Laxma Reddy
-
ఉప్పల్ లో బీఆర్ఎస్ జోరు
-
ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడియో హల్చల్
జడ్చర్ల: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయకపోతే ఇళ్లను ఇవ్వబోమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్న ఓ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 4వ వార్డు పరిధిలోని బోయలకుంటలో ప్రచార సమయంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ‘ఎన్నికలు కాబట్టి ఎవరెవరో వచ్చి ఓట్లు అడుగుతారు. ఎవరొచ్చి ఏం చేసేది ఏమీ లేదు. ఏం చేసినా మనమే చేయాలి. పొరపాటు జరిగి మా అభ్యర్థికి తక్కువ ఓట్లువస్తే ఇళ్లు కూడా ఇవ్వను. బీరుకో, బిర్యానీకో ఆశపడి ఓట్లు వేయొద్దు’ అని అన్నారు. ఈ వీడియోపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటర్లను బెదిరింపులకు గురిచేసేలా లక్ష్మారెడ్డి వైఖరి ఉండడం సరికాదన్నారు. అర్హులకు పథకాలు అందించడం ప్రభుత్వాల పని అని, ఎవరూ బెదిరింపులకు భయపడొద్దన్నారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: టీకా వేసుకున్న భర్త.. ఆ తర్వాత భార్య -
వ్యాఖ్యల దుమారంపై స్పందించిన లక్ష్మారెడ్డి
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రజలకు మంచి చేస్తే మరచిపోతారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రద్దు చేయాలనే వ్యాఖ్యలపై టీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. తాను అలా అనలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి ప్రసారం చేసిందని అన్నారు. పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు గుర్తుంచుకోవాలని అర్ధం వచ్చేలా తాను నిన్న మాట్లాడానని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాలు ఏవైనా ప్రజలకు మేలు చేస్తే ఆ ప్రభుత్వాలను ఆదరించాలి. నేను నిన్న చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్, జడ్చర్ల మండల కేంద్రాలలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లక్ష్మారెడ్డి మంగళవారం లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కేసీఆర్‌ను కోరుతానని లక్ష్మారెడ్డి మాట్లాడినట్టు వార్తలు వెలువడ్డాయి. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపాయి. టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ అసహనం వ్యక్తమైంది. (చదవండి: 'జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుంది..') -
అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి
అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి.. నిర్వాసితులకు మేలు చేస్తామని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్‌లో మంపు నిర్వాసితులు చేపట్టిన దీక్ష శిబిరానికి వారు చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. సాక్షి, జడ్చర్ల : అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి.. నిర్వాసితులకు మేలు చేస్తామని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న వల్లూరు, ఉదండాపూర్ ప్రజలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మంగళవారం అక్కడి శిబిరానికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో నిర్వాసిత కుటుంబాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో సేకరించిన భూములకు అతి తక్కువ ధరలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు పనిగట్టుకుని రెచ్చ గొడుతున్నాయని, ఆ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. పునరావాసం, ముంపునకు గురవుతున్న ఇళ్లకు సంబంధించిన ప్యాకేజీ తదితర సమస్యలను చర్చించేందుకు ఓ కమిటీగా ఏర్పడి అసెంబ్లీ వద్దకు రావాలన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ తదితర కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను అందజేసి ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామన్నారు. పోలేపల్లి పరిధిలోని భూములకు రూ.12.5 లక్షలు ఇస్తున్నట్లు వచ్చిన ప్రచారంలో నిజం లేదని, నిబంధనల మేరకే పరిహారం అందుతుందన్నారు. నిర్వాసితులకు బండమీదిపల్లి, శంకరాయపల్లి పరిధిలో ఒక్కో కుటుంబానికి 300 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు. 18ఏళ్లు నిండిన యువకులకు పునరావాసంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. రిజర్వాయర్‌లో చేపలను పట్టుకుని అమ్ముకుని ఉపాధి పొందేందుకు అనుమతి ఇస్తామన్నారు. వారి వెంట జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఆర్డీఓ శ్రీనివాస్, జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
‘న్యాయశాఖ’ జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బిహార్‌లో జరిగిన ఆల్ ఇండియా న్యాయశాఖ ఉద్యోగ సంఘాల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 29 రాష్ట్రాల సంఘాలు ఆ సమావేశానికి హాజరుకాగా, దేశంలోని 78 శాతం సంఘాలు లక్ష్మారెడ్డికి మద్దతు తెలిపాయి. రంగారెడ్డి జిల్లాలోని కుమ్మేర గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 2015 నుంచి జాతీయ న్యాయశాఖ ఉద్యోగుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు -
సమాచార కమిషనర్ నియామకం వివాదాస్పదం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఐలాపురం రాజా నియామకం వివాస్పదంగా మారింది. రాజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లంచ్‌మోషన్‌లో పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్-50లోని క్లాజ్3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని పొన్నవోలు అర్గ్యుమెంట్ చేశారు. సెక్షన్-15 క్లాజ్ 6 ప్రకారం సమాచార కమిషనర్‌గా వ్యాపారస్తులని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని వాదించారు. సేవాదృక్పధం, జ్ఞాన సంపత్తి లేని ఐలాపురం రాజా నియామకాన్ని రద్దు చేయాలని విన్నవించారు. ప్రభుత్వం మారే సమయంలో ఇష్టులకి పదవుల పందేరంలో భాగంగానే ఐలాపురం పేరు సూచించారని ఆరోపించారు. అర్గ్యుమెంట్స్ విన్న తర్వాత విచారణను ఈ నెల 29కి హైకోర్టు వెకేషన్ బెంచ్ వాయిదా వేసింది. అలాగే ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
