‘ఇంద్రారెడ్డి చార్మినార్‌లో ఒంటరిగా వదిలిపెట్టారు, అలా డ్రైవింగ్‌ నేర్చుకున్నా’ | Sabitha Indra Reddy Distributes She Cabs To 23 Women Drivers | Sakshi
Sakshi News home page

‘ఇంద్రారెడ్డి చార్మినార్‌లో ఒంటరిగా వదిలిపెట్టారు, అలా డ్రైవింగ్‌ నేర్చుకున్నా’

Published Sat, Oct 1 2022 10:03 AM | Last Updated on Sat, Oct 1 2022 3:06 PM

Sabitha Indra Reddy Distributes She Cabs To 23 Women Drivers - Sakshi

మహిళకు డ్రైవింగ్‌లో మెలకువలు నేర్పుతున్న మంత్రి సబితారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను మూడు రోజుల్లోనే కారు డ్రైవింగ్‌ నేర్చుకున్నా. మా ఆయనే నేర్పించారు’అని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ప్రభుత్వ సహకారంతో డ్రైవింగ్‌ శిక్షణ పూర్తి చేసుకున్న యువతులతో తాను డ్రైవింగ్‌ నేర్చుకున్న అనుభవాలను పంచుకున్నారు. సంకల్పం, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 23 మంది యువతులకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా శుక్రవారం సరూర్‌నగర్‌ వీఎంహోంలో షీ క్యాబ్స్‌ వాహనాలను మంత్రి అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌లో మొదటి రోజు స్టీరింగ్, రెండో రోజు బ్రేక్, గేర్ల గురించి నేర్చుకున్నా. మూడో రోజు స్టీరింగ్‌ కంట్రోల్‌ చేస్తూ కారు నడిపా. ఇక నాల్గవ రోజు రోడ్డు మీదకు వాహనం నడుపుతూ వచ్చా’అని చెప్పారు. పాతబస్తీలో డ్రైవ్‌ చేస్తే ఎక్కడైనా చెయ్యొచ్చు అని ఇంద్రారెడ్డి చార్మినార్‌లో తనను ఒంటరిగా వదిలిపెట్టారని, అలా డ్రైవింగ్‌ నేర్చుకున్నానని సబిత తెలిపారు. 
చదవండి: కేజిన్నర వెండి, బంగారంతో కూకట్‌పల్లిలో బతుకమ్మ.. వైరల్‌ ఫొటో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement