![Rde Norms In India From 2023 Onwards Will Cause Discontinuation Of Several Cars,suvs - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/20/cars.jpg.webp?itok=YXdBs1zq)
త్వరలో కేంద్రం రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్‌డీఈ) నిబంధనల్ని అమలు చేయనుంది?. దీంతో భారత్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని కంపెనీలకు చెందిన కార్లు, ఎస్‌యూవీలు కనుమరుగు కానున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
కొత్త ఉద్గార నిబంధనలు డ్రైవింగ్ సమయంలో కార్ల నుంచి విడుదలయ్యే ఎన్‌ఓఎక్స్ వంటి కాలుష్య కారకాల్ని కొలవడం, వేగం వృద్ధి, క్షీణతలో తరచూగా వచ్చే మార్పులను పరిణగలోకి తీసుకోనున్నాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, కార్ల తయారీదారులు తమ ఇంజిన్‌లను తక్కువ ఉద్గారాలకు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. ఇంజన్ అప్‌డేషన్ ప్రక్రియ ఖరీదైంది. కాబట్టే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో పలు కంపెనీల 27 డీజిల్ కార్లు, ఎస్‌యూవీల కార్యకలాపాల్ని నిలివేసే అవకాశం ఉంది.
ఆర్‌డీఈ నిబంధనల ప్రకారం వాహనాలు డ్రైవింగ్ సమయంలో విడుదలయ్యే ఉద్గార స్థాయిలను గుర్తించేలా పరికరాన్ని కలిగి ఉండాలి. ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉత్ప్రేరక కన్వర్టర్లు, ఆక్సిజన్ సెన్సార్‌ల వంటి క్లిష్టమైన భాగాలను పరికరం పర్యవేక్షిస్తుంది. కార్‌మేకర్‌లు క్రాంక్‌షాఫ్ట్ పొజిషన్‌లు, థొరెటల్, ఇంజన్ ఉష్ణోగ్రతను స్కాన్ చేయడానికి వాహనాల సెమీకండక్టర్‌లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కార్లు, ఎస్‌యూవీలలో ఇంధనం మండే స్థాయిని నియంత్రించడానికి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్లను కూడా అమర్చాలి.
అన్ని డీజిల్ ఇంజిన్‌లు ఉద్గారాల నియంత్రణ ఖరీదైన 'సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్' (ఎస్‌ఈఆర్) సాంకేతికతకు మారవలసి ఉంటుంది. కాబట్టి, డీజిల్ కార్ల ధర గణనీయంగా పెరుగుతుంది. కార్ల తయారీకి భారీగా ఖర్చు చేయడం, తయారీ ఖర్చు.. కార్ల ధరల్ని పెంచడం.. పెరిగిన ధరలతో వాటి డిమాండ్ పడిపోవడం వంటి పరిణామలత నేపథ్యంలో సంస్థలు కార్ల తయారీని, అమ్మకాల్ని నిలివేయనున్నాయి.
వాటిలో హోండా సిటీ 4వ జెన్, సిటీ 5వ జెన్ (డీజిల్), అమేజ్ (డీజిల్), జాజ్ డబ్ల్యూఆర్ -వీ, మరాజు, అల్ట్రాస్ జీ4, కేయూవీ 100, మహీంద్రా, హ్యుందాయ్, స్కోడా ఒక్కొక్కటి రెండు మోడళ్లను నిలిపివేయనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ ఐ20, వెర్నా డీజిల్ మోడళ్లను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తే, స్కోడా ఆక్టావియా, సూపర్బ్ కార్లు మార్కెట్‌లో కనుమరుగు కానున్నాయి. టాటా ఆల్ట్రోజ్ (డీజిల్), రెనాల్ట్ క్విడ్ 800, నిస్సాన్ కిక్స్, మారుతి సుజుకి ఆల్టో 800 నిలిపివేయనున్న జాబితాలో ఉన్నాయి.
చదవండి👉 టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
Comments
Please login to add a commentAdd a comment