rajaiah
-
రాజయ్య Vs కడియం: ‘ఎవరో ఒక్కరే ఉండాలి అంటూ..’
సాక్షి, జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా శ్రీహరి వ్యాఖ్యలపై రాజయ్య స్పందిస్తూ ప్రతి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.సీనియర్ నేతలు కడియం, రాజయ్య మధ్య రాజకీయం మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలి అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య స్పందించారు. ఈ క్రమంలో రాజయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కడియం సవాలును స్వీకరిస్తున్నాను. కడియం శ్రీహరి స్థానికేతరుడు. దళిత వ్యతిరేకి. ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నేను నిద్రపోను. నియోజకవర్గంలో నువ్వో నేనో.. ఎవరో ఒక్కరే మిగలాలి.కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అల్లుడ్ని అడ్డం పెట్టుకొని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా?. నీ భూ కబ్జాలు నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు నిజంగా సత్య హరిశ్చంద్రుడివి అయితే నీ బిడ్డను ఎంపీ చేయడానికి రూ.100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు?. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. శ్రీహరికి నాకు పోటీనే లేదు. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కడియం శ్రీహరి ప్రజానాయకుడు కాదు.. రాజకీయ నాయకుడు మాత్రమే’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
-
అతని మృతికి కడియం శ్రీహరే కారణం : మాజీ ఎమ్మెల్యే రాజయ్య
హనమకొండ: జనగామ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, చిల్పూరు జెడ్పీటీసీ పాగాల సంపత్‌రెడ్డి మృతికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరే కారణమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియంపై పలు ఆరోపణలు చేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ విజయోత్సవ సభలో కడియం ఒక్కొక్కరికి బూత్‌ల వారీగా నాయకులను సభలో నిలబెట్టి మీ బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటూ అవమానపర్చారన్నారు. అదే క్రమంలో పాగాల సంపత్‌రెడ్డి గ్రామం రాజవరం గురించి మాట్లాడుతూ ‘నువ్వు చిల్పూరు జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్‌గా ఉన్నావు, నీ గ్రామంలోనే ఓట్లు తక్కువ వచ్చాయి’ అని అవమానకరంగా మాట్లాడాడన్నారు.సంపత్‌రెడ్డి మనోవేదనతో సాయంత్రం మృతిచెందాడని, ఆయన చావుకు ముమ్మాటికీ కడియం కారణమన్నారు. చివరకు జనగామలో నిర్వహించిన సంతాపసభలో సైతం సంపత్‌రెడ్డి గురించి కాకుండా ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని రాజకీయాలు మాట్లాడిన చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు. -
BRS: రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు
సాక్షి,గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం(ఏప్రిల్14) భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో జరిగిన ఈ భేటీ సందర్భంగా రాజయ్యకు స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్‌కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా రాజయ్యకు కేసీఆర్ సూచించారు. కాగా, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ సీటును కేసీఆర్ రాజయ్యకే ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో సుధీర్‌కుమార్‌కు కేటాయించారు. అయినా స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఇంఛార్జ్ బాధ్యతల కోసం రాజయ్య తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. కవితతో ముగిసిన కేటీఆర్ ములాఖత్ -
బీఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్యే డా.టి.రాజయ్య.?
సాక్షిప్రతినిధి, వరంగల్: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య కారెక్కెందుకు సిద్ధమయ్యారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనంటున్నాయి ఆయన అనుచర వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్లోనే ఉన్న రాజయ్య.. ఆ ఫలితాలు వెలువడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పెద్దలను కలిసిన ఆయన ఇటు బీఆర్ఎస్లో కొనసాగకుండా.. అటు కాంగ్రెస్‌లో చేరకుండా స్తబ్దతగా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలతో తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన రాజయ్య.. తన పేరిట ‘నేను మళ్లీ వస్తున్నాను.. ఎవరూ పార్టీని వీడకండి’ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుతుండటంతో ఆయన చేరిక ఖాయమైందన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పెద్దలతో పూర్తయిన చర్చలు.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్లో రాజుకున్న అసంతృప్తి ఓటమి తర్వాత.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బట్టబయలైంది. స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, రైతుబంధు సమితి మాజీ చైర్మన్ డాక్టర్ తాటికొండ రాజయ్య, మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌లతో మొదలైన రాజీనామాల పరంపర ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరకు కొనసాగింది. తన చిరకాల ప్రత్యర్థి కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్యలు బీఆర్ఎస్ను వీడటం రాజయ్యను కాంగ్రెస్‌లో చేరడమా? బీఆర్ఎస్లో కొనసాగడమా? అన్న సందిగ్ధంలో పడేసింది. ఇదే సమయంలో ఆయన రాజీనామా ఇంకా ఆమోదం కాకపోవడంతో బీఆర్ఎస్ హైకమాండ్ రాజయ్య విషయంలో పునరాలోచనలో పడింది. ఈ మేరకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగి రాజయ్యతో మంతనాలు జరిపినట్లు తెలిసింది. వారంలో రెండు పర్యాయాలు రాజయ్యతో మంతనాలు జరిపిన పల్లా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులతో కూడా మాట్లాడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న రాజయ్య.. పార్టీ అధినేత కేసీఆర్ సమయం తీసుకుని పెద్ద సంఖ్యలో కేడర్‌తో కలిసి కారెక్కుతారన్న చర్చ ఆయన అనుచరవర్గంలో సాగుతోంది. ‘సారు నుంచి పిలుపు రావడమే ఆలస్యం.. కారెక్కుతాం’ అంటున్నారు. ‘స్టేషన్’ ఇక డా.రాజయ్యదే... హైకమాండ్ సూచన మేరకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న డా.టి.రాజయ్య.. చర్చల సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తాను తెలంగాణ రాష్ట్రసాధన కోసం పార్టీని వీడి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరానని, కడియం శ్రీహరి కూడా పార్టీలో చేరాక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వివరించినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలతో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినా.. టికెట్ రాకుండా చూడటం కోసం దుష్ప్రచారాలు చేయించినా హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి పని చేశానన్న ఆయన ఇకనుంచైనా భరోసా ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో పా టు పార్టీలో కీలకంగా కొనసాగేలా అవకాశం కల్పించనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో తాను మళ్లీ పార్టీలోకి వస్తున్నానని, ఎవరూ కూడా కాంగ్రెస్, బీజేపీలకు వెళ్లవద్దని కోరుతూ వాట్సాప్ గ్రూపుల ద్వారా కేడర్‌కు సందేశాలు పంపినట్లుగా చెబుతున్నారు. రెండు రోజుల్లో తేదీని ప్రకటించి కేడర్‌తో కలిసి డా.రాజయ్య బీఆర్ఎస్లో చేరుతారని సమాచారం. -
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఎం.రమేష్, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్‌ను నియమించారు. వీరంతా ఈ పదవుల్లో రెండేళ్ల పాటు ఉండనున్నారు.ఇప్పటికే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా సీఎంవో మాజీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరింది వీరే -
అప్పు చేసి ఇల్లు నిర్మించొద్దన్నందుకు..
కరీంనగర్: మొట్లపల్లి గ్రామానికి చెందిన సంఘని రాజయ్య(50)అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజయ్య గ్రామంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. డబ్బులు లేక ఇంటి పనులు నిలిచి పోయాయి. అప్పు తెచ్చి నిర్మాణం కొనసాగించాలని కుటుంబ సభ్యులను కోరాడు. అప్పుతెచ్చి ఇల్లు కడితే అవి తీర్చలేక ఇబ్బందుల పాలవుతామని కుటుంబసభ్యులు నిరాకరించారు. మనస్తాపానికి గురైన రాజయ్య ఈనెల 4వ తేదీన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: భార్యపై దారుణంగా ప్రవర్తించిన భర్త.. -
మాట కలిపి.. కారం చల్లి.. కత్తితో దాడిచేసి.. ఆపై దారుణం!
కరీంనగర్: అతనో పశువుల వ్యాపారి. గురువారం అంగడి ఉండడంతో పశువులు కొనేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. దారిమధ్యలో ఆకలివేయడంతో టిఫిన్ కోసం ఆగాడు. టిఫిన్ తిని బిల్లు చెల్లిస్తుండగా.. అతనివద్ద డబ్బులు చూసిన ఓ మాయగాడు ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు. తనవద్ద ఓ గేదె ఉందని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక పశువుల వ్యాపారి కళ్లలో కారంకొట్టి.. కత్తితో బెదిరించి.. రూ.82వేలు తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన మానకొండూర్ మండలం శంశాబాద్ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడు అంకతి రాజయ్య, ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన అంకతి రాజయ్య(63) పశువుల వ్యాపారం చేస్తుంటాడు. గురువారం పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి అంగడికి ద్విచక్ర వాహనంపై ఉదయాన్నే బయల్దేరాడు. మార్గంమధ్యలో ఆకలివేయడంతో తాడికల్ గ్రామశివారులో ఓ హోటల్ వద్ద ఆగాడు. టిఫిన్ తిన్నాడు. తనజేబులో నుంచి డబ్బులు తీసి బిల్లు చెల్లిస్తుండగా.. అక్కడే ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి గమనించాడు. రాజయ్య వద్ద పెద్దమొత్తంలో నగదు ఉందని గమనించి, ఎలాగైనా కాజేయాలని పథకం పన్నాడు. రాజయ్య వద్దకు వచ్చి మాటామాట కలిపాడు. తనవద్ద ఓ గేదె ఉందని, అమ్ముతానని చెప్పడంతో రాజయ అతనితో కలిసి వెళ్లాడు. మానకొండూర్ మండలం శంశాబాద్ శివారులోని కాలువ ప్రాంతానికి చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తి రాజయ్య దగ్గర ఉన్న డబ్బు ఇవ్వమని బెదిరించాడు. ఇవ్వకపోవడంతో కళ్లలో కారం చల్లాడు. కత్తితో చేతిపై దాడి చేశాడు. అతని దగ్గర ఉన్న రూ.82వేలు తీసుకుని పారిపోయాడు. కాసేపటికి తేరుకున్న రాజయ్య వెంటనే మానకొండూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
భవిష్యత్తుకు భరోసా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రాజుకున్న వేడి క్రమంగా చల్లబడుతోంది. పార్టీ నేతల మధ్య సయోధ్యకు జరుగుతున్న ప్రయత్నాలు ఒకటొకటిగా కొలిక్కి వస్తున్నాయి. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బుజ్జగించిన అధినేత కేసీఆర్.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆ నియోజకవర్గం టికెట్ ఖరారు చేశారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నడుమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో రాజీ కుదిరింది. నర్సాపూర్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనను కూడా రెండు మూడురోజుల్లో తొలగించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి, పటాన్చెరు తదితర నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై కూడా కేటీఆర్ దృష్టి సారించారు. జనగామ, నర్సాపూర్‌తో పాటు నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలన్న ముత్తిరెడ్డి? ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, వెంకట్రాంరెడ్డి శుక్రవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసానికి వెళ్లారు. అంతా కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ముత్తిరెడ్డికి టికెట్ నిరాకరణకు కారణాలను వివరించిన కేసీఆర్.. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సహకరించి ఆయన గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో ఎమ్మెల్సీగానూ అవకాశం కల్పిస్తానని హామీ ఇ చ్చినట్లు తెలిసింది. అయితే తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలని ముత్తిరెడ్డి కోరగా ప్రస్తుతం ఎమ్మెల్సీ పల్లా నిర్వహిస్తున్న రైతుబంధు సమితి అధ్యక్ష పదవిని కేసీఆర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా ముత్తిరెడ్డి బెట్టు వీడిన నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ అభ్యరి్థగా పల్లా పేరును కేసీఆర్ ఖరారు చేశారు. నర్సాపూర్, కల్వకుర్తిపై త్వరలో స్పష్టత నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనపై బీఆర్ఎస్ అధినేత దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా టికెట్ కోసం పట్టుబడుతుండటంతో అభ్యర్థి ప్రకటనను పెండింగులో పెట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని మదన్‌రెడ్డి స్పష్టం చేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమ లేదా మంగళవారం అందుబాటులో ఉండాల్సిందిగా ఇద్దరు నేతలకు ప్రగతిభవన్ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కల్వకుర్తి టికెట్‌ను ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కూడా శుక్రవారం ప్రగతిభవన్ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలిసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు కసిరెడ్డి ప్రగతిభవన్‌కు చేరుకున్నప్పటికీ సీఎం ఇతర సమావేశాలతో బిజీగా ఉండటంతో భేటీ వాయిదా పడింది. కసిరెడ్డికి ఒకటి రెండురోజుల్లోనే మరోమారు పిలుపు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. తనను కల్వకుర్తి అభ్యరి్థగా ప్రకటించి, సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు తాను ఖాళీ చేసే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కసిరెడ్డి కోరుతున్నారు. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానన్న రాజయ్య! స్టేషన్ ఘన్పూర్ టికెట్ విషయంలో నెలకొన్న పంచాయితీ కూడా ప్రగతిభవన్ వేదికగా కొలిక్కి వ చ్చింది. ఎమ్మెల్సీ పల్లా శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యరి్థ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వెంటబెట్టుకుని కేటీఆర్ వద్దకు వెళ్లారు. సంప్రదింపులు, చర్చల అనంతరం కడియం శ్రీహరి అభ్యరి్థత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు రాజయ్య ప్రకటించారు. కడియం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని రాజయ్యకు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే గతంలో శ్రీహరికి వరంగల్ ఎంపీగా అవకాశం ఇ చ్చినందున తనకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాజయ్య కోరినట్లు సమాచారం. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనకు లోక్‌సభకు పోటీ చేసే అవకాశమివ్వాలని రాజయ్య పట్టుబట్టినట్లు సమాచారం. అయితే కేటీఆర్ ఏదో ఒక చట్టసభలో క చ్చితంగా పదవి ఇస్తామని భరోసా ఇవ్వడంతో రాజయ్య అంగీకరించినట్లు తెలిసింది. కేటీఆర్‌తో భేటీ అనంతరం కడియం శ్రీహరి గెలుపు కోసం పనిచేస్తానంటూ రాజయ్య ప్రకటించారు. కాగా పార్టీ నిర్ణయం మేరకు తనకు మద్దతు ప్రకటించిన రాజయ్యకు కడియం ధన్యవాదాలు తెలిపారు. -
TS Elections 2023: చర్చనీయాంశంగా మారిన.. రాజయ్య రాజకీయ వ్యూహం..!
వరంగల్: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య తాజా రాజకీయ వ్యూహం ఏమిటనేది పొలిటికల్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆగస్టు 21న సీఎం కేసీఆర్ స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన తర్వాత రాజయ్య వ్యూహం మార్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేటీఆర్, పార్టీ నేతల పట్ల లాయల్‌గానే ఉంటున్నా.. కడియం శ్రీహరిని ప్రత్యర్థిగా చూస్తున్న తీరు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. టికెట్ ఖరారైన నేపథ్యంలో కడియం శ్రీహరి నిర్వహించిన భారీ ర్యాలీకి దూరంగా ఉన్న రాజయ్య... రాయబారానికి వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర నేతలను కలవకుండా తిరిగారు. మాదిగ దండోరా అండతో రాజకీయంగా చక్రం తిప్పుతున్న రాజయ్య, సోమవారం కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై మాదిగ చామర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (ఎంసీఐఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో పాల్గొనేందుకు మాత్రమే వెళ్లానని, ఇందులో అన్ని పార్టీలకు చెందిన మాదిగలతోపాటు తాను కూడా హాజరైనట్లు సమర్థించుకున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ చీఫ్‌విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్.. మంగళవారం రాజయ్య ఇంటికి వెళ్లి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజయ్య మాత్రం భేటీల వెనుక రహస్యం ఏమీ లేదన్న గంటన్నరకే స్టేషన్‌ఘన్‌పూర్‌లో తనను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులతో మాట్లాడుతూ ఏ రాజకీయపార్టీలో ఉన్నా.. మాదిగలు ఐక్యంగా ఉండాలన్నారు. ఓ వైపు అసంతృప్తివాదులను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో స్టేషన్ ఘన్పూర్ వివాదం చల్లారకపోగా రోజుకో తీరుగా మారుతోంది. ఈ క్రమంలో కారు దిగి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారాన్ని కొట్టిపారేస్తూ, తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భవిష్యత్ వ్యూహం ఏమిటనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
కడియం వద్దు.. రాజయ్యే ముద్దు
మడికొండ: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆదివారం గ్రేటర్ వరంగల్ పరిధి 46వ డివిజన్ రాంపూర్‌లో అంబేడ్క ర్ సంఘం ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘కడియం వద్దు.. రాజయ్యే ముద్దు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి కడి యం ఏమీ చేయలేదని, రాజయ్య వచ్చాకే అభివృద్ధి జరిగింది అన్నారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీహరి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేయించలేదని పేర్కొన్నారు. రాజయ్య పై లేనిపోని ఆరోపణలు చేసి టికెట్ తెచ్చుకున్న ఆయన మాదిగలను కాదని ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. ఎమ్మెల్యే రాజయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని, టికెట్ కెటాయిస్తే భారీ మోజార్టీతో గెలిపిచుకుంటా మని చెప్పారు. అంతకు ముందు రాంపూర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టా రు. కార్యక్రమంలో మునిగాల వెంకటయ్య, డేని యల్, తప్పెట సారయ్య, కడారి దేవయ్య, మాదా సి రమేష్, యాదగిరి, నర్సింగం, కమలేష్, ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ పట్ల మహేష్, ఎర్ర సంపత్, నాగేష్, వెంకటస్వామి, మీసాల ఎల్లేష్, సాగర్, ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు. -
కడియం శ్రీహరి గుంటనక్క లాంటివాడు
స్టేషన్‌ఘన్‌పూర్: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గుంటనక్కలాంటి వాడని, ఆనాడు డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎం బర్తరఫ్‌లో, ప్రస్తుతం బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంలో కడియం కుట్ర ఉందని, రెండు సందర్భాల్లో కడియం సూత్రధారుడని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం జరిగిన నియోజకవర్గస్థాయి మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవసభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మాదిగల అస్థిత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని, కాపాడుకోవాల్సిన బాధ్యత మాదిగలందరిపై ఉందన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో రాజయ్య పంచె, ధోతి కట్టుకుని రాష్ట్రమంతా తిరిగితే పెద్దదొర కేసీఆర్, దళితదొర కడియం ఓర్వలేదన్నారు. కడియం మాదిగలను అణగదొక్కేలా గుంటనక్కలా వ్యవహరిస్తున్నారన్నారు. లైంగిక వేధింపుల విషయమై రాజయ్యపై నిరాధారమైన ఆరోపణలతో మహిళా కమిషన్ సుమోటో కేసు ఎలా స్వీకరించిందని మంద కృష్ణ ప్రశ్నించారు. భూపాలపల్లి, బెల్లంపల్లి, ఆర్మూరు ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కేవలం రాజయ్య మాదిగ ఎమ్మెల్యే కావడంతోనే సుమోటోగా స్వీకరించారన్నారు. -
కేసీఆర్ గీసిన గీత దాటను
స్టేషన్‌ఘన్‌పూర్: బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటినుంచి ఇప్పటివరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నానని, ఆయన గీసిన గీత దాటేది లేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. రాజయ్యకు టికెట్ రాని నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆయన వర్గీయులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని చూసిన రాజయ్య భావోద్వేగానికి గురై బోరున విలపించారు. దీంతో ఆయన వర్గీయులు కొందరు కంటతడి పెడుతూ రాజయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు. తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎమ్మెల్యే కన్నీరుమున్నీరయ్యారు. ఒకదశలో క్యాంపు కార్యాలయంలో కిందపడి, మోకరిల్లి విలపించారు. దీంతో పక్క నే ఉన్న ఆయన భార్య, అభిమానులు, పార్టీ శ్రేణు లు కూడా ఏడుస్తూనే ఆయన్ను సముదాయించారు. ఆయన మాట్లాడుతూ ఘన్పూర్ టికెట్ విషయమై ఇటీవల పరిణామాలు ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. తన స్థాయికి తగ్గకుండా సముచిత స్థానం కల్పిస్తానని సీఎం హామీ ఇచి్చనట్లు తెలి పారు. ప్రజల్లో ఉండటమే తనకు ఇష్టమని, నియో జకవర్గమే దేవాలయమని, అవసరమైతే ప్రాణాలు సైతం ఇస్తానన్నారు. అనంతరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి విలపించారు. ఎమ్మెల్యే సతీమణి ఫాతిమా తదితరులు వెంట ఉన్నారు. -
భావోద్వేగంతో ఎమ్మెల్యే రాజయ్య కంటతడి
సాక్షి, జనగామ: అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ దక్కకపోవడంపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఢీలా పడిపోయారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారు. దీంతో.. టికెట్ మీద గంపెడాశలు పెట్టుకున్న రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని ఆయన బోరున విలపించారు. అయితే.. టికెట్ దక్కకపోయినప్పటికీ.. అధినేత కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. ‘‘బీఆర్ఎస్లోలో చేరినప్పటి నుండి కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నా. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.. అందరూ సమన్వయం పాటించండి. దయచేసి ఎవరినీ బాధ పెట్టొద్దు’’ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేక్రమంలో.. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన్ని పట్టుకుని విలపించారు. ‘‘ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి గ్రామానికి సీడీఎఫ్ కింద 3 కోట్లు మంజూరయ్యాయి. అభివృద్ధి పనులు కొనసాగుతాయి. 15 సంవత్సరాల రాజకీయ అనుభవం, అధికార కాంగ్రెస్ పార్టీకి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తెలంగాణ కోసం రాజీనామా చేశా. స్థాయికి తగ్గకుండా ఉన్నత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.. దళిత బంధుకు 1,100 మందికి వచ్చే విధంగా సిఫారసు చేశా.. ఘనాపూర్ ప్రజల మధ్యే నా జీవితం’’ అని రాజయ్య పేర్కొన్నారు. కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది: ఎమ్మెల్యే రాజయ్య సతీమణి ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ టిక్కెట్ లభించకపోవడం అన్యాయం కాదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని ఆయన సతీమణి ఫాతిమా మేరీ అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరాం. బీఆర్ఎస్లోనే ఉంటాం... కడియం శ్రీహరిని ఎమ్మెల్యే గా గెలిపించేందుకు కృషి చేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. -
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉద్రిక్తత
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికే వస్తుందని విస్తృతంగా ప్రచారం కావడం, ఎమ్మెల్యే రాజయ్యపై కడియం వ్యాఖ్యలు చేయడంపై రాజయ్య అనుచరులు భగ్గుమన్నారు. శనివారం ఇక్కడ కడియం దిష్టిబోమ్మను ఎమ్మెల్యే అనుచరులు దహనం చేయనున్నారని పోలీసులు తెలుసుకొని అప్రమత్తమయ్యారు. జెడ్పీటీసీ మారపాక రవితోపాటు పలువురిని ఉదయం అరెస్టు చేశారు. ఘన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎమ్మెల్యే అనుచరులను, ప్రజాప్రతినిధులను ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ రాఘవేందర్, ఎస్ఐలు నాగరాజు, హరికృష్ణ ఆ«ధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే తమ్ముడు, ఘన్పూర్ సర్పంచ్ తాటికొండ సురేశ్‌కుమార్ గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి బయటికి వెళ్లకుండా హౌస్అరెస్టు చేశారు. ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిందని, గోకుడు, గీకుడుగాళ్లు, భూకబ్జాదారులంటూ కడియం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని మీదికొండ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే అనుచరులు ఆయన దిష్టిబోమ్మను దహనం చేశా రు. శ్రీహరి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
బీఆర్ఎస్లో ట్విస్ట్.. గులాబీ నేతలకు కేసీఆర్, కేటీఆర్ వార్నింగ్
గులాబీ తోటలో స్టేషన్ ఘన్పూర్ పంచాయతీకి తెర పడిందా? కొన్నాళ్లుగా మాటల యుద్ధం చేసుకుంటున్న కడియం, రాజయ్యలకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా? లేక ఇద్దరి మధ్యా రాజీ కుదిరిందా? సీటు విషయంలో ఎవరిది పై చేయి అయింది? ఇంకొకరికి ఎటువంటి హామీ లభించింది? ఇకముందు ఇద్దరూ సైలెంట్‌గా ఉంటారా? మరోసారి రెచ్చిపోతారా?.. తెలంగాణలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల సీటు వివాదం కొత్తమలుపు తిరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్యా సాగుతున్న డైలాగ్‌వార్‌కు పార్టీ నాయకత్వం చెక్ పెట్టింది. ఇద్దరినీ హైదరాబాద్‌కు పిలిపించి పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సున్నితంగా మందలించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అటు కేసీఆర్‌ను ఇటు కేటీఆర్‌తోనూ సమావేశమయ్యారు. కేటీఆర్‌ను కలిసిన రాజయ్య రాజయ్య మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాత్రమే కలిసారు. తొలి నుంచీ రాజకీయ ప్రత్యర్థులైన కడియం, రాజయ్యలు బీఆర్ఎస్లో చేరిన తర్వాత కూడా అదే పోకడ కొనసాగించారు. డిప్యూటీ సీఎంలుగా ముందు రాజయ్యకు, తర్వాత కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ సీటు విషయంలో ఇద్దరి మధ్యా పోరు తీవ్రంగా సాగుతోంది. ఇంకా ముదిరితే పార్టీకే నష్టమని పార్టీ నాయకత్వం పార్టీ క్రమశిక్షణ అధిగమించవద్దని ఇద్దరినీ సున్నితంగా మందలించి పంపింది. రాజయ్య అవినీతిపై కడియం వివరణ.. హైదరాబాద్ నుంచి పిలుపు రాగానే హడావుడిగా వచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అంతకు రెండు రోజుల ముందు కడియం శ్రీహరి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని, కేటీఆర్‌ను కలిసారు. తాను కడియంపై కొత్తగా ఏమీ ఆరోపణలు చేయలేదని, గతం నుంచి ఆయన మీద ఉన్నవేనని రాజయ్య.. కేటీఆర్‌కు వివరణ ఇచ్చుకున్నారు. అదేవిధంగా రాజయ్య అవినీతి గురించి కడియం పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలకు వార్నింగ్ ఇచ్చి.. ఎవరి భవిష్యత్ అయినా కేసీఆర్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. అయితే స్టేషన్‌ఘన్‌పూర్ సీటు విషయంలో ఈసారి కడియం శ్రీహరి పోటీ చేయడానికి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నియోజకవర్గంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. స్పీడ్ పెంచిన శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్న కడియం తన నియోజకవర్గంగా స్టేషన్ ఘన్‌ఫూర్ ఎంపిక చేసకుని.. మరింత దూకుడుగా వ్యవహరించడం వెనుక మర్మం ఏమిటన్న చర్చ జరుగుతోంది. నిరంతరం వివాదాల్లో చిక్కుకుంటున్న రాజయ్యకు బదులుగా ఈసారి కడియం శ్రీహరి వైపు గులాబీ దళపతి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే సభలు, సమావేశాలను ముమ్మరంగా నిర్వహిస్తున్న కడియం నియోజకవర్గంలో తన ఫ్లెక్సీల కోసం మండలానికి 10 లక్షలు చొప్పున పంపిణీ చేశారన్న టాక్ నడుస్తోంది. కడియం, రాజయ్య మధ్య వివాదం తీవ్రం కావడంతో జనగామకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని తెరమీదకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో నియోజకవర్గానికి చెందిన సీఎం ముఖ్య అనుచరుడు ఒకరు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్సీ ఎంట్రీ.. ఘన్పూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వివాదం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కనుగొనే పనిలో పార్టీ అధిష్టానం నిమగ్నమయిందట. అసలు విషయం తేల్చకుండా ఇంతకాలం కలిసి పనిచేసుకోండని చెప్పినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. ఇద్దరి మధ్య మరో ఎమ్మెల్సీ ఎంట్రీ కారణంగానే ఘన్పూర్ అడ్డా అధికార పార్టీలో రాజకీయ దుమారం చెలరేగిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. టిక్కెట్ విషయంలో వెంటనే స్పష్టత ఇచ్చి..పార్టీ ఐక్యత దెబ్బతినకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఘన్పూర్ గులాబీ శ్రేణులు అధిష్టానాన్ని కోరుతున్నాయి. ఇది కూడా చదవండి: చంద్రబాబు వారసుడు రేవంత్ -
కారు.. వీధిపోరు! 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘బహుళ’ తలనొప్పి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ భారత్ రాష్ట్ర సమితి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. నేతలు చివరకు వ్యక్తిత్వ హననానికి సైతం పాల్పడుతూ వీధికెక్కుతున్నారు. రోజుకో చోట.. రోజుకో నేత అనే రీతిలో నియోజకవర్గ స్థాయి మొదలుకుని క్షేత్రస్థాయి వరకు పరస్పర విమర్శలు, దూషణలు తెరమీదకు వస్తున్నాయి. సిట్టింగ్‌లు తమను కలుపు కొని వెళ్లకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలు క్రమంగా స్వరం పెంచుతు న్నారు. పార్టీ అధినేతపై విశ్వాసం, విధేయత ప్రకటిస్తూనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు లక్ష్యంగా బహిరంగ ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌ల చైర్మన్లు, పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలు, వివిధ సందర్భాల్లో టికెట్లు ఆశిస్తూ పార్టీలో చేరినవారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తు న్నారు. టికెట్ల పోటీలో పర స్పరం సిగపట్లకు దిగుతు న్నారు. కార్యకర్తలు, అను యాయుల సమక్షంలో సొంత పార్టీకి చెందిన రాజ కీయ ప్రత్యర్థిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ నేతలు లక్ష్మణరేఖ దాటుతున్నా.. అధినేత కేసీఆర్ చాలా సందర్భాల్లో ప్రతిస్పందించక పోవడంతో వివాదాలు మరింత ముదురుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక నాయకత్వంతో పొసగని నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. అయినప్పటికీ అధినేత మౌనం వెనుక ఆంతర్యం పార్టీ కేడర్‌కు అంతుపట్టడం లేదు. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిల పరస్పర ఆరోపణలకు సంబంధించిన వివాదంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి హెచ్చరికలు జారీ చేయడంతో ఈ తరహా పరిణామాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. రోజుకో చోట.. రోజుకో నేత సుమారు 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ బహుళ నాయకత్వం సమస్యను ఎదుర్కొంటోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ టికెట్‌ను ఆశిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు లాబీయింగ్‌కు దిగుతున్నారు. టికెట్ దక్కదనే అంచనాకు వచ్చిన కూచాడి శ్రీహరిరావు (నిర్మల్)తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని వీడారు. ఇటీవలి కాలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు వేయగా, వారు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడంతో పాటు ఆ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నా చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే పార్టీ టికెట్ ఆశిస్తున్న మెదక్, రాజేంద్రనగర్, కొత్తగూడెం, ఉప్పల్, హుజూరాబాద్, తాండూరు, మహబూబాబాద్ తదితర నియోజకవర్గాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, జనగామ, ఖానాపూర్, వరంగల్ పశ్చిమ, నాగార్జునసాగర్, కల్వకుర్తి, జహీరాబాద్, వేములవాడ తదితర నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఎక్కడికక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. సమావేశాలు, సభలు నిర్వహిస్తూ సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థులపై విమర్శల దాడి చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ విధంగా కట్టుతప్పుతున్న నేతలపై చర్యలు లేకుంటే.. పరిస్థితి ఇతర పార్టీలకు అనుకూలంగా మారుతుందనే ఆందోళన పార్టీ కేడర్‌లో నెలకొంది. అయితే టికెట్ ఆశిస్తున్న నేతలంతా పార్టీ అధినేతకు విధేయులుగానే ఉంటున్నారని, ఎన్నికల నాటికి అంతా సద్దుమణుగుతుందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. నేతల పనితీరుపై కేసీఆర్‌కు పూర్తి స్పష్టత ఉన్నందున అందరికీ ఏదో ఒకరకంగా గుర్తింపు లభిస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. -
నేను నోరు విప్పితే అంతే.. ఎమ్మెల్యే ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ఎమ్మెల్యే రాజయ్య నా కుటుంబం గురించి, నా తల్లి, నా బిడ్డ గురించి సభ్యత, సంస్కారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడారు.. నేను నోరు విప్పితే ఆయన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లి అనేది సత్యం.. తండ్రి అనేది అపోహ అంటూ నా తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాజయ్య చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఉన్న ప్రతి తల్లిని, కుటుంబ వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని, ఇందుకు రాజయ్య ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ’’అవును నాతల్లి బీసీ, తండ్రి ఎస్సీ, సుప్రీంకోర్టు తీర్పు, చట్టం ప్రకారం నేను ఎస్సీ, నా బిడ్డ ఎస్సీ. నాబిడ్డ మతాంతర వివాహం చేసుకుంటే ఆమెకు పుట్టే పిల్లలకు తండ్రి మతం, కులం వర్తిస్తుంది’ అని చెప్పారు. 1994కు ముందు ఎన్కౌంటర్లు జరగలేదా... తనను ఎన్కౌంటర్ల సృష్టికర్త అంటూ రాజయ్య వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రంలో 1994కు ముందు ఎన్కౌంటర్లు జరగలేదా అని కడియం ప్రశ్నించారు. అధిక ఎన్కౌంటర్లు 2004–14 మధ్యలో జరిగాయని, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నక్సలైట్లను చర్చలకు పిలిచిన విషయాన్ని గుర్తుకు చేశారు. 2004 నుంచి 2012 వరకు రాజయ్య కాంగ్రెస్‌లో ఉన్నాడని, ఆ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లకు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. వేల కోట్ల ఆస్తులు నిరూపిస్తే దళితులకు రాసిస్తా.. రాజయ్య ఆరోపిస్తున్న విధంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. వాటిని నియోజకవర్గ దళితులకు రాసిస్తా అని కడియం అన్నారు. నియోజకవర్గంలో పనులు ఇస్తానని, పదవులు ఇస్తానని ఏ ఒక్కరివద్ద డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే ఘన్పూర్ నియోజకవర్గాన్ని వదిలేసి పోటీనుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలు పుస్తెలు, ఇండ్లు, వ్యవసాయ భూములు కుదువపెట్టి డబ్బులు ఇచ్చారని, సమయం వస్తే బాధితులతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి రాజయ్య బండారం బయటపెడతాని హెచ్చరించారు. నీ చేష్టలు, మాటలు అన్నీ పార్టీ అధిష్టానం చూస్తోందని.. త్వరలోనే శిశుపాలుడి వధ జరుగుతుందని కడియం వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎవ్వరికి టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేసేలా కృషి చేస్తానన్నారు. -
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
-
రాజయ్యపై నవ్య ఆరోపణలు.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
-
మహిళా కమిషన్ల ముందుకు నవ్య కేసు
ధర్మసాగర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వివాదాన్ని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలమీద విచారణ చేపట్టి నివేదిక అందజేయాల్సిందిగా మహిళా కమిషన్లు పోలీసు శాఖను ఆదేశించాయి. కాగా, ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరుల ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సర్పంచ్ నవ్య శనివారం మరోసారి మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే వద్ద నయాపైసా కూడా తీసుకోలేదని మరోమారు స్పష్టం చేశారు. సీడీఎఫ్ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యే రాజయ్యపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్న వారిని ఎవరినీ వదిలిపెట్టనని.. అందరి బండారం బయట పెడతానని ఆమె హెచ్చరించారు. నోటీసులు జారీ చేసిన పోలీసులు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు ఆయన పీఏ శ్రీనివాస్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, తన భర్త ప్రవీణ్‌పై నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేతోపాటు మిగతావారిపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు, ఫోన్ రికార్డులు, డాక్యుమెంటరీ సాక్ష్యం, ఇతర ఏ విధమైన ఆధారాలు ఉన్నా తమకు అందజేయాలని ధర్మసాగర్ పోలీసులు, కాజీపేట ఏసీపీ ఆమెకు వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. కాగా, ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారని మీడియా నవ్యను ప్రశ్నించగా అడ్వొకేట్ ద్వారా తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు అప్పగిస్తానని తెలిపారు. -
నవ్య ఆరోపణలు సుమోటోగా స్వీకరించిన జాతీయ, రాష్ట్ర మహిళా కమీషన్
-
ఎమ్మెల్యే రాజయ్య నా భర్తను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు: నవ్య
-
ఎమ్మెల్యే ఎప్పుడూ వివాదమే..!
వరంగల్: మహిళా సర్పంచ్‌పై లైగింక వేధింపుల ఆరోపణలతో ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్యే సార్‌ను ఓ ఆటా ఆడేసుకుంటున్నారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న ఎమ్మెల్యే.. మహిళలకు సంబంధించి తరుచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఎమ్మెల్యే రాజయ్య తనను లైగింకంగా వేధిస్తున్నాడని హనుమకొండ/జనగామ జిల్లా పరిధి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య ఆరోపించడంతో మూడు రోజులుగా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీతో సహా అన్ని వర్గాల నుంచి ఆగ్రహం పెల్లుబికడంతో నిరసన సెగ ప్రగతిభన్ను తాకింది. పార్టీ వర్గాలు ఓపైపు ఆరా తీస్తుండగానే.. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించింది. ఎమ్మెల్యే ఎప్పుడూ వివాదమే..! గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే రాజయ్య మహిళలకు సంబంధించిన ఏదో ఒక వివాదంలో తెరపైన కనిపిసూ్తనే ఉన్నాడు. తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనను కేబినెట్ నుంచి ఏకంగా బర్తరఫ్ చేయడం అప్పట్లో హాట్‌టాఫిక్‌గా మారింది. దానిపై అనేక ముచ్చట్లు సైతం వినిపించాయి. ఇదిలా ఉంటే.. గతంలో వేలేరు మండలంలోని ఓ ఊరికి చెందిన మహిళతో ఫోన్లో అసభ్యకరంగా.. శవ్వ, శవ్వ అంటూ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడిన మాటలుగా.. ఆడియో రికార్డు ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశం కాగా.. అది తన వాయిస్ కాదని రాజయ్య కొట్టిపారేశారు. ఆ తర్వాత లింగాలఘణపురంలో జరిగిన ఓ జన్మదిన వేడుకల్లో సైతం ఎమ్మెల్యే చిలిపి చేష్టలు.. ఆన్లైన్లో హల్చల్ చేశాయి. ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లాలో లక్ష మందికి పైగా పిల్లలు తన వల్లనే పు ట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు సైతం విమర్శలను ఎదుర్కొనేలా చేసింది. అలాగే లింగాలఘణపురం మండలంలో బతుకమ్మ చీరల పంపిణీలో సీఎం కేసీఆర్ అందరికీ భర్త లాంటి వాడని నోరుజారీ.. సరిచేసుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా జానకీపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించడంతో ఎమ్మెల్యేకు అధిష్టానం నుంచి మొట్టికాయలు వేసే వరకు దారి తీసింది. మహిళా కమిషన్ ఆదేశం..పోలీసుల విచారణ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని సర్పంచ్ నవ్య ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్çపర్సన్ సునీత స్పందించారు. కేసును సుమోటోగా తీసుకుని.. విచారణకు డీజీపీని ఆదేశించారు. దీంతో పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఎమ్మెల్యే.. పార్టీ పెద్దల సూచనలు పాటిస్తూ.. ఆదివారం జానకీపురంలోని సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. సర్పంచ్ దంపతులతో కలిసి ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. ప్రొటోకాల్ విషయంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే.. మహిళా లోకం తనను క్షమించాలని కోరగా.. నవ్య పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెబుతూనే.. ఎమ్మెల్యేకు పరోక్షంగా హెచ్చరికలను జారీ చేసింది. వేధింపులకు గురిచేసిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే సర్పంచ్ ఇంటికి వెళ్లడంతో నాలుగు రోజుల వివాదానికి తెరపడగా.. మహిళా కమిషన్ విచారణకు ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సర్పంచ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యవహారంపై ఇంటలిజన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు సమాచారం. ఈ విషయమై సీఎంతోపాటు మంత్రి కేటీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. -
ఒకే వేదికపైకి రాజయ్య, నవ్య
సాక్షి ప్రతినిధి, వరంగల్/ధర్మసాగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జానకీపురం సర్పంచ్ నవ్య ఆరోపణలకు సంబంధించి.. ఆమెతోపాటు ఎమ్మెల్యే టి.రాజయ్య ఒకే వేదికపైకి వచ్చారు. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం గ్రామానికి వెళ్లిన రాజయ్య.. సర్పంచ్ కురుసవల్లి నవ్య, ఆమె భర్త ప్రవీణ్‌లతో చర్చించారు. తర్వాత వారంతా కలిసి జానకీపురంలోనే మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధ కలిగితే క్షమాపణలు చెప్తున్నా: రాజయ్య మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. ‘‘నా వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నాను. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నాను. నాకు నలుగురు చెల్లెళ్లు. ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేస్తా. నేను పనిచేసే క్రమంలో ఎక్కడైనా, ఎవరైనా మానసిక క్షోభకు గురైతే మహిళా సమాజానికి క్షమాపణలు చెప్తున్నా.. తెలిసీ తెలియక తప్పులు జరిగితే ఒప్పుకోక తప్పదు. జానకీపురం గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయిస్తున్నా. సర్పంచ్ నవ్య, ప్రవీణ్‌లను అన్నిరకాలుగా కాపాడుకుంటాను. నేను చేసిన శిఖండి వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడుతా. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..’’అని పేర్కొన్నారు. పార్టీ పెద్దల ఆదేశాలతో.. సర్పంచ్ కె.నవ్యపై ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా వచ్చి ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ దీనిపై దుమారం రేగింది. ఈ క్రమంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకే.. రాజయ్య, కొందరు పార్టీ నేతలతో కలిసి జానకీపురం వెళ్లినట్టు తెలిసింది. రాజయ్యకు మహిళా కమిషన్ నోటీసు సర్పంచ్ నవ్య ఆరోపణల అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా వచ్చిన అభ్యర్థనపై మహిళా కమిషన్ ఆదివారం స్పందించింది. రాజయ్యకు నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్‌కు కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి లేఖ రాసినట్టు తెలిపింది. మహిళల పట్ల పిచ్చి వేషాలు వేయొద్దు: నవ్య ఎవరైనా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, వివక్ష చూపితే సహించేది లేదని సర్పంచ్ నవ్య పేర్కొన్నారు. ‘‘చెడును కచ్చితంగా ఖండిస్తాను. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యం. ఎమ్మెల్యే రాజయ్య వల్లే నేను సర్పంచ్ అయ్యాను. అయితే రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దు. ఎవరైనా మహిళలపై పిచ్చివేషాలు వేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టడానికైనా వెనుకాడను. ముఖ్య నాయకులు వారి పద్ధతి మార్చుకుని మహిళలను గౌరవించాలి. ఇక మీదట తప్పులు చేయకూడదు. గతంలో జరిగిన తప్పులను క్షమిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తాను. నేను చేసిన ఆరోపణలు నిజం. సమాజంలో మహిళలు కొన్ని విషయాల్లో కొందరి చేత మోసపోతున్నారు. అలాంటి వారు బయటికి వచ్చి నిలదీయాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే వారిపక్షాన నేను ముందుండి కొట్లాడుతా..’’అని చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య జానకీపురం గ్రామ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడం లేదని.. ఇప్పటికైనా అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.