pravallika
-
కష్టం కార్పొరేటర్‌ది.. ప్రచారం ఎమ్మెల్యేది
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కార్పొరేటర్లు కౌన్సిల్లో శాంక్షన్ చేయించిన పనులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తానే చేయించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు ఆ పనులను మంజూరు చేయించిన కార్పొరేటర్ల ప్రమేయం లేకుండా ప్రచారం కోసం టెంకాయలు కొట్టి శంకస్థాపనలు చేస్తుంటే ఇదేమీ చోద్యం అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇలా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గత ప్రభుత్వంలో మంజూరైన నిధులకు సంబంధించిన పనులకు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తూ అంతా తన ఘనతే అంటూ ప్రచారం చేసుకోవడం విమర్శలకు తావిస్తుంది. ఇవే నిదర్శనం.. మూడో డివిజన్లోని రామచంద్రానగర్, నాగార్జున నగర్లో రోడ్లు నిర్మాణం కోసం ఎన్నికలకు ముందుకు కౌన్సిల్లో కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, కో ఆప్షన్ సభ్యుడు ముసునూరు సుబ్బారావు ప్రతిపాదనలు పెట్టారు. ఆ పనులను అడ్డుకునేందుకు టీడీపీ వాళ్లు ప్రయత్నం చేయగా, కార్పొరేటర్, కో ఆప్షన్ సభ్యుడు పట్టుబట్టి వాటిని మంజూరు చేయించారు. ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్లి, ఆ పనులకు శంకుస్థాపన చేసి అంతా తన ఘనతే అని చెప్పుకుంటున్నారు. నాల్గవ డివిజన్ ఎనీ్టఆర్ కాలనీలో 2021లో పార్కు, జిమ్‌ను ప్రారంభించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో, నాటి కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. వాటిని మళ్లీ ఇటీవల ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెళ్లి రిబ్బన్ కట్ చేశారు. ఒకసారి ప్రారంభించిన పనిని మళ్లీ ప్రారంభించడం ఏమిటనీ ఆ ప్రాంత వాసులు నవ్వుకున్నారు. అంతేకాదు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. అవన్నీ ఎన్నికల కోడ్ సందర్భంగా నిలిచిపోయాయి. వాటన్నింటికి శంకుస్థాపనులు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు నాసిరకంగా కొంతమేర రిటైనింగ్‌వాల్ నిర్మించి, రిటైనింగ్ వాల్ ఘనత తమదే అంటూ ప్రచారం చెప్పుకోవడం విశేషం. తూర్పు నియోజకవర్గంలో 2014–19 కాలంలో కూడా కార్పొరేటర్లు చేసిన పనులను తానే చేసినట్లు చెప్పుకుంటున్నారని నాడు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే విధంగా ప్రచారం చేసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. నాడు అడ్డుకున్నారు.. నాగార్జున నగర్, రామచంద్రానగర్లలో రోడ్ల నిర్మాణం కోసం కౌన్సిల్లో పెడితే టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కానీ పట్టుబట్టి ఆమోదం చేయించాం. ఇప్పుడు మాకు చెప్పకుండా శంకుస్థాపన చేసి, వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. తాను కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత డివిజన్లో రూ.25 కోట్లతో అభివృద్ధి చేశాం. అంతా కళ్లకు కనిపిస్తుంది. ఎవరు అభివృద్ధి చేశారో కూడా ప్రజలకు తెలుసు. గత ప్రభుత్వంలో దేవినేని అవినాష్ సహకారంతోనే అభివృద్ధి చేయగలిగాం. – భీమిశెట్టి ప్రవల్లిక, 3వ డివిజన్ కార్పొరేటర్ -
హ్యాట్సాఫ్ ప్రవల్లిక: జీవితాన్ని మలుపు తిప్పిన సాఫ్ట్ బాల్
సాఫ్ట్ బాల్ క్రీడ ఆమె జీవితాన్నే మార్చేసింది. నాల్గో తరగతి నుంచే సాఫ్ట్ బాల్ పట్ల మక్కువ పెంచుకున్న ఆమె అంతటితో ఆగిపోలేదు.. నిరంతర సాధనతో ఆ క్రీడపై పట్టు సాధించారు. అంతేకాదు పదో తరగతిలోపే నాలుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. దీంతోపాటు బాల క్రీడాకారుల కోటాలో అంతర్జాతీయ విజ్ఞాన పర్యటనలకు ఎంపికయ్యారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. 20 రోజులు అమెరికాలో పర్యటించే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా)ను సందర్శించారు సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ప్రవల్లిక. 15 జాతీయ, రెండు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆమె కనబరిచిన ప్రతిభ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నారు. సాఫ్ట్‌బాల్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించడం, సివిల్ సరీ్వసెస్‌లో చేరడం వంటి లక్ష్యాలతో కసరత్తు చేస్తున్న ప్రవల్లిక ‘సాక్షి’తో పంచుకున్న పలు విశేషాలు... సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నవీన్‌గౌడ్, కవిత దంపతుల కుమార్తె ప్రవల్లిక. నాల్గో తరగతి చదువుతున్న సమయంలోనే క్రీడల పట్ల ప్రవల్లిక ఆసక్తి చూపేది. కుమార్తె ఆసక్తికి తగ్గట్టుగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు బాల్యం నుంచే సాఫ్ట్ బాల్ క్రీడలో శిక్షణ ఇప్పించారు. శిక్షణలో చేరింది మొదలు అకుంటిత దీక్షతో సాధన చేసిన ఆమె క్రమేణ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తను చదువుతున్న సికింద్రాబాద్ సెయింటాన్స్ స్కూల్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణిగా అండర్ –17 విభాగంలో రాష్త్ర స్థాయి క్రీడాకారిణిగా ఎదిగారు. తెలంగాణ జట్టు తరపున మధ్యప్రదేశ్, మహారాష్త్ర తదితర రాష్ట్రాల్లో జరిగిన సాఫ్ట్ బాల్ జాతీయ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇప్పటి వరకూ వరుసగా 15 జాతీయ స్థాయి పోటీల్లో దక్షిణ భారత దేశం తరపున పాల్గొని పలు పతకాలు గెలుచుకున్నారు. ఇండోనేషియా, సౌత్ కొరియా దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత్ నుంచి పాల్గొని వెండి పతకాన్ని సాధించారు.లవ్లీ యూనివర్శిటీ తోడ్పాటు.. నగరంలో ఇంటరీ్మడియట్ పూర్తిచేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి సాఫ్ట్‌బాల్‌లో రాణిస్తున్న తనను పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ చేరదీసింది. స్పోర్ట్స్ కోటాలో తనకు అన్ని వసతులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే అవకాశాన్ని కల్పించిందని ప్రవల్లిక తెలిపారు. అంతేకాదు తను అక్కడకు వెళ్లిన తర్వాత యూనివర్శిటీ తరపున ఇండోనేíÙయా, దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్నీ కలి్పంచారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు శిక్షణతోపాటు సివిల్స్ పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా లవ్లీ యూనివర్శిటీ యాజమాన్యమే ఇప్సిస్తుండడం గమనార్హం.14 ఏళ్లకే నాసా సందర్శన.. అతి తక్కువ మందికి లభించే అరుదైన నాసా సందర్శన అవకాశం ప్రవల్లికకు 14 ఏళ్ల ప్రాయంలోనే అందివచి్చంది. దేశంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచే బాలలకు విజ్ఞాన పర్యటనలు ఉంటాయి. ఏ రంగానికి చెందిన బాలలైనా విజ్ఞాన పర్యటనల జాబితాలో చేరడం కోసం రాత పరీక్ష రాయాల్సిందే. ఆ పరీక్షను నెగ్గిన ప్రవల్లిక యూఎస్ఏ ఫ్లోరిడాలోని నాసాను సందర్శించారు. 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కి ఏకంగా 20 రోజుల పాటు అమెరికాను చుట్టి వచ్చారు.. నాసా పరిశోధకులు, వ్యోమగాములతో కరచాలనాలు, సంభాషణలు చేసే అరుదైన అవకాశం దక్కడం జీవితంలో గొప్ప అనుభూతి అని ఆమె చెబుతున్నారు. సివిల్స్, వరల్డ్ కప్ సాధించాలి.. సాఫ్ట్‌బాల్ క్రీడలో ఇప్పటికీ నిరంతర సాదన చేస్తున్నాను. ఉత్తమ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకుంటున్నాను. భారత్ తరపున ప్రపంచ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ కప్ సాధించాలన్నదే లక్ష్యం. కొద్ది నెలల క్రితమే వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. సివిల్స్ సాధించడం మరో లక్ష్యం. బాల్యంలోనే అమెరికా పర్యటన అవకాశం రావడం నా అదృష్టం. నన్ను ప్రోత్సహించిన అప్పటి రాష్త్ర మాజీ క్రీడాశాఖ మంత్రి టీ.పద్మారావు గౌడ్, తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు కే.శోభన్ బాబు, నవీన్ కుమార్, ఇండియన్ కోచ్ చిన్నాకృష్ణ సహకారంతో ఈ స్థాయికి ఎదిగాను. –ప్రవల్లిక, సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి -
ప్రవల్లిక కేసు: సరైన ఆధారాలు లేవు.. శివరామ్‌కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్‌కు నాంపల్లి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు.. ప్రవల్లిక ఆత్మహత్య కేసులో శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది. మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరామ్ రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా చిక్కడపల్లి పోలీసులు ఇతడి కోసం ముమ్మరంగా గాలించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి నగరానికి వచ్చి అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్లో ఉంటోంది. గతవారం ఆమె హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రవల్లిక రూమ్‌లో సోదా చేసిన అధికారులకు సూసైడ్ నోట్ లభించింది. ఆమె సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి అందులోని అంశాలను విశ్లేషించగా ఆత్మహత్యకు గల కారణాలు బయటపడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన శివరామ్ రాథోడ్ అనే యువకుడితో వాట్సాప్‌లో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. అతడికి ఆమె రాసిన ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించిన పోలీసులు శివరామ్ రాథోడ్‌కు మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో ప్రవల్లిక తాను మోసపోయానని కుంగిపోయినట్లు తేల్చారు. ఈ మేరకు ప్రవల్లిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. సోమవారం నగరానికి వచ్చిన ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడమేకాకుండా సందేశాల ప్రింటవుట్స్ సైతం అందించారు. వీటి ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును మార్చారు. ఐసీపీలోని 417, 420, 306 సెక్షన్లు జోడిస్తూ శివరామ్‌ను నిందితుడిగా చేర్చారు. అప్పటి నుంచి గాలిస్తున్న ప్రత్యేక బృందాలకు గురువారం మహారాష్ట్రలో అతడు చిక్కి నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే శివరామ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కోర్టు అనుమతించడంతో లొంగిపోయాడు. అయితే, ఈ కేసుపై శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య -
ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శివరాం రాథోడ్.. సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. శివరాం పిటిషన్‌కు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న రాత్రి హైదరాబాద్‌లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ప్రియుడు మోసం చేసిన కారణంగానే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నిర్థారించిన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా వాసి శివరామ్ చేతిలో మోసపోయా నన్న విషయాన్ని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు. చదవండి: మెట్రోలో కోతి చేష్టలు -
ప్రవల్లిక కేసు: హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివరాం కుటుంబం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ అభ్యర్థి ప్రవల్లిక ఆత్మహత్య తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రవల్లిక లేఖలో పేర్కొనగా.. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రవల్లిక ఆత్మహత్యకు శివరాం రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్ అరెస్ట్? -
ప్రవల్లిక కుటుంబానికి అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక కుటుంబసభ్యులు బుధవారం మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లోని తన కార్యాలయంలో కలసిన ప్రవల్లిక కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రవల్లిక మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తమ కుమార్తె మరణానికి కారణమైన శివరామ్ అనే వ్యక్తిని శిక్షించాలని ప్రవల్లిక కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రవల్లిక మరణం దురదృష్టకరమని, బాధాకర సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మంత్రి వారిని ఓదార్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర డీజీపీతో కేటీఆర్ మాట్లాడి, విచారణ వేగవంతం చేయాలని కోరారు. ప్రవల్లిక మృతికి కారణమైన వ్యక్తికి తగిన శిక్ష పడేలా చూస్తామని ఆమె కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు. అలాగే కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రవల్లిక సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ‘ధైర్యంగా ఉండండి.. నీ బిడ్డను తెచ్చి ఇవ్వలేను కాని అన్ని విధాలుగా ఆదుకుంటా’అని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రవల్లిక తల్లిదండ్రులు లింగయ్య, విజయ తెలిపారు. -
టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం: కేటీఆర్
సాక్షి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో కరీంనగర్లో ఆశీర్వాద సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు మంత్రి కేటీఆర్ సహా గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు రమణ, భాను ప్రసాదరావు, ప్లానింగ్ బోర్డు వైఎస్ ఛైర్మన్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగింది. ప్రవల్లిక విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రవల్లిక తల్లిదండ్రులు ఈరోజు నన్ను కలిశారు. ఒకడు మా అమ్మాయిని వేధించి చంపాడని చెప్పారు. న్యాయం చేస్తానని వాళ్లకు హామీ ఇచ్చాను.ప్రవల్లిక సోదరుడికి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పాను. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఉద్యోగాలు కోరుకుంటున్నవాళ్లకు న్యాయం చేస్తాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. రాహుల్, ప్రియాంక గాంధీ వంటి వారు వచ్చి మాయమాటలు చెబుతారు జాగ్రత్త అని అన్నారు. ఇదే సమయంలో అద్భుతమైన మెజారిటీతో మళ్లీ ఎమ్మెల్యే కాబోయే గంగుల కమలాకర్‌కు అభినందనలు. ఒక్క గంగులకే కాదు ఎంపీ ఎన్నికల్లో వినోద్‌ను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలి. గత ఎన్నికల్లో మోసం జరిగింది. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కోసం ఏం చేశాడు. బడి లేదు.. గుడి లేదు ఏమీ తేలేదు. ప్రధాని మోదీ ఎందుకు దేవుడో బండి సంజయ్ చెప్పాలి. మోదీ చెప్పినట్టు రూ.15లక్షలు వచ్చినవాళ్లంతా బీజేపీకి ఓటు వేయండిన. రానివాళ్లు బీఆర్ఎస్కు ఓటు వేయండి. కేసీఆర్ అందరివాడు.. ఏ ఒక్క మతానికో లేక వర్గానికో చెందిన వ్యక్తి కాదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ క్రిమినల్. ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన వ్యక్తి. ఓటు విషయంలో ఆలోచించి వేయండి. తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది కరీంనగర్‌లోనే. ఓటుతో బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించాలి. మతం పేరుతో చిచ్చు పెట్టే కొందరు వ్యక్తులు మళ్లీ కరీంనగర్ వచ్చారు. వారితో జాగ్రత్త అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా రెడీ.. విడుదల ఎప్పుడంటే? -
ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్ అరెస్ట్?
సాక్షి, హైదరాబాద్: ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న రాత్రి హైదరాబాద్‌లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రియుడు మోసం చేసిన కారణంగానే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నిర్థారించిన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా వాసి శివరామ్ చేతిలో మోసపోయా నన్న విషయాన్ని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు స్పందించారు. మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రవల్లిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ మాట్లాడిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. వీడియోలో ఏముందంటే.. ‘మా అమ్మాయి పేరు మర్రి ప్రవల్లిక. రెండేళ్ల నుంచి నా బిడ్డ, నా కొడు కును హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్నా.. మేము కాయకష్టం చేసుకుని చదివిస్తున్నం. మా పిల్లలకు కష్టం రాకూడదని హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్న. నా బిడ్డను వాడు వేధించాడు. వాడి టార్చర్‌ను మా అమ్మాయి మాతో చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డ చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడు బయటికి రాకుండా చూడాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రావద్దు. మీకు, మీ పార్టీలకు గొడవలు ఉంటే మీరే చూసుకోండి .. మా కుటుంబాన్ని నా బిడ్డ చావును అందులోకి లాగకండి. నా బిడ్డ ఉరి వేసుకున్నట్టే వాడికి ఉరిశిక్ష పడాలి’ అని మర్రి విజయ వీడియో పోస్టు చేశారు. ‘ప్రవల్లిక చనిపోవడానికి కారణం శివరాం. మా అక్క స్నేహి తురాలి ద్వారా పరిచయమయ్యాడు. వేధించాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక డిప్రెషన్లో పడింది. సూసైడ్ చేసుకుంది’ అని ప్రవల్లిక తమ్ముడు మర్రి ప్రణయ్‌కుమార్ మరో వీడియోలో పేర్కొన్నాడు. చదవండి: నా బిడ్డ చావుపై రాజకీయాలు చేయొద్దు -
ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
సాక్షి, వరంగల్: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె కుటుంబం స్పష్టం చేసింది. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ వీడియో రిలీజ్ చేశారు. శివరామ్ వేధింపుల వల్లే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని ప్రవళిక అన్న ప్రణయ్ అన్నారు. తమ చెల్లి హాస్టల్లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు వేధింపులకు గురి చేశారని, ఫ్రెండ్స్ ఫోన్లతో పాటు వేరే ఇతర నంబర్ల నుంచి కాల్స్ చేసి ఇబ్బందులకు గురిచేశాడని, దాంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన చెల్లి సూసైడ్ చేసుకుందని సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. శివరామ్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగొద్దని ప్రవళిక తల్లి, సోదరుడు విజ్ఞప్తి చేశారు. కాగా, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవళిక కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు తనని కాదని మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: బతుకమ్మకు వస్తనంటివి బిడ్డా.. -
ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు?
హైదరాబాద్‌లో గ్రూప్–2 విద్యార్థిని ప్రవల్లిక మరణం ఆత్మహత్యల అంశాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. పరీక్షల్ని ప్రభుత్వం వాయిదా వేయడం వల్లనే ఆమె నిరాశకు గురై చనిపోయిందని కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. పోలీసుల కథనం ప్రకారం శివరామ్ అనే మిత్రునితో ప్రవల్లిక కొన్నాళ్ళుగా ప్రేమలో వుంది. అతను మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యి, నిశ్చితార్థం చేసుకున్నాడు. అది ఆమె మనసును గాయపరిచింది. మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారూ? అనే ప్రశ్న ఇలాంటి సందర్భాల్లో ముందుకు వస్తుంటుంది. ప్రతి ఆత్మహత్యకూ ఏదో ఒక కారణం వుంటుంది. అలా అనుకుంటే ప్రతి ఆత్మహత్య ప్రత్యేక మైనదే అవుతుంది. వ్యక్తిగతం అవు తుంది. అప్పుడు ఆత్మహత్యలను సూత్రీకరించడం కుదరదు. చర్చించడమూ కుదరదు. ఆత్మహత్యలకు సమాజమే కారణం అని నిర్ధారించినవాడు ఫ్రెంచ్ సమాజ శాస్త్రవేత్త ఎమిలి డర్ఖేమ్ (1858 – 1917). సామాజిక సంక్షోభం కారణంగానే మను షులు ఆత్మహత్యలు చేసుకుంటారని నిర్ధారిస్తూ 1897లో ఆయన ‘లా సూసైడ్’ శీర్షికతో ఓ ఉద్గ్రంథాన్ని రాశాడు. మనుషులు ఏం కోరుకుంటారూ? అని అడిగితే ఒక్కొ క్కరూ ఒక్కో సమాధానం చెపుతారు. భారీ ఆదాయం వచ్చే ఉద్యోగం, విలాసవంతమైన ఇల్లు, అందమైన భార్య, మొన గాడైన భర్త, రాజ్యసభ సీటు, కేబినెట్లో స్థానం... ఇలా సాగుతుంది కోరికల జాబితా. వీటన్నింటినీ డర్ఖేమ్ కొట్టి పడేస్తాడు. ఈ కోరికలన్నీ పైకి కనిపించే అంశాలు; సారాంశంలో ప్రతి మనిషీ సంఘీభావాన్ని కోరుకుంటాడని చెబుతాడు. అదే మనిషి ప్రాథమిక కోరిక. సమాజంలో సంఘీభావం ఏ స్థాయిలో వుందో కొలవడానికి డర్ఖేమ్ ఒక పరికరాన్ని కనిపెట్టాడు. దానిపేరే ‘ఆత్మహత్య’. సంఘీభావానికీ ఆత్మ హత్యలకూ విలోమానుపాత సంబంధం వుంటుందని ఆయన తేల్చాడు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటే అక్కడ సంఘీభావం తక్కువగా వున్నట్టు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు తక్కువగా వుంటే ఆ సమాజంలో సంఘీభావం ఎక్కువగా వున్నట్టు భావించాలన్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాదీ దేశాల వారీగా ఆత్మహత్యల నివేదికను ప్రకటిస్తూ వుంటుంది. వివిధ దేశాల్లో ఏడాదికి లక్ష మందికి 10 నుండి 40 మంది వరకు ఆత్మ హత్యలు చేసుకుంటారు. అయితే ఈ గణాంకాలను కచ్చితమై నవని అనుకోలేము. అనేక కుటుంబాలు ఆత్మహత్యను సామా జిక అవమానంగా భావిస్తాయి. జీవిత బీమా తదితర టెక్నికల్ కారణాల వల్లనూ కొందరు ఆత్మహత్యల్ని దాచిపెడతారు. కొన్ని దేశాల్లో ఆత్మహత్య అనేది శిక్షించదగ్గ నేరం. ఇన్ని కారణాల వల్ల ఆత్మహత్యల గురించి కచ్చితమైన నివేదికలు రావు. అయితే, కొన్ని నిర్ధారణలు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు పనికి వస్తాయి. మహిళల్లో ఎక్కువ శాతం ఆత్మ హత్య చేసుకోవాలని అనుకుంటారు; కానీ పురుషులు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటారు. చదువుకోనివారికన్నా చదువుకున్నవారు, కుటుంబ వ్యవస్థలో వున్నవారికన్నా కుటుంబ వ్యవస్థలో లేనివారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసు కుంటారట! జంతువులు ఒంటరిగా జీవించగలవుగానీ మనుషులు ఒంటరిగా జీవించలేరు. యుద్ధ సమయాల్లో, ఉద్యమాల సందర్భాల్లో మనుషుల మధ్య సంఘీభావం వున్నత స్థాయిలో వుంటుంది. అప్పుడు ఆ సమాజాల్లో ఆత్మహత్యల రేటు చాలా తక్కువగా వుంటుంది. ఆ దశ దాటిపోగానే ఆ స్థాయి సంఘీభావాన్ని పొందలేక గొప్ప నైరాశ్యానికి గురయ్యి చని పోవాలనుకుంటారు. ఎమిలి డుర్ఖేమ్ దృష్టిలో ఆత్మహత్యలకు రెండే కారణాలుంటాయి. మొదటిది అనుబంధాలు; రెండోది ఆంక్షలు. అనుబంధాల వల్ల రెండు రకాలు ఆత్మహత్యలు, ఆంక్షల వల్ల మరో రెండు రకాల ఆత్మహత్యలు జరుగుతాయంటాడు. మొత్తం ఆత్మహత్యలు నాలుగు రకాలని ఆయన వర్గీకరించాడు. మను షుల మీద ప్రేమాభిమానాలు చాలా ఎక్కువయినపుడు వారి కోసం కొందరు స్వచ్ఛందంగా చనిపోవడానికి సిద్ధపడతారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారూ, నక్సలైట్ ఉద్యమ అమరులూ ఈ కోవలోనికి వస్తారు. మనం ఇలాంటి చావుల్ని బలిదానాలు(ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్) అంటాము. మనుషుల మీద ప్రేమాభిమానాలు బొత్తిగా లేన ప్పుడూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. మనుషుల మీద ప్రేమాభిమానాలు లేని మనిషి ఒక అహంతో బతుకుతుంటాడు. బయటి నుండి సంఘీభావం అందక చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి చావును అహంభావ ఆత్మహత్య (ఈగోయిస్టిక్ సూసైడ్) అంటారు. కొందరి మీద ఇంటాబయట ఆక్షలుంటాయి. బట్టలు ఎలా వేసుకోవాలి, తల ఎలా దువ్వుకోవాలి, ఎలా నడవాలి, ఏం చదవాలి, ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి వరకు తల్లిదండ్రులే శాసిస్తుంటారు. కొందరిని ఆఫీసులో పైఅధికారులు వేధిస్తుంటారు. వీటిని తట్టుకోలేక కొందరు మరణానికి సిద్ధపడతారు. వీటిని నిర్బంధ మరణం (ఫాటలిస్టిక్ సూసైడ్) అంటారు. కొన్ని సందర్భాల్లో ‘ప్రభుత్వం చేసిన హత్య’ అంటుంటాం. ఇలాంటివి ఈ కోవలోనికే వస్తాయి. ఆంక్షల్ని, నియమ నిబంధనల్ని అస్సలు పట్టించుకోని వారు కొందరుంటారు. వీరిలోనూ ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటుంది. వీటిని క్రమ శిక్షణ రహిత ఆత్మహత్యలు (అనామిక్ సూసైడ్) అనవచ్చు. ఆత్మహత్యల్ని నివారించడానికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి కొన్ని యాప్‌లు కూడా వున్నాయి. ఆత్మహత్యల్ని నివారించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనది సంఘీభావం. అది వర్తమాన సమాజంలో క్రమంగా కను మరుగైపోతున్నది. ఇది అమానవీయమైన పరిణామం. మను షుల మధ్య సంఘీభావాన్ని నెలకొల్పడానికి అందరూ పూను కోవాల్సిన సందర్భం ఇది. డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు మొబైల్: 90107 57776 -
ప్రియుడు మోసం చేశాడనే ప్రవల్లిక ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవల్లిక (23) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు తనని కాదని మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక అశోక్‌నగర్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ‘‘ఆత్మహత్యపై శుక్రవారం రాత్రి సమాచారం రావడంతో అక్కడికి వెళ్లాం. ఆమె గదిలో సూసైడ్ లెటర్ దొరికింది. ఆమె సెల్‌ఫోన్ కాల్ రికార్డ్‌లు, వాట్సాప్ చాటింగ్‌లతో పాటు ఆమె స్నేహితులను విచారించాం. ప్రవల్లిక మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి గ్రామానికి చెందిన శివరామ్ రాథోడ్‌తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించాం. ప్రియుడితో ఫొటోలు, సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా ఉన్నాయి. తనను మోసం చేసి శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇరువురి మధ్య జరిగిన చాటింగ్‌లను గుర్తించాం. శివరామ్, ప్రవల్లిక ఇద్దరు కలిసి నగరంలో ఓ హోటల్‌కు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. మరింత విచారణ కోసం మృతురాలి సెల్‌ఫోన్, సీసీటీవీ ఫుటేజ్, సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. ఫోరెన్సిక్ రిపోర్ట్, ప్రవల్లిక చాటింగ్స్ ఆధారంగా శివరామ్ రాథోడ్‌పై కేసు నమోదు చేస్తామని డీసీపీ వివరించారు. అలాగే సూసైడ్ నోట్, లెటర్‌పై ఉన్న హ్యాండ్ రైటింగ్ ప్రవల్లికదేనా కాదా అనేది నిర్ధారించేందుకు ఆమె నోట్‌బుక్స్ కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. ఏం జరిగిందంటే.. శుక్రవారం సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ప్రవల్లిక ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్ధి సంఘాల నేతలు అడ్డుకున్నారు. గ్రూప్–2 పరీక్ష వాయిదా వేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అర్ధరాత్రి వరకూ మృతదేహాన్ని హాస్టల్లోనే ఉంచి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రేమ వ్యవహారమే ప్రవళ్లిక ఆత్మహత్యకు కారణమని తేల్చారు. పక్షం రోజుల కితమే హాస్టల్లో చేరిక కాగా, 15 రోజుల క్రితం హాస్టల్లో జాయిన్ అయిన ప్రవల్లిక సంధ్య, అక్షయ శ్రుతిలతో కలిసి ఉండేది. ఎక్కువగా ఎవరితో మాట్లాడేది కాదని అంటున్నారు. ప్రవల్లిక ఉరివేసుకున్న రూమ్‌లో సూసైడ్ నోట్‌తో పాటు లవ్ సింబల్స్‌తో ఉన్న ఓ లెటర్‌ను కూడా పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతురాలి సెల్ ఫోన్ లో తాను ప్రేమించిన శివరామ్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని ఫ్రెండ్స్‌తో చేసిన చాటింగ్స్‌ను పోలీసులు గుర్తించారు. ప్రేమగురించి కుటుంబసభ్యులకు తెలుసు–డీసీపీ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ప్రవల్లిక ఎలాంటి గ్రూప్స్ పరీక్షలకు అప్లయ్ చేయలేదని డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు. ఎలాంటి పోటీ పరీక్షలు కూడా రాయలేదన్నారు. ప్రవల్లిక ప్రేమ విషయం కూకట్‌పల్లిలో డిగ్రీ చదువుతున్న తమ్ముడు ప్రణయ్‌తో పాటు తల్లిదండ్రులకు కూడా తెలుసే ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. వారి వద్ద మరింత సమాచారం సేకరిస్తామన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆందోళనలు చేసి పోలీసులపై రాళ్లురువి్వన కేసులో బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. నివేదిక కోరిన గవర్నర్.. ప్రవల్లిక ఆత్మహత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె ఆత్మహత్యపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, టీఎస్పీఎస్సీ కార్యదర్శిలను ఆదేశించారు. ప్రవల్లిక ఆత్మహత్య పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేసిన గవర్నర్, ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. రాహుల్ గాందీ, ఖర్గే సంతాపం ప్రవల్లిక ఆత్మహత్య బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఉదాసీనతే కారణమని ఆరోపించారు. -
ప్రేమ వల్లే ప్రవల్లిక మృతి.. రేవంత్ రియాక్షన్ ఇదే..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇక, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కాగా, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రెండు నెలలు ఓపిక పట్టండి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని సీరియస్ అయ్యారు. అలాగే, డిసెంబరు 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు తెస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు ఉండకూడదంటే కేసీఆర్ గద్దె దిగాలి. 32 లక్షల మంది యువత ఆందోళనలో ఉన్నారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్మడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా?. సింగరేణిలో నియామకాల విషయంలోనూ సరిగా వ్యవహరించలేదు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల రద్దుతో అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు. జరిగిన పరిణామాలకు టీఎస్పీఎస్సీ అధికారులను బాధ్యులను చేయడం లేదు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థిని శుక్రవారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మరో విధంగా ప్రచారం చేస్తున్నారు. విద్యార్థిని రాసిన లేఖలోనే ఆత్మహత్యకు కారణం స్పష్టంగా పేర్కొంది. చనిపోయిన విద్యార్థినిపై అబాండాలు వేయడం సరికాదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ గద్దె దిగడమే అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రవల్లిక మృతిపై డీసీపీ వెంకటేశ్వర్లు సంచలన కామెంట్స్ చేశారు. ప్రవల్లిక ఆత్మహత్య ఉదంతం కేసుపై డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రవల్లిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్నారు. ఆమె 15 రోజుల కిందటే హాస్టల్లో చేరింది. శివరామ్ రాథోడ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలుసు. కానీ, అతను ఆమెను మోసం చేశాడు. వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అది తెలిసి ప్రవళిక డిప్రెషన్లోకి వెళ్లింది. వాట్సప్ ఛాటింగ్, సీసీటీవీ ఫుటేజీలతో ఈ వ్యవహారం బయటపడింది. అది తట్టుకోలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది తెలిపారు. శివరామ్‌తోనే ఆమె చివరిసారిగా కాల్ మాట్లాడింది. పూర్తి దర్యాప్తు తర్వాత అతనిపై చర్యలు ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు. ప్రవళిక మృతికి.. పరీక్ష వాయిదాకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటివరకు ప్రవళిక ఎలాంటి పోటీ పరీక్షకు హాజరు కాలేదని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ.. రేపే కీలక ప్రకటన -
ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్.. నివేదిక ఇవ్వాలని ఆదేశం
-
కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రవల్లిక లెటర్
-
బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు..
సైదాబాద్(హైదరాబాద్): వైద్యానికైన బిల్లు చెల్లించేస్తోమత లేక నిరుపేద దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. ఐదురోజులుగా ఎంత ప్రయత్నించినా ఆదుకునేనాథుడులేక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో నివసించే నితిన్, ప్రవల్లిక ఏడాదిన్నర క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. నితిన్ కిరాయి ఆటో నడుపుతూ భార్యను పోషిస్తున్నాడు. 13 రోజుల క్రితం వారికి కూతురు జన్మించింది. అయితే పసిపాపకు ఊపిరితిత్తుల సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒవైసీ ఆసుపత్రిలో చేర్చారు. ఏడురోజుల చికిత్స అనంతరం చిన్నారి కోలుకుంది. వైద్యానికిగాను రూ.లక్షా 16 వేల బిల్లు అయింది. అయితే వారి వద్ద కేవలం రూ. 35 వేలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన డబ్బులు కట్టడానికి సహాయం కోసం ఎవరిని అడిగినా ఫలితం లేకపోయింది. దాంతో బిల్లు కట్టలేక ఆ దంపతులు తమ కూతురును ఆసుపత్రిలోనే వదిలేశారు. గత ఐదు రోజులుగా తమను ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం సేవాలాల్ బంజారా సంఘం కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ దాతలు ఈ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి ఆసుపత్రి బిల్లు కట్టేందుకు సాయం చేయాలని కోరారు. -
అమెరికాలో నృత్య ప్రదర్శనకు చీపురుపల్లి యువతులు
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఇద్దరు నృత్యకళాకారిణిలకు అరుదైన అవకాశం లభించింది. తాము నేర్చుకున్న విద్యను ఖండాంతరాల్లో ప్రదర్శించేందుకు అర్హత సాధించారు. చిన్నప్పటి నుంచి నృత్యంలో శిక్షణ పొంది దేశంలో ఎన్నో వేదికలపై వందలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చిన హిమబిందు, ప్రవళ్లికలు ఇప్పుడు విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వమే స్వయంగా వీరిని అమెరికాలో నృత్య ప్రదర్శనలకు పంపిస్తోంది. ఆజాదికా అమృత మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భారత ప్రభుత్వం వందేభారతం పేరుతో భారీ కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. అందులో దేశ వ్యాప్తంగా 300 బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. అందులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన 35 బృందాలను విదేశాల్లో ప్రదర్శనలు కోసం ఎంపిక చేశారు. ఆ 35 బృందాల్లో శ్రీకాకుళానికి చెందిన శివశ్రీ కళా నృత్యనికేతన్ బృందానికి చెందిన నృత్యకారులు ఎంపికకాగా, అందులో చీపురుపల్లికి చెందిన నృత్యకారిణిలు ఇద్దరు ఉన్నారు. చీపురుపల్లి రిక్షాకాలనీకి చెందిన హిమబిందు ప్రస్తుతం టెక్‌మహీంద్రా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, ఆంజనేయపురానికి చెందిన జి.ప్రవళ్లిక ఎమ్మెస్సీ చదువుతోంది. 12 బృందం నృత్యకారులు నృత్యనికేతన్ మాస్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ పర్యవేక్షణలో నృత్య ప్రదర్శనలకు మంగళవారం బయలుదేరి వెళ్లనున్నారు. జూలై 21న అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూ నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. (క్లిక్: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
వచ్చే ఏడాది పెళ్లి
దర్శకుడు సుజిత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రవల్లిక అనే దంతవైద్యురాలితో సుజిత్ నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. సుజిత్, ప్రవల్లికలు ప్రేమించుకున్నారని సమాచారం. వీరి ప్రేమను అంగీకరించి ఇద్దరి కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరిపించారని తెలిసింది. వచ్చే ఏడాది సుజిత్, ప్రవల్లికల వివాహం జరగనుందట. ఇక సుజిత్ విషయానికి వస్తే... ‘రన్ రాజా రన్’ (2014) చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ‘సాహో’ చిత్రాన్ని తెరకెక్కించారు సుజిత్. ఇప్పుడు మలయాళ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌కి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఇందులో చిరంజీవి హీరోగా నటించబోతున్నారు. -
రెండింటిలోనూ అమ్మాయిలే ఫస్ట్..
సాక్షి, విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ (మెడికల్, డెంటల్) నీట్–2020లో అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.శ్యాంప్రసాద్ విడుదల చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తో కలిసి ఆయన ఫలితాలు వెల్లడించారు. పీజీ మెడికల్ నీట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 11,635 మంది హాజరుకాగా, 6,600 మంది అర్హత పొందారని తెలిపారు. పీజీ డెంటల్ (ఎండీఎస్)కు ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరైన 924 మందిలో 538 మంది అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరతామన్నారు. అనంతరం ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి తుది మెరిట్‌లిస్టు వెల్లడిస్తామన్నారు. ఇందుకు సంబంధించి వచ్చేవారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. కాగా, మెడికల్ కౌన్సెలింగ్లకు జీవో నెంబర్లు 550, 43 పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన దృష్ట్యా, కౌన్సెలింగ్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని వీసీ తెలిపారు. కమిటీæ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియ విధివిధానాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. మెడికల్, డెంటల్ రెండింటిలోనూ అమ్మాయిలే ఫస్ట్ కాగా జాతీయ స్థాయిలో నీట్లో మెడికల్, డెంటల్ రెండు విభాగాల్లోనూ రాష్ట్రంలో అమ్మాయిలే మొదటి స్థానం సాధించారు. మెడికల్‌లో చప్పా ప్రవల్లిక (రోల్ నెం: 2066161932) 41వ ర్యాంకు కైవసం చేసుకుంది. పీజీ డెంటల్ నీట్లో మెలేటి వెంకటసౌమ్య (1955226759) రెండవ ర్యాంకు కైవసం చేసుకుంది. (చదవండి: సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం) -
నాన్న పేరు గుర్తుండిపోయేలా....
సినిమాని కాచి వడపోసిన వారు కొద్ది మందే ఉంటారు. ఆ జాబితాలో కచ్చితంగా కోడి రామకృష్ణ ఉంటారు. అందుకే ఆయన హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి అనేక హిట్ సినిమాలు తీసి గురువును(దాసరి నారాయణరావు) మించిన శిష్యుడు అనిపించుకున్నారు. కోడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి శనివారం (22న). ఈ సందర్భంగా ఆయన కుమార్తెలు దీప్తి, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది మా కోరిక. అందుకే ఆయన పేరుతో సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి చిత్రాలు తీస్తాం.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. కాగా పాలకొల్లులో పుట్టి పెరిగిన కోడి రామకృష్ణ పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. డిగ్రీ పూర్తయ్యాక చెన్నై వెళ్లి దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలందరితో పని చేశారు. తమిళ, హిందీ, కన్నడ, మల యాళ చిత్రాలకూ దర్శకత్వం వహించా రాయన. ఆయన దర్శకత్వంలో చివ రిగా వచ్చిన చిత్రం ‘అరుంధతి’. -
విమానంలో తిరుపతి తీసుకెళ్లలేదని..
బంజారాహిల్స్: విమానంలో తిరుపతి తీసుకెళ్లలేదని అలిగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన ఎన్.ప్రవళ్లిక(30) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె 2014లో ఎస్పీఆర్హిల్స్ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన వెంకటరమణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ రాజీవ్‌గాంధీనగర్‌లో ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె రిత్విక. ఈ నెల 10న రిత్విక పుట్టు వెంట్రుకలు తీసేందుకు వెంకటరమణ కుటుంబంతో సహా తిరుపతి వెళ్లేందుకు రైలు టిక్కెట్ బుక్ చేసుకున్నారు. అయితే అనివార్యకారణాలతో ప్రయాణం వాయిదా పడింది. అయితే అందుకు అంగీకరించని ప్రవళ్లిక ఇద్దరం కలిసి విమానంలో తిరుపతి వెళ్లి వద్దామని కోరింది. అందుకు వెంకటరమణ అంగీకరించకపోగా వారం తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి రైలులో వెళ్దామని నచ్చజెప్పాడు. ఈ నేపథ్యంలో గత రెండ్రోసులుగా వారి మధ్య గొడవ జరుగుతోంది. బుధవారం సాయంత్రం డ్యూటీనుంచి ఇంటికి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి గడియ వేసుకుంది. గురువారం ఉదయం వెంకటరమణ లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో అతను ఆమెను కిందకు దింపి మోతీనగర్‌లోని నీలిమా ఆస్పత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఎస్ఐ సుధీర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపులు తాళలేక భార్య.. బంజారాహిల్స్: భర్త, తోటి కోడలు వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా, కొండచాకరపల్లి గ్రామానికి చెందిన గీత(20) కొండాపూర్‌లోని గూగూల్ సంస్థలో హౌజ్ కీపింగ్ విభాగంలో పని చేసేది. ఐదు నెలల క్రితం అదే కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్న విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ ఎన్బీటీ నగర్లో అద్దెకుంటున్నారు. ప్రస్తుతం గీత గర్భిణి. మంగళవారం రాత్రి విజయ్ తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. దీనిపై గీత నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం డ్యూటీ వెళ్లి వచ్చిన గీత సాయంత్రం తన గదిలో చున్నీతో వెంటిలేటర్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నైట్ డ్యూటీకి వెళ్లిన విజయ్ గురువారం ఉదయం దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. గత కొంతకాలంగా భర్తతో పాటు ఆమె తోటి కోడలు వేధిస్తున్నారని ఫోన్ చేసి చెప్పినట్లు మృతి రాలి తల్లిదండ్రులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి మందలించాడని యువకుడు.. మేడ్చల్: తండ్రి మందలించాడని మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని అత్వెలి గ్రామానికి చెందిన గడ్డం యాదయ్యకు నలుగురు సంతానం. వీరిలో చిన్న కుమారుడైన శ్యాంరావు(26) ఖాలీగా తిరుగుతుండటంతో యాదయ్య అతడిని మందలించాడు. దీంతో మనస్తాపానికిలోనైన శ్యాంరావు బుధవారం రాత్రి వంటగదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని మెడిసిటీ హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వైఎస్సార్ జిల్లాలో విషాదం...
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. కొల్లూరు వద్ద కుందునదిలోకి దూకి ఓ కుటుంబం గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో భార్యా, భర్తతో పాటు కుమార్తె కూడా మృతి చెందింది. మృతులు రాజుపాలెం మండలం గాదెగూడురుకు చెందిన తిరుపతిరెడ్డి, వెంకట లక్ష్మమ్మ, ప్రవళికగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. కాగా ప్రవళిక ప్రేమ వ్యవహారమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. చిన్న కుమార్తె ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పాటు మనసు మార్చుకోవాలని సూచించారు. అయితే కుమార్తె ప్రవర్తనలో రాకపోవడంతో తిరుపతి రెడ్డి మనస్తాపం చెంది, భార్య, కుమార్తెతో ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆయన పిల్లలుగా పుట్టడమే మాకు పెద్ద గిఫ్ట్
‘‘నాన్నగారికి వివక్ష ఉండేది కాదు. ఆడ, మగ ఇద్దరూ సమానమే అనేవారు. అందుకే తన ఇద్దరి కూతుళ్లకు లేనిపోని ఆంక్షలు పెట్టలేదు. ‘మీరెలా ఉండాలను కుంటున్నారో అలా ఉండండి. అయితే ఏ పని చేసినా నిజాయతీగా చేయండి. పద్ధతిగా ఉండండి’ అనేవారు. నాన్నగారు వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఆయన లేని లోటు మాకు ఎప్పటికీ తెలుస్తుంది’’ అన్నారు దివ్య దీప్తి. కోడి రామకృష్ణ, పద్మశ్రీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి దివ్య దీప్తి, రెండో కుమార్తె ప్రవల్లిక. ‘సాక్షి’తో దివ్య దీప్తి ప్రత్యేకంగా మాట్లాడారు. మీ నాన్నగారిని ఆస్పత్రిలో ఎప్పుడు చేర్చారు. ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉండేది? రెండు మూడు రోజుల క్రితం చేర్చాం. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూడా ఆయన చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ‘ఇట్స్ ఓకే. ట్రీట్మెంట్ అయ్యాక ఇంటికి వెళ్లిపోవచ్చు’ అంటుండేవారు. నాన్నగారికి విల్ పవర్ చాలా ఎక్కువ. అందుకే ఫస్ట్ టైమ్ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చాలా త్వరగా కోలుకున్నారు. ఏ ఇయర్లో హార్ట్ ఎటాక్ వచ్చింది? 