![Fire In Car At Ghatkesar Near Hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/6/fire%20accident.jpg.webp?itok=23Cx5l-C)
సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో సోమవారం(జనవరి6) సాయంత్రం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమైన కేసు కొత్త మలుపు తిరిగింది. కారులో ఉన్నది ప్రేమికులైన యువతీ యువకులని తెలుస్తోంది. కొందరు యువకుల వేధింపులు భరించలేక వారు ఆత్మహత్యాయత్నం చేస్తుండగా కారులో మంటలు చెలరేగి కాలిపోయారని సమాచారం.
తొలుత ఇది ప్రమాదమే అనుకున్నప్పటికీ ఘటనపై పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో అసలు విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పివేసింది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ వాహనం బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment