సాక్షి, హైదరాబాద్: రెండేళ్లపాటు కరోనా కారణంగా పీయూసీలో తక్కువ జీపీఏ వచ్చినందున.. మానవతా దృక్పథంతో బీటెక్‌లోకి అనుమతించాలని బాసర ట్రిపుల్ ఐటీలో చదివిన పలువురు విద్యార్థులు విద్యా మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని కలిసి వేడుకున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చా మని తమ పరిస్థితిని వివరించారు.
టెన్త్‌లో అత్య« దిక మార్కులు వస్తేనే బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుందని ప్రభుత్వానికీ తెలుసునని వారు స్పష్టం చేశారు. పీయూసీలో గ్రేడ్ తక్కువ రావడానికి రెండేళ్లుగా ఉన్న పరిస్థి తులే కారణమని గుర్తించకపోవడం సరికాదని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారని, తమ కుటుంబాల్లో సెల్‌ఫోన్ కూడా కొనలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులు చేసి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చినా నెట్ బ్యాలెన్స్‌కు ఖర్చు పెట్టలేకపోయామని వారు తెలిపారు. నెట్‌వర్క్ సరిగ్గా పనిచేయని పల్లెల్లో ఉండటం వల్ల ఆన్లైన్ క్లాసులు సరిగా వినలేకపోయామనినిజామాబాద్‌కు చెందిన విద్యార్థిని ఎం.అంజలి వాపోయింది. విద్యార్థుల ఆవేదనపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫె సర్ ఆర్.లింబాద్రి స్పందిస్తూ వెంటనే విషయాన్ని బాసర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
విద్యా ర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ విషయమై బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకట రమణ స్పంది స్తూ, 6 జీపీఏ లేకుండా ఇంజనీరింగ్‌లోకి అనుమ తించకూడదనే నిబంధన ఉందని స్పష్టం చేశా రు. అయినప్పటికీ ఈ విషయాన్ని బోర్డ్ సమా వేశంలో చర్చిస్తామని, సానుకూల నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment