విద్యార్థుల భద్రతపై సమావేశం | Professor R Limbadri Meeting On Students Safety In Telangana | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భద్రతపై సమావేశం

Published Wed, Dec 21 2022 1:10 AM | Last Updated on Wed, Dec 21 2022 10:36 AM

Professor R Limbadri Meeting On Students Safety In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యాసంస్థల్లో విద్యార్థులకు భద్రత, రక్షణ వ్యవస్థ ఏర్పా టుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నట్టు మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా జరిగే ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్‌ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ,

కాలేజీ విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, అదనపు డీజీ స్వాతిలక్రా సహా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులు పాల్గొంటారని ఆయ న తెలిపారు. కళాశాలల్లో చేరే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవ్వకుండా, సైబర్‌ నేరాలకు ఆకర్షితులవ్వకుండా, వివిధ కారణాల వల్ల ఆత్మన్యూనత భావానికి లోనవ్వకుండా ఏ తరహా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement