Dismissed
-
భావ ప్రకటన స్వేచ్ఛ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court Of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో.. అందునా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని.. ప్రాథమిక హక్కులను పరిరక్షించడం న్యాయస్థానాల విధి అని స్పష్టం చేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హీపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ(Freedom of Expression) అంతర్భాగమని, ఆ హక్కును గౌరవించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో ఎలాంటి నేరం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలోనే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.సినిమాలు, కవిత్వం.. సాహిత్యం, వ్యంగ్యం.. మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ఎలా సాధ్యమవుతుంది?. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే.. అవి సహేతుకంగా ఉండాలే గానీ.. ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే.. ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. భావ స్వేచ్ఛ ప్రకటన, వాక్ స్వాతంత్య్రం(Freedom of Speech) అనేవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి. అంతిమంగా.. ఆర్టికల్ 19(1)ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే’’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. జరిగింది ఇదే..గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి(Imran Pratapgarhi) గతేడాది డిసెంబరులో 46 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఓ పెళ్లి వేడుక మధ్యలో ఆయన నడిచివస్తుండగా పూలవర్షం కురిపిస్తూ.. బ్యాక్‌గ్రౌండ్ ఓ పద్యం వినిపించారు. అయితే, ఆ పద్యంలో పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవి మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుతో గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ హైకోర్టులో ఇమ్రాన్‌కు ఊరట లభించలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్‌కు ఊరట ఇచ్చింది. -
ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం ఆతిశికి బిగ్ రిలీఫ్..
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్‌కు ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఎన్నికల వేళ ఆప్ సీనియర్ మహిళా నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశికి ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఒక్క వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆమె మాట్లాడలేదని.. మొత్తం పార్టీని ఉద్దేశించే వ్యాఖ్యానించారని న్యాయస్థానం పేర్కొంది. కాగా, గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందు మంత్రిగా వ్యవహరించిన ఆతిశి.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీలో చేరకపోతే.. ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఆప్ నేతలను అరెస్టు చేస్తుందని కొందరు బీజేపీ నేతలు బెదిరించారంటూ ఆమె ఆరోపించారు. దీంతో ఆతిశి వ్యతిరేకంగా బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో పాటు ఆమెపై న్యాయస్థానంలో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్‌ను కొట్టేసింది.మరో వైపు, దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. కమలం పార్టీ అక్కడ 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు సీట్లనూ గెలుస్తూ వస్తున్నా అసెంబ్లీ బరిలో మాత్రం పట్టు చిక్కడమే లేదు. ఈ సారి ఎలాగైనా హస్తిన గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు పరివర్తన్ (మార్పు) నినాదాన్ని నమ్ముకుంటోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. అవినీతిరహిత పాలన కోసం తమనే గెలిపించాలని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు మరో 15 గ్యారంటీలను ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదలచేసిన ఆప్ సోమవారం మరో అదనపు మేనిఫెస్టోను విడుదలచేసింది. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, మెట్రో ఛార్జీలో 50 శాతం రాయితీ వంటి పలు హామీలను ఇందులో చేర్చింది.ఇదీ చదవండి: ఢిల్లీ ప్రజలకు ఆప్ మరో 15 గ్యారంటీలు -
ట్రంప్ రివేంజ్ పాలిటిక్స్.. 12 మంది ప్రాసిక్యూటర్ల తొలగింపు
వాషింగ్టన్:రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో రాజకీయ కక్ష తీర్చుకునే నిర్ణయాలు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ 12 మంది దాకా ప్రాసిక్యూటర్లను తొలగించింది. వీరంతా గత ప్రభుత్వంలో ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన లాయర్లు కావడం గమనార్హం. బైడెన్ హయాంలో ట్రంప్ పలు క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అధ్యకక్షుడిని కేసులతో ముప్పుతిప్పలు పెట్టిన వారిని వదిలేదని లేదన్న సంకేతాలను జస్టిస్ డిపార్ట్మెంట్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ‘గతంలో అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన న్యాయవాదులను యాక్టింగ్ అటార్నీ జనరల్ సర్వీసు నుంచి తొలగించారు. అధ్యక్షుడి ఎజెండాను అమలు చేయలేరన్న కారణంతోనే వీరిని తొలగిస్తున్నాం’అని జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేసిన న్యాయవాదులంతా ప్రత్యేక కౌన్సిల్ జాక్‌స్మిత్ నేతృత్వంలో పనిచేశారు. జాక్ స్మిత్ జనవరి మొదటి వారంలోనే తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాగా, ట్రంప్ గత ప్రభుత్వ హయంలో ప్రముఖంగా ‘క్యాపిటల్’ తిరుగుబాటు, పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ హష్మనీ కేసులను ఎదుర్కొన్నారు. వీటిలో హష్మనీ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలారు. అయితే కోర్టు ట్రంప్‌కు ఈ కేసులో ఎలాంటి శిక్ష వేయలేదు. -
‘స్వలింగ వివాహాల’పై తీర్పు సరైనదే: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ వివాహాల విషయంలో సుప్రీంకోర్టు తన వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టినట్లు తేల్చేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేమంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు నిరాకరించింది. ఈ తీర్పును మళ్లీ క్షుణ్నంగా పరిశీలిచాలంటూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా గుర్తింపు ఇవ్వడానికి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఆధారం లేదని 2023 అక్టోబర్‌లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సామాజిక కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ తదితర వర్గాలు ఆందోళనకు దిగాయి. స్వలింగ వివాహాలపై అప్పట్లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఆయా పిటిషన్లను పరిశీలించింది. 2023 నాటి తీర్పులో ఎలాంటి పొరపాటు లేదని తేల్చిచెప్పింది. అప్పటి తీర్పులో వెల్లడించిన అభిప్రాయాలు చట్టానికి అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. ఆ తీర్పులో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించింది. రివ్యూ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టంచేసింది. -
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula) కేసులో విద్యార్థుల, ఎన్నారైల పోరాటం ఫలించింది. ఆమె మృతికి కారణమైన అధికారిని విధుల్లోంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మరణం గురించి చులకనగా మాట్లాడిన అధికారిపై సైతం వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో న్యాయం జరిగినట్లైంది!.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల(23).. 2023,జనవరి 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి అతివేగంగా పాట్రోలింగ్ వాహనం నడుపుతూ వచ్చి రోడ్డు దాటుతున్న ఆమెను ఢీ కొట్టాడు. దీంతో.. ఆమె చాలాదూరం ఎగిరిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.అయితే విధి నిర్వహణలో భాగంగానే ఆయన అంత వేగంగా వెళ్లాల్సి వచ్చిందని.. కాబట్టి ఆయనపై ఎలాంటి చర్యలు అవసరం లేదని తొలుత పోలీస్ శాఖ భావించింది. అలాగే ఆమె మరణంపై చులకనగా మాట్లాడిన అధికారి విషయంలోనూ క్షమాగుణం ప్రదర్శించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించాయి. జస్టిస్ ఫర్ జాహ్నవి పేరుతో విద్యార్థులు ఫ్లకార్డులతో రోడ్డెక్కి నిరసనసలు చేపట్టారు. దీంతో సియాటెల్ పోలీస్ శాఖ దిగొచ్చింది. ఉన్నతస్థాయి దర్యాప్తుతో పాటు కోర్టు క్లియరెన్స్ కోసం ఎదురు చూసింది. చివరకు చర్యలకు ఉపక్రమించింది. ఇదీ చదవండి: జాహ్నవికి మరణానంతర డిగ్రీ‘‘ఘటనలో ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యవహరించి ఉండకపోవచ్చు. డ్రగ్స్ ఓవర్‌డోస్ అయిన బాధితుడ్ని రక్షించాలని ఆయన తాపత్రయపడ్డారు. ఆ క్రమంలోనే తన వాహనంతో ఢీ కొట్టి ప్రాణం పోయేందుకు కారణం అయ్యారు. అయితే ఆయన తన వాహనాన్ని అత్యంత ప్రమాదకరంగా నడిపారు. సియాటెల్ పోలీస్ విభాగానికి చెడ్డ పేరు తెచ్చారు. డిపార్ట్మెంట్ పాలసీల్లో నాలుగింటిని ఆయన ఉల్లంఘించారు. అందుకే సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డేవ్‌ను తొలగించాం’’ అని సియాటెల్ తాత్కాలిక పోలీస్ చీఫ్ సూ రెహర్ ప్రకటించారు. ఆమె ప్రకటనను సియాటెల్ టైమ్స్ సోమవారం ప్రచురించింది. అంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మృతి పట్ల అనుచితంగా మాట్లాడిన అధికారి డేనియల్ అడెరెర్‌ను సైతం గతేడాది సెప్టెంబర్‌లో విధుల్లోంచి తొలగించారు.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పైగా.. ఆమె ప్రాణం విలువ గురించి మరో అధికారి చులకనగా మాట్లాడారు. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఈ మరణానికి విలువలేదు. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నారైల నుంచి, విద్యార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో దర్యాప్తు అనంతరం అతన్ని విధుల్లోంచి తొలగించింది. అయితే.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని డేనియల్ అడెరె వివరణ ఇచ్చినప్పటికీ వేటు మాత్రం తప్పలేదు. -
యాద్రాది: డ్యూటీలకు డుమ్మా.. టీచర్లపై వేటు
సాక్షి, యాద్రాది: దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లపై వేటు పడింది. 2005, 2006 నుంచి విధులకు రాని 16 మంది టీచర్లను తొలగిస్తూ యాద్రాది భువనగిరి జిల్లా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.యాద్రాది జిల్లాలో 18 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరుకావడం లేదు. 2005 నుంచి ఇప్పటివరకు డుమ్మా కొడుతున్న వారుండగా.. గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఇద్దరు డ్యూటీలో చేరారు. మిగిలిన 16 మంది స్పందించలేకపోవడంతో. గత మే నెలలో కూడా గెజిట్ నోటీసు విద్యాశాఖ జారీ చేసింది. అయినా టీచర్ల నుంచి స్పందన రాకపోవడంతో వారందరికీ సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. -
‘చిల్లర’ పొరపాట్లు.. పెద్ద శిక్షలు!
టికెట్ జారీ యంత్రం (టిమ్) ద్వారా కండక్టర్ విధులను కూడా నిర్వహించే డ్రైవర్ అతను. బస్సు నడుపుతుండగా రిజర్వేషన్ చేయించుకొని తదుపరి స్టాప్‌లో ఎక్కాల్సిన ప్రయాణికుడు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ మాట్లాడుతుండగా ఫొటో తీసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో డ్రైవర్‌ను ఉన్నతాధికారులు తొలుత సస్పెండ్ చేసి ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఇంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ సస్పెండ్ అయిన చరిత్ర ఆయనకు ఉందని.. అందుకే తొలగించాల్సి వచ్చిందనేది అధికారుల మాట.ఒకేసారి నలుగురు ప్రయాణికులు ఎక్కారు. ఆ తొందరలో పొరపాటున పురుష ప్రయాణికుడికి కండక్టర్ జీరో టికెట్ (మహాలక్ష్మి పథకంలో మహిళలకు జారీ చేయాల్సిన టికెట్) జారీ చేశాడు. తదుపరి స్టాప్‌లో చెకింగ్ సిబ్బంది తనిఖీ చేసి కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కావాలనే జీరో టికెట్ జారీ చేసి టికెట్ చార్జీ రుసుము తీసుకున్నాడన్నది తనిఖీ సిబ్బంది ఆరోపణ.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ‘చిల్లర’కారణాలతో గత మూడేళ్లలో వందలాది మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎన్నిసార్లు వేడుకున్నా (అప్పీళ్లు) కుదరదని సంస్థ తేలి్చచెప్పడంతో వారంతా తాజాగా మూకుమ్మడిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం ఆర్టీసీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్రంగా పరిగణిస్తూ..: ఆర్టీసీలో ‘చిల్లర’వివాదాలు కొత్తకాదు. టికెట్ల జారీలో జరిగే పొరపాట్లను సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. రూ. 10 తేడా వచి్చనా విధుల నుంచి తప్పిస్తోంది. ఇక డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సైతం తొలగిస్తోంది. మూడేళ్లుగా వివిధ కారణాలతో ఏకంగా 600 మందికి ఉద్వాసన పలికింది. అయితే వారంతా డిపో మేనేజర్ మొదలు ఎండీ వరకు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో గత నెలలో అప్పీళ్ల మేళా నిర్వహించింది. వివిధ కోణాల్లో వారి కేసులను సమీక్షించి 180 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. మిగతా 420 మందిని మాత్రం పక్కనపెట్టేసింది.దీంతో వారంతా సంస్థ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. వేతన సవరణ, పాత బకాయిలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లింపు సహా వివిధ డిమాండ్లపై నిత్యం కారి్మకులు గొంతెత్తుతున్న వేళ 420 మంది రోడ్డెక్కడం ఆర్టీసీకి తలనొప్పిగా మారింది. ఉద్వాసనకు గురైన వారి వాదన ఓ రకంగా ఉంటే అధికారుల మాట మరోరకంగా ఉంటోంది. వారిలో ఎవరి వాదన సరైందో తేలాల్సి ఉంది.వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ‘టిమ్’లో టికెట్ ప్రింట్ కాకపోవడం వల్ల పెన్నుతో టికెట్ నంబర్ రాసే క్రమంలో చేసిన పొరపాటుకు ఓ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. టిమ్ యంత్రం వాడకంలో చిన్న పొరపాట్లు చేసిన మరికొందరిని తప్పించారు. చిన్నచిన్న సమస్యలు, చిల్లర విషయాలపై ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా ఉద్యోగాలు తీసేస్తే ఎలా? ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు కూలీలుగా మారుతున్నారు. అలా వారం క్రితం ఓ మాజీ కండక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. – ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ సిబ్బంది బృందం ప్రతినిధి రాజేందర్ ఊరికే ఉద్యోగాలు తొలగించం.. ఆర్టీసీ కారి్మకులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వారి సంక్షేమానికే ప్రయతి్నస్తాం తప్ప వారి ఉద్యోగాలు తొలగించాలని చూడం. ఓ తప్పు చేసినట్లు తేలితే వివిధ కోణాల్లో సమీక్షించడంతోపాటు ఆ ఉద్యోగి గత చరిత్రను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఒకట్రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించి వదిలేస్తాం. తప్పును పునరావృతం చేస్తే వేటు వేస్తాం. మద్యం సేవించి విధులకు వచ్చే డ్రైవర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటాం. – ఓ ఆర్టీసీ అధికారి మాట -
కోర్టు తీర్పుపై రిషితేశ్వరి తల్లిదండ్రుల ఆవేదన..
-
‘మా పాపకు అన్యాయం జరిగింది..’ రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును శుక్రవారం గుంటూరు కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. అయితే సాక్ష్యాలు ఇచ్చినా కూడా వాటిని కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదని, ఈ కేసులో న్యాయం కోసం పోరాడతామని రిషితేశ్వరి తల్లి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది.రిషితేశ్వరి స్వస్థలం వరంగల్. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేసిన ఆమె.. 2015 జులై 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే.. ర్యాగింగ్ వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లేవంటూ గుంటూరు జిల్లా ఐదవ కోర్టు .. తొమ్మిదేళ్ల విచారణ తర్వాత ఇప్పుడు కేసు కొట్టేసింది.‘‘మా పాప కేసులో మాకు అన్యాయం జరిగింది. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మా పాప రాసిన డైరీ ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశాం. మాకు న్యాయం చేయమని అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడిని, అప్పటి ఎస్పీ త్రిపాఠిని కలిశాం. మా పాపను ర్యాగింగ్ పేరుతో ఎలా వేధించారు రాసిన డైరీ ని కూడా ఒక కాపీ ఇచ్చాం. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు. మా అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్‌ను ప్రతీ అధికారికి వాటిని సమర్పించాం. పది సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం.. .. కానీ, మేమిచ్చిన సాక్ష్యాన్ని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అర్థం కావట్లేదు. న్యాయం కోసం అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంలను కలుస్తాం. మాకు పైకోర్టుల్లో పోరాడే ఆర్థిక శక్తి లేదు. ప్రభుత్వమే సాయం చేయాలి. కేసులో న్యాయం జరగకపోతే మాకు మరణమే శరణ్యం’’ అని రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు పెట్టకుంది.‘‘రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారి పేర్లు డైరీలో ఉన్నాయి. ఆమె ఏ విధంగా వేధింపులకు గురైందో డైరీ ల్లో ఉన్నాయి. అవి అన్నీ కోర్టు ముందు ఉన్నాయి. తోటి విద్యార్థులు, సీనియర్లు ఏ విధంగా వేధించారో స్పష్టంగా ఉంది. ప్రిన్సిపాల్ బాబురావుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. హాయ్ ల్యాండ్ లో ప్రెషర్స్ పార్టీలో లైంగికంగా వేధించారు. నిందితులకు శిక్ష పడుతుందని భావించాం. కానీ, కోర్టు కేసు కొట్టేసింది. ఈ తీర్పు న్యాయమైనది కాదని భావిస్తున్నాం. తీర్పుపై అప్పీల్ కు వెళ్ళాలన్నది నా నిర్ణయం. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేస్తాను.::: రిషితేశ్వరి కేసులో స్పెషల్ పీపీ వైకే -
మద్యం డిపోల్లో ఉద్యోగులపై వేటు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల ఉసురుతీస్తోంది. ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని 15వేల మంది సూపర్వైజర్లు, సేల్స్‌మెన్‌ను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీలు ద్వారా పారదర్శకంగా నియమితమైన తమను తొలగించవద్దన్న వారి విజ్ఞప్తిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.తమను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న వారి వినతిని తిరస్కరించింది. తాజాగా రాష్ట్రంలోని మద్యం డిపోల్లో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, స్కానర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో డిపోలో పది నుంచి 15మంది చొప్పున మొత్తం 400మందికిపైగా ఆపరేటర్లు, స్కానర్లు పదేళ్లుగా విధుల్లో కొనసాగుతున్నారు. వారిలో 50శాతం మందిని నవంబరు 1 నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎక్సైజ్ శాఖ 200మందిపై వేటు వేసింది. ఇక రెండో విడతలో మిగిలిన 200మందిని కూడా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలురాష్ట్రంలోని పలు మద్యం డిస్టిలరీల్లో సీఐడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. బీరు తయారీ కంపెనీలు, మొలాసిస్ యూనిట్లలోనూ తనిఖీలు నిర్వహించారు. గతేడాది కాలంలో ఆ కంపెనీల ఉత్పత్తులు, సరఫరా రికార్డులను పరిశీలించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జత్వానీ కేసు విచారణ చేపట్టిన సీఐడీహనీట్రాప్ కేసుల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. ఆ కేసును ఇప్పటివరకు విజయవాడ పోలీసులు దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. -
అరెస్ట్‌కు కారణాలను రాతపూర్వకంగా చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: ఏ కేసులో అయినా అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో పోలీసులు ఏకీకృత, నిర్ధిష్ట విధానాన్ని అనుసరించడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి రాతపూర్వకంగా తెలియచేసి తీరాలని పోలీసులను ఆదేశించింది. తద్వారా కస్టోడియల్ రిమాండ్ నుంచి తనను తాను కాపాడుకుని, బెయిల్ కోరేందుకు అవకాశం ఇవ్వాలని తేల్చిచెప్పింది. అలా చేయని పక్షంలో వివాదాస్పద అంశాల్లో వాస్తవాలేమిటన్న విషయం తేలకుండా పోతుందని పేర్కొంది.అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా తెలియచేసే విషయంలో ఏకీకృత విధానాన్ని రూపొందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అరెస్ట్‌కు దారి తీసిన కేసుకు సంబంధించిన మౌలిక వివరాలను కూడా అందులో పొందుపరచాలంది. అరెస్ట్‌కు సంబంధించి ఏ కారణాలనైతే నిందితునికి తెలియచేశారో వాటిని రిమాండ్ రిపోర్ట్‌తో జత చేయాలని కూడా ఆదేశించింది.రిమాండ్ అధికారాన్ని ఉపయోగించే న్యాయాధికారులు, మేజిస్ట్రేట్లు, జడ్జీలందరూ అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు తెలియచేయాలన్న రాజ్యాంగంలోని అధికరణ 22(1)లోని ఆదేశాన్ని, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 47(1)ను పోలీసులు అనుసరించారా లేదా అన్న దానిపై తమ సంతృప్తిని రికార్డ్ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. అరెస్టయిన వ్యక్తికి కూడా హక్కులుంటాయని, మానవ హక్కులు కూడా వర్తిస్తాయని తెలిపింది.విద్యాసాగర్ రిమాండ్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోంసినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో విజయవాడ కోర్టు తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. విద్యాసాగర్ రిమాండ్ విషయంలో విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. విజయవాడ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను కొట్టేసేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి సోమవారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు కాపీని రాష్ట్రంలోని న్యాయాధికారులందరికీ, డీజీపీకి పంపాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు.ఇదే సమయంలో తన అరెస్ట్ గురించి, అరెస్ట్‌కు గల కారణాల గురించి తన కుటుంబ సభ్యులకు గానీ, స్నేహితులకు గానీ పోలీసులు తెలియచేయలేదన్న విద్యాసాగర్ వాదనను న్యాయమూర్తి తన తీర్పులో తోసిపుచ్చారు. అరెస్ట్ గురించి, అరెస్ట్‌కుగల కారణాలను పోలీసులు విద్యాసాగర్‌కు 20.09.2024 ఉదయం 6.30 గంటల సమయంలోనే తెలియచేశారన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో జతచేసిన డాక్యుమెంట్లలో విద్యాసాగర్ అరెస్ట్‌కు సంబంధించిన అరెస్ట్ మెమో కూడా ఉందని తెలిపారు. జత్వానీ ఫిర్యాదు మేరకు విద్యాసాగర్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేశారు. విజయవాడ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ చక్రవర్తి సోమవారం తీర్పు చెప్పారు. -
10 మంది టీజీఎస్పీ సిబ్బంది డిస్మిస్
సాక్షి, హైదరాబాద్: సెలవుల్లో మార్పులు, ఇతర డిమాండ్లతో ఆందోళనలు చేపట్టిన తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరించడం, ఆందోళనలను రెచ్చగొట్టడం, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంటూ డీజీపీ కార్యాలయం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్వాసనకు గురైన సిబ్బంది వీరే..: 3వ బెటాలియన్ కానిస్టేబుల్ జి.రవికుమార్.. 6వ బెటాలియన్ కానిస్టేబుల్ కె.భూషణ్‌రావు.. 12వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్ ఎస్కే షరీఫ్.. 17వ బెటాలియన్ ఏఆర్ఎస్సై సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, ఎస్.కరుణాకర్‌రెడ్డి, టి.వంశీ, బండెల అశోక్, ఆర్.శ్రీనివాస్‌లను విధుల్లోంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఈడీకి సుప్రీం కోర్టులో చుక్కెదురు
ఢిల్లీ: భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు మంజూరైన బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై సోమవారం విచారణ జరిపిన సుప్రీకోర్టు ఈడీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందనేనని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక.. హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్‌లు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. జూన్ 28 హైకోర్టు సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. భూకుంభకోణంలో హేమంత్ సోరెన్ ప్రమేయం ఉన్నట్లు రికార్డులు సూచించటం లేదని జార్ఖండ్ హైకోర్టు పేర్కొంది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. సోరెన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. -
‘రస్ట్’ కేసు కొట్టివేత
శాంటా ఫే: ‘రస్ట్’ సినిమా షూటింగ్ రిహార్సల్స్ సమయంలో 2021లో అలెక్ బాల్డ్విన్(61) చేతిలోని తుపాకీ పేలి సినిమాటోగ్రాఫర్ హలియానా హట్చిన్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కేసు మూడేళ్లకు అనూహ్యంగా సుఖాంతమయింది. నటుడు అలెక్ బాల్డ్‌విన్‌పై ఉన్న ‘అసంకల్పిత హత్య’ ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే న్యూ మెక్సికో కోర్టు జడ్జి అకస్మాత్తుగా కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. కేసులో సాక్షులను అడ్డుకుంటూ పోలీసులు, లాయర్లు వ్యవహరించిన తీరు ఆధారంగానే తీర్పు ఇచ్చినట్లు జడ్జి మేరీ మార్లో సోమర్ తెలిపారు. కోర్టు హాల్లోనే ఉన్న బాల్డ్విన్ తీర్పు విని పట్టరాని ఆనందంతో ఏడ్చేశారు. మూడు దశాబ్దాలకు పైగా మంచి నటుడిగా పేరున్న బాల్డ్విన్ కెరీర్ 2021 నాటి ఘటనతో ప్రశ్నార్థకంలో పడింది. -
సందేశ్‌ఖాలీ కేసు: మమత సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు
కోల్‌కతా: సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసులో పశ్చిమబెంగాల్లోని మమతాబెనర్జీ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. కేసు దర్యాప్తును హైకోర్టు సీబీఐకి ఇవ్వడాన్ని తప్పుపడుతూ మమత సర్కారు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం(జులై 8) కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఎవరినో కాపాడటానికి ప్రభుత్వానికి ఆసక్తి ఎందుకు. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’అని బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్ వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మొత్తం నిరుత్సాహపరిచిందని పేర్కొంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ స్థానిక మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా వారి భూములు కబ్జా చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలతో అక్కడి మహిళలు ఒక ఉద్యమాన్నే నడిపారు. దీంతో షాజహాన్‌ను సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి. -
కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..
-
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి. దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు. సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్ బెయిల్ కోర్టు డిస్మిస్ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్‌కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిని చేయాలని వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను మోదీని ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిని చేయాలని వేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు ముందు సోమవారం(ఏప్రిల్29) విచారణకు వచ్చింది.ఇటీవల ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్‌లో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోదీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పిటిషనర్ కోరారు. అయితే పిటిషన్లో విచారించదగ్గ మెరిట్స్ ఏవీ లేవని కోర్టు అభిప్రాయపడింది. -
సీఈసీ, ఈసీల నియామక చట్టంపై స్టే ఇవ్వలేం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (అపాయింట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సరీ్వస్, టర్మ్స్ ఆఫ్ ఆఫీస్) చట్టం–2023’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, ఇటీవల ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఇతర పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్ లాయర్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన కమిటీ సిఫార్సుల మేరకు సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపట్టాలని అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచి్చందని గుర్తుచేశారు. కొత్త చట్టంపై స్టే విధించాల్సిందేనని అసోసియేషన్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రభుత్వ పాలనాయంత్రాంగం కింద పని చేస్తోందని ఆరోపించారు. అయితే, ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని, పాలనాయంత్రాంగం కింద పనిచేస్తోందని అనడం సరికాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యా నించారు. ‘‘ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే నియమితులయ్యారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. నియమితులైన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టంపై మధ్యంతర ఉత్తర్వు ద్వారా స్టే విధించడం గందరగోళానికి దారి తీస్తుంది. అలాగే వారి నియామకాన్ని నిలిపివేయలేం’’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తేల్చిచెప్పారు. నూతన చట్టం ప్రకారం ఎంపికైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరింది. అయితే, ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్లను పరిశీలిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 5 తేదీకి వాయిదా వేసింది. -
Delhi: సత్యేంద్రజైన్ వెంటనే లొంగిపోవాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జెయిన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం(మార్చ్ 18) కొట్టివేసింది. జైన్ వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ బేలా ఎమ్. త్రివేది, పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం జైన్ బెయిల్ పిటిషన్‌ను విచారించింది.‘బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాం, పిటిషనర్ వెంటనే లొంగిపోవాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. అనారోగ్య కారణాల వల్ల తన క్లైంట్ లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని సత్యేంద్ర జైన్ తరపు న్యాయవాది కోరగా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. గత సంవత్సరం మే 26 నుంచి సత్యేంద్రజైన్ మధ్యంతర మెడికల్ బెయిల్‌పై బయటే ఉన్నారు. ఈయనకు గతేడాది జులై 21న వెన్నెముక ఆపరేషన్ జరిగింది. కాగా, 2015 నుంచి 2017 వరకు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేస్తూ అక్రమ ఆస్తులు పోగేశారన్న అభియోగాలపై 2022 జైన్ అరెస్టయ్యారు. ఇదే కేసుకు సంబంధించి జైన్ తన కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడి అక్రమ లావాదేవీలు చేశారని ప్రాథమికంగా తేల్చిన ఈడీ ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి.. ఎన్నికల బాండ్లు.. ఎస్బీఐకి సుప్రీం డెడ్‌లైన్ -
అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తమ పారీ్టకి సంబంధించిన రూ.210 కోట్ల నిధులను స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ కొట్టివేసింది. కిందటి సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ సమరి్పంచిన ఐటీ రిటర్నుల్లో లోపాలు ఉన్నాయంటూ ఐటీ శాఖ ఆ పారీ్టకి రూ.210 కోట్ల జరిమానా విధించించిన సంగతి తెలిసిందే. ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాలంటూ కాంగ్రెస్ ఖాతాలున్న బ్యాంకులను ఐటీ శాఖ ఆదేశించింది. వేర్వేరు బ్యాంకుల్లోని తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండా రూ.65 కోట్లను ఐటీ శాఖ విత్‌డ్రా చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. రూ.205 కోట్లను స్తంభింపజేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాలపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది.పిటిషన్‌ను కొట్టివేస్తూ ట్రిబ్యునల్ శుక్రవారం తీర్పు వెలువరించింది. -
850 ఎకరాల స్కాం.. చంద్రబాబుకు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఓ సంస్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుధీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఆ కేటాయింపులను రద్దు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. వివరాల్లోకి వెళితే.. 2003లో బిల్లీ రావు అనే వ్యక్తి హైదరాబాద్, చుట్టుపక్కల క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ఐఎంజీ భారత్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉండగానే 850 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కారుచవకగా కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమ భూ కేటాయింపులను గుర్తించిన వైఎస్సార్ ప్రభుత్వం 2006లో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో బిల్లీ రావు ఈ రద్దును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ కొనసాగగా తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. వైఎస్సార్ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ బిల్లీ రావు పిటిషన్‌ను కొట్టేసింది. ఏకపక్షంగా భూ కేటాయింపులు చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. -
మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో మహువా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ)పై దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ తనకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తోందని.. దాన్ని నిరోధించాలని మహువా ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై గరువారం విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తీర్పును రిజర్వులో పెట్టి నేడు(శుక్రవారం) విడుదల చేశారు. మహువా మొయిత్రి చేసిన ఆరోపణలను ఈడీ తరఫు న్యాయవాది ఖండించాడు. ఈ కేసు సంబంధించి మహువా సమాచారాన్ని ప్రెస్ రిలీజ్ లేదా మీడియాకు వెల్లడించటం చేయలేదని తెలిపారు. ఇక.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసులో సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన మహువా మొయిత్రా హాజరుకాలేదు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లతో ఈడీ ప్రధాన కార్యాలయానికి ఫిబ్రవరి 19న హాజరుకావాలని ఈడీ ఇంతకుముందు ఆమెను కోరింది. అయితే... తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారు. అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని.. వచ్చే వారంలో తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మహువా మొయిత్రాపై సీబీఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరుపుతోంది. భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్‌పాల్ ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత డిసెంబరులో మహువా లోక్‌సభ సభ్యత్వం కూడా రద్దయింది. మొయిత్రా.. తాను ఏ తప్పు చేయలేదని లోక్‌సభ సభ్యత్వ రద్దును ఖండించారు.తన బహిష్కరణ వేటుపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చినందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బీ) ప్రకారం.. ఈ దశలో జోక్యం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్లో ఈసీ పేర్కొంది. రెండింటికీ బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ముద్రించాలని వివరించింది. పోలింగ్ స్టేషన్లనూ విడిగానే ఏర్పాటు చేయాలంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల అధికారులు సహా అన్నీ వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది. అయితే విడివిడిగా జరిగితే ప్రతి ఎన్నికకు అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా మారుతారు. దీంతో కాంగ్రెస్సే రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 171(4), ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961లోని రూల్ 70 ప్రకారం.. ఒకేసారి ముగియనున్న (నవంబర్ 30, 2027) ఎమ్మెల్సీ పదవీ కాల పరిమితికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ఎన్నిక నిర్వహించాలన్నారు. విడివిడిగా ఎన్నిక జరుపుతామంటూ జనవరి 4.. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 151 ప్రకారమే కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
కొడాలి నాని, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు కొట్టేసిన కోర్టు
సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ నేతలపై టీడీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేసింది. నానితో పాటు, మరో ఆరుగురు వైఎస్సార్సీపీ నేతలు నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. 2017లో వినాయకచవితి సందర్భంగా గుడివాడలో నాని నిర్వహించిన అన్న సమారాధనను పోలీసుల ద్వారా టీడీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. డీఎస్పీ మహేష్ నేతృత్వంలో అన్నదానాన్ని పోలీసులు అడ్డుకోబోగా, అన్నం పెడుతుంటే అడ్డుకోవడమేంటని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. భోజనం చేస్తున్న టేబుళ్లను పోలీసులు నెట్టి వెయ్యడంతో దుమారం చెలరేగింది. ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే నాని, వైసీపీ నాయకులు గుడ్లవల్లేరు బాబ్జి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్ సహా మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జరిగిన విచారణలో పోలీసులు చూపినవి తప్పుడు సాక్ష్యాలని న్యాయమూర్తి నిర్ధారించారు. వైఎస్సార్సీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీపై పిటిషన్ కొట్టివేత
సాక్షి, అమరావతి: రైతుభరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గతనెలలో జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు వెటర్నరీ మెడికల్ ప్రాక్టీషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. నోటిఫికేషన్ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన 37 మంది వెటర్నరీ వైద్యులకు రూ.5 వేల చొప్పున ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని రెడ్‌క్రాస్‌కు చెల్లించాలని ఆ వైద్యులను ఆదేశించింది. గురువారం ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీచేశారు. విచారణలో పిటిషనర్ల న్యాయవాదులు జడా శ్రవణ్‌కుమార్, ఆర్.వెంకటేష్ వాదనలు వినిపిస్తూ.. పశుసంవర్ధక సహాయకులకు విస్తృతాధికారాలు, వెటర్నరీ సర్జన్లకు ఉన్న అధికారాలు కల్పిస్తున్నారని, ఇది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులు నేరుగా వెటర్నరీ సర్జన్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుందని జాబ్‌చార్ట్ చెబుతున్నప్పటికీ, వాస్తవరూపంలో సహాయకులకు విస్తృత అధికారాలు కల్పించారని వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది జి.వి.ఎస్.కిషోర్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌కు, వెటర్నరీ చట్ట కౌన్సిల్ నిబంధనలకు సంబంధం లేదన్నారు. సర్వీసు సంబంధిత క్రమశిక్షణ చర్యలకే వెటర్నరీ కౌన్సిల్ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులకు విస్తృతాధికారులు ఇవ్వడం లేదన్నారు. రైతులకు సహాయ సహకారాలు అందించడమే వారి ప్రధాన బాధ్యతని తెలిపారు. పోస్టుల భర్తీని అడ్డుకోవడమే లక్ష్యంగా పిటిషనర్లు ఈ వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఈ పోస్టుల భర్తీలో కేవలం ఈడబ్ల్యూఎస్ వర్గానికి మాత్రమేగాక, అన్ని వర్గాలకు స్థానం కల్పించామని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం వెటర్నరీ వైద్యుల పిటిషన్‌ను కొట్టేసింది. -
ఆ 181 ఎకరాలు HMDAవే.. హైకోర్టులో భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో హైదరాబాద్ మహనగర అభివృద్ధి సంస్థ(HMDA)కు భారీ ఊరట లభించింది. శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములు హెచ్‌ఎండీఏవేనని హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. పిటిషనర్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆశ్రయించినట్లు గుర్తించిన కోర్టు.. వాళ్ల తీరును తప్పుబడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏకు చెందిన 181 ఎకరాల భూముల్లో.. 50 ఎకరాల భూముల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఈ మేరకు కోర్టులో పత్రాలు సమర్పించి మరీ రిట్ పిటిషన్ వేశారు కొందరు. అయితే సంబంధంలేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండీఏ ఆధీనంలోని భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారని హెచ్ఎండీఏ వాదించింది. ఇరువైపులా వాదనలు నవంబర్ 18వ తేదీన పూర్తికాగా.. తీర్పును రిజర్వ్ చేసింది డివిజన్ బెంచ్. ఈ క్రమంలో పిటిషనర్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించిన ఉన్నత న్యాయస్థానం డివిజన్ బెంచ్.. ఇవాళ రిట్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. తీర్పు వెల్లడించే క్రమంలో అక్రమార్కుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, తమ ఉన్నతాధికారుల చొరవతో మొత్తానికి హెచ్ఎండీఏ కేసు గెలిచింది. -
ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట
సాక్షి, విజయవాడ: ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 2015 టీడీపీ హయాంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో అధికారులపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరిపిన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు.. కేసును కొట్టేసింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలతో సహా మరో 16 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నేడు తీర్పును వెల్లడించింది. ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా? -
యెమెన్‌లో కేరళ నర్సుకు నిరాశ
ఢిల్లీ: యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సుకు నిరాశే ఎదురైంది. ఆమె మరణశిక్షపై దాఖలు చేసిన అప్పీల్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోవైపు తన కూతుర్ని విడిపించడానికి యెమెన్ వెళ్లాలని బాధితురాలి తల్లి చేసిన అభ్యర్థనపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని గురువారం కోరింది. కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే మహిళ తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో తలాల్ అబ్దో మహదీ అనే వ్కక్తికి మత్తుమందు ఇచ్చి చంపినట్లు కోర్టు దోషిగా తేల్చింది. మరణశిక్ష విధించింది. ఈ కేసులో 2017 నుంచి నిమిషా ప్రియ యెమెన్‌లో జైలు శిక్ష అనుభవిస్తోంది. అరబ్ దేశంలో అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉంది. అయినప్పటికీ యెమెన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రియా తల్లి ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియను విడుదల చేయడానికి మహదీ కుటుంబంతో నష్టపరిహారం గురించి చర్చలు జరపడానికి యెమెన్ వెళ్లాలని కోరుకుంటోంది. తన బిడ్డను కాపడటానికి తప్పకుండా యెమెన్ వెళ్లాల్సి ఉందని ధర్మాసనానికి ప్రియ తల్లి విన్నవించుకున్నారు. అందుకు ప్రయాణ నిషేధం అడ్డుగా ఉందని పేర్కొన్నారు. యెమెన్ ప్రయాణ నిషేధాన్ని సడలించవచ్చని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులు యెమెన్ వెల్లడానికి ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రియా విడుదల కోసం "సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్" అనే బృందం 2022లో హైకోర్టును ఆశ్రయించింది. నిమిషా ప్రియను రక్షించేందుకు దౌత్యపరమైన జోక్యం చేసుకోవడంతో పాటు కేంద్రం చర్చలు జరపాలని కోరింది. అయితే.. ప్రియాను రక్షించడానికి పరిహారం గురించి చర్చలు జరపాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఆమెను దోషిగా నిర్ధారించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ధర్మాసనం వెల్లడించింది. ఇదీ చదవండి: లాటరీలో రూ.45 కోట్లు గెలుచుకున్న కేరళవాసి -
లింగమనేనికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
సాక్షి, ఢిల్లీ: టీడీపీ నేత లింగమనేనికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ నిర్మాణాల అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా?. ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉందని సీజే ప్రశ్నించారు. ఇది రాజకీయ ఫిర్యాదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రుషికొండపై నిర్మాణాలు అక్రమం అని, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంంలో లింగమనేని శివరామ ప్రసాద్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్జీటీ, ఏపీ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు రుషి కొండపై ఏవిధమైన నిర్మాణాలు, కార్యక్రమాలు చేపట్టోద్దని లింగమనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లింగమనేని అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చదవండి: ఉచితమంటూ.. ముసుగు దోపిడీ -
డీకేపై విచారణ 3 నెలల్లో పూర్తిచేయండి
బనశంకరి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తును సవాలు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. ఇప్పటి వరకు ఉన్న స్టేను ఎత్తివేస్తూ దర్యాప్తు మూడునెలల్లో పూర్తిచేయాలని సీబీఐను ఆదేశించింది. దర్యాప్తు చాలావరకు పూర్తయిందని, అందుకే ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. 2014–18 మధ్య డీకే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది ప్రత్యేక కేసు నమోదు చేసింది. అంతకుముందు రెండు మూడుసార్లు డీకే, ఆయన సన్నిహితుల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపి నగదు, రికార్డులను స్వా«దీనం చేసుకుంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో డీకే కొన్ని నెలల కిందట హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తుపై స్టే తెచ్చుకున్నారు. గత సోదాల సమయంలో రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు వెలుగు చూశాయని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు. కేసుపై స్టే ఎత్తివేయాలని అభ్యర్థించారు. హైకోర్టు తీర్పును డీకే సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశముందని తెలిసింది. రాజకీయ దురుద్దేశంతోనే: డీకే రాజకీయ దురుద్దేశంతో గతంలో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం తన కేసును సీబీఐకి అప్పగించిందని డీకే శివకుమార్ ఆరోపించారు. తీర్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనను, కుటుంబాన్ని కనీసం ఒక్కరోజు కూడా విచారణకు రావాలని పిలవలేదన్నారు. మరి 90 శాతం దర్యాప్తు ఎలా పూర్తి చేశారోనని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కోర్టులపై తనకు నమ్మకం ఉందని, పోరాటం చేస్తానని చెప్పారు. తనను జైలుకు పంపిస్తామన్న రాష్ట్ర బీజేపీ, జేడీఎస్ నాయకుల మాటలను ప్రస్తావిస్తూ.. దమ్ముంటే త్వరగా ఆ పనిచేయాలని సవాల్ విసిరారు. -
ఇంత జరిగాక దర్యాప్తు ఆపమని చెప్పలేం: ఏపీ హైకోర్టు
సాక్షి, కృష్ణా: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ‘పిటిషన్ డిస్మిస్డ్’ అంటూ ఏకవాక్యంతో తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి. ఇక 68 పేజీలతో కూడిన చంద్రబాబు క్వాష్ ఆర్డర్ కాపీలో ఏపీ హైకోర్టుల కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ కీలక దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆపడం సరికాదు. ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రతిసారి పిటిషన్‌ను క్వాష్ చేయలేం.అసాధారణ పరిస్థితుల్లో ఉంటేనే ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలి. ఎఫ్ఐఆర్లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదు. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలి. విచారణ అంశాలను తర్వాతి దశలో ఎఫ్ఐఆర్లో నమోదు చేయొచ్చు. విచారణలో ఎఫ్ఐఆర్ మెరిట్స్ మీద కేసును అడ్డుకోకూడదు. సీఆర్పీసీ 482 కింద దాఖలైన పిటిషన్‌పై మినీ ట్రయల్ నిర్వహించలేం. 2021 నుంచి 140 మందిని సీఐడీ విచారించింది. నాలుగు వేల దాకా డాక్యుమెంట్లు సేకరించింది. ఈ దశలో ఈ విచారణలో జోక్యం చేసుకోలేం. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందు వల్ల మేం జోక్యం చేసుకోలేం’’ అని స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ రెండేళ్ల దర్యాప్తు తదనంతరం.. తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు. మరోవైపు సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్‌ను అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) రెండ్రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే హైకోర్టు ఆర్డర్ పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండి -
చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత
-
AP: కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్ల మేర నష్టం కలిగించారంటూ విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సూర్యనారాయణపై ఉన్నవి మామూలు ఆరోపణలు కాదని, అవి చాలా తీవ్రమైనవని హైకోర్టు స్పష్టం చేసింది. సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చి చెప్పింది. సూర్యనారాయణ పాత్రపై వ్యాపారులు స్పష్టమైన వాంగ్మూలాలు ఇచ్చారన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత వ్యాపారులు ముందుకొచ్చి వాంగ్మూలాలు ఇచ్చారని, సహ నిందితులు సైతం వాంగ్మూలాలు ఇచ్చారని, పలువురు సాక్షులు కూడా వాంగ్మూలం ఇచ్చారని, వీటన్నింటినీ పరిశీలిస్తే నేరంలో సూర్యనారాయణ పాత్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయంది. చదవండి: పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు దర్యాప్తులో పోలీసులు సేకరించిన సాక్ష్యాలు సూర్యనారాయణ పాత్రను ప్రాథమికంగా నిర్ధారిస్తున్నాయని తెలిపింది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించినటువంటి తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో సూర్యనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో సూర్యనారాయణ పాత్రపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అది ఇంకా పూర్తి కాలేదంది. అందువల్ల ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు. -
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పల ఈశ్వర్.. కోర్టుకు విన్నవించారు. మూడేళ్ల పాటు విచారణ జరిగి.. అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక ఇప్పుడు సాధ్యం కాదన్న హైకోర్టు.. తుది వాదనలు వినాల్సి ఉందని పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కొప్పుల ఈశ్వర్ ఎన్నిక సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి లక్షణ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈశ్వర్ స్థానంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు. లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలంటూ మంత్రి మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చదవండి: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం.. 15 బృందాలతో దాడులు -
చిరంజీవిపై నమోదైన కేసు కొట్టేసిన ఏపీ హైకోర్టు
సాక్షి, విజయవాడ: చిరంజీవిపై నమోదైన కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. 2014 ఎన్నికల్లో ఆయన కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. గుంటూరులో నిర్ణీత సమయంలో సభ ముగించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అప్పట్లో కాంగ్రెస్ నేతగా ప్రచారంలో పాల్గొన్న చిరంజీవిపై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ చిరంజీవి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది. చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి! -
కృష్ణా: ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసు కొట్టివేత
సాక్షి, కృష్ణా జిల్లా: సంచలనం సృష్టించిన ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆధారాలు లేవంటూ ఈ కేసును ఏడీజే(జిల్లా అదనపు జడ్జి) కోర్టు కొట్టివేసింది. అక్టోబర్ 24, 2014న కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురయ్యారు. రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తడంతో హత్య కోసం ఢిల్లీ నుంచి కాంట్రాక్టు కిల్లర్లను మాట్లాడారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను ఢిల్లీలోనే అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి గంధం మారయ్య, పగిడి మారయ్యలు వచ్చారు. వారిని తీసుకెళ్లేందుకు ఏలూరు నుంచి వారి తండ్రి గంధం నాగేశ్వరరావు వచ్చారు. అంతకుముందే విమానాశ్రయం వద్ద బాలాజీ, మహేష్, శివలు ఎరుపురంగు కారులో క్యాప్‌లు ధరించి ఉన్నారు. వీరితో పాటు పల్సర్ బైక్‌పై హంతకముఠా సభ్యుడు(షూటర్స్బ్యాచ్ )కూడా అక్కడే ఉన్నట్టు పోలీసులు కేసు రిపోర్టులో పేర్కొన్నారు. చదవండి: ప్రియునితో జీవిస్తోందని భర్త కిరాతకం? విమానం దిగి బయటకు వచ్చి తవేరా కారు ఎక్కగానే ఆ ముగ్గురూ చంపాల్సిన వ్యక్తులని షూటర్‌కు చూపించారు. దీంతో అతను షూటర్స్‌కు సమాచారం అందించాడు. తవేరా కారును ఆ షూటర్స్ మరో కారులో వెంబడించి గంధం నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్యలను హతమార్చారు. శివ, మహేష్, బాలాజీలు ఘటన అనంతరం గుంటూరు వెళ్లి కారును వదిలి బస్సులో చెన్నై వెళ్లారు. -
ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం: తేజస్వీ యాదవ్‌ని క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్..
