సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సర ద్వితీయ భాష పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలు రాసేందుకు 4,82,360 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 4,61,516 మంది హాజరయ్యారు. 20,844 మంది (4.32 శాతం) గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. వికారాబాద్, కరీంనగర్, సూర్యాపేట్‌లో మూడు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయినట్లు తెలిపింది.
రేపటి నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు..
మార్చి 2 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ద్వితీయ సంవత్సర పరీక్షల్లో భాగంగా మొదటి రోజు ద్వితీయ భాష పరీక్ష ఉంటుందని పేర్కొంది.
ఆ పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు: కడియం
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దూరప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బందోబస్తు కల్పించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా ముందే కేంద్రాల వద్ద ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పరీక్షల సమయంలో కేంద్రాలకు సమీపంలో ఉండే జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం
Published Thu, Mar 1 2018 3:28 AM | Last Updated on Thu, Mar 1 2018 3:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment