driving tests
-
కేంద్రం సంచలన నిర్ణయం..! ఆ కార్ల తయారీ నిలిపివేత?
త్వరలో కేంద్రం రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) నిబంధనల్ని అమలు చేయనుంది?. దీంతో భారత్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని కంపెనీలకు చెందిన కార్లు, ఎస్‌యూవీలు కనుమరుగు కానున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కొత్త ఉద్గార నిబంధనలు డ్రైవింగ్ సమయంలో కార్ల నుంచి విడుదలయ్యే ఎన్ఓఎక్స్ వంటి కాలుష్య కారకాల్ని కొలవడం, వేగం వృద్ధి, క్షీణతలో తరచూగా వచ్చే మార్పులను పరిణగలోకి తీసుకోనున్నాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, కార్ల తయారీదారులు తమ ఇంజిన్లను తక్కువ ఉద్గారాలకు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. ఇంజన్ అప్డేషన్ ప్రక్రియ ఖరీదైంది. కాబట్టే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో పలు కంపెనీల 27 డీజిల్ కార్లు, ఎస్‌యూవీల కార్యకలాపాల్ని నిలివేసే అవకాశం ఉంది. ఆర్డీఈ నిబంధనల ప్రకారం వాహనాలు డ్రైవింగ్ సమయంలో విడుదలయ్యే ఉద్గార స్థాయిలను గుర్తించేలా పరికరాన్ని కలిగి ఉండాలి. ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉత్ప్రేరక కన్వర్టర్లు, ఆక్సిజన్ సెన్సార్ల వంటి క్లిష్టమైన భాగాలను పరికరం పర్యవేక్షిస్తుంది. కార్మేకర్లు క్రాంక్‌షాఫ్ట్ పొజిషన్లు, థొరెటల్, ఇంజన్ ఉష్ణోగ్రతను స్కాన్ చేయడానికి వాహనాల సెమీకండక్టర్లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కార్లు, ఎస్‌యూవీలలో ఇంధనం మండే స్థాయిని నియంత్రించడానికి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్లను కూడా అమర్చాలి. అన్ని డీజిల్ ఇంజిన్లు ఉద్గారాల నియంత్రణ ఖరీదైన 'సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్' (ఎస్ఈఆర్) సాంకేతికతకు మారవలసి ఉంటుంది. కాబట్టి, డీజిల్ కార్ల ధర గణనీయంగా పెరుగుతుంది. కార్ల తయారీకి భారీగా ఖర్చు చేయడం, తయారీ ఖర్చు.. కార్ల ధరల్ని పెంచడం.. పెరిగిన ధరలతో వాటి డిమాండ్ పడిపోవడం వంటి పరిణామలత నేపథ్యంలో సంస్థలు కార్ల తయారీని, అమ్మకాల్ని నిలివేయనున్నాయి. వాటిలో హోండా సిటీ 4వ జెన్, సిటీ 5వ జెన్ (డీజిల్), అమేజ్ (డీజిల్), జాజ్ డబ్ల్యూఆర్ -వీ, మరాజు, అల్ట్రాస్ జీ4, కేయూవీ 100, మహీంద్రా, హ్యుందాయ్, స్కోడా ఒక్కొక్కటి రెండు మోడళ్లను నిలిపివేయనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ ఐ20, వెర్నా డీజిల్ మోడళ్లను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తే, స్కోడా ఆక్టావియా, సూపర్బ్ కార్లు మార్కెట్లో కనుమరుగు కానున్నాయి. టాటా ఆల్ట్రోజ్ (డీజిల్), రెనాల్ట్ క్విడ్ 800, నిస్సాన్ కిక్స్, మారుతి సుజుకి ఆల్టో 800 నిలిపివేయనున్న జాబితాలో ఉన్నాయి. చదవండి👉 టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
‘ఇంద్రారెడ్డి చార్మినార్‌లో ఒంటరిగా వదిలిపెట్టారు, అలా డ్రైవింగ్ నేర్చుకున్నా’
సాక్షి, హైదరాబాద్: ‘నేను మూడు రోజుల్లోనే కారు డ్రైవింగ్ నేర్చుకున్నా. మా ఆయనే నేర్పించారు’అని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ప్రభుత్వ సహకారంతో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతులతో తాను డ్రైవింగ్ నేర్చుకున్న అనుభవాలను పంచుకున్నారు. సంకల్పం, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 23 మంది యువతులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా శుక్రవారం సరూర్‌నగర్ వీఎంహోంలో షీ క్యాబ్స్ వాహనాలను మంత్రి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో మొదటి రోజు స్టీరింగ్, రెండో రోజు బ్రేక్, గేర్ల గురించి నేర్చుకున్నా. మూడో రోజు స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ కారు నడిపా. ఇక నాల్గవ రోజు రోడ్డు మీదకు వాహనం నడుపుతూ వచ్చా’అని చెప్పారు. పాతబస్తీలో డ్రైవ్ చేస్తే ఎక్కడైనా చెయ్యొచ్చు అని ఇంద్రారెడ్డి చార్మినార్‌లో తనను ఒంటరిగా వదిలిపెట్టారని, అలా డ్రైవింగ్ నేర్చుకున్నానని సబిత తెలిపారు. చదవండి: కేజిన్నర వెండి, బంగారంతో కూకట్‌పల్లిలో బతుకమ్మ.. వైరల్ ఫొటో -
డ్రైవింగ్ టెస్టుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా లెర్నింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆరునెలల్లో శాశ్వత లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఎంచుకున్న సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేల కనుక ఆ పరీక్షలో ఫెయిల్ అయితే మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది. అయితే తాజాగా కేంద్రం డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందవచ్చు. డ్రైవింగ్ స్కూళ్లకు, డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు ఈ మేరకు గుర్తింపు ఇవ్వనుంది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం చేత గుర్తింపబడిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో విజయవంతంగా డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేసిన వారు రాష్ట్ర రవాణా అధికారుల నుండి లైసెన్స్ పొందవచ్చు. అలాగని శిక్షణ కేంద్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. వాటికి అనుమతులు, శిక్షణా కార్యక్రమాల పర్యవేక్షణకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వమే డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను గుర్తిస్తుంది. దీని కోసం ప్రభుత్వం కొన్ని నియమాలను సూచిస్తుంది. ఆ డ్రైవింగ్ కేంద్రాలు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది.(చదవండి: అసోంలో ప్రధాని మోదీ పర్యటన) -
అదృశ్యకరణి
తన ఎదురుగా కూర్చుని ఉన్న యువకుడి వంక విసుగ్గా చూశాడు మల్హోత్రా. ‘‘చెప్పండి. ఏం పని మీద వచ్చారు?’’ వాచీలో టైమ్ చూసుకుంటూ చెప్పాడు.‘‘మీరు ప్రాచీన కళాఖండాలు, కొత్త వస్తువుల్లో డీల్ చేస్తారని తెలిసి వచ్చాను. నా దగ్గర ఒక విచిత్రమైన వస్తువు ఉంది’’ గది చుట్టూ ఒకసారి పరికించి, చిన్నగా చెప్పాడు సఫారీ సూట్ యువకుడు.సఫారీ సూట్ యువకుడు మల్హోత్రా మాటలకు సంతృప్తి చెంది, లెదర్బ్యాగులోంచి ఒక పలచటి తెల్లటి వస్త్రాన్ని బయటకు తీశాడు. మల్హోత్రా దానివంక ఆశ్చర్యంగా చూశాడు.‘‘దీన్ని అదృశ్యకరణి అంటారు’’ అని ఆ యువకుడు జిప్బ్యాగులోంచి ఒక చిన్న సీసా తీసి, అందులోని ద్రవాన్ని కొంత ఆ వస్త్రానికి పూసి, తనపై ఆ గుడ్డను కప్పుకున్నాడు. మరుక్షణం మల్హోత్రా ముందు ఎవ్వరూ లేరు. మల్హోత్రా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. రెండు నిమిషాల తర్వాత మల్హోత్రా ముందు కుర్చీలోప్రత్యక్షమయ్యాడు ఆ యువకుడు.‘‘ఆశ్చర్యంగా ఉంది. ఈ మాయావస్త్రం నీకెక్కడిది?’’ అన్నాడు మల్హోత్రా.‘‘ఎక్స్పోర్ట్ బిజినెస్ మీద నేను తరచు హాంకాంగ్‌కు వెళుతుంటాను. అక్కడొక యూనివర్సిటీ ప్రొఫెసర్ తయారు చేశాడు దీన్ని. ఆయన కొడుకు నా కస్టమర్, మంచి మిత్రుడు. ప్రొఫెసర్ వద్ద కొన్నాను దీన్ని భారీ సొమ్ము చెల్లించి’’ అన్నాడు సూట్‌వాలా.మల్హోత్రాకు ఇంకా నమ్మకం కుదరకపోవడంతో మళ్లీ ఆ వస్త్రాన్ని తనపై కప్పుకొని అదృశ్యమయ్యాడా యువకుడు. క్షణం తర్వాత ఆ గది తలుపు దగ్గర ప్రత్యక్షమయ్యాడు.‘‘చెప్పు దీన్ని ఎంతకమ్ముతావు నాకు?’’ ఆశ్చర్యానందాలతో తలమునకలవుతూ అడిగాడు మల్హోత్రా.‘‘పది లక్షలు. అంతకంటే తక్కువకు అమ్మలేను’’ అన్నాడతను కరాఖండిగా.‘‘చాలా ఎక్కువ. రెండు లక్షలకు మించి ఇవ్వలేను’’ బింకంగా చెప్పాడు మల్హోత్రా.‘‘వద్దులెండి. ఇంకెవరైనా దీన్ని కొంటారేమో చూస్తాను’’ అంటూ లేచి నిలబడి డోర్‌వైపు కదిలాడా యువకుడు.‘‘వద్దు, వద్దు. నేనే కొంటాను దీన్ని. నీకు చెక్ ఇయ్యవచ్చా?’’ అన్నాడు మల్హోత్రా ఆత్రంగా.‘‘లేదు. క్యాష్ మాత్రమే తీసుకుంటా’’ అన్నాడతడు.‘‘సరే, నీ పేరు, వివరాలూ నాకనవసరం. ఇది నాకు అమ్మినట్లు నువ్వు ఎవరికీ చెప్పకూడదు’’ అన్నాడు మల్హోత్రా. అలాగేనన్నాడతను.మల్హోత్రా ఇంటి లోపలికి వెళ్లి ఐదు నిమిషాల్లో డబ్బు తీసుకొని వచ్చి ఆ యువకుడికిచ్చాడు.సఫారీ సూట్‌వాలా వస్త్రాన్ని, చిన్న సీసాలోని ద్రవాన్ని మల్హోత్రాకిచ్చి చెప్పాడు: ‘‘మీరు ఈ వస్త్రంపై ఈ సీసాలోని ద్రవం ఒక ఐదు చుక్కలు పూసి కప్పుకుంటే అదృశ్యమవుతారు. కానీ ఈ వస్త్రం ప్రభావం రెండు గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత మీరందరికీ మామూలుగా కనిపిస్తారు’’ అన్నాడు. ‘‘రెండు గంటలు కావస్తుండగా మళ్లీ ఈ వస్త్రంపై ద్రవం పూస్తే మళ్లీ మాయం కావచ్చా?’’ అడిగాడు మల్హోత్రా.‘‘లేదు. రెండు వాడకాల మధ్య కనీసం పన్నెండు గంటలు గ్యాప్ ఉండాలి. వస్త్రాన్ని చెక్ చేసుకోండి’’ అని తన బ్యాగ్ తీసుకుని గది బయటకు నడిచాడా యువకుడు.మల్హోత్రా మనసు ఆనందంతో ఉరకలేస్తోంది. వస్త్రంపై ద్రవాన్ని పూసి కప్పుకొని అద్దంలో చూసుకున్నాడు. అద్దంలో ఎవరూ లేరు. తన వంటిపై వస్త్రాన్ని తీసేయగానే మళ్లీ మల్హోత్రా ప్రతిరూపం అద్దంలో కనిపించింది. మల్హోత్రా పనివాడు మున్నాను కేకేసి, వాడు గదిలోకి వచ్చేలోగా మళ్లీ ఆ గుడ్డను కప్పుకొని అదృశ్యమయ్యాడు.మున్నా గదిలోకి వచ్చి, ‘‘సాబ్ మీరెక్కడ?’’ అని గదంతా కలియదిరగడం ముసిముసి నవ్వుతో గమనించాడు మల్హోత్రా. గది బయటకు నడిచి, ఆ గుడ్డను ఒంటిపై నుంచి తీసి జాగ్రత్తగా మడిచి, జేబులో పెట్టుకొని గదిలోపలికొస్తూ, ‘‘ఒరేదున్నపోతు వెధవా, టీ తీసుకొని రా’’ అన్నాడు. మున్నా ఆశ్చర్యంగా వెళ్లిపోయాడు.కొంతకాలంగా మల్హోత్రా చేసే బిజినెస్ నష్టాల్లో ఉంది. కొందరు చోరులు తస్కరించిన కళాఖండాలు కూడా కొంటూఉంటాడతను. అటువంటి దొంగసరుకులు బొంబాయిలోని ఒక కస్టమర్ కోసం తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకోవడంతో మల్హోత్రా చాలా ఖర్చుపెట్టి వాటిని విడిపించాల్సి వచ్చింది. ‘‘పది లక్షలు చిల్లపెంకుల్లా ధారబోసి ఈ వస్త్రాన్ని కొన్నాను. వెంటనే దీన్ని ఉపయోగించి, పెట్టుబడిని రాబట్టుకోవాలి’’ అనుకున్నాడు మల్హోత్రా.మల్హోత్రా భార్య రెండు రోజుల క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. వస్త్రాన్ని కొన్న సందర్భాన్ని షాంపేన్ తాగుతూ ఆ రాత్రి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడతను. అతని బట్టల బీరువాలో విదేశాల నుంచి ఒక మిత్రుడు తెచ్చిచ్చిన షాంపేన్ బాటిల్ ఉండనే ఉంది.కాసేపు ఆలోచించి, మల్హోత్రా ఆ వస్త్రాన్ని, ద్రవాన్ని ఒక జిప్ బ్యాగులో ఉంచుకుని తన కారులో బయల్దేరి కృపాల్బాగ్లోని జువెలరీ షాపులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. ఒక ప్రసిద్ధి పొందిన జువెలరీ షాపు సమీపంలో తన కారు పార్క్ చేసి, బ్యాగులోంచి వస్త్రాన్ని తీసి, దానిపై ఐదు చుక్కల ద్రవాన్ని పూసి తనపై కప్పుకొని డోర్ తీసి కారు దిగాడు. తన ఉనికిని చుట్టుపక్కల వాళ్లెవరూ గుర్తించకపోవడం చూసి నవ్వుకుంటూ జాగ్రత్తగా రోడ్డు దాటి ‘మయూర్ షా జువెలర్స్’ దుకాణంలోకి వెళ్లాడు. ఒక కస్టమర్ గ్లాస్డోర్లోంచి లోనికి ప్రవేశిస్తుండగా, అతని వెనుకనే అదృశ్యరూపంలో ఉన్న మల్హోత్రా కూడా షాపులోనికి వెళ్లిపోయాడు. మల్హోత్రా షాపంతా కలియదిరుగుతూ షోకేసుల్లో పేర్చిన రకరకాల వజ్రాల హారాలు, బ్రేస్లెట్స్, నగల వంక ఆనందంగా చూశాడు. వాటి జోలికి వెళ్లడం ప్రమాదం. కళ్ల ముందే నగలు మాయమైతే ఏ సేల్స్‌మెన్ కూడా ఊరుకోడు కదా అనుకున్నాడు.కౌంటరు ముందున్న మయూర్ షా ముందున్న ట్రేలో రకరకాల నగలు ఉన్నాయి. ఇదివరకు అదే షాపులో నగలు కొన్న కస్టమర్స్, ఆ రసీదులు నగలు తీసుకొచ్చి ఎప్పుడైనా తిరిగి ఆ షాపులో ఇస్తే ఆ కస్టమర్స్ కొన్న ధరకు తిరిగి నగదు చెల్లించే సదుపాయం ఉందా దుకాణంలో. అలా పాత కస్టమర్స్ ఆ రోజు తిరిగి ఇచ్చిన నగలవి. షాపు మూసే సమయం కావడంతో మయూర్ షా ఆ నగలన్నిటినీ క్యాష్ టేబుల్ కింది ర్యాక్‌లో ఉంచి తాళం వేసి, తాళం చెవి సొరుగుపై ఉంచి షాపంతా కలియదిరుగుతూ సేల్స్‌మెన్‌కు షోకేసులు మూసి లాక్ చేయాలని పురమాయిస్తున్నాడు.ఇదే అదనుగా మల్హోత్రా షా టేబుల్ సొరుగుపై ఉన్న తాళంచెవి సహాయంతో ఆ ర్యాక్ తెరిచి, ఆ నగలన్నింటినీ తన జేబులో కూరుకున్నాడు. షా అటువైపు రావడం గమనించి, ర్యాక్ మూసి తాళం వేసి, కొందరు కస్టమర్స్ స్వింగ్ డోర్స్ తెరుచుకొని బయటకు వెళ్తూ ఉంటే వారి వెనుకనే ఆ షాపు నుంచి బయటకు నడిచాడు. తన ఉనికిని ఎవరూ గమనించకపోవడం అతణ్ణి ఆనంద పారవశ్యంలో ముంచింది. మల్హోత్రా కారు డోర్ తీసుకుని, సీట్లో కూర్చోవడం ఆ రద్దీలో ఎవరూ గమనించలేదు. ఆనందంగా ఇల్లు చేరుకుని, పనివాడు మున్నాను ఇంటికి పంపించి, డోర్ లాక్ చేసుకుని బెడ్ రూమ్‌లోకి నడిచాడు. జేబులోంచి నగలు తీసి ఆనందంగా చూసుకుని వాటినీ, మాయవస్త్రం, ద్రవం ఉన్న జిప్‌బ్యాగ్‌ను ఒక అల్మరాలో ఉంచాడు. తనకు బాగా తెలిసిన నగల వర్తకుడు కరమ్చంద్కు ఫోన్‌చేసి తన వద్ద కొన్ని నగలు ఉన్నాయని, వాటిని కొనడానికి మర్నాటి పొద్దున ఎనిమిదింటికి సొమ్ము తీసుకురమ్మని పురమాయించాడు. తర్వాత బట్టల బీరువాలోంచి షాంపేన్ బాటిల్ బయటకు తీసి ఆనందంగా కాసేపు తాగి, మున్నా చేసి పెట్టి పోయిన పరోటాలు తిని ఉల్లాసంగా నిద్రకు ఉపక్రమించాడు.ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేచిన మల్హోత్రా గబగబా తయారయ్యే సరికి తొమ్మిదింపావు దాటింది. ఎందుకో కరంచంద్ ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే క్యాష్ రెడీ చేసుకోవడం ఆలస్యమైందని, దారిలో ఉన్నానని చెప్పాడు. పది గంటలకు కాలింగ్ బెల్ మోగింది. కరంచంద్ వచ్చి ఉంటాడని తలుపు తీసిన మల్హోత్రా ఎదురుగా యూనిఫామ్‌లోని పోలీసులనూ, మయూర్ షానూ చూసి నిశ్చేష్టుడయ్యాడు.‘‘మీరు నిన్న రాత్రి వీరి దుకాణంలో చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ నగలు ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పండి.’’ అన్నాడు ఇన్స్పెక్టర్. మల్హోత్రాకు మతిపోయినట్లైంది.‘‘నిన్న రాత్రి వీడు చోరీ చేస్తుంటే ఎవ్వరూ గమనించలేదు. సీసీ కెమెరా దృశ్యాల్లోనూ కనబడలేదు. ఏం మాయ చేశాడో ఏమో! మళ్లీ ఈ రోజు ఉదయం తొమ్మిదింటికి షాపు తెరిచి, నగలు మిస్సవడంతో రాత్రి తాలుకా సీసీ కెమెరా ఫుటేజీ చూసేసరికి వీడునగలు చోరీ చేస్తూ కనపడ్డాడు. దగ్గరలో పార్క్ అయిన కారు వివరాలు ట్రాఫిక్ పోలీసుల సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ద్వారా ఇతని ఆచూకీ కనుక్కున్నాం’’ అప్పుడే అక్కడకు చేరుకున్న డీఎస్పీకి వివరించాడు షా. పోలీసు దెబ్బల భయంతో మల్హోత్రా గాభరాగా గత రాత్రి తాను నగలు దాచిన అలమరా తెరిచాడు. అందులో నగలు కాని, మాయావస్త్రం ఉన్న జిప్బ్యాగు కాని కనపడలేదు. సఫారీసూట్ యువకుడి వద్ద అలాంటిదే మరో వస్త్రం ఉండి ఉండాలి. దాన్ని గమనించి బయటకు నడవగానే కప్పుకొని తన బెడ్రూములోనే దాగి ఉండి, తాను నిద్రపోయాక నగలు, జిప్బ్యాగు చోరీ చేసి వెళ్లిపోయి ఉండవచ్చు.మాయావస్త్రం ప్రభావం రెండుగంటల తర్వాత తగ్గడంతో సీసీ కెమెరాల్లో తాను ఉన్న దృశ్యం కనిపించి ఉండవచ్చు. మల్హోత్రా చెప్పేది ఎవ్వరూ వినిపించుకోలేదు. దిగులుగా పోలీసుల వెనుక నడిచాడు మల్హోత్రా. - రాచపూటి రమేష్ -
డ్రైవింగ్ నేర్చుకునేవారికి సిమ్యులేటర్ శిక్షణ
సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా... అయితే మొదట సిమ్యులేటర్స్‌పైన తప్పనిసరిగా శిక్షణ పొందాల్సిందే. రోడ్డుపై వాహనాన్ని నడిపేందుకు ముందు సిమ్యులేటర్ ద్వారా డ్రైవింగ్ మెళకువలను తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం రవాణాశాఖ స్వయంగా సిమ్యులేటర్ శిక్షణకు శ్రీకారం చుట్టింది. లెర్నింగ్ లైసె న్సు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను సిమ్యులేటర్ శిక్షణకు ప్రోత్సహించేందుకు ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో సిమ్యులేటర్లను ఏర్పాటు చేశారు. మరో వారం రోజుల్లో దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ తెలిపారు. అనంతరం దశల వారీగా అన్ని ఆర్టీఏ కార్యాలయాలకు విస్తరించాలని భావిస్తున్నామన్నారు. మరోవైపు నామమాత్రపు శిక్షణ ఇస్తూ వినియోగదారుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న డ్రైవింగ్ స్కూళ్లకు అడ్డుకట్టవేయడంపై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రతి డ్రైవింగ్ స్కూల్లో సిమ్యులేటర్ శిక్షణ తప్పనిసరి చేయనున్నారు. తద్వారా ప్రాథమిక దశలోనే వాహనదారులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపైన అవగాహన ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డుపైన వాహనాన్ని నడపడం కంటే ముందే డ్రైవింగ్ లో మెళకువలను నేర్పించడం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ప్రతి డ్రైవింగ్ స్కూల్ సిమ్యులేటర్‌ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు జేటీసీ రమేష్ పేర్కొన్నారు. డొల్ల శిక్షణకు చెల్లు... ప్రస్తుతం నగరంలో వందలకొద్దీ డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 80 శాతానికి పైగా మొక్కుబడి అవగాహన కల్పిస్తూ వినియోగదారుల నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నాయి. ఆయా స్కూళ్లలో శిక్షణ పొందిన వారు రోడ్డుపైకి వచ్చిన తరువాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ రద్దీలో గందరగోళానికి గురవుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని స్కూళ్లు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా కేవలం డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించేందుకే పరిమితమయ్యాయి. ఈ మేరకు ఆర్టీఏ అధికారులతో ఒప్పందం చేసుకొని దళారీ పాత్రను పోషిస్తున్నాయి. మొత్తంగా ఎలాంటి శాస్త్రీయత లేకుండా, నాణ్యమైన పద్ధతులు లేకుండా లభిస్తోన్న శిక్షణ స్థానంలో సిమ్యులేటర్లు శాస్త్రీయమైన పద్ధతులకు దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. సిమ్యులేటర్లతో ప్రయోజనాలు... ⇒ డ్రైవింగ్ పట్ల భయం తొలగిపోతుంది. ట్రాఫిక్ రద్దీ, వాహనాల రొద వంటి పరిస్థితుల్లో గందరగోళం లేకుండా వాహనం నడిపే అవగాహన ఏర్పడుతుంది. ⇒ క్లచ్, గేర్,ఎస్కలేటర్, స్టీరింగ్, ఇండికేటర్, హెడ్‌లైట్, వైపర్లను ఎలా వినియోగించాలో, ఏ సమయంలో ఏం చేయాలనేది నేర్చుకోవచ్చు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డుపైన ఏ ట్రాక్‌లో వాహనం నడపాలనే అంశం తెలుస్తుంది. ట్రాఫిక్ రద్దీ తీవ్రతకు అనుగుణంగా ట్రాక్‌లలో మార్పులు చోటు చేసుకుంటాయి. ⇒ కుడి, ఎడమ ఇండికేటర్స్ ఎలా విని యోగించాలో తెలుసుకోవచ్చు. ‘యు’ టర్న్ తీసుకొనేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. ⇒ ఘాట్‌రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపైన సిమ్యులేటర్లు అవగాహన కల్పిస్తాయి. వర్షాకాలం, మంచుకురిసే సమయాల్లో హెడ్లైట్లను తప్పనిసరిగా వేయాలి. వైపర్ల కండీషన్ ముఖ్యం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సిమ్యులేటర్ శిక్షణ డ్రైవింగ్‌తో ముడిపడిన ప్రతి అంశంపైన అవగాహన కల్పిస్తుంది. ⇒ సిగ్నల్ పడిన సమయంలో ఎంత దూరంలో వాహనం నిలపాలి. పార్కింగ్ సమయంలో ఎలాంటి మెళకువలు పాటించాలి వంటి అన్ని అంశాలపైన యానిమేషన్ చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తారు. ⇒ వివిధ రకాల రోడ్లు, సైన్‌బోర్డులు, జాగ్రత్తలు, హెచ్చరికల సూచీకలపైన అవగాహన కలుగుతుంది. ⇒ ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. మూడు గంటలు – ఆరు క్లాసులు సిమ్యులేటర్‌లో మొత్తం 6 క్లాసులు ఉంటాయి. దశలవారీగా 3 గంటల సమయంలో ఈ శిక్షణ ఇస్తాం. ఈ శిక్షణ తరువాత వినియోగదారుడికి డ్రైవింగ్ పైన భయం పూర్తిగా తొలగిపోతుంది. అన్ని విషయాలపైన స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఆ తరువాత రోడ్డుపైన ఎలాంటి గందరగోళం లేకుండా తాపీగా నేర్చుకోగలుగుతాడు. ఖైరతాబాద్ ఆర్టీఏలో మరో వారం లో ఈ శిక్షణ ప్రారంభం కానుంది. – మగ్బుల్ ఫలక్, సిమ్యులేటర్ శిక్షకులు రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుంది సిమ్యులేటర్ ద్వారా శిక్షణ పొందేవారికి అనేక అంశాలపైన కచ్చితమైన అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా రోడ్డు భద్రతా నిబంధనలు తెలుస్తాయి. వాతావరణం, ట్రాఫిక్ రద్దీలో వచ్చే మార్పులకు అనుగుణంగా వాహనం నడిపే తీరు, వేగనియంత్రణ, వివిధ రకాల విడిభాగాలను వినియోగించే పద్ధతిని ముందుగానే తెలుసుకొని ఆ తరువాత వాహనం స్టీరింగ్ పట్టుకోవడం వల్ల డ్రైవింగ్ పైన అపోహలు, ఆందోళన తొలగిపోతాయి. అన్ని డ్రైవింగ్ స్కూళ్లు సిమ్యులేటర్లను ఏర్పాటు చేయాలి. – రమేష్, జేటీసీ -
