
హైదరాబాద్: నగరంతో తెలంగాణలోని పలు చోట్ల అకాల వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లో పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్ లో కొన్ని చోట్ల కుండ పోత వర్షం కురవగా, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది. ఈ వర్షానికి జన జీవనం స్తంభించింది. వర్షం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో వాహనదారులు అవస్తలు తప్పలేదు.
మరొకవైపు ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ఓ చెట్టు విరిగి కారుపై పడింది. దాంతో అప్రమత్తం కావడంతో వారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారుపై చెట్టు పడిన వెంటనే రెస్య్కూ ఆపరేషన్ లో ఉన్న పోలీసులు సకాలంలో స్పందించారు. కారులో ఉన్న ముగ్గుర్ని ముందుగా బయటకు తీసేశారు. కారుపై పడ్డ చెట్టును అక్కడ నుంచి తొలగించే పనిలో ఉన్నారు డీఆర్ఎఫ్ సిబ్బంది.