పట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు చుక్కెదురయ్యేలా ఉంది. ఇప్పటికే ఈ కేసులో తేజస్వీతో పాటు ఆయన తల్లిదండ్రులపై కూడా సీబీఐ ఛార్జ్‌షీటు నమోదు చేసింది. దీంతో తేజస్వీ యాదవ్‌ను క్యాబినెట్ నుంచి తప్పించాలని బీజేపీ సీనియర్ నాయకుడు సుషీల్ మోదీ డిమాండ్ చేశారు. 'బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పాలనలో అవినీతికి స్థానం లేదని చెబుతాడు. మరి ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై అవినీతి కేసు నమోదైంది. ఎలాంటి ఆలస్యం చేయకుండా తేజస్విని క్యాబినెట్ నుంచి తప్పించాలి' అని సుశీల్ మోదీ డిమాండ్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2009 మధ్య కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో వెస్టర్న్ సెంట్రల్ జోన్లో గ్రూప్ డీ పోస్టుల భర్తీలో అవనీతికి పాల్పడ్డారని లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన భార్య రబ్రీ దేవీ కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు మరో 14 మందిపై ఛార్జ్‌షీటు కూడా నమోదు చేసింది. ఇదీ చదవండి: ఇక బిహార్ వంతు...? మహారాష్ట్ర తరహాలో ఆపరేషన్ కమలం! -
అమిత్ షా ఎంట్రీ.. వెనక్కి తగ్గిన తమిళనాడు గవర్నర్
చెన్నై: అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని క్యాబినెట్ నుంచి తప్పిస్తూ గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని గంటల్లోనే ఆర్.ఎన్. రవి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఇంతకూ అమిత్ షా ఏం చెప్పారు? ఎందుకు సెంథిల్ బాలీజీ విషయంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి వెనక్కి తగ్గారు? క్యాష్ ఫర్ జాబ్స్, మనీల్యాండరింగ్ లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసుల నేపథ్యంలో క్యాబినెట్ నుంచి మంత్రి సెంథిల్‌ను తొలగిస్తున్నట్లు గవర్నర్ ఆర్.ఎన్.రవి నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం గవర్నర్ తన విచక్షణ అధికారం ఉపయోగించినట్లు రాజ్‌భవన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు అర్ధరాత్రి సమయంలో అటార్నీ జనరల్‌తో భేటీ అయిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు. గవర్నర్ ఆర్.ఎన్.రవి నిర్ణయం న్యాయ పరంగా చిక్కుల్ని తెచ్చి పెట్టే అవకాశం ఉందనే అనుమానంతోనే అటార్ని జనరల్ సూచన తీసుకోమని అమిత్ షా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం బాలాజీ జ్యూడీషియల్ కస్టడీని జులై 12వ తేదీ వరకు పొడిగించింది స్థానిక కోర్టు. మనీల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన చేతిలో ఉన్న శాఖలను ఇది వరకే మరో ఇద్దరు మంత్రులకు సీఎం స్టాలిన్ అందజేయగా.. మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెంథిల్ కొనసాగుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: అర్ధరాత్రి తమిళనాట హైడ్రామా.. మంత్రి డిస్మిస్‌పై వెనక్కి తగ్గిన గవర్నర్! -
మేం జోక్యం చేసుకోం.. పిల్ కొట్టివేత
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభింపజేసేలా లోక్‌సభ సెక్రటేరియెట్, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశారు. అయితే.. ఇందులో జోక్యం చేసుకోలేమంటూ పిల్‌ను కొట్టేసింది సుప్రీం కోర్టు. మే 18వ తేదీన లోక్‌సభ సెక్రటేరియెట్ విడుదల చేసిన ఒక ప్రకటనతో పాటు లోక్‌సభ స్పీకర్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఇచ్చిన ఆహ్వానం.. రాష్ట్రపతిని అవమానించడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘనేనంటూ అడ్వొకేట్ జయ సుకిన్ పిల్ దాఖలు చేశారు. దీనిని శుక్రవారం వెకేషన్ బెంచ్ పరిశీలనకు తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ఉల్లంఘన(పార్లమెంటు రాజ్యాంగాన్ని వివరించేక్రమంలో.. ఉభయ సభలకు రాష్ట్రపతి ప్రతినిధిగా ఉంటారని వివరిస్తుంది) కిందకు ఎలా వస్తుందని, ఒక న్యాయవాదిగా అది రుజువు చేయాలని జస్టిస్ జేకే మహేశ్వరి కోరారు. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నందునా.. ఫైన్ విధిస్తామని సున్నితంగా మరో జస్టిస్ నరసింహ సున్నితంగా హెచ్చరించారు. ఈ తరుణంలో పిటిషన్ వెనక్కి తీసుకునేందుకే మొగ్గు చూపించారు. -
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడు భాస్కర్‌కు చుక్కెదురు
సాక్షి, విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడు భాస్కర్‌కు చుక్కెదురైంది. భాస్కర్, ఆయన భార్య అపర్ణ బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. రెండు బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లపై ప్రత్యేక న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, ముందస్తు పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం సంతోషకరమన్నారు. ‘‘గత ప్రభుత్వంలో దోచుకో.. పంచుకో.. తినుకో స్కీములు ఎక్కువగా నడిచాయి. ప్రజాధనాన్ని దోచుకున్న వారు చట్టం నుండి తప్పించుకోలేరు. ఈ కేసులో చట్టం తన పని తాను చేస్తోంది. భాస్కర్, అతని భార్య అరుణ ఉపాధ్యాయ తప్పిదాల్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ కేసులో ఇంకా చాలా మంది ప్రమేయం ఉందని భావిస్తున్నాను. ఈ కేసును ఈడీ కూడా నిశితంగా పరిశీలిస్తుంది’’ అని పొన్నవోలు సుధాకర్ తెలిపారు. చదవండి: నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని -
సుప్రీంలో ఊరట.. జడ్జిగా గౌరీ ప్రమాణం
సాక్షి, ఢిల్లీ: మద్రాస్ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా లాయర్ లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొలీజియంలో చర్చ జరిగాకే ఆమె పేరు ప్రతిపాదించినట్టు పేర్కొంది. సంబంధిత హైకోర్టు జడ్జిల అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నట్టు తెలిపింది. ఈ పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లు తేలినా లేదా ప్రమాణానికి లోబడి విధులను నిర్వర్తించకున్నా రెండేళ్ల తర్వాత ఆమె పనితీరు సంతృప్తికరమని భావిస్తేనే శాశ్వత జడ్జిగా ప్రతిపాదించే అవకాశం కొలీజియంకు ఉందని గుర్తు చేసింది. గతంలో అడిషనల్ జడ్జిలుగా పనిచేసిన వారు శాశ్వత జడ్జీలు కాలేకపోయిన ఘటనలు అనేకం ఉన్నాయంది. ఒక వ్యక్తి రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలు ఆ వ్యక్తి పేరును జడ్జిగా సిఫారసు చేయకపోవడానికి కారణం కాదని కొలీజియం భావించిందని పేర్కొంది. గౌరి మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ కొందరు లాయర్లు కేసు వేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే... మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుకు ముందే మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా గౌరి ప్రమాణం చేశారు! తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజా మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో ఆమెతో ప్రమాణం చేయించారు. తనకు గొప్ప అవకాశమిచి్చన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా ఇతర న్యాయమూర్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 1973లో జని్మంచిన గౌరి, 1995లో లాయర్‌గా పేరు నమోదు చేయించుకున్నారు. మదురై బెంచ్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా 2022 నుంచి పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం జనవరి 17వ తేదీన గౌరితో కలిపి మొత్తం ఐదు పేర్లను హైకోర్టు జడ్జీలుగా నియమించేందుకు కేంద్రానికి సిఫారసు చేసింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సిట్‌కు చుక్కెదురు.. హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌కు చుక్కెదురైంది. ప్రభుత్వ రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. కేసులో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ మోమో జారీ చేసిన సంగతి తెలిసిందే.. కాగా, బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్‌లపై మెమో విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇప్పటికే ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు గత ఏడాది డిసెంబర్లో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనిని విచారిస్తున్న సిట్‌గానీ, దర్యాప్తు అధికారిగానీ ఇక ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 63 రద్దు చేసింది. కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) పూర్తి వివరాలను, స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను సీబీఐకి అందజేయాలని సిట్, దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కావాలనే అలా మాట్లాడా! నేరం ఒప్పుకోలు.. భైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు -
నవయుగ కంపెనీకి సుప్రీంకోర్టులో షాక్
సాక్షి, ఢిల్లీ: మచిలీపట్నం పోర్టు పనుల రద్దుపై నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భూమి కేటాయించినా పోర్టు నిర్మించడంలో నవయుగ ఆలస్యం చేసిందని కాంట్రాక్టును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. త్వరితగతిన పోర్టు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. చదవండి: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు సోదాలు -
ఎమ్మెల్యేల కేసులో హైలైట్ ట్విస్ట్.. పోలీసులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో భాగంగా పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ మెమోలో పోలీసులు.. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చుతూ పిటిషన్ వేశారు. దీన్ని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసులో పీసీ యాక్ట్ ప్రకారం అక్కడ డబ్బు దొరకలేదు, ఘటన జరుగుతున్న సమయంలో నిందితులు అక్కడ లేరు. కానీ, పోలీసులు మాత్రం వారిని నిందితులుగా భావిస్తూ మెమో దాఖలు చేయడం పట్ల ఏసీబీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెమోను కొట్టివేసింది. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వీరు ముగ్గురు బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్.. మొదటి నుంచి సిట్ విచారణను హాజరుకాలేదు. అంతేకాకుండా, తమపై పెట్టిన కేసులు కూడా తప్పుడు కేసులు అంటూ హైకోర్టులో పిటషన్లు దాఖలుచేయడంతో వారి మద్దతుగానే కోర్టు సైతం వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి తరుణంలో ఏసీబీ కోర్టు మెమోను కొట్టివేయడం ఆసక్తికరంగా మారింది. -
AP High Court: అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత
సాక్షి, అమరావతి: అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదని హైకోర్టు పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. చదవండి: సలహాదారులుగా ఎవరిని నియమించాలో ప్రభుత్వ ఇష్టం కాగా, అమరావతే రాజధానిగా ఉండాలంటూ చేస్తున్న మహా పాదయాత్రపై గతంలో కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. ఈ పాదయాత్రను రాజకీయ యాత్రగా హైకోర్టు తేల్చింది. రైతులను ముందుంచి ఇతరులు ఈ యాత్రను నడిపిస్తున్నారని స్పష్టం చేసింది. అమరావతికి అనుకూలంగా తాము తీర్పు ఇచ్చినప్పటికీ రైతులు పాదయాత్ర చేస్తుండటాన్ని ఆక్షేపించింది. రైతులు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించింది. రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా ఇలాంటి యాత్రలు చేయడం ఏమిటంటూ నిలదీసింది. యాత్రల ద్వారా కోర్టులపై ఒత్తిడి తెస్తున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
నేతాజీ జయంతికి సెలవు.. పిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: స్వాతంత్ర సమర యోధుడు, ఆజాద్ హింద్‌ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని.. సెలవు దినంగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇలాంటి వ్యవహారాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయొద్దని పిటిషనర్‌ని మందలించింది న్యాయస్థానం. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. 1897 జనవరి 23వ తేదీన కటక్‌లో జన్మించారు. అయితే.. ఆయన జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. తద్వారా ఆ మహనీయుడికి ఓ గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సెలవు ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిల్లో అభ్యర్థించారు పిటిషనర్ కె కె రమేష్. అయితే.. దేశానికి ఆయన(నేతాజీ) చేసిన సేవలను గుర్తించడానికి ఉత్తమ మార్గం.. కష్టపడి పని చేయడమేనని, అంతేకానీ, ఇలా జయంతికి సెలవులను జోడించడం కాదు అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అయినా ఇది పూర్తిగా భారత ప్రభుత్వ పరిధిలోని అంశమని, న్యాయ వ్యవస్థ పరిధిలోకి రాదని పేర్కొంటూ ఆ పిల్‌ను డిస్మిస్ చేశారాయన. ఇదీ చదవండి: గూగుల్ పోటీలో నెగ్గిన మన కుర్రాడు -
భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత
-
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. ఎయిర్‌పోర్టు నోటిఫికేషన్ చెల్లదంటూ గతంలో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం పలువురు రైతులు కేసు ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మిగిలిన రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే జీఎంఆర్‌తో ఒప్పందం కుదిరింది. హైకోర్టు తీర్పుతో పనుల ప్రారంభానికి అడ్డంకులు తొలగాయి. నిర్మాణంపై గతంలో వేసిన స్టేను కూడా హైకోర్టు ఎత్తేసేంది. చదవండి: అసాగో బయోఇథనాల్ ప్లాంట్‌కు సీఎం జగన్ భూమి పూజ -
ఇదేం పాడు పని ప్రొఫెసర్.. విద్యార్థులకు అసభ్యకర వీడియోలు పంపి..
యశవంతపుర(బెంగళూరు): విద్యార్థులకు ఇన్‌స్టా గ్రాంలో అశ్లీల వీడియోలను పంపించిన మధుసూదన్ ఆచార్య అనే ప్రొఫెసర్‌ను నగరంలోని ఒక ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీ ఉద్యోగం నుంచి తొలగించింది. పోర్న్ వీడియోను విద్యార్థులకు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న కాలేజీ పాలక మండలి ఆయనను ఇంటికి పంపించింది. గౌరవమైన పదవిలో ఉంటూ విద్యార్థులకు అసభ్యకరమైన పోస్టులు చేయడం తలవంపులు తెచ్చేదిగా పేర్కొంది. -
మునుగోడు గుర్తుల వివాదం.. టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల గుర్తుల వివాదంలో టీఆర్ఎస్కు ఎదురు దెబ్బ తగిలింది. టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. కారును పోలిన గుర్తులను ఇవ్వొద్దని టీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈసీ వాదనతో ఏకీభవించిన కోర్టు సదరు పిటిషన్‌ను కొట్టేసింది. మునుగోడు స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని హైకోర్టుకి నివేదించింది ఎన్నికల సంఘం. దీంతో ఈ సమయంలో ఈ పిటిషన్ పై జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.. టీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. -
విధుల నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. మహిళను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సోమవారం ఉత్వర్వులు జారీ చేశారు. వనస్థలిపురంలో వివాహితను తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సీఐ కోరట్ల నాగేశ్వరరావును గతంలోనే పోలీస్ శాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నాగేశ్వరరావుపై ఇప్పటికే వనస్థలిపురం పోలీసులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. కొద్దీ రోజుల క్రితమే కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో మొత్తం 39 మందిని పోలీస్ శాఖ సర్వీస్ నుంచి తొలగించింది. గత పది నెలల్లో 55 మందిపై చర్యలు తీసుకుంది. తీవ్రమైన నేరారోపణలపై ఆర్టికల్ 311(2) బి కింద విధుల నుంచి తొలగించింది. సర్వీస్ రిమూవల్ కోరుతూ హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాశారు. ఈ మేరకు సీపీ లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ అథారిటీ సర్వీస్ నుంచి తొలగించింది. -
ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కానిస్టేబుల్ విధుల నుంచి తొలగించిన ప్రకాష్ వ్యవహారంలో మహిళ లక్ష్మి పాత్ర వివాదాస్పమవుతోంది. తనను ప్రకాష్ వేధించాడంటూ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసి మాట మార్చిన విషయం తెలిసిందే. తాజాగా తొమ్మిది రోజుల క్రితం జరిగిన ఓ విషయంమై శుక్రవారం ఆమె ఫిర్యాదు చేసేందుకు రావడం.. అదీ పోలీసులపైనే కేసు పెట్టడం మరోసారి చర్చనీయాంశమైంది. చదవండి: ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో.. వివరాలు.. కానిస్టేబుల్ ప్రకాష్ తన భార్య లక్ష్మిని లోబరుచుకున్నాడంటూ గార్లదిన్నెకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హౌసింగ్‌బోర్డులోని ఓ ఇంట్లో ఈ నెల ఒకటో తేదీన వారిద్దరూ కలిసుండడం చూసిన ఆయన అడ్డుకున్నట్లు తెలిసింది. గొడవ జరగడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని మందలించి పంపారు. అప్పటి నుంచి కనిపించని లక్ష్మి సంఘటన జరిగిన 9 రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం మీడియా ముందు ప్రత్యక్షమైంది. తనను అనంతపురం టూటౌన్ ఎస్ఐ రాంప్రసాద్, భర్త వేణుగోపాల్‌రెడ్డి, నాగేంద్రరెడ్డితో పాటు అంజినిరెడ్డి ఆ రోజు చంపాలని చూశారని ఆరోపించింది. స్థానికులు రావడంతో ఎస్ఐతో పాటు అందరూ పరారయ్యారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. -
ఎంపీ రఘురామ కుమారుడిపై బలవంతపు చర్యలొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కాని స్టేబుల్‌పై దాడి చేశారంటూ ఎంపీ రఘురామ కుమారుడు భరత్‌పై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు బలవంతపు చర్యలొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీ సులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయా లంటూ ఎంపీ రఘురామ, భరత్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఆగస్టు 12న ఇదే పిటిషన్ విచారించి కొట్టివేశామని, ఆర్డర్ ఇచ్చే సమయంలో మరికొన్ని ఆర్డర్లు కనిపించాయని ధర్మాసనం పేర్కొంది. అవి కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, అనంతరం సుప్రీంకోర్టు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సకు అను మతివ్వడానికి సంబంధించిన ఆర్డర్లని ఎంపీ రఘురామ తరఫు సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు తెలిపారు. రెండూ ఒకే అంశా నికి చెందినవా? అని ధర్మాసనం ప్రశ్నించింది. వేర్వేరు కేసులని న్యాయవాది స్పష్టం చేశారు. తర్వాత గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు పిటిషనర్లపై తదుపరి ఆదే శాలవరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ.. ధర్మాసనం హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. చదవండి: (సీఎం జగన్ నిర్ణయంతో మంచి జరుగుతుందని భావిస్తున్నా: ఉండవల్లి) -
రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ
Raghu Rama Krishna Raju.. సాక్షి, న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. తన సెక్యూరిటీ, తనయుడిపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని వేసిన రఘురామ పిటిషన్‌ను సుప్రీంకోర్టు.. శుక్రవారం డిస్మిస్ చేసింది. కాగా, ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి కేసులో రఘురామ.. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక, విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు లాయర్ అదనపు సమాచారం కోసం సమయం కోరారు. ఈ క్రమంలో ధర్మాసనం.. కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది కదా.. విచారణ కానివ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఇదిలా ఉండగా... రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో కూడా చుక్కెదురైన విషయం తెలిసిందే. గచ్చిబౌలి పీఎస్‌లో దాఖలైన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. అయితే, రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారన్న విషయంలో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణలో భాగంగా.. కోర్టులో పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు చెప్పారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్ అయ్యారని తెలిపారు. దీంతో, పోలీసుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల -
అడిగినంత లంచం ఇవ్వాలి.. లేదంటే నీ సంగతి చెప్తా
భువనేశ్వర్: రాష్ట్ర విజిలెన్స్ ఇనస్పెక్టర్ మానసి జెనాను విధుల నుంచి బర్తరఫ్ చేసినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) సునీల్‌కుమార్ బన్సాల్ శుక్రవారం ప్రకటించారు. తోటి ఉద్యోగి ఆధ్వర్యంలో రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆమె ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. విజిలెన్స్ వలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగిపై నమోదైన కేసును కొట్టి వేసేందుకు ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఆరోపణ. అడిగినంత లంచం ఇవ్వకుంటే కఠిన క్రిమినల్ చర్యలు చేపడతామని నిందితుడిని బెదిరించారు. ఈ వ్యవహారంలో విజిలెన్స్ అంతర్గత వర్గం అధికారులు మానసి జెనాను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మే 14న ఆమెను అరెస్ట్ చేసి, జుడీషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: స్నేహితుని పెళ్లి.. మత్తు ఎక్కువై రైలుపట్టాలపై పడుకుని.. -
నీట్–పీజీ ప్రత్యేక కౌన్సిలింగ్ వద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: అఖిల భారత కోటాలో మిగిలిపోయిన 1,456 నీట్–పీజీ–2021 సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైద్య విద్య ప్రయోజనాల దృష్ట్యా వాటిని భర్తీ చేయరాదన్న కేంద్రం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) నిర్ణయాన్ని సమర్థించింది. వైద్య విద్యతోపాటు ప్రజారోగ్యంతో సంబంధమున్న ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల వెకేషన్ బెంచ్ శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ‘‘విద్యా సంవత్సరం మొదలై ఏడాదవుతోంది. 9 వరకు రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయింది. జూలై నుంచి నీట్–పీజీ–2022 కౌన్సిలింగ్ కూడా మొదలు కానుంది. ఇలాంటప్పుడు విద్యార్థులు ఖాళీల భర్తీ కోరడం సరికాదు’’ అని సూచించింది. -
క్లబ్ టెకీల అంశంలో... మరో ఇన్స్పెక్టర్కు పబ్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్బుల్లో నడుస్తున్న గబ్బు దందాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్న ఇన్స్పెక్టర్లపై వేటు పడుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కొత్వాల్ సీవీ ఆనంద్ చర్యలు తీసుకుంటున్నారు. వెస్ట్‌జోన్ పరిధిలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ వ్యవహారంలో అప్పటి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.శివచంద్ర సస్పెండ్ అయ్యారు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున బయటపడిన క్లబ్ టెకీల వ్యవహారంలో మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) ఇన్స్పెక్టర్ ఎస్.సైదులుపై బదిలీ వేటు పడింది. సైదులును కమిషనర్ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో అదనపు ఇన్స్పెక్టర్ గడ్డం కాశికి బాధ్యతలు అప్పగించారు. (చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!) -
సెక్యూరిటీ చీఫ్‌ని తొలగించిన జెలెన్ స్కీ!
ఉక్రెయిన్ పై నిరవధిక దాడులతో రెచ్చిపోతున్న రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని తూర్పు నగరాలపై విధ్వంసం సృష్టించాయి. దీంతో దెబ్బతిన్న ఖార్కివ్ ప్రాంతాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సందర్శించారు. ఆ ప్రాంతంలో నగరాన్ని పూర్తి స్థాయిలో రక్షించేందుకు ప్రయత్నించని ఒక సెక్యూరిటీ చీఫ్‌ని కూడా తొలగించారు. ఖార్కివ్‌లోని పరిసరా ప్రాంతాలన్ని చాలా వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయని జెలెన్ స్కీ అన్నారు. అదీగాక రష్య కైవ్‌ని స్వాధీనం చేసుకోవడంలో విఫలమవ్వడంతో ఖార్కివ్ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గి తూర్పు డోన్బాస్ ప్రాంతం నుంచి దాడులు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని తూర్పువైపు దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. ఐతే జెలెన్ స్కీ మాత్రం చివరి వరకు మా దేశాన్ని రక్షించుకుంటామని పునరుద్ఘాటించటం విశేషం. అంతేకాదు ఖార్కివ్ ప్రాంతంలోని మూడో వంతు రష్యా అధినంలో ఉంది. పైగా రష్యా దళాల బాంబుల వర్షంతో విరుచుకుపడటంతో అక్కడ పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది. వేలాదిమంది పౌరులు చనిపోవడమే కాకుండా ఆ ప్రాంతాలకు వెళ్లడం కూడా కష్టతరంగా ఉందని స్థానిక గవర్నర్ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని ఉక్రెయిన్ ఆయుధ డిపోలనే లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని క్రెయిన్వాసులు తాగు నీరు లేక, ఆహారం కొనగోలు చేసేందుకు డబ్బులు లేక అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు. దీంతో జెలెన్స్కీ ధ్వంసమైన ప్రాంతాలను పునర్మించే దిశగా స్థానిక అధికారులతో ప్రణాళికా చర్చలు జరిపారు. మరోవైపు రష్యా ఎగుమతులపై ఆంక్షలు పెంచేలా ఒత్తిడి చేసేందుకు ఈయూ నాయకులతో శిఖరాగ్ర సమావేశమయ్యారు. అంతేకాదు హంగేరి, క్రోయోషియా వంటి దేశాలు రష్యా నుంచి దిగుమతి చేసుకునే భూగర్భ ఆధారిత పైప్ లైన్ చమురు పైనే ఆధారపడి ఉంది. దీంతో ఈయూ శిఖారాగ్ర సమావేశంలో పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే చమురు పై కాకుండా ట్యాంకర్ల ద్వారా చమురు సరఫరా చేసే ప్రతిపాదనను తీసుకొచ్చారు. (చదవండి: పుతిన్ బతికేది మరో మూడేళ్లే!.. తొలిసారి స్పందించిన రష్యా) -
సోదాల పేరుతో సీబీఐ అధికారుల రచ్చ
న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు గుంజేందుకు సోదాల పేరుతో హంగామా సృష్టించిన సీబీఐ అధికారులు నలుగురు అడ్డంగా దొరికిపోయారు. ఉన్నతాధికారులు వారిని డిస్మిస్ చేయడంతోపాటు అరెస్ట్ చేశారు. ఈనెల 10వ తేదీన సీబీఐ అధికారులమని చెబుతూ కొందరు తన ఆఫీసులోకి వచ్చి, నానా హంగామా సృష్టించారని చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త ఒకరు ఫిర్యాదు చేశారు. తనకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ బెదిరించి, రూ.25 లక్షలివ్వాలని డిమాండ్ చేశారని అందులో పేర్కొన్నారు. తమ సిబ్బంది ఒకరిని పట్టుకోగా, మిగతా వారు పరారయ్యారని వివరించారు. ఈ ఫిర్యాదుపై సీబీఐ డైరెక్టర్ సుబోధ్‌కుమార్ జైశ్వాల్ వెంటనే స్పందించారు. విచారణ జరిపి ఈ నలుగురూ ఢిల్లీ సీబీఐ ఆర్థిక నేరాలు, ఇంటర్‌పోల్ ప్రొటోకాల్ డివిజన్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్సైలు సుమిత్ గుప్తా, అంకుర్ కుమార్, ప్రదీప్ రాణా, అకాశ్ అహ్లావత్లుగా గుర్తించారు. వీరి నివాసాలపై సోదాలు చేపట్టి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురినీ అరెస్ట్ చేయడంతోపాటు వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిపై ఆరోపణలు రుజువైతే 10 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. -
కలెక్టరేట్ ఎక్కడనే నిర్ణయం ప్రభుత్వానిదే
సాక్షి, ఢిల్లీ: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం అభివృద్ధి అడుగుగానే భావించాలని అభిప్రాయపడింది. చిత్తూరు జిల్లా తిరుచానూరులోని పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌గా మార్చాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆధ్యాత్మిక భవనాన్ని కలెక్టరేట్‌కు ఇవ్వడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషనర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు తెలిపారు. ‘కలెక్టర్ ఎక్కడ కూర్చోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోబోం. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలి కదా. రాష్ట్ర విభజన అయిందంటే కొత్త రాష్ట్రంలో హైకోర్టు ఎక్కడ పెట్టాలి? సెక్రటేరియట్ ఎక్కడ నిర్మించాలి అని చూస్తాం కదా? ఆ ప్రాంతంలో ప్రజల నివాసానికి అనుగుణంగా ఉండాలి కదా? దీనికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. పద్మావతి నిలయాన్ని ప్రభుత్వం అద్దె ప్రాతిపదికనే తీసుకుంది. ఉచితంగా ఏం తీసుకోలేదు కదా? కలెక్టర్ కార్యాలయం వచ్చిందంటే ఆ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. కలెక్టర్ ఎక్కడ కూర్చోవాలి.. చెట్టు కింద కూర్చొని పనిచేయి అని మేం చెప్పలేం కదా. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలివేయాలి. ప్రజా ప్రయోజనాల అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో జోక్యం చేసుకోం. ఈ పిటిషన్ కొట్టివేస్తున్నాం..’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు -
మాధురీ జైన్‌కు భారత్‌పే షాక్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే తాజాగా కంపెనీ సహవ్యవస్థాపకుడు, ఎండీ అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్‌కు ఉద్వాసన పలికింది. ఆర్థిక అక్రమాలకు పాల్పడిన అభియోగాలతో బోర్డు నుంచి ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. మాధురికి గతంలో కేటాయించిన ఉద్యోగ స్టాక్ ఆప్షన్లు(ఇసాప్స్) సైతం కంపెనీ రద్దు చేసింది. కంపెనీ నిధులను వ్యక్తిగత సౌందర్య చికిత్సలకు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు, కుటుంబ ప్రయాణాల(యూఎస్, దుబాయ్)కు వెచ్చించినట్లు వెలువడిన ఆరోపణలతో మాధురిపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కంపెనీ ఖాతాల నుంచి వ్యక్తిగత సిబ్బందికి చెల్లింపులు, స్నేహపూరిత పార్టీలకు నకిలీ ఇన్వాయిస్లను సృష్టించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలియజేశాయి. వీటిపై మాధురి స్పందించవలసి ఉండగా.. 22 నుంచి ఈమెను సర్వీసుల నుంచి తొలగించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. అయితే కారణాలు వెల్లడించలేదు. సమీక్ష ఎఫెక్ట్ భారత్‌పే బోర్డు బయటి వ్యక్తులతో నిర్వహించిన ఆడిట్ నేపథ్యంలో తాజా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. రిస్క్‌ల సలహా సంస్థ అల్వారెజ్ అండ్ మార్సల్ ద్వారా కంపెనీ పాలనాపరమైన సమీక్షకు తెరతీసింది. రహస్యంగా ఉంచవలసిన సమాచారాన్ని తండ్రి, సోదరులకు మాధురి వెల్లడించినట్లు ఈ సమీక్షలో తేలిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తద్వారా కొన్ని థర్డ్‌పార్టీల ఇన్వాయిస్ సంబంధిత అవకతవకలు జరిగినట్లు తెలియజేశాయి. అన్ని బిల్లులను ఆమె ఆమోదించినట్లు పేర్కొన్నాయి. 2018 అక్టోబర్ నుంచి కంపెనీ ఫైనాన్షియల్ ఇన్చార్జిగా మాధురి వ్యవహరించారు. కాగా.. కొటక్ మహీంద్రా బ్యాంక్ సిబ్బందిపై దుర్భాషలాడటంతోపాటు, ఆర్థిక అవకతవకలకు పాల్పడిన అభియోగాల నేపథ్యంలో మాధురి భర్త గ్రోవర్ సైతం మూడు నెలల సెలవుపై వెళ్లారు. అయితే వీటిని గ్రోవర్ తోసిపుచ్చారు. భర్త గ్రోవర్ సెలవుపై వెళ్లిన కొద్ది రోజుల్లోనే మాధురి సైతం సెలవుపై వెళ్లడం గమనార్హం! -
ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు హైకోర్టులో ఊరట లభించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2019లో డబ్బు పంపిణీ చేశారంటూ ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి గురువారం తీర్పునిచ్చారు. -
డ్రగ్స్ కేసు : నటుడు అర్మాన్ కోహ్లీకి షాక్ ఇచ్చిన కోర్టు
Armaan Kohli Bail Denied In Drugs Case: నటుడు అర్మాన్ కోహ్లీకి ముంబై కోర్టు షాకిచ్చింది. అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం.. డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని గత నెల28న ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అర్మాన్ నివాసంలో జరిపిన సోదాల్లో 1.2 గ్రాముల కొకైన్ లభ్యం కావడంతో ఎన్సీబీ అతడ్ని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టు అర్మాన్‌కు 14రోజల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీనిని సవాలు చేస్తూ తనకు డ్రగ్ సప్లయర్స్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అర్మాన్ పేర్కొన్నాడు. తనకు వెంటనే బెయిల్ ముంజూరు చేయాలని కోరుతూ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాగా ఈ కేసులో అర్మాన్తో పాటు ఏడుగురు నిందితులు ఉన్నారని, వీరికి ఒకరితో మరొకరికి సంబంధాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా కోర్టుకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్మాన్‌కు బెయిల్ మంజూరు చేయరాదంటూ కోర్టుకు విన్నవించారు. దీనిపై ఏకీభవించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఎమ్ నెర్లికర్ అర్మాన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. చదవండి : సిద్ధార్థ్ శుక్లాకు నివాళులు అర్పించిన హాలీవుడ్ నటుడు జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన కంగనా రనౌత్ -
ఆ వార్తలను నమ్మొద్దు.. వీడియో రిలీజ్ చేసిన షకీలా
చెన్నై: తన గురించి ప్రసారం అవుతున్న వదంతులను నమ్మొద్దని సంచలన నటి షకీలా పేర్కొన్నారు. శృంగార తార షకీలా ప్రస్తుతం టీవీ కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇస్తున్న ఈమె గురించి ఒక షాకింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది. షకీలా మరణించారన్నదే ఆ వార్త. ఈ ప్రచారంతో షకీలా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో తన ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం తనని దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ఓ వీడియో విడుదల చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఇలాంటి వదంతులను ఎవరూ నమ్మొద్దని ఆమె పేర్కొన్నారు. ఈమె మిలా అనే అమ్మాయిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తను దత్తపుత్రికతో తీసుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. మిలా లేకపోతే తాను లేను తనకు జీవితమే లేదు తనకు తోడు మిలానే అని షకీలా పేర్కొన్నారు. దత్తపుత్రికతో షకీల (పైల్) Actress #Shakeela dismisses rumors about her and her health.. She is doing absolutely fine..@Royalreporter1 pic.twitter.com/ut41SrRGG4 — Ramesh Bala (@rameshlaus) July 29, 2021 -
కరోనాతో రాజకీయ సంక్షోభం: ప్రధానమంత్రి తొలగింపు
టూనిస్ (ట్యూనిషియా): మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ప్రజలతో పాటు ప్రభుత్వాలను కుప్పకూలుస్తోంది. తాజాగా ట్యూనిషియా దేశంలో కరోనా ప్రభావంతో ఏకంగా ప్రధానమంత్రినే తొలగించారు. దేశ అధ్యక్షుడు మొత్తం పార్లమెంట్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై తాజా మాజీ ప్రధానమంత్రి అధ్యక్షుడి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి కావాల్సిన పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ పార్లమెంట్‌ను రద్దు చేయడంపై మండిపడుతున్నారు. దీంతో ప్రస్తుతం టునిషీయాలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ట్యూనిషియాలో కరోనా తీవ్రంగా ప్రబలింది. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శించాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలోనే కొన్ని నెలల కిందట ఆరోగ్య శాఖ మంత్రిని పదవి నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆ దేశంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాజధాని నగరం టునీస్‌లో ప్రజలు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అధికార పార్టీ ఎన్నాహద్ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. కంప్యూటర్లు పగులగొట్టి.. నిప్పు పెట్టి హింసాత్మక పరిస్థితులకు దారి తీసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతుండడంతో దేశ అధ్యక్షుడు కైస్ సయీద్ ప్రధానమంత్రి హిచెమ్ మెచిచిని పదవిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్‌ను రద్దు చేశారు. అధికార పార్టీ ‘ఇస్లామిస్ట్ ఇన్స్పైర్డ్ ఎన్నాహ్‌ద పార్టీ’కి వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రదాన నగరాల్లో ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. అయితే అధ్యక్షుడి నిర్ణయాన్ని తాజాగా మాజీ ప్రధానమంత్రిగా అయిన హిచెమ్ మెచిచి తప్పుబట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో అధ్యక్షుడిగా కాయిస్ సయీద్ ఎన్నికయ్యారు. -
హైకోర్టులో ఏఆర్ రెహ్మాన్‌కు ఊరట
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏఆర్ రెహ్మాన్ 2000 సంవత్సరంలో ఒక సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాళియప్పన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరుకాలేదు. తాను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రాలేదని, ఏఆర్ రెహ్మాన్ మాత్రం లబ్ధి పొందారని..తనకు నష్టపరిహారంగా రూ.3 కోట్లు చెల్లించాలని కాళియప్పన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును న్యాయమూర్తి ఆర్.సుబ్రమణియం శుక్రవారం విచారించారు. నిర్వాహకుడికి లాభం రాకపోవడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని రెహ్మాన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. లాభం లేదని చెబుతూ నిర్వాహకుడు తమకు ఇస్తానని ఒప్పుకున్న డబ్బు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి పిటిషన్‌దారుడు తరఫు న్యాయవాది వివరణ ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. -
టెలికం కంపెనీలకు ‘సుప్రీం’ నిరాశ
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి తాము చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల లెక్కల్లో తప్పులు దొర్లాయని, సవరించడానికి అనుమతించాలని వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలీ సర్వీసెస్‌లు దాఖలు చేసుకున్న పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, ఎస్ఏ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో వేసిన లెక్కలే చివరివనీ, వీటిలో ఎటువంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే... ► దాదాపు రూ.1.4 లక్షల కోట్ల ఏజీఆర్‌ను టెలికం శాఖ డిమాండ్ చేసింది. టెలికంకు అనుకూలం గా 2019 అక్టోబర్‌లో సుప్రీం తీర్పు నిచ్చింది. ► అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీం కొంత ఊరటనిచ్చింది. టెలికం డిమాండ్ చేసిన ఏజీఆర్ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీలోపు చెల్లించాలని టెలికం కంపెనీలకు గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన మొత్తాలను 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2031 మర్చి 31వ తేదీ లోపు వార్షిక వాయిదాల్లో చెల్లించాలని సూచించింది. ఆయా అంశాలపై ఇదే తుది నిర్ణయమని కూడా స్పష్టం చేసింది. ► భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాసహా ఆపరేటర్లు ఏజీఆర్ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీ నాటికి చెల్లించాయి. ► వేర్వేరుగా చూస్తే, భారతీ ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రూ.58,254 కోట్లు, టాటా గ్రూప్ రూ.16,798 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ.5,835.85 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.4,352.09 కోట్లు చెల్లించాల్సి ఉంది. ► ఇందులో భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే రూ.18,004 కోట్లు చెల్లించింది. వొడాఫోన్ ఐడియా రూ.7,854 కోట్లు, టాటాలు రూ.4,197 కోట్లు, రిలయన్స్ జియో రూ.194.79 కోట్లు చెల్లించాయి. ► అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.25,194.58 కోట్లు, ఎయిర్‌సెల్ రూ.12,389 కోట్లు, వీడియోకాన్ కమ్యూనికేషన్స్ రూ.1,376 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇవి దివాలా ప్రక్రియలో ఉన్నాయి. ► ప్రభుత్వానికి రూ.604 కోట్లు బకాయిపడ్డ లూప్ టెలికం, ఎటిసలాట్ డీబీ, ఎస్ టెల్ భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేశాయి. ► ఇదిలావుండగా, తమ ఆస్తులలో భాగంగా ఎయిర్ వేవ్స్ లేదా స్పెక్ట్రంను టెలికం కంపెనీలు బదిలీ చేయవచ్చా లేదా విక్రయించవచ్చా అనే ప్రశ్నపై దాఖలైన ఇతర పిటిషన్ల విచారణ ప్రస్తుతం సుప్రీం ధర్మాసనం ముందు ఉంది. షేర్ల ధరలు ఇలా... సుప్రీం తీర్పు నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేర్ ధర శుక్రవారం ఎన్ఎస్ఈలో దాదాపు 10 శాతం పడి, రూ.8.35 వద్ద ముగిసింది. ఇక ఇండస్ టవర్స్ షేర్ ధర 5 శాతం తగ్గి రూ.220.50 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ షేర్ ధర మాత్రం స్వల్పంగా (0.29 శాతం) పెరిగి రూ.548.30 వద్ద ముగిసింది. టాటా టెలిసర్వీసెస్ కూడా 5 శాతం నష్టపోయి రూ. 37.75 వద్ద ముగిసింది. వీఐఎల్‌కు ఇబ్బందే: విశ్లేషణలు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు టెలికం కంపెనీలకు ప్రత్యేకంగా రుణ భారాలను మోస్తున్న వొడాఫోన్ ఐడియాకు తీవ్ర ఇబ్బందికర పరిణామమని విశ్లేషణా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ తీర్పు ప్రతికూలతను పరోక్షంగా ఎదుర్కొనే సంస్థల్లో తరువాత ఇండస్ టవర్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి. ఫైనాన్షియల్ సేవల సంస్థ... సిటీ దీనిపై విశ్లేషిస్తూ, వొడాఫోన్ ఐడియా దాదాపు రూ.25,000 కోట్ల సమీకరణ ప్రణాళికలపై తాజా పరిణామం ప్రభా వం పడుతుందని పేర్కొంది. అయితే భారతీ ఎయిర్టెల్ పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉండబోదని విశ్లేషించింది. ఎడిల్వీస్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై పిటిషన్‌ను తోసిపుచ్చిన ఎన్జీటీ
సాక్షి, అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో చిత్తూరు జిల్లా ఆవులపల్లి గ్రామస్థులు వేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. రాయలసీమ లిఫ్ట్ అంశంపై అదే పనిగా కేసులు వేయడంపై టిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై పదేపదే కేసులా అంటూ ఆవులపల్లి గ్రామస్థులపై ఎన్జీటీ సీరియస్ అయ్యింది. తరచూ కేసులు వేసి ఇబ్బంది పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులు మళ్లీ వేస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రిబ్యునల్ హెచ్చరించింది. -
ఫేస్‌బుక్‌కు భారీ ఊరట..!
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ దిగ్గజ సంస్థలు ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, ఆపిల్ కంపెనీలు యాంటీట్రస్ట్ బిల్లుల పేరిట విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. యాంటీ ట్రస్ట్ బిల్లుల విషయంలో ఫేసుబుక్పై నమోదైన వ్యాజ్యాలను సోమవారం యూఎస్ ఫెడరల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అమెరికాలో ఫేసుబుక్కు భారీ ఊరట లభించింది. గతంలో ఫేసుబుక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లను బలవంతంగా కొనుగోలు చేశారనే విషయంలో ఫేస్‌బుక్‌పై యాంటీ ట్రస్ట్ వ్యాజ్యం నమోదైంది. వన్ ట్రిలియన్ డాలర్లకు ఎగిసినా మార్కెట్ విలువ.. 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఒక బిలియన్ డాలర్లకు, 2014లో వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫేస్బుక్ బహిరంగ మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందనే ఆరోపణలను యూఎస్ కోర్టులో ఎఫ్‌టీసీ నిరూపించలేకపోయింది.ఫేస్బుక్ కు యాంటీట్రస్ట్ విషయంలో సానుకూలంగా తీర్పు రావడంతో ఫేసుబుక్ షేర్లు దూసుకుపోయాయి. తీర్పు వెలువడిన తర్వాత ఫేస్బుక్ షేర్లు 4 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. దీంతో తొలిసారి ఫేసుబుక్ మార్కెట్ మూలధన విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్..! -
అంబానీ ఇంటి వద్ద కలకలం కేసు: సచిన్ వాజేకు షాక్
ముంబై: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో నిందితుడిగా ఉన్న సచిన్ వాజే ఇక మాజీ పోలీస్ అధికారిగా మారిపోయాడు. ఆయనను విధుల్లో నుంచి తొలగిస్తూ ముంబై పోలీస్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌కు గురైన అతడిని తాజాగా మంగళవారం పోలీస్ శాఖ నుంచి పంపించేశారు. పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా సచిన్ వాజే పేరు ప్రఖ్యాతులు పొందారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసుతో ఆయన ఉచ్చులో చిక్కుకున్నారు. పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ ఫిబ్రవరి 25న ముకేశ్ అంబానీ దక్షిణ ముంబై నివాసం వెలుపల నిలిపి ఉన్న కేసు కొత్త కొత్త మలుపులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పేలుడు పదార్థాలతో పట్టుబడిన స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మృతి కేసులో వాజే.. ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. ఈ కేసులో సచిన్ వాజే ప్రమేయం ఉందని గుర్తించిన ఎన్ఐఏ వాజేను మార్చి 13 న అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా శాఖపరమైన చర్యలు ముంబై పోలీసులు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోంది. చదవండి: ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా -
తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత
సాక్షి అమరావతి: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఈ నెల 17న నిర్వహించిన ఉప ఎన్నికను రద్దుచేసి రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యంపై అధికరణ 329 కింద నిషేధం ఉందని తెలిపింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని పిటిషనర్లు భావిస్తే అందుకు వారు చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. తిరుపతి ఉప ఎన్నికలో అక్రమాలు జరిగాయని, అందువల్ల ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ రత్న ప్రభ, పనబాక లక్ష్మి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ‘పరిషత్’ ఎన్నికలపై విచారణ 3కి వాయిదా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ.. ఎన్నికల ప్రక్రియను ఆపేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సింగిల్ జడ్జిని కోరింది. శుక్రవారం ఈ పిటిషన్లు విచారణకు రాగా న్యాయమూర్తి సోమవారం విచారణ జరుపుతామని తెలిపారు. చదవండి: ఏసీబీ కస్టడీకి ధూళిపాళ్ల ఆర్టీసీ 'డోర్ టు డోర్' పార్సిల్ సర్వీసు -
ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధూళిపాళ్ల క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆయనను విచారించాలని కోర్టు ఆదేశించింది. మే 5లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో పలు అక్రమాలు, అవినీతి కేసులో ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సంగం డెయిరీ అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కస్టడీకి కోరనుంది. ధూళిపాళ్ల నరేంద్ర అక్రమాల చిట్టా ఇదీ.. ♦సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన పదెకరాల భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ఉన్న ట్రస్ట్‌కు నరేంద్ర బదలాయించారు. అప్పటి డెయిరీ ఎండీగా ఉన్న గోపాలకృష్ణ ఆ పదెకరాలను ట్రస్టుకు బదలాయించినట్టు తీర్మానం చేయడం, మేనేజింగ్ ట్రస్టీగా నరేంద్ర వాటిని తీసేసుకోవడం జరిగిపోయాయి. ఇది బైలా నంబర్ 439 ప్రకారం ఉల్లంఘన. ♦ప్రభుత్వ భూమిలో వీరయ్య చౌదరి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ నిర్మించుకున్నారు. ఈ ఆస్పత్రికి నరేంద్ర భార్య జ్యోతిర్మయి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ♦ఏదైనా సహకార సంఘాన్ని కంపెనీగా మార్చుకోవాలంటే ప్రభుత్వానికి బకాయిలు చెల్లించి, భూములు అప్పగించి జిల్లా కోఆపరేటివ్ అధికారి నుంచి ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) తెచ్చుకోవాలి. 2011 ఫిబ్రవరి 28న రిటైర్ అయిన డీసీవో గురునాథం నుంచి ఆయన రిటైర్మెంట్కు రెండు రోజుల ముందు తేదీతో ఎన్వోసీ తెచ్చి.. సంగం డెయిరీని కంపెనీ చట్టం కిందకు తెచ్చుకున్నారు. ఫలితంగా తన సొంత కంపెనీగా నరేంద్ర డెయిరీని మార్చేశారు. ♦దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ అధికారి కార్యాలయంలో తనిఖీలు చేసిన ఏసీబీ.. ఎన్వోసీకి సంబంధించిన దరఖాస్తు, ఇతర ఉత్తరప్రత్యుత్తరాలు లేవని నిర్ధారించింది. అక్రమ పద్దతుల్లో ఎన్వోసీని సృష్టించినట్టు తేలింది. మరోవైపు ఏపీడీడీసీ కమిషనర్ పేరుతో ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి వాటిని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)లో తనఖా పెట్టి 2013లో ధూళిపాళ్ల నరేంద్ర రూ.115.58 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తన తండ్రి పేరుతో ఆస్పత్రి నిర్మాణానికి, నిర్వహణకు మళ్లించారు. ♦సంగం డెయిరీ లాభాలు, ప్రభుత్వ నిధులతో 1973, 1976, 1977, 1978లో కొనుగోలు చేసిన 72.54 ఎకరాలకు చెందిన 51 డాక్యుమెంట్లను కూడా ఏసీబీ సేకరించింది. ఈ భూములను కొట్టేసేందుకు ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించారు. ♦ప్రభుత్వం 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టం తెచ్చింది. దీని ప్రకారం.. ఒక సహకార సంఘాన్ని మ్యాక్స్ పరిధిలోకి తేవాలంటే ప్రభుత్వానికి చెందిన భూములు తిరిగి అప్పగించడంతోపాటు బకాయిలను చెల్లించాలి. అలా చేయకుండానే 1997 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని మాక్స్ చట్టం పరిధిలోకి తెచ్చారు. నరేంద్ర సంగం డెయిరీ నిర్వహణ చూస్తునే మరోవైపు సొంతంగా మిల్క్‌లైన్ అనే ప్రయివేటు పాల సేకరణ కంపెనీని నిర్వహించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. తర్వాత మిల్క్‌లైన్ కంపెనీకి తన భార్య జ్యోతిర్మయిని ఎండీని చేశారు. చదవండి: చంద్రబాబు అండతోనే.. Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ -
ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
ఆ నలుగురు ఔట్..!
మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీలో పనిచేస్తున్న నలుగురు ప్రొఫెసర్లను ఉద్యోగాల నుంచి రిలీవ్ చేస్తూ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ ఆమోదంతో గురువారం రాత్రి ఇన్చార్జి రిజిస్ట్రార్ వైకే సుందరకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నలుగురు ప్రొఫెసర్లు ప్రస్తుతం సెలవులో ఉండటంతో ఉత్తర్వులను వారి వ్యక్తిగత మెయిల్‌కు పంపడంతో పాటు శుక్రవారం వాటిని సొంత ఊరు అడ్రస్‌కు పోస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వర్సిటీ పాలక మండలి నియామక నోటిఫికేషన్ రద్దు చేసిందన్న విషయాన్ని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ప్రొఫెసర్ల ఉద్యోగాలు పోయినట్లే. అయితే వాటిని కాపాడుకునేందుకు సదరు ప్రొఫెసర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతపురం జేఎన్టీయూ మాదిరే తమకు కూడా హైకోర్టు ధర్మాసనం సానుకూలమైన తీర్పు ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా సుందరకృష్ణ కృష్ణా యూనివర్సిటీ నుంచి సాగనంపే నలుగురు ప్రొఫెసర్లలో ఒకరైన టి. హైమావతి ప్రస్తుతం ఇక్కడ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ల నియామకం, తొలగింపు... రిజిస్ట్రార్ సంతకంతోనే జరగాల్సి ఉంది. ఇది చిక్కు తెచ్చిపెట్టింది. వర్సిటీ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ దీనిపై తీవ్ర తర్జన భర్జన అనంతరం వైకే సుందరకృష్ణను ఇన్చార్ట్ రిజిస్ట్రార్‌గా నియమించి, అతనితో ఆ నలుగురు ప్రొఫెసర్లకు తొలగింపు ఉత్తర్వులు ఇప్పించారు. తొలగించిన వారు వీరే.. ♦డాక్టర్ తాళ్ల హైమావతి, అప్లైడ్ మాథమెటిక్స్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు) ♦డాక్టర్ వి. వెంకట్రాము, ఫిజిక్స్ డిపార్ట్మెంటు, అసిస్టెంట్ ప్రొఫెసర్, యోగి వేమన యూనివర్సిటీ (నూజివీడు పీజీ సెంటర్ స్పెషల్ ఆఫీసర్‌గా, వర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ బాధ్యతలు చూస్తున్నారు.) ♦డాక్టర్ ఈదర దిలీప్, ఇంగ్లిష్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ద్రవిడన్ యూనివర్సిటీ (ఇంగ్లిష్ డిపార్ట్ట్మెంట్ హెచ్ఓడీగా, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా ఉన్నారు.) ♦డాక్టర్ వైఏవీఏఎస్‌ఎన్ మారుతి బయోసైన్స్ అండ్ బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్, ప్రొఫెసర్, గీతం యూనివర్సిటీ ( కాలేజీ అభివృద్ధి కమిటీ (సీడీసీ) డీన్‌తో పాటు క్యాంపస్‌లో ఉన్న ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు). ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే కృష్ణా యూనివర్సిటీ ఎగ్జిక్వూటివ్ కౌన్సిల్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నాము. నిపుణుల సలహాలు తీసుకొనే ఆ నలుగురు ప్రొఫెసర్లును రిలీవ్ చేశాము. ఇన్చార్జ్ రిజిస్ట్రార్ నియామకం తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. – కేబీ చంద్రశేఖర్, వైస్ చాన్సలర్, కృష్ణా యూనివర్సిటీ చదవండి: ‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్ తుపాన్లతో దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు -
కామిరెడ్డిపల్లి త్రిబుల్ మర్డర్ కేసు కొట్టివేత
సాక్షి, ధర్మవరం/అనంతపురం: నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన కామిరెడ్డిపల్లి త్రిబుల్ మర్డర్ కేసులో జిల్లా మహిళా కోర్టు(జిల్లా 4వ అదనపు జడ్జి) న్యాయమూర్తి బి.సునీత గురువారం తీర్పునిచ్చారు. కేసులో నిందితులుగా ఉన్న 20 మందిపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా పరిగణించారు. వివరాలు.. 2011లో ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు, అతని కొడుకు దాసరి ఆంజనేయులు, కూతురు పద్మావతి కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద హత్యకు గురయ్యారు. ఈ కేసులో మాజీ కౌన్సిలర్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, అతని చిన్నాన్న కామిరెడ్డిపల్లి ఆదిరెడ్డి, సోదరుడు రవీంద్రారెడ్డి, మల్లాకాల్వ రామమోహన్‌రెడ్డి, రావులచెరువు ప్రతాపరెడ్డి, మరో 17 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 2011 సెప్టెంబర్ 15న కనగానపల్లి పోలీసులు సెక్షన్–324, 326, 307, 302,120బీ కింద కేసు నమోదు చేశారు. ధర్మవరం, అనంతపురం కోర్టుల్లో కేసు నడిచింది. (టీడీపీలో ‘చిచ్చు’ బుడ్డి) 35 మంది సాక్షులను విచారించిన కోర్టు కేసులో నిందితులుగా మొత్తం 22 మంది ఉండగా, వారిలో మూడేళ్ల క్రితం తిమ్మప్ప, ప్రకాష్ చనిపోయారు. మిగిలిన 20 మందిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. కాగా రెండు నెలల పాటు ఈ కేసును విచారించిన జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి మొత్తం 35 మంది సాక్షులను విచారించారు. వీరితోపాటు అప్పట్లో కేసు నమోదు చేసిన ముగ్గురు పోలీసు అధికారులను కూడా విచారణ చేశారు. నేరం రుజువు కాకపోవడంతో మొత్తం 20 మంది నిందితులను నిర్దోషులుగా తీర్పునిస్తూ న్యాయమూర్తి కేసు కొట్టేశారు. -
తిరుపతి బండికి ఎగనామం
సాక్షి, మచిలీపట్నం: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి మచిలీపట్నం నుంచి గడిచిన పుష్కర కాలంగా నడుస్తున్న ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయాలని కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈమేరకు ఆ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా బీదర్‌కు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు, మచిలీట్నం–యశ్వంత్‌పూర్ మధ్య కొండవీడు ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం నుంచి వయా తిరుపతి మీదుగా ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్రంపై తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగా బీదర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ధర్మవరం ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బోర్డు నిర్ణయంతో ఇక నుంచి నర్సాపురం– ధర్మవరం మధ్య ఈ రైలును నడపనున్నారు. బందరు– గుడివాడ మధ్య తిరిగే లింక్ బండినొకదాన్ని ధర్మవరం ఎక్స్ ప్రెస్‌కు అనుసంధానం చేస్తారు. తిరుపతి వెళ్లాలనుకునే బందరు పరిసర వాసులు ఈ లింక్ ద్వారా గుడివాడ జంక్షన్‌కు చేరుకుని అక్కడ ధర్మవరం ట్రైన్ ఎక్కాల్సి ఉంది. ఎక్స్‌ప్రెస్ కానున్న విశాఖ పాసింజర్ ఇక నుంచి మచిలీపట్నం– విశాఖ పాసింజర్‌ను ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. నర్సాపురం నుంచి భీమవరం మధ్య నడిచే లింక్ ప్యాసింజర్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నారు.« విశాఖ ప్యాసింజర్‌ను ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్ చేయడాన్ని స్వాగతిస్తున్న బందరు వాసులు తిరుపతి మీదుగా నడిచే ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రద్దు చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తా ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రద్దు చేయాలని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించేలా ఒత్తిడి తీసుకొస్తా. అవసరమైతే కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడతా. మచిలీపట్నం నుంచి ఈ ట్రై¯న్ రద్దు కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటా. –వల్లభనేని బాలశౌరి, ఎంపీ, మచిలీపట్నం. చదవండి: జిల్లాలో చర్చనీయాంశంగా బ్రాస్లైట్ వ్యవహారం -
ఇంధన ధరల పెంపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కోర్టు జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్)ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుతున్నా దేశీయంగా ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేరళకు చెందిన న్యాయవాది షాజీ జె కోదన్‌కందత్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అకారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారని, ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని పిటిషన్లో షాజి కోరారు. చమురు ధరలు తగ్గినా, కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని చమురు మార్కెటింగ్ సంస్థలు రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయనీ, ఏప్రిల్ నుండి వరుసగా ధరలు పెరుగుతున్నాయని షాజీ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణకు నిరాకరించిన జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం షాజిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక విధానానికి సంబంధించిన అంశంలో పిల్ వేయడాన్ని తప్పుబట్టిన సుప్రీం పిటిషన్‌ను కొనసాగించాలనుకుంటే పిటిషనర్‌కు భారీ జరిమానా విధిస్తామని జస్టిస్ రోహింటన్ నారిమన్ హెచ్చరించారు. దీంతో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు పిటిషనర్ ప్రకటించారు. -
ఉద్యోగిపై వేటు : ఫేస్‌బుక్‌తో విసిగిపోయా!
శాన్ ఫ్రాన్సిస్కో: జార్జ్ ఫ్లాయిడ్ హత్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వివాదంలో మరో కీలక పరిణామం చేసుకుంది. సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పై విమర్శలు చేసిన ఉద్యోగిపై సంస్థ వేటు వేసింది. మార్క్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇంజనీర్ బ్రాండన్ డైల్ ను విధులనుంచి తొలగించింది. దీనిపై వివరణ ఇస్తూ డైల్ ట్విటర్ లో ఒక పోస్ట్ పెట్టారు. బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమానికి మద్దతుకు నిరాకరించిన సహోద్యోగిని బహిరంగంగా తిట్టినందుకు తనను తొలగించినట్లు సియాటెల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇంజనీర్ బ్రాండన్ డైల్ ట్వీట్ చేశారు. జాత్యహంకార వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా ప్రకటన చేయకపోవడం వెనుక రాజకీయ కోణం దాగి వుందన్న జూన్ 2 నాటి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని డైల్ స్పష్టం చేశారు. తనను అన్యాయంగా తొలగించారని అనను కానీ సంస్థ వైఖరితో విసిగిపోయానని పేర్కొన్నారు. ట్రంప్ ను సమర్దించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కొంతమంది ఇంజనీర్ల బృందంలో డైల్ కూడా ఒకరు. మరోవైపు డైల్ తొలగింపును ఫేస్బుక్ కూడా ధృవీకరించింది. కానీ అంతకుమించి స్పందించేందుకు నిరాకరించింది. (జార్జ్ హత్య: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల లేఖ) కాగా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళనలు, నిరసన తెలుపుతున్న వారిని ఉద్దేశించి లూటీ చేస్తే..షూట్ చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు ఫేస్బుక్లో వివాదాన్ని రగిలించాయి. దీనిపై ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసిన పలువురు ఉద్యోగులు ఒక సమావేశంలో సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ను నిలదీశారు. ట్రంప్ బెదిరింపు ధోరణి కంపెనీ పాలసీలను ఉల్లంఘించేదిగా ఉందని ఆరోపించారు. అయితే ట్రంప్ షేర్ చేసిన పోస్టులను అలా వదిలివేయాలన్న తన నిర్ణయంలో మార్పు ఉండదని జుకర్ బెర్గ్ స్పష్టం చేశారు. ట్రంప్ మెసేజ్ రెచ్చగొట్టేదిగా ఉందని తాను గానీ, తన పాలసీ టీమ్ గానీ భావించడం లేదని ఆయన వెల్లడించడంతో వివాదం మరింత ముదిరింది. ఇదే వివాదంలొ ఇప్పటికే తిమోతీ అనే ఉద్యోగి ఈ నెల 1 న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. In the interest of transparency, I was let go for calling out an employee’s inaction here on Twitter. I stand by what I said. They didn’t give me the chance to quit 😅 https://t.co/zMw8ARMwZt — Brandon Dail (@aweary) June 12, 2020 -
‘సోషల్ డిస్టెన్సింగ్’ పిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: సోషల్ డిస్టెన్సింగ్ పదాన్ని వినియోగించరాదంటూ దాఖలైన పిల్‌ని కోర్టు కొట్టివేయడమే కాకుండా పిల్ దాఖలు చేసిన వ్యక్తికి 10,000 జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సోషల్ డిస్టెన్స్‌కి బదులు, ఫిజికల్ డిస్టెన్స్ అనే పదాన్ని వాడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ బీ.ఆర్ గవాయ్ లతోకూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపి, ప్రజాప్రయోజనవ్యాజ్యం విచారణార్హం కాదని కోర్టు కొట్టివేసింది. డిస్టెన్సింగ్ అనే పదం వివక్షతో కూడుకున్నదనీ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనీ అందుకే ఆ పదం వాడుక మార్చాలనీ షకీల్ ఖురేషీ పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది. -
ఎస్సార్ ఆస్తుల జప్తు కుదరదు
లండన్: ఒక ఆర్బ్రిట్రేషన్ కేసులో ఎస్సార్ స్టీల్ పేరెంట్ కంపెనీ, ఆ కంపెనీ ప్రమోటర్ కుటుంబ సభ్యులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల జప్తునకు ఆర్సెలర్‌మిట్టల్ చేస్తున్న యత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మార్చి 30న లండన్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు అనుమతించాలన్న ఆర్సెలర్‌మిట్టల్ పిటిషన్‌ను లండన్ అప్పీలేట్ కోర్ట్ కొట్టివేసింది. 2019లో మారిషస్‌లో దివాలా చట్రంలోకి వెళ్లిన ఎస్సార్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించి 1.5 బిలియన్ డాలర్ల ఆర్బ్రిట్రేషన్ కేసులో ‘తమ ప్రయోజనాలకు కలిగిన నష్టాలను భర్తీ చేయాలని, ఈ విషయంలో ఎస్సార్, రవి రుయా, ప్రశాంత్ రుయాల ఆస్తులను జప్తు చేయాలని ’ కోరుతూ ఆర్సెలర్‌మిట్టల్ చేస్తున్న న్యాయపోరాటాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎస్సార్ చేసిన తాజా ప్రకటన ప్రకారం, ఆర్సెలర్‌మిట్టల్ యూఎస్ఏ (ఏఎంయూఎస్ఏ) అప్పీల్ గెలుపొందడానికి తగిన అంశాలను కలిగిలేదని ఆ సంస్థ (ఆర్సెలర్ మిట్టల్) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ న్యూయీ నేతృత్వంలోని లండన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఏప్రిల్ 21న పేర్కొంది. -
నిర్భయ కేసు:పవన్ గుప్తకు చుక్కెదురు
-
టెల్కోలకు ‘సుప్రీం’ షాక్
న్యూఢిల్లీ: దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల మేర బకాయీల భారం విషయంలో ఊరట లభించగలదని ఆశతో ఉన్న టెలికం సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీన్ని మరోసారి సమీక్షించేందుకు తగిన కారణాలేమీ లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. టెలికం కంపెనీలపై విధించిన వడ్డీ, జరిమానాలు సరైనవేనని అభిప్రాయపడింది. దీనిపై తదుపరి లిటిగేషనేదీ ఉండబోదని, టెలికం కంపెనీలు కట్టాల్సిన బకాయిల లెక్కింపు, చెల్లింపునకు నిర్దిష్ట గడువు ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడుకున్న బెంచ్ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఓపెన్ కోర్టు విధానంలో నిర్వహించాలని టెల్కోలు కోరినప్పటికీ.. ఇన్–చాంబర్ విధానంలోనే జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. తీర్పు నిరాశపర్చింది: భారతి ఎయిర్టెల్ ఏజీఆర్ బకాయీలపై పునఃసమీక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం తమను నిరాశపర్చిందని భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. దీనిపై క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ‘టెలికం పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం, స్పెక్ట్రం కొనుగోలు చేయడం, 5జీ వంటి కొంగొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం మొదలైన వాటిపై భారీగా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ఈ తీర్పు కారణంగా టెలికం పరిశ్రమ లాభదాయకత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం. అయితే దీనిపై మా నిరాశ కూడా తెలియజేదల్చుకున్నాం. ఏజీఆర్‌పై దీర్ఘకాలంగా నెలకొన్న వివాదంపై మా వాదనలు సరైనవేనని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు వొడాఫోన్ ఐడియా కూడా క్యూరేటివ్ పిటిషన్ వేసే యోచనలో ఉంది. ఇంటర్నెట్ సంస్థలకు దెబ్బ: ఐఎస్‌పీఏఐ సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వు .. టెలికం సంస్థలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందని, వాటిపై ఆధారపడిన ఇంటర్నెట్ సంస్థలకు ఇది పెద్ద దెబ్బని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌పీఏఐ) ప్రెసిడెంట్ రాజేశ్ ఛారియా వ్యాఖ్యానించారు. ‘రివ్యూ పిటిషన్ తిరస్కరణతో టెలికం రంగం మొత్తం రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వినియోగదారులకు ఎంత మాత్రం మంచిది కాదు. ఏజీఆర్ నిర్వచనాన్ని సమీక్షించే విషయంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోకపోతే చిన్న స్థాయి ఐఎస్పీల మనుగడ కష్టమవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. వివాదమిదీ.. టెలికం కంపెనీలు కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను మదింపు చేయడానికి ఉద్దేశించిన ఏజీఆర్ నిర్వచనం సరైనదేనంటూ గతేడాది అక్టోబర్ 24న కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల బాకీలు తడిసి మోపెడు కావడంతో టెలికం సంస్థలకు శరాఘాతంగా మారింది. దీని ప్రకారం చూస్తే వడ్డీలు, జరిమానాలు కలిపి.. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర టెలికం కంపెనీలు జనవరి 23లోగా ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల మేర కట్టాల్సి రానుంది. ప్రభుత్వపరంగా మినహాయింపేదైనా లభిస్తుందేమోనని టెల్కోలు ఆశించినప్పటికీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు. టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల బకాయీలు కట్టాల్సి ఉందంటూ గతేడాది నవంబర్‌లో పార్లమెంటుకు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బకాయీల కింద రూ. 92,642 కోట్లు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) కింద రూ. 55,054 కోట్లు కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వడ్డీ, పెనాల్టీలను మాఫీ చేసే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు, టెలికం శాఖ లెక్కింపు ప్రకారం.. వొడాఫోన్ ఐడియా బాకీలు రూ. 53,038 కోట్లు (రూ. 24,729 కోట్ల ఎస్‌యూసీ, రూ. 28,309 కోట్ల లైసెన్సు ఫీజు) కాగా, భారతీ ఎయిర్టెల్ బకాయీలు రూ. 35,586 కోట్ల మేర (రూ. 21,682 కోట్ల లైసెన్సు ఫీజు, రూ. 13,904 కోట్లు ఎస్‌యూసీ) ఉంటాయి. భారతి ఎయిర్‌టెల్‌లో విలీనమైన టెలినార్, టాటా టెలిసర్వీసెస్ బాకీలు విడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెలికం సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వడ్డీ, పెనాల్టీ, జరిమానాపై మళ్లీ వడ్డీ విధింపునకు సంబంధించిన అంశాలను పునఃసమీక్షించాలంటూ భారతీ ఎయిర్టెల్ కోరింది. ఈ రివ్యూ పిటిషన్లపైనే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. బాకీల విషయంలో ఊరట లభించకపోతే కంపెనీని మూసివేయక తప్పదంటూ వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా ఇప్పటికే ప్రకటించడంతో .. ప్రైవేట్ రంగంలో రెండే సంస్థలు మిగిలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. -
రాఫెల్ డీల్ : కేంద్రానికి క్లీన్చిట్
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సమీక్ష పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు, ఇటీవల సుప్రీంతీర్పుని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. అలాగే కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. తద్వారా వివాదాస్పదమైన రాఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చినట్టైంది. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణప పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. రాహుల్ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీం సూచించింది. కాగా ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించింది. అయితే, తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్ డీల్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్ధారించింది. -
రోమియో ఖాకీ బర్తరఫ్కు రంగం సిద్ధం?