ఆర్టీఏలో స్మార్ట్ కార్డుల కొరత
పలుచోట్ల నిలిచిపోయిన పంపిణీ వినియోగదారుల పడిగాపులు సాక్షి, సిటీబ్యూరో: రోజూ వందలాది మందికి డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి లెసైన్స్‌లు అందజేసే రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత ఏర్పడింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ఆర్టీఏ కేంద్రాల్లో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. డ్రైవింగ్ లెసైన్స్ పరీక్షలకు హాజరైన వాళ్లు, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి సకాలంలో స్మార్టు కార్డులు లభించట్లేదు. సాధారణంగా పరీక్షలు ముగిసిన వారంలోపు విని యోగదారుల ఇంటికి చేరేలా వీటిని పంపిణీ చేస్తారు. కానీ వారం, పది రోజులుగా డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్ల వివరాలను ముద్రిం చి వినియోగదారులకు అందజేసేం దుకు కార్డులు లేకపోవడంతో చాలాచోట్ల ప్రక్రియ నిలిచిపోయింది. డి మాండ్ మేరకు రవాణాశాఖ ఎప్పటికప్పుడు కొత్తకార్డులను రాష్ట్ర టెక్నికల్ సర్వీసుల విభాగం నుంచి తెప్పిస్తుం ది. ఇందుకోసం ముందుగానే ఆర్డర్ ఇవ్వాలి. కొద్ది రోజులుగా అధికారు లు ఈ విషయాన్ని మరిచారు. దాం తో పలు ఆర్టీఏ కార్యాలయాల్లో కార్డుల ప్రింటింగ్, పంపిణీ నిలిచిపోయాయి. వేలల్లో డిమాండ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పది ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో రోజూ 5 వేల మంది వాహనదారులు డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహన చిరునామా బదిలీలు, వాహన యాజమాన్య బదిలీలు, డ్రైవింగ్ లెసైన్స్‌ల పునరుద్ధరణ వంటి సేవలు పొందుతారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు 500 కార్డుల చొప్పున ప్రింట్చేసి వాహనదారులకు పంపిణీ చేస్తారు. కొంతకాలంగా కార్డుల పంపిణీ పోస్టల్ ద్వారా జరుగుతుంది. వాహనదారులు పౌరసేవల కోసం హాజరైన రోజు నుంచి వారంలోపు నేరుగా వారి ఇళ్లకు చేరేలా ఈ ప్రక్రియన కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక్కసారిగా కార్డుల ప్రింటింగ్, పంపిణీ నిలిచిపోవడంతో పలు కార్యాలయాల్లో వేల సంఖ్యలో కార్డుల ముద్రణ పెండింగ్‌లో పడింది. దీంతో సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు చేయవలసిన పని వారం, పది రోజులుగా నిలిచిపోవడం వల్ల కొత్త కార్డులు వచ్చినా ఒకేసారి ముద్రించి పంపిణీ చేయడం అసాధ్యం. ఉద్యోగులపై పని భారం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు డ్రైవింగ్ లెసైన్స్‌ల కోసం పరీక్షలకు హాజరై, ఉత్తీర్ణులైనట్లుగా గుర్తింపును పొందినప్పటికీ కార్డులు అందకపోవడం వల్ల వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు చిక్కి జరిమానాలు చెల్లించుకోవలసి వస్తోంది.