మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ పరీక్షలో ఇన్విజిలేటర్లు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే డిస్మిస్ చేస్తామని జిల్లా ఇంటర్మీడియెట్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఫజలుల్లా పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వహణపై డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్షలను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంకు అనుసంధానం చేశామన్నారు. 43 ప్రభుత్వ కళాశాలలు, 41 ప్రైవేటు కళాశాలలు, 6 ట్రైబల్ , 1 మోడల్, 5 సాంఘిక సంక్షేమ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పది సిట్టింగ్, నాలుగు ఫ్లైయింగ్, ఒకటి హైపవర్ కమిటీ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నపత్రాల నిల్వకు 42 పోలీస్‌స్టేషన్లు ఎంపిక చేశామన్నారు. పరీక్ష నిర్వహించే డిపార్ట్‌మెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు 7వ తేదీన సంబంధిత పరీక్ష కేంద్రాల్లో నియామకం కావాలన్నారు. వీరికి మాత్రమే కేంద్రంలో సెల్‌ఫోన్ అనుమతి ఉంటుందని, ఇన్విజిలేటర్లకు అనుమతి లేదన్నారు. 7,8,9 తేదీల్లో ప్రశ్నపత్రాలు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందుతాయన్నారు. జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షకు 24,493, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 23,274, ప్రైవేటుగా 4,916 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అదేవిధంగా వొకేషనల్ ప్రథమ పరీక్షకు 3,350, ద్వితీయ సంవత్సరానికి 3,931, ప్రైవేటుగా 610 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆర్‌ఐవో ఫజలుల్లా వివరించారు.
సాఫీగా జరిగేలా చూడాలి
కాగజ్‌నగర్ : ఇంటర్మీడియెట్ పరీక్షలు సాఫీగా జరిగేలా చూడాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఫజలుల్లా అ న్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు గణేశ్‌కుమార్, జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే డిస్మిస్
Published Thu, Mar 6 2014 12:44 AM | Last Updated on Mon, Jul 29 2019 5:53 PM
Advertisement
Advertisement