సాక్షి, అనంతపురం: తప్పు చేసిన పోలీసు సిబ్బందిపై ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు కొరడా ఝుళిపించనున్నారా? అలాంటి వారిని పోలీస్ విధుల నుంచి శాశ్వతంగా తప్పించునున్నారా? తదితర ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తప్పు చేసిన పలువురిపై ఇప్పటికే వీఆర్, సస్పెన్షన్ వేటు పడడమే ఇందుకు నిదర్శనం. ఇందులో భాగంగానే మరో మూడు రోజుల్లో ఓ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించేందుకు (రిమూవ్ ఫ్రం సర్వీసెస్) రంగం సిద్ధమైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. అనంతపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌పై ఎస్పీ కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. సదరు కానిస్టేబుల్ ఫేస్బుక్ ద్వారా హైదరాబాద్‌లో ఉన్న యువతిని గత కొంతకాలంగా వేధిస్తూ వచ్చాడు. దీనిపై బాధితురాలు అక్కడి బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినా ఆ కానిస్టేబుల్లో మార్పు రాలేదు. ఫోన్ నంబర్ మార్చి అసభ్యకర మెసేజ్‌లు పోస్టు చేస్తుండడంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు దృష్టికి తెలంగాణ పోలీసులు తీసుకువచ్చారు. ఆయన విచారణలో సైతం ఇది నిజమని నిర్ధారణ అయింది. దీంతో ఆ రోమియో కానిస్టేబుల్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలిగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
రోహిత్... ఇదేం తీరు?
కోల్‌కతా: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అనుచిత చర్యకు పాల్పడ్డాడు. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఔటై పెవిలియన్‌కు వెళ్తూ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్లను రోహిత్ బ్యాట్‌తో కొట్టాడు. 233 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అతడు మంచి టచ్‌లో ఉన్న సమయంలో గర్నీ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఔటివ్వగా... రోహిత్ డీఆర్ఎస్ కోరాడు. కానీ, నిర్ణయం వ్యతిరేకంగా వచ్చింది. దీంతో అసహనానికి గురైన అతడు అంపైర్ ఎదుటే బ్యాట్‌ను వికెట్లకు తాకించాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి 2.2లోని లెవల్ 1ను ఉల్లంఘించినందుకు దీనిపై అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్ రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు. -
రిషబ్ పంత్ సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ సింగిల్ సీజన్లో 20 ఔట్లలో భాగస్వామి అయిన చేసిన వికెట్ కీపర్‌గా రికార్డుకెక్కాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషబ్ రెండు క్యాచ్‌లు పట్టడంతో అతడీ ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంత్ 15 క్యాచ్‌లు పట్టి, 5 స్టంపింగ్‌లు చేశాడు. దీంతో శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. 2011లో డెక్కన్ చార్జర్స్ జట్టు తరపున ఆడిన సంగక్కర 19 ఔట్లలో పాలుపంచుకున్నాడు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2019లో బంగ్లా వికెట్ కీపర్ నురుల్ హసన్ కూడా 19 డిసిమిసల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్సీబీతో ఆదివారం ఫిరోజ్‌షా కోట్ల మైదానం జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ రెండు అద్భుత క్యాచ్‌లు పట్టి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ కీపింగ్‌లో మాత్రం మెరిశాడు. కష్టసాధ్యమైన క్యాచ్‌లు పట్టి క్లాసెన్, గురుకీరత్ సింగ్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, గతేడాది ఐపీఎల్లో కూడా పంత్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ సింగిల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్(684)గా నిలిచాడు. -
‘డీజీపీ నియామకాలపై యూపీఎస్సీని ఆశ్రయించాల్సిందే’
సాక్షి, న్యూఢిల్లీ : డీజీపీ ఎంపిక, నియామకాలపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని ఐదు రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. డీజీపీల ఎంపిక, నియామకాలపై తమ స్ధానిక చట్టాలకు అనుగుణంగా వ్యవహరించే వెసులుబాటు కోరుతూ పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్, హర్యానా, బిహార్ తదితర రాష్ట్రాల అప్పీల్‌ను విచారిస్తూ సుప్రీం కోర్టు గతంలో న్యాయస్ధానం జారీ చేసిన ఉత్తర్వులను సమర్ధించింది. డీజీపీ నియామకానికి రాష్ట్రాలు యూపీఎస్సీని ఆశ్రయించాల్సిందేనని స్పష్టం చేసింది.డీజీపీల ఎంపిక, నియామకంపై విస్తృత ప్రయోజనాలతో పాటు రాజకీయ జోక్యం నుంచి పోలీస్ అధికారులను కాపాడేందుకు కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. డీజీపీల నియామకానికి అనుసరించాల్సిన ప్రక్రియపై గత ఏడాది జులై 3న సుప్రీం కోర్టు పలు ఆదేశాలను జారీ చేసింది. -
‘జస్టిస్ గొగోయ్’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ రంజన్ గొగోయ్ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ పిటిషన్లో విచారణార్హమైన అంశాలేవీ లేవని అభిప్రాయపడింది. జస్టిస్ గొగోయ్ నియామకంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. విచారణ సందర్భంగా పిటిషన్ దాఖలుచేసిన లాయర్లు ఆర్పీ లూథ్రా, సత్యవీర్ శర్మ వాదిస్తూ.. జస్టిస్ గొగోయ్ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. సీజేఐ జస్టిస్ మిశ్రా వ్యవహారశైలిని గతంలో మీడియాసమావేశంలో జస్టిస్ గొగోయ్ తప్పుబట్టడం తెల్సిందే. ఈ చర్యలు దేశ న్యాయవ్యవస్థకు ద్రోహం చేయడం కన్నా తక్కువేమీ కాదనీ, ఈ మీడియా సమావేశం ద్వారా దేశ ప్రజల్లో ఆందోళన రేకెత్తించేలా నలుగురు న్యాయమూర్తులు వ్యవహరించారని వ్యాఖ్యానించారు. -
పీఎన్బీ కేసులో మాజీ ఎండీకి షాక్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో ఆ బ్యాంకు మాజీ ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌ను కేంద్ర ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఈ మేరకు సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అలహాబాద్ బ్యాంకు ఎండీ, సీఈఓగా ఉన్న ఉషా పదవీ కాలం సోమవారంతో ముగియగా అదేరోజున కేంద్రం ఈ ఉత్తర్వులు వెలువరించటం గమనార్హం. ఉషాతో పాటు పీఎన్బీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ శరణ్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతిని కూడా కేంద్రం మంజూరు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీ దాదాపు రూ. 14,000 కోట్ల మేర మోసం చేసిన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉషా అనంతసుబ్రమణియన్ గతంలో రెండు దఫాలుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సారథ్యం వహించారు. 2011 జూలై నుంచి 2013 నవంబర్ దాకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గాను, 2015 ఆగస్టు నుంచి 2017 మే దాకా ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. నీరవ్ మోదీ స్కామ్ ప్రారంభమైనది కూడా దాదాపు ఆ సమయంలోనే. కొన్నాళ్లుగా ఉషా అనంతసుబ్రమణియన్ అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే స్కామ్ దరిమిలా ఆమె అధికారాలకు బ్యాంకు కత్తెర వేసింది. సీబీఐ చార్జిషీటులో ఉషాతో పాటు ఇద్దరు మాజీ ఈడీలైన బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్ పేర్లు ఉన్నాయి. ఆమెతో పాటు ఇతర సీనియర్ బ్యాంక్ అధికారులకు అక్రమ లావాదేవీల గురించి తెలిసినప్పటికీ.. వారు దిద్దుబాటు చర్యలేమీ తీసుకోలేదని అభియోగాలున్నాయి. -
‘లోయా మృతి’పై రివ్యూ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా మృతిపై పునర్విచారణ జరపాల న్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లోయాది సహజమరణమే అని ఏప్రిల్ 19న కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలని బాంబే లాయర్ల అసోసియేషన్ వేసిన పిటిషన్లో విచారణార్హమైన విషయాలేవీ లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘రివ్యూ పిటిషన్, దానికి సంబంధించిన పత్రాలన్నింటిని క్షుణ్నంగా పరిశీలించాం. పాత ఉత్తర్వుల్లో మార్పు చేయడానికి తగిన కారణం కనిపించలేదు’ అని బెంచ్ తెలిపింది. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న బీహెచ్ లోయా 2014, డిసెంబర్ 1న గుండెపోటుతో మరణించారు -
ఉర్దూ ఆఫీసర్స్ నియామకాల్లో అవకతవకలు
-
నిత్యానందకు సుప్రీంలో చుక్కెదురు..
న్యూఢిల్లీ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2010లో నిత్యానందపై అత్యాచార కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలనే ఆయన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. ఆయనతో పాటు అత్యాచార కేసులో భాగస్వాములుగా ఉన్న మరో ఐదుగురి పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. తనపై గల నేరాఆరోపణలపై పునర్విచారణ చేపట్టాల్సిందిగా, ఈ కేసు నుంచి విముక్తి కల్పించాల్సిందిగా నిత్యానంద కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. కాగా కర్ణాటక హైకోర్టు ఆయన పిటిషన్‌ను మే 16న తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సోమవారం సుప్రీంను ఆశ్రయించారు. తనపై నిత్యానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదుతో 2010లో ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో 2010 ఏప్రిల్‌లో అరెస్ట్ అయిన నిత్యానందకు, బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. -
జస్టిస్ లోయా కేసులో దర్యాప్తు అవసరం లేదు
-
కీపర్‌గా ధోని అరుదైన ఘనత
కేప్‌టౌన్ : టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 400 ఔట్లలో భాగస్వామి అయిన వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 16 ఓవర్ రెండో బంతికి దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ను స్టంప్ అవుట్ చేసి ఈ ఘనతను అందుకున్నాడు. ఈ వికెట్లలో 294 క్యాచ్లుండగా 106 స్టంప్ అవుట్లున్నాయి. గత సెంచూరియన్ వన్డేలో భువనేశ్వర్ బౌలింగ్‌లో హషీమ్ ఆమ్లాను క్యాచ్ అవుట్ చేసి కీపర్‌గా 399వ వికెట్ సాధించాడు. తాజా స్టంపౌట్‌తో 400పైగా ఔట్లలో భాగస్వామి అయిన నాలుగో వికెట్ కీపర్‌గా ధోని రికార్డుకెక్కాడు. ఇప్పటికే వికెట్ కీపర్‌గా అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో ధోని నాలుగు స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో సంగక్కర (482) ఉండగా.. గిల్‌క్రిస్ట్(472), బౌచర్(424)లు ధోని కన్నా ముందు స్థానంలో ఉన్నారు. ఇక అత్యధిక స్టంపౌట్ల రికార్టు ధోని పేరిటనే ఉన్న విషయం తెలిసిందే. -
జస్టిస్ శుక్లా తొలగింపునకే సీజేఐ నిర్ణయం
న్యూఢిల్లీ: మెడికల్ కళాశాల ప్రవేశాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించిన అలహాబాద్ హైకోర్టు జడ్జి ఎస్ఎన్ శుక్లా తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఆయన్ని తొలగించడానికి సిఫార్సు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయించారు. ఈ మేరకు ఆయన నేడోరేపో రాష్ట్రపతి, ప్రధానికి సిఫార్సు లేఖ రాసే అవకాశాలున్నాయి. జస్టిస్ శుక్లాపై వచ్చిన ఆరోపణలు.. ఆయన తొలగింపు ప్రక్రియను ప్రారంభించేంత తీవ్రమైనవని ముగ్గురు జడ్జీలతో కూడిన కమిటీ నిర్ధారించింది. ఈ కమిటీ నివేదిక సమర్పించిన తరువాత.. రాజీనామా చేయాలని లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలని జస్టిస్ శుక్లాకు సీజేఐ సలహా ఇచ్చారు. అందుకు శుక్లా నిరాకరించడంతో ఆయనకు ఎలాంటి కేసు విచారణ బాధ్యతలు అప్పగించొద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీజేఐ ఆదేశించారు. దీంతో జస్టిస్ శుక్లా దీర్ఘకాల సెలవుపై వెళ్లారు. -
లతా రజనీకాంత్‌కు హైకోర్టులో చుక్కెదురు
చెన్నై : దుకాణం అద్దె పెంపును వ్యతిరేకిస్తూ లతా రజనీకాంత్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నిరాకరణకు గురైంది. నటుడు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ తరఫున మోహన్ మేనన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ విధంగా తెలిపారు. లతా రజనీకాంత్‌కు ఆళ్వార్‌పేటలో కార్పొరేషన్ కేటాయించిన దుకాణం ఉందని, ఇందులో ట్రావెల్స్ సంస్థను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ దుకాణానికి గత జూన్ వరకు రూ.3,702 మాత్రమే అద్దె వసూలు చేస్తూ వచ్చారని, ఇలాఉండగా గత జూన్ 23వ తేదీ దుకాణం అద్దెను రూ.21,160గా చెన్నై కార్పొరేషన్ పెంచినట్లు తెలిపారు. ఇదివరకే పాతనోట్ల రద్దు ప్రకటించడం, జీఎస్టీ వంటి సమస్యలతో ట్రావెల్స్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితిలో చెన్నై కార్పొరేషన్ అద్దెను పెంచడం తమకు భారంగా మారిందని, దీనిపై తాము కార్పొరేషన్‌కు విన్నవించుకున్నా, దీన్ని పరిశీలించలేదని తెలిపారు. అందువల్ల అద్దె పెంచుతూ కార్పొరేషన్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి వైద్యనాథన్ సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో నగర కార్పొరేషన్ తరఫున హాజరైన న్యాయవాది టీసీ గోపాలకృష్ణన్ వాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వ జీవో 92ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు తోసిపుచ్చినట్లు వాదించారు. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి, లతా రజనీకాంత్ తరఫున దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు. -
సెలవు.. వివాదాల నెలవు
♦ ‘నెలలో మూడు రోజులు సెలవు’పై ఆర్టీసీలో రగడ ♦ అనుమతి లేకుండా డుమ్మా కొట్టే సిబ్బందిపై డిస్మిస్ కొరడా ♦ కార్మిక నేతలు, అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కార్మికులకు, అధికారులకు మధ్య సెలవుల రగడ మొదలైంది. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే డ్రైవర్లు, కండక్టర్లపై యాజమాన్యం కఠిన చర్యలకు దిగడం వివాదాస్పదమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు నెలలో మూడు రోజులు సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది. చాలామంది సిబ్బంది ముందస్తు అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరై తర్వాత దాన్ని మూడు రోజుల సెలవు విధానంలోకి మార్చుకుంటున్నారు. అకస్మాత్తుగా విధులకు డుమ్మా కొడుతుండటంతో బస్సు సర్వీసు షెడ్యూళ్లకు తీవ్ర విఘాతం కలుగుతోంది. దీనిపై యాజమాన్యానికి డిపో మేనేజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి సిబ్బందికి మెమోలు జారీ చేయాలని, పరిస్థితి పునరావృతమయితే విధుల నుంచి తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది. దీంతో కొందరు కార్మిక నేతలు యాజమాన్యం వైఖరిని తప్పుపడుతూ ఆయా డిపోల్లో ఆందోళనలకు దిగుతున్నారు. వెరసి కార్మిక నేతలు, అధికారులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. జిల్లా సర్వీసులకు తీవ్ర విఘాతం హైదరాబాద్‌లోని కొన్ని డిపోల పరిధిలో జిల్లా సర్వీసులు కూడా ఉన్నాయి. వీటిల్లో దూరప్రాంతాలకు వెళ్లేందుకు గరుడ బస్సులున్నాయి. ఈ ప్రీమియం కేటగిరీ బస్సులను ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లు తప్ప సాధారణ డ్రైవర్లు నడపలేరు. ఇలాంటి డ్రైవర్లు పరిమితంగా ఉంటారు. తరచూ గరుడ బస్సు సర్వీసు బయలుదేరే వేళ వరకు కూడా సదరు డ్రైవర్ విధులకు రావడంలేదు. దీంతో అప్పటికప్పుడు మరో డిపో నుంచి డ్రైవర్‌ను పిలిపించటం లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ లోపు సమయం మించిపోయి ప్రయాణికులు ఆందోళన చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా కొన్ని దూరప్రాంత సర్వీసులు తరచూ ఆలస్యంగా నడపాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో రద్దు చేయాల్సి వస్తోంది. ప్రతి నెలా 16వ తేదీన మస్టర్స్ సిద్ధం చేసే సమయంలో కొందరు కార్మిక సంఘాల నేతలు రంగ ప్రవేశం చేసి, ముందస్తు అనుమతి లేకుండా విధులను ఎగ్గొట్టిన సిబ్బందికి మూడు రోజుల సెలవు నిబంధన వర్తింపజేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇలా ఒక్కో డిపోలో వంద వరకు సెలవుల పంచాయితీ నెలకొంటోంది. తాజాగా ఆదివారం ఓ డిపోలో 66 మంది విధులకు డుమ్మా కొట్టారు. అయితే, ఆరోజు అసెంబ్లీలో ముస్లిం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంతో కొన్ని రాజకీయపార్టీలు ఆందోళనకు దిగాయి. దీంతో అధికారులు సిటీలో ఏసీ బస్సులను నిలిపివేశారు. డుమ్మా కొట్టినవారి స్థానాల్లో ఇక్కడి డ్రైవర్లు, కండక్టర్లను ఆ రోజు విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు, మూడురోజులుగా డుమ్మా కొట్టిన పలువురు సిబ్బందిని డిస్మిస్ చేశారు. ఇప్పుడీ వ్యవహారం మరోసారి ఆర్టీసీలో వివాదానికి కారణమవుతోంది. -
ప్రకంపనలు సృష్టించిన జవాన్‌పై వేటు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భద్రతా బలగాలకు సరైన ఆహార పదార్థాలు అందించడం లేదని సోషల్ మీడియా ద్వారా ఆరోపించిన దేశంలో కలకలం సృష్టించిన బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్‌ను విధుల నుంచి తప్పించారు. ఆర్మీలో క్రమ శిక్షణ తప్పడంతోపాటు అతడు నిబంధనలకు విరుద్ధమైన ఎన్నో పనులు చేశాడనే ఆరోపణలు రుజువైనందున అతడిని విధుల నుంచి తొలగించినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, ఈ విషయంపై తాను ఉన్నత న్యాయస్థానం ఆశ్రయిస్తానని తేజ్ బహదూర్ తెలిపాడు. నిజాలు బయటకు చెప్పాననే కక్షతో తనపై ఇలాంటి చర్యలు తీసుకున్నారని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పాడు. హర్యానాలోని మహేంద్రఘడ్ జిల్లాకు చెందిన తేజ్ బహదూర్ 1996లో బీఎస్ఎఫ్లో చేరాడు. గత ఏడాది చివర్లో తమకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశాడు. ఇది పెద్ద ధుమారం రేగింది. దీంతో మధ్యంతర విచారణకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఆ విచారణ కమిటీ తమకు నివేదికను అందించిందని, అందులో పలు విషయాలు తెలిశాయంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. -
ప్రకంపనలు సృష్టించిన జవాన్‌పై వేటు
-
ఉపహార్ కేసు: రియల్టర్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపహార్ థియేటర్ ట్రాజెడీ కేసులో ప్రధాన దోషి రియల్ ఎస్టేట్ వ్యాపారి, గోపాల్ అన్సాల్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏడాది జైలు శిక్ష, రూ. 30 కోట్ల జరిమానాపై అన్సల్ పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం సుప్రీం కొట్టి వేసింది. జైలుకి వెళితే తన ఆరోగ్యంపై కోలుకోలేని దెబ్బపడుతుందన్న గోపాల్ అన్సల్ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మార్చి 20వ తేదీలోపు కోర్టుముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. గతనెలలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం గోపాల్ అన్సల్ కోర్టుముందు లొంగిపోవాల్సి ఉంది. రియల్టర్ల తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెట్మలానీ వాదిస్తుండగా, ఉపహార్ విషాద భాదితుల అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది కె టీఎస్ తులసీ తన వాదనలను వినిపించారు. తమ రిప్యూ పిటీషన్ పై సుప్రీం తీర్పుకు సమీక్ష ఉండదని వాదించారు. అయితే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని జె ఎస్ ఖేహర్ ధర్మాసనం విచారణకు జాబితా బెంచ్ లభ్యతపై శుక్రవారం నిర్ధారించనున్నామని సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీకి హామీ ఇచ్చారు. అయితే 1997లో జరిగిన ఉపహార్ సినిమా అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 59 మంది మృతి చెందిన నాటి ఘటనలో థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ సోదరులను దోషులుగా కోర్టు తేల్చింది. వీరిలో గోపాల్ అన్సల్ (69) సుప్రీంకోర్టు ఏడాది జైలుశిక్ష, రూ. 30 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. మరోవైపు సుశీల్ అన్సల్ వయసు ఆధారిత సమస్యల కారణంగా మినహాయింపునిచ్చింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని గోపాల్‌నున ఆదేశించిన సంగతి తెలిసిందే. 2015లో దోషులిద్దరికీ సుప్రీంకోర్టు రెండేండ్ల జైలుశిక్ష (ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా ఉన్నందుకు), చెరొకరికి రూ.30 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2008 డిసెంబర్ 19న ఢిల్లీ హైకోర్టు వారి శిక్షను ఏడాదికి తగ్గించింది. ఈ నేపథ్యంలో మృతుల బంధువుల అసోసియేషన్ దీనిపై న్యాయపోరాటానికి దిగింది. తమకున్యాయం చేయాల్సింది కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. -
బడ్జెట్: ఫిబ్రవరి 1కే సుప్రీం పచ్చజెండా
-
బడ్జెట్: ఫిబ్రవరి 1కే సుప్రీం పచ్చజెండా
న్యూఢిల్లీ : కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌ను వాయిదావేయాలంటూ నమోదైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది. ఎన్నికల అయిపోయేంత వరకు బడ్జెట్‌ను వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ జే.ఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూద్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బడ్జెట్ ఓటర్లను ప్రభావితం చేస్తుందని తాము భావించడం లేదని బెంచ్ పేర్కొంది. కేంద్రం ఫిబ్రవరి1న ప్రవేశపెట్టాలనుకున్న 2017-18 బడ్జెట్‌ను ఏప్రిల్ 1న ప్రవేశపెట్టాలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ అడ్వకేట్ ఎమ్.ఎల్ శర్మ పిల్‌ను దాఖలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ పోల్స్ అయిపోయేంత వరకు బడ్జెట్‌ను వాయిదా వేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ఎన్నికలయ్యేంత వరకు కేంద్రం ఎలాంటి ఉపశమన పథకాలను, ఫైనాన్సియల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా చూడాలని పిల్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌తో కలిపి ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం జనవరి 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎన్నికల ప్రవర్తన నియామవళి కిందకు వస్తుందన్నారు. అయితే ఎం.ఎల్ శర్మ దాఖలు చేసిన ఈ పిల్‌ను సుప్రీంకోర్టును కొట్టివేసింది. బడ్జెట్‌కు సంబంధించిన లాంఛనాలన్నీ మార్చి 31వ తేదీ నాటికి పూర్తిచేసేందుకు బడ్జెట్ తేదీని నెలరోజులు ముందుకు జరిపిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. -
అమ్మ అభిమానులకు నిరాశ
-
అమ్మ అభిమానులకు నిరాశ
ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారత రత్న ఇవ్వాలని కోరుతున్న అమ్మ అభిమానులకు నిరాశ ఎదురైంది. జయలలితకు భారత రత్న ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు కొట్టేసింది. మద్రాసు హైకోర్టు తోసిపుచ్చిన ఈ పిల్‌తో అమ్మకు భారతరత్న వస్తుందో రాదోనని అన్నాడీఎంకే నేతల్లో ఆందోళన నెలకొంది. డిసెంబర్లో అమ్మ మరణించిన తర్వాత భేటీ అయిన తొలి కేబినెట్ జయలలితకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి తీర్మానించిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యున్నత పౌర పురస్కారంగా భారతరత్నకు పేరొంది. అమ్మకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌తో పాటు పలు తీర్మానాలను ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించింది. అమ్మ కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది. అదేవిధంగా ఎంజీఆర్ స్మారకమందిరం వద్దనే అమ్మ స్మారకమందిరం ఏర్పాటుచేయాలని, ఎంజీఆర్ స్మారకమందిరం పేరునూ భారతరత్న డాక్టర్ పురచ్చి తలైవార్ ఎంజీఆర్ పేరుగా మార్చాలని నిర్ణయించారు. జయలలిత స్మారకమందిరానికి పురచ్చి తలైవి అమ్మ సెల్వి జే జయలలితగా పేరు పెట్టాలని నిర్ణయించారు. అమ్మ జీవితాంతమంతా తమిళనాడు రాష్ట్ర ప్రజల కోసమే పనిచేసిందని, సామాజిక సంక్షేమ, విద్యా, వృద్ధి రంగాల్లో అమ్మ సేవలు ఎనలేనివని కేబినెట్ కొనియాడింది. -
నిధుల దుర్వినియోగంలో కార్యదర్శి పై వేటు
సర్వీసు నుంచి తొలగిస్తూ కలెక్టరు ఆదేశాలు రాజానగరం : దివాన్‌చెరువు పంచాయతీ నిధులు దుర్వినియోగం పై ఆ పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన ప్రస్తుతం ఏలేశ్వరం మండలం, యర్రవరం పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బీవీవీఎస్ఎన్ మూర్తి పై వేటు పడింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో అతనిని సర్వీసు నుంచి తొలగిస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టరు హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల కాపీ స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి కూడా చేరింది. ఏపీసీఎస్ (సీసీఏ) రూల్ 1991 యాక్ట్ ననుసరించి ఈ చర్య తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో .... దివాన్‌చెరువు పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగిందంటూ అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు దేశాల వెంకటరామారావు (శ్రీను) ప్రజావాణిలో 2015 ఆగస్టు మూడున ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేపట్టిన విచారణల అనంతరం ఈ చర్య తీసుకున్నారు. సర్పంచ్ కొవ్వాడ చంద్రరావుతో కలిసి 13వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగినట్టుగా గతేడాది నవంబరులో డీఎల్పీఓ చేసిన విచారణ నివేదిక ద్వారా గుర్తించి, సర్పంచ్‌కి, ఇన్చార్జి కార్యదర్శిగా ఉన్న మూర్తికి గత ఏడాది డిసెంబరు ఒకటిన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దానికి మూర్తి జనవరిలో ఇచ్చిన జవాబును అనుసరించి డీఎల్పీఓ ఫిబ్రవరి 20న మరో నివేదికను అందజేశారు. దానిపై అప్పటికే రావులపాలెం పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మూర్తిని సస్పెండ్ చేస్తూ మే 31న చార్జ్ మెమో ఇచ్చారు. దానిపై అతని నుంచి వచ్చిన సమాధానంతోపాటు ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి నుంచి వచ్చిన గైడెన్స్ ప్రకారం అతని సస్పెన్షన్‌ని రద్దు చేసి, ఏలేశ్వరం మండలం, యర్రంవరం పంచాయతీకి జూనియర్ అసిస్టెంట్‌గా జూన్ 22న ఉత్వర్వులిచ్చారు. సబ్ కలెక్టరు నివేదికతో పడిన వేటు ఇదిలావుండగా దివాన్‌చెరువు పంచాయతీ నిధుల దుర్వినియోగం సంఘటనపై వస్తున్న రకరకాల కథనాలు, జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టరును విచారణకు ఆదేశించారు. సెప్టెంబరు 29న సబ్ కలెక్టరు ఇచ్చిన నివేదికలో పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా గుర్తించడంతోపాటు ఇటువంటి వారిని సర్వీసులో కొనసాగించడం ప్రమాదకరమని, సర్వీసు నుంచి తొలగించాలంటూ ప్రతిపాధించారు. సబ్ కలెక్టరు ఇచ్చిన నివేదిక ప్రకారం పంచాయతీలో రూ.78 లక్షల 80 వేల 755ల నిధులు దుర్వినియోగం అయినట్టుగా నిర్థారించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని ఖాతరు చేయకుండా, విచక్షణా రహితంగా బిల్లు కలెక్టరును, 44 మంది పారిశుద్ధ్య కార్మికులను (పోస్టులు మంజూరు లేకుండానే) నియమించుకోవడాన్ని తప్పుపట్టారు. అలాగే ఇంటి పన్నులుగా వసూలు చేసిన రూ. 67,961లు పంచాయతీ ఆదాయంలో జమ చేయకపోవడాన్ని, వాటర్ టాక్స్‌గా వసూలు చేసిన రూ.3,960ని కూడా జమ చేయకపోవడాన్ని గుర్తించారు. ఇదే విధంగా వివిధ రకాల ఖర్చులలో వచ్చిన తేడాలను, జరిగిన అవినీతిని తన నివేదికలో వివరంగా పేర్కొన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.34 లక్షల 34 వేల 613లు, పంచాయతీ సాధారణ నిధుల నుంచి రూ.36 లక్షల 51 వేల, 921లు, వాటర్ టాక్స్, పారిశుద్ధ్య కార్మికులకు నిబంధనలకు విరుద్ధంగా వెచ్చించిన మొత్తం రూ.ఏడు లక్షల 22 వేల, 300లు, వసూలు చేసిన వాటర్ టాక్స్‌ని పంచాయతీ జమ చేయకుండా వాడకున్న మొత్తం రూ.71 వేల, 921లుగా ఉన్నాయి. ఇదిలావుండగా నిధుల దుర్వినియోగంలో పంచాయతీ సర్పంచ్ కొవ్వాడ చంద్రరావు ఇప్పటికే సస్పెండ్ అయివున్నారు. కాగా ఈ విషయమై సర్వీసు నుంచి తొలగించబడిన మూర్తిని ఫోన్లో వివరణ కోరగా దుర్వినియోగంలో తాను నిర్థోషినన్నారు. అదే విషయాన్ని మరోసారి రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. -
రాజయ్యను బర్తరఫ్ చేయించిన కడియం
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ సాక్షి, హైదరాబాద్: మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి బర్తరఫ్ చేరుుంచింది డిప్యూటీ సీఎం కడియం శ్రీహరేనని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి వద్దని కేసీఆర్‌కు సలహా ఇచ్చింది తనేనని కడియం ప్రకటించడం దారుణమన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టి దళితుల అభివృద్ధిలో రాజయ్య క్రియాశీల పాత్ర పోషించారన్నారు. ఎంఆర్పీఎస్ తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
ముగ్గురు రేషన్ డీలర్ల లైసెన్స్‌లు రద్దు
సిరిసిల్ల : సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లోని ముగ్గురు రేషన్ డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేసినట్లు సిరిసిల్ల ఆర్డీవో జి.వి.శ్యామ్‌ప్రసాద్‌లాల్ బుధవారం తెలిపారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌కు చెందిన రేషన్ డీలర్లు బి.లక్ష్మి, ఎస్.స్వామి, వేములవాడకు చెందిన ఎస్.నాగభూషణం డీలర్ షిప్‌లను రద్దు చేశామని ఆర్డీవో వివరించారు. పౌరసరఫరాల సరుకులను సక్రమంగా ప్రజలకు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చేసినందుకు వారి లైసెన్స్‌లు రద్దు చేసినట్లు ఆర్డీవో తెలిపారు. సరుకుల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తూ జాయింట్ కలెక్టర్‌కు నివేదిక పంపించామని ఆర్డీవో తెలిపారు. డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఊడిన ఉద్యోగం
సుదీర్ఘ విచారణ అనంతరం నిర్ణయం సీనియర్ అసిస్టెంట్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు హన్మకొండ : జిల్లా ప్రజాపరిషత్ సీనియర్ అసిస్టెంట్ బి.లక్ష్మి అన్నపూర్ణను తొలగిస్తూ జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్.విజయ్‌గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. చిట్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న లక్ష్మి అన్నపూర్ణ తప్పు డు ఎస్సీ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొం దినట్లు నిర్ధారణ కావడంతో సీఈఓ ఆమెను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ–డీకి చెందిన బి.లక్ష్మి అన్నపూర్ణ దళితుడైన బి.బాబును వివాహం చేసుకుంది. ఉపాద్యాయుడైన బాబు మృతి చెందడంతో భర్త ఎస్సీ కావడంతో ఎస్సీ ధ్రువీకరణ పత్రం సమర్పించి 1997లో జూనియర్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామకం పొందింది. అనంతరం ఎస్సీ సర్టిఫికెట్‌పై సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందింది. ఆ తర్వాత ఆమె బీసీ డి కేటగిరికీ చెందినదని తెలుసుకున్న జెడ్పీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం నేతలు 2013లో అప్పటి జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేయగా, 2015లో ములుగు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించా రు. విచారణ జరిపిన ఆర్డీఓ లక్ష్మిఅన్నపూర్ణ ఎస్సీ కాద ని నివేదిక అందజేశారు. దీన్ని కలెక్టర్‌కు అందించగా ఎస్సీ ధ్రువీకరణ పత్రం రద్దుకై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్క్రూటిని కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ మరోసారి విచారించి లక్ష్మి అన్నపూర్ణ దళితురాలు కాదని, బీసీ డీ అని తేల్చి ఎస్సీ ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తూ కలెక్టర్‌కు నివేదిక అందించారు. దీంతో గత నెలలో ఆ పత్రం రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ గెజిట్ పబ్లికేషన్ ఇస్తూ, ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించకూడదో చెప్పాలని లక్ష్మిఅన్నపూర్ణకు జెడ్పీ అధికారులు నోటీసు జారీ చేశారు. నెలరోజులసమయంతీసుకున్నా, మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం. దీంతో సంతృప్తి పడని సీఈఓ బి.లక్ష్మిఅన్నపూర్ణను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఎస్సీ, ఎస్టీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందితే డిస్మిస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లక్ష్మి అన్నపూర్ణను డిస్మిస్ చేశారు. -
ఆస్తుల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన ‘సుప్రీం’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఉన్నత విద్యామండలి ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ఆ కోర్టు తోసిపుచ్చింది. బుధవారం రివ్యూ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రా తో కూడిన ధర్మాసనం పిటిషన్లో పునఃసమీక్షించాల్సిన అంశాలేవీ లేవంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఉత్తర్వులను సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది. -
కోర్టు అటెండర్ నియామకాలు రద్దు
కమాన్‌చౌరస్తా : జిల్లా కోర్టులో అటెండర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా న్యాయమూర్తి వై. రేణుక తెలిపారు. జిల్లాలో 53 ఉద్యోగాల భర్తీ కోసం 2014 ఆగస్టు 12న ప్రకటన వచ్చింది. 11200 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. అర్హులైన అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేశారు. వారికి ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రోజుకు 300 మంది అభ్యర్థుల చొప్పున అప్పటి న్యాయమూర్తి బి. నాగమారుతిశర్మ రెండు నెలలపాటు మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైకోర్టుకు పంపించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అటెండర్ నియామాకాలను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా న్యాయమూర్తి తెలిపారు. తదుపరి నియామకాలు హైకోర్టు ఆదేశానుసారమే ఉంటాయన్నారు. -
సీపీఎస్ విధానం రద్దు చేయాల్సిందే!
రౌండ్‌టేబుల్ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మహబూబ్‌నగర్ విద్యావిభాగం : సీపీఎస్ విధానం రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సనాతన బాలస్వామి, కామర్తి రాజశేఖర్‌లు మాట్లాడారు. సామాజిక భద్రతలేని సీపీఎస్ పింఛన్ విధానాన్ని, జీఓ నెం.653, 654, 655లను రద్దు చేయాలని, 2013లో అమలులోకి వచ్చిన పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు అన్ని సంఘాల నాయకులు ఏకమై ఐక్యపోరాటాలు చేస్తామని నిర్ణయించారు. సమావేశంలో టీఎన్జీఓ జిల్లా గౌరవ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, అధ్యక్షుడు రామకృష్ణారావు, ఉఐటీఓ సెక్రెటరీ జనరల్ వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రఘురాంరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, టీపీయుఎస్ హన్మంతరావు, టీపీఆర్టీయూ జిల్లా అ«ధ్యక్షుడు దుంకుడు శ్రీనివాస్, టీటీయూ చలపతిరావు, టీఎస్టీయూ ప్రపుల్చంద్ర, టీపీటీఎఫ్ నారాయణమ్మ, బీటీఏ సుదర్శన్, టీఆర్టీయూ ప్రవీణ్‌కుమార్, డీటీఎఫ్ వెంకటేష్, ఎస్‌ఎల్‌టీఏ సురేంద్రనాథ్, సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఆప్ ఎమ్మెల్యేకు బెయిల్ తిరస్కరణ
న్యూఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహనియాకు సాకేత్ కోర్టు సోమవారం బెయిల్ తిరస్కరించింది. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆయనని పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో దినేశ్ మోహనియా ఇవాళ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ తోసిపుచ్చింది. మరోవైపు దినేశ్ మోహనియా జ్యుడిషియల్ కస్టడీని జూలై 11 వరకూ న్యాయస్థానం పొడిగించింది. కాగా నీళ్ల కోసం వెళ్తే తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యే దినేశ్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నీళ్ల గురించి మరోసారి అడగగానే తనతో పాటు ఇతర మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి, తోసేశారంటూ దినేష్ మోహనియాపై ఫిర్యాదు చేశారు. -
'బేరసారాలాడుతూ సీఎం కెమెరాకంటికి చిక్కారు'
ఢిల్లీ: ఉత్తరాఖండ్ సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్వయంగా ఎమ్మెల్యేలతో బేరసారాలాడుతూ కెమెరాకు చిక్కారని తెలిపారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 91 ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు గద్దెదించాయని ధ్వజమెత్తారు. వీటికి సంబంధించి వివరాలను తన ఫేస్ బుక్ పేజీలో ఉంచారు. ఉత్తరాఖండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తుందని తెలిపారు. సీఎం హరీష్ రావత్‌పై చేసిన స్టింగ్ ఆపరేషన్ సీడీలను కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతిపాలన విధిస్తున్నట్లు ప్రణబ్ ముఖర్జీ ఆదివారం నిర్ణయాన్ని ప్రకటించారు. Congress and its supporters dismissed 91 non-Congress governments, and now crying foul... Read on https://t.co/xg6DRfDU3P — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 28 March 2016 -
ఫిర్యాదు చేసినా బాబుపై కేసు పెట్టడం లేదు
హైకోర్టులో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడి పిటిషన్..కొట్టివేత సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేసినా గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ‘ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు..’ అంటూ చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు అడుసుమల్లి ప్రతాప్‌కుమార్ చిలకలూరిపేట పోలీసులకు గతనెల 10న ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేయలేదు. దీన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాన్ని మంగళవారం న్యాయమూర్తి విచారించి పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎలా ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. అయినా ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా వర్తిస్తుందన్నారు. -
రోహిత్ మృతికి నిరసనగా రాస్తారోకో
రేపు రాష్ర్టంలోని విద్యాసంస్థల బంద్ విజయవాడ (మొగల్రాజపురం) : సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ, యూనివర్శిటీ వీసీ అప్పారావును ఆ పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌చేస్తూ ఈనెల 3వ తేదీ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని ఏపీ విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం చుట్టుగుంటలో కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు డి.అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కేజీ నుంచి పీజీ వరకూ అన్ని విద్యాసంస్థల్లో బుధవారం బంద్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర మాట్లాడుతూ రోహిత్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజీవ్త్రన్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన దళిత విద్యార్థి మృతిచెందినా ముఖ్యమంత్రి చంద్రబాబు రోహిత్ తల్లిదండ్రులను పరామర్శించే తీరిక లేనంత బిజీగా ఉన్నారన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్ మాట్లాడుతూ రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకునేంత వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. రోహిత్ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ప్రవీణ్‌తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని మానవహారం నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌చేసి మాచవరం స్టేషన్‌కు తరలించి మధ్యాహ్నం విడుదల చేశారు. -
'కేజ్రీవాల్ ఎవరికీ లంచం ఇవ్వలేదు కదా'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట కలిగింది. ఆయనపై గతంలో దాఖలైన ఓ క్రిమినల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆయన తప్పు చేసినట్లుగా పిటిషన్ దారులు ఎటువంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయినందున ఆ పటిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బబ్రు భాన్ తీర్పు వెలువరించారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ప్రచారం సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను పక్కదారి పట్టించేలా వ్యవహరించారని, మిగితా అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకోవచ్చని, కానీ ఓట్లు మాత్రం తమకే వేయాలని వారిని మభ్య పెట్టారని, అది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లే అవుతుందని ఆరోపిస్తూ ఇక్రాంత్ శర్మ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే, వ్యక్తిగతంగా కేజ్రీవాల్ ఎవరికీ లంఛం ఇవ్వలేదని, ఇతరులు ఇస్తే మాత్రం తీసుకోవచ్చని మాత్రమే చెప్పారని ఈ సందర్భంగా పిటిషన్ దారుకు కోర్టు తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 2015లో ఈ పిటిషన్ దాఖలైంది. -
కదం తొక్కిన అంగన్వాడీ కార్యకర్తలు
-
13 మంది డిస్మిస్, 45 మందికి ఫైన్
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 13 మంది అధికారులను డిస్మిస్ చేసింది. 45 మంది అధికారుల పింఛన్ కట్ చేసింది. విధుల నిర్వహణ, ప్రజాసేవలో వాళ్ల పనితీరు అసంతృప్తికరంగా ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. కొందరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. అసమర్థులైన అధికారులను తప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, అధికార యంత్రాంగాన్ని సమర్థంగా, బాధ్యతాయుతంగా చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే అన్ని శాఖలకు ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు జరపాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి తెలిపారు. 50/55 ఏళ్ల వయసు లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తవడానికి ముందు కనీసం ఆరుసార్లు ప్రతి ఉద్యోగికి ఈ సమీక్ష జరగాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. దాన్నిబట్టి వాళ్లను ఉద్యోగంలో ఉంచాలా లేదా రిటైర్మెంట్ ఇప్పించాలా అన్నది నిర్ణయిస్తారు. -
బీరు తాగిన అమ్మాయిలకు టీసీలు
చెన్నై: పట్టపగలు.. క్లాస్ రూంలో నలుగురు అమ్మాయిలు కలిసి బీరు కొడతారని ఎప్పుడైనా ఊహించారా? ఆ స్కూలు యాజమాన్యం కూడా ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. విషయం తెలియగానే ముందు షాకైనా.. తర్వాత ఆ నలుగురికీ టీసీలు ఇచ్చి ఇంటికి పంపేశారు. ఇదేదో కార్పొరేట్ స్కూల్లో.. బాగా డబ్బున్న ఆసాముల పిల్లలు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. తమిళనాడు నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్‌లో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వ్యవహారమిది. వీళ్లంతా 11వ తరగతి (జూనియర్ ఇంటర్) చదువుతున్నారు. చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్. గోపీదాస్ ఆదేశాలతో వీళ్లకు టీసీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. క్లాసులో నలుగురు అమ్మాయిలు తాగిన మత్తులో ఉన్నట్లు క్లాస్ టీచర్ గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆమె ప్రధానోపాధ్యాయురాలికి చెప్పగా, వాళ్లను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ.. ఆ నలుగురూ మద్యం తాగినట్లు నిర్ధారణ అయ్యింది. స్నేహితురాలి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోడానికి మొత్తం ఏడుగురు విద్యార్థినులు ఆ రోజు స్కూలుకు వచ్చారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కూల్ డ్రింకు బాటిళ్లలో బీరు నింపుకొని తీసుకొచ్చారు. అయితే, తర్వాత వాళ్లలో ముగ్గురు భయపడి.. తాగలేదు. మిగిలిన నలుగురూ తాగడంతో.. వాళ్లకు మాత్రం టీసీలు ఇచ్చి పంపేశారు. -
హిందూమతోన్మాద దాడులను ఖండించిన నేతలు
-
'గీత' ను అప్పగించేది లేదు
కరాచీ/న్యూఢిల్లీ: 13 ఏళ్ల క్రితం పాక్ భూభాగంలో పొరపాటున అడుగుపెట్టి తప్పిపోయిన గీతను తమకు అప్పగించాలని భారత్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్‌ను సింధ్ హైకోర్టు గురువారం కొట్టివేసింది. 23ఏళ్ల గీతను బలవంతంగా అప్పగించేందుకు ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. హరియాణాకు చెందిన సామాజిక కార్యకర్త మోమినీన్ మాలిక్ గీత సంరక్షణను తాను చూసుకుంటానని హామీ ఇస్తూ స్థానిక లాయర్ల సాయంతో సింధ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. గీతను అప్పగించాలంటే కొన్ని పద్ధతులు పాటిం చాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. కాగా గీతను భారత్‌కు రప్పించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : కడప నారాయణ కళాశాలలో ఈనెల 17న నందిని, మనీషా అనే విద్యార్థినులు మృతి చెందడంపై న్యాయ విచారణ జరిపించాలని,మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాషా, నగర మేయర్ సురేష్‌బాబు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే ఐఎస్ఎఫ్, ఆర్ఎస్యూ, ఆర్ఎస్ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. సీపీఎం నగర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి సుబ్బరాయుడులు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నందిని, మనీషాల మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని, అవి హత్యలా? ఆత్మహత్యలా? అన్న విషయాన్ని న్యాయ విచారణ ద్వారా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు ఆయన విద్యా సంస్థల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీలో తల్లిదండ్రులనుగానీ, విద్యార్థి సంఘాలనుగానీ ఎందుకు చేర్చలేదో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ కార్మికుల న్యాయపోరాటం
హైదరాబాద్: సమ్మె విరమణ విషయంలో ప్రభుత్వం మాటను లెక్కచేయలేదన్న కారణంతో విధుల నుంచి డిస్మిస్ అయిన జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు న్యాయపోరాటానిక దిగారు. తమను తిరిగి విధుల్లోకి చేర్చునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో తొలిగింపునకు గురైన కార్మికులు శుక్రవారం మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేపట్టిన తమపై కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కక్షగట్టిందని, కొందరిని మాత్రమే విధుల నుంచి తొలిగించడం అన్యాయమని కార్మికులు ఆరోపించారు. తమను వెంటనే విధుల్లోకి చేర్చుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హెచ్చార్సీని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేత సుధాభాస్కర్ కూడా పాల్గొన్నారు. -
మంత్రి హరీష్‌పై కేసు కొట్టివేత
వరంగల్‌లీగల్ : 2012లో పరకాల ఉప ఎన్నిక సందర్భంగా హరీష్‌రావుపై నమోదైన కేసును కొట్టివేశారు. వరంగల్ జిల్లా పరకాల శాసన సభ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా గీసుకొండ పోలీసులు హరీష్‌రావుపై పెట్టిన కేసును కొట్టివేస్తూ వరంగల్ మూడో మున్సిఫ్ మెజిస్టేట్ కోర్టు జడ్జి అజీజ్కుమార్ గురువారం తీర్పు వెల్లడించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గీసుగొండ మండలం మచ్చాపూర్ గ్రామంలో నిర్వహించిన సభలో నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొండా సురేఖను వ్యక్తిగత దూషలు చేస్తూ మానుకోట ఘటన దృశ్యాలతో కూడిన పోస్టర్ హరీష్‌రావు విడుదల చేశారని... ఎన్నికల నిబంధనలను ఉల్లఘిస్తూ తమపై అసత్య ఆరోపణలు, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా హరీష్‌రావు వ్యవహిరిస్తున్నారని కొండా సురేఖ ఎన్నికల కమిషనర్‌కు 2012 మే 30న ఫిర్యాదు చేశారు. నాటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి విద్యాసాగర్ ఫిర్యాదు మేరుకు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షాధారలు, ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన కోర్టు నేరం రుజువు కానందున మంత్రి హరీష్‌రావుపై ఉన్న కేసును కొట్టివేస్తున్నట్లు జడ్జి అజీజ్కుమార్ వెల్లడించారు. మంత్రి హరీష్‌రావు న్యాయవాదిగా బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ వ్యవహరించారు. -
కార్మిక చట్టాల ప్రక్షాళన!
మూడు చట్టాలను ఏకీకృతం చేసే ప్రతిపాదన * కార్మిక నియామక, తీసివేత నిబంధనలు సరళీకృతం న్యూఢిల్లీ: దేశంలో కార్మిక చట్టాలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కఠినంగా ఉన్న ఉద్యోగుల నియామకం, తీసివేత నిబంధనలను సరళీకృతం చేస్తోంది. సంఘాలను ఏర్పాటుచేసే నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఈమేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశంలో వ్యాపార కార్యకలాపాలు సులభంగా సాగేలా చేయడం, ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో మూడు చట్టాలను మిళితం చేసేందుకు కార్మిక శాఖ ముసాయిదా బిల్లును సిద్ధం చేసిందన్నారు. పారిశ్రామిక సత్సంబంధాల కోసం కార్మిక సంఘాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, పారిశ్రామిక ఉపాధి చట్టాలను ఏకీకృతం చేస్తామన్నారు. పరిశ్రమలకు, కార్మికులకు మధ్య సుహృద్భావ వాతావరణం కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ముసాయిదా బిల్లు గురించి దత్తాత్రేయ ఇంకా ఏమన్నారంటే... ⇒ అధికారిక అనుమతి కోరకుండా కంపెనీ 300 మంది కార్మికులను నియమించుకునేందుకు ఈ ముసాయిదా అనుమతిస్తుంది. ⇒ ఉద్యోగులను తీసివేసేందుకు నెల రోజుల నోటీసు కాలాన్ని 3 నెలలకు పెంచుతాం. ⇒ సిబ్బందిని ఆకస్మికంగా తొలగించాలంటే గతంలో వారి సర్వీసుపూర్తయిన ఏడాది కాలానికి 15 రోజుల వేతనాన్ని ఇవ్వాల్సి ఉండగా, దీన్ని 45 రోజులకు పెంచుతాం. ⇒ కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి త్రైపాక్షిక సంప్రదింపులు జరుపుతాం. ⇒ ఉద్యోగులందరికీ కనీస వేతనాన్ని అమలుచేస్తాం. ⇒ సంఘాల ఏర్పాటుపై, సమ్మెలపై నిబంధనలు కఠినం చేస్తాం. ఆరు నెలల ముందస్తు నోటీసులేకుండా సమ్మెలకు అనుమతించం. ⇒ సిబ్బంది సామూహికంగా క్యాజువల్ సెల వు పెట్టినా,సగంకంటే ఎక్కువమంది క్యా జువల్ లీవ్‌పై వెళ్లినా సమ్మెగా పరిగణిస్తాం. ⇒ కార్మిక సంఘాల్లో బయటి వ్యక్తులను అనుమతించం. బయటివారెవరూ వ్యవస్థీకృత రంగంలోని సంఘాల్లో ఆఫీస్ బేరర్‌గా ఉండకుండా నిషేధిస్తాం. అవ్యవస్థీకృత రంగంలో మాత్రం బయటి వ్యక్తులు ఇద్దరు ప్రతినిధులుగా ఉండేందుకు వీలుకల్పిస్తాం. -
విశాఖలో విరిగిపడిన కొండచరియలు
విశాఖపట్నం: బొర్రా వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా బొర్రా-కరకవలస స్టేషన్ల మధ్య కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కేకే లైన్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విశాఖ-కిరండోల్ 1 వీకే ప్యాసింజర్ రైలు రద్దయింది. ఇక సాంకేతిక కారణాలతో విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలును కూడా రద్దు చేశారు. విరిగి పడిన కొండచరియలు అధికారులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
సచివాలయ తరలింపుపై వ్యాజ్యం కొట్టివేత
తెలంగాణ సచివాలయాన్ని వాస్తుదోషం కారణంతో ఎర్రగడ్డకు తరలించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిందని, దానిని అడ్డుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో పిటిషనర్ సరైన వివరాలు సేకరించకుండానే కోర్టును ఆశ్రయించారని, తద్వారా కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ రూ.10 వేల జరిమానా విధించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ తరలింపు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆప్ నేత మహ్మద్ హాజీ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. మంత్రిమండలి నోట్‌ఫైల్‌ను పరిశీలించి పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో ఎక్కడా కూడా వాస్తుదోషం కారణంగా సచివాలయాన్ని తరలిస్తున్నట్లు లేదని స్పష్టం చేసింది. -
ఉగ్రవాది ఖాజాపై కేసు కొట్టివేత
హైదరాబాద్ సిటీ : లష్కర్-ఎ-తోయిబా (ఎల్టీ) ఉగ్రవాద సంస్థ సౌత్ ఇండియా ఆపరేషన్ చీఫ్ షేక్ అబ్దుల్ ఖాజా అలియాస్ అంజాద్‌పై నమోదైన నకిలీ పాస్‌పోర్టు, నకిలీ నోట్ల కేసును నాంపల్లి ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. సాక్ష్యాధారాలు రుజువు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో ఖాజాపై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది. మలక్‌పేటకు చెందిన ఖాజా బేగంపేటలోని నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం (ప్రస్తుతం సికింద్రాబాద్‌కు మారింది)పై 2005 అక్టోబర్ 12న జరిగిన మానవ బాంబు దాడి కేసులో 9వ నిందితుడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఖాజాను జనవరి 18, 2010న అఫ్జల్‌గంజ్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఇన్స్పెక్టర్ మధుకర్‌స్వామి అరెస్టు చేశారు. ఆ సమయంలో అతని నుంచి కరాచీ నివాసి మహ్మద్ ఫరాన్ అనే పేరుతో పాకిస్తాన్‌కు చెందిన పాస్‌పోర్టు, రూ.50 వేలు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ బాంబు పేలుడు కేసులో ఇతడిని అదే రోజు రిమాండ్ చేయగా, అతనిపై సిట్ అధికారులు నకిలీపాస్‌పోర్టు, నకిలీ నోట్ల కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జ్‌షీట్ వేయడంతో కోర్టులో విచారణ ప్రారంభమైంది. విచారణలో పోలీసులు అతనిపై చేసిన ఆరోపణలను రుజువు చేయలేకపోవడంతో కేసు వీగిపోయింది. ఖాజాపై ఈ కేసు కొట్టివేసినా టాస్క్‌ఫోర్స్ బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉండటంతో అతను ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. అఫ్జల్‌గంజ్‌లో అరెస్టు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో చెట్టుకింద పాస్‌పోర్టు ఎలా సీజ్ చేశారని ఖాజా తరపు న్యాయవాది అజీమ్ ప్రశ్నించడంతో కేసు వీగిపోయింది. -
' మాదిగలను విస్మరించడం దారుణం'
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ అస్పష్ట వైఖరితోనే విద్యారంగంలో అయోమయ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాఠ్యాంశాల మార్పు, ఫాస్ట్ పథకం, ఎంసెట్ నిర్వహణ, పోటీ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఏర్పడిన గందరగోళాన్ని తొలగించేందుకు ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్నిపొంగులేటి డిమాండ్ చేశారు. కేవలం తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాల మార్పు పేరుతో తెలుగు నేతల చరిత్రను, తెలుగుజాతికోసం కృషి చేసిన మాదిగల చరిత్రను తొలగించాలనుకోవడం దారుణమైన విషయమన్నారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం ఎంతోమంది నిరుద్యగులు ఎదురుచూస్తున్నారని, నోటిఫికేషన్లు పెండింగులో పెట్టడం దారుణమని పొంగులేటి పేర్కొన్నారు. -
రాజయ్యను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలి
బీసీ సంఘాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: బర్తరఫ్ అయిన డిప్యూటీ సీఎం రాజయ్యను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని తెలంగాణ బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ విధంగా బర్తరఫ్ చేసుకుంటూ పోతే ఇదే చివరిపాలన అవుతుందని జాజుల శ్రీనివాస్‌గౌడ్ (బీసీ సంక్షేమ సంఘం), మల్లేష్ యాదవ్ (బీసీ ఫ్రంట్), గుజ్జ కృష్ణ (బీసీ ప్రజాసమితి), దుర్గమ్మ (బీసీ సమాఖ్య) సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు వారినే బలిపశువులను చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యల ద్వారా అణగారిన వర్గాలను ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. బడుగులను బలి చేయడాన్ని బట్టి మళ్లీ నిజాం పాలన తీసుకు వస్తారేమోనని ఎద్దేవా చేశారు. -
విచ్ఛిన్నమైన రోజు ఆవిర్భావ దినమా!
ఖండించిన జన చైతన్య వేదిక సాక్షి, హైదరాబాద్: తెలుగు జాతి విచ్ఛిన్నమైన రోజును ఏపీ రాష్ట్ర అవతరణ దినంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని జన చైతన్య వేదిక ఖండించింది. ఆదివారం ఎన్ఎస్ఎస్లో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, పంచాయితీరాజ్ ఉద్యోగుల నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తుంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956 నవంబర్ 1న తొలి రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1నే అవతరణ దినంగా జరుపుకోవాలని డిమాండ్ చేశారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి చేగొండి రామజోగయ్య మాట్లాడుతూ జూన్ 2ను అవతరణ దినంగా ప్రకటించటం చారి త్రక తప్పిదమన్నారు. -
నిషేధ పిటిషన్ కొట్టివేత
కత్తి, పులిపార్వై చిత్రాలను నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను మదురై కోర్టు కొట్టివేసింది. విజయ్ నటిస్తున్న భారీ చిత్రం కత్తి. సమంత హీరోయిన్. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై, ఎల్.టి.టి.ఈ నాయకుడు దివంగత ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్ ఇతివృత్తంతో తెరకెక్కిన పులి పార్వై చిత్రంపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమిళ సంఘాలు చిత్రాన్ని విడుదల చేయరాదంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ చిత్రాల విడుదలను నిషేధించాలని కోరుతూ హైకోర్టుకు అనుబంధ శాఖ అయిన మదురై కోర్టులో మదురై కేకేనగర్‌కు చెందిన న్యాయవాది రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు చిత్రాల్లో తమిళ సంప్రదాయాన్ని శ్రీలంకలో జరిగిన యుద్ధాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు చోటు చేసుకున్నాయన్నారు. కత్తి చిత్రాన్ని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు బినామిగా వ్యవహరిస్తున్న సుభాష్ కరన్ నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసే సంభాషణలు చోటు చేసుకున్నాయన్నారు. ఇక పులిపార్వై చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ అందించడం ద్రోహ చర్యగా పేర్కొన్నారు. ఈ చిత్రాల విడుదలను నిషేధించాలంటూ డీజీపీకి ఆగస్టు 1న పిటిషన్ అందించామని తెలిపారు. కత్తి, పులిపార్వై చిత్రాల విడుదలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది రమేష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి కృపాకరన్ పిటిషన్లో సరైన ఆధారాలు చూపించనందున కొట్టివేస్తున్నట్లు వెల్లడించారు. -
సోనియా గాంధీపై కేసు కొట్టివేత
న్యూయార్క్: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీపై నమోదైన కేసును అమెరికాలోని ఓ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. 1984లో జరిగిన సిక్కుల ఊచకోత సంఘటనలో ప్రమేయమున్న కాంగ్రెస్ నాయకులను సోనియా కాపాడుతున్నారని ఆరోపిస్తూ.. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సిక్కుల హక్కుల సంస్థ కోర్టును ఆశ్రయించింది. బ్రూక్లిన్‌లోని యూఎస్ జిల్లా జడ్జి బ్రియాన్ ఎం కొగాన్ సోమవారం ఈ కేసును విచారించారు. ఈ కేసులో తగిన ఆధారాలు లేకపోవడంతో కొట్టివేసేందుకు అనుమతిచ్చారు. -
దుర్భరంగానల్లసూరీళ్ల జీవితాలు
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణిలో డిస్మిస్ కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. జీతాలు లేక వారి జీవితాలు x`గా మారాయి. సింగరేణి వ్యాప్తంగా 13 వేల మంది డిస్మిస్ కార్మికులు ఉన్నారు. హత్య చేసిన వారికి మరణశిక్ష విధించేటప్పుడు చివరి కోరిక ఏమిటి అని అడిగి తీరుస్తారు. కానీ, సింగరేణి యాజమాన్యం డిస్మిస్ కార్మికులపై ఆ మాత్రం జాలి చూపడం లేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతున్నా కనికరించడం లేదు. దీంతో చాలా మంది డిస్మిస్ కార్మికులు కూలినాలీ చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. ఫలితంగా నాటి బాయి దొరలు నేడు పాలేర్లుగా మారారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయా పార్టీల అభ్యర్థులు కోల్‌బెల్ట్‌లో ప్రచారం చేసేటప్పుడు తాము గెలిస్తే డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఓట్లు దండుకుంటున్నారు తప్ప న్యాయం చేయడం లేదు. ఈసారి కూడా అవే హామీలు ఇస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ, కార్మికులు మాత్రం నిశీతంగా పరిశీలిస్తున్నారు. హామీ నెరవేర్చని వారికి ఓటుతో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనైన చోటు దక్కుతుందని ఆశపడుతున్నారు. అయితే ప్రధాన పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చకపోవడం వారికి సమస్యపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. మస్టర్లు తక్కువగా ఉన్నాయనే నెపంతో.. మస్టర్లు తక్కువగా ఉన్నాయనే కారణంతో 1993 నుంచి కార్మికులను డిస్మిస్ చేశారు. సంవత్సరంలో 100 మస్టర్ల కంటే తక్కువగా చేసిన కార్మికులను కనికరం లేకుండా తొలగించారు. ఇలా 2010 వరకు డిస్మిస్ చేస్తూ సింగరేణి యాజమాన్యం వచ్చింది. దీంతో వేలాది మంది కార్మికులు డిస్మిస్ అయి రోడ్లపై పడ్డారు. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగడంతో దిగి వచ్చిన యాజమాన్యం 2000 సంవత్సరంలో హైపవర్ కమిటీ డిస్మిస్ అయిన వారిలో అనారోగ్య కారణాల వల్ల డ్యూటీలు చేయలేదని నిర్ధారించిన 66 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. తరువాత మే 2004లో 85 మందిని తీసుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున డిస్మిస్ కార్మికులు ఉండటంతో ఉద్యమం ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో తెలంగాణ సంఘాలు వీరికి మద్దతుగా వచ్చాయి. అనంతరం యాజమాన్యం మళ్లీ ఏప్రిల్ 2012లో మళ్లీ హెపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. కఠిన నిబంధనలు పెట్టి మొత్తం 2,249 మందిని కౌన్సిలింగ్‌కు పిలిచి వారిలో 66 మందికే ఉద్యోగాలు ఇచ్చింది. అనంతరం లోకాయుక్తకు దీనిపై కేసు వెళ్లడంతో మరో 420 మందిని తీసుకున్నారు. కూలీలుగా మారిన కార్మికులు గతంలో సింగరేణిలో కొంత మద్యానికి వ్యసనంగా మారిన వారు, జులాయి తిరుగుడు వల్ల డ్యూటీలు చేయని వారు డిస్మిస్ బారిన పడ్డారు. మరికొంత మంది కొత్తగా ఉద్యోగంలో చేరిన యువకులు శారీరక శ్రమకు తట్టుకోలేక ఒకరోజు డ్యూటీ చేస్తే రెండు రోజులు ఇంటి వద్దే ఉండటం, మరి కొందరు అనారోగ్య కారణాల వల్ల నాగాలు ఎక్కువగా చేసి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఒక్కసారిగా ఉద్యోగం పోవడంతో వారు కూలీలుగా మారారు. జీతం లేకపోవడం చేసేది లేక అడ్డా కూలీలుగా, హోటళ్లలో పనోళ్లుగా, ఇటుక బట్టీలు, ఆటో నడుపుతూ, వ్యవయసాయ కూలీలుగా మారి చాలా మంది డిస్మిస్ కార్మికుల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. తప్పు చేశాం పశ్చత్తాప పడుతున్నామని కనీసం ఒక్కసారి అవకాశం ఇస్తే మరోసారి ఇలా చేయకుండా చక్కగా డ్యూటీ చేసి బతుకుదామని మొర పెట్టుకున్న కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. డిమాండ్లు ఇవే.. ఎలాంటి ఆంక్షలు లేకుండా నాగాల పేరుతో డిస్మిస్ అయిన వారికి ఒక్కసారి అవకాశం కల్పిస్తు ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. 50 ఏళ్ల వయస్సు దాటిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. లేదా రూ.8 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. డిస్మిస్ కార్మికుడు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా 8 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం డిస్మిస్ రహిత సింగరేణిగా చేయాలి. -
మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే డిస్మిస్
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ పరీక్షలో ఇన్విజిలేటర్లు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే డిస్మిస్ చేస్తామని జిల్లా ఇంటర్మీడియెట్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఫజలుల్లా పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వహణపై డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్షలను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంకు అనుసంధానం చేశామన్నారు. 43 ప్రభుత్వ కళాశాలలు, 41 ప్రైవేటు కళాశాలలు, 6 ట్రైబల్ , 1 మోడల్, 5 సాంఘిక సంక్షేమ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పది సిట్టింగ్, నాలుగు ఫ్లైయింగ్, ఒకటి హైపవర్ కమిటీ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నపత్రాల నిల్వకు 42 పోలీస్స్టేషన్లు ఎంపిక చేశామన్నారు. పరీక్ష నిర్వహించే డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు 7వ తేదీన సంబంధిత పరీక్ష కేంద్రాల్లో నియామకం కావాలన్నారు. వీరికి మాత్రమే కేంద్రంలో సెల్‌ఫోన్ అనుమతి ఉంటుందని, ఇన్విజిలేటర్లకు అనుమతి లేదన్నారు. 7,8,9 తేదీల్లో ప్రశ్నపత్రాలు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందుతాయన్నారు. జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షకు 24,493, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 23,274, ప్రైవేటుగా 4,916 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అదేవిధంగా వొకేషనల్ ప్రథమ పరీక్షకు 3,350, ద్వితీయ సంవత్సరానికి 3,931, ప్రైవేటుగా 610 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆర్ఐవో ఫజలుల్లా వివరించారు. సాఫీగా జరిగేలా చూడాలి కాగజ్‌నగర్ : ఇంటర్మీడియెట్ పరీక్షలు సాఫీగా జరిగేలా చూడాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఫజలుల్లా అ న్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు గణేశ్‌కుమార్, జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ధోని ఖతాలో మరో రికార్డు!
భారత క్రికెట్‌కి కొత్త ‘దేవుడు’గా నీరాజనాలందుకుంటున్న మహేంద్ర సింగ్ ధోని మరో ఘనత సాధించాడు. టీమిండియాకు విజయవంతమైన నాయకుడిగా కొనసాగుతున్న ఈ జార్కండ్ ప్లేయర్ సమకాలిన క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. విక్టరీల్లోనే కాదు ఆటలోనూ అద్భుతాలు చేస్తున్నాడు. తాజాగా ధోని మరో రికార్డు కైవసం చేసుకున్నాడు. వికెట్ల వెనకుండి ఈ రికార్డు సాధించడం విశేషం. వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత వికెట్ కీపర్‌గా 'కూల్ కెప్టెన్' రికార్డు సాధించాడు. 300 వికెట్లు(220 క్యాచ్‌లు, 79 స్టంపింగ్‌లు) తీసి అతడీ ఘనత అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో 37వ ఓవర్లో ఈ రికార్డు నెలకొల్పాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో రాస్ టేలర్ క్యాచ్ అందుకుని ఈ రికార్డు తన ఖతాలో వేసుకున్నాడు. 32 ఏళ్ల ధోని 239 మ్యాచ్‌ల్లో మొత్తం 301 వికెట్లు కూల్చాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో బ్రెండన్ మెక్కల్లమ్ క్యాచ్ పట్టి 301వ వికెట్ దక్కించుకున్నాడు. తాజా రికార్డుతో దిగ్గజ వికెట్ కీపర్ల సరసన ధోని చేరాడు. అతడు నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ అందరికంటే ముందున్నాడు. గిల్‌క్రిస్ట్ 287 మ్యాచ్‌ల్లో 472 వికెట్లు పడగొట్టాడు. మార్క్ బౌచర్(దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర(శ్రీలంక) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌచర్ 295 వన్డేల్లో 424 డిస్మిసల్స్ చేశాడు. సంగక్కర 362 మ్యాచ్‌ల్లో 424 వికెట్లు తీశాడు. ధోని ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. న్యూజిలాండ్ జట్టు నుంచి అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత కెప్టెన్‌గా నిలిచాడు. పది క్యాచ్‌లు అందుకుని అతడీ ఘనత సాధించాడు. టేలర్ క్యాచ్ అతడిని కివీస్ టీమ్‌పై 10వది. అంతకుముందు ఈ రికార్డు మహ్మద్ అజహరుద్దీన్ పేరిట ఉంది. టీమిండియాకు అత్యంత విజయమైంతన సారథిగా ధోని ఇప్పటికే ఖ్యాతికెక్కాడు. ఈ కూల్ కెప్టెన్ మరిన్ని రికార్డులు సాధించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. -
అవినీతి ఐఏఎస్ దంపతుల డిస్మిస్ కు రంగం సిద్ధం
వాళ్లిద్దరూ ఆదర్శ దంపతులు. భర్త అడుగుజాడల్లోనే భార్య నడిచింది, భార్య చూపిన బాటలోనే భర్త వెళ్లారు. చివరకు వాళ్లిద్దరూ కలిసి జైలుకు వెళ్లారు. వీళ్లేదో మామలు చిల్లర దొంగలు అనుకుంటున్నారేమో.. కాదు కాదు.. సాక్షాత్తు ఐఏఎస్ అధికారులు!! వాళ్ల పేర్లు అరవింద్ జోషి, టిను జోషి. లంచాలు తెగ మెక్కి, దాదాపు 22 కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకున్న వీరిని ఉద్యోగాల నుంచి తొలగించాలని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు పంపగా, కేంద్రం కూడా అందుకు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే సస్పెండైన వీరిని డిస్మిస్ చేయాలన్న ప్రతిపాదనలను యూపీఎస్సీ ఆమోదం కోసం కేంద్రం పంపింది. రెండు రోజుల్లోనే వీరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు రావచ్చిన తెలుస్తోంది. వీరిపై విచారణ కూడా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరింది. 2011లో జోషి దంపతుల ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేయగా, మూడు కోట్ల రూపాయల నగదు, మరన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు దొరికాయి. మొత్తం ఆస్తుల విలువ 22 కోట్లుగా తేలడంతో, ఐఏఎస్ దంపతులు, వారి బంధువులకు ఏసీబీ కోర్టు నోటీసులిచ్చింది.