ఆ సెలైన్లో పురుగుల్లేవ్: మంత్రి
హైదరాబాద్: చిన్నారి ప్రవళిక మృతిని వివాదాస్పదం చేయడం సరికాదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రవళికది సహజమరణమే అని, వారి కుటుంబసభ్యులను తామెవరం బెదిరించలేదన్నారు. సెలైన్ బాటిల్లో పురుగు ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని, చిన్నారి తండ్రి కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు.
నీలోఫర్లో బాలింతల మృతిపై సైతం లక్ష్మారెడ్డి స్పందించారు. బాలింతల మృతి వాస్తవమే అన్న ఆయన.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనారోగ్యంతో రెండు నెలల కిందట గాంధీ అసుపత్రిలో చేరిన జనగాం జిల్లాకు చెందిన సాయి ప్రవళిక అనే చిన్నారి మంగళవారం తెల్లవారు జామున మృతిచెందిన విషయం తెలిసిందే. చిన్నారికి ఎక్కించిన సెలైన్లో పురుగులున్నాయన్న ఆరోపనలు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఈ మేరకు స్పందించారు.