వాళ్లిద్దరినీ బర్తరఫ్ చేయండి: చాడ | Chada venkat reddy slams Telangana leaders | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరినీ బర్తరఫ్ చేయండి: చాడ

Published Thu, Jul 28 2016 8:23 PM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM

వాళ్లిద్దరినీ బర్తరఫ్ చేయండి: చాడ - Sakshi

వాళ్లిద్దరినీ బర్తరఫ్ చేయండి: చాడ

యాదగిరిగుట్ట(నల్లగొండ): ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన విద్య, ఆరోగ్యశాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. లీకేజీ వీరులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.

ఎంసెట్-2 పరీక్షల్లో నిజమైన ర్యాంకర్లకు అన్యాయం జరగకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. ఎంసెట్ రద్దు చేస్తున్నామని వస్తున్న వార్తలతో విద్యార్థులు మనోవేదన చెందుతున్నారని వారికి చదువుపై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ల పేరుతో విద్యార్థులను తప్పు దారి పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement