Sabitha indra reddy
-
Akshainie Reddy: నానమ్మ గురించి రాస్తా...
పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల్ల అమ్మాయి గురించి కథ రాస్తే ఎలా ఉంటుంది?! ఏడవతరగతి చదువుతున్న పన్నెండేళ్ల పట్లోళ్ల అక్షయినీ రెడ్డి రాసిన ‘ట్రైల్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్’ పుస్తకం ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలు అక్షయినీ రెడ్డి.‘‘మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో రోజూ చూస్తుంటాను. నానమ్మ, అమ్మ, నాన్న.. మా ఇంట్లోని వ్యక్తులే నాకు స్ఫూర్తి. నానమ్మ లైఫ్ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను...’ అంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.‘‘నాకు కథలపైన ఆసక్తి మొదలైందంటే అమ్మ చెప్పిన స్టోరీస్ వల్లే. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ రకరకాల కథలు చెబుతుంటుంది. తముణ్ణి, నన్ను బయటకు తీసుకెళ్లినప్పుడైనా, కాస్త టైమ్ దొరికినా ఏదో చిట్టి కథ ఉంటుంది. సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కథలు చెప్పి, వాటిని షార్ట్ ఫార్మ్‌లో రాసి చూపించమనేది. తర్వాత్తర్వాత పుస్తకాల్లోని కథలు చదివినా, వాటిని ఒక చిన్న పేరాలో రాసి చూపించేదాన్ని. ఈ అలవాటు నాకు పుస్తకాలంటే ఇష్టం పెరిగేలా చేసింది. ఇప్పుడు నా కోసం ఇంట్లో ఓ లైబ్రరీయే ఏర్పాటు చేశారు. ఎక్కువ భాగం ఇంగ్లిష్వే ఉంటాయి. ఫారినర్స్ రాసినవి, సుధామూర్తి రచనలు బాగా చదువుతాను. ఒక బుక్ చదివాక బాగా నచ్చితే ఆ బుక్ నుంచి మరొక స్టోరీ రాస్తాను. ‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ పుస్తకం అలా రాసిందే. నానమ్మ, నాన్న, అమ్మ, స్కూల్లో టీచర్స్, ఫ్రెండ్స్.. చాలా మెచ్చుకున్నారు.బలమైన వ్యక్తిత్వం‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ బుక్ లో పదహారేళ్ల అమ్మాయి పేరు ఆటమ్. ఆమె భావోద్వేగాలు ఈ పుస్తకం నిండా ఉంటాయి. ఒక చిన్న వెకేషన్ కోసం తల్లిదండ్రులను ఒప్పించి మెక్సికోకు బయల్దేరుతుంది. అనుకోని సంఘటనలో తల్లి మరణిస్తుంది. తమ కుటుంబం నుంచి దూరమైన ఆంటోనియోను కలుసుకుంటుంది. క్షేమకరం కాని ఆ ్రపాంతంలో ఉండలేక మెక్సికో నుంచి వాళ్లు లండన్‌కు చేరుకుంటారు. అక్కడ జేమ్సన్ అనే వ్యక్తిని కలుస్తారు. జేమ్సన్ కుటుంబంతో ఉండటమూ క్షేమకరం కాదని అర్థమై తండ్రి, ఆంటోనియోలతో కలిసి జర్మనీకి వెళ్లిపోతుంది. జీవితమెప్పుడూ సంతోషంగా ఉండాలనుకునే ఆటమ్ ప్రతినిత్యం సమస్యలతో చేసే ప్రయాణం గురించి ఈ కథ వివరిస్తుంది. ఆ అమ్మాయి స్నేహాలను ఎలా డెవలప్ చేసుకుంటుంది, ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది, ఒకమ్మాయి ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనే విషయాలు నేర్పిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే హ్యాపీ ఎండింగ్ తప్పక దొరుకుతుంది అనే హోప్‌ని ఇస్తుంది. నా ఫ్రెండ్స్ టైటిల్ విషయంలో, కవర్ పేజీ విషయంలో సాయం చేశారు. ఈ బుక్ కోసం ఏడాది పాటు వర్క్ చేశాను. నిజానికి 16 ఏళ్ల అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అనే విషయాలను గురించి అంతగా మ్యాచ్ చేయలేకపోవచ్చు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ బుక్స్ బాగా చదువుతారు. వారికి ఈ పుస్తకంలో స్నేహపూర్వక స్వభావం, స్ట్రాంగ్ విల్‌పవర్, వ్యక్తిత్వం బాగా నచ్చాయి. నా ఫ్రెండ్స్‌కు నేను రాసిన స్టోరీ నచ్చింది. నా ఫ్రెండ్స్ ఈ బుక్ కొని చాలా సపోర్ట్ చేశారు. స్కూల్లో అందరూ నన్ను అభినందించారు. కొందరు మంచి విమర్శలు కూడా చేశారు.ఎంతో నేర్చుకోవాలి...రచనలు చేయడంలో చాలా నేర్చుకోవాల్సి ఉందని నాకు ఈ పుస్తకం ద్వారా తెలిసి వచ్చింది. వచ్చిన విమర్శల నుంచి కూడా నేర్చుకుంటున్నాను. స్టోరీలో ఒక పాత్రను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఆ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయాలి, స్టోరీ ΄్లాట్ ఎలా రాయాలి.. వంటివి నేర్చుకోవాలి. ఇదంతా తెలుసుకుంటూనే నా రచనల్లో వాటిని ఇంక్లూడ్ చేస్తూ వెళ్లాలని ఉంది. ముఖ్యంగా మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో చూస్తుంటాను. నానమ్మ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను. అందుకు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. మంచి రైటర్‌గా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పేరుతెచ్చుకుంటూనే లాయర్ని అవ్వాలనే లక్ష్యంతో చదువుకుంటున్నాను. లాయర్‌గా న్యాయం కోసం పోరాటం చేస్తూనే, నా రచనల ద్వారా కొంతమందినైనా ప్రభావితం చేయాలనేది నా ముందున్న లక్ష్యం’’ అంటూ తెలిపింది ఈ బాల రచయిత్రి. టైమ్ క్రియేషన్ఈ బుక్ రిలీజ్ అయ్యాక మా ఫ్రెండ్స్‌తో సహా కొంతమంది నీకు టైమ్ ఎలా సరిపోతుంది అని అడిగారు. నేను టైమ్‌ను క్రియేట్ చేసుకున్నాను. రోజులో ఒక గంటసేపు ఈ బుక్ కోసం కేటాయించుకున్నాను. మొత్తం ఇరవై ఐదు వేల పదాలు. నేనే స్వయంగా టైప్ చేసి, ఎడిటింగ్ చేసుకుంటూ, తిరిగి మార్పులు చేసుకుంటూ రాశాను. దీనిని బుక్‌గా తీసుకురావడానికి అమ్మవాళ్లకు చెప్పకుండానే నలుగురు పబ్లిషర్స్‌తో మాట్లాడాను. వాళ్లు ఆశ్చర్యపోయారు. పబ్లిషర్స్ అమ్మ వాళ్లను అ్రపోచ్ అవడంతో... ఈ పని ఈజీ అయ్యింది. – నిర్మలారెడ్డిఫొటోలు: గడిగె బాలస్వామి -
రేవంత్.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా?: సబిత సీరియస్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గమనిస్తుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇదే సమయంలో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాను అంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ట్విట్టర్ వేదికగా..‘రేవంత్ రెడ్డి గారు ఆత్మ అభిమానం కన్నా మించిన ఆస్తి లేదని నమ్ముతున్న వ్యక్తిని నేను. మీ ముందు కానీ మరి ఇంకెవరు ముందులో కానీ 'పేద ఏడుపులు' ఏడ్చిన సందర్భం నాకు ఆ దేవుడు కలిగియలేదు. మిమ్మల్ని, మీ మాట తీరుని ఈ తెలంగాణ సమాజం గమనిస్తుంది, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.రేవంత్ రెడ్డి గారు ఆత్మ అభిమానం కన్నా మించిన ఆస్తి లేదని నమ్ముతున్న వ్యక్తిని నేను. మీ ముందు కానీ మరి ఇంకెవరు ముందులో కానీ 'పేద ఏడుపులు' ఏడ్చిన సందర్భం నాకు ఆ దేవుడు కలిగియలేదు. మిమ్మల్ని, మీ మాట తీరుని ఈ తెలంగాణ సమాజం గమనిస్తుంది, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. Cont— Sabitha Reddy (@BrsSabithaIndra) October 3, 2024మా అబ్బాయి కడుతున్న 'ఇల్లు' మినాయించి, మిగతా మూడు 'ఫామ్ హౌస్ లు' ఎక్కడున్నాయి అనే వివరాలు ప్రజల ముందు పెట్టండి. మీరు ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాను అంటూ’ కామెంట్స్ చేశారు. మా అబ్బాయి కడుతున్న 'ఇల్లు' మినాయించి, మిగతా మూడు 'ఫామ్ హౌస్ లు' ఎక్కడున్నాయి అనే వివరాలు ప్రజల ముందు పెట్టండి. మీరు ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాను.— Sabitha Reddy (@BrsSabithaIndra) October 3, 2024ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
వాళ్లు ఆడబిడ్డలు కాదా.. మంత్రి కొండా సురేఖకు సబిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కౌంటరిచ్చారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి.@IKondaSurekha సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. @KTRBRS గారి గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. Cont— Sabitha Reddy (@BrsSabithaIndra) October 2, 2024మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ గారి అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించినారా? బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడటం బాధాకరం’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ గారి అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించినారా? బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడటం బాధాకరం.— Sabitha Reddy (@BrsSabithaIndra) October 2, 2024ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
హైడ్రా బాధితుల తరఫున కొట్లాడుతాం: బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కూల్చివేతల పేరుతో బుల్డోజర్లు వస్తే.. వాటికంటే ముందు తాము వస్తామని భరోసా ఇస్తోంది బీఆర్ఎస్. శనివారం మధ్యాహ్నాం తెలంగాణ భవన్లో మూసీ సుందరీకరణ బాధితులతో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు.ఈ భేటీలో పలువురు కూల్చివేతలతో తమకు జరుగుతున్న నష్టం గురించి కంటతడి పెట్టుకున్నారు. ‘‘కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. బాధితుల వద్దకు బుల్డోజర్లు వెళ్తే వాటికంటే ముందు మేము వస్తాం. ఈ ప్రభుత్వంతో మీ తరఫున మేం కొట్లాడుతాం. అధైర్యపడొద్దు’’ అని బీఆర్ఎస్ నేతలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.కేటీఆర్‌కు జ్వరం తెలంగాణ భవన్‌కు వస్తున్న హైడ్రా బాధితులకు అండగా నిలవాని పార్టీ నాయకులకు, శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట కేటీఆర్ సూచించారు. గత రెండ్రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ్టి తెలంగాణ భవన్‌కు వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. హైడ్రా బాధితులకు అండగా పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుందని తెలిపారాయన.Down with fever, cough and heavy cold since 36 hours. Taking Anti viral, antibiotics, anti histamine as per doctor instructions Hopefully will be better soon Meanwhile, our @BRSparty MLAs and senior leaders along with legal team will support the demolition victims who are…— KTR (@KTRBRS) September 28, 2024ఇక.. హైడ్రా బాధితుల కోసం బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటనకు సిద్దమైంది. ఆదివారం ఉదయం బాధితుల వద్దకే బీఆర్ఎస్ బృందం వెళ్లనుందని సమాచారం. ఈ బృందంలో కేటీఆర్, హరీష్‌రావుతో పాటు నగర ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు ఉండనున్నారు. బండ్లగూడ జాగీర్, హైదర్ షా కోట్, గంధంగూడలో పర్యటించి.. పలువురు అపార్ట్మెంట్లు, విల్లాల వాసులతో సమావేశంకానున్నారు. -
అన్నం, పప్పులో పురుగులొస్తున్నా సీఎంకు పట్టదా?
