
అంబేద్కర్ దారిలో కేసీఆర్
ఆయన పాలన విపక్షాల్లో దడ పుట్టిస్తోంది
అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత వరంగల్
కార్యకర్తలను కనురెప్పల్లా కాపాడుకుంటాం
12 జరిగే బహిరంగ సభను విజయవంతం చేయూలి
టీఆర్‌ఎస్ జిల్లా విస్తృతస్థారుు సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య
హన్మకొండ సిటీ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దారిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ముందుకు పోతున్నారని డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. కేసీఆర్ పాలన విపక్షాల్లో దఢ పుట్టిస్తోందన్నా రు. దీంతో దిక్కుతోచని స్థితిలో అర్థరహిత విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ఎన్నికల మెనిఫెస్టో అమలుతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటున్నారన్నారు. హన్మకొండ సుబేదారిలోని తారా గార్డెన్‌లో మంగళవారం టీఆర్‌ఎస్ జిల్లా విస్తృతస్తాయి కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడారు. టీఆర్‌ఎస్ బలోపేతంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారిం చారని, ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 11వ తేదీన ప్రతి నిధుల సభ (ప్లీనరీ) నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సభకు నియోజకవర్గానికి 300 మంది ప్రతినిధుల చొప్పున హాజరుకానున్నారని వెల్లడించారు. అదేవిధంగా 12వ తేదీన సికిం ద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని, ఈ సభకు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
టీఆర్‌ఎస్ కార్యకర్తలు అభద్రతకు గురికావొద్దని, వారిని కనురెప్పలా కాపాడుకుంటామన్నారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు అండగా నిలుస్తారన్నారు. ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించి, చురుకైన పాత్ర పోషించిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని, నామినేటెడ్, పార్టీ పదవుల్లో వారికి కేసీఆర్ అవకా శం కల్పిస్తారన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి తగిన గుర్తింపు లభిస్తుందని, ఎవ రూ అధైర్యపడొద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషిచేయూలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అభివృద్ధిలో ముందు నిలపాలనే కృతనిశ్చయంతో కేసీఆర్ ఉన్నారన్నారు. ఇందులో భాగంగానే పారిశ్రామికాభివృద్ధిపై ఆయన దృష్టి సారించారన్నారు. పారిశ్రామిక వేత్తలకు వరంగల్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తన ముందే చెప్పారన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ 11న జరిగే ప్లీనరీ, 12న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. ఎంపీ ఆజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఎక్కడికి వెళ్లారని, వనరుల దోపిడీకి పాల్పడింది ఎవరని బస్సు యాత్ర చేసే టీడీపీ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. బయ్యరం గనులను విశాఖ స్టీల్‌కు లీజ్‌కు ఇచ్చినపుడు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశావని ఎర్రబెల్లి దయాకర్‌రావును ప్రశ్నించారు. ఉద్యమంలో పని చేసిన కార్యకర్తలకు అన్యాయం చేస్తే ద్రోహులుగానే మిగులుతామన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ అధికారంలోకి వ స్తే ఎవరైనా ఆడంబరాలకు వెళతారని, కేసీఆర్ ఎలాంటి ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు శిలశాసనాలని పేర్కొన్నారు.
ప్రజలికిచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతుంటే.. అధికారంలో ఉండి విపక్షంలోకి వచ్చిన వారు విధాన నిర్ణయాలు, రాష్ర్ట స్థితిగతులు తెలిసి కూడా తెలియనట్లు మూర్ఖుల్లా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ ఎన్నికల మెనిఫెస్టో అమలుతో పాటు నూతన నిర్ణయాలు తీసుకుంటూకేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి బంగారు తెలంగాణ నిర్మాణంలో కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆమె అక్రమాలన్ని సీడీ రూపంలో ప్రజల ముందు పెడతానన్నారు. ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోందన్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రోజూ లెక్కపెటుకుంటున్నారని, ఎవరు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారో తెలుసుకొం టున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల పై ఆయనకు నమ్మకం సడలినట్లుందన్నారు. పొన్నాల లక్ష్మయ్యను ఆ పార్టీ నాయకులే పీసీసీ అధ్యక్షుడిగా గుర్తించడం లేదన్నారు. ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్... తెలంగాణ పునర్నిర్మాణానికి కంకణబద్ధులై కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, మొలుగూరి బిక్షపతి, డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, నాయకులు ముద్దసాని సహోదర్‌రెడ్డి, నన్నపనేని నరేందర్, ఇండ్ల నాగేశ్వర్‌రావు, మార్నేని రవీందర్‌రావు, మర్రి యాదవరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, ఎల్లావుల లలితయాదవ్, కె.వాసుదేవరెడ్డి, గైనేని రాజన్, దయాకర్ పాల్గొన్నారు.