సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కొని ఉత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. విద్యార్థులు ఒత్తిడిని తట్టుకునేందుకు, వార్షిక పరీక్షను విజయవంతంగా రాసేందుకు ఉపయుక్తమైన ఫస్టియర్ స్టడీమెటీరియల్‌ను మంత్రి మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రం, చరిత్ర స్టడీ మెటీరియల్‌ను ‘టీఎస్‌బీఐఈ’వెబ్‌సైట్‌లో పొందొచ్చని తెలిపారు. కోవిడ్ కారణంగా ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతికి పంపిన విషయం తెలిసిందే. వారికి ద్వితీయ సంవత్సరం మధ్యలో గత వార్షిక పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో 50%చాయస్ ఇస్తూ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment