Intermediate exam
-
బాబోయ్ బరాత్!.. పెళ్లి ఊరేగింపుల్లో పెరుగుతున్న శబ్ద కాలుష్యం
చిలకలగూడకు చెందిన వర్షిణి ఇంటర్మీడియట్ పరీక్షలకు సన్నద్ధవుతోంది. చదువుకునే సమయంలో అర్ధరాత్రి దాటేంతవరకు ఆగకుండా మోగుతున్న డప్పుల చప్పుడుకు ఏకాగ్రత కోల్పోయి, అటు చదువుకు ఇటు నిద్రకు దూరమై.. మరుసటి రోజు పరీక్ష సరిగా రాయలేక పోయింది.రాత్రి 10 గంటల వరకే.. బ్యాండ్ బరాత్‌లు, ర్యాలీలకు రాత్రి 10 గంటల వరకే పోలీసులు అనుమతి ఇస్తున్నా.. అర్ధరాత్రి దాటేవరకు ఇవి సాగుతున్నాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో శబ్ద కాలుష్యంపై డయల్ 100కు మూడుసార్లు ఫిర్యాదు చేయగా ఆలస్యంగా స్పందించారు’ అని నామాలగుండుకు చెందిన వెంకట రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి, సిటీబ్యూరో/చిలకలగూడ: ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల కంటే ఎక్కువగా పెళ్లి బరాత్‌ల టెన్షన్ పట్టుకుంది. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా చదువుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర శబ్ద కాలుష్యం వెలువడుతుంటమే దీనికి కారణం. దీన్ని అడ్డుకోవాల్సిన పోలీసు విభాగం సైతం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. డయల్–100కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన ఉండట్లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరి బాధ వారిది.. పెళ్లిళ్ల సీజన్ వచి్చందంటే చాలు నగర వ్యాప్తంగా బరాత్‌ల హడావుడి కనిపిస్తుంటుంది. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుకని, అందరికీ మధుర జ్ఞాపకంగా మిగలడం కోసం ఇలా చేసుకుంటామని నిర్వాహకులు చెబుతుంటారు. హంగులు, ఆర్భాటాల మాట అటుంచితే.. ఊరేగింపులోని డీజేలు, ఇతర శబ్దాలతో పాటు బాణాసంచా తదితరాల వల్ల ఎదుటి వారు ఎదుర్కొనే ఇబ్బందులు వారు పట్టించుకోరనేది బాధితుల మాట. రహదారులకు పక్కన, ఫంక్షన్ హాళ్ల చుట్టుపక్కల నివసించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. సాధారణ సమయల్లో ఈ ఇబ్బందుల్ని భరిస్తున్నా ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడంతో పిల్లల ఏకాగ్రత దెబ్బతింటోందని వాపోతున్నారు. ఆ ప్రాంతాల్లో నిషేధం ఉన్నా.. పెళ్లి బరాత్ అంటేనే నెమ్మదిగా సాగే సమూహం. ఒకప్పుడు బరాత్‌లు కిలోమీటర్ల మేర సాగేవి. అంతర్గత రహదారుల్లోనే కాకుండా ప్రధాన రహదారుల పైనా గంటల పాటు ఈ ఊరేగింపులు నడిచేవి. వీటి కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఏర్పడిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు కొన్నేళ్ల క్రితం బరాత్‌లను నిషేధించారు. అయినప్పటికీ.. కాలనీలతో పాటు ఫంక్షన్ హాళ్ల సమీపంలో ఇప్పటికీ నడుస్తున్నాయి. నిర్వాహకులను దృష్టిలో పెట్టుకుంటున్న పోలీసులు వీటిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. సమయపాలన లేకుండా శబ్దాలు.. దీంతో ఇటీవల కాలంలో బరాత్‌ల హంగామా ఎక్కువైంది. నగరంలో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే సౌండ్ సిస్టమ్స్ వాడాలనే నిబంధన ఉంది. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే ఎలాంటి సౌండ్లు చేయడానికి వీలులేదు. ప్రాంతాల వారీగా ఎన్ని డెసిబుల్స్ శబ్ద తీవ్రత ఉండాలనేది నిర్ధారించారు. వీటికి సంబంధించి గతంలో ప్రభుత్వం ఉత్తర్వులతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. అయినప్పటికీ బరాత్‌ల నిర్వాహకులు వీటిని పట్టించుకోవట్లేదు. పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు వీరివల్ల నరకం చవి చూస్తున్నారు. పట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు.. బరాత్ల్లో వెలువడుతున్న శబ్దాల కారణంగా విద్యార్థులు చదువుకోలేకపోవడమే కాదు.. చివరికి కంటి నిండా నిద్రకూ దూరమై తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ప్రభావం ఫైనల్ పరీక్షలపై ఉంటోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత కూడా నడుస్తున్న బరాత్‌లు, డీజేలపై ఫిర్యాదు చేసినా సరైన స్పందన ఉండట్లేదని వాపోతున్నారు. కఠిన చర్యలు లేని కారణంగా గస్తీ బృందాలు వచి్చనప్పుడు ఆపేస్తున్న నిర్వాహకులు వాళ్లు వెళ్లిన తర్వాత మళ్లీ మొదలెడుతున్నారని ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు అవసరమైన పట్టించుకోకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పరీక్షల సీజన్లో శబ్ద కాలుష్యం లేకుండా చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెళ్లి ఊరేగింపుల్లో పెరుగుతున్న శబ్ద కాలుష్యం -
పరీక్షల భయం ఉండదిక..
సాక్షి, అమరావతి: పరీక్షల భయంతో కలిగే మానసిక ఒత్తిడిని విద్యార్థులు అధిగమించేలా చేయడంపై ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) దృష్టి సారించింది. ఇందుకోసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌తో కలిసి ప్రవాస వైద్యులు, నిపుణులతో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని లెక్చరర్లకు ‘లైఫ్ స్కిల్స్–స్ట్రెస్ మేనేజ్మెంట్’ పేరిట శిక్షణ ఇస్తోంది. ఆ అధ్యాపకులు తమ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఇంటర్మీడియెట్ పరీక్షల సమయంలో విద్యార్థులు అధిక ఒత్తిడికి గురవుతున్నారని, దానిని ఎలా అధిగమించవచ్చనే విషయాన్ని వివరించేందుకు వర్చువల్‌గా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు చొప్పున 10,200 మంది (ప్రభుత్వ కాలేజీల నుంచి 3,400 మంది, ప్రైవేట్ కాలేజీల నుంచి 6,800 మంది) లెక్చరర్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు. విద్యార్థులను మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయడానికి అవలంబించాల్సిన విధానాలపై వారికి శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఇప్పటికే 50 శాతం కళాశాలల్లో శిక్షణ పూర్తయిందని, ఈ నెల 22 వరకు కొనసాగుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయిన లెక్చరర్లు తమ కాలేజీల్లోని విద్యార్థులకు ఒత్తిడి అధిగమించడంపై కౌన్సెలింగ్ ఇస్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అమెరికాలోని అల్బమాకు చెందిన సర్టిఫైడ్ చైల్డ్ అండ్ అడాలెసెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అపర్ణ ఉప్పల, ఎస్పీఐఎఫ్ వ్యవస్థాపకుడు నెల్సన్ వినోద్ మోజెస్ (మెంటల్ హెల్త్ జర్నలిస్ట్ విభాగంలో అవార్డ్ గ్రహీత)తోపాటు ప్రముఖ యాంకర్, సినీనటి ఝాన్సీ తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు. -
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జేఈఈ అడ్వాన్స్ పరీక్షల షెడ్యూల్ కారణంగా తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. బుధవారం రిషెడ్యూల్ చేసిన తేదీల ప్రకారం.. ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు.. ఏప్రిల్ 23 నుంచి మే 7 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11,12 న ఎన్విరాన్మెంటల్ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. ►ఏప్రిల్ 22 న పేపర్ 1 తెలుగు/ సంస్కృతి ►ఏప్రిల్ 25 న ఇంగ్లీష్ పేపర్ 1 ►ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 ►ఏప్రిల్ 29న మాథ్స్ పేపర్ 1B జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్1 ►మే2 న ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్1 ►మే 6న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్.. ►ఏప్రిల్ 23న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2, ►ఏప్రిల్ 26 న ఇంగ్లిష్ పేపర్ 2 ►ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2, ►ఏప్రిల్ 30న మాథ్స్ పేపర్ 2B, జూవాలజీ పేపర్2, హిస్టరీ పేపర్ 2 ►మే 5న ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్ 2, ►మే 7న కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్2 -
హైదరాబాద్ పోలీస్... సూపర్ బాస్
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు అంటే ప్రజలకు ఒకరకమైన భయం. వారితో ఎందుకులే అని ఆమడ దూరంలో వెళ్లిపోతారు. ఎందుకంటే పురాతన కాలం నుంచి వారిపై ప్రజలకు ఉన్న చెడు అభిప్రాయం. కానీ వీటన్నింటికి భిన్నంగా హైదరాబాద్ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. సమయానుకూలంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కన తలదాల్చుకుంటున్న వారికి సహాయం అందిస్తున్నారు. అక్రమాలకు పాల్పడితే తాటతీసే పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాల్లోను విరివిగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ట్రాఫిక్ పోలీసులు 8మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను తమ వాహనంలో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు పారంభమైన సంగతి తెలిసిందే. పశ్చిమ మారేడ్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అర్ధాంతరంగా ఆగిపోయింది. పరీక్షకు సమయం మించి పోతుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అటుగా వెళ్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పరిస్థితిని గమనించి వారిని పరీక్షా కేంద్రం వద్ద విడిచిపెట్టారు. అంతేకాదు ప్రతిరోజు నగరంలోని ట్రాఫిక్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అప్డేట్ చేస్తారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలంటూ యువతకు అవగాహన కల్పిస్తున్నారు. -
మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫస్టియర్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 19 వరకు, సెకండియర్ పరీక్షలను మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ మంగళవారం షెడ్యూల్‌ను జారీ చేశారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష అదే నెల 31న ఉంటుందని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 2 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. జనరల్‌తోపాటు వొకేషనల్ విద్యార్థులకు ఇవే పరీక్ష తేదీలు వర్తిస్తాయని తెలిపారు. మొదటి రోజు ద్వితీయ భాషా సబ్జెక్టుతో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే టెన్త్ పరీక్షల షెడ్యూలు.. పదో తరగతి పరీక్షల షెడ్యూలు ఖరారుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి 12 లేదా 14వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంది. ఏటా ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినం. ఈసారి నుంచి ఏప్రిల్ 12వ తేదీని చివరి పనిదినంగా ప్రకటించారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 9 వరకు ప్రీఫైనల్ పరీక్షలున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 12 లేదా 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
టెన్షన్.. వన్ మినిట్ టెన్షన్
-
దేశవ్యాప్తంగా ఇంటర్‌కు ఒకే తరహా పరీక్ష!
► కేంద్రానికి అధికారుల కమిటీ సిఫారసు ► 2 దీర్ఘ, 4 స్వల్పకాలిక, 8 లఘు సమాధాన విధానంలో ప్రశ్నపత్రం ► అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిందే! ► వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే యోచన సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ స్థాయిలో ఒకే తరహా సిలబస్, ఒకే నమూనా ప్రశ్నపత్రాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ చర్యలు చేపట్టింది. ప్రతి సబ్జెక్టులో 2 దీర్ఘ (లాంగ్) ప్రశ్నలు, 4 స్వల్ప సమాధాన (షార్ట్) ప్రశ్నలు, 8 లఘు (వెరీ షార్ట్) సమాధాన ప్రశ్నలు ఉండేలా ప్రశ్నపత్రాన్ని రూపొందించనుంది. ప్రతి సబ్జెక్టులో 70 శాతం మార్కులు రాతపరీక్షలకు, 30 శాతం మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించనుంది. మొత్తంగా ఇంటర్ స్థాయిలో దేశవ్యాప్తంగా ఒకే తరహా విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. వీలైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ సంస్కరణలను అమల్లోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. వేర్వేరు సిలబస్‌లు, విధానాలతో సమస్యలు ప్రస్తుతం ఇంటర్మీడియెట్ స్థాయిలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సిలబస్, ఒక్కో తరహా పరీక్షల విధానం ఉన్నాయి. వేర్వేరు తరహా ప్రశ్నపత్రాలు, మార్కుల విధానం ఉన్నాయి. దీనివల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, ప్రవేశాల విధానంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్లో దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు గతేడాది రెండు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. సిలబస్‌లో మార్పులపై తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ చైర్మన్‌గా ఒక కమిటీని, ప్రశ్నపత్రాల నమూనాపై మేఘాలయ విద్యా కమిషనర్ అండ్ సెక్రటరీ ఈపీ కర్భీహ్ చైర్మన్‌గా మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సిలబస్ కమిటీ గతంలోనే తమ నివేదికను అందజేయగా.. ప్రశ్నపత్రం నమూనాపై ఏర్పాటు కమిటీ ఇటీవలే తమ నివేదికను సమర్పించింది. ఆప్షన్ విధానం ఉండొద్దు! ఇంటర్లో అన్ని సబ్జెక్టుల పరీక్షల నిర్వహణ, ప్రశ్నలు ఉండాల్సిన తీరును కర్భీహ్ ఆధ్వర్యంలోని కమిటీ తమ నివేదికలో సూచించింది. అన్ని సబ్జెక్టుల్లోనూ 2:4:8 నిష్పత్తి విధానంలో ప్రశ్నలు ఉండాలని పేర్కొంది. అంటే దీర్ఘమైన జవాబులు రాసే ప్రశ్నలు 2, స్వల్ప సమాధాన ప్రశ్నలు 4, లఘు సమాధాన ప్రశ్నలు 8 ఉండాలని స్పష్టం చేసింది. అయితే పరీక్షించే విధానం పూర్తిగా డిస్రి్కప్టివ్ (వివరణాత్మక) విధానంలో ఉండాలని.. విద్యార్థులు ప్రతి ప్రశ్నకు జవాబు రాసేలా ఉండాలని, ఆప్షన్ విధానం ఉండొద్దని ప్రతిపాదించింది. ప్రతి సబ్జెక్టులోనూ ప్రాక్టికల్ విధానం ఉండాలని.. రాతపరీక్షకు 70 శాతం మార్కులు, ప్రాక్టికల్స్‌కు 30 శాతం మార్కులు ఉండాలని సూచించింది. ప్రశ్నపత్రాన్ని క్షుణ్నంగా చదువుకునేందుకు 15 నిమిషాలు అదనంగా సమయం ఇవ్వాలని పేర్కొంది. సులభ ప్రశ్నలు 35 శాతం, సాధారణ ప్రశ్నలు 40 శాతం, కఠిన ప్రశ్నలు 25 శాతం ఉండేలా చూడాలని తెలిపింది. గణితం, సైన్స్ పరీక్షలకు 3 గంటల సమయం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఓపెన్ బుక్ పరీక్షా విధానం అమల్లోకి తెస్తే ఎలా ఉంటుందన్న మానవ వనరుల శాఖ సూచనను కమిటీ తిరస్కరించింది. కాగా.. ఇప్పటికే నివేదిక సమర్పించిన సిలబస్ కమిటీ.. అన్ని రాష్ట్రాల్లోని ఇంటర్ విద్యలో, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లోని 10+2 విధానంలోనూ కామన్ కోర్ సిలబస్ ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల్లో మాత్రం 100 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండాలని.. ఇతర గ్రూపులు, సబ్జెక్టుల్లో 70 శాతం కామన్ సిలబస్ ఉండాలని ప్రతిపాదించింది. -
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు నవంబర్ 3 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో జరగనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును నవంబర్ 3 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం(నేడు)తో ముగియాల్సిన ఫీజు గడువును విద్యార్థుల సౌలభ్యం కోసం పొడిగించినట్లు పేర్కొన్నారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు 3వ తేదీ వరకు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు తీసుకోవాలని తెలిపారు. దానిని బోర్డు అకౌంట్లో 4వ తేదీ లోగా జమచేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
‘నిమిషం’ నిబంధనకు ఇంటర్ విద్యార్థిని బలి
సంగారెడ్డి రూరల్: ఇంటర్ పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా చేరుకోవటంతో పరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం చెర్లగూడెంకి చెందిన లక్ష్మీ, కిష్ట య్య కూతురు ప్రవల్లిక(16) సంగారెడ్డి లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈ నెల 2న పరీక్షల ప్రారంభంరోజునే ప్రవల్లిక పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంది. దీంతో సిబ్బంది ప్రవల్లికను లోనికి అనుమతించలేదు. ఆ తర్వాత పరీక్షలు రాస్తున్నా మొదటి పరీక్ష రాయనందున ఫెయిల్ అవుతానని ఆందోళనకు గురై బుధవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిం చుకుంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ గురువారం ప్రవల్లిక మృతి చెందింది. -
ఏపీ టెన్త్,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
నేలబారు పరీక్షలు
కర్నూలు(జిల్లా పరిషత్): ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో తప్పనిసరిగా బేంచీలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలు బేఖాతర్ అయ్యాయి. బుధవారం జిల్లాలో చాలా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు నేలపైనే పరీక్ష రాయాల్సి వచ్చింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు 7 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా కేంద్రమైన కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్ కేంద్రాల్లోనూ పలు కేంద్రాల్లో ఈ పరిస్థితి కనిపించింది. స్థానికంగా ఉన్న విద్యార్థులు సైతం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రానికి చేరుకోవడం ప్రారంభించారు. కొందరు విద్యార్థులు మాత్రమే 9 గంటల తర్వాత పది నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్నా అనుమతించారు. జిల్లా మొత్తంగా 110 కేంద్రాల్లో బుధవారం మొదటిరోజు జరిగిన పరీక్షకు 38,804 మంది విద్యార్థులకు గాను 37,061 మంది హాజరుకాగా, 1,743 మంది గైర్హాజరయ్యారు. కర్నూలు నగరంలోని పలు కేంద్రాలను ఆర్ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు పరిశీలించారు. ఈసారి ప్రయోగాత్మకంగా ఆళ్లగడ్డ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా నీడలో పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇంటర్ మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని ఆర్ఐవో తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, సమస్యలు ఉత్పన్నం కాలేదని చెప్పారు. నేలపైనే రాతలు ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పినా పలు కేంద్రాల్లో డెస్క్‌ల సమస్య తీవ్రంగా ఉంది. కర్నూలు నగరంలోని బాలశివ జూనియర్ కళాశాలతో పాటు పెద్దపాడులోని మోడల్ స్కూల్, కోడుమూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఆదోనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కోసిగి, మంత్రాలయం, కౌతాళంలలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు నేలపైనే పరీక్షలు రాశారు. రావూస్ కాలేజీలో ఆందోళన పరీక్షా కేంద్రంలోకి ప్యాడ్లు అనుమతించ కపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నంద్యాలలోని రావూస్ జూనియర్ కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కళాశాలలో ప్యాడ్‌తో కూడిన కుర్చీలు ఉండటంతో పరీక్షల నిర్వహణాధికారులు విద్యార్థులకు ప్రత్యేకంగా ప్యాడ్లు తీసుకురాకూడదని ఆంక్షలు విధించారు. తాము ప్యాడ్లపై రాసే అలవాటు ఉందని, అకస్మాత్తుగా ప్యాడ్లు వద్దని చెబితే ఎలా రాయగలమని నిలదీశారు. వీరికి మద్దతుగా తల్లిదండ్రులు సైతం ఆందోళన చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవ సద్దుమణించారు. గురువారం నుంచైనా విద్యార్థులకు ప్యాడ్లు అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. కోడుమూరు మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు రహదారి సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. రహదారి వెంట గుంతలు, ముళ్లకంపలు ఉండటంతో ఆటోలు సైతం వెళ్లలేని పరిస్థితి. దీంతో ఒకటిన్నర కిలోమీటర్ దూరం నడిచి వెళ్లి పరీక్ష రాయాల్సి వచ్చింది. -
ఇంటర్ బోర్డు పై అధికారం ఎవరిది?
-
‘ఓపెన్ ఇంటర్’లో 58.14% ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షల్లో 58.14 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 1,04,011 మంది పరీక్ష రాయగా 60,475 మంది ఉత్తీర్ణులు అయినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర్శర్మ శనివారమిక్కడ తెలిపారు. ఈ పరీక్షలకు హాజరైన 67,497 మంది పురుషుల్లో 38,130 (56.49 శాతం) మంది, 36,514 మంది మహిళల్లో 22,345 (61.20 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ‘ఎ’ గ్రేడ్‌లో (91-100 శాతం మార్కులు) ఒక్కరూ పాస్ కాకపోగా ‘బి’ గ్రేడ్‌లో (81-90 శాతం మార్కులు) 0.22 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. అత్యధికంగా ‘ఎఫ్’ గ్రేడ్‌లో (41-50 శాతం మార్కులు) 37.17 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం పేపరుకు రూ. 200 చొప్పున, రీవెరిఫికేషన్ కోసం పేపరుకు రూ. 600 చొప్పున ఈ నెల 31లోగా ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలని శర్మ సూచించారు. -
సడలిన నిబంధన
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధన సడలిపోయింది. గురువారం పరీక్ష సమయం దాటి ఐదు నిమిషాల వరకు విద్యార్థులకుఇచ్చారు. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల వారు కొందరు విద్యార్థులకు మేలు చేస్తారన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ బోర్డు.. ఈ నిబంధనను విధించింది. దీంతో బుధవారం విద్యార్థులు పలు అవస్థలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాల్లో ఉన్న పరీక్ష కేంద్రానికి రావడానికి బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. కర్నూలు నగరంలోనూ ట్రాఫిక్ విద్యార్థులకు పరీక్ష పెట్టింది. దీంతో పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, వారిని ఇన్విజిలేటర్లు వెనక్కి పంపించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. అదీగాక 8.45 గంటలకే పరీక్ష కేంద్రంలో ఉండాలనే నిబంధన విద్యార్థులను మరింత ఇరుకున పెట్టింది. దీంతో 9.05 నిమిషాల వరకు అనుమతి ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. గురువారం ఈ మేరకు చర్యలు తీసుకోవడంతో గైర్హాజరు శాతం తగ్గింది. రెండో రోజు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగగా.. మొత్తం 37,956 మందికి గాను 31,906 మంది హాజరయ్యారు. బుధవారం నాటితో పోలిస్తే గైర్హాజరుశాతంతో పాటు 8.45 నుంచి 9 గంటల మధ్యలో వచ్చే విద్యార్థుల సంఖ్య 61కి తగ్గింది. ఇదిలా ఉండగా బి.క్యాంపులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూం నంబర్లు సరిగ్గా వేయలేదని పేర్కొంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గొడవకు దిగారు. ఉస్మానియా కళాశాలలో వరండాలో నేలపై విద్యార్థులను కూర్చోబెట్టి పరీక్ష రాయించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 8.15 నుంచే అనుమతించాలి ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా విద్యార్థులను 8.15 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ఆర్ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. కొన్ని కేంద్రాల్లో 8.30 గంటలు దాటినా అనుమతించడం లేదన్న ఫిర్యాదులు రావడంతో, దీంతో ఆయా కేంద్రాల వద్ద భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విధుల నుంచి ఇన్విజిలేటర్ తొలగింపు అరబిక్ పేపర్‌కు బదులు ఉర్దూ పేపర్ ను ఇచ్చిన ఇన్విలేటర్ను విధుల నుంచి తొలగించినట్లు ఆర్ఐవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. స్థానిక మద్దూర్‌నగర్‌లోని మాస్టర్స్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో నారాయణ కళాశాల విద్యార్థిని షేక్ అర్షియాసమ్రీన్కు బుధవారం అరబిక్ పేపర్ బదులు విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్ ఉర్దూ పేపర్‌ను ఇచ్చారు. ఈ విషయమై ఇన్విజిలేటర్‌కు పలుమార్లు చెప్పినా స్పందించకపోవడంతో ఆమె నష్టపోయారు. విషయం తెలుసుకున్న ఆర్ఐవో ప్రాథమిక విచారణ జరిపి, సదరు ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఈ నెల 12 నుంచి 28 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి సామగ్రిని సంబంధిత డిపార్టుమెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లకు అందజేసేందుకు ఆర్ ఐవో కార్యాలయంలో భద్రపరిచారు. ఈ నెల 4న ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి. థియరీ పరీక్షలకు గడువు దగ్గరపడుతుండడంతో ఏర్పాట్లు వేగవంతం చేశారు. విద్యార్థులకు హాల్‌టికెట్స్‌తో పాటు ఎస్‌ఆర్‌లు, సెంటర్ఎన్ఆర్లు, బార్‌కోడ్స్ సూచనలతో కూడిన బుక్లెట్లు పంపిణీ చేస్తున్నారు. గతంలో వలే కాకుండా ఈసారి పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి మించి ఒక్క నిమిషం ఆలస్యం అయినా విద్యార్థులను అనుమతించేది లేదని ఇంటర్‌బోర్డు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రం చేరుకోవాల్సి ఉంటుంది. 8.45 వరకు హాల్లోకి అనుమతిస్తారు. 9గంటల తర్వాత వచ్చే వారిని కేంద్రంలోకి అనుమతించరు. పెరిగిన 28 కేంద్రాలు ఇంటర్ పరీక్షల నిర్వహణకు గాను జిల్లా వ్యాప్తంగా 141 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి మరో 28 కేంద్రాలు కొత్తగా పెరిగాయి. ఇందులో జిల్లావ్యాప్తంగా 23 ఆదర్శ పాఠశాలల్లో సైతం కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 141 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 141 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఆరు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఈ సారి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంను ప్రవేశపెట్టారు. ఆయా కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారులు, ఇన్విజిలేటర్లు పరీక్ష సమయంలో ఎవరితో ఏమేమీ మాట్లాడారనే విషయాలన్నీ రికార్డు అవుతాయి. అనుమానం వస్తే వెంటనే ఉన్నతాధికారులు జీపీఎస్ ద్వారా రికార్డయిన వాయిస్‌ను పరిశీలించనున్నారు. ఏమైనా అక్రమాలు జరిగినట్లు వెల్లడైతే వెంటనే చర్యలు చేపట్టనున్నారు. 1,02,157 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 42,916 మంది, వృత్తివిద్య కోర్సులో 3642 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 39,744 మంది విద్యార్ధులు, ప్రైవేట్ విద్యార్ధులు 10,010 మంది , వృత్తి విద్యకోర్సుల్లో 4,376 మంది, ప్రైవేట్‌గా 1,469 మంది మొత్తం 1,02,157 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కలెక్టర్, ఆర్ఐవో వారం రోజులుగా అన్ని విభాగాల అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. హాల్‌టికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు విద్యార్థులకు హాల్టికెట్లివ్వకుండా వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య, తాగునీటి సౌకర్యాలతోపాటు సెంటర్ల వరకూ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్రాల వద్ద ముందస్తుగా 144 సెక్షన్ విధించాం. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. -ఆర్ఐవో రమేశ్‌బాబు సమస్యలుంటే సంప్రదించండి. పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైనట్లయితే 0878-2241215, 9440593803, 9849500923 నంబర్లలో సంప్రదించవచ్చు. -
మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే డిస్మిస్
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ పరీక్షలో ఇన్విజిలేటర్లు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే డిస్మిస్ చేస్తామని జిల్లా ఇంటర్మీడియెట్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఫజలుల్లా పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వహణపై డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్షలను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంకు అనుసంధానం చేశామన్నారు. 43 ప్రభుత్వ కళాశాలలు, 41 ప్రైవేటు కళాశాలలు, 6 ట్రైబల్ , 1 మోడల్, 5 సాంఘిక సంక్షేమ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పది సిట్టింగ్, నాలుగు ఫ్లైయింగ్, ఒకటి హైపవర్ కమిటీ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నపత్రాల నిల్వకు 42 పోలీస్స్టేషన్లు ఎంపిక చేశామన్నారు. పరీక్ష నిర్వహించే డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు 7వ తేదీన సంబంధిత పరీక్ష కేంద్రాల్లో నియామకం కావాలన్నారు. వీరికి మాత్రమే కేంద్రంలో సెల్‌ఫోన్ అనుమతి ఉంటుందని, ఇన్విజిలేటర్లకు అనుమతి లేదన్నారు. 7,8,9 తేదీల్లో ప్రశ్నపత్రాలు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందుతాయన్నారు. జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షకు 24,493, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 23,274, ప్రైవేటుగా 4,916 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అదేవిధంగా వొకేషనల్ ప్రథమ పరీక్షకు 3,350, ద్వితీయ సంవత్సరానికి 3,931, ప్రైవేటుగా 610 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆర్ఐవో ఫజలుల్లా వివరించారు. సాఫీగా జరిగేలా చూడాలి కాగజ్‌నగర్ : ఇంటర్మీడియెట్ పరీక్షలు సాఫీగా జరిగేలా చూడాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఫజలుల్లా అ న్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు గణేశ్‌కుమార్, జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.