలంటే అనుసరిం చాల్సిన కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. నేటికీ హిందూ మత సంరక్షకు లెవ్వరూ దాన్ని పట్టించుకోకపోగా, వారి సనాతన భావాలను వదులు కోవడానికి సిద్ధంగా లేరు. దాని ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ‘అస్పృశ్యులెవరు?’ కులానికి సంబంధించిన పలు విషయాలతో పాటూ అంటరానితనం మూలాలను సుస్పష్టంగా చెప్పగలిగినది అంబేడ్కర్ మాత్రమే. ఆయన రాసిన ‘అస్పృశ్యులెవరు?’ అనే గ్రంథమే అందుకు సాక్ష్యం. ఇది కూడా ఈ సమస్యపై అంతకు ముందటి రచనలను, అధ్యయనాలను పూర్వపక్షం చేసింది. అపరిశుభ్రత, ఆవు మాంసం తినడం లాంటి విషయాలే అంటరాని తనానికి కారణాలనే వాదనలను అంబేడ్కర్ ఒక్కొక్కటిగా ఉదాహరణలతో సహా తిరస్కరించారు. అపరిశుభ్రత అన్ని చోట్లా ఉన్నదని, అన్ని కులాల్లో అది సర్వసాధారణమని, అదెంత మాత్రం అంటరానితనానికి కారణం కాదని చెప్పారు. ఆవు మాంసం విషయానికొస్తే అంటరాని కులాలు మాత్రమేకాక, ఇతరులు చాలా మంది ఆవు మాంసం తింటున్నట్టు రుజువు చేశారు. అంతేగాక చారిత్రక విశ్లేషణ ద్వారా ఆయన హిందూ మత రక్షకులుగా ఉన్న వారే మాంసాహారులుగా ఉన్న విషయాన్ని శాస్త్ర గ్రంథాల సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. నిజానికి అంటరానితనాన్ని రాజకీయ సమస్యగా చూడా ల్సిందే తప్ప, కేవలం ఆచార వ్యవహారాలకు సంబం ధించినది కాదని చెప్పారు. చివరగా, బౌద్ధంపై వైదిక మతం చేసిన దాడుల వల్ల భయపడి అందులోనుంచి లొంగిరాని తెగలను, ప్రజలను ఊరు నుంచి, సమాజం నుంచి వెలివేసినట్టు తేల్చారు. బౌద్ధులను రాజకీయంగా అణచివేయడం కోసమే ఈ బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించారని, అంతిమంగా వారు అంటరాని కులాలుగా ఏర్పడ్డారని తేల్చి చెప్పారు. రాజకీయ, సామాజిక మతపరమైన అంశాలు ఏ విధంగా అంటరానితనాన్ని పెంచి పోషించాయనే విషయాన్ని ఆయన తెలిపారు. హిందూ మత తాత్విక చింతనను తెలియజేస్తూనే అందులో ఉన్న వివిధ అంశాలను విశ్లేషించారు. ముఖ్యంగా ఆయన ‘రాముడు, కృష్ణుడి రహస్యాలు’ రచనలో వారికి సంబంధించిన చారిత్రక విషయాలను నేటి సామాజిక ధృక్పథం నుంచి వివరించారు. ఆ రచన హిందూ మతంలో సంచలనాన్ని రేపింది. కులాల రూపకల్పన చేసిన మనువుని ఎండగట్టడం ఆయన రచనల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. ‘శూద్రు లెవరు?’ అనే అంశంపై చేసిన ఆయన జరిపిన పరిశోధన కూడా అత్యంత విశిష్టమైనది. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించిన క్షత్రియులను వర్ణవ్యవస్థ లోని నిచ్చెన పై మెట్ల నుంచి కిందకు తోసి శూద్రులుగా ముద్ర వేశారని ఆయన ఆధారాలతో బయటపెట్టారు. దీని కొనసాగింపుగానే భారతదేశ చరిత్రపై కూడా ఆయన తన పరిశోధనను కొనసాగించారు. ఆయన రాసిన ‘విప్లవం, ప్రతీఘాత విప్లవం’ అనే పుస్తకం ఈ దేశంలో బౌద్ధం సాధించిన విజయాన్ని, హైందవం జరిపిన మారణకాండను సోదాహరణంగా వివరించింది. అంతేగాక, భారత దేశ చరిత్రను హిందూమతానికీ, బౌద్ధానికీ మధ్య జరిగిన సంఘర్షణగా వివరించడం ద్వారా అంబేడ్కర్ ఒక పరిణతి చెందిన చరిత్రకారుడిగా మనకు దర్శనమిస్తారు. 1936 ప్రాంతంలో ఒక సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ తాను హిందువుగా పుట్టడం తన చేతుల్లో లేదని, కానీ తాను హిందువుగా మాత్రం మరణించనని ప్రకటించారు. అన్నట్టే ఆయన 1956 అక్టోబర్ 14న బౌద్ధం స్వీకరించారు. తద్వారా హిందుత్వం సృష్టించిన కులాన్ని జయించి విజయపతాకాన్ని ఎగురవేశారు. 1916లో కులంపైన పరిశోధనలు మొదలు పెట్టిన పాతికేళ్ళ యువకుడు 40 ఏళ్ళ తరువాత అదే కులాన్ని తిరస్కరించి ఒక నవసమాజ నిర్మాణానికి అంకురార్పణ చేశాడు. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
♦ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన ♦ దళిత గ్రామాలన్నిటికీ సిమెంటు రోడ్లు ♦ రెసిడెన్షియల్ స్కూళ్లుగా ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, దళితుల ఉన్నతికి ఎంతో కృషి చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా నూతన రాజధాని అమరావతిలో 125 అడుగుల ఎత్తై అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని సీఎం మంగళవారం అసెంబ్లీలో స్టేట్మెంట్ చదివి వినిపించారు. ‘అమరావతిలో 15 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్ స్మృతి వ నం, బౌద్ధుల ధ్యానకేంద్రం, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు నా అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కృషి చేస్తోంది. రానున్న ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ కాలనీలన్నిటికీ సిమెంట్లు రోడ్లు వేస్తాం. సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టళ్లన్నిటినీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా మారుస్తాం. అంబేడ్కర్ జయంతి రోజున 6 లక్షల మంది పేదలకు గృహాలు నిర్మించే పనికి శ్రీకారం చుడుతున్నాం..’ అని సీఎం చెప్పారు. ఏడాదిలో ఎన్టీఆర్ సుజల కింద అన్ని దళిత గ్రామాలకు తాగునీరు అందిస్తామని, ప్రస్తుతం ఉన్న రెండు బల్బులు కాకుండా, మరో రెండు ఎల్ఈడీ బల్బులు ఇస్తామని అన్నారు. 50 యూనిట్ల వరకు కరెంటు చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సమాజంలో రెండే కులాలున్నాయని, ఒకటి డబ్బున్న కులం, మరొకటి డబ్బులేని కులం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
విద్యార్థులపై దేశద్రోహం కేసులు సిగ్గుచేటు
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తెనాలిక్రైమ్: భగత్‌సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైతన్య యాత్రలు సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమయ్యాయి. రివల్యూషనరీ యూత్ అసోసియేషన్(ఆర్వైఏ), ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ట్రేడ్ యూనియన్(ఏఐసీసీటీయూ), ఏఐఎస్ఏ స్టూడెంట్స్ అసోసియేషన్లతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ మోపిదేవి ఫణిరాందేవ్ మాట్లాడుతూ విశ్యవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం తగ్గాలన్నారు. విద్యార్థులపై దేశద్రోహం కేసులు బనాయించటం సిగ్గుచేటన్నారు. సెక్షన్ 120 చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఆర్.నాగలక్ష్మి మాట్లాడుతూ చైతన్యయాత్రలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 వరకూ కొనసాగుతాయన్నారు. -
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మిడుతూరు: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఆదివారం మండలపరిధిలోని వీపనగండ్ల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. విగ్రహప్రదాత అయిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ మేధావుల్లో బాబాసాహెబ్ ఒకరన్నారు. ఆయన కల్పించిన రిజర్వేషన్‌తో తాను ఐఆర్ఎస్ స్థాయికి ఎదిగానని చెప్పారు. జిల్లాలో 100కు పైగా అంబేడ్కర్ విగ్రహాలను సొంతఖర్చుతో నెలకొల్పి ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేస్తానన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు పర్వత యుగంధర్‌రెడ్డి, అంబేడ్కర్ యూత్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాడాల త్యారాజు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ నాగరాజు, పారిశ్రామిక వేత్త చంద్రమౌళి, దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాధవరం బాల సుందరం, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాముడు, మేకల దేవదాసు, జిల్లా అధ్యక్షుడు నాగముని, తాలుకా అధ్యక్షుడు అచ్చెన్న, టీడీపీ నాయకుడు విక్టర్, వీపనగండ్ల ఎంపీటీసీ తిమ్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖరయ్య, సంఘపెద్దలు పాల్గొన్నారు. -
రాజ్యాంగం ఉపయోగం మోసగాళ్లకేనా?