బాబు ఇంటి ముందు తమ్ముళ్ల తన్నులాట
-
అవయవదాన పత్రంపై లక్ష్మారెడ్డి సంతకం
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదానం చేస్తానని ప్రతిజ్ఞ చేసి సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. మరికొందరు అవయవదానం చేయాలని కూడా ఆయన ప్రోత్సహించడం విశేషం. ఆదివారం లక్ష్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాదేపల్లి పట్టణంలో మెగా రక్తదాన శిబి రం నిర్వహించినట్లు తెలిపారు. 15 ఏళ్లుగా తన పుట్టినరోజున శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. గతంలో 1,220 యూనిట్ల రక్త సేకరణ రికార్డుగా ఉండగా, ఈ ఏడాది 2,120 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. -
ఏపీలో ‘108’ అంబులెన్సుల కొను‘గోల్మాల్’
షాద్‌నగర్‌టౌన్: ఏపీ సీఎం చంద్రబాబు అవినీతి పాలన కొనసాగిస్తున్నారని, ‘108’ అంబులెన్సుల కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయని మాజీమంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరోపించారు. సోమవారం ఇక్కడి టీఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనావ్యవహారాలపై ఇటీవల సీఎం కేసీఆర్ నిజాలు మాట్లాడారని, అవి నచ్చకపోవడంతో ఆంధ్రామంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబుపై ఎన్నో కేసులు ఉన్నాయని, విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకొని చంద్రబాబు బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఒకే నమూనాలో ఉన్న అంబులెన్సులను కొనుగోలు చేశాయని, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో వాహనాన్ని రూ.15 లక్షలకు కొనుగోలు చేస్తే, చంద్రబాబు రూ.20 లక్షల చొప్పున కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు ఆంధ్రా ప్రజల సొమ్మును భారీగా దోచి ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నేతల కోసం తరలించారని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసమే సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ రహిత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారని లక్ష్మారెడ్డి అన్నారు. -
‘108’లోనూ అవినీతి.. తెలంగాణ కంటే 4లక్షలు ఎక్కువ ఖర్చు!!
సాక్షి, షాద్‌నగర్ : 108 వాహనాల కొనుగోళ్లలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ వైద్యాశాఖ తాజా మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరోపించారు. షాద్‌నగర్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఒక్కో 108 వాహనానికి తెలంగాణ ప్రభుత్వం కంటే రూ. నాలుగు లక్షలు ఎక్కువగా పెట్టి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దీని వెనుక అవినీతి జరిగిందని ఆయన తెలిపారు. జన్మభూమి కమిటీలతోనే చంద్రబాబు సర్కార్ అవినీతి మొదలైందని, మహబూబ్‌నగర్‌లో కరువు పేరుతో ప్రపంచబ్యాంకు నిధులను తెచ్చి దోచుకున్న చరిత్ర చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అవినీతిపై ప్రచారం చేస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. -
‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు’
కామారెడ్డి క్రైం: టెక్నాలజీని వాడుకుని ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేయడంతోనే టీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఓటమి ఎదురైనందుకు తాను ఇలా మాట్లాడటం లేదన్నారు. సాంకేతికతపై అవగాహన ఉన్నందునే మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన గంపగోవర్ధన్‌కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. తాను నియోజకవర్గంలో 45 రోజలు పాటు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చే శానన్నారు. అలాగే ప్రజలు అన్నిచోట్ల నుంచి బీజేపీకి ఓట్లు వేశారని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఓట్లు వేసినా ట్యాంపరింగ్ చేయడంతోనే సీట్లు రాలేదన్నారు. లేదంటే ఎన్నికల ప్రచార సమయంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, ఎన్ని సీట్లు వస్తాయో సీఎం కేసీఆర్‌కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రెవెన్యూ, పోలీస్‌శాఖలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేసిందన్నారు. నీతి, నిజాయితీలు, అవినీతి రహిత పాలనే అజెండాగా ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్తామన్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానాన్ని తీసుకువచ్చేలా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, అసెంబ్లీ కన్వీనర్ తేలు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు బాలకిషన్, నాయకులు మహేశ్‌గుప్తా, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం : బాణాల తాడ్వాయి: ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటు లో ఉండి వారి సమస్యలను తీ ర్చేలా కృషి చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అద్యక్షడు బా ణాల లక్ష్మారెడ్డి అన్నారు. తా డ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడి గ్రామంలో శుక్రవా రం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పని చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఏఒక్క గ్రామానికి నిధులు రాలేదని, కేంద్రం నుంచి ఎల్లారెడ్డి నియోజక వర్గానికి 13, 14ఆర్థిక నిధుల క్రింద రూ.157కోట్లు వచ్చాయని తెలిపారు. మోదీ ప్ర భుత్వం భారత దేశంలో ఉన్న ప్రతి గ్రామానికి రూ.కోట్లల్లో నిధులు విడుదల చేస్తే రాష్ట్రప్రభుత్వం తమ నిధులని చెప్పుకుంటున్నదని ఆరోపించారు. ఈ నెల 16న జుక్కల్, 17న బాన్స్వాడ, 18న కామారెడ్డి నియోజక వర్గాలలో సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు మరింత కష్టపడి రాబోయే ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు మర్రి రాంరెడ్డి, నాయకులు వెంకన్న, బాలకిషన్, సురెందర్‌రెడ్డి, రమణారెడ్డి, వెంకట్రావు, సాయిబాబా, నర్సింహారెడ్డి, సతీష్, రవీందర్రావు, ఏడు మండలాల అ«ధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూతు కమిటి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఆరోగ్యశ్రీ’ బంద్ విరమణ
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు ఆందోళనను విరమించాయి. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో మాణిక్‌రాజ్‌తో ఆదివారం జరిగిన చర్చలు సఫలం కావడంతో వైద్య సేవల బంద్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం ప్రకటించిం ది. తక్షణమే వైద్య సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్ ‘సాక్షి’కి తెలిపారు. సీఈవో తమ సమస్యలకు సానుకూలంగా స్పందించారని, ఈ నెలాఖరుకు మరో రూ.150 కోట్లు్ల ఇచ్చేందుకు అంగీకరించారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే రూ.150 కోట్లు చెల్లించినందుకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. బకాయిలు పేరుకుపోవడంతో... ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ పథకాల కింద పేదలు, ఉద్యోగులకు నెట్వర్క్ ఆస్పత్రులు నగదు రహిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయి లు పేరుకుపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. రూ.1200 కోట్ల బకాయిలు ఉండటంతో ఆ రెండు పథకాల కింద లబ్ధిదారులకు వైద్య సేవలను గత నెల 20వ తేదీ నుంచి నిలిపేశాయి. ప్రభుత్వం రూ.150 కోట్ల వరకు విడుదల చేసింది. పూర్తిస్థాయి తీర్చలేదంటూ ఈ నెల 1 నుంచి పూర్తిస్థాయిలో ఇన్‌పేషెంట్, అత్యవసర వైద్య సేవలనూ నిలిపివేశాయి. ఆందోళనలపై సర్కారు ఆగ్రహం ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే, మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయటంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమయం సందర్భం లేకుండా సేవలను నిలిపివేయడంలో రాజకీయ స్వార్థం దాగుందని సర్కారు వర్గాలు అనుమానించాయి. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన పలువురు అధికారులు నెట్వర్క్ ఆస్పత్రుల తీరును ఖండించారు. చివరకు మంత్రి రంగంలోకి దిగి సీరియస్ కావడంతో చర్చలు జరగడం, బంద్ ఉపసంహరించుకోవడం చకచకా జరిగిపోయింది. అత్యవసర వైద్య సేవలను నిలిపేస్తున్న నెట్వర్క్ ఆస్పత్రులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తుండటంతో వాటి యాజమాన్యాల్లోనూ భయాందోళనలు ఏర్పడ్డాయి. చివరకు సంబంధిత ఆస్పత్రుల్లో కొన్నింటికి నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు జరిగాయి. ఈ పరిస్థితిని గమనించిన నెట్వర్క్ ఆస్పత్రులు వెనక్కు తగ్గాయన్న ప్రచారం జరుగుతోంది. -
ప్రతిపక్ష పార్టీలది దొంగల కూటమి
షాద్‌నగర్‌టౌన్: ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేశాయని, ఆ కూటమిలో అందరు దొంగలు ఉన్నారని, మహా కూటమితోనే ఒరిగేదేమీ లేదని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని హాజిపల్లి, కిషన్‌నగర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దొంగల కూటమిలో కాంగ్రెస్, టీడీపీలతో పాటు మరిన్ని పార్టీలు జతకట్టాయని, చంద్రబాబునాయుడు తెలంగాణకు వచ్చి ప్రచారం చేసినా ఒరిగేదేమీ లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబునాయుడు కేంద్ర వాటర్ బోర్డు కమిషన్‌కు లేఖలు రాశారని, ప్రచారానికి వచ్చే ఆయన ఎందుకు ప్రాజెక్టు పనులు ఆపారని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. ఎంత మంది చంద్రబాబునాయుడులు వచ్చినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉంటారని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం పూర్తిగా నిరాధారణకు గురైందన్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలను సీమాంధ్ర ప్రాంత నాయకులు తరలించుకపోయారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టారని చెప్పారు. ఎందరో త్యాగాల పునాదుల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, కొట్లాది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషిచేస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. లక్ష్మిదేవునిపల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని, ఈ పథకంలో భాగంగా కొందుర్గు వద్ద లక్ష్మిదేవునిపల్లి ప్రాజెక్టును నిర్మించేందుకు రూపకల్పన చేసినట్టు మంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి కేసులు వేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి కావాలంటే టీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తీసుకరావాలని ఆయన ప్రజలను కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. టీఆర్ఎస్ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోను తయారు చేసిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని ప్రకటిస్తే.. కాంగ్రెస్ రెండు లక్షల రూపాయలను ప్రకటించిందని, ఇది కాంగ్రెస్ పార్టీ అవివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో ఏ రైతుకూ రెండు లక్షల రూపాయల రుణం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు తెలివితక్కువ దద్దమ్మలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలను వారిని ఏవిధంగా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని, టీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు అందెబాబయ్య, శ్యాంసుందర్‌రెడ్డి, జిల్లెల వెంకట్‌రెడ్డి, సూర్యప్రకాష్, వెంకట్రాంరెడ్డి, లక్ష్మణ్, శోభ, వెంకట్‌రెడ్డి, నరేందర్, రఘునాథ్ యాదవ్, గుళ్లె కృష్ణయ్య, సంజీవరెడ్డి, యుగెందర్, సజ్జల కాశీనాథ్, శ్రీశైలం, చిల్కమర్రి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చల్లారేదెన్నడు ?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వేగంగా దూసుకెళ్లాలని ఉవ్విళ్లూ రుతున్న ‘కారు’కు అసమ్మతి నేతలు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. అసెంబ్లీ రద్దు చేసిన వెనువెంటనే బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లాలని భావించిన టీఆర్ఎస్కు ఈ అంశం మింగుడు పడటం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్, కల్వకుర్తి, షాద్‌నగర్, అలంపూర్ నియోజకవర్గాల్లో అసమ్మతి చిచ్చు రగిలింది. దీంతో జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు టీఆర్ఎస్ ముఖ్యలైన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు జోక్యం చేసుకోవడంతో అసమ్మతి గళం సద్గుమణిగినట్లు కనిపించింది. అయితే ఒక్క అలంపూర్ మినహా మిగతా చోట్ల పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. స్వయంగా పార్టీ అభ్యర్థులకు ఫోన్లు చేసి ‘అసమ్మతి నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రచారంలో నిమగ్నం కావాలి.. ఏ ఒక్క గంటను కూడా వృథా చేయడానికి వీలులేదు. అసమ్మతి నేతలు లేరనుకుని ప్రచారంలో ముందుకు సాగండి’ అంటూ స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులకు కొండంత ధీమా వచ్చినట్లయింది. అభ్యర్థులను మార్చేది లేదు.. విపక్షపార్టీలకు చిక్కకుండా వేగంగా దూసుకెళ్లాలని భావించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు అక్కడక్కడా అసమ్మతి నేతలు బ్రేకులు వేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలంటూ సభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తుండగా.. మరికొన్ని చోట్ల ద్వితీయశ్రేణి నాయకత్వం పార్టీని వీడుతోంది. మక్తల్, కల్వకుర్తిలో అభ్యర్థులను మార్చాలనే డిమాండ్ కొనసాగుతుండగా.. అచ్చంపేట, దేవరకద్ర తదితర చోట్ల ద్వితీయశ్రేణి నేతలు పార్టీని వీడారు. అచ్చంపేట నియోజకవర్గానికి పలువురు కీలక నేతలు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వినికిడి. ఇలా ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని పరిస్థితులు పార్టీ అధిష్టానానికి చికాకు తెచ్చి పెడుతున్నాయి. నష్టనివారణకు... అభ్యర్థుల విషయమై అసంతృప్తి విషయంలో నష్టనివారణ చర్యల కోసం పార్టీకి చెందిన ముఖ్యులు కొంత కాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వంలోని కీలక మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా పలు దఫాలు అసంతృప్తులతో చర్చలు జరిపారు. పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల విషయమై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే టికెట్ ప్రకటించినట్లు నేతలకు సర్దిచెబుతున్నారు. అభ్యర్థుల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న తుది నిర్ణయానికి అందరూ కట్టుబడి పార్టీ కోసం పనిచేయాలని హితబోధ చేశారు. పార్టీలో ఉన్న వారికి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటామని... భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో కొందరు అసమ్మతి నేతలు వెనక్కి తగ్గారు. అయితే, కొన్ని చోట్ల మాత్రం వెనక్కి తగ్గినట్లే తగ్గి.. మళ్లీ నిరసనల గళం వినిపిస్తుండడం గమనార్హం. ఎంపీ జితేందర్‌రెడ్డిపై ఒత్తిడి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈనెల 5న వనపర్తిలో ఎన్నికల ప్రచార సభ ఏర్పాటుచేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానుండగా.. అప్పటి లోగా అసమ్మతి పూర్తిగా తగ్గిపోవాలని ఆదేశాల మేరకు ముఖ్యనేతల సంప్రదింపులు ముమ్మరం చేశారు. మక్తల్ నియోజకవర్గ ం విషయంలో మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసమ్మతి గళం వినిపించే వారందరు కూడా ఎంపీ అనుచరగణంగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యం లో ఆదివారం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సభలో... పార్టీ అభ్యర్థి చిట్టెం రామ్మో హన్‌రెడ్డిపై అసమ్మతినేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. కొందరు ఏకంగా చిట్టెంను వ్యక్తిగతంగా దూషించారు. పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థిపై అసభ్యపదజాలాన్ని ఉపయోగించినా... పార్టీ ముఖ్యులు ఉపేక్షించడంలో మతలబు ఏమిటని చిట్టెం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అలాగే పార్టీ అధిష్టానం నుంచి కూడా ఒత్తిళ్లు పెరుగుతుండడంతో ఎంపీ జితేందర్‌రెడ్డి ఆగమేఘాల మీద సోమవారం మక్తల్ వెళ్లి... అసంతృప్తుల విషయమై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కేసీఆర్ మాటే వేదంగా టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డి విజయానికి అందరూ కృషి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కల్వకుర్తిలో తర్జనభర్జన రాజకీయ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే క ల్వకుర్తి విషయంలో అసమ్మతి వర్గం తర్జనభర్జన పడుతోంది. రాబోయే ఎన్నికలకు పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కసిరెడ్డికి పార్టీ టికెట్ ఇస్తే సులువుగా గెలవొచ్చంటూ వారి అనుచరులు పేర్కొంటున్నా రు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసు కుని ముఖ్యనేతలందరితో సంప్రదింపులు చేసి, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచిం చారు. ఇటీవల నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన బహిరంగసభలో కూడా మంత్రి కేటీఆర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ కసిరెడ్డి వర్గం మాత్రం ససేమిరా అంటోంది. స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగాలని కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నా.. ఆయన వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికీ కసిరెడ్డి వర్గం ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొనకుండా ప్రత్యేక సమావేశాలతో తర్జనభర్జనలు చేస్తుండడం గమనార్హం. -
టీఆర్ఎస్తోనే యువతకు భవిత
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్తోనే యువతకు భవిష్యత్తు ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలతోపాటు యువత కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఇప్పటికే కేజీ టు పీజీ విద్యతోపాటు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల మెరుగు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల యువ నేతలు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్లో చేరారు. లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లల్లో తెలంగాణలో పేదరికం దూరం అవుతుందని, అప్పటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయని, తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి రాష్ట్రం సుభిక్షం గా మారుతుందన్నారు. గతంలో వివిధ పార్టీల్లో ఉన్నందువల్ల యువకులు కొందరు ఉద్యమంలో పాల్గొనలేక పోయారని, అలాంటి వాళ్లంతా ఇప్పుడు టీఆర్ఎస్లో చేరి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్నే గెలిపిద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు. ఒకప్పుడు ఊళ్లకు వెళితే ప్రజలు మాకేమిస్తారని అడిగేవారని, ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులకు డబ్బులు ఎదురు ఇస్తూ, ఓటు వేస్తామని ప్రమాణాలు చేస్తున్నారని, ఏకగ్రీవ తీర్మానాలు చేసి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. 2009లో కేసీఆర్ దీక్ష చేసిన సమయంలో యూ టర్న్ తీసుకుని అనేక మంది ఉసురు పోసుకున్న చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ గుజరాత్ కంటే తెలంగాణలో ఆర్థిక ప్రగతి అద్భుతంగా ఉందంటూ ప్రధాని మోదీ పార్లమెంట్‌లోనే చెప్పారన్నారు. కార్యక్రమంలో నాటక అకాడమీ చైర్మన్ బద్మీ శివకుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాసి పెట్టుకోండి..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. ఈ రోజు నేను అంటున్నానని కాదు.. ఈ మాట రాసి పెట్టుకోండి.. పాలమూరు ప్రాంతంలో టీఆర్ఎస్ విజయ దుదుంభి మోగిస్తుంది. 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరును వెనకబడిన ప్రాంతంగానే ఉంచారు. టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవన్నీ నెరవేరి పాలమూరు ప్రజల తలరాత మారాలంటే మరోసారి టీఆర్ఎస్ను గెలిపించుకోవడం చారిత్రక అవసరం. ప్రజలు కూడా ఇంకోసారి టీఆర్ఎస్, కేసీఆర్‌ను ఆశీర్వదించడం ఖాయం’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అంశాలు ప్రభావితం చూపుతాయి, ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పరిస్థితి, విపక్షాల విమర్శలు, అసంతృప్తి నేతల వేరు కుంపట్లు తదితర అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... వారిది అసమర్థ నాయకత్వం పాలమూరు ప్రాంతం అంటే కరువు, కాటకాలతో సతమతమయ్యేదనే ముద్ర పడింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వెనకబడిన ప్రాంతాల్లో పాలమూరు ఒకటి. ఇలా కావడానికి గత పాలకులే కారణం. ఎందుకంటే పాలమూరులో పుష్కలమైన వనరులు ఉన్నాయి. తలాఫున కృష్ణమ్మ పారుతున్నా... సాగు, తాగునీరు అందించలేని అసమర్థ నాయకత్వం గత పాలకులది.60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని అభివృద్ధిని... టీఆర్ఎస్ కేవలం నాలుగున్నర ఏళ్లలో చేసి చూపించింది. సమస్యలు అధిగమిస్తున్నాం.. విపక్షనేతలకు ఎంతసేపు రాజకీయం చేయాలనే ధ్యాసే తప్ప అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే ఆలోచన లేదు. ఉదాహరణకు ఒక విషయం చెబుతా... పాల మూరులో తీవ్ర వర్షాభావంవల్ల అశించినంతగా సాగు జరగడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన పాలమూరు–రంగారెడ్డిని ప్రారంభించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు వచ్చినప్పు డు ఏం చేయాలి? రాజకీయాలకు అతీతంగా అం దరూ కలిసి మెలిసి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలి. కానీ ప్రతిపక్షాల నాయకులు ప్రతీ చిన్న విషయానికి కోర్టుల్లో కేసులు వేశారు. ఫలితంగా మూడు, నాలుగేళ్లలో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి. అయితే వారు ఎన్ని చిక్కులు సృష్టిస్తున్నా... సీఎం కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తున్నారు. మాటలతో మభ్యపెట్టారు. కాంగ్రెస్ నేతలకు మాటలు తప్ప మరేం చేతకాదు. ప్రాజెక్టులను వాళ్లు 90శాతం పూర్తి చేసినట్లయితే.. పది శాతం పనులే అడ్డంకయ్యాయా? 60 ఏళ్లుగా వాళ్లు ఇలాంటి మోసపూరిత మాటలతోనే మభ్యపెట్టారు. అభివృద్ధి విషయంలో వాళ్లు కళ్లు ఉండి కబోదులు. ఈ రోజు నాగర్‌కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, మక్తల్, దేవ రకద్ర, అలంపూర్, గద్వాల నియోజకవర్గాలకు వెళ్లి చూడమనండి. సాగునీరుతో ఆ ప్రాంత మంతా కోనసీమ మాదిరిగా పచ్చదనంతో కళకళలాడుతోంది. మేం కాదు స్థానిక ప్రజలే చెబుతారు టీఆర్ఎస్ ఏం చేసిందనేది. ఉత్తుత్తి ప్రచారమే.. పాలమూరు టీఆర్ఎస్ బలహీనంగా ఉందనేది ఉత్తి ప్రచారం మాత్రమే. ప్రస్తుతం పాలమూరు ప్రాంతంలో టీఆర్ఎస్కు.. కాంగ్రెస్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక్క విషయం చెప్పాలంటే ... పాలమూరులో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి. ఆ పార్టీ అభ్యర్థులకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో విపక్షాలు ఒకటి, రెండు స్థానాలు గెలిస్తే గగనమే. టీఆర్ఎస్ స్వీప్ చేయడం ఖాయం. ఓర్వలేక ఒకటయ్యారు.. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఒక్కటవుతున్నారు. వారికి జెండా లేదు అజెండా లేదు. వారి చేస్తున్న ప్రయత్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. విపక్షాలన్నీ వంద మందితో కలిసి వచ్చినా... టీఆర్ఎస్ సింహం సింగిల్‌గా ఎదుర్కొంటుంది. ఈ ఎన్నికలు మహాభారతంలో కౌరవ, పాండవుల యుద్ధం లాంటిది. అంతిమంగా న్యాయమే గెలిచి తీరుతుంది. అసంతృప్తి సహజం ఏ రాజకీయపార్టీలోనైన కాస్త అసంతృప్తి సహ జమే. అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు కదా. అంతెందుకు చేతికి ఉండే ఐదు వేళ్లు ఒకలా ఉండవు. పార్టీలో ఉండే వ్యక్తలు అందరూ ఒకలా ఆలోచించాలనేది గ్యారంటీ ఉండదు. కనుక ఒకటి, రెండు చోట్ల అభ్యర్థుల విషయంలో అసంతృప్తి సహజంగాగా బయట పడుతోంది. ఇప్పటికే అసంతృప్తులతో సంప్రదింపులు చేశాము. అన్ని కూడా ఒకట్రెండు రోజుల్లో ఓ కొలిక్కి వస్తాయి. అందరూ పార్టీకి పనిచేస్తారు ప్రస్తుతం కొందరు అభ్యర్థులపై ఉన్న అసంతృప్తి టీ కప్పులో తుఫాను వంటిది. దీనిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో మార్పు ఉండదు. ఇది ఫైనల్ అని ఇదివరకే పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడ మరో ప్రశ్నకు తావే లేదు. ప్రకటించిన అభ్యర్థులే బరిలో ఉంటారు. అసంతృప్తి కూడా సద్గుమణుగుతుంది. ఆ తర్వాత అందరు కూడా పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేస్తారు. కనీవినీ రీతిలో అభివృద్ధి జడ్చర్ల నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా కనివినీ ఎరుగని విధంగా అభివృద్ధి పథంలో నడుస్తోంది. నియోజకవర్గంలోని గ్రామాలన్నింటికీ బీటీ రోడ్లు వేశాం. నియోజకవర్గ కేంద్రంలో డివైడర్‌తో కూడిన రెండు లేన్ల రహదారి నిర్మించాం. తాగునీటికి ఎంతో ఇబ్బంది ఉండే బాదేపల్లి, జడ్చర్ల పట్టణాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు ఇస్తున్నాం. అంతేకాదు నా హయాంలోనే జడ్చర్లకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటై అభివృద్ధి చెందింది. జడ్చర్ల నుంచి గతంలో ఎందరో ప్రాతినిధ్యం వహించినా ఎవరు కూడా నేను చేసినంత అభివృద్ధి చేయలేదు. ఆస్పత్రులన్నీ బలోపేతం చేశా.. వైద్య ఆరోగ్యశాఖ నాదే కావడంతో ఒక్క నా నియోజకవర్గమే కాదు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులన్నీ బలోపేతం చేశాను. జిల్లాల పునర్విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి జిల్లా ఆస్పత్రిని అత్యంత వెనకబడిన నారాయణపేటకు కేటాయించాల్సి వచ్చింది. అందుకే నా నియోజకవర్గమైన జడ్చర్లలోని అన్ని పీహెచ్‌సీలను 30 పడకల ఆస్పత్రులుగా మారుస్తానని చెప్పా ను. అందుకు అనుగుణంగా బాలానగర్‌లోని పీహెచ్సీ 30 పడకలు పనులు పూర్తయ్యా యి. నవాబుపేట, మిడ్జిల్‌లో పనులు చురు గ్గా సాగుతున్నాయి. ఒక రాజాపూర్‌లో మా త్రమే అవసరం లేదని చేపట్టడంలేదు. ఎం దుకంటే రాజాపూర్ మండలం అటు బాలానగర్, ఇటు జడ్చర్లకు అతి చేరువలో ఉంది. జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రిని కూడా ఎన్నికల నాటికి పూర్తి చేస్తాం. ఇక ఫైర్‌స్టేషన్‌కు సంబంధించి పనులు కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు సాధించగా.. స్థలసేకరణ కూడా పూర్తయ్యింది. అది సాధ్యమైనంత త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. -
మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
జడ్చర్ల: తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష్మారెడ్డి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని విమర్శిస్తూ తీవ్రపదజాలం వాడారు. ప్రభుత్వ వాహనాలు వాడుకుంటూ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి నియోజకవర్గం జడ్చర్లలో వంద పడకల ఆసుపత్రి మాటలకే పరిమితమైపోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో కూడా కనీస వైద్య సౌకర్యాలు లేవని, జడ్చర్ల నియోజకవర్గానికి లక్ష్మారెడ్డి చేసింది శూన్యమని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో లక్ష్మారెడ్డిని ఓడించి మల్లు రవిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తే లేదని, అక్కడి నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. -
లక్ష మందికి కంటి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘కంటి వెలుగు’కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు దాదాపు లక్ష మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వేలాది మందికి కళ్లజోళ్లు ఇచ్చారు. కొందరికి మాత్రలు ఇవ్వగా, మరికొందరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. కంటివెలుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 824 శిబిరాల్లో ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో 561, పట్టణ ప్రాంతాల్లో 109, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 158 శిబిరాలు ప్రారంభమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి వరకు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో ‘కంటి వెలుగు’పథకాన్ని తొలుత లాంఛనంగా ప్రారంభించారు. కొంతమందికి కళ్లద్దాలను అందజేశారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మరికల్లో కంటి శిబిరాన్ని ప్రారంభించారు. కళ్లజోళ్లు, మందులు ఉచితంగా అందజేశారు. కంటిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో అనేకమంది వృద్ధులు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకోవడంతో పండగ వాతావరణం నెలకొందని మంత్రి లక్ష్మారెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’తో అన్నారు. మొదటిరోజు కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైందని, ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుందని వారు వివరించారు. -
సీజనల్ వ్యాధుల నివారణకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఏజెన్సీకి ఫీవర్’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులు సిద్ధం చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, గతంలోలాగే అధికారులు, వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించామని మంత్రి చెప్పారు. వైద్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉంద న్నారు. ఈ సీజన్లో సాధారణం గా డెంగీ, స్వైన్‌ఫ్లూ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, వైరల్ హెపటైటిస్ (జాండీస్), విరేచనాలు, వాంతులు, డిప్తీరియా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయని, వైరల్, సీజనల్ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకని ఇలాంటి వ్యాధి లక్షణాలు కనిపించిన వారు వెంటనే సమీప ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళాలని సూచించారు. ఈ సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి, ప్రజలకు సత్వర వైద్యం అందడానికి వీలుగా వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులతో సిబ్బంది, డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ల్యాబ్ టెస్టులు చేయడానికి స్టాఫ్, కిట్లు, ఓపీలోనూ తగు సదుపాయా లు, ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ సిద్ధం చేశామన్నారు. దోమలు పెరగకుండా, నీళ్ళు నిల్వ ఉండకుండా, బురద, మురుగునీరు చేరకుండా, పారిశుద్ధ్యం సరిగా ఉండేలా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ వంటి శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి... ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఇప్పటికే మాట్లాడామన్నారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో చర్చించామన్నారు. ప్రజల్లో వ్యాధుల పట్ల అవగాహన, చైతన్యం పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్యశాలల్లోనూ సదుపాయాలు, మందులు, పరికరాలు పెంచామని, అనేక మంది స్పెషలిస్టు డాక్టర్లను కూడా నియమించామని, దీంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఇప్పుడిప్పుడే సీజనల్ వ్యాధు లు వస్తున్నాయని, వీటిని మొగ్గలోనే తుంచే విధంగా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రాథమిక దశలోనే వైద్యశాలలకు చేరితే ఎలాంటి ప్రమాదాలుండవన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి తదితరులతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. -
పారదర్శకంగా పోస్టింగులు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైద్య విధాన పరిషత్ సహా మిగతా విభాగాల్లో కొత్తగా ఎంపిౖMðన అభ్య ర్థులకు పోస్టింగ్‌ల కేటా యింపుల్లో పారదర్శకత పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా పోస్టింగులు ఇవ్వాలని సూచించారు. చరిత్రాత్మకంగా వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 1,133 పోస్టుల నియామకం చేపట్టగా, అందులో 919 పోస్టులు భర్తీ చేశామని, వారికి త్వరలో పోస్టింగ్‌లు కేటాయించాలని కోరారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంకా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియలో కూడా వేగం పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఏయే స్పెషాలిటీ డాక్టర్ల అవసరం ఉందో గుర్తించి, ఆయా చోట్ల వారిని నియమించాలని ఆదేశించారు. ప్రజా వైద్యానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. కేసీఆర్ కిట్ల పథకంతో సర్కారీ దవాఖానాల్లో కాన్పుల సంఖ్య పెరిగినందున వాటిని దృష్టిలో పెట్టుకొని, ఎనస్థీసియా, స్త్రీ వ్యాధులు, ప్రసూతి నిపుణులను నియమించాలన్నారు. అలాగే ఇప్పటికే ప్రకటించిన, వివిధ స్థాయిల్లో ఉన్న నియామకాల ప్రక్రియల మీద కూడా మంత్రి సమీక్షించారు. -
నాడు పశువుల కాపరి నేడు పేదల వైద్యుడు
కృషి ఉంటే మనుషులు రుషులవుతారని అంటారు. లక్ష్మిరెడ్డి డాక్టర్ అయ్యారు. ఇరవై ఏళ్ల క్రితం పశువుల కాపరిగా ఉన్న లక్ష్మిరెడ్డి నేడు సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా మార్కాపురం ఏరియా వైద్యశాలలో ప్రభుత్వ వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. మార్కాపురం మండలంలోని బిరుదులనరవ గ్రామంలో 1979లో పగడాల వెంకటరెడ్డి, సుబ్బమ్మలకు జన్మించిన డాక్టర్ లక్ష్మిరెడ్డి విద్యాభ్యాసం ఒకటి నుంచి నాల్గవ తరగతి వరకు దోర్నాల మండలం చిన్నదోర్నాలలోని వేమన విద్యాలయంలో జరిగింది. ఆరు నుంచి పది వరకు మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం హైస్కూల్లో జరిగింది. లక్ష్మిరెడ్డి టెన్త్‌లో ఫెయిల్ కావటంతో తల్లిదండ్రులు అతడికిక చదువు రాదని నిర్ణయించుకుని పశువులను మేపేందుకు పొలాలకు పంపారు. ఏడాది పాటు పశువుల కాపరిగా ఉన్న లక్ష్మిరెడ్డి ఇదే తన జీవితం కాదని, టెన్త్ పాస్ కావాలని నిశ్చయించుకున్నాడు. ఇన్స్టెంట్ పరీక్ష రాసి పాసయ్యాడు. మార్కాపురం ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలలో ఇంటర్ చేరేందుకు వెళ్లగా టెన్త్ను ‘ఎట్ ఎ టైమ్’ పాస్ కాకపోవడంతో సీటు ఇవ్వలేమని చెప్పారు. దీనితో నల్లగొండలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరాడు. మళ్లీ రెండవ సంవత్సరం బేస్తవారిపేటలో చదివాడు. ఎంసెట్ లో 1600 ర్యాంక్ రావటంతో తిరుపతి వెటర్నరీ కళాశాలలో చేరాడు. దాంతో సంతృప్తి చెందని లక్ష్మిరెడ్డి మెడికల్ సీటు సాధించాలనే పట్టుదలతో మళ్లీ ఎంసెట్ రాశారు. ఈసారి 229వ ర్యాంక్ రావటంతో కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆయన పట్టుదల అక్కడితో ఆగిపోలేదు. ఎంబీబీఎస్‌లో కూడా టాపర్‌గా నిలిచారు. తిరుపతి స్విమ్స్‌లో డయాబెటిస్‌లో కోర్సు పూర్తి చేశారు. 2007లో దూపాడులో వైద్యాధికారిగా విధుల్లో చేరారు. అప్పటికీ వైద్య వృత్తిలో ఇంకా ఏదో సాధించాలనే తపనతో పీజీ కోసం పరీక్ష రాశారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంఎస్‌లో సీటు వచ్చింది. కోర్సు పూర్తయిన అనంతరం 2015లో మార్కాపురం ఏరియా వైద్యశాలలో జనరల్ సర్జన్‌గా నియమితులయ్యారు. ఈ మూడేళ్ల కాలంలో లక్ష్మిరెడ్డి సుమారు రెండు వేల మైనర్ ఆపరేషన్లు, వెయ్యి మేజర్ ఆపరేషన్లు చేశారు. ఏ డాక్టర్ వద్దకు వెళ్లినా ఓపీ ఫీజు వందా, నూటాయాభై రూపాయలు ఉన్న ఈ రోజుల్లో పట్టణంలో ప్రజా వైద్యశాలను స్థాపించి ముప్పై రూపాయలు మాత్రమే తీసుకుంటూ పేదల డాక్టర్‌గా గుర్తింపు పొందారు లక్ష్మిరెడ్డి. నిరాశా నిస్పృహలు వద్దు ఎంసెట్‌లో మొదటి ప్రయత్నంలో మెడికల్ సీటు కోల్పోవటంతో ఇంటికి వచ్చేశా. అదే సమయంలో ‘నారాయణ’ విద్యా సంస్థల చైర్మన్ నాకు స్వయంగా ఫోన్ చేసి ఉచితంగా కోచింగ్ ఇప్పించడంతో రెండో ప్రయత్నంలో మెడికల్ సీటు సాధించా. దీనితో నా కల నెరవేరింది. పేదలకు మంచి వైద్యం అందించటమే నా లక్ష్యం. కృషి, పట్టుదల, శ్రమ ఉంటే సాధించలేనిదేమీ లేదు. ఇటీవల కాలంలో ఎంసెట్‌లో, నీట్లో ర్యాంక్‌లు రాలేదని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం చూస్తుంటే బాధ కలుగుతోంది. నిరాశ, నిస్పృహల్ని దగ్గరకు రానివ్వద్దు. పట్టుపట్టి చదివితే విజయం సాధించి తీరుతాం. అందుకు నేనే ఉదాహరణ. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో మా సొంత ఊరెళ్లి తల్లిదండ్రులకు పొలం పనుల్లో సహాయం చేస్తుంటా. నాకు అది తృప్తినిస్తుంది. – డాక్టర్ లక్ష్మిరెడ్డి – జి.ఎల్.నరసింహారావు, సాక్షి, మార్కాపురం -
‘కళ్ల దానమే అంధత్వ నివారణకు మార్గం’
సాక్షి, హైదరాబాద్ : కళ్ల దానమే అంధత్వ నివారణకు మార్గమని ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అవయవదానానికి అందరూ ముందుకు రావాలని కోరారు. బుధవారం సరోజనీ కంటి ఆస్పత్రిలో ఐ బ్యాంక్‌ను, నేత్రాల సేకరణకు రూ.కోటి విలువ చేసే అత్యాధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐ బ్యాంక్ ఏర్పాటుతో సేకరించిన కార్నియాను రెండు నెలలవరకు నిల్వ ఉంచవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద అంతా కలిసి ముందుకు వస్తే సర్కార్ ఆస్పత్రులను అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. -
వేగంగా ఎయిమ్స్ ప్రక్రియ: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి మంజూరైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోందని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతర సంప్రదింపులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు త్వరితగతిన స్పందిస్తున్నారని చెప్పారు. అనుకున్న సమయానికి కంటే ముందుగానే కేంద్ర బృందం గురువారం రాష్ట్రానికి వచ్చిందని, బీబీనగర్‌లోని ప్రతిపాదిత ఎయిమ్స్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిందని తెలిపారు. వీలైనంత త్వరగా ఎయిమ్స్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. -
సుందర నగరానికి సహకరించాలి
కరీంనగర్‌కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్‌ను సోమవారం కోర్టు చౌరస్తాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్ పరిశుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే నగరానికి స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేయడం ద్వారా నైట్ స్వీపింగ్ కార్మికులకు భారం తగ్గుతుందని, ప్రధాన రహదారుల్లో ప్రమాదాలను నియంత్రించొచ్చని పేర్కొన్నారు. రహదారులు పరిశుభ్రంగా ఉంటే నగరం సుందరంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ సుందర నగరం కోసం సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం నగరంలోని 35వ డివిజన్ సప్తగిరికాలనీలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి చేపట్టనున్న రూ.2.4కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత చిన్న సుందర నగరంగా కరీంనగర్‌కు గుర్తింపు ఉందని, కరీంనగర్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్ కవితబుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిపాపై ఆందోళన చెందవద్దు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కేరళను వణికిస్తున్న నిపా వైరస్‌పై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. నిపా వ్యాధికి టీకాలు లేవని నివారణ ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నిపా వ్యాధి నిర్ధారణ పరీక్షల అవగాహనకు వచ్చిన మంత్రి.. ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ)తో, మణిపాల్‌లోని మణిపాల్ సెంటర్ ఫర్ వైరాలజీ, రీసెర్చ్(ఎంసీవీఆర్)తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధాన వైద్యశాలల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ఐపీఎం ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రజల్లో చైతన్యంతో ఇలాంటి వ్యాధులను అదుపు చేయడం, నివారించడం సాధ్యమన్నారు.