2012లో. అప్పుడు బైపాస్ చేశారు. అయితే తనకో పెద్ద ఆపరేషన్ జరిగిందనే ఫీలింగ్ ఉండేది కాదు. చాలా కూల్‌గా త్వరగా కోలుకున్నారు. కొంత కాలంగా çసరిగ్గా నడవలేకపోతున్నారు పెరాలసిస్ అని ఇండస్ట్రీలో కొందరు అంటుంటారు... పెరాలసిస్ (పక్షవాతం) లాంటిది ఏమీ లేదండి. నాన్న కాళ్ళకి చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. కర్ర సాయంతో నడవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఎవరో ఒకరిని సాయంగా పట్టుకొని నడిచేవారు. ఆయన చివరిగా ఎవరితో మాట్లాడారు? అమ్మ, చెల్లి నాతోనే మాట్లాడారు. మాతో మాట్లాడిన తర్వాతే వెంటిలేటర్లోకి వెళ్లారు. ఇలా జరుగుతుందనే డౌట్ లాంటిదేమైనా మీ నాన్నగారికి? అస్సలు లేదు. ఏం ఫర్వాలేదు.. ఇంటికెళ్లిపోతాం అని ధైర్యం చెప్పారు. మీరు ఎదిగే టైమ్‌లో మీ నాన్నగారు ఫుల్ బిజీగా ఉండేవారు. మీరు బాగా మిస్సయ్యేవారేమో? నాకు బాగా గుర్తు. సాయంత్రం ఫ్లైట్‌కి వచ్చి మమ్మల్ని చూసి, కాసేపు టైమ్ స్పెండ్ చేసి మళ్లీ నైట్ ఫ్లైట్‌కి వెళ్ళిపోయేవారు. ఎప్పుడూ నాలుగైదు సినిమాలతో బిజీ. సినిమాలంటే ఆయనకు విపరీతమైన ప్రేమ. వేరే వ్యాపకం ఏమీ ఉండేది కాదు. పిల్లలకు ఏం కావాలో చూసుకో అని అమ్మతో అనేవారు. మాకు మాత్రం ‘ఎవరితో ఒక్క మాట అనిపించుకోకుండా ఉండాలి. హ్యాపీగా ఉండండి. సాదాసీదాగా ఉండాలి. పెద్దవాళ్లను గౌరవించాలి. చిన్నవాళ్లతో చక్కగా మాట్లాడాలి’ అని చెప్పేవారు. షూటింగ్ లొకేషన్స్‌కి మిమ్మల్ని, మీ చెల్లెల్ని తీసుకువెళ్లేవారా? అప్పట్లో ఇండస్ట్రీ చెన్నైలో ఉండేదా? మీ ఇద్దరూ అక్కడే పుట్టారా? మేం అక్కడే పుట్టాం. కొన్నేళ్లు అక్కడే చదువుకున్నాం కూడా. షూటింగ్స్ అన్నీ కూడా చెన్నైలో ఎక్కువగా జరిగేవి. మేం స్కూల్ అయిపోయిన వెంటనే షూటింగ్ స్పాట్‌కి వెళ్లిపోయేవాళ్లం. హాలిడే అయితే సెట్లోనే గడిపేవాళ్లం. ఎప్పటివరకూ చెన్నైలో ఉన్నారు? 2001 వరకూ చెన్నైలోనే ఉండేవాళ్లం. ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నాన్నగారు ఇక్కడ ఉండేవారు. ఆయన్ను చాలా మిస్ అయిపోతున్నాం అని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అప్పుడు కూడా మమ్మల్ని షిఫ్ట్ అవ్వొద్దన్నారు. ఎందుకంటే ఆయనకు చెన్నై అంటే చాలా ఇష్టం. 100 సినిమాలకు పైగా చేశాను. ఇంక రెస్ట్ తీసుకుంటా అని అనేవారా? నెవ్వర్. ఆయన కోరిక ఏంటంటే చనిపోయేటప్పుడు కూడా ‘యాక్షన్ అని చెబుతూ చచ్చిపోవాలి’ అని. ఆ విషయాన్ని మాతో చాలాసార్లు చెప్పేవారు. లాస్ట్ టు ఇయర్స్ కూడా సినిమాలు చేయడం లేదని ఫీల్ అయ్యేవాళ్లు. స్ట్రెయిన్ అవ్వకూడదు డాడీ అని చెప్పేవాళ్లం. అయినా వినేవారు కాదు. సినిమాలు చేయకుండా ఇంట్లో ఉండటం ఆయనకు నచ్చేది కాదు. మీ నాన్నగారు గొప్ప గొప్ప సినిమాలు తీశారు. దర్శకుడిగా ఆయన ఎలా ఫీల్ అయేవారు? నాన్నగారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే.. తనకేం అయినా ఫర్వాలేదు. చెడ్డ పేరొచ్చినా ఏం ఫర్వాలేదు.. నిర్మాతకు మాత్రం నష్టం రాకూడనుకునేవారు. ఆ ఫిలాసఫీ చాలా గొప్పది. నాన్నగారిలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే.. ఎవరొచ్చినా... స్థాయితో సంబంధం లేకుండా లేచి నిలబడి రిసీవ్ చేసుకునేవారు. ఇక తన గురువు (దాసరి నారాయణరావు) గారి ముందు కూర్చునే విధానంలో చాలా వినయం కనిపించేది. ‘అంజి’ సినిమాకి ఎక్కువ టైమ్ పట్టినప్పుడు ఆయన బాధపడేవారా? ఆయనకు ఆ టెన్షన్ ఎప్పుడూ లేదు. నిర్మాతకు నష్టం రాకూడదు. లాభాల్లోనే ఉండాలని మాత్రం అనుకునేవారు. కూతుళ్ల పెళ్లి గురించి ఆయనకు కలలేమైనా ఉండేదా? ఆయనకు అవేం తెలియదు. ఇంటి బాధ్యతలన్నీ అమ్మకు అప్పజెప్పారు. ఆయనకు సినిమా తప్ప వేరే లోకం ఏమీ లేదు. ఇంట్లో ఏం జరుగుతుంది? అని అడిగేవారు కాదు. అన్నీ మా ఇష్టం అనేవారు. పిల్లలకు ఏది ఇష్టమైతే అదే చెయ్యమని అమ్మతో అనేవారు. అలాగని ఆయనకు కుటుంబం అంటే నిర్లక్ష్యం కాదు. మా అమ్మగారి మీద ఆయనకు భరోసా ఎక్కువ. మీరు మీ నాన్నగారికి ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా ఉందా? ఆయన మీకిచ్చిన గిఫ్ట్? ఆయన పిల్లలుగా పుట్టడమే మాకు పెద్ద గిఫ్ట్. ఎవరితోనూ ఒక్క మాట కూడా అనిపించుకోకుండా ఉండండి అనేవారు. మేం అలా ఉండడమే ఆయనకు మేం ఇచ్చే గిఫ్ట్. నేను సినిమా డైరెక్ట్ చేయాలని ఆయనకు ఉండేది. నాన్నగారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేశారా? 2002 నుంచి 2007 వరకూ నాన్నగారి సినిమాలకు వర్క్ చేశాను. ఆ టైమ్‌లో డైరెక్షన్ గురించి చాలా నేర్చుకున్నాను. పెళ్లి తర్వాత బిజీ అవ్వడంతో కుదర్లేదు. దర్శకురాలిగా ఇండస్ట్రీకి ఎప్పుడు రావాలనుకుంటున్నారు? వచ్చే ఏడాదిలో రావాలనుకుంటున్నా. ఈ మధ్యనే ఓ కంపెనీ స్టార్ట్ చేశాం. అలాగే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఇప్పుడు ఇలా జరిగింది. త్వరలోనే కచ్చితంగా వస్తాను. కొత్త సినిమాల కోసం కోడి రామకృష్ణగారు కథలేమైనా రాశారా? వాటిని మీరు సినిమాగా మలిచే అవకాశం ఉందా? ఈ రెండు మూడేళ్లలో చేయాలని 3 స్క్రిప్ట్‌లు రెడీ చేశారు. అయితే నాన్నగారు ఈ కథలకు ఇచ్చినంత ట్రీట్మెంట్ నేనివ్వగలుగుతానో? లేదో? ఆ కథలకు న్యాయం చెయ్యగలననే నమ్మకం కుదిరితే సినిమా చేస్తాను. లేకపోతే టచ్ చేయను. నాన్నగారికి తీరని కోరిక ఏమైనా ఉందా? కోరిక లాంటిది ఏం లేదు. కానీ రెండేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు. ఆ వెలితికి ఆయనకు ఉన్నట్లుగా అనిపించేది. మధ్యలో రెండు సినిమాలు ఆగిపోయినట్టున్నాయి ‘పుట్టపర్తి సాయి బాబా’ సినిమా మొత్తం అయిపోయింది. అది ప్రొడక్షన్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. ఇంకో సినిమా ఓపెనింగ్ జరిగింది. లక్ష్మీరాయ్‌తో ఆ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఓపెనింగ్ రోజే హార్ట్ ఎటాక్ రావడంతో ఆ సినిమా కొనసాగలేదు. మీకు ఘనంగా పెళ్లి చేశారు. మీ చెల్లెలి పెళ్లి గురించి కూడా ఆలోచిస్తుండేవారా? ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేసి, భారం తీర్చేసుకోవాలనే టైప్ కాదు. మంచి అబ్బాయి దొరకాలి, అతని మీద నమ్మకం కుదరాలి. అప్పుడే పెళ్లి. నాకు అలానే మంచి సంబంధం చూసి చేశారు. చెల్లెలికి కూడా అలా కుదిరితే చేయాలనుకున్నారు. కూతుళ్లను బరువనుకోలేదు. నాకు ఇద్దరు అమ్మాయిలు అని గర్వంగా చెప్పుకునేవారు. ఆయనకు నేనెప్పుడూ కనబడుతుండాలి. అందుకే డాడీ దగ్గరే ఉంటున్నాను. నాన్నగారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు? అన్నీ ఇష్టమే. ప్రతి సినిమా చూస్తాను. ఫ్యామిలీని తీసుకు వెళ్లేవారా? సినిమాలకు ఆయన సినిమాలు ఆయన చూడరు. మేమే చూసి ఎలా ఉందో చెప్పేవాళ్లం. ముఖ్యంగా ఎలా ఉంది? అని అమ్మను అడిగేవారు. మేం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్లం. డి.జి. భవాని నా కోసం పాత్రనే మార్చారు ‘‘కోడి రామకృష్ణగారు చనిపోయారన్న వార్త విన్న వెంటనే షాక్ అయ్యాను. నమ్మలేకుండా ఉన్నాను. చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్యనే ఏదో ఇంటర్వ్యూలో కెరీర్ గురించి మాట్లాడుతూ కోడి రామకృష్ణగారి గురించి మాట్లాడాను. ‘మంగమ్మగారి మనవడు’ సినిమాలో ఆర్టిస్ట్‌గా నాకు చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో చేసిన ‘మా పల్లెలో గోపాలుడు’లో చేసిన ‘పులుసు’ పాత్ర చాలా పాపులర్ అయింది. ఇప్పటికీ ఆ పాత్రను గుర్తు చేసేవాళ్లు ఉన్నారు. ఆ సినిమా 365 రోజులాడింది. అంతకుముందు తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేశాన. తెలుగులోనూ 15 సినిమాలు వరకూ చేశా. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ‘మంగమ్మగారి మనవడు’. ‘పులుసు’ పాత్రతో నా కెరీర్ పీక్‌కి వెళ్ళిపోయింది. వెయ్యి సినిమాల వరకూ చేశాను. కోడి రామకృష్ణగారితో చేసిన సినిమాలు ఎంతో తృప్తికరమైనవి. చక్కటి పాత్రలు ఇచ్చారు. తెలుగు భాషలో ఉన్న అన్ని యాసలు ఆయన సినిమాలో మాట్లాడాను. స్వతహాగా నేను తెలుగు అమ్మాయినే అయినప్పటికీ చిన్నప్పుడే చెన్నైలో సెటిల్ అవ్వడం వల్ల తెలుగులో ఇన్ని యాసలుంటాయా? అనుకున్నాను. గ్లామర్ పాత్రల నుంచి తల్లి పాత్ర వరకు అన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు. చాలా బాధగా ఉంది (చెమర్చిన కళ్లతో కాసేపు మౌనం). మా అమ్మాయి, వాళ్ల అమ్మాయి కలసి చదువుకున్నారు. కొన్ని కమిట్మెంట్స్ వల్ల కోడి రామకృష్ణగారి భౌతిక కాయాన్ని సందర్శించలేకపోయాను. ఇవి పూర్తి కాగానే వెంటనే వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలుస్తాను. ఆర్టిస్టులను బంగారం లాగా చూసుకుంటారు ఆయన. డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. నా కెరీర్లో గుర్తుండిపోయే దర్శకుడు. ప్యాకప్ చెప్పేవరకూ భోజనం చేయరు ఆయన. మేం బ్రేక్‌లో తిన్నా కూడా ఆయన ప్యాకప్ చెప్పాకే తింటారు. పనిమీద శ్రద్ధ అలాంటిది. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ‘ఇంటి దొంగ’ సినిమాలో నా పాత్రను ప్రెగ్నెంట్‌గా మార్చారు. అలా ఎవరుంటారు? ఆర్టిస్ట్ మీద అభిమానంతో అలా చేశారు. నిజానికి నేను ‘అరుంధతి’ కూడా చేయాలి. కుదర్లేదు. మూడు నెలల క్రితం మాట్లాడాను. ఈ మధ్య కలవాలనుకున్నాను. మళ్లీ మేం కలిసి సినిమా చేస్తామనుకున్నాను. ఈ లోపే ఘోరం జరిగిపోయింది. చిత్రసీమ గొప్ప దర్శకుడుని కోల్పోయింది. -
ఆ సెలైన్‌లో పురుగుల్లేవ్: మంత్రి
హైదరాబాద్: చిన్నారి ప్రవళిక మృతిని వివాదాస్పదం చేయడం సరికాదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రవళికది సహజమరణమే అని, వారి కుటుంబసభ్యులను తామెవరం బెదిరించలేదన్నారు. సెలైన్ బాటిల్లో పురుగు ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని, చిన్నారి తండ్రి కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. నీలోఫర్‌లో బాలింతల మృతిపై సైతం లక్ష్మారెడ్డి స్పందించారు. బాలింతల మృతి వాస్తవమే అన్న ఆయన.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనారోగ్యంతో రెండు నెలల కిందట గాంధీ అసుపత్రిలో చేరిన జనగాం జిల్లాకు చెందిన సాయి ప్రవళిక అనే చిన్నారి మంగళవారం తెల్లవారు జామున మృతిచెందిన విషయం తెలిసిందే. చిన్నారికి ఎక్కించిన సెలైన్‌లో పురుగులున్నాయన్న ఆరోపనలు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఈ మేరకు స్పందించారు. -
అధికారుల తప్పిదం.. అందని పురస్కారం
హిందూపురం టౌన్ : దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సాధించిన పురస్కారం అధికారుల తప్పిదంతో అందకుండా పోయింది. వివరాలు.. పట్టణంలోని లక్ష్మిపురం ప్రాంతానికి చెందిన విజయసాయి, లీలమ్మ దంపతుల కుమార్తె నామకల్లు ప్రవల్లిక అనంతపురంలోని ఎస్కేయూలో పీజీ విభాగంలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిభ పురస్కారం 2016కు ఎంపికైంది. గత నెల 15న విజయవాడలో సీఎం చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం, ప్రశంసాపత్రం, హైదరాబాద్ సిండికేట్ బ్యాంకు మీద రూ.20 వేల డీడీ అందించారు. అయితే డీడీపై నామకల్లు ప్రవల్లిక బదులు ''హారిక నామకల్లు ప్రవల్లిక'' అనే పేరు రాసి ఇచ్చారు. డీడీ తీసుకుని హిందూపురంలోని సిండికేట్ బ్యాంకుకు వెళ్లగా చెల్లదని వెనక్కి పంపినట్టు బాధితురాలు వాపోయింది. హైదరాబాద్ వెళ్లి డీడీ మార్పించుకుని రావాలని సూచించారు. -
నృత్య పోటీల్లో ప్రవల్లిక ప్రతిభ
రేపల్లె: గత నెల 21 నుంచి 24వ తేదీ వరకు సిమ్లాలో నిర్వహించిన ధారోహర్ అంతర్జాతీయ నృత్యోత్సవంలో చెరుకుపల్లికి పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక ప్రతిభ కనబరిచింది. జాతీయస్థాయి నృత్య పోటీల్లో సెమీ క్లాసికల్ విభాగంలో ప్రథమ బహహుమతి, మరో నృత్యకారిణి మోహనతో కలిసి చేసిన కూచిపూడి జంట నృత్యంలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. జానపద నృత్య విభాగంలో తృతీయ బహుమతి దక్కించుకుంది. ఆమెను విద్యాశాఖ ప్రాంతీయ ఉప సంచాలకురాలు పార్వతి, నాట్య గురువు కాజ వెంకట సుబ్రహ్మణ్యం, బాపట్ల డీఈవో ఎన్.రఘుకుమార్, ఎంఈవో పి.లాజర్, ఎంపీడీవో షేక్ సుభానీ, వనజాచంద్ర విద్యాలయం డైరెక్టర్ కొడాలి మోహన్, ప్రిన్సిపాల్ ఏవీ కృష్ణారావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.