ఒకే వ్యక్తికి నాలుగు కుల ధ్రువీకరణ పత్రాలా? సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర విజయనగరం మున్సిపాలిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం మోసగాళ్లకు, దోపిడీ దొంగలకు ఉపయోగపడుతో ందని సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీడిక.రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విజయనగరం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి.భంజదేవ్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, దీనిపై జాయింట్ కలెక్టర్ బుధవారం విచారణచేపట్టగా వాయిదా కావాలని భంజ్‌దేవ్ కోరినట్లు తెలిపారు. 2006వ సంవత్సరంలో ఆర్పి.భంజ్‌దేవ్ కుల ధ్రువీకరణపై హైకోర్టు ఆయన గిరిజనుడు కాదని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. అయితే అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తూ గతంలో ఐటీడీఏ పీఓగా విధులు నిర్వహించిన సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి గిరిజనుడంటూ ఎలా కులధ్రువీకరణ పత్రం జారీ చేశారన్నారు. న్యాయస్థానం తీర్పును తలకిందులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా జరగలేదన్నారు. ప్రస్థుతం సదరు అధికారి వేరొక రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నా విడిచిపెట్టేది లేదన్నారు. ఈ విషయంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విజయనగరం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల ద్వారా ఉద్యోగాలు, పదవులు అనుభవిస్తున్న వారు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో కులధ్రువీకరణ కేసులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై యంత్రాంగం దృష్టి సారించి పరిశీలిస్తే అర్హులకు న్యాయం జరుగుతుందని కోరారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని ముఖ్యమంత్రికి తెలిసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలో అంగన్వాడీ, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియతో పాటు స్వచ్ఛభారత్ ట్రాక్టర్ కొనుగోలులో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. గిరిజన న్యాయవాది రేగు మహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన నాయకులు శోభా.హైమావతి, శత్రుచర్ల, విజయరామరాజు, జనార్దన్ థాట్రాజ్‌లు ఎస్టీలు కాదని సెక్షన్ 11 ప్రకారం ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేశామని, అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వేసిన కేసు విచారణలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో గుంప ప్రకాశరావు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
- అంబేడ్కర్ వర్సిటీ సేవలు నిలిపివేతపై ఆందోళన - విద్యార్థులు ఉద్యమం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి - వర్సిటీ రీజనల్ జేడీ సీహెచ్ ప్రసాద్ గుంటూరు ఎడ్యుకేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ సేవలు కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని కోరుతూ వర్సిటీ రిజిస్ట్రార్ ఏపీ ప్రభుత్వానికి నాలుగుసార్లు లేఖలు రాసినా స్పందించకపోవడంతో వారు సేవలను నిలిపివేశారని, ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణమని వర్సిటీ విజయవాడ ప్రాంతీయ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ చాముండేశ్వరి ప్రసాద్ అన్నారు. జేకేసీ కళాశాలోని బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో శుక్రవారం వర్సిటీ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు, కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేడీ చాముండేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ ఏపీలోని 13 జిల్లాల్లో 92 అధ్యయన కేంద్రాలు, ఏడు ప్రాంతీయ అధ్యయన కేంద్రాల ద్వారా అంబేడ్కర్ వర్శిటీపై ఆధారపడి 3.50 లక్షల మంది అభ్యర్థులు డిగ్రీ, పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారని చెప్పారు. రెండు నెలల క్రితం ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉద్యమబాట పట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ వర్సిటీలో ప్రవేశాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జేకేసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకంగా మారుతోందని ఆరోపించారు. వర్సిటీ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ పి.గోపీచంద్ మాట్లాడుతూ దూర విద్యా వ్యాప్తి లక్ష్యంతో ఎన్టీఆర్ స్ధాపించిన అంబేడ్కర్ వర్సిటీలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు ప్రవేశాలు నిలిపివేయడం దురదృష్టకరమన్నారు. దీనిపై గవర్నర్, సీఎం, విద్యాశాఖ మంత్రికి పోస్ట్‌కార్డులు పంపుతామన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయూలి
ముదిగొండ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయూలని వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధిర ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాణాపురంలో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ విగ్రహాన్ని భట్టి ఆవిష్కరించారు. ఎంపీ పూలదండ వేసి నివాళి అర్పించారు. అనంతరం శీలం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంబేద్కర్ కలలను నిజం చేశారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యూయన్నారు. అవమానాలు, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడానికి అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. దళితులు, గిరిజనులకు అంబేద్కర్‌ను పరిమితం చేసి చూడవద్దు అని భట్టి విక్రమార్క కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్, జడ్పీటీసీ మందరపు నాగేశ్వరరావు, సర్పంచ్ వేముల రాజకుమారి, ఉపసర్పంచ్ పండ్రకోల రాంబాబు, అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగాల రవికుమార్, సీపీఎం జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షర్మిలా సంపత్, పాలేరు డివిజన్ అధ్యక్షుడు సాధు రమేష్‌రెడ్డి, మండల అధ్యక్షుడు దేవరపల్లి అనంతరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మోర్తాల నాగార్జునరెడ్డి, మరికంటి గురుమూర్తి, పోట్ల బాబు, లంకెల బ్రహ్మారెడ్డి,ఆవుల ప్రమీల, మరికంటి సత్యనారాయణ, కృష్ట, ఇస్మాయిల్ పాల్గొన్నారు.