‘ఓపెన్ ఇంటర్’లో 58.14% ఉత్తీర్ణత | above 58% result in open inter | Sakshi
Sakshi News home page

‘ఓపెన్ ఇంటర్’లో 58.14% ఉత్తీర్ణత

Published Sun, May 25 2014 12:45 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

above 58% result in open inter

సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షల్లో 58.14 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 1,04,011 మంది పరీక్ష రాయగా 60,475 మంది ఉత్తీర్ణులు అయినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర్‌శర్మ శనివారమిక్కడ తెలిపారు. ఈ పరీక్షలకు హాజరైన 67,497 మంది పురుషుల్లో 38,130 (56.49 శాతం) మంది, 36,514 మంది మహిళల్లో 22,345 (61.20 శాతం) మంది  ఉత్తీర్ణులయ్యారు.  ‘ఎ’ గ్రేడ్‌లో (91-100 శాతం మార్కులు) ఒక్కరూ పాస్ కాకపోగా ‘బి’ గ్రేడ్‌లో (81-90 శాతం మార్కులు) 0.22 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. అత్యధికంగా ‘ఎఫ్’ గ్రేడ్‌లో (41-50 శాతం మార్కులు) 37.17 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం పేపరుకు రూ. 200 చొప్పున, రీవెరిఫికేషన్ కోసం పేపరుకు రూ. 600 చొప్పున ఈ నెల 31లోగా ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలని శర్మ సూచించారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement