ఇంటర్ పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా చేరుకోవటంతో పరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డి రూరల్: ఇంటర్ పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా చేరుకోవటంతో పరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం చెర్లగూడెంకి చెందిన లక్ష్మీ, కిష్ట య్య కూతురు ప్రవల్లిక(16) సంగారెడ్డి లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.
ఈ నెల 2న పరీక్షల ప్రారంభంరోజునే ప్రవల్లిక పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంది. దీంతో సిబ్బంది ప్రవల్లికను లోనికి అనుమతించలేదు. ఆ తర్వాత పరీక్షలు రాస్తున్నా మొదటి పరీక్ష రాయనందున ఫెయిల్ అవుతానని ఆందోళనకు గురై బుధవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిం చుకుంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ గురువారం ప్రవల్లిక మృతి చెందింది.