'ఎంసెట్-3 రాసేందుకు అందరూ అర్హులే'
Published Wed, Aug 3 2016 6:16 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
హైదరాబాద్ : ఎంసెట్-3 పరీక్ష రాసేందుకు అందరూ అర్హులేనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఎంసెట్-2 రాసినవారంతా ఎంసెట్-3 పరీక్ష రాసేందుకు అర్హులేనన్నారు. పేపర్ లీక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఎంసెట్-3 రాసేందుకు అనుమతిస్తామన్నారు.
ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ఎంసెట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీలో విద్యార్థుల ప్రమేయం ఇంకా నిర్థారణ కాలేదన్నారు. అయితే తప్పు చేసినవారిపై చర్యలు తప్పవని కడియం శ్రీహరి హెచ్చరించారు. సీఐడీ నివేదిక రాగానే ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. విద్యా వాలంటీర్ల నియామకం 80 శాతం పూర్తయిందని కడియం శ్రీహరి తెలిపారు. కాగా ఎంసెట్-3 సెప్టెంబరు 11న జరుగుతుంది.
Advertisement