
రాజయ్యను బర్తరఫ్ చేయించిన కడియం
ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి బర్తరఫ్ చేరుుంచింది డిప్యూటీ సీఎం కడియం శ్రీహరేనని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి వద్దని కేసీఆర్‌కు సలహా ఇచ్చింది తనేనని కడియం ప్రకటించడం దారుణమన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టి దళితుల అభివృద్ధిలో రాజయ్య క్రియాశీల పాత్ర పోషించారన్నారు. ఎంఆర్‌పీఎస్ తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.