శంషాబాద్ రూరల్: ‘అన్నం, పప్పులో పురుగులు వస్తున్నాయని ఆడపిల్లలు రెండు కి.మీ. నడిచి జాతీయ రహ దారిపై ధర్నా చేస్తే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందనలేదు. విద్యా ర్థుల కన్నీళ్లు చూçస్తుంటే ఏడుపొస్తోంది. దీనికి సీఎంరేవంత్‌రెడ్డి సిగ్గుపడాలి. ఫెయిల్యూర్ సీఎం కారణంగా రాష్ట్రంలో గురుకులాలు, మైనారిటీ విద్యా వ్యవస్థ కుంటుపడింది’ అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మాకు లలో ఉన్న కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని మాజీ మంత్రి పి.సబితారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. హరీశ్, సబిత రాకతో పిల్లలు వారి బాధలు చెప్పుకొని ఏడ్చారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు.కడుపు నిండా భోజనం పెట్టట్లేదు..‘విద్యార్థినులకు కడుపు నిండా భోజ నం లేదు. పుస్తకాలు, బోధన, కనీస సౌకర్యా లు లేవని విద్యార్థినులు బాధ పడుతు న్నారు. ఆరో తరగతి వారికి ఒక జత యూనిఫాం మాత్రమే వచ్చినట్లు విద్యా ర్థినులు చెబుతున్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో పుస్తకాలు ఇవ్వలేదు. సమస్య ల గురించి చెబితే వారిపట్ల ఉపాధ్యా యులు వ్యవహరించిన తీరు బాధాకరం. గతంలో కేసీఆర్ సన్న బియ్యంతో అన్నం పెడితే ప్రస్తుతం గొడ్డు కారంతో భోజనం పెడుతున్నారు. మెనూ ప్రకా రం పిల్లలకు గుడ్లు, మాంసం పెట్టట్లేదు. సీఎం వద్ద విద్య, సాంఘిక సంక్షేమ శాఖ లున్నా సమీక్షల్లేక అంతా అస్తవ్యస్తంగా మారింది. ఈ ప్రభు త్వం వచ్చాక కస్తూ ర్బా, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని హరీశ్‌రావు విమర్శించారు.ప్రభుత్వానిది మొద్దునిద్ర..సంక్షేమ పాఠశాలల్లో విషాహారం తిని 500 మంది పిల్లలు ఆస్పత్రులపాలైతే 38 మంది పిల్లలు చనిపోయారని హరీశ్‌రావు ఆరోపించారు. ఓవైపు ఎలుకలు, మరోవైపు పాముకాట్లకు పిల్లలు గురవుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా ఉండేవన్నారు. ముఖ్యమంత్రి మాటలు కాకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పాల్మాకులలో ఉపాధ్యాయులందరినీ బదిలీ చేసి పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.విద్యావ్యవస్థను గాలికొదిలేశారు: సబితారెడ్డివిద్యావ్యవస్థను ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి పి.సబితారెడ్డి ఆరోపించారు. ఎంత బాధ ఉంటే పిల్లలు రోడ్డు పైకి వస్తారో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. కలెక్టర్ ఇటువైవు చూసే తీరిక లేకుండా ఉన్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో 800 వరకు పాఠశాలలు ఉపాధ్యా యుల్లేక మూతపడినట్లు వార్తలు వచ్చాయన్నారు. అంతకు ముందు మాజీ మంత్రులు పాఠశాలలోని వంటగది, తరగతి గదులను పరిశీలించారు. చక్రధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.పాఠాలొద్దు.. ప్రాణాలే ముద్దు..శిథిలమైన పాఠశాల భవనంలో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదని కొడంగల్‌లోని దుద్యాల మండలం హస్నాబాద్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం తరగతులు బహిష్కరించి పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు. కనీ సం వర్షాకాలం ముగిసేవరకైనా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చేతు లు జోడించి మొక్కుతూ వినూత్న నిరసన తెలిపారు. నిజాం రాజుల కాలంలో సుమారు వందేళ్ల క్రితం నిర్మించిన భవనం వర్షాలకు కారుతోందని వివరించారు.గోడలు తడిసి, గదుల నిండా నీళ్లు నిండుతున్నాయని వాపోయారు. తమ సమస్యను అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ఆరు నుంచి పది తరగతులకు చెందిన 234 మంది ఈ పాఠశా లలో చదువుతున్నారు. వర్షం కురిస్తే ఎలాగూ తరగతులు జరగవనే ఉద్దేశంతో చాలామంది పాఠశాల వైపు కూడా రాకపోవడం గమనార్హం. –దుద్యాలకేజీబీవీలో విద్యార్థులతో కలెక్టర్ భోజనంసాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం పాలమాకులలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) కలెక్టర్ శశాంక శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వారికి అందిస్తున్న ఆహారంలో నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి ఆయన భోజనం చేశారు. విద్యార్థినులు చెబుతున్న సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు ఉన్నారు. -
ఇందిరమ్మ పాలనంటే ఇదేనా?: సబిత
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ హామీలను నమ్మి ఆడబిడ్డలు ఓటేశారని.. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం మాట్లాడటం లేదు.. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అంటూ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.‘‘అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ ఇవ్వడం లేదు. నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడ్డా మైక్ ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తామని చెప్పినా మాట్లాడనివ్వలేదు. శాడిస్ట్‌లాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తమంటుంది. నోటి మాటల్లో కాదు నిజంగా చేసే దమ్ముందా?’’ అని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు.ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నాలుగు గంటలు నిలబడ్డా కనీసం మాకు మైక్ ఇవ్వలేదంటూ మండిపడ్డారు. జూనియర్ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించటం బాధగా ఉంది. ఇద్దరు మహిళ మంత్రులు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదు? మేము మాట్లాడి రెండు రోజులు అవుతుంటే ఎందుకు స్పందించటం లేదు.మహిళా మంత్రులు బాధ్యత కాదా?’’ అంటూ సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. -
దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. తనను నమ్ముకున్న అక్కలు (సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్ధేశించి)మంత్రులయ్యారని.. వారిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల మాటలు నమ్మవద్దని అక్కలకు చెబుతున్నానని తెలిపారు. వాళ్లను నమ్మిన చెల్లెలు తీహార్ జైలులో ఉందని, సొంత చెల్లినే జైలుకు పంపిన వాళ్లను నమ్మవద్దని సీఎం పేర్కొన్నారు. సొంత చెల్లి జైల్లో ఉంటే దాని గురించి మాట్లాడలేదని, మైక్ ఇస్తే శాపనార్ధాలు, లేకుంటే పోడియం ముందుకు.. వాళ్ల పనే అంత అంటూ మండిపడ్డారు. తనను అయిదేళ్ల పాటు సభలోకి రానివ్వలేదని, వచ్చినా మార్షల్స్‌ను పెట్టి బటయకు గెంటారని గుర్తు చేశారు.చెల్లి జైల్లో ఉంటే బజార్ల రాజకీయాలు చేసే నీచుడిని కాదని సీఎం తెలిపారు. మంత్రి సీతక్కపై అవమానకరమైన పోస్టులు పెడుతున్నారని, ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కూడా సొంత అక్కల్లాగే భావించానని అన్నారు. అయితే ఒక అక్క నన్ను నడిరోడ్డు మీద వదిలేసి వెళితే.. మరో అక్క కోసం ప్రచారానికి వెళ్తే తనపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు చిక్కుకున్నారన్న సీఎం.. దొర కుట్రలను తెలుసుకుని అక్కలు బయటకు రావాలని సూచించారు.కాగా అసెంబ్లీలో ఆడబిడ్డలను అవమనించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బుధవారం మీడియాతో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తనను టార్గెట్ చేసిన రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి తానే ఆహ్వానించానని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా? అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
నల్ల బ్యాడ్జిలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నీరసన
-
కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయొచ్చు!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కొందరు సభ్యుల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. గతంలో కొన్ని సాంప్రదాయాలు నెలకొల్పారని, తనను ఏ రోజు అసెంబ్లీలో కూర్చోనివ్వలేదని ప్రస్తావించారు. తన వద్దకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లినట్లు సీఎం పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ గురువారానికి వాయిదా పడిన తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌తో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా బడ్జెట్‌పై ఇంత చర్చ జరగలేదన్నారు సీఎం రేవంత్. ప్రజాస్వామ్య బద్దంగా సభ నడుస్తుందని అన్నారు. ఒక్క రోజు 17 గంటల పాటు సభ నడిచిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌కు అనుబంధంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టామని. నేడు మొత్తం బడ్జెట్‌కు ఆమోదం తెలిపామని చెప్పారు.మోసం అనే పదానికి సబితా ప్రత్యామ్నాయం‘మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి చెప్పారు.అంతకుమించి సమాధానం ఏముంటుంది. సునితా లక్ష్మారెడ్డి కోసం ప్రచారం చేస్తే నాపై రెండు కేసులు పెట్టారు.తరువాత ఆమె బీఆర్ఎస్లోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్పర్సన్ అయ్యారు. నేను కేసుల చుట్టూ తిరుగుతున్నాను. నేను ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదు. ఆమెను సొంత అక్కలా భావించా. వాళ్లు ఎందుకు బాధపడ్డారు. రియాక్ట్ అయ్యారు.అక్క అనే అన్నాను.. వేరే భాషలో మాట్లాడలేదునన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన అక్క.. నాకు తోడుండాలి కదా. కానీ ఆమె బీఆర్ఎస్లోకి వెళ్లారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ తీసుకో నేను పనిచేస్తా అని చెప్పి.. టికెట్ రాగానే సబిత పార్టీ మారారు. సభలో హరీష్ రావు 2 గంటల 11 నిమిషాలు మాట్లాడారు. జగదీశ్‌రెడ్డి గంటా 10 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్ 2 గంటల 36 నిమిషాలు మాట్లాడారు. ఇంతకంటే ఎక్కువ సేపు మాకు ఎప్పుడైనా మైక్ ఇచ్చారా? మాకంటే వాళ్లే ఎక్కువ సేపు మాట్లాడారు.రాజకీయంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు. సబితకు మాట్లాడే అవకాశం ఇచ్చాం. ఆమె వ్యక్తిగత ప్రస్తావన తెస్తే.. ఆ తరువాత నేను మాట్లాడాను. సబితక్క ఆవేదనకు కేటీఆర్, హరీశ్ ఎందుకు అండగా లేరు? కేటీఆర్,హరీష్‌లు తాము సభలో సరిపోతామని చెబతున్నారు. అలాంటిప్పుడు కేసీఆర్‌ను ఫ్లోర్ లీడర్‌గా తీసేయండి. సభలో గందరగోళం చేసేందుకే కేటీఆర్ సభకు వస్తున్నారు.’ అని సీఎం రేవంత్ మండిపడ్డారు. -
రేవంత్ వ్యాఖ్యలు.. సబిత కన్నీరు
-
అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలతో సబిత కన్నీరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై కామెంట్స్ నేపథ్యంలో ఆమె కన్నీరుపెట్టుకున్నారు. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..కాంగ్రెస్‌లో ఉండి ఇక్కడ ముంచి అక్కడి వెళ్లారు.బీఆర్ఎస్ నేతల వెనుక ఉన్న అక్కలను నమ్మితే అంతే..వాళ్ల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్‌లో నిలబడాల్సి వస్తుంది.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.సబితను సొంత అక్కగానే భావించాను.కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కన్నీరు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి.అసెంబ్లీలో సబిత భావోద్వేగం.నన్ను ఎందుకు టార్గెట్ చేశారు.రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారు.కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.పార్టీ మార్పులపై చర్చ జరగాలి.రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి నేనే ఆహ్వానించాను.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా?అక్కడున్న కాకి మా ఇంటి మీద వాడితే కాల్చుతా అన్నారు రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే.ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా?సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్ చేశారు?వెనక కూర్చున్న అక్కలు ఎవరిని మోసం చేశారు?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి భవిష్యత్తు చూపించాం.ముఖ్యమంత్రి ఎవరిని అవమానిస్తున్నారు ఆలోచన చేసుకోవాలి?ఆడిబిడ్డలాగా ఉన్న మేము ఎవరిని మోసం చేసాము?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్.. అక్కగా నేను సబితా ఇంద్రారెడ్డిని నమ్మాను.నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని చెప్పి.. కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్లోకి వెళ్లారు.ఒకవైపు నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని.. మరోవైపు కేసీఆర్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరారు.మల్కాజ్‌గిరిలో పోటీ చేయమని, బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి పొందారు.రాజ్ భవన్ వెళ్లి వచ్చాక అన్ని అంశాలపై సమాధానాలు చెప్తా అన్ని విషయాలు బయటపెడతాను. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చింది.పదేండ్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది.2014లో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు.కాంగ్రెస్ పార్టీ దళిత నేతగా ఉన్న నాకు సీఎల్పీ, ఎల్ఓపీగా బాధ్యతలు ఇచ్చారు.సబితా ఇంద్రారెడ్డి రెడ్డి నా వెనుక ఉండి నన్ను సీఎల్పీ, ఎల్ఓపీగా కాకుండా అధికారం కోసం పార్టీ మారారు.సబితా ఇంద్రారెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు సబితా ఇంద్రారెడ్డి.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మరోసారి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్స్పీకర్ పోడియం ముందు వచ్చి నిరసన చేస్తున్న ఎమ్మెల్యేలు.మహిళా నాయకురాళ్లపై మంత్రులుగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటున్న బీఆర్ఎస్. బీఆర్ఎస్ నేతల నిరసన..స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం.రెండు గంటలు సమయం ఇచ్చిన చైర్‌కు బీఆర్ఎస్ మర్యాద ఇవ్వడం లేదు.మహిళలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదుఎంత అవకాశం ఇచ్చిన నిరసన చేయడం సరైన పద్ధతి కాదు. -
మహిళలకు భద్రత ఉందా?.. సర్కార్‌పై మాజీ మంత్రి సబిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహిళల భద్రతపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. రాష్ట్రంలో వరుసగా అత్యాచార ఘటనలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, మాజీ మంత్రి సబిత ట్విట్టర్ వేదికగా.. తెలంగాణలో ఏం జరుగుతోంది. అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాలేదు. రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధాకరం. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం. మహిళలకు భద్రత కరువైంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.1. వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం2. ఓయూ పీఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం3. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై అత్యాచారం4. నిర్మల్ నుండి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్. pic.twitter.com/reV7o3MB8o— Sabitha Reddy (@BrsSabithaIndra) July 31, 2024 -
బీఆర్ఎస్లోనే.. ఆ ఆలోచన ఎంతమాత్రం లేదు: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల జంపింగ్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్యలు పార్టీని వీడి అధికార కాంగ్రెస్‌లోకి చేరారు. ఈ క్రమంలో.. మరో ఐదుగురు ఉన్నారని, మాజీ మంత్రి సబితా రెడ్డి కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఒకటి నడుస్తోంది. అయితే.. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారాన్ని ఖండించారామె. బీఆర్ఎస్లో కేసీఆర్ తనకు సముచిత స్థానం కల్పించారన్న సబిత.. ఆయన సారధ్యంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, పార్టీ మారాల్సిన అవసరంగానీ.. ఆ ఆలోచనగానీ తనకు లేవని అన్నారామె. -
ఎమ్మెల్యేగా సబితమ్మ ప్రమాణం
-
మహేశ్వరంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
-
ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మూడ్రోజులుగా ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్న డబ్బుగా ఐటీ శాఖ తేల్చింది. ప్రదీప్‌రెడ్డితో పాటు కోట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఆయన ఇంట్లో రూ. 7 కోట్ల 50 లక్షలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఐటీ అధికారుల వరుస సోదాలు సోమవారం మూడ్రోజులు పాటు కొనసాగాయి. ఫార్మా రంగానికి చెందిన పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ అధికారుల బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, ఆర్సీపురం, వట్టినాగులపల్లి,గచ్చి బౌలిలోని మైహోం భుజాలో సోదాలు నిర్వహించాయి. మై హోమ్ భుజాలో నివాసం ఉంటున్న ప్రదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడాలో అంతర్జాతీయ రసాయన పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. తనిఖీల సమయంలో ఎవరినీ లోపలికి రానీయకుండా సీఆర్పీ ఎఫ్ జవాన్లు బందోబస్తు నిర్వహించారు. ఆయా కంపెనీలకు చెందిన ఆర్ధిక లావాదేవీల వివరాలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులకు పలు ఫార్మా కంపెనీల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారులు మెరుపుదాడులు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. చదవండి: కోట్లున్నా..కారుండదు..ఎందుకు? -
సబితా ఇంద్రారెడ్డి ఆస్తులు రూ.9.27 కోట్లు
మహేశ్వరం: తనకు రూ.9 కోట్లకు పైగా ఆస్తులున్నాయని, తనపై నాలుగు కేసులున్నాయని ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్లోళ్ల సబితారెడ్డి పేర్కొన్నారు. ఆమె పేరు మీద కారు లేదని, చేతిలో రూ.6 లక్షల50వేల నగదు, 900 గ్రాముల బంగారం ఉందని అఫిడవిట్లో తెలిపారు. స్థిరాస్తులు: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం మాద్రి గ్రామం, తాండూరు మండలం మల్కాపూర్, చేవెళ్ల మండలం కౌకుంట్ల, తాండూరు మండలం కోటబాసుపల్లి, చేవెళ్ల మండల కేంద్రంలో సుమారు రూ.2.28 కోట్లు విలువ చేసే 35.19 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కమర్షియల్ ఆస్తులు హైదరాబాద్‌లోని శ్రీనగర్, శంషాబాద్ మధురానగర్, తాండూరులో శంకర్రావు నగర్, చేవెళ్ల కౌకుంట్ల గ్రామాల్లో రూ.7.97 కోట్లు విలువ చేసే ఇళ్లు, ప్లాట్లు ఉన్నాయి. అప్పులు ఏమీ లేవు. చరాస్తులు, స్థిరాస్తులు మొత్తం రూ.9.27 కోట్లు ఉన్నాయని తెలిపారు. -
ఉప ఎన్నికతో ప్రస్తావాన్ని ప్రారంభించిన సబిత.. మంత్రిగా ఘనత.!
సాక్షి, రంగారెడ్డి: చేవెళ్ల చెల్లెమ్మగా.. తొలి మహిళా హోం మంత్రిగా... గెలిచిన ప్రతీసారి మంత్రి పదవి చేపట్టి ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ ప్రత్యేకంగా నిలిచారు. ప్రస్తుతం ఆమె మహేశ్వరం సిట్టింగ్ ఎమ్మెల్యే.. విద్యాశాఖా మంత్రి సబితారెడ్డి. భర్త మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె దివంగత సీఎం వైఎస్సార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లో రాణిస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ► ఉమ్మడి రాష్ట్రంలో 1999లో సబితారెడ్డి భర్త పి.ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఎల్‌ఆర్‌పై విజయం సాధించారు. 2000లో ఆయన అకాల మరణంతో ఆమె అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఉప ఎన్నికతో ప్రస్తావాన్ని ప్రారంభించిన ఆమె కేఎల్ఆర్ను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టింది. ► 2004లోనూ పోటీలో నిలిచిన ఆమె టీడీపీ అభ్యర్థి ఎస్.భూపల్‌రెడ్డిపై విజయం సాధించారు. అనంతరం ఆమె మంత్రి వర్గంలో చోటు దక్కించుకుని గనుల శాఖ మంత్రిగా మెప్పించారు. ► 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి సబితారెడ్డి మూడోసారి బరిలో నిలిచారు. ఈ ఎన్నికలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగి టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై ఘన విజయం సాధించారు. దీంతో వైఎస్ఆర్ ప్రోత్సహించి ఆమెకు హోంమంత్రి పదవిని కట్టబెట్టడంతో తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించారు. అనంతరం 2014 ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. ► 2018 ఎన్నికల్లో మరోసారి మహేశ్వరం నుంచి పోటీ చేసిన సబితారెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆమె గులాబీ తీర్థం పుచ్చుకుని సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా రికార్డుల నెలకొలిపారు. 2023 ఎన్నికల్లో ఆమె కారుగుర్తుపై ఎన్నికల పోటీలో ఉన్నారు. ఇవి చదవండి: ‘పట్నం’లో టైట్ ఫైట్! కాంగ్రెస్ నలభై ఏళ్ల కల.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కోసం వల! -
మంత్రి సబితా గన్ మెన్ ఆత్మహత్య..
-
మంత్రి సబిత గన్‌మెన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్‌తో కాల్చుకుని ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని మంత్రి సబితా పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ, ఫాజిల్ ఉదయం ఆరుగంటలకు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రాథమిక దర్యాప్తులో ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. కూతురితో మాట్లాడిన తర్వాత పిస్తోల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. -
వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకులకు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్–వీవోఏ) రక్షాబంధన్ కానుకగా వారి గౌరవ వేతనాలను పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారి వేతనాలు నెలకు రూ. 8 వేలకు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకులకు(వీవోఏ) లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించి మంత్రులు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై నిర్ణయం ప్రకటించాలని మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. దీంతో సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారులు, పలువురు వీవోఏ మహిళా సంఘాల ప్రతినిధులతో హరీశ్‌రావు సమావేశమై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తెలియజేశారు. ఆ ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల కాపీని మహిళా సంఘాల ప్రతినిధులకు మంత్రులు అందజేయగా వారు మంత్రులకు రాఖీలు కట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. వేతన పెంపుదల ద్వారా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.106 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, డ్రెస్ కోడ్ అమలు కోసం నిధులు విడుదల చేయాలన్న వీవోఏల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ.2 కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి మూడు నెలలకోసారి చేసే రెన్యూవల్ విధానాన్ని ఇకపై ఏడాదికి చేసేలా సవరించాలని సీఎం నిర్ణయించారు. జీవిత బీమా కోసం విధివిధానాలు అధ్యయనం చేసి నివేదిక అందించాలని మంత్రి ఎర్రబెల్లిని ఆదేశించారు. జీతాల పెంపు ఇలా... ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో పొదుపు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు సహాయకులుగా పనిచేస్తూ సంఘాలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, ఇతర సమాచారాన్ని నమోదు చేసే విధులను వీవోఏలు స్వచ్ఛందంగా నిర్వహించేవారు. వారు సేవ చేస్తున్న మహిళా సంఘాల నుంచి మాత్రమే ‘గ్రూపు లీడర్లు’గా నెలకు రూ. 2 వేల గౌరవ వేతనం ఇచ్చేవారు. వీవోఏల కృషిని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం 2016 నుంచి వారికి నెలకు రూ. 3 వేల గౌరవ వేతనం అందిస్తోంది. ఇటీవలే పెంచిన పీఆర్సీని వీవోఏలకు కూడా వర్తింపజేయడంతో వారి గౌరవ వేతనం రూ. 3900కు పెరిగింది. దీంతో మహిళా సంఘాల నుంచి అందే రూ.2 వేల తోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే రూ. 3,900 కలిపితే వారి వేతనం రూ. 5,900కు పెరిగింది. అయితే వారి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం మరోసారి వీవోఏలను ఆదుకోవాలని నిర్ణయించి రాఖీ పండుగ కానుకగా వేతనాలను రూ. 8 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఇది కూడా చదవండి: అంగన్వాడీల్లో సమ్మె సైరన్! 11 నుంచి నిరవధిక సమ్మె -
‘టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు కోర్టు తీర్పుకు లోబడే ఉండాలి’
హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను కోర్టు తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం నడాఉ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ‘పూర్తి పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ తరఫున వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపాలి. ఆన్లైన్ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. జిల్లాల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారాలను ఆయా జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సాఫీగా జరిగేలా చూడాలి’ అని మంత్రి సబితా ఆదేశించారు. -
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని వి. శ్రీనివాస్ గౌడ్ ,విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ,స్థానిక గౌడ కులస్తులు నేతలతో కలిసి ఆవిష్కరించారు . రంగారెడ్ది జిల్లా కందుకూరు చౌరస్తాలో స్ధానిక గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు అన్ని కులాలను మతాలను సమానంగా ఆదరిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను కొనసాగిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో గీత వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో చెట్ల పెంపకానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌడ కులస్తులకు కూడా కొకపేట ప్రాంతంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు.అదేవిధంగా రైతన్నల లాగే,గౌడన్నలకు 5 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు. ఎక్కడికో వెళ్లి గియకుండా,గౌడన్నలకు దగ్గరగా ఉండాలనే చెరువు కట్ట మీద ఈత చెట్లు పెట్టినట్లు,వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత సొసైటీలకే ఉందన్నారు.ఆదాయం పెంచుకోవాలని మంత్రి సూచించారు.కుల వృత్తుల వారికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.నాడు భయం భయంగా ప్రభుత్వాల ఆంక్షల మధ్య కల్లు అమ్ముకునేవారని,నేడు నగరం నడి బొడ్డున నీరా కేఫ్ లు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉంటున్నారన్నారు..బీసీ ల్లోని కుల చేతి వృత్తుల వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సహాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... సుమారు 350 ఏళ్ల క్రితం ఆనాటి మొగల్ పాలకుల దౌర్జన్యాలకు , నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరాఠయోధుడు చత్రపతి శివాజీ సమకాలికులు తెలుగు గడ్డపైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లు తిరుగుబాటు చేసి 33 కోటలను జయించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసి గోల్కొండ కోటను 6 నెలల పాటు పాలించిన గొప్ప బహుజన వీరులు అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వర్ధంతి లను అధికారికంగా నిర్వహించడంతోపాటు చారిత్రక ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు మతాలకు వృత్తుల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కల్లు దుకాణాలను రద్దుచేసి గౌడ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో తాటి చెట్లను నాటుతున్నమన్నారు కల్లుకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నామన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీరా ప్రాజెక్టును ప్రారంభించి ప్రజలకు ఔషధ గుణాలున్న నీరాను అందిస్తున్నామన్నారు. గీత కార్మికులు సాహసపేతమైన వృత్తిని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యానికి కల్లు, నీరాను అందించి ఎంతో భయంకరమైన క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధమైన రోగాల బారి నుండి ప్రజలను కాపాడుతున్నారన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ్ల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు వీటితోపాటు వైన్ షాప్ లలో 15శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. -
సబితతో సవాలే.. ‘ఢీ’ కొట్టగలరా?
రంగారెడ్డి: మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి‘హస్త’వ్యస్తంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. ఇక్కడి నేతల ‘చేతులు’ మాత్రం కలవడం లేదు. ఎవరికి వారే ప్రత్యేక ఎ‘జెండా’తో ముందుకు సాగడంపై పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఒకవైపు కొత్తగా వలసలు.. ఏళ్లుగా నియోజకవర్గాన్ని నమ్ము కుని పని చేస్తున్న లీడర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా.. మరోవైపు నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలతో గందరగోళం నెలకొంది. సంక్షోభ సమయంలో పార్టీకి పెద్ద దిక్కుగా.. కార్యకర్తలకు అండగా నిలబడి.. ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఆర్థికంగా ఖర్చులు భరిస్తూ పార్టీని బలోపేతం చేస్తే.. తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తమను కాదని, కొత్త నేతలకు టికెట్ కట్టబెడితే తమ రాజకీయ భవితవ్యం ఏమిటనే భావన ఆ పార్టీ నేతలను వేధిస్తోంది. తమదైన ముద్ర వేసేందుకు.. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి వచ్చే ఎన్ని కల్లో ఈ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఆయన మీర్పేట్, జిల్లెలగూడ, చంపాపేట్‌లో తరచూ పర్యటిస్తున్నారు. ఆయా కేంద్రాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్కేపురం నుంచి కార్పొరేటర్‌గా పని చేసిన అనుభవం ఉన్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దేప భాస్కర్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. పార్టీ నుంచి ఈసారి ఎమ్మెల్యే టికెట్ తనకే లభిస్తుందని చెబుతున్నారు. ఈయనకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లతో పాటు మహేశ్వరం మండలంపై కొంత పట్టుంది. రాజకీయంగా మంత్రి సబితతో విభేదించి ఏడాది క్రితం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. బడంగ్పేట్, బాలాపూర్, జల్పల్లి కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓటమిపాలైన కొత్త మనోహర్‌రెడ్డి సైతం ఇటీవల ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన పదేళ్లుగా కేఎంఆర్ ట్రస్ట్ పేరుతో పుస్తెమెట్టెలు, నూతన వస్త్రాల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గంగా గుర్తింపు పొందిన ఆయన కూడా ఈసారి టికెట్ తనకే వస్తుందని చెబుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎల్మటి అమరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి సైతం పోటీకి సై అంటున్నారు. ఊగిసలాటలో తీగల గతంలో హైదరాబాద్ మేయర్‌గా, మహేశ్వరం ఎమ్మెల్యేగా పని చేసిన బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.అధికార బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కేడర్‌కు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఆయన నిర్ణయాన్ని ఇటు హస్తం పార్టీ స్థానిక నేతలే కాదు.. స్వయంగా కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన కోడలు, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి ఆయనతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. సబితతో సవాలే.. నియోజకవర్గాల పునర్వీభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో పటోళ్ల సబితారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాఽధించారు. 2009లో మొత్తం 2,86,974 ఓట్లు ఉండగా, 1,74,911 పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డికి 57,244 పోలవగా, సబిత 65,077 ఓట్లతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 4,03,719 ఓట్లకు, 2,17, 299 పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త మనోహర్‌రెడ్డికి 42,517 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి 62,521 పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 93,305 ఓట్లతో విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు 39,445 ఓట్లు (16.84 శాతం) సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 86,254 ఓట్లు (36.82 శాతం) సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సబితారెడ్డి 95,481 ఓట్లతో(40.76 శాతం) విజయం సాధించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆమె కాంగ్రెస్‌ను వీడి.. అధికార బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం జిల్లా నుంచి రాష్ట్ర కేబినేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి భారీగా నిధులు తెప్పించి, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ముందున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆమెను వచ్చే ఎన్నికల్లో ‘ఢీ’ కొట్టడం కాంగ్రెస్‌కు అంత సులువు కాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సబిత ఆరా
-
కాస్త ముందుగానే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: రేపు(గురువారం) ఉదయం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు.. సమయంలో మార్పులు చేశారు. ఉదయం 9:30 గంటలకే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ కారణంగా ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. చదవండి: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు -
మంత్రి సబిత పీఏలమంటూ నమ్మించి భారీ మోసం
బంజారాహిల్స్(హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యాలయ సిబ్బందిమంటూ పరిచయం చేసుకుని ప్రముఖ షూస్ తయారీ కంపెనీని మోసం చేసిన ఏడుగురు వ్యక్తులపై బంజారాహిల్స్‌పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో షూస్, స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఆర్డర్‌ను తమకు కేటాయించాలని హరియాణా రాష్ట్రంలోని కర్నైల్ పట్టణానికి చెందిన లిబర్టీ షూస్ లిమిటెడ్ సంస్థ 2019 డిసెంబర్లో రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. కొన్ని రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి పర్సనల్ అసిస్టెంట్‌ను అంటూ జీకే.కుమార్, సెకండ్‌పర్సనల్ అసిస్టెంట్ అంటూ బెల్లి తేజ, పోలిటికల్ సెక్రటరీ అంటూ ప్రవీణ్‌వర్మ తదితరులు లిబర్టీ సంస్థ ప్రతినిధి కమల్ ధవన్‌కు ఫోన్ చేశారు. షూస్ కాంట్రాక్ట్ విషయంపై మాట్లాడదామంటూ హైదరాబాద్‌కు పిలిపించారు. కాంట్రాక్ట్ విషయం ఫైనల్ చేస్తామని దీనికోసం ప్రాసెసింగ్ ఫీజులతో పాటు ఇతర చార్జీల కింద ఇవ్వాలంటూ రూ.17.66 లక్షలు వసూలు చేశారు. చదవండి: HYD: మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం వివిధ అకౌంట్ నెంబర్లకు ఈ డబ్బును పంపించాలని సూచించారు. వారి సూచనల మేరకు డబ్బు చెల్లించిన లిబర్టీ సంస్థ ప్రతినిధులు ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్ట్ రాకపోవడంతో అనుమానం వచ్చి వాకబు చేయగా కుమార్ అనే వ్యక్తి గతంలో పనిచేసిన మాట వాస్తవమేనని, అతడిని ఉద్యోగంలోంచి తొలగించారని తేలింది. దీంతో తమను మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని లిబర్టీ షూస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి కమల్ ధావన్ సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీకే.కుమార్, బెల్లితేజ, ప్రవీణ్‌వర్మ, స్వాతి, విక్రమ్ పురి, అంజనేయులు, రమేష్ రెడ్డి అనే వ్యక్తులపై ఐపీసీ 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా
-
TS SSC Result 2023: టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించారు. జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది. కాగా నిన్నే(మంగళవారం) ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోనాడే టెన్త్ ఫలితాలు రిలీజ్ కానుండడం విశేషం. ‘సాక్షి’లో ఫలితాలు.. టెన్త్ పరీక్ష ఫలితాలను త్వరితగతిన తెలుసుకునేందుకు సాక్షి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. www. sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి, ఫలితాలు పొందవచ్చు. ►తెలంగాణ టెన్త్ ఫలితాల్లో 86 శాతం ఉత్తీర్ణ నమోదైంది. ►బాలుర ఉత్తీర్ణత 84.68 శాతం ►బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత ►2,793 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత ►నిర్మల్ జిల్లా 99 శాతంతో మొదటి స్తానంలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరి స్థానంలో ఉంది. ►25 పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత ►ప్రభుత్వ పాఠశాలలో 72.39 శాతం ఉత్తీర్ణత ►తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.25 ఉత్తీర్ణత -
మంత్రి సబితా ఇంటి ముట్టడికి NSUI యత్నం
-
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తలపించేలా.. కోర్టు ముందుకు బండి సంజయ్..
సాక్షి, వరంగల్/హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు కోర్టులో హజరుపర్చారు. కమలాపూర్, కరీంనగర్ టూటౌన్లో సంజయ్‌పై పేపర్ లీకేజీ కేసు నమోదైంది. ఆయనను హన్మకొండలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏ1గా బండి సంజయ్.. టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్ పేరును చేర్చారు. ఏ2 ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా శివగణేష్‌ను పోలీసులు చేర్చారు. 120(బి) సెక్షన్ కింద సంజయ్‌పై కేసు నమోదు చేశారు. హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత.. హన్మకొండ కోర్టు వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సంజయ్‌ను తీసుకెళ్తున్న వాహనంపై చెప్పులు విసిరారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. బండి సంజయ్ అరెస్ట్‌పై ఫిర్యాదు చేశారు. కాగా, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుపై హైడ్రామా కొనసాగింది. థ్రిల్లర్ సినిమా తలపించేలా పలు ప్రాంతాలు తిప్పారు. అసలు బండి సంజయ్‌ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపి లీగల్ సెల్ ఆందోళన వ్యక్తం చేసింది. పేపర్ బయటకు వచ్చిన కేసులో అనౌన్ పర్సన్ అని ఎఫ్ఐఆర్లో చూపి కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా బండి సంజయ్ ని అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులను, అరెస్టులను న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నారు. బెయిలేబుల్ కేసులే అయినప్పటికీ దొంగలా రహస్యంగా కోర్టుకు తరలించడమేంటని ప్రశ్నిస్తున్నారు. టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీలో కుట్ర ఉంది: మంత్రి సబితా ఇదిలా ఉండగా, టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీలో కుట్ర ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే బండి సంజయ్ కుట్ర చేశారంటూ ఆమె ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. నిందితులకు బీజేపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. కేసీఆర్ సర్కార్‌ను అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతోనే పేపర్ లీక్‌కు పాల్పడ్డారని మంత్రి సబితా మండిపడ్డారు. చదవండి: అర్థరాత్రి అరెస్ట్.. అసలేం జరిగిందో చెప్పిన బండి సంజయ్ సతీమణి -
టెన్త్ పేపర్ లీక్‌పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సబిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జిలు షానవాజ్ కాసీం , చంద్రశేఖర్ రెడ్డి లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్థ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సబితా స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్‌లను మూసివేయించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
భగ్గుమన్న బీఆర్ఎస్.. ‘బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను ధైర్యంగా ఎదుర్కొనలేక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మహిళల కోసం ఎందుకు ధర్నా చేయడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నించారని.. తెలంగాణలో మహిళలకు ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్లకు అవకాశం కల్పించారని తెలిపారు. ‘మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడిన ప్రభుత్వం మాది. మీరు దేశంలో మహిళ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. దేశంలో మోడి ఆడింది ఆట, పాడిందే పాట లాగా అయిపోయింది. దేశంలో కేసీఆర్‌కు వస్తున్న ప్రజాదరణను అడ్డుకోవడానికి కేంద్రం కుట్ర పన్నింది. బీజేపీలో మహిళలకు సరైన ఆదరణ, ప్రాధాన్యత లేదు.’ అని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. బండిపై సత్యవతి రాథోడ్ ఫైర్ ఈడీలు, బోడీలు మమ్మల్ని ఏమీ చేయలేవని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 2018లో తెలంగాణ బీజేపీ 100 పైగా నియోజక వర్గాల్లో డిపాజిట్లు కూడా రాలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయనకు మహిళలంటే ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని సెటైర్లు వేశారు. బీజేపీ నేతలు భవిష్యత్తులో జైళుకు వెళ్లే రోజులు వస్తాయని జోస్యం చెప్పారు. తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని అన్నారు. బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందించాలని మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమంటే స్పందించే గవర్నర్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. గవర్నర్ ఉద్ధేశం ఏంటో చెప్పాలని అన్నారు. మోదీని వ్యతిరేకిస్తేనే నోటీసులు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత ఏ తప్పు చేయలేదని తేలుతందని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి జై కొడితే ఏ నోటీసులు ఉండవని.. వ్యతిరేకిస్తే నోటీసులు ఉంటాయని విమర్శించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు దారుణమని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ వ్యాఖ్యలపై స్పందించే ధైర్యం గవర్నర్‌కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ వ్యాఖ్యలు కుసంస్కారమని ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. బండి వ్యాఖ్యల వీడియోను గవర్నర్‌కు ట్యాగ్ చేశారు. హైదరాబాద్‌లో నిరసనలు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. బండి సంజయ్ చేసిన వాఖ్యలను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈడీ ఆఫీస్‌ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికంగా పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయం గేట్లు మూసివేశారు పోలీసులు. అదే విధంగా పంజాగుట్టలో బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి నిరసన చేపట్టారు. -
బాధ్యులైన వారిని శిక్షిస్తాం : మంత్రి సబిత
-
సాత్విక్ ఆత్మహత్యపై మంత్రి సబితా సీరియస్
-
శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ ఆత్మహత్య.. మంత్రి సబిత కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ కుమారుడికి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ ఎదుట ఆందోళనల సందర్బంగా సాత్విక్ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యార్థిపై విచారణకు ఆదేశించారు సబిత. ఇదే సమయంలో ఈ ఘటనపై విచారణ చెపట్టాలని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌కు కూడా సబిత ఆదేశించారు. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ క్రిష్ణారెడ్డి, వార్డెన్లు నరేష్‌తో పాటు మేనేజ్మెంట్పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 305 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇక, అంతుకుముందు.. తమకు న్యాయం చేయాలంటూ శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతిచెందాడని పేరెంట్స్ ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఆందోళనల సందర్బంగా సాత్విక్ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసి విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. -
అభ్యంతరాలను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే సీబీఐకోర్టు పిటిషన్‌ను కొట్టివేసిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టు వాదనలు వినిపించారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఎలాంటి కొత్త అంశాలు లేకుండా అదనపు అభియోగ పత్రం దాఖలు చేస్తూ నిందితురాలిగా చేర్చారని సబితా ఇంద్రారెడ్డి నివేదించారు. తన డిశ్చార్జి పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ మరోసారి విచారణ చేపట్టారు. ఆ అంశాలకు సమాధానం చెప్పలేదు డిశ్చార్జి పిటిషన్లో తాను లేవనెత్తిన అభ్యంతరాలకు సీబీఐ కోర్టు సమాధానం చెప్పలేదని సబిత పేర్కొన్నారు. డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. గనుల శాఖ ప్రతిపాదనల ఆధారంగా మంత్రి ఆమోదం ఉంటుందని, ఆ శాఖ మంత్రిగా ఏం బాధ్యతలు ఉంటాయో కూడా సీబీఐ కోర్టు గుర్తించలేదని వివరించారు. వాదనలు విన్న సీజే...సీబీఐ వాదనల కోసం తదుపరి విచారణను వచ్చే ఈనెల 24కు వాయిదా వేశారు. -
Telangana: మే 7 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ ఎంసెట్–2023ను మే 7న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను మే 7 నుంచి 11 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కూడా ఎంసెట్‌ను జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తోంది. ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెట్స్‌కు సంబంధించిన దరఖాస్తు తేదీలు, ఫీజుల వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ల కన్వీనర్లు త్వరలో విడుదల చేస్తారని మంత్రి తెలిపారు. -
టీచర్లందరికీ బదిలీ చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులందరికీ బదిలీ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ప్రారంభమైన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. 317 జీవో ద్వారా కొంతకాలం క్రితం కొత్త జిల్లాలకు వెళ్లిన దాదాపు 25 వేలమంది టీచర్లు ఈ నెల 12 నుంచి 14 వరకూ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ గత నెల 27న విడుదలైంది. ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న స్కూల్లో కనీసం రెండేళ్ల సర్వీసు ఉంటేనే బదిలీకి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో 59 వేల మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరి ధ్రువపత్రాలను డీఈవోలు పరిశీలించారు. సీనియారిటీ విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే 317 జీవో ద్వారా బదిలీ అయి న టీచర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వడంతో బదిలీల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లు ఉమ్మడి జిల్లాల్లో పనిచేసిన సర్వీసును కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పైరవీ టీచర్లలో గుబులు బదిలీల్లో ఉన్న కొన్ని ఆప్షన్లను ఉపయోగించుకుని అడ్డగోలుగా పైరవీ బేరాలు కుదుర్చుకున్న కొంత మంది టీచర్లలో తాజా పరిణామాలు గుబులు పుట్టిస్తున్నాయి. టీచర్లు లేదా వారి కుటుంబంలోని వారికి దీర్ఘకాలిక వ్యాధులుంటే వైద్య సేవల కోసం కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయించుకునే వెసులుబాటు మార్గదర్శకాల్లో పొందుపరిచారు. వాస్తవానికి అనేక మంది ఈ కోటాను దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అనారోగ్య కోటా కింద దరఖాస్తు చేసిన వారికి కూడా సీనియారిటీని బట్టి ప్రాధాన్యతనిస్తారు. ఈ ప్రక్రియలో కొంతమంది తప్పుడు సర్టిఫికెట్లతో పైరవీలు చేయించుకున్నట్టు, దీని కోసం మధ్యవర్తులకు రూ. లక్షల్లో ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. తాజాగా 317 జీవో టీచర్లకు కూడా అనారోగ్య కోటా వర్తించనుంది. దీంతో ఈ కోటాలో తమ సీనియారిటీ మారుతుందేమోననే ఆందోళన పైరవీలు చేసుకున్న ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. అలా చేస్తే క్రెడిట్ మనకే వచ్చేదిగా.. బదిలీల మార్గదర్శకాల్లో జీరో సర్వీసు నిబంధన ఉండాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. కానీ పాఠశాల విద్యా డైరెక్టర్ ఇందుకు అడ్డుపడ్డారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశం మంత్రి వద్ద మంగళవారం చర్చకు వచ్చినట్టు తెలిసింది. మనమే జీరో సర్వీస్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని మంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో అమలు చేస్తున్నారు తప్ప, ప్రభుత్వం ఔదార్యంతో వ్యవహరించిందనే క్రెడిట్ రాదు కదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
ఉపాధ్యాయ బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జీవో 317తో ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి బదిలీ అయిన 25వేల మందిలో దాదాపు 15వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు కోరుకుంటున్నారని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఉమ్మడి జిల్లాల్లో సర్వీసు కలిపి రెండేళ్లు పూర్తయిన వారికి కూడా బదిలీల కోసం దరఖాస్తు చేసేందుకు అనుమతివ్వాలని మంత్రి ఆదేశించారు. జీవో 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 ఉంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులందరికీ సమన్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 59వేల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలన కూడా పూర్తయిందని, ఈ ధరఖాస్తులు కూడా వచ్చిన తర్వాత అన్నింటిపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. చదవండి: హైదరాబాద్‌కు మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయి -
గూడు చెదిరి.. గుండె పగిలి..
ఖమ్మం: శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో.. దుండగుల బారి నుంచి సమాజాన్ని కాపాడటంలో పోలీసులదే కీలక పాత్ర. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అనుక్షణం ప్రజారక్షణ కోసం పరి తపిస్తూ.. ఓ వైపు లా అండ్ ఆర్డర్.. మరోవైపు కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో దంపతులిద్దరూ కూడా సేవలందించేవారున్నారు. అలాంటి వారికి పెద్ద కష్టమే వచ్చింది. ఉద్యోగం ఉందన్న ఓ ఆశ తప్పితే వారి జీవితంలో సుఖసంతోషాలు కరువై నరకయాతన అనుభవిస్తున్నారు. భర్త ఒకచోట.. భార్య మరోచోట.. వారి పిల్లలు ఇంకోచోట.. ఇలా గూడు చెదిరిన పక్షుల వలె స్పౌజ్ పరిధిలోని కానిస్టేబుళ్లు కన్నీళ్లను దిగమింగుకుని విధులకు హాజరవుతున్నారు. కుటుంబం, విధులు అనే రెండింటి మధ్య తల్లడిల్లుతూ ఆగమ్యగోచరంగా మారిన తమ తలరాత ఎప్పుడు మారుతుందోనంటూ దీనంగా ఎదురుచూస్తున్నారు. 317 జీఓతో చెల్లాచెదురు తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా 2021లో తీసుకొచ్చిన 317 జీఓ పోలీస్ శాఖలో ఒకే జిల్లాలో పనిచేసుకుంటున్న దంపతులకు శాపంగా మారిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణలో భాగంగా సిబ్బందిని కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న దంపతులు చెరో జిల్లాలకు బదిలీ అయ్యారు. సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేయడంతో భార్య ఒకచోట, భర్త మరోచోట విధులు నిర్వర్తిస్తూ అక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడంతో పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారి ఆలనా, పాలన, చదువు, ఇలా ప్రతిదీ కష్టంగా మారడంతో స్పౌజ్ కానిస్టేబుళ్లు తమ సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేడుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి చేరుకోవాలంటే ఆ బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దంపతులిద్దరూ పోలీసులే.. కానీ.. ఉద్యోగమున్నా అటు పిల్లలను చూసుకోలేక, ఇటు కుటుంబాన్ని పట్టించుకోక దంపతులిద్దరూ బాధను దిగమింగుకుంటూ విధులకు హాజరవుతున్నారు. ఎండనక వాననక కష్టపడి పనిచేస్తున్నా సంతోషం కరువైందని, కుటుంబం దగ్గరగా లేకపోవడంతో స్పౌజ్ కానిస్టేబుళ్లు మానసికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఉన్నా కనీసం కుటుంబ సభ్యులతో సరదాగా కాసేపు మాట్లాడుకోలేని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం కరుణ చూపి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని స్పౌజ్ పరిధిలోని పోలీసులు మొరపెట్టుకుంటున్నారు. పిల్లల భవిష్యత్‌ను అర్థం చేసుకుని తమకొక దారిచూపాలని కోరుతున్నారు. ఉపాధ్యాయుల మాదిరి కరుణ చూపండి.. క్రమబదీ్ధకరణ సమయంలో ప్రభుత్వం 13 జిల్లాలను బ్లాక్ లిస్టులో ఉంచి దంపతులైన ఉద్యోగుల బదిలీలను నిలిపివేసింది. తాజాగా ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. గత నెల 26న విద్యాశాఖ 13 జిల్లాల్లోని దంపతులైన ఉపాధ్యాయులను (స్పౌజ్) ఒకే జిల్లాకు బదిలీ చేసింది. అయితే ఎస్జీటీల విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ తరుణంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న స్పౌజ్ పరిధిలోని ఉద్యోగులను కూడా బదిలీ చేయాలని పోలీసులు ప్రభుత్వానికి, డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నారు. కానిస్టేబుళ్ల స్థాయిలో స్పౌజ్ కింద పనిచేసే వారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 మంది ఉంటారు. బదిలీ అవకాశం కల్పించమని దరఖాస్తు చేసుకొని సంవత్సరం దాటినప్పటికీ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇబ్బంది ఉందని సిక్ లీవ్, ఎర్న్ లీవ్స్ అడిగినప్పటికీ బందోబస్తు ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో సెలవులకు కూడా అవకాశం ఇవ్వడం లేదని తెలిసింది. అసలే సెలవులు లేని ఉద్యోగం, పిల్లలను చూసుకునేందుకు ఒక పూట అనుమతి తీసుకుని ఇంటికి బయలు దేరినా మార్గమధ్యలో ఎమర్జెన్సీ డ్యూటీ అని ఫోన్ వస్తే కుటుంబాన్ని చూడకుండానే వెనుదిరిగే పరిస్థితి ఉందని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే సిబ్బంది వాపోతున్నారు. పోలీసులు మినహా మిగతా ఉద్యోగులకు తమకేమైనా సమస్య వస్తే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు తెలుపుతారు. కానీ పోలీసులకు అలాంటి పరిస్థితి ఉండదు. యూనిఫాం వేసుకున్న రోజే వారు ఆ హక్కును కోల్పోతారు. ప్రభుత్వం తమ దీనగాథను అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని స్పౌజ్ పరిధిలోని పోలీసులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో భార్య కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా, భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇటీవల రెండు సంవత్సరాలు వయసు కలిగిన చిన్న కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో ఎమర్జెన్సీగా ఆసుపత్రికి తీసుకొని వెళ్లాల్సి వచి్చంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు విధి నిర్వహణలో ఉండడం, ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బంధువులకు ఫోన్ చేసి చెప్పగా వారు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. నాలుగైదు గంటల తర్వాత వారు ఆసుపత్రికి వెళ్లాల్సి వచి్చంది. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారిని ఆసుపత్రిలో చేరి్పంచలేక, మరోవైపు విధులను వదిలేసి రాలేక వారు నరకయాతన అనుభవించారు. -
స్పౌజ్ బదిలీలు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితులతో పాటు ఇంకా మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌ను కోరింది. సంఘం ప్రతినిధులు వివేక్, ఖాదర్ నేతృత్వంలో పలువురు ఉపాధ్యాయులు ఆదివారం మంత్రులను కలిసి, ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల 615 మంది స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్‌లను బదిలీ చేశారని, ఇంకా కొన్ని బదిలీలు మిగిలే ఉన్నాయని తెలిపారు. ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితుల బదిలీలను నిలిపి వేశారని వివరించారు. ఉపాధ్యాయి నులు 200 కిలోమీటర్లు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘మనఊరు–మనబడి’ స్కూళ్ల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: మన ఊరు–మన బడి పథకం కింద పనులు పూర్తి చేసిన స్కూళ్లను రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కె.తారకరామారావు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సంబంధిత నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు మొదటి విడతలో పూర్తయిన పాఠశాలలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని ప్రభుత్వం ప్రజా ప్రతి నిధులను కోరింది. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు–మనబడి పథకాన్ని 3 దశల్లో చేపట్టాలని నిర్ణయించింది. పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి మొత్తంగా రూ.7,289 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశా రు. రాష్ట్రంలోని 26,055 స్కూళ్ల లో తొలి విడతలో 9,123 స్కూళ్లను ఎంపిక చేశారు. రూ.3,497.62 కోట్లను మొదటి విడతలో ఖర్చు చేయాలని నిర్ణయించారు. అయితే, ఇప్పటి వరకు 1,200 స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. పాఠశాలల్లో భవనాలకు మరమ్మతులు చేపట్టడం, రంగులు వేయడం, కాంపౌండ్ వాల్స్ నిర్మించడం, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఫర్నిచర్ అమర్చడం, డిజిటల్ తరగతులు, సోలార్ ప్యానెల్స్, అధునా తన వసతుల పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి ప్రభు త్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఈ పథకం కింద పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు, మంచి లైటింగ్ సదుపాయం, భోజనవసతి, గ్రీన్ బోర్డులు, డిజిటల్ తరగతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
50,000 మంది టీచర్లకు బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఈ అంశంపై అధికారులతో చర్చించారు. శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె సమీక్షించారు. మరోవైపు పదోన్నతులకు వీలుగా ఖాళీలను లెక్క తేల్చే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది టీచర్లకు స్థాన చలనం కలగనుంది. ఒకేచోట 8 ఏళ్ల సర్వీసు నిండి అనివార్యంగా బదిలీ అవ్వాల్సిన వాళ్లు 25 వేల మంది ఉంటే..ఐదేళ్లుగా ఒకే స్కూల్లో పనిచేస్తున్న 25 వేల మంది కూడా బదిలీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదిలావుండగా పలు ఉపాద్యాయ సంఘాలు బదిలీలు ప్రహసనంగా మారాయని, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లుకు కోరిన ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధికారులను నిలదీస్తే పైనుంచే పైరవీలు వస్తున్నాయని వారు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని, దీనిపై ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు తెలిపాయి. సొంత జిల్లాల్లో ఖాళీలన్నీ స్పౌజ్లతోనే భర్తీ! భార్యాభర్తల (స్పౌజ్) బదిలీలకు ప్రభుత్వం అనుమతించడం టీచర్ల పదోన్నతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్పౌజ్‌ల్లో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వీళ్లంతా స్కూల్ అసిస్టెంట్లు. 317 జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు బదిలీ అయ్యారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో 70 శాతం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు (ఎస్జీటీలు) పదోన్నతులు ఇవ్వడం ద్వారా, 30 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రస్తుతం దాదాపు 427 మంది స్పౌజ్‌లను సొంత ప్రాంతాలకు పంపుతున్నారు. ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ స్థానాల్లో ముందుగా వీరిని నియమిస్తారు. ఫలితంగా 13 జిల్లాల్లో ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్స్‌గా పదోన్నతి పొందేందుకు ఉన్న ఖాళీల సంఖ్య తగ్గే అవకాశం కన్పిస్తోంది. ఇంగ్లిష్, గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టుల్లో పదోన్నతులకు ఎక్కడా అవకాశం లేకుండా పోతోంది. దీనిపై ఎస్జీటీలు మండిపడుతున్నారు. మరోవైపు స్పౌజ్‌లు తిరిగి తమ జిల్లాలకు రావడంతో, వారు ఇప్పటివరకు పనిచేసిన 19 జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో తక్కువ సీనియారిటీ ఉన్న ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశం వస్తోంది. ప్రక్రియ మొదలుకాక ముందే బదిలీలు! బదిలీల ప్రక్రియ మొదలవ్వక ముందే దాదాపు 120 మందిని కోరుకున్న ప్రాంతాలకు పంపుతూ ఉత్తర్వులు వెలువడటం తీవ్ర దుమారం రేపుతోంది. మరో 200 వరకు ఇదే విధమైన సిఫారసులు వచ్చినట్టు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై ఉపాధ్యాయ నేతలు మంత్రి సబిత వద్ద తీవ్ర నిరసన తెలిపారు. మరోవైపు పైరవీల జోరు పెరగడంతో టీచర్లు కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నేతలను, రాజకీయ ప్రముఖులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది మధ్యవర్తులు పుటుకొస్తున్నారు. పైనుంచి బదిలీ ఆదేశాలు తెప్పిస్తామని చెబుతూ రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నేటి నుంచి నిరసనలు: యూటీఎఫ్ బదిలీల్లో పైరవీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి నిరసనలు చేపట్టాలని ఉపాద్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చినట్లు టీఎస్ యూటీఎఫ్ నేత చావా రవి తెలిపారు. ప్రభుత్వమే పైరవీలకు తెరలేపడం టీచర్లలో అంశాంతి కల్గిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లందరికీ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. 29న డైరెక్టరేట్ ముట్టడి: టీఎస్పీటీఏ స్పౌజ్ టీచర్లు 2,200 మంది వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే ఓటు హక్కు ఉండే 625 మంది స్కూల్ అసిస్టెంట్లకే బదిలీకి కల్పించడం అన్యాయమని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ అన్నారు. మిగతా స్పౌజ్‌ల సంగతి తేల్చకుంటే 29న పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. బారులు తీరిన టీచర్లు ఉపాధ్యాయ పదోన్నతులకు సంబంధించి నల్లగొండలో ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలనకు ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం (డైట్) వద్ద బారులుదీరారు. – నల్లగొండ -
ఆన్లైన్లోనే టీచర్ల బదిలీలు
తాండూరు: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతు లన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తన పుట్టిల్లయిన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కోటబాస్పల్లిలో ఎల్లమ్మ దేవత ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలను సబిత ఖండించారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, అవగాహన రాహిత్యంతోనే ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. బదిలీలు, పదోన్నతులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఈసారి కూడా తాను మహేశ్వరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. -
ఓఎంసీ కేసు నుంచి తప్పించండి
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం గనుల కేసు నుంచి తన పేరును తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆమె సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం మంత్రి అభ్యర్థనను గత అక్టోబర్‌లో తోసిపుచ్చింది. దీంతో సీబీఐ న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కేసుతో తనకు సంబంధం లేనందున పేరు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈ క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై విచారణ జరగనుంది -
టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ పదోన్నతులకూ ఓకే
సాక్షి, హైదరాబాద్: పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మంగళ, బుధవారాల్లో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆశిస్తున్నారు. విధి విధానాలు ఎలా ఉంటాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని మంత్రులు హరీష్‌రావు, సబిత ఇంద్రారెడ్డి ఆదివారం ఆయా సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు. అనంతరం బదిలీలు, పదోన్నతులకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారని, త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని సబిత తెలిపారు. కస్తూరీ బా గాంధీ బాలికల విద్యాలయంలో కూడా ఇది అమలవుతుందని ఆమె చెప్పారు. సంక్రాంతి కానుకగా ఈ శుభవార్త చెబుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. టెన్త్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించడం... ఇతర తరగతుల పరీక్షలు త్వరలో జరుగుతున్న కారణంగా ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ప్రకటించినా, ఏప్రిల్ తర్వాతే వీటిని అమలు చేస్తామని తెలిపారు. అయితే ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను ఫిబ్రవరి రెండో వారం కల్లా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రమోషన్లు ఎంతమందికి? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1.05 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. వీటిల్లో 18 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో తెలిపింది. 317 జీవో అమలు తర్వాత దీనిపై స్పష్టమైన లెక్కలు తీయాల్సి ఉంది. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7111 ఖాళీలున్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)లకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70 శాతం ఖాళీలు భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. ఈ క్రమంలో 5 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్స్‌గా పదోన్నతి లభిస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులు 2084 ఖాళీలున్నాయి. వీటిని ఎస్జీటీల ద్వారా భర్తీ చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో 1948 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ఉన్న స్కూల్ అసిస్టెంట్స్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 9 వేల మందికిపై ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లభిస్తాయి. కోర్టు వివాదాల తర్వాతే ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోల భర్తీ మండల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారులు, భాషా పండితుల అప్‌గ్రేడ్ వ్యవహారం చేపట్టేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు. రాష్ట్రంలో 443 ఎంఈవో పోస్టులున్నాయి. కానీ ఇప్పుడు పనిచేస్తున్న ఎంఈవోలు 21 మంది మాత్రమే. డిప్యూటీ డీఈవో పోస్టులు 78 ఉంటే 18 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఎంఈవో పోస్టులను నేరుగా ఎంపికైన ప్రభుత్వ హెచ్ఎంల ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల పాఠశాలలకూ ఈ అవకాశం ఇవ్వాలని మరికొన్ని సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం వివాదం కోర్టు పరిధిలో ఉంది. భాషా పండితుల విషయం కూడా న్యాయస్థానంలో ఉంది. ఈ కారణంగా కోర్టు వివాదం ముగిసిన తర్వాతే ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్నికల కోసమేనా? హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మార్చిలో ఈ ఎన్నిక జరిగే వీలుంది. మరోవైపు సాధారణ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే 317 జీవో కారణంగా ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 2015లో ప్రమో షన్లు, బదిలీలు చేపట్టారు. 2017లో మరోసారి బదిలీలు మాత్రమే జరిగాయి. అప్పట్నుంచి బది లీలు, పదోన్నతులు లేవు. ఈ ప్రభావం ఎమ్మెల్సీ, సాధారణ ఎన్నికలపై ఉంటుందని ప్రభుత్వం సందేహిస్తోందని, అందుకే హడావుడిగా ఉపాధ్యా యవర్గాలను ఆకర్షించేందుకు ప్రకటన చేశారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. 317 జీవో కారణంగా జరిగిన బదిలీల్లో 13 జిల్లాల్లో స్పౌజ్ కేసులను పరిష్కరించలేదని, ఇప్పుడు బదిలీలు ఎలా చేపడతారని మరికొంతమంది అంటున్నారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలి బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలనే నిర్ణయం మంచిదే. దీంతో పాటు స్కూళ్ళలో అన్ని స్థాయి ల్లో ఖాళీలు భర్తీ చేయాలి.. అప్పుడే విద్యా వ్యవస్థలో మార్పు సాధ్యం. ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పర్యవేక్షక పోస్టులను విస్మరించకూడదు. – పి రాజభాను చంద్ర ప్రకాశ్, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు మంచి నిర్ణయం ఉపాధ్యాయ సంఘాలకు ఈ తరహా తీపి కబురు ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే నిర్ణయం సమర్థనీయం. – బీరెల్లి కమలాకర్, పింగిలి శ్రీపాల్ రెడ్డి (పీఆర్టీయూటీఎస్ నేతలు) -
తెలంగాణ ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్
-
తెలంగాణలో టీచర్లకు గుడ్‌న్యూస్.. బదిలీలు, పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్స్ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. భేటీ సందర్బంగా బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. ఇందుకు తగినట్టు మంత్రులు కార్యచరణను రూపొందిచనున్నారు. -
ఇంటర్‌తో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇంటర్మీడియెట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లోని 20 వేల మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియెట్ బోర్డు ఇన్చార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో గురువారం మంత్రి సమీక్షించారు. గణితం సబ్జెక్టు కలిగి ప్ర భుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరిలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో 60 శాతం మార్కు లు పొందిన విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఎంపికైన వారికి ఆన్లైన్లోనే ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారని, అది పూర్తయ్యాక హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్యాలయంలో ఆరు నెలలపా టు ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. ఇంటర్న్‌షిప్‌లో నెల కు రూ.10 వేలు ఉపకారవేతనం ఇస్తారని, ఆ తర్వాత రూ. 2.5 లక్షల వార్షిక వేతనంతో పూర్తిస్థాయి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 15న ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. -
బీటెక్‌లోకి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లపాటు కరోనా కారణంగా పీయూసీలో తక్కువ జీపీఏ వచ్చినందున.. మానవతా దృక్పథంతో బీటెక్‌లోకి అనుమతించాలని బాసర ట్రిపుల్ ఐటీలో చదివిన పలువురు విద్యార్థులు విద్యా మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని కలిసి వేడుకున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చా మని తమ పరిస్థితిని వివరించారు. టెన్త్‌లో అత్య« దిక మార్కులు వస్తేనే బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుందని ప్రభుత్వానికీ తెలుసునని వారు స్పష్టం చేశారు. పీయూసీలో గ్రేడ్ తక్కువ రావడానికి రెండేళ్లుగా ఉన్న పరిస్థి తులే కారణమని గుర్తించకపోవడం సరికాదని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించారని, తమ కుటుంబాల్లో సెల్‌ఫోన్ కూడా కొనలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చినా నెట్ బ్యాలెన్స్‌కు ఖర్చు పెట్టలేకపోయామని వారు తెలిపారు. నెట్వర్క్ సరిగ్గా పనిచేయని పల్లెల్లో ఉండటం వల్ల ఆన్లైన్ క్లాసులు సరిగా వినలేకపోయామనినిజామాబాద్‌కు చెందిన విద్యార్థిని ఎం.అంజలి వాపోయింది. విద్యార్థుల ఆవేదనపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫె సర్ ఆర్.లింబాద్రి స్పందిస్తూ వెంటనే విషయాన్ని బాసర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యా ర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ విషయమై బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకట రమణ స్పంది స్తూ, 6 జీపీఏ లేకుండా ఇంజనీరింగ్‌లోకి అనుమ తించకూడదనే నిబంధన ఉందని స్పష్టం చేశా రు. అయినప్పటికీ ఈ విషయాన్ని బోర్డ్ సమా వేశంలో చర్చిస్తామని, సానుకూల నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం
మన్సూరాబాద్: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) వజ్రోత్సవాలను సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతగల పౌరులను సమాజానికి అందించాల్సిన బాధ్య త ఉపాధ్యాయులపై ఉందని, విలువలతో కూడిన విద్య అందించడంలో కలసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల్లో కోతలతో కొంత మేర ఇబ్బందులు తలెత్తుతున్నాయని... అందుకే ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాల చెల్లింపులో కాస్త జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు. చదువులపై భారీగా ఖర్చు... రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని కొందరు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు విద్యారంగానికి కేటాయించిన నిధులతోపాటు తమ ప్రభుత్వం ఏర్పడ్డాక కేటాయిస్తున్న నిధుల వివరాలను గణాంకాలతో ఆయన వివరించారు. విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు బడ్జెట్లో 10 శాతానికి పైగానే ఉంటున్నాయని తెలిపారు. కేజీ టు పీజీ విద్యను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే మొదట అటవీ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదేనన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటిసారిగా 43 శాతం, తరువాత 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దేశంలో అత్యధికంగా జీతాలు పొందుతున్న ఉద్యోగులంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులని, అందులో ఉపాధ్యాయులే అత్యధికంగా ఉన్నారన్నారు. కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తొలి నుంచీ ప్రభుత్వానికి అండగా ఉపాధ్యాయులు: మంత్రి సబిత ఉపాధ్యాయులు మొదటి నుంచీ తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉన్నారని, ఎస్టీయూటీఎస్ సంఘం శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు ఎన్ని సమస్యలున్నా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యలపై పోరాడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల, ప్రమోషన్లు, బదిలీల విషయంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు నూతన విద్యావ్యవస్థ ఏర్పాటుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అనంతరం వజ్రోత్సవ సావనీర్‌ను, డైరీని, వజ్రోత్సవ సీడీని, తెలంగాణ జాతిరత్నాలు పుస్తకాన్ని, నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర అధ్య క్షుడు సదానందగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి, ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావు, నరేంద్రారెడ్డి, బ్రహ్మచారి, నాగేశ్వర్రావు, ఏపీ సంఘం అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, తిమ్మన్న, కమలారెడ్డి, కరుణాకర్, శ్రీధర్, సుధాకర్, మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఉన్నత విద్యాసంస్థల్లో అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: సరికొత్త చట్టాలు, అధునాతన సాంకేతికత సహాయంతో ఉన్నత విద్యాసంస్థల్లో అసాంఘిక చర్యలపై ఉక్కుపాదం మోపాలని ఉన్న త విద్యా, పోలీసుశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికిగాను ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేయాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యామండలి నేతృత్వంలో గురువారం ఇక్కడ ‘విద్యాసంస్థల్లో భద్రతాచర్యలు, రక్షణ విధానం’అనే అంశంపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. యూనివర్సిటీలు, కాలేజీల్లో మాదవద్రవ్యాలు, సైబర్ నేరాలు, వివక్ష, వేధింపుల నియంత్రణ సవాల్‌గా మారిందని పోలీసు అధికారులు చెప్పినట్లు తెలిసింది. విద్యాసంస్థల్లోకి పోలీసుల ప్రవేశాన్ని అడ్డుకునే చట్టాలను మార్చాలని, స్వేచ్ఛగా ప్రవేశించి, ఏ కేసునైనా శోధించే వీలు కల్పించాలని, నిఘా వ్యవస్థ కోసం పటిష్టమైన చర్యలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని పోలీ సు అధికారులు అభిప్రాయపడ్డారు. సీసీ కెమెరా లు, కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని పలువురు సూచించగా వీటన్నింటికీ నిధుల సమ స్య ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. అంతిమంగా పోలీసు, విద్యాశాఖ కలిసి పనిచేయాలని, ఈ దిశగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయాలని నిర్ణయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సుమతి తదితరులు పాల్గొన్నారు. భద్రత ముఖ్యమే: లింబాద్రి సమావేశం అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాసంస్థల్లో భద్రత కీలకమైన అంశమని, దీని కోసం పోలీసు లు, విద్యాశాఖ సమన్వయంతో ముందుకువెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులుండే వర్సిటీ క్యాంపస్‌ల్లో డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టడం వంటి విషయాలపై అవగాహనకు సరికొత్త విధానాలు అనుసరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. కొత్తగా కాలేజీల్లోకి అడుగుపెట్టే వారిలో న్యూనతాభావం తొలగించేందుకు, ఒత్తిడికి లోనవ్వకుండా కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు అవసరంపై చర్చించనట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడే వీలుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడే క్రమంలో వాటిని వినియోగించే విద్యార్థులను నేరస్తులుగా చూడబోమన్నారు. గవర్నర్ ఆమోదించగానే ఖాళీల భర్తీ: మంత్రి సబిత సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఆమోదం పొంది, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న విద్యాశాఖ బిల్లులపై అనుమానాలను నివృత్తి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టం చేశారు. ఆమె గురువారం బషీర్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. కొంత కాలంగా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదం లభించిన వెంటనే వర్సిటీల్లోని ఖాళీ లను భర్తీ చేస్తామని చెప్పారు. బిల్లులను గవర్నర్ ఎందుకు ఆమోదించడం లేదో తనకు తెలియ ద ని పేర్కొన్నారు. కరోనా కాలంలో తెలంగాణ లోనే ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా ఇక్కడి ప్రజలను కలిసే ప్రయత్నం చేయలేదని ఆమె వి మర్శించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రజలపై మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. -
‘మన ఊరు–మనబడి’ పనుల వేగం పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ‘మన ఊరు–మనబడి’తొలిదశలో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, దీనివల్ల పాఠశాలల రూపురేఖలే మారిపోతాయని స్పష్టచేశారు. ‘మన ఊరు–మన బడి’పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆమె గురువారం వీడియో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఈ నెలాఖరుకు ప్రతీ మండలంలో కనీసం రెండు పాఠశాలల్లోనైనా పనులుపూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. ‘మన ఊరు–మన బడి’కార్యక్రమానికి రూ.7,289 కోట్లను కేటాయించామని, తొలిదశలో భాగంగా 9,123 స్కూళ్లకు 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,497 కోట్లను కేటాయించామని వెల్లడించారు. ఈ పనులకు నిధులు అందుబాటులో ఉన్నాయని, పనులను వేగవంతం చేయాలని కోరారు. పనులను పర్యవేక్షిస్తున్న ఏజెన్సీలతోను, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ చివరి నాటికి 1,210 పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను కోరారు. వీటికీ డ్యూయల్ డెస్క్‌లను అందజేయాలని, గ్రంథాలయాలను, ఆట స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి
గన్‌ఫౌండ్రీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖమంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ తాత్కాలిక ఉపాధ్యాయుల ద్వారా కాకుండా శాశ్వత ఉపాధ్యాయుల భర్తీలను చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. త్వరలో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపడతామని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
స్కూళ్లు తెరిచే నాటికే యూనిఫాం: మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే యూనిఫాం అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. మన ఊరు–మన బడి, యూనిఫాం సరఫరా అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. వచ్చే ఏడాది 25 లక్షల మంది విద్యార్థులకు రూ.121 కోట్లతో యూనిఫాం అందించాలని నిర్ణయించారు. విద్యార్థుల మధ్య తారతమ్యాల దూరానికి యూనిఫాం అవసరమని ఆమె తెలిపారు. ఏప్రిల్ నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జిల్లా స్థాయిలో యూనిఫాం సిద్ధం చేయాలని సూచించారు. -
ప్రతి విద్యార్థికీ ఉపాధి లభించాలి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఉపాధి కల్పించేలా ప్రస్తుత బోధన విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ దిశగా విశ్వవిద్యాలయాల ఉప కులపతులు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, టీసీఎస్, టీఎస్ ఆన్లైన్ నేతృత్వంలో ‘ఉపాధి అవకాశాల పెంపునకు సాధికార విద్య’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సబిత మాట్లాడుతూ, డిగ్రీలతో బయటకొచ్చే ప్రతి విద్యార్థికీ ఉపాధి లభించేలా చూడాలన్నారు. నైపుణ్యత పెంచడం ద్వారానే ఇది సాధ్యమని తెలిపారు. విద్యార్థులు హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీల్లోనే ప్రవేశాలు కావాలని కోరుకుంటున్నారని, అలా కాకుండా అన్ని కాలేజీల్లోనూ ప్రవేశాలు కోరుకునే విధంగా ఆయా కాలేజీల్లో బోధన విధానంలో మార్పు తేవాలని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఏడు లక్షల మందికి రాష్ట్రంలో ఉపాధి కల్పించినట్టు తెలిపారు. నైపుణ్యమే ముఖ్యం నైపుణ్యంతో కూడిన విద్యతోనే ఉపాధి అవకాశాలుంటాయని ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు్టగా ఇంటర్న్‌షిప్ ఉండాలన్నారు. మార్కులకు ప్రాధాన్యం ఇవ్వకుండా మంచి ప్రాజెక్టు వర్క్‌పైనే దృష్టి పెట్టాలని సూచించారు. డిగ్రీ చేతికి రాగానే ఉపాధి వెంట పరుగులు పెట్టేకన్నా, పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టాలని చెప్పారు. 20ఏళ్ళ నాటి పుస్తకాలతోనే ఇంకా బోధన సాగుతుండటం శోచనీయమని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. నేటి అవసరాలకు అనుగుణంగా విద్య సాగాలని పేర్కొన్నారు. విద్యలో నాణ్యత, పరిణతి పెరగాల్సిన అవసరం ఉందని టీసీఎస్ భారత విభాగం ముఖ్య అధికారి గోపాలకృష్ణ జీఎస్ఎస్ తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి అనేక కొత్త కోర్సులను ప్రవేశపెట్టిందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. హానర్స్, బీఎస్సీలో డేటా సైన్స్ వంటి కోర్సులను ఉదహరించారు. మండలి వైఎస్ చైర్మన్ ప్రొఫెసర్ వి వెంకటరమణ, పలు యూనివర్శిటీల వీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
క్షణాల్లో నకిలీని పట్టేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: బోగస్ సర్టిఫికెట్ల నియంత్రణకు మరో అడుగు పడింది. ఈ దిశగా స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఉన్నత విద్యామండలి రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. 27 భాషల్లో ఈ వెబ్సైట్ సేవలు పొందేలా డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, డీజీపీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వెబ్సైట్ రీ డిజైనర్ ప్రొఫెసర్ నవీన్‌కుమార్, పలు యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. తెలంగాణ విద్యాసంస్థల విశ్వసనీయతను విశ్వవ్యాప్తంగా చాటడానికే ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు వక్తలు చెప్పారు. తక్షణ వెరిఫికేషన్ కూడా.. ‘ఆధార్, ఈమెయిల్ వంటి వివరాలతో ఎవరైనా ఈ వెబ్‌సైట్‌కు లింక్ అవ్వొచ్చు. తక్షణ వెరిఫికేషన్ కోరే వారికి కొన్ని నిమిషాల్లోనే పరిమిత సమాచారం ఇస్తాం. సమగ్ర సమాచారం కోరే వారికి కొంత వ్యవధితో వెరిఫికేషన్ పూర్తి చేసి సమాచారం పంపుతాం. దీనికి రూ.1,500 వరకూ రుసుము ఉంటుంది. మార్కులు, ఎక్కడ చదివింది, అన్ని వివరాలను డిజిటల్ సంతకంతో అందిస్తాం. 15 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థుల సమాచారం 2010 నుంచి అందుబాటులో ఉంది. ఏ దేశం నుంచైనా, ఏ సంస్థ అయినా అనుమానం ఉన్న సర్టిఫికెట్ అసలైనదా లేదా నకిలీదా అనేది కేవలం కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు’ అని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి చెప్పారు. కొత్త టెక్నాలజీ పరిధిలోకి ఇంటర్, టెన్త్ బోర్డులను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ చెప్పారు. ఈ సైట్నూ హాక్ చేసే ఘనులున్నారు: డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్పటివరకూ ఉద్యోగాలకు వెళ్లే యువత సరిఫికెట్లు అసలో, నకిలీవో తెలుసుకోవాలంటే తీవ్ర జాప్యం జరిగేది. దీనివల్ల యువకుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసే ఒక ముఠాను పట్టుకుంటే, మరికొన్ని ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్లు దేశ విదేశాల్లో ఉన్నారు. కన్సల్టెన్సీలూ ఫేక్ సర్టిఫికెట్లు ప్రోత్సహిస్తున్నాయి. రియల్ టైమ్‌లో ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారం. రాబోయేకాలంలో ఇందులోనూ హ్యాకర్స్ ప్రవేశించే వీలుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో మరింత పటిష్టం చేయాలి. తెలంగాణ చరిత్రలో మైలురాయి: సబిత తెలంగాణ విద్య చరిత్రలో ఇదో మైలురాయి. దేశంలోనే తొలిసారి మన రాష్ట్రంలోనే దీన్ని తెచ్చాం. నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టాలన్న ఆలోచనకు అనుగుణంగా అన్నిస్థాయిల అధికారులు చొరవ తీసుకున్నారు. టెక్నాలజీని వాడుకుని జరిగే మోసాలకు ఇది అడ్డుకట్ట వేస్తుంది. దీన్ని ఆషామాషీగా ప్రారంభించి వదిలేయకుండా మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలి. మన రాష్ట్రంలో జారీ చేసే సర్టిఫికెట్లు నకిలీలు చేయలేరనేది నిరూపించాలి. -
ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలి: జీటీఏ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ ఐఓఎస్, డైట్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని గురువారం కలిసిన సంఘం నేతలు ఈమేరకు వినతి పత్రం అందజేశారు. -
యూజీ విద్యార్థినులకే నిజాం హాస్టల్
గన్‌ఫౌండ్రీ: నిజాం కళాశాల విద్యార్థినులు 15 రోజులుగా చేస్తున్న ఆందోళనకు ఫలితం దక్కింది. విద్యార్థినులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. నిజాం కాలేజీ హాస్టల్‌ను యూజీ విద్యార్థినులకే కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తమ సమస్యల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించడంపై పలువురు విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ పోరాటానికి మద్దతుగా నిలిచిన రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలి పారు. ఎలాంటి షరతులు లేకుండా డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సి పల్ సూచించారు. దీంతో విద్యార్థినులు తమ అందోళనను విరమించారు. బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. -
ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్: మంత్రి సబితా
సాక్షి, హైదరాబాద్: నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్, నిజాం కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు. నిజాం కళాశాల విద్యార్థినుల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్గదర్శక నిబంధనలకు అనుగుణంగా వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులందరూ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా నిజాం కళాశాలలో యుజీ విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థినులకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. చదవండి: (అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లపై తేల్చేసిన సీఎం కేసీఆర్) -
‘ఇంగ్లిష్ మీడియానికి అనుమతించండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 40 ప్రభుత్వ పాఠశాల్లో 9, 10 చదివే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో అదనపు తరగతుల నిర్వహణకు అనుమతించాలని ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర నేతలు రాజాభానుచంద్ర ప్రకాశ్, రాజుగంగారెడ్డి విద్యామంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కోరారు. టెన్త్ ఫీజు చెల్లించే తేదీలు ప్రక టించినా ఇంకా ఇంగ్లిష్ మీడియానికి అను మతించలేదని, దీంతో విద్యార్థులకు నష్టం జరుగుతోందని తెలిపారు. వెంటనే ఉపాధ్యా య బదిలీలు చేపట్టాలని, తమ సంఘం లేవ నెత్తిన అనేక అంశాలు పెండిగ్లో ఉన్నాయని మంత్రికి వివరించారు. తమ విజ్ఞప్తిపై సబిత సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు -
విలువలు, అవసరాలే లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో విలువలు పెంచడం.. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు తగినట్టుగా కోర్సులు/సబ్జెక్టులను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఇంటర్ విద్యలో కీలక మార్పులకు విద్యాశాఖ సిద్ధమైంది. బోధన ప్రణాళికను సమూలంగా మార్చాలని, ఇందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో పలు ప్రతిపాదనలు చేశారు. భేటీలో సుమారు 111 అంశాలపై క్షుణ్నంగా చర్చించారు. ప్రధానంగా ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు, కోర్సుల్లో తీసుకురావాల్సిన మార్పులు, పాలనాపరమైన జాప్యాన్ని నివారించే అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. కోవిడ్ పరిణామాల నేపథ్యంలో ఇంటర్ విద్యలో చోటు చేసుకున్న మార్పులను పరిశీలించిన మంత్రి.. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు మెరుగయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. కోర్సులపై నిపుణుల కమిటీ కాలానికి అనుగుణంగా ఇంటర్ విద్య కోర్సుల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రి, అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ పలు కోర్సుల్లో సంబంధం లేని/అవసరం లేని సబ్జెక్టులు ఉన్నాయని.. వాటిని మార్చాల్సిన అవసరం ఉందని ఇంటర్ బోర్డు అధ్యయన నివేదికలలో వెల్లడైన అంశాలు, ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ గ్రూపుల నవీకరణ కోసం నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గుర్తింపుపై ఆలస్యమెందుకు? ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు బోర్డు గుర్తింపు ప్రక్రియపై కొన్నేళ్లుగా విమర్శలు వస్తుండటంపై సమావేశంలో చర్చించారు. కాలేజీలు తెరిచి నెలలు గడుస్తున్నా అనుబంధ గుర్తింపు పెండింగ్‌లో పెట్టడం, తర్వాత అన్ని కాలేజీలకు ఇవ్వడం సాధారణమైపోయిందని కొందరు అధికారులు ప్రస్తావించారు. గుర్తింపు ఇచ్చే క్రమంలో గతంలో ముడుపులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలనూ గుర్తుచేశారు. వీటన్నింటికీ పరిష్కారంగా కాలేజీలు తెరిచే నాటికే అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని, మేలోనే గుర్తింపు ఇచ్చేదీ లేనిదీ తెలపాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారు లకు సూచించారు. ఇక వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష రాసే అదనపు సమయాన్ని అరగంట నుంచి గంటకు పెంచాలని తీర్మానించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, కాకతీయ, తెలంగాణ వర్సిటీల వైస్ చాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాలేజీలు తెరిచే నాటికే పుస్తకాలు: మంత్రి సబిత ఇంటర్ కాలేజీలు తెరిచే నాటికే విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండాలని బోర్డు భేటీలో నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సమావేశం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. పేపర్ సకాలంలో అందని కారణంగా పాఠ్య పుస్తకాల ముద్రణ ఈ ఏడాది ఆలస్యమైందని.. వచ్చే ఏడాదికి కావాల్సిన పుస్తకాల కోసం టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు విషయంలో జాప్యం తగదని సూచించినట్టు తెలిపారు. మార్పుల ప్రతిపాదనలు ఇవీ.. ►ఇంటర్లో ఉండే తెలుగు, హిందీ, ఇతర భాషా సబ్జెక్టుల్లో నైతిక విలువలు పెంపొందించే దిశగా సిలబస్‌లో మార్పులు తేవాలని బోర్డు సమావేశంలో తీర్మానించారు. ►ఎంఈసీ, ఎంపీసీ గ్రూపులకు ఒకే విధమైన గణిత సబ్జెక్టులు ఉన్నాయని.. వాస్తవానికి మేథ్స్ విద్యార్థులతో సమానంగా ఎంఈసీ విద్యార్థులకు మేథ్స్ ఉండాల్సిన అవసరం లేదని బోర్డు భావనకు వచ్చింది. కామర్స్‌కు ఉపయోగపడే మేథమేటిక్స్‌కు సబ్జెక్టులో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది. ►సీఈసీ గ్రూపులో సివిక్స్ కన్నా అకౌంటెన్సీకి ప్రాధాన్యం ఇవ్వాలని.. హెచ్ఈసీలో సివిక్స్ స్థానంలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో లోతైన అవగాహన పెంచేలా మార్పు చేయాలని ప్రతిపాదించింది. ►వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టాలని, తొలుత భాషా సబ్జెక్టులను ప్రయోగాత్మకంగా మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు. -
Nizam College: విద్యార్థుల నిరసన.. తలనొప్పిగా సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజి విద్యార్థుల సమస్యపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రోడ్డెక్కిన నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యపై విద్యాశాఖ మంత్రి స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. నిజాం కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కారమైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 50 శాతం డిగ్రీ, 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టళ్లు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం తలనొప్పిగా మారింది. కాగా, ప్రభుత్వ ఉత్తర్వులపై డిగ్రీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం తమకే కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో హీటెక్కిస్తున్న మోదీ టూర్ -
గవర్నర్ తమిళిసై ప్రశ్నల వర్షం.. మాట్లాడకుండా వెళ్లిపోయిన సబిత
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్–టీచింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఆమె గురువారం సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, మరికొందరు అధికారులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. సుమారు 45 నిమిషాలపాటు గవర్నర్‌తో భేటీ అయ్యారు. సందేహాలు.. వివాదాల మధ్య.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో గతంలో మాదిరిగా విడివిడిగా కాకుండా, ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే ఈ బిల్లుకు సంబంధించి తనకు పలు సందేహాలు ఉన్నాయని, వచ్చి వివరణ ఇవ్వాలని విద్యా మంత్రి సబితను గవర్నర్ తమిళిసై కోరారు. తనకు గవర్నర్ పిలుపు అందలేదని, ప్రజలను రాజ్‌భవన్ తప్పుదోవ పట్టించవద్దని మంత్రి సబిత వ్యాఖ్యానించడం, దీనిని తప్పుపడుతూ గవర్నర్ ప్రెస్‌మీట్ పెట్టి విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సబిత రాజ్‌భవన్‌కు వెళ్లారు. కామన్ రిక్రూట్మెంట్ బిల్లు తేవాల్సిన అవసరం, ఇందులో పాటించిన నిబంధనలు, యూజీసీ మార్గదర్శకాలను పరిగణనలోనికి తీసుకున్నామని గవర్నర్‌కు వివరించారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్ అసంతృప్తి అయితే రాష్ట్రంలోని వర్సిటీల్లో ఎనిమిదేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడాన్ని గవర్నర్ తమిళిసై ప్రస్తావించినట్టు తెలిసింది. దీనిపై ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. యూనివర్సిటీలకు చాన్సలర్ అయిన తనకు బిల్లు తెచ్చే విషయాన్ని ముందే చెప్పకపోవడంపై నిరసన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కనీసం వీసీలతోనైనా చర్చించారా? అని ప్రశ్నించినట్టు సమాచారం. ఇలాంటి బిల్లు తేవడం వల్ల విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే ప్రస్తుత విధానంలో నియామక ప్రక్రియ వల్ల అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, అందుకే ఉమ్మడి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు వివరించినట్టు సమాచారం. అలాగైతే వీసీల ప్రమేయమే లేకుండా జరిగే నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండదా? అని గవర్నర్ నిలదీసినట్టు తెలిసింది. బిల్లులోని అంశాలపై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. అధికారులు కొన్నింటికి బదులిచ్చారని.. కొన్నింటి విషయంలో స్పష్టత ఇవ్వలేకపోవడంతో గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ముందే సిద్ధమైన మంత్రి గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లే ముందు మంత్రి సబిత తన చాంబర్లో అధికారులతో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఎవరే అంశంపై మాట్లాడాలనే దానిపై చర్చించారు. సాంకేతిక, న్యాయ సంబంధ అంశాలపై సంబంధిత శాఖల నుంచి వివరాలు తెప్పించుకున్నట్టు తెలిసింది. అయితే గవర్నర్‌ను కలిసిన అనంతరం మంత్రి సబిత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఏ అధికారి కూడా మీడియాతో ఈ అంశంపై మాట్లాడొద్దని ఆదేశించినట్టు తెలిసింది. నియామకాల్లో పారదర్శకత అవసరం: గవర్నర్ తమిళిసై విశ్వవిద్యాలయాల ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టే పోస్టుల భర్తీ పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని.. అర్హత ఆధారంగానే నియామకాలు ఉండాలని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాల నేపథ్యంలోనే తాను ఉమ్మడి బోర్డు ఏర్పాటుపై ఆందోళన వ్యక్తం చేసినట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్, మంత్రి భేటీ అనంతరం రాజ్‌భవన్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సమావేశం సందర్భంగా గవర్నర్ పలు సూచనలు చేసినట్టు తెలిపింది. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కు సంబంధించి యూజీసీ నిబంధనలను కచ్చితంగా పాటించడం, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆందోళనలను పరిష్కరించడం అవసరమని అభిప్రాయపడినట్టు వివరించింది. యూనివర్సిటీల్లో లైబ్రరీలు, డిజిటల్ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ప్రభుత్వ హాస్టళ్లను మెరుగుపర్చడంతోపాటు విద్యాసంస్థల్లో ల్యాబ్‌లు పెంచాలని అధికారులకు సూచించినట్టు తెలిపింది. విశ్వవిద్యాలయాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గవర్నర్ పేర్కొన్నట్టు వివరించింది. చదవండి: ధరణిలో మరో లొల్లి!.. దశాదిశ లేని ప్రభుత్వ కసరత్తు -
గవర్నర్ తమిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో గురువారం భేటీ అయ్యారు. ఉమ్మడి నియామక బోర్డు బిల్లు ఆమోదంపై విద్యాశాఖ మంత్రి రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాలని గరవ్నర్ సూచించడంతో సబితా ఇంద్రారెడ్డి తమిళసైతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రితోపాటు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై మంత్రి వివరణ ఇచ్చారు. ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ సందేహాలను నివృత్తి చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకూడదనేదే తన విధానమని గవర్నర్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డు ద్వారా నియామకాలు త్వరగా జరగాలనేదే తన అభిమతమని తెలిపారు. అయితే నిబంధనలు అన్ని పూర్తి స్థాయిలో పాటిస్తున్నమని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి సబితా తెలిపారు. -
త్వరలో చెబుతా.. గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి సబిత రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ క్రమంలో గవర్నర్.. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో కేసీఆర్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు. తమిళిసై కామెంట్స్‌పై ఇప్పుడే స్పందించనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తను ఎక్కడా రాజ్‌భవన్‌ను డీగ్రేడ్ చేసేలా మాట్లాడలేదని సబిత అన్నారు. ప్రెస్‌మీట్ నిర్వహించి త్వరలో అన్ని వివరాలు చెప్తానని మంత్రి అన్నారు. మరోవైపు గవర్నర్‌ను మంత్రి కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగినా స్పందన లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు కాగా, రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులు ఉన్నాయంటూ మీడియా సమావేశంలో గవర్నర్ విమర్శలు గుప్పించారు. రాజ్‌భవన్.. ప్రగతిభవన్‌లా కాదు.. రాజ్‌భవన్‌కు ఎవరైనా ఎప్పుడైనా రావొచ్చన్నారు. ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు వచ్చాయని వాటిపై వివరణ అడిగానని బిల్లులు సమగ్రంగా పరిశీలించేందుకు సమయం తీసుకున్నానని, ఈ లోపే తప్పుడు ప్రచారం జరిగిందని గవర్నర్ మండిపడ్డారు. -
గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. లేఖపై మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్‌ను కలవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. అపాయింట్మెంట్ కోరాం.. ఇంకా ఖరారు కాలేదన్నారు. గవర్నర్‌ను కలిసి ఆమె సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసిన విషయం తెలిసిందే. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. చదవండి: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు -
బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌కు వినతి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్, ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు మంగళవారం మంత్రిని హైదరాబాద్‌లో కలిశారు. పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం వల్ల ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు. -
గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి?
దేశంలో గవర్నర్ల వ్యవస్థ రోజురోజుకు చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వాన్ని నడిపే వారికి, ఆయా రాష్ట్రాల గవర్నర్లకు మధ్య ఏర్పడుతున్న విభేదాలు మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై విద్యాశాఖకు చెందిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును నిలిపివేసి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్ భవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా అన్న మీమాంస సహజంగానే వస్తుంది. తమిళసై తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదించిన ఏడు బిల్లులను పెండింగ్‌లో ఉంచడం సరైన పద్దతి అనిపించదు. చదవండి: తెలంగాణలో ఒకలా.! ఏపీలో మరోలా.! ఎందుకలా..? ఆ బిల్లులు ఏవైనా చట్ట విరుద్దం, రాజ్యాంగ విరుద్దం అని భావిస్తే వాటిని ప్రభుత్వానికి తిప్పి పంపి, తమ అభ్యంతరాలను తెలియచేసి ఉండవచ్చు. కాని ఆమె ఆలా చేయలేదు. బిల్లుల ఆమోదం తన పరిధిలోనిది అంటూ కొత్త వాదన తీసుకు వచ్చారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఒక భాగమే తప్ప, గవర్నరే ప్రభుత్వం కాదు. గవర్నర్ గౌరవప్రదమైన అధినేతే తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం విడుదల చేసే ఏ జిఓలో అయిన బై ఆర్డర్ ఆఫ్ గవర్నర్ అని ఉన్నంత మాత్రాన అన్ని గవర్నరే జారీ చేసినట్లుకాదు తమిళసై కి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గత రెండేళ్లుగా ఏర్పడిన రాజకీయ బేధాభిప్రాయాలు ఇప్పుడు కొత్తరూపం దాల్చుతున్నాయి. ఇటీవలికాలంలో కేసీఆర్ కేంద్రంపైన, బీజేపీపైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ రియాక్షన్ ఈ విధంగా ఉందన్నది బహిరంగ రహస్యమే. కొన్ని నెలల క్రితం గవర్నర్ తమిళసై రాష్ట్రంలో టూర్లు చేస్తున్నప్పుడు ప్రభుత్వం సహకరించని మాట నిజమే. హెలికాఫ్టర్ వంటి సదుపాయం కల్పించడం మానే, కనీసం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వంటి వారు వచ్చి ఆమెకు స్వాగతం పలకడం లేదు. ప్రభుత్వం ఇలా చేయడం కూడా సరికాదు. అలాగే కేసీఆర్ పైన, ప్రభుత్వంపైన గవర్నర్ బహిరంగ వ్యాఖ్యలకు పాల్పడడం వల్ల వివాదాలు ముదురుతున్నాయి. సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వారినే గవర్నర్లుగా నియమిస్తుంటారు. గతంలో కాంగ్రెస్ టైమ్‌లో కూడా పలువురు గవర్నర్లు వివాదాస్పదంగా వ్యవహరించారు. ప్రత్యేకించి ఇతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఈ వివాదాలు తీవ్రంగా ఉంటున్నాయి. నాడు ఎన్టీఆర్‌కు షాక్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి గవర్నర్లు రామ్ లాల్ కాని, కుముద్ బెన్ జోషి వంటివారు కాని అనుసరించిన వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు గురైంది. రామ్ లాల్ అయితే ఏకంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేసి నాదెండ్ల భాస్కరరావుకు పట్టంకట్టారు. దాంతో పెద్ద ప్రజా ఉద్యమం వచ్చి, ఆనాటి ఇందిరాగాంధీనే దిగివచ్చి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పునరుద్దరించక తప్పలేదు. కుముద్ బెన్ జోషిపై ఆనాటి మంత్రి శ్రీనివాసులురెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించేవారు. రాజ్‌భవన్‌ను కాంగ్రెస్ ఆఫీస్‌గా మార్చేశారన్న ఆరోపణలు వచ్చేవి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్లు పెద్దగా ప్రభుత్వ విధులలో జోక్యం చేసుకునేవారు కారు. ఇప్పుడు బీజేపీ హయాంలో కూడా అలాగే జరుగుతోంది. కాని వేరే పార్టీలు రాష్ట్రాలలో అధికారంలో ఉంటే మాత్రం తేడా వస్తోంది. కేంద్రంతో సఖ్యతతో ఉంటే సరే.. లేకుంటే మాత్రం తగాదానే. గతంలో యూపీలో రమేష్ బండారి అనే గవర్నర్ ఉండేవారు. ఆయన బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ అగ్రనేత వాజ్ పేయి ఢిల్లీలో నిరశన దీక్ష చేశారు. ఇక్కడా బాబు లాబీయింగే.! ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు తిరుగుబాటు చేసినప్పుడు ఆనాటి ఏపీ గవర్నర్ కృష్ణకాంత్ ఆయనకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఉప రాష్ట్రపతి పదవి పొందడానికి ఇది కూడా కారణమని అంటారు. తదుపరి రాష్ట్రపతి పదవి ఇస్తారని ఆయన ఆశించినా, అది జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురై మనోవేదనతో మరణించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయన వాజ్ పేయికి మద్దతు ఇచ్చి కేంద్రానికి అనుకూలంగా మారారు. ఆ పలుకుబడితో ఆర్థికవేత్త, ఆర్బిఐ మాజీ గవర్నర్ రంగరాజన్‌ను రాష్ట్ర గవర్నర్‌గా తెచ్చుకున్నారు. ఆ టైమ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయింది. సుదీర్ఘ కాలం నరసింహాన్ నిజానికి తెలుగుదేశం పార్టీ గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసేది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్లను నానా రకాలుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కేంద్రంతో రాజీ కుదుర్చుకోవడానికి మళ్లీ అదే గవర్నర్‌ను ఏదో రకంగా మేనేజ్ చేయడంలో కూడా ఆయన ఆరితేరారని చెబుతారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు టీడీపీ నేతలు విమర్శించడం కాదు.. దూషించినంత పనిచేశారు. నరసింహన్ రాజకీయవేత్తకాదు. మాజీ బ్యూరోక్రాట్. ఛత్తీస్ గడ్ నుంచి ఏపీకి బదిలిచేశారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని అదుపులో పెట్టడానికి ఆయనను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నియమించిందని చెబుతుండేవారు. ఆ టైమ్‌లో టీఆర్ఎస్ వారు ఆయనపై తెలంగాణ ద్రోహి అన్న ముద్రవేసేవారు. కాని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఆయనతో చాలా సత్సంబందాలు నెరిపారు. వారం, వారం వెళ్లి ఆయనతో భేటీ అయ్యేవారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతిభద్రతల అంశం అంతా నరసింహనే చూసుకున్నారన్న భావన ఉండేది. పోలీసు అధికారులు గవర్నర్‌కు నేరుగా రిపోర్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం నరసింహన్‌కు, ఆయనకు తేడాలు వచ్చాయి. కిరణ్ సిఫారస్ చేసిన ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి నరసింహన్ నిరాకరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, కిరణ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఇలా జరిగింది. కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. సమన్వయం ప్రస్తుతం ఏపీలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఎలాంటి వివాదాలు లేకుండా, హుందాగా పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయన పట్ల గౌరవ, మర్యాదలతో ప్రవర్తిస్తున్నారు. కాని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నించడం ఆరంభించినప్పటి నుంచి గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ క్రమంలో గవర్నర్ తమిళసైని టీఆర్ఎస్ అవమానించిందన్న భావన కూడా ఉంది. దానికి ప్రతిగా గవర్నర్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపైన, ఏకంగా సీఎంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల వరకు ఈ వివాదం ఇలాగే కొనసాగవచ్చు ఛలో హస్తిన.! రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఫోన్ టాపింగ్‌కు పాల్పడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆమె ఫిర్యాదు చేసి వచ్చారట. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కూడా ఆమె చర్చించారు. బీజేపీని బదనాం చేయడానికి టీఆర్ఎస్ చేస్తున్న ఎత్తుగడలను తన అధికార పరిధిలో ఉన్నమేరకు తిప్పికొట్టడానికి తమిళసై యత్నిస్తున్నారు. కేరళలో గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ అక్కడి సీపీఎం ప్రభుత్వంతో పెద్ద గొడవే పెట్టుకున్నారు. మంత్రులను తానే తీసేస్తానంతవరకు వెళ్లారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్లను రాజీనామా చేయాలని హుకుం జారీ చేశారు. తమిళనాడులో గవర్నర్ రవి వివాదాస్పదంగా ప్రవర్తిస్తుండడంతో డిఎంకే ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. మహారాష్ట్రలో బలం లేకపోయినా, కొంతకాలం క్రితం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గవర్నర్ క్రియాశీలకంగా ఉండడం పెద్ద వివాదం అయింది. పశ్చిమబెంగాల్లో గవర్నర్ జగదీప్ ధన్కర్ నానా రచ్చ చేసిన ఫలితంగా ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి ప్రమోషన్ లభించింది. పరిఢవిల్లాలి ప్రజాస్వామ్యం మెజార్టీ తక్కువగా ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడంలో కూడా గవర్నర్ పాత్ర ఉంటోందన్న భావన ఉంది. ఇది కాంగ్రెస్ టైమ్ లోనూ జరిగింది. ఇప్పుడూ జరుగుతోంది. ఈ పరిస్థితి మారాలంటే గవర్నర్ల అధికార పరిధిని స్పష్టంగా నిర్వచిస్తూ కేంద్రం చట్టం చేయడమో లేక, రాజ్యాంగంలో మార్పులు చేయడమో జరగకపోతే గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య ఇలాగే గొడవలు సాగుతుంటాయి. కాని అధికారమే పరమావధిగా మారిన ఈ రోజుల్లో గవర్నర్ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవడానికే కేంద్రంలో ఉన్న అదికార పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇది ఎప్పటికైనా మారుతుందా అంటే అనుమానమే. మన ప్రజాస్వామ్యంలో గవర్నర్ల వ్యవస్థ ఉండడం ఒకరకంగా మేలు, మరో రకంగా కీడుగా మారింది. దీనికి పరిష్కారం ఇప్పట్లో దొరుకుందా అన్నది ప్రశ్నార్ధకమే. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అసలేం జరుగుతోంది?.. ముదురుతున్న వివాదం.. సబిత వ్యాఖ్యలపై స్పందించిన రాజ్‌భవన్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బిల్లులపై వివాదం ముదురుతోంది. యూనివర్శిటీ బిల్లు విషయంలో తనకు ఎలాంటి సమాచారం రాలేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై రాజ్‌భవన్ వర్గాలు స్పందించాయి. గవర్నర్ నుంచి లేఖ రాలేదనడం సరికాదని, యూనివర్శిటీల బిల్లు వ్యవహారంపై మెసెంజర్ ద్వారా నిన్ననే(సోమవారం) సమాచారం ఇచ్చామని రాజ్‌భవన్ పేర్కొంది. చదవండి: తెలంగాణలో పొలిటికల్ హీట్.. ప్రధాని మోదీ పర్యటనపై వివాదం కాగా, ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు–2022’ విషయంలో పలు సందేహాలు ఉన్నాయని.. దీనిపై రాజ్‌భవన్‌కు వచ్చి తనతో చర్చించాలని విద్యాశాఖ మంత్రికి సోమవారం గవర్నర్ లేఖ రాశారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇప్పుడున్న విధానంలో ఇబ్బందులేమిటని.. కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలాగని ప్రశ్నించారు. కొంతకాలం నుంచి రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై లేఖలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్సిటీల బిల్లుకు సంబంధించి విద్యా మంత్రికి రాసిన లేఖలో గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. ఈ క్రమంలో ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే పరస్పరం బహిరంగ ఆరోపణలు, విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పుడీ విభేదాలు ముదిరినట్టుగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంతో విభేదాలు బయటపడ్డాయి. సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లేందుకు గవర్నర్ హెలికాప్టర్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వివాదంగా మారింది. తర్వాత గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కే పరిమితం చేసి సాదాసీదాగా నిర్వహించడం పట్ల గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేశారు. -
వచ్చి చర్చించండి.. సబితకు గవర్నర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ షాకిచ్చారు. ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు–2022’ విషయంలో పలు సందేహాలు ఉన్నాయని.. దీనిపై రాజ్‌భవన్‌కు వచ్చి తనతో చర్చించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి సోమవారం గవర్నర్ లేఖ రాశారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇప్పుడున్న విధానంలో ఇబ్బందులేమిటని.. కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలాగని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఈ కొత్త విధానంపై అభిప్రాయం వ్యక్తం చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి గవర్నర్ లేఖ రాశారు. కొంతకాలం నుంచి రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై లేఖలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్సిటీల బిల్లుకు సంబంధించి విద్యా మంత్రికి రాసిన లేఖలో గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. ‘‘ప్రస్తుత విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటి? కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు ఎదురై పోస్టుల భర్తీలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉండటంతో ఉద్యోగార్థులు నష్టపోరా? గత ఎనిమిదేళ్లుగా యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోలేదు? యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని గత 3 ఏళ్లలో తాను ఎన్నోసార్లు లేఖలు రాసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని ప్రశ్నించారు. ఈ అంశాలపై చర్చించడానికి రాజ్‌భవన్‌కు రావాలని మంత్రి సబితను కోరారు. ఇక రాష్ట్రంలోని వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం చట్టబద్ధమేనా? న్యాయస్థానాల్లో చెల్లుబాటు అవుతుందా? అన్న విషయంలో అభిప్రాయం చెప్పాలని యూజీసీని గవర్నర్ తమిళిసై కోరారు. ఈ మేరకు యూజీసీ చైర్మన్‌కు లేఖ రాశారు. ఇంకా పెండింగ్‌లోనే 7 బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13న తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుతోపాటు మరో ఏడు బిల్లులను శాసనసభ, శాసనమండలిలలో ఆమోదించి గవర్నర్‌కు పంపింది. అందులో ఒక్క జీఎస్టీ చట్ట సవరణ బిల్లును గవర్నర్ ఆమోదించి తిరిగి పంపారు. వర్సిటీల బిల్లు సహా ఏడు బిల్లులు ఇంకా రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ములుగు అటవీ కళాశాలను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు, తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లు, పురపాలికల చట్ట సవరణ బిల్లు, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వాహనాలపై పన్నుల చట్ట సవరణ బిల్లు ఉన్నాయి. గవర్నర్ ఆమోదిస్తే వెంటనే వాటిని అమల్లోకి తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో యూనివర్సిటీల బోర్డు బిల్లును గవర్నర్ మంగళవారంలోగా ఆమోదించకపోతే.. రాజ్‌భవన్‌ను వేలాది మందితో ముట్టడిస్తామని యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై మంత్రి సబితకు లేఖ రాసినట్టుగా చెప్తున్నారు. ఎత్తులు.. పైఎత్తులతో.. ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని.. ఈ క్రమంలోనే పరస్పరం బహిరంగ ఆరోపణలు, విమర్శలు వినవస్తున్నాయని రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడీ విభేదాలు ముదిరినట్టుగా కనిపిస్తున్నాయని అంటున్నాయి. గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంతో విభేదాలు బయటపడ్డాయి. సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లేందుకు గవర్నర్ హెలికాప్టర్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వివాదంగా మారింది. తర్వాత గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కే పరిమితం చేసి సాదాసీదాగా నిర్వహించడం పట్ల గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు రావడం మానేశారని ఆమె ఎన్నో పర్యాయాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడాన్ని తప్పుపట్టారు. మరోవైపు మంత్రులు బీజేపీ కార్యకలాపాలకు రాజ్‌భవన్ అడ్డాగా మారిందని గవర్నర్‌పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఎన్నో వివాదాలు తలెత్తాయి. ఇటీవల తన వ్యక్తిగత ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవడం లేదని గవర్నర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తనను కలిసేందుకు సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులెవరూ రాకపోవడంతోనే.. యూనివర్సిటీల నియామకాల బిల్లును అడ్డు పెట్టుకుని మంత్రిని పిలుస్తూ గవర్నర్ లేఖ రాశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రాజ్‌భవన్‌కు వెళ్తారా? సీఎం కేసీఆర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు ఏడాదికాలం నుంచి రాజ్‌భవన్‌తో అంటీముట్టనట్టు ఉంటున్న నేపథ్యంలో ఓ రాష్ట్ర మంత్రికి గవర్నర్ నుంచి పిలుపురావడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ లేఖకు స్పందించి మంత్రి సబిత రాజ్‌భవన్‌కు వెళ్తారా, లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోతే మాత్రం మంత్రి సబితను రాజ్‌భవన్‌కు పంపించే అవకాశాలు ఉండవని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఇటీవల గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ... ‘‘శాసనసభలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా నా పరిధిలోనిది. గవర్నర్‌గా నాకు విస్తృత అధికారాలు ఉంటాయి. నా పరిధిలోనే నేను నడుచుకుంటున్నాను’’ అని పేర్కొనడం గమనార్హం. చదవండి: మోదీ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం -
బంజారాహిల్స్ డీఏవీ పాఠాశాల గుర్తింపు రద్దు
-
‘ఇంద్రారెడ్డి చార్మినార్‌లో ఒంటరిగా వదిలిపెట్టారు, అలా డ్రైవింగ్ నేర్చుకున్నా’
సాక్షి, హైదరాబాద్: ‘నేను మూడు రోజుల్లోనే కారు డ్రైవింగ్ నేర్చుకున్నా. మా ఆయనే నేర్పించారు’అని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ప్రభుత్వ సహకారంతో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతులతో తాను డ్రైవింగ్ నేర్చుకున్న అనుభవాలను పంచుకున్నారు. సంకల్పం, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 23 మంది యువతులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా శుక్రవారం సరూర్‌నగర్ వీఎంహోంలో షీ క్యాబ్స్ వాహనాలను మంత్రి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో మొదటి రోజు స్టీరింగ్, రెండో రోజు బ్రేక్, గేర్ల గురించి నేర్చుకున్నా. మూడో రోజు స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ కారు నడిపా. ఇక నాల్గవ రోజు రోడ్డు మీదకు వాహనం నడుపుతూ వచ్చా’అని చెప్పారు. పాతబస్తీలో డ్రైవ్ చేస్తే ఎక్కడైనా చెయ్యొచ్చు అని ఇంద్రారెడ్డి చార్మినార్‌లో తనను ఒంటరిగా వదిలిపెట్టారని, అలా డ్రైవింగ్ నేర్చుకున్నానని సబిత తెలిపారు. చదవండి: కేజిన్నర వెండి, బంగారంతో కూకట్‌పల్లిలో బతుకమ్మ.. వైరల్ ఫొటో -
డీఎస్సీ–98 అర్హులకు న్యాయం
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–98 అర్హులందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చినట్టు డీఎస్సీ–98 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ తెలిపారు. తమ సమస్యలపై ఆదివారం మంత్రిని కలిసి వివరించినట్టు తెలిపారు. అర్హత ఉన్నా దశాబ్దాలుగా తమకు ఉద్యోగాలు రావడం లేదని, ఈ విషయమై సీఎంకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సాధన సమితి గౌరవాధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లేపల్లి రఘురామరాజు తదితరులున్నారు. -
నారాయణ కాలేజీ ఘటనపై మంత్రి సబితా సీరియస్
సాక్షి, హైదరాబాద్: రామాంతాపూర్ నారాయణ కాలేజ్ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డు కార్యదర్శిని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా పేర్కొన్నారు. భవిష్యుత్తలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆమె సూచించారు. కాగా రామంతాపూర్ నారాయణ కాలేజీలో సెంకడ్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థి సాయి నారాయణ.. విద్యార్థి సంఘం నాయకుడు సందీప్‌తో కలిసి కాలేజ్‌కు వచ్చాడు. టీసీ ఇవ్వాలంటే డ్యూ ఉన్న రూ. 16 వేల ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ సుధాకర్ చెప్పాడు. ఈ క్రమంలో విద్యార్థి నేత, నారాయణ ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థి నేత సందీప్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మొత్తం ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. అయితే యశోద ఆసుప్రతిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. సందీప్ సహా వెంకటేష్‌చారీ, కాలేజ్ ఏవో అశోక్‌కు డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: (రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది?) -
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన.. మంత్రి సబితా ఇంటివద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో శ్రీనగర్ కాలనీలోని మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే బాసర విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి సబితా ఇంటి ముట్టడికి ప్రయత్నించిన పేరెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మంత్రి ఇంటిముందు పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ. తమ పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారని, పిల్లల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినట్లు వెల్లడించారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్థుల హెచ్చరించారు. విద్యార్థులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. మంత్రి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. -
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఉద్రిక్తత
-
మరబొమ్మ సాక్షాత్.. గురు బ్రహ్మ..
‘ఇందుగలడందు లేడని సందేహంబు వలదు.. ఎందెందు వెదికినా అందందే గలడు’ అన్నట్టు రెస్టారెంట్స్ నుంచి హాస్పిటల్స్ వరకు సేవలందిస్తున్న రోబోటిక్ టెక్నాలజీ విద్యారంగంలోనూ తన ఉనికి చాటుతోంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల స్థానంలోకీ మర బొమ్మలు ప్రవేశించాయి. భారత తొలి రోబో ‘ఈగిల్’ను రూపొందించినట్టు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ చెప్పింది. సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి టీచింగ్ రోబో ‘ఈగిల్’ను పరిచయం చేసింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని వారికి 30 రోబోలను అందజేశారు. హైదరాబాద్, బెంగళూరు, పుణేలలోని తమ స్కూల్స్‌లోనూ, ఒక్కో దగ్గర ఏడు చొప్పున రోబోలను ఏర్పాటు చేసి, బోధిస్తున్నట్టు స్కూల్ ప్రతినిధులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్యను అందించేందుకు రోబోలను అందుబాటులోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ఈ మేరకు ‘ఈగిల్ రోబో’ పనితీరును మంత్రి కార్యాలయంలో ఆదివారం ప్రదర్శించారు. ప్రత్యేకతలివే... లాంగ్వేజెస్తోపాటుగా సైన్స్, హ్యుమానిటీస్, తదితర సబ్జెక్టులను బోధించడానికి ‘ఈగిల్’ రోబోలు ప్రోగ్రామ్ చేయబడ్డాయి. ఇది భావ వ్యక్తీక రణతో పాటు, ముఖాముఖిగానూ చురుకుగా ఉంటుంది. తరగతి గదిలో ఎవరిపైనా ఆధారపడకుండా గ్రేడ్ 5 నుంచి 11వ తరగతి విద్యార్థులకు బోధించగలదు. 30కిపైగా విభిన్నమైన భాషలలో విద్యను అందిస్తాయి. విద్యార్థుల సందేహాలను నివృత్తి కూడా చేస్తాయి. అనలటిక్స్ సహాయంతో తరగతి చివరి దశలో రివిజన్స్ నిర్వహించగలవు. తమ మొబైల్, ట్యాబ్ లేదా ల్యాప్ టాప్‌లతో రోబో కంటెంట్‌తో విద్యార్థులు అనుసంధానం కావచ్చు. రోబో ప్యాకేజీ ప్రీలోడెడ్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. దీన్ని వివిధ భాషల్లో విభిన్న పాఠ్యాంశాల కోసం రూపొందించుకోవచ్చు. టీచర్ ట్రైనింగ్ ప్యాకేజీ ద్వారా రోబోల వినియోగం గురించి ఉపాధ్యాయులకు శిక్షణనూ ఇస్తుంది. గుణాత్మక మార్పు కోసం... విద్యార్జనలో సాంకేతికత సహకారాన్ని తీసుకురావాలనే ఆలోచనే రోబో తయారీకి మమ్మల్ని ప్రేరేపించింది. ఇతర రంగాల్లో మాదిరిగానే, విద్యారంగంలోనూ మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు మిళితమైతే గుణాత్మక మార్పు వస్తుంది. హ్యూమనాయిడ్ రోబోలు టీచర్‌కి బోధించడంలో సహాయం చేస్తాయి – రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అర్జున్ రే, ఇండస్ స్కూల్ నిర్వాహకులు ఉపాధ్యాయుల కొరత తీరుతుంది.. ఈ రోబోల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తగ్గించొచ్చు. విద్యలో నాణ్యతను మెరుగుపరచొచ్చు. విద్యార్థులు భవిష్యత్ సవాళ్లను స్వీకరించేలా తీర్చిదిద్దడానికి వీలు కల్పిస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని విద్యా సంస్థలకు ‘ఈగిల్’ రోబోలను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నాం. –అపర్ణ ఆచంట, ఇండస్ స్కూల్ నిర్వాహకులు -
విద్యా ప్రమాణాలు పెంచుతున్నాం
కుత్బుల్లాపూర్/సుభాష్‌నగర్: ప్రభుత్వ రంగంలో గత 8 ఏళ్లుగా విద్యా ప్రమాణాలను పెంచుతూ వస్తున్నామని... పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. అంగన్వాడీ మొదలు యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్, బహుదూర్‌పల్లిలలో రూ. 2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన జూనియర్ కాలేజీని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో కలసి ప్రారంభించారు. వొకేషనల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల భేరిలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఇదే జూనియర్ కాలేజీ శిథిలావస్థలో ఉండేదని, ప్రస్తుతం కొత్త భవనం నిర్మించి వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గురుకుల విద్యార్థులు ఐఐటీలకు... ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలల్లో 5 లక్షల మంది విద్యార్థులకు రూ. 1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాణ్యమైన విద్యతోపాటు ఇంట్లో కూడా అందని సకల సౌకర్యాలు అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందించే నాణ్యమైన చదువుతో వెయ్యి మందికంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఐఐటీకి వెళ్లారని... ఇది ప్రభుత్వం చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. 400 గురుకుల పాఠశాలలను 1,052 గురుకులాలను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామని.. ఇది ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.18 వేల కోట్లు చెల్లించామని, విదేశాల్లో చదువుకోవాలనుకునే ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు అందిస్తున్నామని కేటీఆర్ వివరించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున 33 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని... అగ్రికల్చర్, లా కాలేజీలు, 79 డిగ్రీ కాలేజీలు, రెండు యూనివర్సిటీలను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద కోరిన మేరకు ఉర్దూ కాలేజీని మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబిత, మల్లారెడ్డి ప్రసంగించగా ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్, సురభి వాణీదేవి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు.